బ్రహ్మ మహా పురాణము

60 - సముద్ర స్నానవిధి వర్ణనమ్‌.

బ్రహ్మ:

శ్వేత మాధవ మాలోక్య సమీపే మత్స్యమాధవమ్‌

ఏకార్ణవజలే పూర్వం రోహితం రూపమాస్థితమ్‌

వేదానాం హరణార్థాయ రసాతలతే స్థితమ్‌

 చింతయిత్వా క్షితిం సమ్యక్తస్మిస్థ్సానే ప్రతిష్ఠితమ్‌

ఆధ్యావతరణం రూపం మాధవం మత్స్యరూపిణమ్‌

ప్రణమ్య ప్రణతో భూత్వా సర్వదుఃఖాద్విముచ్యతే

ప్రయాతి పరమం స్థానం యత్ర దేవో హరిః స్వయమ్‌

కాలే పునరిహాయాతో రాజా స్యాత్పృథివీతలే

వత్సమాధవ మాసాద్య దురాధర్షో భవేన్నరః

దాతా భోక్తా భవేద్యజ్వా వైష్ణవః సత్యసంగరః

యోగం ప్రాప్య హరేః పశ్చాత్తతో మోక్షమవాప్నుయాత్‌

మత్స్యమాధవ మాహాత్మ్యం మయా సంపరికీర్తితమ్‌

యం దృష్ట్యా మునిశార్దూలాః సర్వాన్కామానవాప్నుయాత్‌

బ్రహ్మ:

శ్వేత మాధవుని దర్శించి ప్రళయ మందేకార్ణవ మైన తఱి మత్స్యావతార మెత్తిన మాధవుని దర్శింప వలెను. వేదములను హరించిన హిరణ్యాక్షుని సంహరించి వేద రక్షణము చేసిన మొదటి యవతార మెత్తిన విష్ణువును నమస్కరించి నరుడు దుఃఖ విముక్తు డగును. విష్ణు లోకమును బడయును. మరల నీ పుడమికి వచ్చి వత్సమాధవ స్వామి నిచట దర్శించి దాతయు, ఐశ్వర్య భోక్తయు, యజ్ఞ కర్తయు, విష్ణు భక్తుడును సత్యవ్రతుడునై హరి సన్నిధాన మొంది మోక్షము వడయును. సర్వకామ ప్రదమయిన మత్స్య మాధవ మాహాత్మ్యమును వర్ణించితిని.

మునులు:

భగవన్శ్రోతుమిచ్ఛామో మార్జనం వరుణాలయే

క్రియతే స్నానదానాది తస్యాశేషఫలం వద

మునులు:

అనవిని మునులు స్వామి! సముద్ర జల మార్జనము స్నానము దానము చేయుట యందు వలన గల్గు నశేష ఫలము చెప్పుమని యడుగ బ్రహ్మ యిట్లనియె.

బ్రహ్మ:

శృణుధ్వం మునిశార్దూలా మార్జనస్య యథా విధి

భక్త్యా తు తన్మనా భూత్వా సంప్రాప్య పుణ్యముత్తమమ్‌

మార్కండేయహ్రదే స్నానం పూర్వకాలే ప్రశస్యతే

చతర్దుశ్యాం విశేషేణ సర్వపాప ప్రణాశనమ్‌

తద్వత్స్నానం సముద్రస్య సర్వకాలం ప్రశస్యతే

పౌర్ణమాస్యాం విశేషేణ హయమేధ ఫలం లభేత్‌

మార్కండేయం వటం కృష్ణం రౌహిణేయం మహోదధిమ్‌

తదా గచ్ఛేద్విశేషేణ తీర్థరాజం పరం శుభమ్‌

పూర్ణిమా జ్యేష్ఠమాసస్య జ్యేష్ఠా ఋక్షం యదా భవేత్‌

తదా గచ్ఛేద్విశేషేణ తీర్థరాజం పరం శుభమ్‌

కాయవాఙ్మానసైః శుద్ధస్తద్భావో నాన్యమానసః

సర్వద్వంద్వ వినిర్ముక్తో వీతరాగో విమత్సరః

కల్ప వృక్షవటం రమ్యం తత్ర స్నాత్వా జనార్దనమ్‌

 ప్రదక్షిణం ప్రకుర్వీత త్రివారం సుసమాహితః

యం దృష్ట్వాముచ్యతే పాపాత్సప్తజన్మ సముద్భవాత్‌

పుణ్యం చాప్నోతి విపులంగతిమిష్టాంచభోద్విజాః

తస్య నామాని వక్ష్యామి ప్రమాణం చ యుగేయుగే

 యథాసంఖ్యం చ భో విప్రాః కృతాదిషు యథాక్రమమ్‌

వటం వటేశ్వరం కృష్ణం పురాణపురుషం ద్విజాః

వటస్యైతాని నామాని కీర్తితాని కృతాదిషు

యోజనం పాదహీనం చ యోజనార్ధం తదర్ధకమ్‌

ప్రమాణం కల్పవృక్షస్య కృతాదౌ పరికీర్తితమ్‌

యథోక్తేన తు మంత్రేణ నమస్కృత్వా తు తం వటమ్‌

దక్షిణాభిముభో గచ్ఛేద్ధన్వంతర శతత్రయమ్‌

యత్రాసౌ దృశ్యతే విష్ణుః స్వర్గద్వారం మనోరమమ్‌

సాగరాంభః సమాకృష్టం కాష్ఠం సర్వగుణాన్వితమ్‌

ప్రణిపత్య తతస్తం భో పరిపూజ్య తతః పునః

ముచ్యతే సర్వరోగాద్యైస్తథా పాపైర్గ్రహాదిభిః

ఉగ్రసేనం పురా దృష్ట్వా స్వర్గద్వారేణ సాగరమ్‌

గత్వాచమ్య శుచిస్తత్ర థ్యాత్వా నారాయణం పరమ్‌

న్య సేదష్టాక్షరం మంత్రం పశ్చాద్ధస్త తరీరయోః

ఓం నమో నారాయణాయేతి యం వదంతి మనీషిణః

కిం కార్యం బహుభిర్మంత్రైర్మనో విభ్రమకారకైః

ఓం నమో నారాయణాయేతి మంత్రః సర్వార్ధ సాధకః

ఆపో నరస్య సూనుత్వాన్నారా ఇతీహ కీర్తితాః

విష్ణోస్తా స్త్వయనం పూర్వం తేన నారాయణః స్మృతః

నారాయణపరా వేదా నారాయణపరా ద్విజాః

నారాయణపరా యజ్ఞా నారాయణపరాః క్రియాః

నారాయణపరా పృథ్వీ నారాయణ పరం జలమ్‌

నారాయణ పరో వహ్నిః నారాయణపరం నభః

నారాయణపరో వాయుర్నారాయణపరం మనః

అహంకారశ్చ బుద్ధిశ్చ ఉభే నారాయణాత్మకే

భూతం భవ్యం భవిష్యం చ యత్కించిజ్జీవసంజ్ఞితమ్‌

స్థూలం సూక్ష్మం పరం చైవ సర్వం నారాయణాత్మకమ్‌

శబ్దాద్యా విషయాః సర్వే శ్రోత్రాదీనీంద్రియాణి చ

ప్రకృతిః పురుషశ్చైవ సర్వే నారాయణాత్మకాః

జలేస్థతే చ పాతాళే స్వర్గలోకేంబరే నగే

అవష్టభ్య ఇదం సర్వమాస్తే నారాయణః ప్రభుః

కిం చాత్ర బహునోక్తేన జగదేతచ్చరాచరమ్‌

 బ్రహ్మాదిస్తంబపర్యంతం సర్వం నారాయణాత్మకమ్‌

నారాయణాత్పరం కించిన్నేహ పశ్యామి భో ద్విజాః

 తేన వ్యాప్తమిదం సర్వం దృశ్యా దృశ్యం చరాచరమ్‌

అపో హ్యాయతనం విష్ణుః స చ ఏవాంభసాం పతిః

తస్మాదప్సు స్మరేన్నిత్యం నారాయణ మఘాపహమ్‌

స్నానకాలే విశేషేణ చోపస్థాయ జలే శుచిః

స్మరేన్నారాయణం ధ్యాయేద్ధస్తే కాయే ద విన్యసేత్‌

ఓంకారంచనకారంచ అంగుష్ఠేహ స్తయోర్నసేత్‌ శేషైర్హ(షాన్హ)స్తతలం(లే)యావత్తర్జన్యాదిషువిన్యసేత్‌

