245 - అజస్యాపి విక్రియయా నానాభవనమ్‌

వసిష్ఠుడు:

ఆప్రబుద్ధ మథావ్యక్త మిమం గుణనిధిం సదా 

గుణానా ధార్యతాం తత్త్వం సృజ త్యాక్షిపతే తథా

అజోహి క్రీడయా భూప విక్రియాం ప్రాప్త ఇత్యుత

ఆత్మానం బహుధా కృత్వా నానేవ ప్రతిచక్షతే

ఏతదేవం వికుర్వాణో బుధ్యమానో న బుధ్యతే

గుణా నాచరతే హ్యేష సృజ త్యాక్షిపతే తథా

అవ్యక్తబోధానా చ్చైవ బుద్యమానం వదం త్యపి

న త్వేవం బుధ్యతేవ్యక్తం సగుణం తాత నిర్గుణమ్‌

కదాచి త్త్వేవ ఖల్వేతత్తదాహుః ప్రతిబుద్ధకమ్‌ 

బుద్యతే యది చావ్య క్తమేత ద్వై పంచవింశకమ్‌

బుద్యమనో భవత్యేష మమాత్మక ఇతి శ్రుతః

అన్యోన్య ప్రతిబుద్ధేన వదం త్యవ్యక్త మచ్యుతమ్‌

అవ్యక్తభోదనాచ్చైవ బుధ్యమానం వదం త్యుత

పంచవింశం మహాత్మానం న చాసా వపి బుధ్యతే 

షడ్వింశం విమలం బుద్ధమప్రమేయం సనాతనమ్‌

సతతం పంచవింశం తు చతుర్వింశం విబుధ్యతే

దృశ్యాదృశ్యే హ్యనుగత తత్స్వభావే మహాద్యుతే

అవ్యక్తం చైవ తద్బ్రహ్మబుద్యతే తాత కేవలమ్‌ 

పంచవింశం చతుర్వింశమాత్మాన మనుపశ్యతి 

బుధ్యమానో యదాత్మానమన్మోహ మితి మన్యతే

తదా ప్రకృతి మానేష భవ త్యవ్యక్తలోచనః

బుధ్యతే చ పరాం బుద్ధిం విశుద్ధా మమతాం యదా

షడ్వింశం రాజషార్దూల తదా బుద్ధః కృతో వ్రజేత్‌

తత స్త్యజతి సోవ్యక్త సర్గప్రలయధర్మి ణమ్‌

నిర్గుణాం ప్రకృతిం వేద గుణయుక్తా మచేతనామ 

తతః కేవల ధర్మాసౌ భవ త్యవ్యక్తదర్శ నాత్‌

కేవలేన సమాగమ్మ మిముక్తాత్మాన మాప్నుయాత్‌

ఏతత్తుతత్త్వ మిత్యాహు ర్నిస్తత్త్వ మజరామరమ్‌

వసిష్ఠ జనక సంవాదోప సంహారము

వసిష్ఠుడు:

ఆ ప్రబుద్ధావస్థలో నుండు జీవుడు అవ్యక్తమును నిర్గణమును నగు ఇరువది యైదవ తత్త్వమును కూడ సగుణ తత్త్వముగా భావించును. ఆతత్త్వము నందు ఆరోపింప బడు గుణములను సృజించుచు ఉపసంహరించుచు ఉన్నట్లు కల్పన చేసికొనును. ఓ జనక రాజా! ఆ మూల తత్త్వము అజము జన్మ రహితము ఐనను క్రీడార్థమై వికారములను పొందు చున్నాడు. తన్ను తాను అనేక తత్త్వముల రూపమున కల్పించుకొని నానా రూపముల నొందిన వాడు వలె చెప్పబడు చున్నాడు. ఇట్లు వికృతి నొందు చుండియు ఇట్లని వాస్తవ స్థితిని ఎరుగ లేకున్నాడు. అవ్యక్త తత్త్వ స్వరూపము ఇది యని తత్త్వబొధ చేయ బడినవుడు జ్ఞాన సాధన దశలో అతడు బుధ్యమానుడు, బోధమును, జ్ఞనమును అందుకొను చున్నవాడు అని వ్యవహరింప బుడు చున్నాడు. కాని ఇట్లు బోధింపడు చుండియు సగుణ మైనది వలె కనబడు ఈ అవ్యక్త తత్త్వమును వాస్తవమున నిర్గుణమైన దానినిగా గుర్తింప లేక పొవు చున్నాడు. ఇరువది యైదవది యగు ఈ అవ్యక్త తత్త్వ స్వరూపమును దాని నిర్గుణత్వమును ఒకానొకప్పు డీతడు తెలిసికొన గలిగిన యెడల ప్రతిబుద్ధుడు అని వ్యవహరింప బడును. బుధ్యమాన దశలో జీవుడు మమకారా వృతుడు. అన్ని తత్త్వములకును అతీతమగు ఇరువది యారవ తత్త్వము విమలమును, బుద్ధమును, జ్ఞానాత్మకమును, ఆప్రమేయమును. ఇట్టిది అని ఎరుగ శక్యము కానిది సనాతనము, శాశ్వత మైనది. దానిని గుర్తింప గలిగి నప్పుడు సృష్టి ప్రళయ ధర్మ యుక్తమగు ఇరువది యైదవ తత్త్వముగా నుండుటను గూడ అతిగతమై అత్యున్నత దశ నందుకొనును. అప్పు డీతడు వస్తుతః గుణ రహితమును జడమును నగు ప్రకృతిని సగుణత్ము నొందిన దానినిగా గురైరుగును. తాను కేవల జ్ఞానాత్మకుడై అవ్యక్త తత్త్వమును గూడ వాస్తవ రూపమున దర్శింప గలుగును.

