ఋషులు:
ప్రాచేతసస్య దక్షస్య కథం వైవస్వతేంతరే
వినాశ మగమ ద్ర్బహ్మన్! హయమేధః ప్రజాపతేః
దేవ్యా మన్యుకృతం బుద్ధ్వా కృద్ధః సర్వాత్మకః ప్రభుః
కథం వినాశితో యజ్ఞో దక్షస్యా మితతేజసః
మహాదేవేన రోషా ద్వై త న్నః ప్రబ్రూహి విస్తరాత్
ఋషులు:
వైవస్వత మన్వంతరమున ప్రాచేతసుడగు దక్ష ప్రజాపతియొక్క అశ్వమేధ యాగమెట్లు నాశమొందెను. దేవి యొక్క క్రోధవ్యాపాన మెఱింగి సర్వాత్మకుడగు నీశ్వరుడెట్లు కోపించెను? అమిత తేజో వంతుడగు దక్షుని యాగము మహా దేవునిచే రోషముతో నశింప చేయబడిన వృత్తాంతమును సవిస్తరముగ మా కెఱింగింపుము
బ్రహ్మ:
వర్ణ యిష్యామి వో విప్రాః! మహాదేవేన వై యధా
క్రోధా ద్విధ్వంసితో యజ్ఞో దేవ్యాః ప్రియచికీర్షయా
పురా మేర్వో ర్ద్విజశ్రేష్ఠాః శ్శృంగం త్రైలోక్య పూజితమ్
జ్యోతిస్థలం నామ చిత్రం సర్వరత్న విభూషితమ్
అప్రమేయ మనాధృష్యం సర్వలోకనమస్కృతమ్
తత్ర దేవో గిరితటే సర్వధాతు విచిత్రితే
పర్వంక ఇవ విస్తీర్ణ ఉపవిష్టో బభూవ హ
శైలరాజసుతా చాస్య నిత్యం పార్శ్వస్థితాభవత్
అదిత్యా శ్చ మహాత్మానో వసవ శ్చ మహౌజసః
తథైవ చ మహాత్మానా వశ్వినౌ భిషజాం వరౌ
తథా వై శ్రవణో రాజా గుహ్యకైః పరివారితః
యక్షాణా మీశ్వరః శ్రీమా న్కైలాసనిలయః ప్రభుః
ఉపాసతే మహాత్మాన ముశనా చ మహామునిః
సనత్కుమార ప్రముఖా స్తథైవ పరమర్షయః
అంగిరఃప్రముఖా శ్చైవ తథా దేవర్షయో పి చ
విశ్వావసు శ్చ గంథర్వ స్తథా నారద పర్వతౌ
అప్సరోగణ సంఘా శ్చ సమాజగ్ము రనేకశః
వవౌ సుఖశివో వాయు ర్నానా గంధవహః శుచిః
సర్వర్తుకుసుమోపేతః పుష్పవంతో భవ న్ద్రుమాః
తథా వాద్యాధరాః సాధ్యాః సిద్ధా శ్చైవ తపోధనాః
మహాదేవం పశుపతిం పర్యుపాసత తత్ర వై
భూతాని చ తథా న్యాని నానారూపధరాణ్యథ
రాక్షసా శ్చ మహారౌద్రాః పిశాచా శ్చ మహాబలాః
బహురూపధరా దృష్టా నానాప్రహరణాయుధా
దేవ స్యానుచరా స్తత్ర తస్థు ర్వైశ్వానరోపమాః
నందీశ్వర శ్చ భగవా న్దేవ స్యానుమతే స్థితః
ప్రగృహ్య జ్వలితం శూలం దీప్యమానం స్వతేజసా
గంగా చ సరితాం శ్రేష్ఠా సర్వతీర్థ జలోద్భవా
పర్యుపాసత తం దేవం రూపిణీ ద్విజసత్తమాః
ఏవం స భగవాం స్తత్ర పూజ్యమానః సురర్షిభిః
బ్రహ్మ:
ఋషులకు బ్రహ్మ యిట్లనియె! మేరు శృంగ మొకటి “జ్యోతి స్థలము” అను పేర నున్నది. అది సర్వరత్న భూషితము. లోక మనోహరము. అందుపై శైల కన్యతో నిందు ధరుండు వసించును. ఆదిత్యులు, వసువులు, అశ్వినులు, కుబేరుడు సనత్కు మారాదులు అప్సరసలు అందరు నీశ్వరుని సేవింతురు. గంగానది మూర్తిని ధరించి శివు నుపచరించు చుండెను.
