బ్రహ్మ:
అనంతాఖ్యం వాసుదేవం దృష్ట్వా భ్యక్త్యా ప్రణమ్యచ
సర్వపాపవినిర్ముక్తో నరో యాతి పరం పదమ్
మయా చారాధితశ్చాసౌ శక్రేణ తదనంతరమ్
విభీషణేన రామేణ కస్తం నారాధయేత్పుమాన్
శ్వేతగంగాం నరః స్నాత్వాయః పశ్వేచ్ఛ్వేతమాధవమ్
మత్స్యాఖ్యం మాధవం చైవ శ్వేతదీపం స గచ్ఛతి
బ్రహ్మ:
అనంత వాసుదేవ మూర్తిని సేవించన వారు పాప ముక్తులై పరమపద మందుదురు. ఈ స్వామిని నేనును నింద్రుడును సేవించినాము. అటుపై విభీషణుడు రాముడు సేవించిరి శ్వేత గంగ యందు స్నానము చేసి శ్వేత మాధవుని మత్య్సమూర్తి యైన మాధవుని దర్శించిన యతడు శ్వేత ద్వీపమున కేగును.
మునులు:
శ్వేతమాధవమాహాత్మ్యం వక్తుమర్హస్యశేషతః
విస్తరేణ జగన్నాథ ప్రతిమాం తస్య వై హరేః
తస్మిన్జేత్రవరే పుణ్యే విఖ్యాతే జగతీతలే
శ్వేతాఖ్యం మాధవం దేవం కస్తం స్థాపితవాన్పురా
మునులు:
శ్వేత మాధవుని మహాత్మ్యమును చెప్పుడు. శ్వేత మాధవుని విగ్రహమును ప్రతిష్టించిన వారెవరు? అని అడిగిరి.
బ్రహ్మ:
అభూత్కృతయుగే విప్రాః శ్వేతో నామ నృపోబలీ
మతిమాన్థర్మవిచ్చూరః సత్యసంధో ధృఢవ్రతః
యస్యరాజ్యేతు వర్షాణాం సహస్రం దశమానవాః
ఆయుష్మంతోభవంత్యత్ర బాల స్తస్మిన్న సీదతి
వర్తమానే తదారాజ్యే కించిత్కాలే గతే ద్విజాః
కపాలగౌతమో నామ ఋషిః పరమధార్మికః
సుతోస్యాజాతదంతశ్చ మృతః కాలవృశాద్ద్విజాః
తమాదాయ ఋషిర్ధీమాన్వృపస్యాంతికమానయత్
దృష్ట్వెవం నృపతిః సుప్తం కుమారం గతచేతసమ్
ప్రతిజ్ఞామకరోద్విప్రా జీవనార్ధం శిశోస్తదా
బ్రహ్మ:
కృతయుగ మందు బుద్ధిమంతుడు ధర్మజ్ఞుడు శూరుడు సత్య సంధుడు వ్రత నిష్ఠుడునైన శ్వేతుడను రాజు యొక్క రాజ్య మందు మానవులు పదివేల సంవత్సరముల యాయుర్దాయము గల్గి యుండిరి. కొంత కాలమునకు కపాల గౌతముడను ఋషి పండ్లు కూడ రాని స్థితిలో మరణించిన తన కుమారు నెత్తుకొని రాజు నొద్దకు గొని వచ్చెను.
రాజు:
యావద్భాలమహం త్వేనం యమస్య సదనేగతమ్
నానయే సప్తరాత్రేణ చితాం దీప్తాం సమారుహే
రాజు:
వానింజూచి యా శిశువును యమ లోకము నుండి తిరిగి తీసికొని రానిచో నేడు రోజులలో చితి యెక్కెద నని ప్రతిజ్ఞ చేసెను.
