బ్రహ్మ మహా పురాణము
5 - మన్వంతర కీర్తనము
ఋషులు:
మన్వంతరాణి సర్వాణి విస్తరేణ మహామతే
తేషాం పూర్వవిసృష్టిం చ లోమహర్షణ కీర్తయ
యావంతో మనవశ్చైవ యావంతం కాలమేవ చ
మన్వంతరాణి భోః సూత! శ్రోతుమిచ్ఛామ తత్త్వతః
ఋషులు:
ఓ బుద్ధిశాలీ లోమహర్షణ! మన్వంతరముల నన్నింటిని వాని యొక్క విశేష సృష్టిని వర్ణింపుము. మనుపు లెందరో వారి కాల మేదియో వారి సమయ మందు జరిగిన విశేషము లేవియో స్పష్టమున నెఱుగ గోరెదము.
లోమహర్షణుడు:
న శక్యో విస్తరో విప్రా వక్తుం వర్షశతైరపి
మన్వంతరాణాం సల్వేషాం చ్ఛృణుత ద్విజాః
స్వాయంభువో మనుః పూర్వం మనుః స్వారోచిషస్తథా
ఉత్తమ స్తామసశ్చైవ రైవత శ్చాక్షుష ప్తథా
వైవస్వతశ్చ భో విప్రాః సాంప్రతం మనురుచ్యతే
సావర్ణిశ్చ మనుస్తద్వ ద్రైభ్యో రౌచ్య స్తథైవచ
తథైవ మేరు సావర్ణి శ్చత్వారో మనవః స్మృతాః
అతీతా వర్తమానాశ్చ తథైవానాగతా ద్విజాః
కీర్తితా మనవ స్తుభ్యం మయైవై తే యథా శ్రుతాః
ఋషీం స్తేషాం ప్రవక్ష్యామి పుత్రా న్దేవగణాం స్తథా
లోమహర్షణుడు:
ఋషుడుగ నూతుడు మన్వంతరములను గూర్చిన చరిత్ర సంక్షేపముగ చెప్పెద. వేయేండ్ల యిననిది తెలుప నలవి కానిది స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షువుడు, పైవస్వతుడు. సావర్ణి (తర్వాత) రైభ్యుడు, రౌచ్యుడు, మేరుసావర్ణి, ఇపుడు వైవస్వత మన్వంతరము జరుగు చున్నది. అయా మన్వంతరము లందలి సప్తర్షులను పుత్రపౌత్ర పరంపరను దేవ గణములను తెలుపు చున్నాము.
మరీచి రత్రిర్భగవా నంగిరాః పులహః క్రతుః
పులస్త్యశ్చ వశిష్ఠశ్చ సప్తైతే బ్రహ్మణ స్సుతాః
ఉత్తరస్యాం దిశి తథా ద్విజాః సప్తర్షయ స్తథా
ఆగ్నీధ్ర శ్చాగ్నిబాహుశ్చ మేధ్యో మేధాతిథిర్వసుః
జ్యోతిష్మాన్ ద్యుతిమాన్ హవ్యః సబలః పుత్రసంజ్ఞకః
మనోః స్వాయంభువస్యైతే దశపుత్రామహౌజసః
ఏతద్వై ప్రథమం విప్రా మన్వంతర ముదాహృతమ్
ఔర్వో వశిష్ఠ పుత్రశ్చ స్తంబః కశ్యప ఏవ చ
స్వాయంభువ మనువు కాలమున సప్తర్షులు మరీచి, అత్రి, అంగిరస్సు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వశిష్ఠుడు, వీరు బ్రహ్మ కుమారులు. ఉత్తర దిక్కు నందుందురు. ఆగ్నీధ్రుడు, అగ్ని బాహుడు, మేధ్యుడు, మేధాతిథి, వసువు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సబలుడు, పుత్రుడు అను పది మంది స్వాయంభువు కుమారులు. ఈ యది ప్రథమ మన్వంతరము.