ఓం కారం వామపాదే తు నకారం దక్షిణే న్యసేత్‌

మోకారం వామకట్యాం తు నాకారం దక్షిణే న్యసేత్‌

రాకారం నాభిదేశే తు యకారం వామబాహుకే

ణాకారం దక్షిణే న్యస్య యకారం మూర్ధ్ని విన్యసేత్‌

అధశ్చోర్ధ్వం చ హృదయే పార్మ్వతః పృష్ఠతోగ్రతః

ధ్యాత్యా నారాయణం పశ్చా దారభేత్కవచం బుధః

పూర్వే మాం పాతు గోవిందో దక్షిణే మధుసూదనః

పశ్చిమే శ్రీధరో దేవః కేశవస్తు తథోత్తరే

పాతు విష్ణుస్తథాగ్నేయే నైరృతే మాధవోవ్యయః

వాయవ్యే తు హృపీకేశ స్తథేశానే చ వామనః

భూతలే పాతు వారాహ స్తథోర్థ్వం చ త్రివిక్రమః

 కృత్వైవం కవచం పశ్చా దాత్మానం చింతయేత్తతః

అహం నారాయణో దేవః శంఖ చక్ర గదా ధరః

ఏవం ధ్యాత్వా తదాత్మాన మిమం మంత్రముదీరయేత్‌

బ్రహ్మ:

మునులార! వినుండు. భక్తి మనసు నందుంచిన సముద్ర జల మార్జనము మార్కండేయ హ్రదమందు ప్రాతః స్నానము ఉత్తమ పుణ్యఫల మిచ్చును. చతుర్దశి యందు పూర్ణిమకు స్నానము జేసిన యశ్వమేథ ఫల మందును. మార్కండేయ హ్రదము, కృష్ణ వటము బలరాముడు మహోదధి యింద్రద్యుమ్న సరస్సునను వీనికి పంచ తీర్థములని పేరు. జ్యేష్ఠ పూర్ణిమ జ్యేష్ఠా నక్షత్రము కలసి వచ్చిన పుణ్య కాలమున ఈ తీర్థ సేవనము పరమ శుభమని చెప్ప బడినది. త్రికరణముల చేతను శుద్ధుడయి రాగ ద్వేషాదులను ద్వంద్వములను బాసి కల్ప వృక్షమును బోలిన మర్రి చెట్టునకు స్నాన పూర్వకముగ ప్రదక్షిణము జేసి విష్ణువునకు కూడ ముమ్మార్లు వలగొనిన వాడు సప్త జన్మ పాపముల నుండి ముక్తుడయి కోరిన సద్గతి బడయును. ఆ వట వృక్షమునకు వటేశ్వరుడు కృష్ణుడు, పురాణ పురుషుడు అను పేరులు మూడు కృతాది యుగము లందు గీర్తింప బడినది. కృత యుగము నందు నీ వృక్ష ప్రమాణము ఒక యోజనము. త్రేతా యుగము నందు నాల్గవ వంతు తగ్గినది. ద్వాపర మందు సగము యోజనము. కలిలో దానిలో సగము వైశాల్యమని చెప్పబడెను. ఎడమ పాదమున ప్రణవమును దక్షిణ పాదమున నకారము వామ కటి యందు మోకారము కుడి వైపున నాకారము నాభి యందు రాకారము యెడమ భుజమున “య” కారమును కుడి భుజమున ణాకారము శిరస్సున “య”కారమును న్యాసము చేయ వలెను. క్రిందను మీదను హృదయ మందును ఇరు ప్రక్కలను పుష్ఠ భాగమునను నారాయణుని ధ్యానించి నారాయణ కవచ పారాయణము ప్రారంభించ వలెను. గోవిందాది నామములతో తూర్పు మొదలుగ నలుదిక్కుల యందును విష్ణువు, మొదలుగా గల నామములతో నాగ్నేయాది విదిక్కుల యందు (మూల లందు)ను విష్ణువు రక్షించుగాక యని పలుక వలెను. వరాహ మూర్తి భూతలము నందును త్రివిక్రముడు మీదను రక్షించుగాక యని పలికి నారాయణుడను నేనెయని యాత్మాను సంధానము చేయవలెను. (అద్వైతమును) అభేదమును సాధింప వలెను.

