వ్యాసులు:
భీష్మకః కుండినేరాజా విదర్భవిషయేభవత్
రుక్మిణీ తస్యదుహితా రుక్మీచైవ సుతోద్విజాః
రుక్మిణీం చకమేకృష్ణః సాచతం చారుహాసినీ
న దదౌ యాచతే చైనాం రుక్మీ ద్వేషేణ చక్రిణే
దదౌ స శిశుపాలాయ జరాసంధప్రచోదితః
భీష్మకో రుక్మిణాసార్థం రుక్మిణీ మురువిక్రమః
వివాహార్థం తతః సర్వే జరాసంధముఖానృపాః
భీష్మకస్య పురంజగ్ముః శిశుపాలశ్చ కుండినమ్
కృష్ణోపి బలభద్రాద్యై ర్యదుభిః పరివారితః
ప్రయయౌ కుండినం ద్రష్టుం వివాహం చైద్యభూపతేః
శ్వోభావిని వివాహేతు తాం కన్యాం హృతవాన్హరిః
విపక్షభావమాసాద్య రామాద్వేష్వేవ బంధుషు
తతశ్చ పౌండ్రకః శ్రీమా న్దంతవక్త్రో విదూరథః
శిశుపాలో జరాసంధః శాల్వాదాశ్చ మహీభృతః
కుపితాస్తే హరిం హంతుం చక్రురుద్యోగముత్తమమ్
నిర్జితాశ్చ సమాగమ్య రామాద్యైర్యదుపుంగవైః
కుండినం న ప్రవేక్ష్యామి అహత్వా యేధి కేశవమ్
కృత్వా ప్రతిజ్ఞాం రుక్మీ చ హంతుం కృష్ణమభిద్రుతః
హత్వా బలంస నాగాశ్వ పత్తిస్యందన సంకులమ్
నిర్జితః పాతితశ్చోర్వ్యాం లీలయైవ స చక్రిణా
నిర్జిత్య రుక్మిణం సమ్య గుపయేమే స రుక్మిణీమ్
రాక్షసేన విధానేన సంప్రాప్తో మధుసూదనః
తస్యాం జజ్ఞే చ ప్రద్యుమ్నో మదనాంశః సవీర్యవాన్
జహార శంబరోయం వై యో జఘాన చ శంబరమ్
వ్యాసులు:
భీష్మకుడు విదర్భ దేశాధిపతి కుండిన నగరము రాజధానిగ రాజ్య పరిపాలన చేసెను. అతని కుమార్తె రుక్మిణి. కుమారుడు రుక్మి యనువాడు. రుక్మిణిని కృష్ణుడును కృష్ణుని రుక్మిణియు నొండరులు వరించు కొనిరి. కాని రుక్మి ద్వేషము గొని చక్రా యుధున కతడీయ డయ్యెను. జరాసంధుని ప్రేరణచే శిశుపాలునకు వాగ్ధానము చేసెను. భీష్మకుడును రుక్మితో నట్లే యనెను. అవ్వల జరాసంధాదులు కళ్యాణార్ధము భీష్మ నగరమునకు వచ్చిరి. శిశుపాలుడును వచ్చెను. కృష్ణుడు బలభద్రుడు మొదలగు యాదవులుతో గూడి యవ్వివాహము జూచుట కని వచ్చెను. రేపు వివాహము కానున్న సమయమున హరి యాకన్యం గొంపోయెను. దానికి బలరామాది బంధువుల యెడ శతృత్వము గొని శ్రీమంతుడగు పౌండ్రకుడు దంత వక్తృడు విదూరథుడు శిశుపాలుడు జరాసంధుడు శాల్వాది రాజులు కోపించి హరిని జంపుటకు తీవ్రమైన యత్నము సేసిర. అట్లెత్తి వచ్చిన యా బలగము రామాదులచే నోడి పోయిరి. రుక్మి రణమున కేశ వుంగూల్పక పురమునం బ్రవేశింప నని ప్రతిజ్ఞ చేసి కృష్ణునిం జంప దూకెను. చక్రాయుధుడు వాని చతురంగ సైన్యమును లీలగ కూల్చి రుక్మిని బడ గొట్టెను. వాడోడి పోయెను. అట్లు రుక్మిం గెలిచి శ్రీకృష్ణుడు శ్రీరుక్మిణీ దేవిని రాక్షస వివాహ విధానమున పరిణయ మాడెను. కృష్ణున కామె యందు మన్మథాంశమున ప్రద్యుమ్నుడు జన్మించెను. శంబరుడా తనిని దొంగిలించు కొని పోయెను. అతడా శంబరుని సంహరించెను.
Summary of chapter 92 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
At the wedding of Aniruddha (Kṛṣṇa's grandson) with Rukmī's granddaughter, a quarrel over a dice game breaks out between Rukmī and Balarāma. The confrontation escalates; Balarāma kills Rukmī with his ploughshare. The event creates a complex emotional situation — Rukmī was the brother of Rukmiṇī, Kṛṣṇa's beloved first wife — and Kṛṣṇa, though saddened, says nothing, having neither approved nor prevented the act.