దేవై శ్చ సుమహాభాగై ర్మహాదేవో వ్యతిష్ఠత
కస్యచి త్త్వథ కాలస్య దక్షో నామ ప్రజాపతిః
పూర్వోక్తేన విదానేన యక్ష్యమాణో భ్యుపద్యత
తత స్తస్య మఖే దేవాః సర్వే శక్రపురోగమాః
స్వర్గ స్థానా దథాగమ్య దక్ష మాపేదిరే తథా
తే విమానై ర్మహాత్మానో జ్వలద్భి ర్జ్వలనప్రభాః
దేవ స్యానుమతే గచ్ఛన్ గంగాద్వార మితి శ్రుతిః
గంధర్వాప్సరసా కీర్ణం నానాద్రుమలతా వృతమ్
ఋషిసిద్దైః పరివృతం దక్షం ధర్మభృతా వరమ్
పృథివ్యా మంతరిక్షే చ యే చ స్వర్లోకవాసినః
సర్వే ప్రాంజలయో భూత్వా ఉపతస్థుః ప్రజాపతిమ్
ఆదిత్యా వసవో రుద్రా స్సాధ్యా స్సర్వే మరుద్గణాః
విష్ణునా సహితా స్సర్వే ఆగతా యజ్ఞభాగినః
ఊష్మపా ధూమపా శ్చైవ ఆజ్యపా స్సోమపా స్తథా
అశ్వినౌ మరుత శ్చైవ నానాదేవగణై స్సహ
ఏతే చాన్యే చ బహవో భూతగ్రామా స్తథైవ చ
జరాయుజాండజా శ్చైవ తథైవ స్వేదజోద్భిదః
ఆగతా స్సత్రిణ స్సర్వే దేవాః స్త్రీభిః సహర్షిభిః
విరాజంతే విమానస్థా దీప్యమానా ఇవా గ్రతః
తాన్ దృష్ట్వా మన్యునావిష్టో దధీచి ర్వాక్య మబ్రవీత్
దక్ష ప్రజాపతి యీ చెప్పిన విధముగ యజ్ఞా రంభము చేసెను. ఇంద్రాది దేవతలు వచ్చిరి. అగ్ని సమమైన తేజస్సులతో విమానముల మీద గంగా(హరి) ద్వారమునకు వార రుదెంచిరి. గంధర్వులు అప్సరసలు ఆడిరి పాడిరి. అందరును చేతు లొగ్గి యాయనను సేవించిరి. మఱియు శ్రీమహా విష్ణువుతో వసు, రుద్ర, ఆదిత్య, సాధ్య మరుద్గ ణములు ఊష్మపులు, ఆజ్యవులు, సోమపాయలు అశ్వినీ దేవతలు యజ్ఞ భాగార్థులై వచ్చిరి. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జములను నాలుగు రకముల జీవ సంఘాతము కూడ వచ్చిరి. దేవతలు, ఋషులు సపత్నీకులై యేతెంచిరి. వారిని చూచి దధీచి కుపితుడై ఇట్లనియె.
దధీచి:
అపూజ్య పూజనే చైవ పూజ్యానాం చా ప్యపూజనే
నరః పాప మవాప్నోతి మహా ద్వై నాత్ర సంశయః
దధీచి:
పూజార్హులు కాని వారిని పూజించి నను అర్హులను పూజింప కున్నను మానవుడు మహా పాపి యగును.
దధీచి:
ఏవ ముక్త్వా తు విప్రర్షిః పున ర్ధక్ష మభాషత
పూజ్యం చ పశుభర్తారం కస్మా న్నార్చయసే ప్రభుమ్
అని దక్షుని చూచి పశుపతిని పూజార్హుని పరమేశ్వరుని నీవేల పూజింప వని యడిగెను.
దక్షుడు:
సంతి మే బహవో రుద్రాః శూలహస్తాః కపర్దినః
ఏకాదశ స్థానగతా నాన్యం విద్మో మహేశ్వరమ్
దక్షుడు:
శూల హస్తులు జటాజూట ధారులునైన ఏకాదశ రుద్రులు నాకు గలరు. మఱియొక మహేశ్వరుని మేమెరుగము అనెను.
దధీచి:
సర్వేషా మేకమాత్రో యం మమేశో న నిమంత్రితః
యథాహం శంకరా దూర్ధ్వం నాన్యం పశ్యామి దైవతమ్
తథా దక్షస్య విపులో యజ్ఞో యం న భవిష్యతి
దధీచి:
సర్వేశ్వరుల కేకైకమూర్తి యయిన మా మహేశ్వరుని నీవు పిలువ లేదు శంకరుని కంటె మించిన దైవతమును నేను గానను. ఈ యజ్ఞము సంపన్నము గాదు.