త్వమగ్నిర్ద్విపదాం నాథ రేతోధాః కామదీపనః

ప్రధానః సర్వభూతానాం జీవానాం ప్రభురవ్యయః

అమృతస్యారణిస్త్వం హి దేవయోని రపాంపతే

వృజినం హర మే సర్వం తీర్థరాజ నమోస్తుతే

ఏవముచ్చార్య విధివత్తతః స్నానం సమాచరేత్‌

అన్యథా భో ద్విజశ్రేష్ఠాః స్నానం తత్ర న శస్యతే

కృత్వా తు వైదికైర్మంత్రై రభిషేకం చ మార్జనమ్‌

అంతర్జలే జపేత్పశ్చా త్త్రిరావృత్త్యాఘ మర్షణమ్‌

హయమేథో యథా విప్రాః సర్వపాప హరః క్రతుః

తథాఘమర్షణం చాత్ర సూక్తం సర్వాఘనాశనమ్‌

ఉత్తీర్య వాససీ ధౌతే నిర్మలే పరిధాయ వై

ప్రాణానాయమ్య చాచమ్య సంధ్యాం చోపాస్య భాస్కరమ్‌

ఉపతిష్ఠేత్తతశ్చోర్ధ్వం క్షీప్త్వా పుష్పజలాంజలిమ్‌

ఉపస్థాయోర్థ్వబాహుశ్చ తల్లింగైర్భాస్కరం తతః

గాయత్రీం పావనీం దేవీం జపేదష్టోత్తరం శతమ్‌

అన్యాంశ్చ సౌరమంత్రాంశ్చ జప్త్వా తిష్ఠన్సమాహితః

కృత్వా ప్రదక్షిణం సూర్యం నమస్కృత్యోపవిశ్య చ

స్వాధ్యాయం ప్రాఙ్ముఖః కృత్వా తర్పయే ద్దైవతాన్యృషీన్‌

మనుష్యాంశ్చ పితౄంశ్చాన్యా న్నామగోత్రేణ మంత్రవిత్‌

తోయేన తిలమిశ్రేణ విధివత్సునమాహితః

తర్పణం దేవతానాం చ పూర్వం కృత్వా సమాహితః

అధికారీ భవేత్పశ్చా త్పితౄణాం తర్పణే ద్విజః

శ్రాద్ధే హవనకాలే చ పాణినైకేన నిర్వపేత్‌

తర్పణే తూభయం కుర్యా దేష ఏవ విధిః సదా

అటుపై నీ క్రింది మంత్రమును జపింప వలెను. ఆ మంత్ర భావమిది. మనుజులలో నగ్నిని నీవు. అనగా వైశ్వా నరాగ్నియను జఠరాగ్ని నీవె. కామోద్దీపనము చేయు వీర్యాధానము చేయు వాడవు నీవె. సర్వ భూతములకు ప్రధాన భూతము నీవు. సర్వజీవులకు ప్రభువవు. అమృతములకు సరణివి. అనగా జన్మ స్థానము. దేవతలకు మూల పురుషుడవు. నా పాపము హరింపుము. ఓ తీర్థ రాజమా! నీకు నమస్కారము. ఆపైన స్నానము చేయ వలెను. స్నాన మవసరమూ లేదు. ఆతీర్థ జలము లందు వైదిక మంత్రములతో నభిషేకము చేసి మార్జనము చేసు కొన్నను చాలు. మోకాళ్ళు నీళ్ళలో నిలిచి యఘమర్షణ ఋక్కులను మూడావృత్తులు జపించుచు స్నానము చేసిన నశ్వమేధ యాగఫలము వచ్చును. గట్టునకు వచ్చి మడి బట్టలను ధరించి ప్రాణాయా మాచరణములను జేసి సంధ్య నుపాసించి సూర్యోపస్థనము జెప్పి పూలతో జలాంజలి యిచ్చి బాహువులు మీదికెత్తి సూర్యు నుద్దేశించి నూట యెనిమిది మార్లు జపించ వలెను. నిలువ బడి ఇంకను గల సౌర మంత్రములను జపించ వలెను. సూర్యు నుద్దేశించి ప్రదక్షిణము జేసి నమస్కరించి తూర్పు ముఖమై బ్రహ్మ యజ్ఞము దేవర్షి పితృ తర్పణములను గోత్రములతో పితృ దేవతలకును తర్పణము చేయ వలెను. దేవతా తర్పణ మయిన తరువాతనే పితృ తర్పణమున కధికారి యగును. శ్రాద్ధ కాలమందు హోమ కాలమందు నొంటి చేతితో జేయ వచ్చును. తర్పణము రెండు చేతులతో జేయ వలెను.