ప్రాణో బృహస్పతిశ్చైవదత్తో త్రిశ్చ్యవన స్తథా
ఏతే మహర్షయో విప్రా వాయు ప్రోక్తా మహావ్రతాః
దేవాశ్చ తుషితానామ స్మృతాః స్వారోచిషేంతరే
హవిర్ఘ్నః సుకృతిర్జ్యోతి రాపోమూర్తిరపి స్మృతః
ప్రతీతశ్చ నభస్యశ్చ నభ ఊర్జస్తథైవ చ
స్వారోచిషస్య పుత్రాస్తే మనో ర్విప్రాః మహాత్మనః
కీర్తితాః పృథివీపాలా మహావీర్యపరాక్రమాః
ద్వితీయ మేతత్కథితం విప్రా మన్వంతరం మయా
స్వరోచి మనువు కాలమున ఋషులు ఉర్వుడు, స్తంబుడు, కశ్యపుడు, ప్రాణుడు, బృహస్పతి, దత్తుడు, అత్రి, చ్యవనుడు. మహా వ్రతులైన యేడ్వురు దేవతలు తుషితులు, హవిఘ్నుడు, సుకృతి, జ్యాతి, ఆపుడు, మూర్తి ప్రతీతుడు, నభస్యడు, నభస్సు ఊర్జస్సు యనువారు స్వారోచి కుమారులు. ఇది రెండవ మన్వంతర విషయము.
ఇదం తృతీయం వక్ష్యామి తద్బుధ్యధ్వం ద్విజోత్తమాః
వశిష్ఠపుత్రాః సప్తాసన్వాశిష్ఠా ఇతి విశ్రుతాః
హిరణ్యగర్భస్య సుతా ఊర్జాజాతాః సుతేజసః
ఋషయోత్ర మయా ప్రోక్తాః కీర్త్యమానా న్నిబోధత
ఔత్తమేయా న్మునిశ్రేష్ఠాః దశపుత్రా న్మనోరిమాన్
ఇష ఊర్ణ స్తనూర్జస్తు మధు ర్మాధవ ఏవ చ
శుచిః శక్రః సహశ్చైవ నభస్యో నభ ఏవ చ
భావన స్తత్ర దేవాశ్చ మన్వంతర ముదాహృతమ్
ఉత్తముని కాలమున వశిష్ఠ కుమారులు (వాశిష్టులు) యేడ్వురు ఋషులు. హిరణ్య గర్ఛుని కుమారులు ఊర్జులు. ఉత్తముని కుమారులు పది మంది. ఇషుడు, ఊర్జస్సు, తనూర్జుడు, మధువు, మాధవుడు, శుచి, శుక్రుడు, నహుడు, నభస్యుడు. నభుడు, దేవత లిందు భానువులు ఇది తృతీయ మన్వంతర విషయము.
మన్వంతరం చతుర్థం వః కథయిష్యామి సాంప్రతమ్
కావ్యః పృథు స్తథైవాగ్నిర్జహ్ను ర్థాతా ద్విజోత్తమాః
కపీ వా నకపీవాంశ్చ తత్ర సప్తర్షయో ద్విజాః
పురాణే కీర్తితా విప్రాః పుత్రాః పౌత్రాశ్చ భో ద్విజాః
వశిష్ట కుమారులు, (వాశిష్టులు) యేడ్వురు ఋషులు. హిరణ్య గర్భుని కుమారులు ఊర్జులు. ఉత్తమునిన కుమారులు పదిమంది. ఇషుడు, ఊర్జస్సు. తనూర్జుడు, మధువు మాధవుడు, శుచి, శుక్రుడు, సహుడు, నభస్యుడు, నభుడు, దేవతలిందు భానువులు. ఇది చతుర్థ మన్వంతర విషయము.
తథా దేవగణాశ్చైవ తామసస్యాంతరే మనోః
ద్యుతి స్తపస్యః సుతపా స్తపోభూతః సనాతనః
తపోరతి రకల్మాష స్తన్వీ ధన్వీ పరంతపః
తామసస్య మనోరేతే దశపుత్రాః ప్రకీ ర్తితాః
వాయుప్రోక్తా ముని శ్రేష్ఠా శ్చతుర్థం చైతదంతరమ్
దేవబాహుర్యదుధ్రశ్చ ముని ర్వేదశిరా స్తథా
హిరణ్యర్తోమా పర్జన్య ఊర్ధ్వబాహుశ్చ సోమజః
సత్య నేత్ర స్తథాత్రేయ ఏతే సప్తర్షయోపరే
దేవా శ్చాభూతరజస స్తథా ప్రకృతయః స్మృతాః
వారిప్లవశ్చరైభ్యశ్చ మనోరంతర ముచ్యతే
తామన మన్వంతరమున కావ్యుడు, పృథువు, అగ్ని, జహ్నువు, ధాత, కపీవంతుడు, అకపీవంతుడు యనువారు సప్తర్షులు. ఇందు దేవగణములు. ద్యుతి, తపస్యుడు, సుతవుడు, తపోభూతుడు, సనాతనుడు, తపోరతి, అకల్మాషుడు, తన్వీ, పరంతవుడు అనువారు పది మంది వాయువుచే చెప్ప బడిన వారు.