బ్రహ్మ:
ఏవముక్త్వా సితైః పద్మైః శతై ర్దశశతాదికైః
సంపూజ్య చ మహాదేవం రాజా విద్యాం జజాపచ
అతిభక్తిం తు సంచింత్య నృపస్య జగదీశ్వరః
సాన్నిధ్యమగమత్తుష్టోస్మిత్యువాచ సహోమయా
శ్రుత్వైవం గిర మీశస్య విలోక్య సహసాహరమ్ః
భస్మదిగ్ధం విరూపాక్షం శరత్కుందేందువర్చనమ్
శార్దూలచర్మవసనం శశాంకాంకితమూర్ధజమ్
మహీం నిపత్య సహసా ప్రణమ్య సతదాబ్రవీత్
బ్రహ్మ:
అట్లు చేసి వేలకొలది. పద్మములతో మహా దేవుని పూజించి శివ మంత్రములను జపించెను. అతని భక్తికి మెచ్చి మహేశ్వరు డుమాదేవితో సాక్షాత్కరించెను. అంతియ కాదు నీ భక్తికి సంతుష్టుడ నైతి ననెను. శరత్కాల మందలి చంద్రబింబ మట్లు మొల్ల మొగ్గల వలె తెల్లగ నున్న విభూతి దాల్చి శార్దూల చర్మమూని, చంద్ర శేఖరుడునై దర్శన మిచ్చిన ఫాలాక్షుని దర్శించి నమస్కార మొనరించి శ్వేతుండిట్లనియె.
శ్వేతుడు:
కారుణ్యం యదిమాం దృష్ట్వా ప్రసన్నోసిప్రభోయది
కాలస్య వశమాపన్నో బాలకో ద్విజపుత్రకః
జీవత్వేష పునర్బాల ఇత్యేవం వ్రతమాహితమ్
ఆకస్మాచ్చ మృతం బాలం నియమ్య భగవన్స్వయమ్
శ్వేతుడు:
స్వామీ! నాయందు ప్రసన్నుడ వైతినేని, కాల వశుడైన ఈ బ్రాహ్మణ శిశువు బ్రతుకు గాక! ఆకాల మృతుడైన యీ బాలుని సంపూర్ణా యుష్మంతుని క్షేమ వంతుని జేయుమని కోరెను.
బ్రహ్మ:
శ్వేతస్యైతద్వచః శ్రత్వా ముదం ప్రాప హరస్తదా
కాలమాజ్ఞాపయామాస సర్వభూత భయంకరమ్
నియమ్య కాలం దుర్ధర్షం యమస్యాజ్ఞాకరం ద్విజాః
బాలం సంజీవయామాన మృత్యోర్ముఖగతం పునః
కృత్వా క్షేమం జగత్సర్వం మునేః పుత్రం నృపోత్మమః
బ్రహ్మ:
శ్వేతుని యా పలుకులు విని శివుడా నందము వడి కాలమును నియమించి సర్వభూత భయంకర మైన యముని శాశించి మృత్యుముఖ గ్రస్తుడైన నా బాలుని జీవింప జేసెను. మహాదేవుడు. గౌరితో ముని కుమారుని సర్వ జగత్తును క్షేమ సంపన్న మొనర్చి యంతర్థాన మయ్యెను.
మునులు:
దేవ దేవ జగన్నాథ త్రైలోక్య ప్రభావావ్యయ
బ్రూహినః పరమం తథ్యం శ్వేతాఖ్యప్య చ సాంప్రతమ్
మునులు:
ఆ శ్వేత నృపతి వృత్తాంతమును సవిస్తరముగా దెల్పుమని యుడగ జగత్ర్పభు విట్లు పలికెను.