అన్వారబ్ధేన సవ్యేన పాణినా దక్షిణేన తు

తృప్యతామితి సించేత్తు నామగ్రోత్రేణ వాగ్యతః

కాయస్థై ర్యస్తిలైర్మోహాతి త్కరో పితృతర్పణమ్‌

రుధిరం తద్భవేత్తోయం ప్రదాతా కిల్బిషీ భవేత్‌

భూమ్యాం యద్దీయతేతోయం దాతా చైవ జలే స్థితః

వృథా తన్ముని శార్దూలా నోపతిష్ఠతి కస్యచిత్‌

స్థలే స్థిత్వా జలే యస్తు ప్రయచ్ఛేదుదకం నరః

పితౄణాం నోపతిష్ఠేత సలిలం తన్నిరర్థకమ్‌

ఉదకే నోదకం కుర్యా త్పితృభ్యశ్చ కదాచన

ఉత్తీర్య తు శుచౌ దేశే కుర్యాదుదకతర్పణమ్‌

నోదకేఘ న పాత్రేఘ న క్రుద్ధో నైకపాణినా

నోపతిష్ఠతి తత్తోయం యద్భూమ్యాం న ప్రదీయతే

పితౄణామక్షయం స్థానం మహీ దత్తా మయా ద్విజాః

తస్మాత్తత్రైవ దాతవ్యం పితౄణాం ప్రీతిమిచ్ఛతా

భూమిపృష్ఠే సముత్పన్నా భూమ్యాం చైవ చ సంస్థితా

భూమ్యాం చైవ లయం యాతా భూమౌదద్యాత్తతోజలమ్‌

ఆ స్తీర్య చ కుశాన్సాగ్రాం స్తానావాహ్య స్వమంత్రతః

ప్రాచీనాగ్రేషు వైదేవా న్యామ్యాగ్రేషు తథా పితౄన్‌

తర్పణము చేయువాడు నీటిలో నిలబడి యొడ్డున తర్పణము చేసిన యెడలను, వొడ్డున కూర్చుండి నీటిలో తర్పణము చేసినను అది ఆయా దేవతలకు జెందదు. వృథా యగును. పితృ తర్పణము నీటిలో జేయరాదు. కుపితుడై చేయ రాదు. ఒంటి చేతితో చేయరాదు. గట్టు మీదికి వచ్చి శుచియైన చోట పితృ తర్పణము చేయ వలెను. ఉదక మందు పాత్రల యందు జేయరాదు. అట్లు చేసిన నది పితృ దేవతలకు నందదు. భూమి యందు జేసిన పితృ తర్పణము అక్షయము అందు కొరకె నేను భూమి నిచ్చితిని. జలము భూమిలో పుట్టినది. భూమి యందు బారు చున్నది. భూమి యందే లయమగు చున్నది. కావున పితృ తర్పణమునకు భూమి ప్రధాన స్థానము. అగ్రములతో నున్న దర్భలను తూర్పు అగ్రములుగ పఱచి దేవతలకును, దక్షిణా గ్రములుగ పఱచి పితృ దేవతలకును తర్పణము జేయ వలెను.