దక్షుడు:
విష్ణో శ్చ భాగాః వివిధాః ప్రదత్తా స్తథా చ రుద్రేభ్య ఉత ప్రదత్తాః
అన్యేపి దేవా నిజభాగయుక్తా దదామి భాగం న తు శంకరాయ
దక్షుడు:
విష్ణువునకు హవిర్భాగము లిచ్చితిమి. రుద్రులకు నిచ్చితిమి. మఱియును గల దేవత లందరకు వారివారి భాగముల నిచ్చు చున్నాను. శంకరునికి మాత్రమీయ ననెను.
బ్రహ్మ:
గతా స్తు దేవతా జ్ఞాత్వా శైలరాజపసుతా తదా
ఉవాచ వచనం శర్వం దేవం పశుపతిం పతిమ్
బ్రహ్మ:
గిరిరాజ కుమారి, తండ్రి యజ్ఞ యునకు వేల్పులెల్ల రేగిరని తెలిసి పశుపతి యగు పతితో నిట్లనియె.
ఉమ:
భగవ న్కుత్రయాంత్యేతేదేవాఃశక్రపురోగమాః
బ్రూహితత్త్వేనతత్త్వజ్ఞ సంశయో మే మహా నయమ్
ఉమ:
స్వామి! ఇంద్రాది దేవతలు ఎచటి కేగు చున్నారు. ఆ రహస్యమును సర్వ రహస్యజ్ఞు డవగు నీవు నాకా నతిమ్ము అన
మహేశ్వరుడు:
దక్షో నామ మహాభాగే! ప్రజానాం పతి రుత్తమః
హయమేధేన యజతే తత్ర యాంతి దివౌకసః
మహేశ్వరుడు:
మహానుభావుడగు దక్షుడను పేరుగల ప్రజాపతి యశ్వమేధము చేయు చున్నాడు.
దేవి:
యజ్ఞ మేతం మహాభాగ! కిమర్థం నానుగచ్ఛసి
కేన వా ప్రతిషేధేన గమనం తే న విద్యతే
దేవి:
ఈ యజ్ఞమునకు మీరేల వెళ్ళరు. వెళ్ళక పోవుట కభ్యంతర మేమి?
మహేశ్వరుడు:
సురై రేవ మహాభాగే సర్వ మేత దనుష్టితమ్
యజ్ఞేషు మమ సర్వేషు న భాగ ఉపకల్పితః
పూర్వాగతేన గంతవ్యం మార్గేణ వరవర్ణిని!
న మే సురాః ప్రయచ్ఛంతి భాగం యజ్ఞస్య ధర్మతః
మహేశ్వరుడు:
ఇదంతయు దేవతలు చేసిన కుట్ర. యజ్ఞము లందన్నిటను నాకు భాగము కల్పింప బడుట లేదు. మునుపటి నుండి యేర్పడిన దారినే పోవలెను. దేవతలు యజ్ఞ భాగమును నాకు ధర్మము ననుసరించి యీయ వలసినది ఇచ్చట లేదు అన
ఉమ:
భగవ న్సర్వదేవేషు ప్రభావాభ్యధికో గుణైః
అజేయ శ్చాప్యధృష్యశ్చ తేజసా యశసా శ్రయా
అనేన తు మహాభాగ ప్రతిషేధేన భాగతః
అతీవ దుఃఖ మాపన్నా వేపథు శ్చ మహ నయమ్
కింనామ దానం నియమం తపో వా కుర్యామహం యేన పతిర్మమాద్య
లభేత భాగం భగవా నచింత్యో యజ్ఞస్య చేంద్రాధ్యమరైర్వి భక్తమ్
ఉమ:
ఏలిన వారు ప్రభావము చేతను గుణముల చేతను దేవత లందరిలో తేజస్సు చేత కీర్తి చేత యణిమా సంపద చేత గెలువ రాని వారు లొంగని వారు. మీకీ హవిర్భాగము ఈయ నందున నేనెంతో దుఃఖము నందు చున్నాను. నాకు వణకు పుట్టు చున్నది. సాక్షా ద్భగవంతుడు ధ్యానమున కందని మహానుభావులు అయిన నా భర్త యజ్ఞ భాగము నందుటకు నేనేమి దానము, నియమము తపస్సు చేయుదును.
బ్రహ్మ:
ఏవం బ్రువాణాం భగవా న్విచింత్య పత్నీం ప్రహృష్టః క్షుభితా మువాచ
బ్రహ్మ:
అని పలికి క్షోభ పడుచున్న పత్నిని జూచి భగవంతుడు ఆనంద భరితుడై యిట్లనియె.