తత్త్వసంశ్రవణా దేవ తత్త్వజ్ఞో జాయతే నృప

పంచవిశతితత్త్వాని ప్రవదంతి మనీషిణః 

నచైవతత్త్వవాం స్తాత సంసారేషు నిమజ్జతి

ఏషాముపైతి తత్త్వం హిక్షిప్రం బుధ్యస్వ లక్షణమ్‌ 

షడ్వింశోయమితి ప్రాజ్ఞో గృహ్యమాణోజరామరః 

కేవలేన బలేనైవ సమదతాం యా త్యసంశయమ్‌ 

షడ్వీం శేన ప్రబుద్ధేన బుధ్యమానోప్యబుద్ధిమాన్‌ 

ఏత న్నానాత్వ మిత్యుక్తం సాంఖ్య శ్రుతినిదర్శనాత్‌

చేతనేన సమేతస్య పంచవింశతికస్య హ

ఏకత్వం వైభవే త్తస్య యదా బుద్ధ్యానుబుధ్యతే

బుధ్యమానేన బుద్ధేన సమాతాం యాతి మైథిల

సంగధర్మా భవత్యేష నిఃసంగాత్మా నరాధిప

నిఃసంగాత్మ్బాన మాసాద్య షడ్వింశం కర్మజం విదుః

విభు స్త్యజతి చావ్యక్తం యదాత్వేత ద్విబుధ్యతే

చతుర్వింశ మగాధం చ షడ్వింశస్య ప్రబోధనాత్‌

ఏష హ్యప్రతిబుద్ధశ్చ బుద్యమానస్తు తే నఘ 

ఉక్తో బుద్ధ శ్చ తత్త్వేన యథాశ్రుతి నిదర్శనాత్‌

పమశకోదుంబరే యద్వ దన్యత్వం తద్వదేకతా

మత్స్యోదకం యథా తద్వ దన్యత్వ ముపలభ్యతే

ఏవ మేవ చ గంతవ్యం నానా త్వై కత్వ మేతయోః 

ఏతావ న్మోక్ష ఇత్యుక్తో జ్ఞాన విజ్ఞాన విజ్ఞాన సంజ్ఞిత

పంచవింశతిక స్యాశుయోయం దేహే ప్రవర్తతే 

ఏవ మోక్షయిత వ్యేతి ప్రాహు రవ్యక్త గోచరాత్‌ 

సోయ మేవం విముచ్యేత నాన్య థేతి వినిశ్చయః 

పరశ్చ పరధర్మా చ భవ త్యేవ సమేత్య వై 

విశుద్ధ ధర్మా శుద్ధేన నాశుద్ధేన చ బుద్ధిమాన్‌

విముక్తధర్మా బుద్ధేన సమేత్య పురుషర్షభ

నియోగధర్మిణాచైవ విముక్తాత్మా భవత్యథ

విమోక్షిణా విమోక్షశ్చ సమే త్యేహ తథా భవేత్‌

శుచికర్మా శుచిశ్చైవ భవ త్యమిత బుద్ధిమాన్‌ 

విమలాత్మాచ భవతి సమేత్య మిమలాత్మనా

కేవలాత్మా తథా చైవ కేవలేన సయేత్యవై

స్వతంత్రశ్చ స్వతంత్రేణ స్వతంత్రత్వ మావాప్యతే 

ఓ రాజా! తత్త్వముల నాశ్రయించిన నేకాని నరుడు తత్త్వజ్ఞుడు కాజాలడు. నాయనా! తత్త్వజ్ఞుడు సంసార గతులలో మునుగడు. తత్త్వము లిరువది యైదని విద్వాంసులు చెప్పు చున్నారు. వీని లక్షణమును తెలిసి కొన్నచో వీటి మూల తత్త్వమును కూడ చేర గలుగను. ఏలయన, ఇరువది యారవది సర్వమూ తత్త్వము. ఇతడు ఇదియే ఇరువది యారవ తత్త్వమని సరిగా గుర్తించి