228 - ప్రజాగరేణ విష్ణు మహిమ గాన ఫలమ్‌

రాత్రి ప్రజాగరముతో విష్ణుమహిమగానమునకు ఫలము

వ్యాసులు:

ఏకాదశ్యా ముభే పక్షే నిరాహారః సమాహితః 

స్నాత్వా సమ్య గ్విధానేన ధౌతవాసా జితేంద్రియః 

సంపూజ్య విధివ ద్విష్ణుం శ్రద్ధయా సుసమాహితః

పుష్పై ర్గంధై స్తథా దీపై ర్ధూపైర్నై వేద్యకై స్తథా 

ఉపహారై ర్బహువిధై ర్జప్యై ర్హోమ ప్రదక్షిణైః 

స్తోత్రై ర్నానావిధై ర్దివ్యై ర్గీతవాద్యై ర్మనోహరైః

దండవ త్ప్రణిపాతైశ్చ జయశబ్దై స్తథో త్తమైః 

ఏవం సంపూజ్య విధివ ద్రాత్రౌ కృత్వా ప్రజాగరమ్‌

కథాం వా గీతికాం విష్ణో ర్గాయ న్విష్ణుపరాయణః 

యాతి విష్ణొః పరం స్థానం నరో నా స్త్యత్ర సంశయః 

వ్యాసులు:

రెండు పక్షము లందు ఏకాదశి నాడు ఉపవశించి శ్రద్దా యుక్తుడై లెస్సగా విధానానుసారము స్నాన మాడి మడుగు వస్త్రము ధరించి జితేంద్రియుడై విధి వత్తుగా మనస్సు నిలిపి విష్ణుని పుష్పములతో సుగంధములతో దీప దూప నైవేధ్యములతో బహు విధములగు ఉపహారములతో జప హోమ ప్రదక్షిణములతో నానా విధములగు స్తోత్రములతో దివ్యములు మనోహరము లగు గీత వాద్యములతో దండవత్ గా నమస్కారములతో ఉత్తమములగు జయ శబ్దములతో పూజించి రాత్రి యందు ప్రజాగారము చేసి విష్ణుని యందు పరమ శ్రద్ధ గలిగి ఆ మహనీయుని కథలనో గీతికలనో గానము చేసినచో నరులు విష్ణుని పొందుదురు. ఇది నిశ్చయము. అని వ్యాసుడు పలికెను.

మునులు:

ప్రజాగరే గీతికాయః ఫలం విష్ణో ర్మహామునే 

బ్రూహి తచ్ర్ఛోతు మిచ్ఛామః పరం కౌతూహలం హి నః

మునులు:

ఓ వ్యాస ముహా మునీ! ప్రజాగరము చేసి గీతికా గానము చేయుట వలన కలుగు ఫలమును వినగోరు చున్నాము. అని మునులు అడిగిరి.

వ్యాసులు:

శృణుధ్వం మునిశార్దూలాః ప్రవక్ష్యా మ్యానుపూర్వశః 

గీతికాయాః ఫలం విష్ణో ర్జాగరే య దుదాహృతమ్‌

అవంతీ నామ నగరీ బభూవ భూవి విశ్రుతా

తత్రాస్తే భగవా న్విష్ణుః శంఖచక్రగదా ధరః

తస్యా నగర్యాః పర్యంతే చాండాలో గీతికోవిదః 

సద్వృత్త్యోత్పాదితధనో భృత్యానాం భరణే రతః

విష్ణు భక్తః స చాండాలో మాసి మాసి దృఢవృతః

ఏకాదశ్యాం సమాగమ్య సోపవాసోథ గాయతి

గీతికా విష్ణునామాంకాః ప్రాదుర్భావ సమాశ్రితాః

గాంధారషడ్జ నై షాద స్వరపంచమధైవతైః

రాత్రిజాగరణే విష్ణుం గాథాభి రుపగాయతి

ప్రభాతే చ ప్రణమ్యేశం ద్వాదశ్యాం గృహ మేత్యచ 

జామాతృభాగినేయాంశ్చ భోజయిత్వా సకన్యకాః 

తతఃసపరివార స్తు పశ్చాద్భుంక్తే ద్విజోత్తమాః 

ఏవం తస్యాసత స్తత్ర కుర్వతో విష్ణుప్రీణనమ్‌ 

గీతికాభి ర్విచి త్రాభి ర్వయః ప్రతిగతం బహు

ఏకదా చైత్రమాసే తు కృష్ణైకాదశి గోచరే

విష్ణు శుశ్రూషణార్థాయ యయౌ వన మనుత్తమమ్‌

వనజాతాని పుష్పాణి గ్రహీతుం భక్తితత్పరః 

క్షిప్రాతటే మహారణ్యే విభీతకతరో రధః 

దృష్టః స రాక్షసే నాథ గృహీతు శ్చాపి భక్షితుమ్‌

చాండాల స్తమథో వాచ నాద్య భక్ష్య స్త్వయా హ్యహమ్‌ 

ప్రాత ర్భోక్ష్యసి కళ్యాణ సత్య మేష్యా మ్యహం పునః 

అద్య కార్యం మమ మహ త్తస్మా న్ముంచస్వ రాక్షస 

శ్వః సత్యేన సమేష్యమి తతః ఖాదసి మామితి

విష్ణుశుశ్రూషణార్థాయ రాత్రి జాగరణం మయా 

కార్యం న వ్రత విఘ్నం మేకర్తు మర్హపి రాక్షస 

తం రాక్షసః ప్రత్యువాచ దశరాత్ర మభోజనమ్‌

మమాభూదద్య చ భవా న్మయా లబ్దో మతంగజ

నమోక్ష్యే భక్షయిష్యామి క్షుధయా పీడితో భృశమ్‌ 

నిశాచరవచః శ్రుత్వా మాతంగ స్తమువాచ హ

స్వాంత్వయన్‌ శ్లక్ష్ణయా వాచా న సత్యవచనై ర్దృఢైః 

వ్యాసులు:

ఓ ముని శ్రేష్ఠులారా! ప్రజాగరము చేసి విష్ణు మహిమ గానము చేయుట వలని ఫలమును క్రమముతో చెప్పెదను వినుడు. భూ లోకమున ప్రసిద్ధి పొందిన అవంతీ నగరమున శంఖ చక్రా గదా ధరుడగు విష్ణువు కలడు. ఆ నగరము చివరలో గానమున నేర్పరి యగు చాండాలుడు కలడు. అతడు సద్వృత్తితో ధనమార్జించి తన సేవకులను పోషించు చుండును. అతడు విష్ణు భక్తుడై ప్రతి మాసమునను దృఢ వ్రతుడై ఏకాదశి నాడు ఉపవసించి రాత్రి ప్రజాగరము చేసి విష్ణుని అవతారములను గూర్చి అతని నామముచే అంకితము లగు గీతికలను సప్తస్వర ప్రస్తారయుక్త ములగు గానము చేయును. ప్రాతః సమయమున ద్వాదశీ తిథిలో విష్ణుని నమస్కరించి స్వగృహమునకు వచ్చితన కూతుళ్లు అల్లుండ్రు మేనల్లుండ్రు పరివారము వీరిని భుజింప జేసి తరువాత తాను భుజించును. ఇట్లు విష్ణు ప్రీతిని కలిగించుచు జీవించు అతనికి చాల వయస్సు గడచెను. ఇట్లుండ ఒకప్పుడు చైత్ర కృష్ణైకాదశి నాడు విష్ణు సేవకై అతడు భక్తి తత్పరుడై పూలు తెచ్చుటకై ఉత్తమ వనమునకు పోయి క్షిప్రా నది యొడ్డున కలి వృక్షము క్రిందనున్న ఒక రాక్షసునకు కనబడెను. ఆ రాక్షసుడు ఈ చాండాలుని తిన గోరెను. నీవు నన్ను ఈనాడు తిన వలదు. నేను రేపు మరల నిజముగా వత్తును. నేనీనాడు పూజ చేసికొన వలయును. కాన రాక్షసా! నన్ను విడువుము. రాత్రి జాగరణము చేసి నేను విష్ణుని సేవింతును. నాకు వ్రత విఘ్నము చేయ వలదు. అని చాండాలుడు రాక్షసుని వేడెను. ఓచాండాలుడా! పదినాళ్ళు నాకు ఆహారము లేక ఈనాడు నీవు నాకు దొరకితివి. నాకు చాల అకలిగా ఉన్నది. నేను నిన్ను విడువను. భక్షింతును. అని పలికిన రాక్షసుని బ్రతిమాలుచు చాండాలుడు దృఢములగు సత్య వచనములు ఇట్లు పలికెను.