మహేశ్వరుడు:
న వేత్సి మాం దేవి కృశోదరాంగి కింనామ యుక్తం వచనం త వేదమ్
అహం విజానామి విశాలనేత్రే! ధ్యానేన సర్వే చ విదంతి సన్తః
తవా ద్య మోహేన సహేంద్రదేవా లోకత్రయం సర్వమధోవినష్టమ్
మా మధ్వరేశం నితరాం స్తువంతి రథంతరం సామ గాయంతి మహ్యమ్
మాం బ్రాహ్మణా బ్రహ్మమంత్రై ర్యజంతి మమా ధ్వర్యవః కల్పయంతే చ భాగమ్
మహేశ్వరుడు:
ఓ కృశోదరి! లతాంగి! నన్నీ వెఱుంగవు. నీవిపుడన్న మాట లేమంత యుచితములు? విశాలాక్షి! మహానుభావు లందఱు నేమన కొందురో నేనె ఱుంగుదును. నీకు గలిగిన పొరబాటు వలన ఇంద్రునితో గూడ నెల్ల దేవతలు ముల్లోకములు సర్వము నష్ట పడినది. నన్ను యజ్ఞేశ్వరుండందురు. రథంత సామముచే వేద విదులు నన్ను స్తుతింతురు. బ్రాహ్మణులు నన్ను వేద మంత్రము లచే యజింతురు. అధ్వర్యులు నాకు యజ్ఞము లందు భాగము గల్పింతురు.
దేవి:
వికత్థసే ప్రాకృతవ త్సర్వస్త్రీజనసంసది
స్తౌషి గర్వాయసే చాపి స్వ మాత్మానం న సంశయః
దేవి:
సామాన్యుని వలె నాడు వారిలో నిన్ను నీవు పొగడు కొను చున్నావు. నీలో నీవు గర్వపడు చున్నావు. సందేహము లేదన
భగవానుడు:
నా త్మానం స్తౌమి దేవేశి! యథా త్వ మనుగచ్ఛసి
సంస్రక్షామి వరారోహే భాగార్థే వరవర్ణిని
భగవానుడు:
సురేశ్వరి! నీవను కొన్నట్లు నన్ను నేను బొగడు కొనుట లేదు. ఇక నా యజ్ఞ భాగమును నేనడుగ బోవు చున్నాను.
బ్రహ్మ:
ఇత్యుక్త్వా భగవాన్పత్నీముమాంప్రాణైరపిప్రియామ్
సో సృజ ద్భగవా న్వక్త్రా త్సుత్రం క్రోధాగ్ని సంభవమ్
త మువాచ మఖం గచ్ఛ దక్షస్య త్వం మహేశ్వర
నాశయా శు క్రతుం తస్య దక్షస్య మదనుజ్ఞయా
బ్రహ్మ:
అని ప్రాణముల కంటె బ్రియురాలైన యుమా దేవింగూర్చి భగవంతుడు పలికి ముఖము నుండి క్రోధాగ్ని నుండి యొక కుమారుని సృష్ఠించెను. వానింగని దక్షుని యజ్ఞమున కేగును. నా యాజ్ఞచే నతడు సేయుచున్న క్రతువును నాశనము సేయుమనియె.
బ్రహ్మ:
తతోరుద్రప్రయు క్తేన సింహవేషేణ లీలయా
దేవ్యా మన్యుకృతం జ్ఞాత్వా హతో దక్షస్య స క్రతుః
మన్యునా చ మహాభీమా భద్రకాళీ మహేశ్వరీ
అత్మనః కర్మ సాక్షిత్వే తేన సార్థం స హానుగా
స ఏష భగవా న్క్రోథః ప్రేతావాస కృతాలయః
వీరభద్రేతి విఖ్యాతో దేవ్యా మన్యుప్రమార్జకః
సో సృజ ద్రోమ కూపేభ్య ఆత్మ నైవ గణేశ్వరాన్
రుద్రానుగాన్ గణా న్రౌద్రా న్రుద్ర వీర్య పరాక్రమాన్
రుద్ర స్యానుచరా స్సర్వే సర్వే రుద్రపరాక్రమాః
తే నిపేతు స్తత స్తూర్ణం శతశో థ సహస్రశః
తతః కిలకిలాశబ్ద అకాశం పూరయ న్నివ
సమభూ త్సుమహా న్విప్రాః సర్వరుద్రగణైః కృతః
