24 - ధ్రువ సంస్థితి నిరూపణమ్‌

లోమహర్షణుడు:

తారామయం భగవతః శిశుమారాకృతిః ప్రభోః

దివి రూపం హరే ర్యత్తు తన్య పుచ్ఛే స్థితో ధ్రువః

నై ష భ్రమ న్ర్భామయతి చంద్రాదిత్యాదికా స్గ్రహాన్‌

భ్రమంతమను తం యాంతి నక్షత్రాణి చ చక్రవత్‌

సూర్యాచంద్రమసౌ తారా నక్షత్రాణి గ్రహై స్సహ

వాతానీకమయై ర్బంధైః ధ్రువే బద్ధాని తానివై

శిశుమారాకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాం దివి

నారాయణః పరంధామ తస్యాధారః న్వయం హృది

ఉత్తానపాదతనయ స్త మారాధ్య ప్రజాపతిమ్‌

స తారాశిశుమారస్య ధ్రువః పుచ్ఛే వ్యవస్థితః

ఆధారః శిశుమారస్య సర్వాధ్యక్షో జనార్దనః

ధ్రువస్య శిశుమారశ్చ ధ్రువే భాను ర్వ్యవస్థితః

తదాధారం జగచ్చేదం సదేవాసురమానుషమ్‌

యేన విప్రా విధానేన తన్మే శృణుత సాంప్రతమ్‌

లోమహర్షణుడు:

భగవంతుడగు హరి యొక్క తారా (నక్షత్ర) మయమైన రూపము శిశుమార నక్షత్ర మంతరిక్ష చక్రము నందు ప్రకాశించు చున్నది. దాని తోక యందు ధ్రువు డున్నాడు. అతడు దాను దిరుగుచు చంద్రా దిత్యాది గ్రహములను ద్రిప్పు చున్నాడు. తిరుగు చున్న యీ ధ్రువు ననుసరించి నక్షత్రములు చక్రము వలె తిరుగు చుండును. సూర్య చంద్రులు తారా నక్షత్ర గ్రహ సమూహము వాయుమయము లైన బంధములచే ధ్రువుని యంద నుబద్ధములై యున్నవి. అంతరిక్ష మందు జ్యోతిశ్చక్రము శిశుమారాకారమున (మొసలి వలె) నున్నదని వర్ణిత మైనది. ఆ మ్మూర్తి కాధారమై హృదయ మందు నారాయణుండు న్నాడు. ఉత్తానపాదుని కుమారుడు ప్రజాపతి నారాధించి తారా రూప మయిన యా శిశుమారము యొక్క తోక యందున్నాడు. శిశుమారము నకాధారము సర్వా ధ్యక్షుడైన జనార్దనుడు. ధ్రువున కాధారము శిశుమార చక్రము. ధ్రువుని యందు భానుడున్నాడు. సురాసుర మానుష మయిన యీ జగత్తంతయు నా సూర్యుని యాధారమున నిలిచి యున్నది. సూర్యుడీ జగత్తు నంతకు నే విధానమున నాధారముగ నుండెనో నా వలన వినుడు!