మాతంగుడు:

సత్యమూలం జగత్సర్వం బ్రహ్మ రాక్షస త చ్ఛృణు 

సత్యేనాహం శపిష్యామి పున రాగమనాయ చ

ఆదిత్యశ్చంద్రమా మహ్ని ర్వాయు ర్భూ ర్ద్యౌర్జలం మనః

అహోరాత్రం యమః సంధ్యే ద్వే విదు ర్నర 

పరదారేషు యత్పాపం యత్పరద్రవ్యహారిషు 

యచ్చ బ్రహ్మ హనః పాపం సురాపే గురుతల్పగే

వంధ్యాపతేశ్చ యత్సాపం యత్పాపం వృషలీపతేః 

యచ్చ దేవలకే పాపం మత్స్యమాంసాశినశ్చయత్‌

క్రోడమాంసాశినో యచ్చ కూర్మమాంసాశినశ్చ యత్‌ 

వృథామాంసాశినో యచ్చ పృష్ఠమాంసాశినశ్చయత్‌ 

కృతఘ్నే మిత్రఘాతకే యత్సాపం దిధిఘాపతౌ 

సూతకస్య చ యత్సాపం యత్సాపం క్రూరకర్మణః

కృపణస్య చ యత్సాపం యచ్చ వంధ్యాతిథే రపి 

అమావాస్యాష్టమీ షష్ఠీ కృష్ణ శుక్ల చతుర్దశీ

తాసు యద్గమనా త్సాపం య ద్విప్రో వ్రజతి స్త్రియమ్‌ 

రజస్వలాం తథా పశ్చా చ్ర్ఛాద్ధం కృత్వాస్త్రియం ప్రజేత్‌ 

సర్వస్వస్నాత భోజ్యానాం య త్సాపం మలభోజనే 

మిత్రభార్యాం గచ్ఛతాం చయత్పాపం పిశునస్యచ 

దంభమాయానురక్తే చ యత్పావం మధుఘాతినః 

బ్రాహ్మణస్య ప్రతిశ్రుత్య యత్పాపం తదయచ్ఛతః

యచ్చ కన్యానృతే పాపం యచ్చ గోశ్వనరానృతే

స్త్రీబాలహంతు ర్య త్సాపం యచ్చ మిథ్యాభిభాషిణః

దేవవేద ద్విజనృప పుత్రమిత్ర సతీ స్త్రియః 

యచ్చ నిందయతాం పాపం గురుమిథ్యాపచారతః 

అగ్నిత్యాగిషు య త్పాన మగ్నిదాయిషు యద్వనే

గృహేష్ట్యాపాతకే యచ్చయ ద్గోఘ్నే య ద్ద్విజాధమే

యత్పాపం పరివిత్తేచ యత్పాపం పరివేదినః

తయో ర్దాతృగ్రహీత్రోశ్చ యత్పాపం భ్రూణఘాతినః

కించాత్ర బహుభిః ప్రోక్తైః శపథై స్తవ రాక్షస

శ్రూయతాం శపధం భీమం దుర్వాచ్య మపి కథ్యతే 

స్వకన్యా జీవినః పావం గూఢసత్యేన సాక్షిణః 

అయాజ్యయాజకే షంఢే యత్పాపం శ్రవణేధమే

ప్రవ్రజ్ర్యావసితే యచ్చ బ్రహ్మచారిణి కాముకే 

ఏతైస్తు పాపైర్లిప్యేహం యది నైష్యామి తేంతికమ్‌ 

మాతంగుడు:

బ్రహ్మ రాక్షసా! వినుము. జగత్తునకు అంతటికి సత్యమే మూలము. నేను మరల వత్తునని సత్యముతో శపథము చేయు చున్నాను. నరుడు చేయు పనులకు సూర్య చంద్రులు అగ్ని వాయువులు భూమ్యా కాశములు జలము మనస్సు అహో రాత్రములు యముడు ప్రాతఃసాయం సంధ్యలు సాక్షులు. నేను మరల నీ దగ్గరకు రానిచో వరదార ధనము లందు ఆసక్తి బ్రహ్మ హత్య సురాపానము గురు దార గమనము గొడ్రాలికి శూద్ర స్త్రీకి పతి యగుట పూజారి తనము చేప పంది తాబేలు వీని మాంసము తినుట నిష్కారణముగా మాంసము తినుట వెన్ను మాంసము తినుట, కృతఘ్నత మిత్ర ద్రోహము, మారు మనువాడిన స్త్రీని పెండ్లాడుట, సూతకము కలుపు కొనుట, క్రూర కర్మలు చేయుట, పిసిని గొట్టు తనము, అతిథుల నాదరింప కుండుట, అమావాస్య అష్టమి షష్ఠీ కృష్ణ శుక్లవక్ష చతుర్దశులు ఈ తిథుల యందును శ్రాద్ధము చేసిన తరువాతను స్త్రీతో సంగ మించుట, బహిష్ఠు ఐన స్త్రీని కలియుట, మిత్రుని భార్యను పొందుట, చాడీలు చెప్పుట, కపటము మోసము చేయుట, తేనె దొంగలించుట, బ్రాహ్మణునికి దాన మిత్తునని ఒప్పుకొనినది ఈయ కుండుట, కన్యను గోవును కంచర గాడిదను ఇత్తునని ఈయ కుండుట, స్త్రీ బాలవధ అసత్య మాడుట, వ్యర్థముగా మాట లాడుట దేవతలను వేదములను ద్విజులను రాజులను పుత్రులను మిత్రులను పతివ్రతలను గురువులను నిందించుట, అగ్ని హోతము విడుచుట, నిప్పుపెట్టుట గృహేష్టి చేయుట, ద్విజాధముడై గోవధ చేయుట, భ్రూణ వధ తమ్మునకు పెండ్లి ఐన తరువాత తాను పెండ్లాడుట, అన్న కంటె ముందు తాను పెండ్లాడుట వలన కలుగు పాపములు నేను మరల నీ కడకు రానిచో నాకు తగులును. ఇంకను భయంకర శపథము వినుము. నేను తిరిగి రానిచో తన కన్యపై జీవించుట సత్యమును మఱుగు పఱచి సాక్ష్యము పలుకుట యాగము చేయింప రాని వానిచే యాగము చేయించుట నపుంసకు డగుట శ్రవణము చేయరాని వాని వాని నుండి శాస్త్ర శ్రవణము చేయుట శ్రవణము చేయదగని వానికి శాస్త్రముల శ్రవణము చేయుట సన్యాసి కాని బ్రహ్మచారి కాని కాముకుడై ప్రవర్తించుట వీని వలన కలుగు పాపముల పొందుదును అని చాండాలుడు రాక్షసునకు శపథము చేసెను.

వ్యాసులు:

మాతంగ వచనం శ్రుత్వా విస్మితో బ్రహ్మ రాక్షసః 

ప్రాహ గచ్ఛస్వ సత్యేన సమయం చైవ పాలయ

ఇత్యుక్తః కుణపాశేన శ్వపాకః కుసుమాని తు

సమాదాయాగమచ్చైవ విష్ణోః స నిలయం గతః

తాని ప్రాదా ద్ర్బాహ్మణాయ సోపి ప్రక్షాళ్య చాంభసా 

విష్ణు మభ్యర్చ్య నిలయం జగామ స తపోధనాః

సోపి మాతంగదాయాదః సోపవాసస్తుతాం నిశామ్‌ 

గాయన్హి బాహ్యభూమిష్ఠః ప్రజాగరము పాకరోత్‌

ప్రభాతాయాం తు శర్వర్యాం స్నాత్వా దేవం నమస్య చ

సత్యం స సమరుం కర్తుం ప్రతస్థే యత్ర రాక్షసః 

తం వ్రజంతం పథి నరః ప్రాహ భద్ర క్వ గచ్ఛసి 

స తథాకథయ త్సర్వం సోస్యేనం పునరబ్రవీత్‌

ధర్మార్థకామ మోక్షాణాం శరీరం సాధనం యతః

మహతా తు ప్రయత్నేన శరీరం పాలయే ద్బుధః 

జీవన్‌ ధర్ధార్థ సుఖంనర స్తథాప్నోతి మోక్షగతిమగ్ర్యామ్‌

జీవన్కీర్తి ముపైతి చ భవతియదిమృస్యకాకథాలోకే 

మాతంగ స్తద్వచః శ్రుత్వా ప్రత్యువా చాథ హేతుమత్‌

వ్యాసులు:

బ్రహ్మ రాక్షసుడు చాండాలుని మాటవిని ఆశ్చర్యపడి ఈ సత్య శపథముతో వెళ్ళి అన్న మాట కాపాడుము అనెను. ఆ చాండాలుడును పుష్పములు తీసికొని దేవాలయమునకు పోయి బ్రాహ్మణున కిచ్చెను. అతడవి నీటితో కడిగి విష్ణుని అర్చించితన ఇంటికి పోయెను. చాండాలుడు ఆనాడు ఉపవసించి గుడి వెలుపల నుండి విష్ణు గీతుల పాడుచు రాత్రి ప్రజాగరము చేసెను. తెల్లవారగనే అతడు స్నాన మాడి విష్ణుని నమస్కరించి తన సత్యమును కాపాడు కొనుటకై రాక్షసుని దగ్గరకు బయలు దేరెను. త్రోవలో తన కెదురైన ఒక నరునకును చాండాలున కును ఇట్లు సంభాషణము జరిగెను. నరుడు “నాయనా! ఎక్కడకు పోవు చున్నావు?’’ చాండాలుడు తనకు రాక్షసుని విషయమున జరిగిన దంతయును చెప్పెను. నరుడు: ’’ధర్మార్థ కామమోక్షములకు శరీరమే సాధనము. కావున వివేకవంతుడు మహా ప్రయత్నముతో నైనను శరీరము రక్షించుకొన వలెను. జీవించినచో కీర్తియు లభించును. మరణించిన వాని మాట ఎవడు తలచును?’’

మాతంగుడు:

భద్ర సత్యం పురస్కృత్య గచ్ఛామి శపథాః కృతాః

మాతంగుడు:

చాండాలుడు యుక్తి యుక్తముగా ఇట్లనెను. ‘‘అయ్యా నేను చాల శపథములు చేసితిని, సత్యము కాపాడుటకై నేను పోవు చున్నాను.’’

వ్యాసులు:

తం భూయః ప్రత్యువా చాథ కి మేవం ముఢధీర్భవాన్‌

కిం నశ్రుతం త్వయా సాధో మనునా యదుదీరితమ్‌ 

గోస్త్రీద్విజానాం పరిరక్షణార్థం వివాహకాలే సురతప్రసంగే

ప్రాణాత్యయే సర్వధనాపహారే పం చానృతా న్యాహు రపాతకాని 

ధర్మవాక్యం న చ స్త్రీషు న వివాహే తథా రిపౌ 

వంచనే చార్థహానౌ చ స్వనాశేనృతకే తథా 

ఏవం తద్వాక్య మాకర్ణ్య మాతంగః వ్రత్యువాచ హ

వ్యాసులు:

నరుడు “నీవు ఇట్లు మూడ బుద్ధివై ఉన్నావేమి? ఓ సత్పురుషుడా! గోవులను స్త్రీలను ద్విజులను రక్షించుటకును వివాహము విషయమునను సురత సందర్భమునను ప్రాణములును సర్వ ధనమును పోవుచు న్నప్పుడును అసత్య మాడుట పాతకము గాదు. స్త్రీల విషయమున వివాహ సందర్భము నను శత్రువు విషయము నను మోసము ధనహాని ఆత్మ నాశము జరుగు నప్పుడును ఇతరులు అసత్యము చేయు నప్పుడును ధర్మ వాక్యములను పాటించ రాదు. అని మనువు చెప్పినది నీవు వినలేదా?’’

మాతంగుడు:

మైవం వదస్వ భద్రం తే సత్యం లోకేషు పూజ్యతే

సత్యే నావాప్యతే సౌఖ్యం యత్కించి జ్జగతీగతమ్‌

సత్యేనార్కః ప్రతపతి సత్యేనాపో రసాత్మికాః 

జ్వల త్యగ్నిశచ సత్యేన వాతి సత్యేన మారుతః

ధర్మార్థ కామ సంప్రాప్తి ర్మోక్షప్రాప్తిశచ దుర్లభా

సత్యేన జాయతే పుంసాం తస్మా త్సత్యం నసంత్యజేత్‌ 

సత్యం బ్రహ్మ పరంలోకే సత్యం యజ్ఞేషు చోత్తమమ్‌

సత్యం స్వర్గ సమాయాతం తస్మా త్సత్యం నసంత్యజేత్‌ 

మాతంగుడు:

చాండాలుడు ‘‘అయ్యా! అట్లు పలుకకుము. సత్యము లోకము లందు పూజింప బడును. లోక మందలి సర్వ సౌఖ్యములును సత్యముచే లభించును. సత్యము చేతనే సూర్యుడు వెలుగును. నీరు ప్రవహించును. అగ్ని జ్వలించును గాలి వీచును. చతుర్విధ పురుషార్థములు సత్యము చేతనే లభించును. సత్యము పరబ్రహ్మము. ఉత్తమ యజ్ఞము. స్వర్గము నుండి వచ్చినది సత్యము. సత్యమును విడువ రాదు.’’

వ్యాసులు:

ఇత్యుక్త్వా సోథ మాతంగ స్తం ప్రక్షిప్య నరోత్తమమ్‌

జగామ తత్రయత్రాస్తేప్రాణిహా బ్రహ్మరాక్షసః 

తమాగతం సమీక్ష్యాసౌ చాండాలం బ్రహ్మరాక్షసః

విస్మయోత్పుల్లనయనః శిరఃకంపం తమబ్రవీత్‌

వ్యాసులు:

ఇట్లు పలికి ఆ చాండాలుడు ఆ నరుని వదలి వేసి ప్రాణి ఘాతుకుడగు ఆ బ్రహ్మ రాక్షసుడున్న చోటికి పోయెను. వాడు ఆశ్చర్యముతో కన్ను విప్పారించి తల ఆడించుచు ఇట్లు పలికెను.

బ్రహ్మ రాక్షసుడు:

సాధు సాధు మహాభాగ సత్యవా క్యానుపాలక

న మాతంగ మహం మన్యే భవంతం సత్యలక్షణమ్‌

కర్మణానేన మన్యే త్వాం బ్రాహ్మణం శుచి మవ్యయమ్‌

యత్కించిత్త్వాం భద్రముఖం ప్రవక్ష్యే ధర్మ సంశ్రయమ్‌

కింతత్ర భవతా రాత్రౌకృతం విష్ణుగృహే వద

బ్రహ్మ రాక్షసుడు:

‘‘సత్య వాక్యమును అనుపాలించిన ఓ మహాభాగా! మేలు మేలు! సత్యమే లక్షణముగా గల నీవు చాండాలుడు కావని నా అభిప్రాయము. నీవు చేసిన ఈ పనిని బట్టి నీవు శుచియై అవ్యయు డగు ఏ వికారమును లేని బ్రాహ్మణు డవే. శుభ స్వరూపుడ వగు నీతో ధర్మమును గూర్చి కొంచెము మాట లాడెదను. నీవు రాత్రి విష్ణ్వాలయమున ఏమి చేసితివో చెప్పుము’’.

