బ్రహ్మ మహా పురాణము

56 - విస్తరేణ విష్ణు మార్కండేయ సంవాద కథనమ్‌

బ్రహ్మ:

ఇత్థం స్తుత స్తదా తేన మార్కండేయేన భో ద్విజాః

ప్రీతః ప్రోవాచ భగవాన్మేఘ గంభీరయా గిరా

బ్రహ్మ:

భగవంతుడట్లు మార్కండేయునిచే వినుతింప బడి మధుర గంభీరముగ నిట్లనియె.

శ్రీ భగవానుడు:

బ్రూహి కామం మునిశ్రేష్ఠ యత్తే మనసి వర్తతే

 దదామి సర్వం విప్రర్షే మత్తో యదభివాంఛసి

శ్రీ భగవానుడు:

నీ మనసునం గల కోర్కెయేమి? తెలుపుము. అదెల్ల నిచ్చెదను

బ్రహ్మ:

శ్రుత్వా స వచనం విప్రాః శిశోస్తస్య మహాత్మనః

ఉవాచ పరమప్రీతో ముని స్తద్గత మానసః

బ్రహ్మ:

అది విని ముని యాదేవుని యెడ మనసు నిలిపి యిట్లనియె.

మార్కండేయుడు:

జ్ఞాతుమిచ్ఛామిదేవ త్వాం మాయాం వై తవచో త్తమామ్‌

త్వత్ర్పసాదాచ్చ దేవేశ స్మృతి ర్న పరిహీయతే

ద్రుతమంతః శరీరేణ సతతతం పర్య (రి)వర్తితమ్‌

ఇచ్ఛామి పురండరీకాక్ష జ్ఞాతుం త్వామహమవ్యయమ్‌

ఇహ భూత్వా శిశుః సాక్షాత్కింభవా నవతిష్ఠతే

పీత్వా జగదిదం సర్వమేత దాఖ్యాతు మర్హసి

కిమర్ధం చ జగత్సర్వం శరీరస్థం తవానఘ

కియంతం చ త్వయా కాల మిహ న్థేయ మరిందమ

జ్ఞాతుమిచ్ఛామి దేవేశ బ్రూహి సర్వ మశేషతః

త్వత్తః కమలపత్రాక్ష విస్తరేణ యథాతథమ్‌

మహదేత దచింత్యం చ యదహం దృష్టవాన్ర్పభో

మార్కండేయుడు:

స్వామి! తామెవ్వరో నీ మాయ యెట్టిదో నీ దయచే నెఱుంగ గోరెదను. నా జ్ఞాపక శక్తి పోలేదు. నీయుదర మందేమేమి వింతలు గంటినో యవి నా మనసులో మెదలు చున్నవి. ఇచట చిన్ని శిశువువై యాడుకొను చున్నావు. ఈ జగత్తెల్ల నీ గర్భ మందెందుల కున్నది. ఎంతకాల మిట నుందువు. దేవేశ! విస్తరముగ తెలుపుము. తెలియ గోరెదను. నేను చూచినది యూహ కందునది గాదు.

బ్రహ్మ:

ఇత్యుక్తః స తదా తేన దేవదేవో మహాద్యుతిః

సాంత్వయన్స తదా వాక్యమువాచ వదతాం వరః

బ్రహ్మ:

అన దేవదేవుం జోదార్చుచు నిట్లనియె.

శ్రీ భగవానుడు:

కామం దేవాశ్చ మాం విప్ర న హి జానంతి తత్త్వతః

తవ ప్రీత్యా ప్రవక్ష్యామి యథేదం విసృజామ్యహమ్‌

పితృభక్తో సి విప్రర్షే మామేవ శరణం గతః

తతో ధృష్టోస్మి తే సాక్షద్ర్బహ్మచర్యం చతే మహత్‌

ఆపో నారా ఇతి పురా సంజ్ఞా కర్మకృతం మయా

తేన నారాయణోస్మ్యుక్తో మమ తాస్త్వయనం సదా

అహం నారాయణో నామ ప్రభవః శాశ్వతోవ్యయః

విధాతా సర్వభూతానాం సంహర్తా చ ద్విజోత్తమ

అహం విష్ణు రహం బ్రహ్మా శక్రశ్చాపి సురాధిపః

అహం వైశ్రవణో రాజా యమః ప్రేతాధిపస్తథా

అహం శివశ్చ సోమశ్చ కశ్యపశ్చ ప్రజాపతిః

అహం ధాతా విధాతా చ యజ్ఞశ్చాహం ద్విజోత్తమ

శ్రీ భగవానుడు:

“వేల్పులు కూడ నన్నచ్చముగ తెలయ లేరు. నీకు ప్రీతి కూర్చుటకు తెల్పెదను. నీవు పితృ భక్తుడవు. నన్ను శరణందితివి. నీ బ్రహ్మ చర్య దీక్ష చూచి యున్నాను. “నారములు” అనగా నీరు ‘ఆయనము’ అనగా స్థానముగా గలవాడను గాన నారాయణుడను. నేనే జగత్కారణము. నాకు నాశము లేదు. భూత విధాతను భూత సంహర్తను నేనే. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, కుబేరుడు, యముడు, సోముడు, కశ్యప ప్రజాపతి, యజ్ఞము నేనే.

సదిశం చ నభః కాయో వాయుర్మనసి మే స్థితః

మయా క్రతుశతైరిష్టం బహుభిశ్చాప్త దక్షిణైః

అగ్నిరాస్యం క్షితిః పాదౌ చంద్రాదిత్యౌ చ లోచనే

ద్యౌర్మూర్థా ఖం దిశః శ్రోత్రే తథాపః స్వేదసంభావాః

యజంతే వేదవిదుషో మాం దేవయజనే స్థితమ్‌

పృథివ్యాం క్షత్రియేంద్రాశ్చ పార్థివాః స్వర్గకాంక్షిణః

యజంతే మాం తథా వైశ్యాః స్వర్గలోకజిగీషవః

చతు స్సముద్ర పర్యంతాం మేరు మందరభూషణామ్‌

శేషో భూత్వాహ మేకో హి ధారయామి వసుంధరామ్‌

వారాహం రూపమాస్తాయ మయేయం జగతీపురా

మజ్జమానా జలే విప్రః వీర్యేణచ సముద్ధృతా

అగ్నిశ్చ బాడవో విప్ర భూత్వాహం ద్విజసత్తమ

పిబామ్యపః సమావిష్ట స్తాశ్చైవ విసృజామ్యహమ్‌

బ్రహ్మ వక్త్రం భూజౌ క్షత్రమూరూమే సంశ్రితా విశః

పాదౌ శూద్రా భవంతీమే విక్రమేణ క్రమేణ చ

ఋగ్వేద స్సామవేదశ్చ యజుర్వేద స్త్వథర్వణః

“నాకగ్ని ముఖము. భూమి పాదము. సూర్య చంద్రులు నేత్రములు”