ఆథపుత్రా నిమాం స్తస్య బుధ్యధ్వం గదతో మమ
ధృతిమా నవ్యయో యుక్త స్తత్త్వదర్శీ నిరుత్సుకః
అరణ్యశ్చ ప్రకాశశ్చ నిర్మోహః సత్యవాక్కృతీ
రైవతస్య మనోః పుత్రా పంచమం చైతదంతరమ్
దేవబాహువు యదుధ్రుడు, (ముని) వేదశిరస్సు హిరణ్యరోముడు, పర్జన్యుడు, ఊర్ధ్వబాహువు, (సోమజుడు) సత్యనేత్రుడు (ఆత్రేయుడు)నను వారు రైవతమనువు కాలమున సప్తర్షులు.
షష్ఠంతు సంప్రవక్ష్యామి తద్బుధ్యధ్వం ద్విజోత్తమాః
భృగు ర్నభో వివస్వాంశ్చ సుధామా విరజాస్తథా
అతినామా సహిష్ణుశ్చ సప్తైతే చ మహర్షయః
చాక్షుషస్యాంతరే విప్రా మనోర్దేవా స్త్విమే స్మృతాః
ఆబాలప్రథితాస్తే వై పృథ క్త్వేన దివౌకసః
లేఖాశ్చ నామతో విప్రాః పంచదేవగణాః స్మృతాః
ఋషే రంగిరసః పుత్రా మహాత్మానో మహౌజసః
నాడ్వలేయా మునిశ్రేష్ఠా దశపుత్రాస్తు విశ్రుతాః
రురుప్రభృతయో విప్రా శ్చాక్షుషస్యాంతరే మనోః
షష్ఠంమన్వంతరం ప్రోక్తం సప్తమంతు నిబోధత
ఇందు దేవ గణములు అభూత రజస్సు ప్రకృతి, వారిప్లవుడు, రైభ్యుడు, ధృతి మంతుడు, అవ్యయుడు, యుక్తుడు, తత్త్వదర్శి, నిరుత్సుకుడు, అరణ్యుడు, ప్రకాశుడు నిర్మోహుడు, సత్యవాక్కు, కృతి ఐదవ రైవత మన్వంతరము నుందు రైవతుని కుమారులు. ఆఱవ మనువు చాక్షుషుడు, ఈయన కాలమున సప్తర్షులు. భృగువు, నభస్సు, వివస్వంతుడు, సుధాముడు, విరజుడు, సహిష్ణువు అనువారు (అప్రసూతులు) ఆ బాల ప్రఖ్యాతులు. లేఖులను వారు దేవ గణము లైదుగురు. అంగిర కుమారులు అతినాముడు, నాడ్వులేయులు పది మంది. చాక్షుష మనువు పుత్రులు రురుప్రభృతులు.
ఆత్రిర్వశిష్ఠో భగవా స్కశ్యపశ్చ మహా నృషిః
గౌతమోథ భరద్వాజో విశ్వామిత్ర స్తథైవచ
తథైవ పుత్రో భగవా నృచీకస్య మహాత్మనః
సప్తమో జమదగ్నిశ్చ ఋషయః సాంప్రతం దివి
సాధ్యా రుద్రాశ్చ విశ్వే చ వసవో మరుత స్తథా
ఆదిత్యా శ్యాశ్వినౌ చాపి దేవౌ వైవస్వతౌ స్మృతౌ
మనో ర్వైవస్వతస్యైతే వర్తంతే సాంప్రతేంతరే
ఇక్ష్వాకుప్రముఖాశ్చైవ దశపుత్రా మహాత్మనః
ఏతేషాం కీర్తితానాం తు మహర్షీణాం మహౌజసామ్
తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ దిక్షు సర్వాసు భో ద్విజాః
మన్వంతరేషు సర్వేషు ప్రాగా సన్సప్త సప్తకాః
లోకే ధర్మ వ్యవస్థార్థం లోక సంరక్షణాయ చ
మన్వంతరే వ్యతిక్రాంతే చత్వారః సప్తకా గణాః
కృత్వా కర్మ దివం యాంతి బ్రహ్మలోక మనామయమ్
తతోన్యే తపసాయుక్తాః స్థానం తత్పూరయంత్యుత
ఆతీతా వర్తమానాశ్చ క్రమేణై తేను భో ద్విజాః
సప్తమము వైవస్వంత మన్వంతరము. అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, (ఋచీకుని కుమారుడు) జమదగ్ని అను వారిపుడు సప్తర్షులు. సాధ్యులు, రుద్రులు, విశ్వేదేవులు, వసువులు, మరుత్తులు, ఆదిత్యులు, అశ్వినులు, వైవస్వత మనువు కాలమున దేవతలు. ఇక్ష్వాకు మొదలగు వారు పదిమంది కుమారులు. వారివారి సంతానము లనంతము లయి సర్వ మన్వంతరము లందు సప్త సప్తకులు 7x7 = 49 మంది ధర్మ వ్యవస్థ కొఱకు లోరక్షణ కొరకు (సప్త గణములు) వర్తించి కర్మా నుష్ఠాన మొనరించి శాశ్వత బ్రహ్మ లోకము నలంకరింతురు. ఆమీద వారివారి స్థానములను తపస్సంపన్నులు మరి యొక రధిష్ఠింతురు. ఇట్లు అతీతులు వర్తమాను లనైన వారి వారిని పేర్కొంటిమి.