వ్యాసులు:

తమభ్యువాచ మాతంగః శృణు విష్ణు గృహే మయా 

యత్కృతం రజనీఖాగే యథాతథ్యం వదామి తే

విష్ణో ర్దేవకుల స్యాధః స్థితేనానమృమూర్తినా

ప్రజాగరః కృతో రాత్రౌ గాయతా విష్ణుగీతికామ్‌ 

తం బ్రహ్మరాక్షసః ప్రాహ కియంతం కాల ముచ్యతామ్‌ 

ప్రజాగరో విష్ణుగృహే కృతోభ క్తిముతా వద

తమభ్యువాచ ప్రహస న్వింశ త్యబ్దాని రాక్షస

ఏకాదశ్యాం మాసి మాసి కాత స్తత్ర ప్రజాగరః

మాతంగ వచనం శ్రుత్వా ప్రోవాచ బ్రహ్మరాక్షసః 

వ్యాసులు:

చాండాలుడిట్లు పలికెను. వినుము. రాత్రి కాలమున విష్ణ్వాలయమున నేనేమి చేసితినో ఉన్నది ఉన్నట్లు చెప్పెదను. ఆలయమునకు దిగువ వినయముతో వంగియుడి నిలిచి రాత్రి అంతయు ప్రజాగరము చేసి విష్ణు గీతికలు గానము చేసితిని.

బ్రహ్మ రాక్షసుడు:

యదద్య త్వాం ప్రవక్ష్యామి తద్భవా న్వక్తు మర్హతి 

ఏకరాత్రి కృతం సాధో మమ దేహ ప్రజాగరమ్‌

ఏవంత్వాం మోక్షయిష్యామి మోక్షయిష్యామి నాన్యధా

త్రిః సత్యేన మహాభాగ ఇత్యుక్త్వా విరరామ హ

బ్రహ్మ రాక్షసుడు:

నీవు భక్తితో ఎంత కాలము ఆలయమున ప్రజాగరము చేసితివి? అనెను.

వ్యాసులు:

మాతంగ స్తమువా చాథ మయాత్మాతే నిశాచర 

నివేదితః కిముక్తేన ఖాదస్వ స్వేచ్ఛయాపి మామ్‌

తమాహ రాక్షసో భూయో యామద్వయ ప్రజాగరమ్‌

సగీతంమే ప్రయచ్ఛస్వ కృపాం కర్తుం త్వ మర్హసి

మాతంగో రాక్షసం ప్రాహ కిమసంబద్ధ ముచ్యతే 

ఖాదస్వ స్వేచ్ఛయా మాం త్వం స ప్రదాస్యే ప్రజాగరమ్‌

మాతంగ వచనం శ్రుత్వా ప్రాహ తం బ్రహ్మరాక్షసః 

వ్యాసులు:

ప్రతి మాసము నందును ఏకాదశీ తిథు లందు ఇరువది సంవత్సరములు ప్రజాగరము చేసితిని అని చాండాలుడు నవ్వుచు పలికెను. అది విని బ్రహ్మ రాక్షసుడు

బ్రహ్మ రాక్షసుడు:

కోహి దుష్ట మతిర్మందో భవంతం ద్రష్టు ముత్సహేత్‌ 

ధర్షయితుం పీడయితుం రక్షితం ధర్మకర్మణా 

దీనస్య పాపగ్రస్తస్య విషయై ర్మోహితస్య చ

నరకార్తస్య మూఢస్య సాధవః స్యు ర్దయాన్వితాః 

తన్మమత్వం మహాభాగ కృపాం కృత్వా ప్రజాగరమ్‌

యామ స్యైకస్య మే దేహి గచ్ఛ వా నిలయం స్వకమ్‌

బ్రహ్మ రాక్షసుడు:

నీవు ఒక రాత్రి ప్రజాగరము చేసి పొందిన ఫలము నాకిమ్ము. అట్లెననే కాని నేను నిన్ను విడువను. అని పలికెను.

వ్యాసులు:

తం పునః ప్రాహ చాండాలో న యాస్యామి నిజం గృహమ్‌

నచాపి తవ దాస్యామి కథంచిద్యామజాగరమ్‌

తం ప్రహస్యాథ చాండాలం ప్రోవాచ బ్రహ్మరాక్షసః

వ్యాసులు:

ఓ రాక్షసుడా! నా దేహము నీకర్పించితిని. మాటలతో పని యేమి? స్వేచ్ఛగా నన్ను తినుమని చాండాలుడు పలికెను. అయ్యా దయతో నీవు రెండు జాములు ప్రజాగరము చేసితిని అని చాండాలుడు నవ్వుచు పలికెను.

బ్రహ్మ రాక్షసుడు:

రాత్ర్యవసానే యా గీతా గీతికా కౌతుకాశ్రయా

తస్యా ఫలం ప్రయచ్ఛస్వ త్రాహి పాపా త్పముద్ధర

బ్రహ్మ రాక్షసుడు:

 అయ్యా! దయతో నీవు రెండు జాములు ప్రజాగరము చేసి సంగీతము పాడి సంపాదించిన ఫలము నైన ఇమ్మని రాక్షసుడు బ్రతిమాలెను.

వ్యాసులు:

ఏవ ముచ్చారితే తేన మాతంగ స్తమువాచ హ

వ్యాసులు:

అసంబద్ధముగా ఏల మాటాడెదవు? నేను ప్రజాగర ఫలము నీయును. స్వేచ్ఛగా నన్ను నీవు తినుమని చాండాలు డనెను. ఆ మాటవిని బ్రహ్మ రాక్షసు డిట్లనెను., ఏమందుడగు దుష్టబుద్ది ధర్మ కర్మలచే రక్షితుడ వగు నిన్ను చూచుటకు గాని బెదరించుటకు గాని పీడించుటకు గాని శక్తి కలవాడు అగును? అదికాక దీనుడు పాప గ్రస్తుడు విషయ సుఖములచే మోహము పొందినవాడు నరక యాతనలచే పీడింప బడువాడు మూఢుడు అగు వాని విషయములో సత్పరుషులు దయ చూపుదురు. ఇట్టి నామీద నీవు దయచూపి ఒక జాము ప్రజాగరము చేసి సంపాదించిన ఫలమునైన ఇమ్ము. లేదా నీ ఇంటికి మరలి పొమ్ము. నీకు యామ ప్రజాగర ఫలమును కూడ ఈయను. ఇంటికిని మరలి పోను. అని చాండాలు డనెను. రాత్రి చివరలో వినోదార్థము పాడిన పాట ఫలమునైన ఇచ్చి నన్ను పాపము నుండి సముద్దరింపుము. అని బ్రహ్మ రాక్షసుడు బ్రతిమాలెను.

మాతంగుడు:

కిం పూర్వం భవతా కర్మ వికృతం కృతమంజసా

యేన త్వం దోష జాతేన నంభూతో బృహ్మరాక్షసః

మాతంగుడు:

అది విని నీవు పూర్వము ఏ వికృత కర్మము చేసి ఈ దోషరాశిచే ఇట్లు బ్రహ్మ రాక్షసుడ వైతివి?

వ్యాసులు:

తస్య తద్వాక్య మాకర్ణ్య మాతంగం బ్రహ్మరాక్షసః

ప్రోవాచ దుఃఖసంతప్తః సంస్మృత్య స్వకృతం కృతమ్‌

వ్యాసులు:

చాండాలు డడుగగా వినివాడు దుఃఖముచే సంతప్తు డగుచు తాను చేసిన దుష్కృతమును జ్ఞాపకము చేసి కొనుచు ఇట్లు పలికెను.