తేన శబ్దేన మహతా త్రస్తాః సర్వే దివౌక సః
పర్వతా శ్చ వ్యశీర్యంత చకంపే చ వసుంధరా
మరుత శ్చ వవుః క్రూరా శ్చుక్షుభే వరుణాలయః
అగ్నయో వై న దీప్యంతే న చా దీప్యత భాస్కరః
గ్రహానైవ ప్రకాశంతే నక్షత్రాణి న తారకాః
ఋషయో న ప్రభాసంతే న దేవా న చ దానవాః
ఏవం హి తిమిరీభూతే నిర్థహంతి గణేశ్వరాః
ప్రభంజం త్యపరే యూపాన్ ఘోరా నుత్పాటయంతి చ
ప్రణదంతి తథా చాన్యే వికుర్వంతి తథాపరే
త్వరితం వై ప్రధావంతి వాయువేగా మనోజవాః
చూర్ణ్యంతే యజ్ఞపాత్రాణి యజ్ఞస్యా యతనాని చ
శీర్యమాణా న్య దృశ్యంత తారా ఇవ నభస్థలాత్
దివ్యాన్న పాన భక్ష్యాణాం రాశయః పర్వతోపమాః
క్షీరనద్య స్తథా చాన్యా ఘృతపాయసకర్దమాః
మధుమండోదకా దివ్యాః ఖండశర్కర వాలుకాః
షడ్రసా న్నివహం త్యన్యా గుడకుల్యా మనోరమాః
ఉచ్ఛావచాని మాంసాని భక్ష్యాని వివిధాని చ
యానికాని చ దివ్యాని లేహ్యచోష్యాణి యాని చ
భుంజతి వివిధై ర్వక్త్రై త్విలుంపంతి క్షిపంతి చ
రుద్రకోపా మహాకోపాః కాలాగ్ని సదృశోపమాః
భక్షయంతో థ శైలాభా భీషయంత శ్చ సర్వతః
క్రీడంతి వివిధాకారా క్షిపు స్సురయోషిత
ఏవం గణా శ్చ తై ర్యుక్తో వీరభద్రః ప్రతాపవాన్
రుద్రకోపయుక్త శ్చ సర్వదేవై స్సురక్షితమ్
తం యజ్ఞ మదవా చ్ఛీఘ్రం భద్రకాళ్యాః సమీపతః
చక్రు రన్యే తథా నాదా న్సర్వభూత భయంకరాన్
ఛిత్వా శిరో న్యే యజ్ఞస్య వ్యనదంత భయంకరమ్
తత శ్శక్రాదయా దేవా దక్ష శ్చైవ ప్రజాపతిః
ఊచుః ప్రాంజలయో భూత్వా కథ్యతాం కో భవా నితి
బ్రహ్మ:
అవ్వల నిట్లు రుద్రుడు ప్రయోగించిన సింహ వేషధారి చేతను దేవి క్రోధవశమై నదని యెఱింగి నా దక్ష యజ్ఞ మవలీలగ ధ్వంసము చేయ బడెను. ఆగ్రహముచే మహోగ్రయై మహేశ్వరి భద్రకాళియై, తాను కర్మసాక్షి గావున యా కోపమూర్తి వెంట నేగెను. రుద్రక్రోధ స్వరూపుడైన యాతడు వీరభద్రుడను పేరందెను. ఆయన శ్మశాన నివాసి గూడ. దాక్షాయణి కోప నివారణము సేసిన వాడు. ఆయన తన రోమ కూపముల నుండి తనకు దాన గణేశ్వరులను సృజించెను. వారు రుద్రుని వెంట నుండువారు రుద్రుని బలపరాక్రమ స్వరూపులు రౌద్రాకారులు. రుద్రుని సేవకలు వందలు వేల కొలది యప్పుడు యటవచ్చి వ్రాలిరి. ఆ రుద్ర గణములు సేసిన ఘోరమైన కిలకిలా రావముల లాకాశ మెల్ల నలము కొన్నట్ల య్యెను. ఆ ధ్వనికి దేవత లందరు హడలి పోయిరి. పర్వతములు బ్రద్ద లయ్యెను. భూకంప మయ్యెను, ఝంఝూ మారుతములు విసరెను. సముద్రము క్షోభించెను. అగ్నులు వెలుగ వయ్యె. సూర్యుడు వెలవెల పోయెను. నక్షత్రములు తారా గ్రహములు కాంతి హీనము లయ్యెను. ఋషులు దేవ దానవులు ప్రభాశూన్యు లయిరి. లోక మిట్లంధ కారబంధుర మయిన తఱి గణేశ్వరులు విజృంబించి యజ్ఞశాల నంటించిరి. బ్రద్దలు కొట్టిరి. యూప స్తంభములను పెల్లగించి పార వేసిరి. మనో వాయు వేగముల బర్వు లెత్తిరి. యజ్ఞ పాత్రములను యజ్ఞా యతన ములను పిండి పిండి చేసిరి. తారలు (నక్షత్రములు) తునుక తునుకలై నింగి నుండి రాలు చున్నట్లు కన బడెను. రుద్ర గణము దివ్యాన్న పాన భక్ష్యరాసులను పర్వతము లట్లున్న వానిని దినివేయ మొదలిడిరి. క్షీర నదులు, కరడు గట్టిన నెయ్యి పాయసము తేనెలు ఇసుక మేటలిట్లు పడి యున్న ఖండ శర్కరలు కాలువలై పారు బెల్లపు పాకములు హెచ్చురు చిగుల్కు మాంసములు వివిధములైన భక్ష్యములు (తిన దగినవి) లేహ్య (నాక దగినవి) చోష్య (జుఱ్ఱ దగినవి) పానీయములు (త్రావ దగినవి) పెక్కు నోళ్ళ దిను చున్నారు. ఒలుక బోయు చున్నారు, విరజిమ్ము చున్నారు, రుద్రుని కోప స్వరూపులు మహా కోవులు. కాలాగ్ను లట్లున్నారు. నడగొండ లట్లు నలుదెసల గ్రమ్మి భక్షించిరి. బెదరించెను. పలు రూపులనాడిరి. గంతు లిడిరి. దేవ తాంగనలం బట్టుకొని విసర జొచ్చిరి. ఇట్లు గణములం గూడి ప్రతాప శాలి వీరభధ్రుడు రుద్ర కోపముచే బ్రయోగింప బడి సర్వ దేవతల రక్షణలో నున్న యమ్మహా యజ్ఞమును, భద్రకాళి సన్నిధి నుండ దహించి వేసెను. కొందరు గణాధిపులు సర్వభూత భయంకర ముగ నార్చులు వెట్టిరి. యజ్ఞ పురుషుని తల బ్రద్దలు గొట్టి పెల్లున గర్జించిరి. అంతట నింద్రాది దేవతలు దక్ష ప్రజాపతియుం జేతులు జోడించి తామెవ్వరో తెలుపు మనిరి.
వీరభద్రుడు:
నాహం దేవో న దైత్యో వా న చ భోక్తు మిహాగతః
నైవ ద్రష్టుం చ దేవేంద్రాః న చ కౌతూహలాన్వితః
దక్షయజ్ఞ వినాశార్థం సంప్రాప్తో హం సురో త్తమాః
వీరభద్రేతివిఖ్యాతో రుద్రకోపా ద్వినిసృతః
భద్రకాళీ చ విఖ్యాతా దేవ్యాః క్రోధా ద్వినిర్గతా
ప్రేషితా దేవదేవేన యాజ్ఞాంతిక ముపాగతా
శరణం గచ్ఛ రాజేంద్ర! దేవదేవ ముమాపతిమ్
వరం క్రోథోపి దేవస్య న వరః పరిచారకైః
వీరభద్రుడు:
నేను దేవుడను గాను దైత్యుడను గాను ఇక్కడ విందు గడుచుటకు వచ్చిన వాడను గాను. మీ వేడుక చూడ వేడుకపడు వాడను గాను. దక్షయజ్ఞ నాశనము సేయ వచ్చి నాడను. రుద్ర కోపము వలన బయలు దేరినాడను. వీరభద్రుడను పేరందిన వాడను. దేవి క్రోధము నుండి వెలువడి భధ్రకాళి యని పేరందిన దీమె. దేవ దేవుడు పంప నీ యజ్ఞము దరికి వచ్చినది. రాజేంద్రా! నీవు దేవదేవు నుమాపతిని శరణందుము. దేవ ప్రభువు కోపించుట మంచిది గాని నైకరులతో గోపము మంచిది గాదు.