అనాగతాశ్చ సప్తైతే స్మృతా దివి మహర్షయః
మనోరంతర మాసాద్య సావర్ణస్యేహ భో ద్విజాః
రామో వ్యాసస్థథాత్రేయో దీప్తిమంతో బహుశ్రుతాః
భారద్వాజ స్తథా ద్రౌణి రశ్వత్థామా మహద్యుతిః
గౌతమశ్చా జరశ్చైవ శరద్వాన్నామ గౌతమః
కౌశికో గాలవ శ్చైవ ఔర్వః కాశ్యప ఏవ చ
ఏతే సప్త మహాత్మానో భవిష్యా మునిసత్తమాః
వైరీ చైవా ధ్వరీవాంశ్చ శమనో ధృతిమా న్వసుః
అరిష్ట శ్చాప్యధృష్టశ్చ వాజీ సుమతీ రేవ చ
సావర్ణస్య మనోః పుత్రా భవిష్యా మునిసత్తమాః
ఏతేషాం కల్య ముత్థాయ కీర్తనా త్సుఖ మేధతే
యశశ్చాప్నోతి సుమహ దాయుష్మాంశ్చ భవేన్నరః
ఏతాన్యుక్తాని భో విప్రాః సప్తసప్త చ తత్త్వతః
మన్వంతరాణి సంక్షేపా చ్ఛృణు తానాగతాన్యపి
సావర్ణా మనవో విప్రాః పంచ తాంశ్చ నిబోధత,
ఏకో వైవస్వత స్తేషాం చత్వారస్తు ప్రపాజతేః
పరమేష్ఠిసుతా విప్రాః మేరుసావర్ణ్యతాం గతాః
దక్షస్యైతే హి దౌహిత్రాః ప్రియాయా స్తనయా నృపాః
మహతా తపసా యుక్తా మేరుపృష్ఠే మహౌజసః
రుచేః ప్రజాపతేః పుత్రోరౌచ్యో నామ మనుః స్మృత్యః
భూత్యాం చోత్పాదితో దేవ్యాం భౌత్యో నామ రుచేః సుతః
అనాగతాశ్చ సప్తైతే కల్పేస్మి న్మనవః స్మృతాః
తైరియం పృథివీ సర్వా సప్త ద్వీపా సపత్తనా
పూర్ణం యుగ సహ్రసంతు పరిపాల్య ద్విజోత్తమాః
ప్రజాపతేశ్చ తపసా సంహరంతే చ నిత్యశః
యుగాని సప్తతిస్తాని సాగ్రాణి కథితాని చ
కృత త్రేతాదియుక్తాని మనోరంతర ముచ్చతే
చదుర్ధశైతే మనవః కథితాః కీర్తివర్ధనాః
వేదేషు సపురాణేషు సర్వేషు ప్రభవిష్ణవః
ప్రజానాం పతయో విప్రా ధన్య మేషాం ప్రకీర్తనం
మన్వంతరేషు సంహారాః సంహారాంతేషు సంభవాః
న శక్యతేంత స్తేషాం వైవక్తుం వర్షశతైరపి
విసర్గస్య ప్రజానాం వై సంహారస్య చ భో ద్విజాః
మన్వంతరేషు సంహారాః శ్రూయంతే ద్విజసత్తమాః
సశేషా స్తత్ర తిష్ఠంతి దేవాః సప్తర్షిభిః సహ
తపసా బ్రహ్మచర్యేణ శ్రుతేనచ సమన్వితాః
పూర్ణే యుగసహస్రే తు కల్పో నిశ్శేష ఉచ్చతే
తత్ర భూతాని సర్వాణి దగ్ధా న్యాదిత్యరశ్మిభిః
బ్రహ్మాణ మగ్రతః కృత్వా సహా దిత్యగణై ర్ద్విజాః
ప్రవిశంతి సుర శ్రేష్ఠం హరిం నారాయణం ప్రభుమ్
స్రష్టారం సర్వభూతానం కల్పాంతేషు పునః
అవ్యక్తః శాశ్వతో దేవ స్తస్య సర్వ మిదం జగత్
ఆత్ర వః కీర్తయిష్యామి మనోర్వైవస్వతస్య వై
విసర్గం ముని శార్దూలాః సాంప్రతస్య మహాద్యుతేః
ఆత్రి వంశ ప్రసంగేన కథ్యమానం పురాతనమ్
యత్రోత్పన్నో మహాత్మాస హరి ర్వృష్ణికులే ప్రభుః