బ్రహ్మ రాక్షసుడు:

శ్రూయతాం యోహ మానం వై పూర్వం యచ్చ మయా కృతమ్‌

యస్మిన్కృతే పాపయోనిం గతవానస్మి రాక్షసీమ్‌

సోమశర్మా ఇతి ఖ్యాతః పూర్వమాస మహం ద్విజః

పుత్రోధ్యయనశీలస్య దేవశర్మస్య యజ్వనః

కన్యచి ద్యజమానిస్య సూత్రమంత్ర బహిష్కృతః

నృపస్య కర్మనక్తేన యూపకర్మను నిష్టితః

అగ్నీధ్రం చాకరోద్యజ్ఞే లోభమోహ ప్రపీడితః

తస్మి న్పరినమాప్తే తు మౌర్ఖ్యాద్దంభ మనుష్ఠితః

యష్టు మారబ్ధవా నస్మి ద్వాద శాహం మహాకృతుమ్‌

ప్రవర్తమానే తస్మింస్తు కుక్షిశూలోభవన్మమ

సంపూర్ణే దశరాత్రే తు న సమాప్తే తథా కృతౌ

విరూపాక్షస్య దీయంత్యా మాహుత్యాం రాక్షసే క్షణే

మృతోహం తేన దోషేణ నంభూతో బ్రహ్మరాక్షసః

మూర్ఖేణ మంత్ర హీనేన సూత్రస్వరవివర్జితమ్‌

అజాసతా య జ్ఞవిద్యాం య దిష్టం యాజితం చ యత్‌

తేన కర్మవిపాకేన సంభూతో బ్రహ్మరాక్షసః

తన్మాం పాపమహాంభోదౌ నిమగ్నం త్వం సముద్ధర

ప్రజాగరే గీతికైకాం పశ్చిమాం దాతు మర్హసి

బ్రహ్మ రాక్షసుడు:

నేను పూర్వము ఎవడనో ఏమి పాపము చేసి నందున రాక్షసుడ నై పాప యోని యందు జన్మించితినో చెప్పెదను వినుము. సోమయాజియు వేదా ధ్యయనము చేసిన వాడు నగు దేవశర్మ యను బ్రాహ్మణుని కుమారు డగు సోమశర్మ అను వాడనుగా ఉంటిని. యజ్ఞోపవీత ధారణము నకు వేదమంత్ర గ్రహణము నకు అధికారము లేకయు యజ్ఞ కర్మ చేయ వలెనను అసక్తి కల ఒక యజమానుని యజ్ఞ కర్మను జరిపించుట యందు శ్రధ్ద వహించి లోభముచే మోహముచే బాధింప బడిన వాడ నగుచు అగ్నీ ధ్రుడుగా అగ్నీధ్రము అను స్థానమున నుండు ఋత్వికుడిగా ఉంటిని. ఆ యజమానుని ఆ యజ్ఞము ముగియ గానే మూర్ఖుడనై దంభమును అవలంబించి ద్వాదశాహ పండ్రెండు నుత్యాహస్సులతో చేయదగిన మహా క్రతువును చేయింప నారంభించితిని. అది జరుగు చుండగా నాకు కడుపు నొప్పి కలిగెను. అప్పటికి పదినాళ్లు మాత్రము గడచెను. యజ్ఞము ముగియ లేదు. రాక్షస సమయము నందు విరూపాక్షునకు ఆహుతి ఈయ బడుచున్న సమయమున నేను మరణించి ఆ దోషముచే బ్రహ్మ రాక్షసుడ నైతిని. మూర్ఖుడనై మంత్రము సూత్రము స్వరము సరిగా తెలియక యజ్ఞ విద్య తెలియక యజ్ఞము చేయుటచే చేయించుట చే ఆ దోషమున బ్రహ్మ రాక్షసుడ నైతిని. కనుక ఇట్లు పాప మహా సముద్రమున మునిగి యున్న నన్ను నీ ప్రజాగరముతో కడపటి ఒక పాట యొక్క ఫలము నైన దానము చేసి ఉద్ధరింపుము.

వ్యాసులు:

త మువా చాథ చాండాలో యది ప్రాణిపదా ద్భవాన్‌

నివృత్తిం కురుతే దద్యాం తతః పశ్చిమ గీతికామ్‌

బాఢ మిత్యవద త్సోపి మాతంగోపి దదౌ తదా

గీతికాఫల మామంత్ర్య ముహూర్తార్ధ ప్రజాగరమ్‌

తస్మి న్గీతిఫలే దత్తే మాతంగం బ్రహ్మరాక్షసః

ప్రణమ్య ప్రయయౌ హృష్ట స్తీర్థవర్యం పృథూదకమ్‌

తత్రానశన సంకల్పం కృత్వా ప్రాణా న్జహౌ ద్విజాః

రాక్షసత్వా ద్వినిర్ముక్తో గీతికాఫల బృంహితః

పృథూదక ప్రభావాచ్చ బ్రహ్మలోకం చ దుర్లభమ్‌

దశ వర్ష సహస్రాణి నిరాతంకోవసత్తతః

తస్యాంతే బ్రాహ్మణో జాతో బభూవ స్మృతిమా న్వశీ

తస్యాహం చరితం భూయః కథయిష్యామి భోద్విజాః

వ్యాసులు:

అని బ్రహ్మరాక్షసుడు వేడెను. నీవు ఇక నుండి ప్రాణి వధను మాను కొందువేని నా కడపటి పాట ఫల మిత్తునని చాండాలు డనగా బ్రహ్మరాక్షసు డంగీకరించెను. తన ప్రజాగరము లో కడపటి సగము జాములో పాడిన పాట ఫలమును చాండాలుడు వానికి దానము చేసెను. వెంటనే వాడును చాండాలుని నమస్కరించి తీర్థశ్రేష్ట మగు పృథూదక తీర్థమునకు పోయి అక్కడ సంకల్ప పూర్వకముగా ఆహారము విడిచి ప్రాణములు విడుచుటతో ఆ చాండాలు డిచ్చిన గీతికా ఫల బలముచే రాక్షసత్వము నుండి విముక్తు డయ్యెను. పృథూదక తీర్థ ప్రభావమున పదివేల యేండ్లు దుర్లభ మగు బ్రహ్మ లోకమున నిరంతరముగా నుండి పిమ్మట పూర్వ జన్మ స్మృతియు ఇంద్రియు నిగ్రహమును గల బ్రాహ్మణుడై జన్మించెను. ద్విజులారా! అతని కథను మీకు మరల చెప్పెదను.

వ్యాసులు:

మాతంగస్య కథాశేషం శృణుధ్వం గదతో మమ

రాక్షసే తు గతే ధీమా న్గృహమేత్య యతాత్మవాన్‌

త ద్విప్రచరితం స్మృత్వా నిర్విణ్ణః శుచిర ప్యసౌ

పుత్రేషు భార్యం నిక్షిప్య దదౌ భూమ్యాః ప్రదక్షిణామ్‌

కోకాముఖాత్సమారభ్య యావద్వైన్కంద దర్శనమ్‌

దృష్ట్వా స్కందం యయౌ ధారాం చక్రే చాపిప్రదక్షిణమ్‌

స్నానం పాపహరం చక్రేసతు చాండాల వంశజః

విముక్తపాపః సస్మార పూర్వజాతీ రనేకశః

స పూర్వజన్మ న్యభవ ద్భిక్షుః సంయత వాఙ్మనాః

యతకాయశ్చ మతిమా న్వేదవేదాంగ పారగః

ఏకదా గోషు నగరా ద్ద్రియమాణాసు తస్కరైః

భిక్షావధూతా రజసా ముక్తాతేనాథ భిక్షుణా

నతే నాధర్మదోషేణ చాండాలీం యోని మాగతః

పాప ప్రమోచనే స్నాతః నమృతో నర్మదా తటే

మూర్ఖోభూ ద్ర్బాహ్మణవరో వారాణస్యాం చ భో ద్విజాః

తత్రాస్య వసతోబ్దైస్తు త్రింశద్భిః సిద్ధపూరుషః

విరూపరూపీ బభ్రామ యోగమాయాబలాన్వితః

తం దృష్ట్వా సోపహాసార్థ మభివాద్యాభ్యువాచ హ

కుశలం సిద్దపురుషం కుత స్త్వాగమ్యతే త్వయా

ఏవం సంభాషిత స్తేన జ్ఞాతోహమితి చింత్య తు

ప్రత్యువా చాథ వంద్య స్తం స్వర్గలోకాదుపాగతః

తం సిద్ధం ప్రాహ మూర్ఖోసౌ కిం త్వం వేత్సి త్రివిష్టపే

నారాయణోరుప్రభవా ముర్వశీ మప్సరో వరామ్‌

సిద్ద స్త మాహ తాం వేద్మి శక్ర చామర ధారిణీమ్‌

స్వర్గస్యాభరణం ముఖ్య ముర్వశీం సాధుసంభవామ్‌

విప్రః సిద్ధ మువా చాథ బుజుమార్గవివర్జితః

తన్మిత్ర మత్కృతే వార్తా ముర్వశ్యా భవతాదరాత్‌

కథనీయా యచ్చ సాతే బ్రూయా దాఖ్యాస్యతే భవాన్‌

బాఢ మి త్య బ్రవీ త్సిద్దః సోపి విప్రో ముదాన్వితః

బభూవ సిద్దోపి యయౌ మేరు పృష్టం సురాలయమ్‌

సమేత్య చోర్వశీం ప్రాహ య దుక్తోసౌ ద్విజేన తు

సాప్రాహ తం సిద్ధంవరం నాహం కాశిపతిం ద్విజమ్‌

జానామి సత్య ముక్తం తే న చేతసి మమ స్థితమ్‌

ఇత్యుక్తః ప్రయయౌ సోపి కాలేన బహునా పునః

చాండాలుని కథా శేషమును చెప్పెదను వినుడు. బుధ్ది శాలియు శుచియు అగు ఆ చాండాలుడు అనంతరము తన ఇంటికి పోయి ఆ బ్రాహ్మణుని కథను తలచు కొనుచు వైరాగ్యము చెంది భార్యను కుమారులకు అప్పగించి కోకాముఖ క్షేత్రమున బయలు దేఱి కుమార స్వామి దర్శన మగు వరకు భూ ప్రదక్షిణము చేసెను. కుమార స్వామిని స్కందుని దర్శించి ధారా చక్రమును ప్రదక్షిణము చేసి వింధ్య పర్వతమును చేరి పాప ప్రమోచన తీర్థమున స్నానము చేసి పాప విముక్తుడై తన పూర్వ జన్మము లనేకములు జ్ఞాపకము చేసి కొనెను. ఈ జన్మ పరంపరా విషయము ఇట్లున్నది: ఈ చాండాలుడు ఒక పూర్వ జన్మములో బుద్ది శాలియు వేద వేదాంగములు కడ వరకు నేర్చిన వాడును త్రికరణముల యందు నిగ్రహము కలవాడును అగు భిక్షువుగా నుండెను. ఒకప్పుడు దొంగలు హరించు కొని పోవు చున్న గోవులచే రేగిన ధూళిచే అ భిక్షువు యొక్క భిక్ష కప్పబడగా దాని నతడు వదలి వేసెను. ఆ ధర్మ దోషముచే అతడు చాండాలుడై పుట్టెను. అతడు నర్మదా తీరము నందలి పా పప్రమోచన తీర్థమున స్నాన మాడిన పుణ్యమున మరణా నంతరము వారణాసి యందు మూర్ఖుడగు బ్రాహ్మణ శ్రేష్టుడుగా పుట్టెను. అతడు ముప్పది ఏండ్ల వాడై యుండగా అచటికి యోగ మాయా బలము కలవాడును విరూపుడను అగు సిద్దుడు సంచరించుచు వచ్చి ఇతనికి కన బడెను. అతనిని చూచి ఈ మూర్ఖ బ్రాహ్మణుడు ఉపహాసమున కై అతనిని నమస్కరించి ఓ సిద్ద పురుషా! కుశలమా? ఎక్కడి నుండి వచ్చు చున్నావు? అని ప్రశ్నించెను. ఆ సిద్దుడు తన్ను ఈతడు తెలిసికొనె నని తలచి స్వర్గము నుండి వచ్చుచున్నా ననెను. స్వర్గము నందు నారాయణ ముని తొడ నుండి జన్మించిన యప్సరస యగు ఊర్వశి నెఱుగుదువా? అని మూర్ఖ బ్రాహ్మణు డడిగెను. అమె నారాయణ ముని నుండి జన్మించినది. స్వర్గమునకు అభరణము వంటిది. ఇంద్రునికి చామర గ్రాహణి. ఇట్టి ఊర్వశిని నేనెఱుగక పోవుటేమి? అని సిద్దు డనెను. ఆ మూర్ఖ బ్రాహ్మణు డును సరళ మార్గము విడిచి వక్ర మార్గమున ఇట్లనెను. ఓ మిత్రమా! నా మీద ఆదరము చూపి నా వృత్తాంతము ఊర్వశికి తెలిపి అమె చెప్పిన సమాధానమును నాకు వచ్చి చెప్పు మనెను. సిద్దుడు సరే అనెను. విప్రుడు సంతసించెను. సిద్దుడు మేరు పర్వత సానువు నందలి స్వర్గమునకు పోయి ఈ బ్రాహ్మణుడు చెప్పిన మాట ఊర్వశికి చెప్పెను. కాశీపతి యగు బ్రాహ్మణు డెవరో నేనెఱు గను కనుక నీవు చెప్పిన మాట నిజమని నేనను కొనుటలేదు. అని ఊర్వశి సిద్దునితో పలికెను.

వారాణసీం యయౌ సిద్దో దృష్టో మూర్ఖేణ వైపునః

దృష్టః పృష్టః కిల భూయః కిమా హోరభవా తవ

సిద్దోబ్రవీన్న జానామి మా మువా చోర్వశీ స్వయమ్‌

సిద్దవాక్యం తతః శ్రుత్వా స్మితభిన్నౌష్ఠసంపుటః

పునః ప్రాహ కథం వేత్సీ త్యేవం వాచ్యా త్వ యోర్వశీ

బాఢ మేవం కరిష్యా మీత్యుక్త్వా సిద్దో దివం గతః

దదర్శ శక్రభవనా నిష్ర్కామంతీ మథోర్వశీమ్‌

ప్రోవాచ తాం సిద్దవరః సా చ తం సిద్ద మబ్రవీత్‌

నియమం కంచిదపి హి కరోతుద్విజసత్తమః

యేనాహం కర్మణా సిద్ద తం జానామి న చాన్యథా

త దుర్వశీ వచోభ్యేత్య తస్మై మూర్ఖద్విజాయ తు

కథయామాస సిద్దస్తు సోపీమం నియమం జగౌ

త వాగ్రే సిద్దపురుష నియమోయం కృతో మయా

న భోక్షే ద్యప్రభృతి వై శకటం సత్య మీరితమ్‌

ఇత్యుక్తః ప్రయయౌ సిద్ధః స్వర్గే దృష్టోర్వశీ మథ

ప్రాహాసౌ శకటం భోక్ష్యే నాద్యప్రభృతి కర్హిచిత్‌ తం సిద్ద ముర్వశీ ప్రాహ జ్ఞాతోసౌ సాంప్రతం మయా