నిఖాతోత్పాటితై ర్యూపై రపవిద్ధై స్తత స్తతః
ఉత్పతద్భిః పతద్భి శ్చ గృధ్రై రామిషగృధ్నుభిః
పక్షవాత వినిర్థూతై శ్శివారుత వినాదితైః
స తస్య యజ్ఞో సృపతే ర్భాధ్యమమాన స్తదా గణైః
ఆస్థాయ మృగరూపం వై ఖ మేవాభ్యపత త్తదా
తం తు యజ్ఞం తథారూపం గచ్ఛంత ముపలభ్య సః
ధను రాదాయ బాణం చ తదర్థ మగమ త్ర్పభుః
తత స్తస్య గణేశస్య క్రోథా దమిత తేజసః
లలాటాత్ర్పసృతో ఘోరః స్వేదబిందు ద్బభూవ హ
తస్మి న్పతితమాత్రే చ స్వేదబిందౌ తదా భువి
ప్రాధుర్భూతో మహా నగ్ని ర్జ్వలత్కాలానలోపమః
తత్రో దపద్యత తదా పురుషో ద్విజస త్తమాః
హ్రస్వో తిమాత్రో రక్తాక్షో హరిచ్ఛ్మశ్రు ర్విభీషణః
ఊర్థ్వకేశో తిరోమాంగః శోణకర్ణ స్తథైవ చ
కరాళకృష్ణవర్ణ శ్చ రక్తవాసా స్తథైవ చ
తం యజ్ఞం స మహాసత్వో దహ త్కక్ష మివా నలః
దేవా శ్చ ప్రద్రుతా స్సర్వే గతా భీతా దిశో దశ
తేన తస్మిన్విచరతా విక్రమేణ తదా తు వై
పృథివీ వ్యచల త్సర్వా సప్త ద్వీపా సమంతతః
మహాభూతే ప్రవృత్తే తు దేవలోక భయంకరే
తదా చాహం మహాదేవ మబ్రవం ప్రతి పూజయాన్
భవతేపి సురా స్సర్వే భాగం దాస్యంతి వై ప్రభో
క్రియతాం ప్రతిసంహారః సర్వదేవేశ్వర! త్వయా
ఇమా శ్చ దేవతాః సర్వా ఋషయ శ్చ సహస్రశః
తన క్రోధా న్మహాదేవ న శాంతి ముపలేభిరే
య శ్చైష పురుషో జాతః స్వే దజ స్తే సురర్షభ
జ్వరో నా మైష ధర్మజ్ఞ! లోకేషు ప్రచరిష్యతి
ఏకీభూతస్య న హ్యస్య ధారణే తేజసః ప్రభో
సమర్ధా సకలా పృధ్వీ బహుధా సృజ్యతామయమ్
ఇత్యుక్తః స మయా దేవో భాగే చాపి ప్రకల్పితే
భగవా న్మాం తథే త్యాహ దేవదేవః పినాకధృక్
పరాం చ ప్రీతి మగమ త్స స్వయం చ పినాక దృక్
దక్షో పి మనసా దేవం భవం శరణ మున్వగాత్
ప్రాణాపానౌ సమారుధ్య చక్షుస్థ్సానే ప్రయత్న తః
విధార్య సర్వతో దృష్టిం బహుదృష్టి రమిత్రజిత్
స్మితం కృత్వా బ్రవీ ద్వాక్యం బ్రూహి “కిం కరవాణి తే”
శ్రావితే చ మహాఖ్యానే దేవానాం పితృభిస్సహ
త మువాచాంజలిం కృత్వా దక్షో దేవం ప్రజాపతిః
భీత శ్శంకితచిత్త స్తు సబాష్ప వదనేక్షణః
కలుగుల నుండి పెల్లగింప బడి విఱువ బడిన యూపములతో మాంస లుబ్ధములై వ్రాలుచు మిక్కిలి విసురగ ఱెక్కలు విసరుచు నెగురుచు వ్రాలుచున్న గ్రద్దలతో నక్క కూతలతో ప్రతి ధ్వనించు చున్న రుద్ర గణములచే ధ్వంసము సేయ బడిన దక్ష యజ్ఞ మపుడు లేడి రూపుగొని యాకాశమున కెగిరి పోయెను. ఆ రూపమున బోవు చున్న యయ్యజ్ఞ పురుషుం జూసి వీరభద్ర స్వామి విల్లు నమ్ములుంగొని వానింజంప నేగెను. అమిత ప్రతాప శాలియైన యా గణేశుని క్రోథము వలన నాతని నుదుటి నుండి ఘోరమైన యొక చెమట చుక్క రాలిపడెను. నేలపై బడగానె యా స్వేదబిందువు నుండి ప్రజ్వలించు కాలాగ్ని వోలె నొక పురుషు డావిర్భ వించెను. ఆదోచిన పురుష మూర్తి మరుగుజ్జు ఎఱువు గన్నుల వాడు. బవిరి గడ్డము వాడు. భయంకరుడు. నిక్కిన తల వెంట్రుకలు. ఒడలెల్ల బొచ్చు. ఎఱుపారు చెవులు. జడుపు గొల్పు కాఱు నలుపు రంగు ఎఱ్ఱ బట్టలు గలవాడై యమ్మహా బలుడా యజ్ఞము నగ్ని కక్షమును (ఎండు గడ్డిని) వలె గాల్చి వైచెను. దేవత లడలెత్తి పది దెసలకు బారి పోయిరి. అందు విక్రమమున సంచారము సేయు చున్న యా వీరభద్రునిచే భూమి సప్త