మత్తః దప్రాదుర్భవంత్యేతే మామేవ ప్రవిశంతి చ

యతయః శాంతిపరమా యతాత్మానో బుభుత్సవః

కామక్రోధ ద్వేషముక్తా నిస్సంగా వీతకల్మషాః

సత్త్వస్థా నిరహంకారా నిత్యమధ్యాత్మకోవిదాః

మామేవ సతతం విప్రాశ్చింతయంత ఉపాసతే

 అహం సంవర్తకో జ్యోతిరహం సంవర్తకా నలః

ఆహం సంవర్తకః సూర్త్యస్త్వహం సంవర్తకో నిలః

తారారూపాణి దృశ్యంతే యాన్యేతాని నభస్తలే

మమ వై రోమకూపాని విద్ధిత్వం ద్విజసత్తమ

రత్నాకరాః సముద్రాశ్చ సర్వ ఏవ చతుర్దిశః

వసనం శయనం చైవ నిలయం చైవ విధ్ధి మే

కామః క్రోధశ్ఛ హర్షశ్చ భయం మోహస్తథైవ చ

మమైవ విద్ధి రూపాణి సర్వాణ్యేతాని సత్తమ

ప్రాప్నువంతి నరా విప్ర యత్కృత్వా కర్మ శోభనమ్‌

సత్యం దానం తపశ్చోగ్ర మహింసాం సర్వజంతుషు

మద్విధానేన విహితా మమదేహవిచారిణః

మయాభిభూత విజ్ఞానాశ్చేష్టయంతి న కామతః

సమ్యగ్వేద మధీయానా యజంతో వివిధైర్మఖైః

శాంతాత్మానో జితక్రోధాః ప్రాప్నువంతి ద్విజాతయః

ప్రాప్తుం శక్యో న చై వాహం నరైర్దుష్కృత కర్మభిః

లోభాభిభూతైః కృపణైరనార్యైరకృతాత్మభిః

తన్మాం మహాఫలం విద్ధి నరాణాం భావితాత్మనామ్‌

సుదుష్ప్రాపం విమూఢానాం మాం కుయోగనిషేవిణామ్‌

 యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి సత్తమ

అభ్యత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌

దైత్యా హింసానురక్తాశ్చ అవధ్యాః సురసత్తమైః

రాక్షసాశ్చాపి లోకేస్మిన్యదోత్పత్స్యంతి దారుణాః

తదాహం సంప్రసూయామి గృహేషుపుణ్యకర్మణామ్‌

ప్రవిష్టో మానుషం దేహం సర్వం ప్రశమయామ్యహమ్‌

సృష్ట్వా దేవమనుష్యాంశ్చ గంధర్వోరగ రాక్షసాన్‌

స్థావరాణి చ భూతావి సంహారామ్యాత్మమాయయా

కర్మకాలే పునర్ధేహమనుచింత్య సృజామ్యహమ్‌

ఆవిశ్య మానుషం దేహం మర్యాదా బంధకారణాత్‌

శ్వేతః కృతయుగె ధర్మః శ్యామ స్త్రేతాయుగే మమ

రక్తో ద్వాపర మాసాద్య కృష్ణః కలియుగే తథా

త్రయోభాగా హ్యధర్మస్య తస్మిన్కాలే భవంతి చ

అంతకాలే చ సంప్రాప్తే కాలో భూత్వా తిదారుణః

త్రైలోక్యం నాశయామ్యేకః సర్వం స్థావరజంగమమ్‌

అహం త్రిధర్మా విశ్వాత్మా సర్వలోకసుఖావహంః

అభిన్నః సర్వగోనంతో హృషీకేశః ఉరుక్రమః

కాలచక్రం నయామ్యేకో బ్రహ్మరూపం మమైవ తత్‌

శమనం సర్వభూతానాంసరర్వభూత కృతోద్యమమ్‌

ఏవం ప్రణిహితః సమ్యజ్మమాత్మా మునిసత్తమ

సర్వభూతేషు విప్రేంద్ర న చ మాంవేత్తి కశ్చన

సర్వలోకేచ మాం భక్తాః పూజయంతి చ సర్వశః

యచ్చ కించి త్త్వయా ప్రాప్తం మయిక్లేశాత్మకం ద్విజ

సుఖోదయాయ తత్సర్వం శ్రేయసే చ తవానఘ

యచ్చ కించిత్త్వయా లోకే దృష్టం స్థావర జంగమమ్‌

విహితః సర్వ ఏవాసౌ మయాత్మా భూతభావనః

అహం నారాయణో నామ శంఖ చక్రగదాధరః

యావద్యుగానాం విప్రర్షే సహస్రం పరివర్తతే

తావత్స్వపితి విశ్వాత్మా సర్వవిశ్వాని మోహయన్‌

ఏవం సర్వమహం కాలమిహా సే మునిసత్తమ

అశిశుః శిశురూపేణ యావద్ర్బహ్మాన బుధ్యతే

మయా చ దత్తో విప్రేంద్ర వరస్తే బ్రహ్మరూపిణా

అసకృత్సరితుష్టేన విప్రర్షిగణ పూజిత

సర్వమేకార్ణవం కృత్యా నష్టే స్థావర జంగమే

నిర్గతో సి మయాజ్ఞాత స్త తస్తే దర్శితం జగత్‌

ఇట్లు వానికి వేయి యుగములు ముగియ గనే స్వామి “మఱి యేమి కోరెదవన” నా పురాణమని యిట్లనియె.

అభ్యంతరం శరీరస్య ప్రవిష్టోసి యదా మమ

దృష్ట్వా లోకం సమస్తం హి విస్మితో నావబుధ్యసే

తతోసి వక్త్రాద్విప్రక్షే ద్రుతం నిఃసారితో మయా

ఆఖ్యాతస్తే మయాచాత్మా దురేజ్ఞయోహిసురాసురైః

యావత్స భగవాన్ర్బహ్మా న బుధ్యేత మహాతపాః

తావత్త్వమిహ విప్రర్షే విస్రబ్ధ శ్చర వై సుఖమ్‌

తతో విబుద్ధే తస్మింస్తు సర్వలోకపితామహే

ఏకో భూతాని స్రక్ష్యామి శరీరాణి ద్విజోత్తమ

ఆకాశం పృథివీం జ్యోతిర్వాయుః సలిల మేవచ

లోకే యచ్చ భవేత్కించిదిహ స్ధావరజంగమమ్‌

బ్రహ్మ:

ఏవ ముక్త్వా తదా విప్రాః పునస్తం ప్రాహ మాధవః

పూర్ణే యుగసహస్రే తు మేఘ గంభీరని స్వనః

శ్రీ భగవానుడు:

మునే! బ్రూహి యదర్ధం మాం స్తుతవా న్పరమార్ధతః

వరం వృణీష్వ యచ్ర్ఛేష్ఠం దదామి నచిరాదహమ్‌

అయుష్మానసి దేవానాం మద్భక్తోసి దృఢవ్రతః

తేన త్వమసి విప్రేంద్ర పునర్దీర్ఘాయురాయురావ్నుహి

బ్రహ్మ:

శ్రుత్వా వాణీం శుభాం తస్య విలోక్య స తదా పునః

మూర్ధ్నా నిపత్య సహసా ప్రణమ్య పునరభ్రవీత్‌

మార్కండేయుడు:

దృష్టం పరం హి దేవేశ తవ రూపం ద్విజోత్తమ

మోహోయం విగతః సత్యం త్వయిదృష్టేతుమే హరే

ఏవమేవమహం నాథ ఇచ్ఛేయం త్వ త్ర్పసాదతః

లోకానాం చ హితార్థాయ నానాభావ ప్రశాంతయే

శైవభాగవతానాం చ వాదార్థ ప్రతిషేధకమ్‌

అస్మినేక్షత్రవరే పుణ్యే నిర్మలే పురుషోత్తమే

శివస్యా యతనం దేవ కరోమి పరమం మహత్‌

ప్రతిష్ఠేయ తథా తత్ర తవస్థానే చ శంకరమ్‌

తతో జ్ఞాస్యంతి లోకేస్మి న్నేకమూర్తీ హరీశ్వరౌ

ప్రత్యువాచ జగన్నాథః స వునస్తం మహామునిమ్‌

శ్రీ భగవానుడు:

యదేత్పరమం దేవ కారణం భువనేశ్వరమ్‌

లింగమారాధనార్థాయ నానాభావ ప్రశాంతయే

మమాదిషేన విప్రేంద్ర కురు శీఘ్రం శివాలయమ్‌

 తత్ర్పభావాచ్ఛివలోకే తిష్ఠ త్వం చతథా క్షయమ్‌

శివే సంస్థాపితే విప్ర మమ సంస్థాపనం భవేత్‌

 నావయో రంతరం కించి దేకభావౌ ద్విధా కృతౌ

యో రుద్రః స స్వయం విష్ణు ర్యో విష్ణుః స మహేశ్వరః

ఉభయోరంతరం నాస్తి పవనాకాశయోరివ

మోహితో నాభిజానాతి య ఏవ గరుడధ్వజః

వృషధ్వజః స ఏవేతి త్రిపురఘ్నం త్రిలోచనమ్‌

తవనామాంకితం తస్మాత్కురువిప్ర శివాలయమ్‌

ఉత్తరే దేవదేవస్య కురు తీర్థం సుశోభనమ్‌

మార్కండేయ హ్రదో నామ నరలోకేషు విశ్రుతః

భవిష్యతి ద్విజశ్రేష్ఠ సర్వపాపప్రణాశనః

బ్రహ్మ:

ఇత్యుక్త్వా స తదా దేవస్తత్రైవాంతరధీయత

మార్కండేయం మునిశ్రేష్ఠాః సర్వవ్యాపీ జనార్దనః

నీ దయచే లోక హితము గోరి భేద భావము నశించుటకు శివ వైష్ణవవాద భేదము లంతరింప జేయుటకు నిక్కడ శివాలయము నిర్మించెదను. అందు నీ క్షేత్రమున శంకర ప్రతిష్ఠ జేసేదను. హరిహరు లొక్కటే యని లోక మెఱుంగు గాక.” అని జగన్నాధుడు భువనేశ్వర రూప మయిన లింగము జగత్కారణము. నా యాన గొని వెంటనే యిట నీశ్వరుని ప్రతిష్ఠింపుము. మా యిర్వురకు నంతరము లేదు. లోక మెఱుంగక వాదు లాడును. నా ఆలయ మిది నీ పేర నిర్మించుము. దాని కుత్తరముగ మార్కండేయ ‘హ్రదము’ అను పేర నొక తీర్థము కూడ నేర్పడును. అది సర్వపాప హరమగును. అని సర్వవ్యాపియైన జనార్దనుడు పల్కి తిరోహితు డయ్యెను.