బ్రహ్మ:
శృణుధ్వం మనిశారూలాః సర్వసత్త్వహితావహమ్
ప్రవక్ష్యామి యథాతథ్యం యత్పృచ్ఛథ మమానఘాః
మాథవస్యచమాహాత్మ్యం సర్వపాప ప్రణాశనమ్
యచ్ఛుత్వాభిమతాన్కా మాన్ద్రువం ప్రాప్నోతి మానవః
శ్రుతవానృషిభిః పూర్వం మాధవాఖ్యస్య భోద్విజాః
శృణుధ్వం తాం కథాం దివ్యాం భయశోకార్తినాశినీమ్
స కృత్వా రాజ్యమేకాగ్ర్యం వర్షాణాం చ సహస్రకం
విచార్య లౌకికాన్ధర్మాన్వైదికాన్ని యమాం స్తథా
కేశవారాధనే విప్రా నిశ్చితం వ్రతమాస్థితిః
స గత్వా పరమం క్షేత్రం సాగరం దక్షిణాశ్రయమ్
తటే తస్మిన్శుభే రమ్యేదేశే కృష్ణస్య చాంతికే
శ్వేతోథ కారయామాస ప్రాసాదం శుభలక్షమ్
ధన్వంతరశతం చైకం దేవదేవస్య దక్షిణే తతః
శ్వేతేన విప్రేంద్రాః శ్వేతశైలమయేన చ
కృతః స భగవాన్మ్వేతో మాధవశ్చంద్ర సంనిభః
ప్రతిష్టాం విధివచ్చక్రే యథోద్దిష్టాం స్వయం తు సః
దత్వా దానం ద్విజాతిభ్యో దీనానాథతపస్వినామ్
అథానంతరతో రాజా మాధవస్య చ సంవిదా
మహీం నిపత్య సహసా ఓంకారం ద్వాదశాక్షరమ్
జపన్స మౌనమాస్థాయి మాసమేకం సమాధినా
నిరాహరో మహాభాగః సమ్యగ్విష్ణుపదే స్థితః
జపాంతే స తు దేవేశం సంస్తోతు ముపచక్రమే
ఈ కథ సర్వజీవ హితకరము. మాధవుని మహాత్మ్యము సర్వ పాప ప్రణాశనము. సర్వకామ ఫల ప్రదము. నేను ఋషుల వలన వింటిని. భయ దుఃఖములను హరించు నీ దివ్య కథను వినుడు. శ్వేతుడు వేలేండ్లు చక్కగ పాలించి లౌకిక వైదిక ధర్మ విచారణ చేసి దక్షిణ సముద్ర తీర మందలి క్షేత్రముల కేగి కృష్ణాష్టమి నాడు సలక్షణ మైన విష్ణు ప్రాసాదమును నిర్మించెను. అది నూరు ధనస్సుల పరిమాణము గలది. శ్వేతశైల మయమైన భగవన్మూర్తిని మాధవుని మూర్తి నందు స్వయముగా ప్రతిష్ఠించెను. బ్రాహ్మణులకు తపస్వినులకు దీనులకు ననాధులకు నమ్మాధవుని సన్నిధిని దానముల నొనరించి స్వామి యెదుట పుడమిపై వ్రాలి ప్రణవ పూర్వకమైన ద్వాదశక్షర మంత్రమును జపించుచు నొకమాసము మౌన వ్రతుడై నిరాహారుడై యవ్విష్ణు పదమందు సమాధి నిష్ఠు డయ్యెను. జపాంత మందు దేవేశ్వరు నిట్లు స్తుతించెను.
శ్వేతకృత విష్ణుస్తుతి
ఓం నమో వాసుదేవాయ నమః సంకర్షణాయ చ
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమో నారాయణాయ చ
నమోస్తు బహురూపాయ విశ్వరూపాయ వేధసే
నిర్గణాయా ప్రతర్క్యాయ శుచయే శుభకర్మణే
ఓం నమః పద్మనాభాయ పద్మగర్భోద్భవాయ చ
నమోస్తు పద్మవర్ణాయ పద్మసాస్తాయతే నమః
ఓం నమః పుష్కరాక్షాయ సహస్రాక్షాయ మీఢుషే
నమః సహస్రపాదాయ సహస్రభుజమన్యవే