నియమగ్రహణా దేవ మూర్ఖో మా ముపహాసకః

ఇత్యుక్త్వా ప్రయయౌ శీఘ్రం వాసం నారాయణాత్మజా

సిద్దోపి విచచా రాసౌ కామచారీ మహీతలమ్‌

ఊర్వ శ్యపి వరారోహో గత్వా వారాణసీం పురీమ్‌

మత్స్యోదరీజలే స్నానం చక్రే దివ్య వపుర్ధరా

అథాసావపి మూర్ఖస్తు నదీం మత్సోదరీం మునే

జగా మాథ దద ర్శాసౌ స్నాయమానా మ థోర్వశీమ్‌

తాం దృష్ట్వా వవృధేథాస్య మన్మథః క్షోభకృద్దృడమ్‌

చకార మూర్ఖశ్చేష్టాశ్చ తం వివే దోర్వశీ స్వయమ్‌

తం మూర్ఖం సిద్ద గదితం జ్ఞాత్వ సస్మిత మాహతమ్‌

ఊర్వశీ చెప్పిన ఈ మాటలు విని సిద్దుడు వెడలి పోయి చాలా కాలము తరువాత మరల వారాణసికి పోయెను. అతనిని చూచి మూర్ఖ బ్రాహ్మణుడు ఊర్వశి ఏమి చెప్పెనని అడుగగా అమె తాను నిన్ను ఎఱుగ ననెనని సిద్దుడు పలికెను. ఆది విని మూర్ఖ విప్రుడు చిరునవ్వు నవ్వి ఈ మాఱు పోయి నప్పుడు నీవాతనిని ఏ గురుతుతో గుర్తింప గలవని ఊర్వశిని అడుగు మనగా సిద్దుడును సరేయని స్వర్గమునకు పోయి నప్పడు ఇంద్ర భవనము నుండి బయటికి వచ్చు చ్చున్న ఊర్వశిని చూసి మూర్ఖ బ్రాహ్మణుడు చెప్పిన మాట అమెకు చెప్పెను.

ఊర్వశి:

కి మిచ్ఛసి మహాభాగః మత్తః శీఘ్ర మి హోచ్యతామ్‌

కరిష్యామి వచ స్తుభ్యం త్వంబిశ్రబ్ధం కరిష్యసి

ఊర్వశి:

అమె ఆ బ్రహ్మణుడు ఏవైన నియమమును పూనినచో దానిని బట్టి అతనిని గుర్తింప గలననెను.

మూర్ఖ బ్రాహ్మణుడు:

ఆత్మప్రదానేన మమ ప్రాణా న్రక్ష శుచిస్మితే

మూర్ఖ బ్రాహ్మణుడు:

ఆ మాట సిద్దుడు మరల మూర్ఖ బ్రాహ్మణునితో చెప్పగా అతడును నేను ఇక మీదట శకటము భక్షింపను.

వ్యాసులు:

తం ప్రా హాథోర్వశీ విప్రం నియమస్థాస్మి సాంప్రతమ్‌

త్వం తిష్టస్వ క్షణ మథ ప్రతీక్షస్వాగతం మమ

స్థితో స్మీ త్య బ్రవీ ద్విప్రః సాపి స్వర్గం జగామ హ

మాస మాత్రేణ సాయాతా దదర్శ తం కృశం ద్విజమ్‌

స్థితం మాసం నదీతీరే నిరాహారం సురాంగనా

తం దృష్ట్వా నిశ్చయయుతం భూత్వా వృద్దవపుస్తతః

సా చకార నదీతీరే శకటం శర్కరావృతమ్‌

ఘృతేన మధునా చైవ నదీం మత్స్యోదరీం గతా

స్నాత్వా థ భూమౌ వసంతీ శకటం చ యథార్థతః

తం బ్రాహ్మణం సమాహూయ వాక్యమాహ సులోచనా

వ్యాసులు:

ఇది నా నియమమని ఊర్వశితో చెప్పు మనెను. సిద్దుడు సరేయని తాను మరల స్వర్గము మునకు పోయి నప్పుడీ విషయము ఊర్వశితో చెప్పెను. ఇప్పుడు నేనతని నీ నియమమును బట్టి గుర్తింప గలను. ఆ మూర్ఖుడు నన్ను ఉపహాసము చేయుటచే ఇట్లు చెప్పెను. అని పలుకుచు ఊర్వశి వెడలిపోయెను.

ఊర్వశి:

మయా తీవ్రంవత్రం విప్ర చీర్ణం సౌభాగ్యకారణాత్‌

 వ్రతాంతే నిష్కృతిం దద్యాం ప్రతి గృహ్ణీష్వ భో ద్విజః

ఊర్వశి:

సిద్దుడును తన ఇచ్చా నుసారముతో లోక సంచారము చేయుచుండెను. మహా సుందరి యగు ఊర్వశియు వారాణసికి పోయి దివ్య శరీరము ధరించి మత్స్యోదరీ తీర్థమున స్నానము చేయు చుండెను. ఈ సమయమున యాదృచ్చికముగ అచటకు వచ్చిన ఆ మూర్ఖ బ్రాహ్మణుడు అట్టి ఊర్వశిని చూచి కామముచే కలత నొందెను. అందుచే అతడు చేసిన చేష్టలను బట్టి మునువు సిద్దుడు చెప్పిన మూర్ఖ విప్రుడు ఈతడే యని ఊర్వశి గుర్తించి చిఱునవ్వు నవ్వుచు అతనితో ఓ మహాభాగా! నా వలన నీకు ఏమి కావలెనో చెప్పుము. నీ మాట ప్రకారము చేయుదును. నీవు నన్ను విశ్వసింపుము. అనెను. నిన్ను నాకు అర్పణము చేసికొని ఓ సుందరీ! నా ప్రాణములను కాపాడు మని అతడనెను. నేను ఇప్పుడు వ్రత నియమము నందున్నాను. క్షణ కాలము నారాకకై వేచి యుండు మని ఊర్వశి పలుకగా అతడు సరే యనెను. అమెయు స్వర్గమున కేగి ఒక మాసము తరువాత మరల వారాణసికి రాగా ఈ విప్రుడు కృశించి కనబడెను. అతడంత వరకును నిరాహారుడై నదీ తీరమందే నిశ్చయముతో నుండెనని అమె తెలిసికొని వృద్దురాలి రూపము ధరించి వచ్చి నదీ తీరమున శర్కరతో తేనెతో నేతితో నిండిన శకటమును కావించి మత్స్యోదరీ తీర్థమునకు పోయి స్నానమాడి ఒడ్డునకు వచ్చి శకటము కడ నిలిచి ఈ మూర్ఖ బ్రాహ్మణుని పిలిచి ఇట్లు పలికెను. ఓ విప్రా! నేను తీవ్రమగు వ్రతమును సౌభాగ్యము నిమిత్త మాచరించితిని. వ్రతాంతమున ఉద్యాపనము నకై ఇది దానము చేయొ చున్నాను. ప్రతి గ్రహించుము. అనెను.

వ్యాసులు:

స ప్రాహ కిమిదం లోకే దీయతే శర్కరావృతమ్‌

క్షుతామకంఠః పృచ్ఛామి సాధు భద్రే సమీరయ

సా ప్రాహ శకటో విప్ర శర్కరా పిష్టసంయుతః

ఇమం త్వం సముపాదాయ ప్రాణం తర్పయ మా చిరమ్‌

స త చ్చృత్వాథ సంస్మృత్య క్షుదయా పీడితోపి సన్‌

ప్రాహ భద్రే న గృహ్ణీమి వియమో హి కృతోమయా

పురతః సిద్ద వర్యస్య న భోక్ష్యే శకటం త్వితి

పరిజ్ఞానార్థ ముర్వశ్యా దద స్వాన్యస్య కస్యచిత్‌

సాబ్రవీన్నియ మో భద్ర కృతః కాష్ఠమయే త్వయా

నాసౌ కాష్టమయో భుంక్ష్వ క్షుధయా చాతి పీడితః

తాం బ్రాహ్మణః ప్రత్యువాచ న మయా త ద్విశేషణమ్‌

కృతం భద్రేథ నియమః సామాన్యే నైవ మేకృతః

తం భూయః ప్రాహ సా తన్వీ న చే ద్భోక్ష్యసి బ్రాహ్మణ

గృహం గృహీత్వా గచ్ఛస్వ కుటుంబం తవ భోక్ష్యతి

స తా మువాచ సుదతి న తావ ద్యామి మందిరమ్‌

ఇహాయాతా వరారోహా త్రైలోక్యే ప్యధికా గుణైః

సా మయా మదనార్తేన ప్రార్థితా శ్వాసిత స్తయా

స్థీయతాం క్షణ మిత్యేవం స్థాస్యా మీతి మ యోదితమ్‌

మాసమాత్రం గతాయాస్తు తస్యా భద్రేస్థితస్య చ

మమ సత్యానురక్తస్య సంగమాయ ధ్రతవృతే

తస్య సా వచనం శ్రుత్వా కృత్వా స్వం రూప ముత్తమమ్‌

 విహస్య భావగంభీర ముర్వశీ ప్రాహ తం ద్విజమ్‌

వ్యాసులు:

అతడు ఇట్లనెను: ఇది ఏమి? లోకములో శర్కరతో నిండిన శకటము దానము చేయుదురా? ఓ పూజ్యురాలా! ఆకలిచే ఎండిన కంఠముతో ఉండి అడుగు చున్నాను. చక్కగా చెప్పుము. ఆమె ఇట్లనెను. ఓ విప్రా! ఈ శకటము శర్కరతోను పిండితోను నిండి యున్నది. దీనిని నీవు తీసికొని నీ ప్రాణముల తృప్తి నొందించు కొనుము. ఆలస్యము చేయుకుము. ఈ మాటవిని అతడు ఆకలితో భాదపడు చుండియు జ్ఞాపకము చేసికొని ఇట్లనెను. ఓ పూజ్యురాలా! నేనిది తీసి కొనను. నేను సిద్ద వర్యుని కడ శకటమును భక్షింప ననియమును ఊర్వశికి గుర్తుగా చేసితిని. కనుక దీనిని మఱి ఎవ్వరి కైన దానము చేయుము. అమె ఇట్లు పలికెను. ఓ విప్రా! పూజ్యుడా! నీవు కొయ్యతో చేసిన శకటమును తిననని నియమము పూనితివి. ఇది కొయ్యతో చేసినది కాదు. శర్కరతో చేసిన శకటము. దీనిని భక్షింపుము. నీవును ఆకలిచే చాల బాధనొంది యున్నావు. బ్రాహ్మణుడిట్లనెను: నేను శకటము అని సామాన్యముగా పలికితిని. కాని దేనితో చేసినది అని విశేషణముతో చెప్పలేదు. ఊర్వశి ఇట్లనెన: ఓ విప్రుడా! సరే. నీవు తినకున్నను నీ కుటుంబము వారు తిందురు. నీవీ చక్కెర బండిని కొని పొమ్ము. బ్రాహ్మణు డిట్లు పలికెను. ఓ సుదతీ! నేనిపు డింటికి పోవను. మూడు లోకముల యందును గుణములచే అందరి కంటే అధికురాలును సుందరియు ఆగు అమె ఇక్కడకు వచ్చినది. నేను కామార్తుడనై వేడగా క్షణములో వత్తును. ఉండు మని నన్నోదార్చి అమె వెళ్లినది. ఓ వ్రతస్థు రాలా! అమెయొక్క సత్య వచనము నందు అను రక్తుడనై అమె సంగమము కోరి అమె వెళ్లి ఇప్పటికి మాసము గడిచినను ఇక్కడనే యున్నాను. ఆ మూర్ఖ విప్రుని మాటలువిని ఊర్వశి తన స్వరూపము ధరించి నవ్వుచు భావ గంభీరముగా ఇట్లు పలికెను

ఊర్వశి:

సాధు సత్యం త్వయా విప్ర వ్రతం నిష్టితచేతసా

నిష్పాదితం హఠా దేవ మమ దర్శనమిచ్చతా

అహ మేవోర్వశీ విప్ర త్వాం జిజ్ఞాసార్థమాగతా

పరీక్షితో నిశ్చితవా న్భవా న్సత్యతపా ఋషిః

గచ్ఛత్వం శూకరోద్దేశం రూపతీ ర్థేతి విశ్రుతమ్‌

సిద్ధిం యాస్యసి విప్రేంద తత స్త్వం మా మవాప్స్యసి

ఊర్వశి:

ఓ విప్రుడా! నీవు నా దర్శనము గోరి హఠముతో నిష్ఠతో కూడిన మనస్సుతో వ్రతమును నిర్వహించిన మాట సత్యము. నీ విషయము తెలిసికొన గోరి వచ్చితిని. ఓ విప్రా! నేనే ఊర్వశిని. నిన్ను పరీక్షించి నీవు సత్య తపస్కుడు అను ఋషి వని నిశ్చయించితిని. రూప తీర్థమని ప్రసిద్ధి పొందిన శూకరవ క్షేత్రమునకు పొమ్ము. అచ్చట నీకు సిద్ది కలుగును. అప్పుడు నేను నీకు లభింతును.

వ్యాసులు:

ఇత్యుక్త్వా దివ ముత్పత్య సా జగా మోర్వశీ ద్విజాః

స చ సత్యతపా విప్రో రూపతీర్థం జగామ హ

తత్ర శాంతి పరోభూత్వా నియమవ్రత ధృక్శుచిః

దేహోత్సర్గే జగామాసౌ గాంధర్వం లోకముత్తమమ్‌

తత్ర మన్వంతరశతం భోగా న్భుక్త్వా యథార్థతః

బభూవ సుకులే రాజా ప్రజారంజన తత్పరః

స యజ్వా వివిధై ర్యజ్ఞైః సమాప్త వరదక్షిణైః

పుత్రేషు రాజ్యం నిక్షిప్య యయౌ శౌకరవం పునః

రూపతీర్థే మృతో భూయః శక్రలోక ముపాగతః

తత్ర మన్వంతరశతం భోగా న్బుక్త్వా తత శ్చ్యుతః

ప్రతిష్ఠానే పురవరే బుధపుత్రః పురూరవాః

బభూవ తత్ర చోర్వశ్యాః సంగమాయ తపోధనాః

ఏవం పురం సత్యతపా ద్విజాతి స్తీర్థే ప్రసిద్దే స హి రూపసంజ్ఞే

ఆరాధ్య జన్మ న్యథ చార్చ్య విష్ణుమవాప్య భోగా నథ ముక్తి మేతి

వ్యాసులు:

ఇట్లు పలికి ఆ ఊర్వశి స్వర్గమునకు ఎగిరి పోయెను. అసత్యత పోయి ఋషియు రూప తీర్థమునకు పోయి అచట శాంతి పరుడై నియమ వ్రతములను పూని శుచియై జీవించి దేహ త్యాగా నంతరము ఉత్తమ మగు గంధర్వ లోకమునకు పోయెను. అచ్చట నూరుల కొలది మన్వంతరములు వాస్తవము లగు భోగములను అనుభవించి పిమ్మట భూ లోకమున ప్రజా రంజకుడగు రాజై జన్మించెను. సమగ్ర మగు దక్షిణలతో వివిధము లగు యజ్ఞములు ఆచరించి కుమారులకు రాజ్యము నప్పగించి మరల శూకరవ క్షేత్రమునకు ఏగెను. ఈ రూప తీర్థమున మృతి పొంది ఇంద్ర లోకమునకు పోయి అచట నూరుల కొలది మన్వంతరము భోగము లనుభవించి అచట నుండి దిగి భూమిపై ప్రతిష్టాన నగరమున బుధుని కుమారుడగు పురూరవుడుగా జన్మించి ఊర్వశితో సంగమము పొందెను. ఈ విధముగ సత్య తపస్కుడన బ్రహ్మణుడు శూకరవ క్షేత్రమను రూప తీర్థమున శ్రీ మహా విష్ణువును ఆరాధించి భోగములను అనుభవించి ముక్తిని కూడ పొందెను. (ఈ ప్రతిష్టా నగరము ఈనాడు అలహాబాదు.)