ద్వీపములతో గంపించెను. దేవలోక భయంకరమైన యొక పెనుభూత మిట్లు విజృంబించి నంతట నేను (బ్రహ్మ) మహా దేవుని బూజించుచు నిట్లంటిని. దేవత లెల్లరు నీకు గూడ యజ్ఞ భాగము నీయ గలరు. ప్రభూ! సర్వ దేవాధి నాథుడవు. నీవీ భయంకర రూపము నుప సంహరింపుము. ఈ దేవత లందఱు వేలకొలది ఋషులు నీ క్రోధముచే శాంతి వడయ లేకున్నారు. ఓ సురేశ్వరా! నీ చెమట నుండి పుట్టిన యీ పురుషుడు జ్వరమను పేర లోకములం జరింప గలడు. ఏక రూపమై యున్న నితని తేజస్సును ఈ యెల్ల పృధివియు భరింప జాలదు. కావున దీనిని పెక్కు రూపుల గావింపుము. అని నేన న్నంతట, యాయనకు గూడ యజ్ఞ భాగము గల్పించి నంతట నా భగవంతుడు పినాక పాణి తనకు దాను పరమ ప్రీతి నందెను. దక్షుడును మనసార నాభవుని దేవుని శరణందెను. నేత్ర స్థానమున ప్రాణా పానములను ప్రయత్నముతో నిలిపి బహుదృష్టి యగు పరమేశ్వరుడు బహిర్గత మైన చూపును మరలించి నిలిపి యల్లన నవ్వి నీకేమి చేయుదును తెలుపు మనియె. ఈ కథను దేవతలు పితృ దేవతలు నాలించి నంతట ప్రజాపతి దక్షుడు చేతులు మొగిచి బెదరి పోయి మదిలో శంకించుచు కన్నుల నీరు గార్చుచు నిట్లనియె.
దక్షుడు:
యది ప్రసన్నో భగవా న్యది వా హం తవ ప్రియః
యది చాహ మనుగ్రాహ్యో యది దేయో వరో మమ
య ద్భక్ష్యం భక్షితం పీతం త్రాసితం యచ్చ నాశితమ్
చూర్ణికృతాపవిధ్ధం చ యజ్ఞ సంభార మీదృశమ్
దీర్ఘకాలేన మహతా ప్రయత్నేన చ సంచితమ్
న చ మిథ్యా భవే న్మహ్యం త్వత్ర్పసాదా న్మహేశ్వర!
దక్షుడు:
భగవంతుడు నా యెడల బ్రసన్ను డగునేని నేను నీకు బ్రియుండ నేని నేన నుగ్రహింప నర్హుడ నేని నాకొక్క వరమీయ దగును. ఈ యజ్ఞము కొరకు బహు కాలము బహు ప్రయత్నముచే సమకూర్చు కొన్న భక్ష్యమెల్ల భక్షింప బడినది. త్రావ దగినిదెల్ల త్రావ బడినది. బెదిరింప బడినది. నాశనము సేయ బడినది. పొడిపొడి గావింప బడినది. ముక్క ముక్కలు సేయ బడినది. అయినను నీ యనుగ్రహము వలన నో మహేశ్వర! ఈ యజ్ఞ మబద్దము గాగూడదు. సఫలము గావలయు నని ప్రార్ధించెను.
బ్రహ్మ:
తథా స్త్వి త్యాహ భగవా న్భగనేత్రహరో హరః
ధర్మాధ్యక్షం మహాదేవం త్ర్యంబకం చ ప్రజాపతిః
జానుభ్యా మవనీం గత్వా దక్షో లబ్ధ్వా భవాధ్వరమ్
నామ్నాం చాష్ట సహస్రేణ స్తుతవా న్వృషభధ్వజమ్
బ్రహ్మ:
తథాస్తు (అట్లే యగు గాక) యని భగుని కన్నులు రాల్చిన యాహరుడు పలికెను. ధర్మమున కధ్యక్షుడు త్రినేత్రుడు నగు మహాదేవుని దక్షుడు నేలపై మోకాళ్ళ నానించి నమస్కరించి శివ యజ్ఞముం బడసి యెనిమిదివే ల శివ నామముల నా వృషభ ధ్వజుని స్తుతించెను.
Summary of chapter 39 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The sacred tīrtha of Ekāmra (Bhubaneswar, Oḍiśā) and its presiding deity Śiva Ekāmreśvara are extolled. The origin of this holy centre, the miraculous events that hallowed it, and the extraordinary merit accruing to those who visit, bathe, and worship there are described. The Ekāmra tīrtha is proclaimed one of the holiest Śaiva centres in Bhārata, capable of granting liberation even to the gravest of sinners.