వివస్వా నష్టభి ర్మాసై ర్గ్రసత్యపో రసాత్మికాః

వర్షత్యంబు తతశ్చాన్న మన్నాద మఖిలం జగత్‌

వివస్వా నంశుభి స్తీక్షై రాదాయ జగతో జలమ్‌

సోమం పుష్య త్యధేందుశ్చ వాయునాడీమయై ర్దివి

జలై ర్విక్షిప్యతేభ్రేషు ధూమాగ్న్యనిలమూర్తిషు

నభ్రశ్యంతి యతస్తేభ్యో జలా న్యభ్రాణి తా న్యతః

ఆభ్రస్థాః ప్రపతం త్యాపో వాయునా సముదీరితాః

సంస్కారం కాలజనితం విప్రాశ్చాసాద్య నిర్మలాః

సరిత్సముద్రా భౌమాస్తు తథాపః ప్రాణిసంభవాః

చతుష్ప్రకారా భగవా నాదత్తే సవితా ద్విజాః

ఆకాశగంగాసలిలం తథాహృత్య గభస్తిమాన్‌

 అనభ్రగత మేవోర్వ్యాం సద్యః క్షిపతి రశ్మిభిః

తస్య సంప్పర్శనిర్థూతపాపపంకో ద్విజో త్తమాః

న యాతి నరకం మర్త్యోదివ్యం స్నానం హితత్స్మృతమ్‌

దృష్టసూర్యం హి తద్వారి పత త్యభ్రైర్వినా దివః

ఆకాశగంగాసలిలం తద్గోభిః క్షిప్యతే రవేః

సూర్యు డెనిమిది మాసములు రసన్వ రూపములైన జలములను బీల్చి వర్షించును. ఆ వర్షము వలన అన్నము దాని వలన సకల జగత్తు పొడమును. తీక్ష కిరణములచే నర్కుడు జగమ్మున గల నీటి నాకర్షించి సోముని పోషించును. ఆయన వాయునాడీ మయమైన జలముచే యాకాశము నందుండి పొగ అగ్ని వాయువు యను వానియొక్క సన్నిపాత స్వరూప మయిన మేఘము లందు జలముల జిమ్మును. అమ్మేఘముల నుండి నీరు భ్రంశము కానందున నమ్మబ్బులకు “అభ్రములు” అను పేరు వచ్చినది. ఈ మేఘము నందున్న నీళ్ళు వాయు ప్రేరణమున కాల జనిత సంస్కారమును బొంది నిర్మలములై వానగా నవనిపై బడును. ప్రాణికోటి పుట్టుటకు కారణము లయి భౌమము లయిన యీ అప్పులు (నీళ్ళు) నదులు, సముద్రములు. భూమి ప్రాణి జన్యము లని నాలుగు రూపములతో నున్న యీ జలమును భగవంతుడైన నవిత అదానము చేయును (గ్రహించును). సూర్యుడు అభ్రగతము కాకుండ ఆకాశ గంగా గతమైన నీటిని కూడ కిరణములచే గ్రహించి ఆప్పటి కపు డవనిపై వర్షించును. అట్టి ఆకాశ గంగోదకముల స్పర్శ వలన పాపములు వాసిన మర్త్యుడు నరకమున కేగడు. అది దివ్య స్నానమని ఋషులు చెప్పిరి. సూర్య దర్శన మాత్రమున దివంబు నుండి రవి కిరణములచే నాయాకాశ గంగోదకము వెదజల్ల బడును.

కృత్తికాదిషు ఋక్షేషు విషమేష్వంబు యద్దివః

దృష్ట్వార్కం పతితం జ్ఞేయం తద్గాంగం దిగ్గజోద్ధృతమ్‌

యుగ్మకేషు తు యత్తోయం పత త్యర్కోద్ధృతం దివః

తత్సూర్యరశ్మిభి స్సద్యః సమాదాయ నిరస్యతే

ఉభయం పుణ్యమత్యర్ధం నృణాం పాపహరం ద్విజాః

ఆకాశగంగా సలిలం దివ్యం స్నానం ద్విజో త్తమాః

యత్తు మేఘైః సముత్సృష్టం వారి తత్ప్రాణినాం ద్విజాః

పుష్ణా త్యోషధయ స్సర్వా జీవనాయా మృతం హితత్‌

తేన వృద్ధిం పరాం నీతః సకల శ్చౌషధీగణః

సాధకః ఫలపాకాంతః ప్రజానాం తు ప్రజాయతే

తేన యజ్ఞా న్యథాప్రోక్తా న్మానవాః శాస్త్ర చక్షుషః

కుర్వతేహరహశ్చైవ దేవా నాప్యాయయంతి తే

ఏవం యజ్ఞాశ్చ వేదాశ్చ వర్ణశ్చ ద్విజపూర్వకాః

సర్వదేవనికాయాశ్చ పశుభూతగణాశ్చయే

వృష్ట్యా ధృత మిదం సర్వం జగత్ధ్సాపరజంగమమ్‌

సాపి నిష్పాద్యదే వృష్టిః సవిత్రా మునిస త్తమాః

ఆధారభూతః సవితుః ధ్రువో మునివరో త్తమాః

ధ్రువస్య శిశుమారోసౌ సోపి నారాయణాశ్రయః

హృదినారాయణ స్తస్య శిశుమారస్య సంస్ధితః

విభర్తా సర్వభూతానా మాదిభూతః సనాతనః

ఏవంమయా మునిశ్రేష్ఠా బ్రహ్మాండం సముదాహృతమ్‌

భూసముద్రాదిభిర్యుక్తం కి మన్య చ్ర్ఛోతు మిచ్ఛథ

కృత్తికాది విషమ (బేసి) నక్షత్రము లందు సూర్యుని దర్శనముతో వర్షించు నయ్యు దకము దిగ్గజము లెత్తి వర్షించి నట్టి గంగోదక మని తెలియ నగును. సూర్యుని కిరణముల ద్వారమున సరి సంఖ్య కల నక్షత్రము లందు కురియు వాన అప్పటి కప్పుడు సూర్య కిరణములచే స్వీకరింప బడి వర్షింప బడినది యీ ఉభయమును నరులకు పాపహరము పుణ్య కరమును నగు దివ్య స్నానమని తెలియ నగును. మేఘముల వెంట కురియు నుదక మోషధులను బోషించును. ప్రాణులకు జ్జీవనమగు నా జలము అమృతము. దానం బెంపొందిన సక లౌషదీ గణము ఫల పాకాంతమై (పంట పండగానే నశించు నదియై) ప్రజలకు సాధక మగును. అందుచే శాస్త్ర చక్షువులగు మానవులు వేదములు సెప్పిన యజ్ఞము సహరహము నాచరించి దేవతల కాప్యాయనము కలిగింతురు. ఇట్లు యజ్ఞములు వేదములు బ్రాహ్మణాది వర్ణములు సర్వ దేవని కాయము సకల పశు భూత సంఘాతము స్థావర జంగమాత్మక మైన సర్వ జగత్తు వర్షాధారమున రాజిల్లు చున్నది. ఆ వర్షము సూర్యుని వలన నేర్పడు చున్నది. అట్టి సూర్యుని కాధారమై ధ్రువు డున్నాడు. ఆతనికి శిశు మారము దానికి నారాయణుడును అశ్రయమై యున్నారు. శిశుమార చక్ర హృదయ స్థాన మందు నారాయణు డుండి సర్వ భూతములను ధరించుచు సనాతనుడు సర్వా దిభూతుడై యలరారు చున్నాడు. భూ సముద్రాది సహితమైన బ్రహ్మాండము యొక్క స్వరూప మిది. మీకు తెలిపితిని. మరి యేమి విన దలతురో యానతిండు.