ఓం నమోస్తు వరాహాయ వరదాయ సుమేధసే
వరిష్ఠాయ వరేణ్యాయ శరణ్యాయాచ్యుతాయ చ
ఓం నమో బాల రూపాయ బాల పద్మప్రభాయ చ
బాలార్కసోమనేత్రాయ ముంజకేశాయ ధీమతే
కేశవాయ నమో నిత్యం నమో నారాయణాయ చ
మాధవాయ వరిష్టాయ గోవిందాయ నమో నమః
ఓం నమో విష్ణవే నిత్యం దేవాయ వసురేతపే
మధుసూదనాయ నమః శుద్ధాయాంశుధరాయ చ
నమోనంతాయ సూక్ష్మాయ నమః శ్రీవత్సధారిణే
త్రివిక్రమాయ చ నమో దివ్యపీతాంబరాయ చ
సృష్టికర్త్రే నమస్తుభ్యం గోప్త్రేధాత్రే నమో నమః
నమోస్తు గుణభూతాయ నిర్గుణాయ నమో నమః
నమో వామనరూపాయ నమో వామనకర్మణే
నమో వామననేత్రాయ నమో వామనవాహినే
నమో రమ్యాయ పూజ్యయ నమోస్త్వవ్య క్తరూపిణే
అప్రతర్క్యాయ శుద్ధాయ నమో భయహరాయచ
సంసారార్ణవపోతాయ ప్రశాంతాయ స్వరూపిణే
శివాయ సౌమ్యరూపాయ రుద్రాయోత్తారణాయ చ
భవభంగకృతే చైవ భవభోగప్రదాయ చ
భవసంఘాతరూపాయ భవసృష్టికృతే నమః
ఓం నమో దివ్య రూపాయ సోమాగ్నిశ్వసితాయ చ
సోమసూర్యాంశుకేశాయ గోబ్రాహ్మణహితాయ చ
ఓం నమ ఋక్స్వరూపాయ పదక్రమస్వరూపిణే
ఋక్త్సుతాయ నమస్తుభ్యం నమ ఋక్సాధనాయ చ
ఓం నమో యజుషాం ధాత్రే యజూరూపధరాయ చ
యజుర్యాజ్యాయ జుష్టాయ యజుషాం పతయే సమః
ఓం నమః శ్రీపతే దేవ శ్రీధరాయ వరాయచ
శ్రియః కాంతాయ దాంతాయయోగిచింత్యాయ యోగినే
ఓం నమః సామరూపాయ సామధ్వనివరాయ చ
ఓం నమః సామసౌమ్యాయ సామయోగవిదే నమః
సామ్నే చ సామగీతాయ ఓం నమః సామధారిణే
సామయజ్ఞవిదే చైవ నమః సామకరాయ చ
నమస్త్వథర్వశిరసే నమోథర్వస్వరూపిణే
నమో స్త్వథర్వపాదాయ నమో థర్వకరాయ చ
ఓం నమో వజ్రశీర్షాయ మధుకైటభ ఘాతినే
మహోదధిజలస్థాయ వేదాహరణకారిణే
నమో దీప్తిస్వరూపాయ హృషీ కేశాయ వై నమః
నమో భగవతే తుభ్యం వాసుదేవాయతే నమః
నారాయణ నమస్తుభ్యం నమో లోకహితాయ చ
ఓం నమో మోహనాశాయ భవభంగకరాయ చ
గతిప్రదాయ చ నమో నమో బంధహరాయ చ
త్రైలోక్య తేజసాం కర్త్రే నమ స్తేజస్ప్వరూపిణే
యోగీశ్వరాయ శుద్ధాయ రామాయోత్తరణాయ చ
సుఖాయ సుఖనేత్రాయ నమ స్సుకృతధారిణే
వాసుదేవాయ వంద్యాయ వామదేవాయ వైనమః
దేహినాం దేహ కర్త్రే చ భేదభంగకరాయ చ
దేవైర్వందితదేహాయ నమస్తే దివ్య మౌళినే
నమో వాసనివాసాయ వాసవ్యవహరాయ చ
ఓం నమో వసుకర్త్రే చ వసువాసప్రదాయ చ
నమో యజ్ఞస్వరూపాయ యజ్ఞేశాయ చ యోగినే
యతియోగకరేశాయ నమో యజ్ఞాంగధారిణే
సంకర్షణాయ చ నమః ప్రలంబమథనాయ చ
మేఘఘోష స్వనో త్తీర్ణవేగలాంగలధారిణే
నమోస్తు జ్ఞానినాంజ్ఞాన నారాయణ పరాయణ
ఈ స్తోత్రము విష్ణునామ మధురము, సరళము, సులభార్ధము.