నచో జరా మరణములు లేక శుద్ధ యోగ బలముచే సమతా స్థితిని పొందును. సందేహము లేదు. ఐనను అజ్ఞానానికి జ్ఞాన బోధ చేయుటకై తత్త్వములు ఇరువది నాల్గేయని ఇరువది యైదే యని ఏకత్వము నుండి నానాత్వము జరిగిన విధము ఇదియని సాంఖ్య దర్శనము. ఎపుడు చేతన తత్త్వము కూడిన ఈ పంచ వింశతితమ తత్త్వమ యొక్క ఏకత్వము బుద్ధి యందు స్థిరమై ఆవగత మై నిలుచునో అపుడు ముముక్షువు సమత్వము పొందును. ఏలయన నిఃసంగుడై యుండియు పరమాత్ముడు మాయా కృతమైన సంగ వశమున నంసారములో వరిభ్రమించు చున్నాడు. మాయ దూరమై నపుడు ముక్తినందు చున్నాడు. నిఃసంగ రూపుడగు పంచ వింశతితమ తత్త్వమును ఎరిగిన తరువాత అజుడగు, జన్మరహితు డగు ఆ ఇరువది యారవ తత్త్వము నెరుగ గలుగును. అవ్యక్త తత్త్వము నెరుగుట చేతనే ఈ పరమ విబోధము జ్ఞానము కలుగును. చతుర్వింశతి తత్త్వముల నెరుగుట కూడ ఈ ఇరువది యారవ తత్త్వము నెరిగి ముక్తి నందుటకు సాధనమే. ఓ అనఘుడ వగు జనక రాజా! నీకిట్లు సాంఖ్య విధానమున బుద్ధ, బుద్యమాన, అప్రతిబుద్ధుల లక్షణములను తెలిపితిని. ఈ తెలిపిన తత్త్వముల నానాత్వము ఏకత్వముల సంబంధము చేపకు నీటికిని, మేడి కాయకు దాని యందలి పురుగులకును గల సంబంధము వంటిది. జ్ఞానము విజ్ఞానము అని వ్యవహరింప బడుట ముక్తి స్వరూప మిదియే. ఈ దేహమున సాక్షి తత్త్వముగా నున్న ఇరువది యైదవ అవ్యక్త తత్త్వము నెరుగనిదే ముక్తి కలుగదు. ఈ ఇరువది యారవ తత్త్వము పర తత్త్వము పరమగు ధర్మము కలిగినది. ఏ మాత్రమును ఆశుద్ధము కాని శుద్ధ తత్త్వము, విశుద్ధ మగు ధర్మము కలది, జ్ఞాన శాలి, జ్ఞానాత్మకుడు, వాస్తవమున ఆలోచించినచో సర్వ ధర్మముల నుండి విముక్తుడు కాని సంయోగ వియోగ ధర్మములు కల ఈ చుతుర్వంశతి తత్త్వత్మక మగు ఈ ప్రకృతితో సంబధము కలుగుట వలన బుద్ధుడై నందున మరల దాని నుండి విడివడి నప్పుడు ముక్తి నందెనని వ్యవహరించుట, వాస్తవమున అతనికి బంధము మోక్షము లేవు. అట్లతడు విమోక్షిగా, శుచి కర్మునితో కలిసిశుచిగా విమలాత్మునితో కలిసి విమలాత్ముడుగా కేవలునితో కలిసి కేవలాత్ముడుగా అగు చున్నాడు . స్వతంత్రునితో కలిసి స్వతంత్రుడై స్వాతంత్ర్యమును పొందు చున్నాడు.