ఇక రాగల మన్వంతరములలో సావర్ణి మనువు కాలమున రాముడు, వ్యాసుడు, (ఆత్రేయుడు) అశ్వత్థామ (భారద్వాజుడు, ద్రౌణి) అజరుడు శరద్వంతుడు (గౌతముడు) గాలవుడు (కౌశికుడు) ఔర్వుడు (కాశ్యపుడు) వీరేడ్వురు ఋషు లయ్యెదరు. వైరి అధ్వరీవంతుడు. శమనుడు, ధృతిమంతుడు. వసువు అరిష్టుడు, అధృష్టుడు, వాజి, సుమతియను వారు. సావర్ణి మనువు కుమారులు. వీరిని వేకువవేళ మేల్కొని కీర్తించిన సుఖ సమృద్ధి యగును కీర్తి కల్గును. ఆయుర్భాగ్యాము పట్టును. సావర్ణులయిన, మనువులలో నొకడు వైవస్వతుడు నల్గురు ప్రజాపతి సంతతి వారు. పరమేష్ఠి కుమారులు మేరు సావర్ణ్యు లయిరి. మేరు గిరిపై తపోనిరతి నుండు వారు ప్రజాపతి పుత్రుడు రౌచ్యుడు. ( మనువు) రుచికి భూతిదేవి యందు గల్గిన వాడు. వీరి శ్వేత వరాహ కల్పము నందు రాగల మనువు లేడుగురు. ఈ పదు నాల్గురు మనువుల వలన సప్త ద్వీపయైన యీ పృథివి యెల్ల పట్టణములతో గూడ వేయి యుగములు పరిపాలింప బడగలదు. డెబ్బది యొక్క మహా యుగములు ప్రజాపతి యొక్క పూర్ణా యుర్దాయము. వీరు మనువులు పదునల్వురు కీర్తి వర్ధనులు. వేదము లందు పురాణము లందు వినిపింతురు. ప్రజాపతులు వీరు. వీరి సంకీర్తనము ధన్యతా సంపాదకము. మన్వంతరము లందు సంహారము, సంహారంతమున (లయ యందు) సృష్టి, ఈ లెక్క వర్ణింప నలవి గాదు. ప్రళయా వసానమున సప్తర్షుల తోడ తపో బలముచే బ్రహ్మచర్య సంపత్తిచే శ్రుతముచే (జ్ఞానముచే) కొందరు మహర్షులు శేషించి యుందురు. వారినే శిష్టు లందురు. యుగ సహస్ర సంపూర్తి యందు కల్ప సమాప్తియై జగత్తు నిశ్శేష మగును. అపుడెల్ల భూతము లాదిత్య కిరణముల దగ్ధము లగును. వీరు బ్రహ్మను ముందిడుకొని ఆదిత్య గణములతో సుర శ్రేష్ఠుడైన నారాయణ ప్రభువు నందు జొచ్చును. కల్పాంతము నందు పునస్సృష్టి సేయు మహానుభావు డాయన. అవ్యక్తము, శాశ్వతము, నైనతత్త్వము, ఆయనయే యీ జగత్తంతము. ఇక వైవస్వత మనువు యొక్క విసర్గ వృత్తాంతము వినిపించెద. పురాణ లక్షణములం దొకటైన వంశ లక్షణముగ ప్రసంగ వశమున శ్రీహరి యవతరించిన వృష్టి వంశమునటుపై వర్ణించెద వినుండు.
Summary of chapter 5 of the Brahma Mahā Purana is as follows:
A systematic review of the kings of the Sūryavaṃśa (Solar Dynasty) is presented, tracing the lineage from Vaivasvata Manu through successive rulers of the Ikṣvāku line. Their tapas, conquests, and adherence to dharma are noted, establishing the sacred genealogical framework through which Rāma and other great kings are descended.