ఏతావ దేత త్కథితం మయా తే తథ్యం మహారాజ యథార్థ తత్త్వమ్‌ 

అమత్సరత్వం ప్రతిగృహ్య బుద్ధ్యా సనాతనం బ్రహ్మ విశుద్ద మాద్యమ్‌ 

త ద్వేదనిష్ఠస్య జనస్య రాజన్‌ ప్రదేయ మేత త్పరమం త్వయా భవేత్‌ 

విధిత్సమానాయ నిబోధకారకం ప్రబోధహేతోః ప్రణతస్య శాసనమ్‌ 

న దేయ మేత చ్చ యథానృతాత్మనే శఠాయ క్లీబాయ న జిహ్మబుద్ధయే

న పండిత జ్ఞానపరోపతాపినే దేయం తథా శిష్యవిబోధనాయ 

శ్రద్ధాన్వితాయాథ గుణాన్వితాయ పరాపవాదా ద్విరతాయ నిత్యమ్‌

విశుద్ధయోగాయ బుధాయ చైవ కాపావతేథ క్షమిణే హితాయ

వివిక్తశీలాయ విధిప్రియాయ వివాదహీనాయ బహుశ్రుతాయ 

వినీత వేషాయ న హైతుకాత్మనే సదైవ గుహ్యం త్విద మేవ దేయమ్‌ 

ఏతైర్గుణై ర్హీనతమే న దేయ మేతత్పరం బ్రహ్మ విశుద్ధ మాహుః

నశ్రేయసే యోక్ష్యతి తాదృశే కృతం ధర్మ ప్రవక్తార మపాత్రదానాత్‌

ప్రథ్వీ మిమాం నా యది రత్నపూర్ణాం దద్యా దదేయం త్విద మవ్రతాయ 

జితేంద్రియాయ ప్రయతాయ దేయం దేయం పర తత్త్వవిదే నరేంద్ర

కరాల మాతే భయ మస్తి కించి దేత చ్చుత్తం బ్రహ్మ పరం త్వయాద్యః

యథావదుక్తం పరమం పవిత్రం విశోకమత్యంత మనాదిమద్యమ్‌

ఆగాధ మేత దజరామరం చ నిరామయం వీతభయం శివం చ 

సమీక్ష్య మోహం పరవాదసంజ్ఞ మేతస్య తత్త్వార్థ మిమం విదిత్వా

ఆవాప్త మేత ద్ధి పూరా సనాతనా ద్ధిరణ్య గర్భాద్ధి తతో నరాధిప 

ప్రసాద్య యత్నేన త ముగ్రతేజసం సనాతనం బ్రహ్మయథా త్వ యైతత్‌

పృష్ట స్తయా చాస్మి యథా నరేంద్ర తథా మ యేదం త్వయి నోక్తమన్యత్‌

యథా వాప్తం బ్రహ్మణో మే నరేంద్ర మహాజ్ఞానం మోక్షవిదాం పరాయణమ్‌

ఓ మహారాజా! ఇంతవరకు నేను నీకిట్లు యథార్థ తత్త్వము తెలిపితిని. నీవును విశుద్ధమును, ఆద్యమును, సనాతనము, శాశ్వాతమును అగు బ్రహ్మ తత్త్వమును అమత్సరుడవై మనో దోషము లేవియు లేనివాడవై ప్రతి గ్రహించితివి. నీవును ఈ పరమ విద్యాను శాసనమును వేదనిష్ఠ, వేదముల యందును, శాస్త్రముల యందును ప్రామాణ్య బుద్ధి, కలిగి ప్రబోధము నొందుటకై ప్రణతుడై తెలిసి కొనగోరి ఆడిగిన వానికి మాత్రమే ఈయ వలెను. అసత్యవాది, మోసగాడు, కపట బుద్ధి, ఆసమర్థుడు, జ్ఞాన పరులగు పండితులను నొప్పించు వాడు అగువాని కీయరాదు. శిష్యులకు జ్ఞానము కలిగించుటకై నీవీ విద్యను శ్రద్ధ కలవాడు సద్గుణ వంతుడు పరనింద చేయనివాడు వివేచనతో కూడిన శీలము కలవాడు వేద శాస్త్ర విధి యందు ప్రీతి కలవాడు వివాదములు చేయని వాడలు అనేక శాస్త్రములను పెద్దల వలన వినిన వాడు వినయమును తెలుపు వేషము కలవాడు హేతు వాదము చేయని వాడు, ఇట్టి వానికి మాత్రమే తెలుప వలయును. విశుద్ధ మగు పరబ్రహ్మ తత్త్వమును ఈ సద్గుణములు లేనివాని కీయరాదు. ఇచ్చినచో అపాత్ర దానము వలన ప్రవచనము చేసిన గురువునకు కూడ శ్రేయస్సు కలుగదు. వ్రత నియమములు లేని వాడు తాను సమస్త రత్నములతో ఈ భూమి నంతటికి విద్యకు ప్రతిఫలముగా ఇత్తు ననినను అట్టి వానికి విద్యను బోధించ రాదు. ఓ నరేంద్రా! తత్త్వము నెరుగ గోరి జితేంద్రియుడై ప్రయతుడైన, ఇంద్రియని గ్రహము శుచిత్వము కలిగిన వానికి మాత్రమే ఇది బోధించ వలెను. ఓ జనకా! నీవు పరమ పవిత్రమును అత్యంతము శోక రహితమును అనాది మధ్యమును ఆగు బ్రహ్మ తత్త్వమును వాస్తవ ముగ ప్రవచించగా వింటివి. నీకిక సంసార భయము లేదు. ఈ తత్త్వము అగాధము, అజరామరము, దోష రహితము, భయ రహితము, శుభ కరము, సంవాదము అను పేరు గల ఈ తత్త్వర్థము తెలిసికొని మోహ స్వరూపమును గుర్తించి విడువుము. ఓ రాజా! పూర్వము హిరణ్య గర్భబ్రహ్మ సనాతన పరమాత్మ నుండి ఈ విద్యను గ్రహించెను. మహా తేజస్వి యగు ఆ బ్రహ్మ నుండి నేను ఆయనను అనుగ్రహింప జేసికొని గ్రహించితిని. నీవడిగి నందున నేను నీకిది ప్రతి పాదించితిని. ఇదియు నేను బ్రహ్మ వలన ఎంత ఎట్లు తెలిసి కొంటినో అంతయ అట్లే తెలిపితిని కాని ఏ మాత్రము మార్పులు చేర్పులు చేయ లేదు.

వ్యాసులు:

ఏత దుక్తం పరం బ్రహ్మయస్మాన్నావర్తతే పునః 

పంచవింశం మునిశ్రేష్ఠా వసిష్ఠేన యథా పురా

పున రావృత్తి మాప్నోతి పరమం జ్ఞాన మవ్యయమ్‌

నాతిబుధ్యతి తత్త్వేన బుధ్యమనో జరామరమ్‌

ఏత న్నిః శ్రేయసకరం జ్ఞానం భోః పరమం మయా

కథితం తత్త్వతో విప్రాః శ్రుత్వా దేవర్షితో ద్విజాః 

హిరణ్య గర్భా దృషిణా వసిష్ఠేన సమాహృతమ్‌

వసిష్ఠా దృషిశార్దూలో నారదోవాప్తపవా నిదమ్‌

నారదా ద్విదితం మహ్య మేత దుక్తం సనాతనమ్‌

మా శుచధ్వం మునిశ్రేష్ఠాః శ్రుత్వైత త్పరమం పదమ్‌

యేన క్షరాక్షరే భిన్నే న భయం తస్య విద్యతే

విద్యతే తుభయం యస్య యో నైనం వేత్తి తత్త్వతః 

అవిజ్ఞానా చ్చ మూఢాత్మా పునః పున రుపద్రవాన్‌ 

ప్రేత్య జాతిసహస్రాణి మరణాంతా న్యుపాశ్నుతే 

దేవలోకం తథా తిర్య జ్మానుష్య మపి చాశ్నుతే 

యది వా ముచ్యతే వాపి తస్మా దజ్ఞాన సాగరాత్‌ 

అజ్ఞాన సాగరే ఘోరే హ్యవ్యక్తాగాధ ఉచ్యతే

అహ న్యహని మజ్జంతి యత్ర భూతాని భోద్విజాః

తస్మా దగాధా దవ్యక్తా దుపక్షీణా త్సనాతనాత్‌ 

తస్మా ద్యూయం విరజస్కా వితమస్కాశ్చ భోద్విజాః 

ఏవం మయా మునిశ్రేష్ఠాఃసారా త్సారతరం పరమ్‌

కథితం పరమం మోక్షం యం జ్ఞాత్వా న నివర్తతే

ననాస్తికాయ దాతవ్యం నాభక్తాయ కదాచన

న దుష్టమతయే విప్రా న శ్రాద్ధావిముఖాయచ 

వ్యాసులు:

ఓ ముని శ్రేష్ఠులారా! వసిష్ఠుడు పంచ వింశతితమ తత్త్వ సంబంధి యగు తత్త్వమును ఇట్లు తెలిపెను. ఈ తత్త్వము ఎరిగి దాని ద్వారమున షడ్వింశ = ఇరువది యారవ తత్త్వమును చేరిన వారికి జనన మరణ రూప సంసారములో పునరావృత్తి యుండదు. ఇది పరమ మగు జ్ఞానము. దీనిని మించిన జ్ఞానము లేదు. ఇది ఎరిగిన వారు అజరామర మగు తత్త్వము చేరుదురు. ఓ ద్విజులారా! నిఃశ్రేయస కరమగు ఈ పరమ జ్ఞానము దేవర్షి యగు నారదుని వలన విని నేనున్న దున్నట్లు మీకు తెలిపితిని. ఏలయన హిరణ్య గర్భుని నుండి వసిష్ఠుడును అతని నుండి నారదుడును అతని నుండి నేనును వింటిమి. దీనిని విని నందున మీకును సంసారములన శోకము కలుగదు. క్షరాక్షర తత్త్వముల భేదాభేదము నెరిగిన వారికి భయ ముండదు. ఎరుగని మూఢాత్ముడు మాత్రము అనేక జన్మ పరంపరల నొంది మరల మరల ఉపద్రవముల పొందును. జననము, మరణము, దేవ లోకము, నరక లోకము, నరక లోకము, తిర్యగ్యోనులు, మనుష్య జన్మము ఇదే క్రమమున పునః పునరా వృత్తి పొందును. అవ్యక్తాగాధ మగు అజ్ఞాన సముద్రమున మునుగును. ఓముని శ్రేష్ఠులారా! నేనిట్లు మిగుల సారతమ మగు పరతత్త్వమును మీకు తెలిపితిని. దీనిని తెలిసి కొనిన వారు పరమ మోక్షమును పొందుదురు. మరల జనన మరణ పునరావృత్తి పొందరు. ఓ విప్రులారా! దీనిని నాస్తికుడు అభక్తుడు దుష్టమతి శ్రద్ధా రహితుడు అగు వానికి తెలుప రాదు.