నమేస్తి త్వామృతే బంధు ర్నరకోత్తారణే ప్రభో
అతస్త్వాం సర్వభావేన ప్రణతో నతవత్సల
మలం యత్కాయజం వ్యాపి మానసం చైవ కేశవ
న తస్యాన్యొస్తి దేవేశ క్షాళక స్త్వామృతేచ్యుత
సంసర్గాణి సమస్తాని విహాయ త్వా ముపస్థితః
సంగో మేస్తు త్వయా సార్ధ మాత్మలాభాయకేశవ
కష్ట మాపత్సు దుష్పారం సంసారం వేద్మి కేశవ
తాపత్రయపరిక్లిష్ణస్తేన త్వాం శరణం గతః
ఏషణాభి ర్జగత్సర్వం మోహితం మాయయాతవ
ఆకర్షితం చ లోభాద్యై రతస్త్వా మహమాశ్రితః
నాస్తి కించిత్సుఖం విష్ణో సంసారస్థస్య దేహినః
యథా యథా హి యజ్ఞేశ త్వయి చేతః ప్రవర్తతే
తథా ఫలవిహీనం తు సుఖమాత్యలతికం లభేత్
నష్టో వివేకశూన్యోస్మి దృశ్యతే జగదాతురమ్
గోవింద త్రాహి సంసారా న్మాముద్ధర్తుం త్వమర్హసి
మగ్నస్య మోహసలిలే నిరుత్తారే భవార్ణవేః
ఉద్ధర్తా పుండరీకాక్ష త్వామృతేన్యో న విద్యతే
మఱియు నిట్లనియె. ప్రభో! నన్ను నరకము నుండి యుద్ధరింప గల బంధువు నీకంటె లేడు. కాయికమలము మానసిక మలము నను వాని కంతము లేదు. వానిని క్షాళనము సేయ నీకంటె నెవ్వరు లేరు. సర్వ సంగముల నెడలి నిన్ను జేరితిని. నీతో నెన్నడును నాకు సంగము గలుగు గాక. అది యాత్మ లాభము (స్వరూప దర్శనము) కొఱకు సమర్ధ మగుగాక. ఈ సంసార మపార కష్ట భరిత. నేను తాపత్రయ పరితప్తుడను. నిన్ను శరణు సొచ్చితిని. దారేషణ పుత్రేషణలచే మాయా మోహితుడనై లొభాది గుణములచే ఆకర్షితుడనై నిన్ను శరణందితిని. సాంసారిక సుఖ మించుకైన లేదు. యజ్ఞేశ్వరా! మనసు నీవంక ప్రవర్తించి నిష్కామ మైన ఆత్యంతిక సుఖము (మోక్షము) బొందుదును గాక. వివేక శూన్యుడనై యున్నాను. జగత్తు వ్యక్తావ్యక్తము. ఓ గోవిందా! రక్షింపుము. సంసారము నుండి యుద్ధరింపుము. మోహరస మయము దుస్తరము నైన భవాబ్ధిలో మునిగిన నన్నుద్ధరింప గలవాడు ఓ పుండరీకాక్ష! నీ కంటె మఱి గనబడడు.
బ్రహ్మ:
ఇత్థం స్తుత స్తతి స్తేన రాజా శ్వేతేన భోద్విజాః
తస్మి న్క్షేత్రవరే దివ్యే విఖ్యాతే పురుషోత్తమే
భక్తిం తస్య తు సంచింత్య దేవదేవో జగద్గురుః
ఆజగామ నృపస్యాగ్రే సర్వైర్దేవైర్వృతో హరిః
నీలజీమూత సంకాశః పద్మపత్రాయతేక్షణః
దధత్సుదర్శనం ధీమాన్కరాగ్రే దీప్తమండలమ్
క్షీరోదజలసంకాశే విమలశ్చంద్ర సంనిభః
రరాజ వామహస్తేస్య పాంచజన్యో మహాద్యుతిః
పక్షిరాజధ్వజః శ్రీమాన్గదాశారాఙ్గది ధృక్ప్రభుః
ఉవాచ సాధు భో రాజన్య స్య తే మతిరుత్తమా
యదిష్టం వర భద్రంతే ప్రసన్నోస్మి తవానఘ
శ్రుత్వైవం దేవదేవస్య వాక్యం తత్పరమామృతమ్
ప్రణమ్య శిరసోవాచ శ్వేతస్తద్గతమానసః
ఇట్లు శ్వేతునిచే వినుతుడై యా పురుషోత్తమ క్షేత్రమందు జగద్గురువు హరి సర్వ దేవతలతో సాక్షాత్కరించెను. ఆ మూర్తి నీల మేఘుడు. పద్మనేత్రుడు. తేజోమండ లాంతర్గతుడు. ఆయన వామ హస్తమున పాలవెల్లి చందమామ వొలె పాంచజన్య మను శంఖము వెలుగొందు చుండెను. గదా శారజ్గ ఖడ్గ ధరుడై గరుడ ధ్వజుడు వచ్చి రాజా! నీబుద్ధి స్వచ్ఛ మైనది. భక్తిభరిత మైనది. ఓ పుణ్యశాలి! ప్రసన్నుడ నైతిని. అభీష్ట వరమును గోరుమన
శ్వేతుడు:
యద్యహం భగవాన్భక్తః ప్రయచ్ఛ వరముత్తమమ్
ఆబ్రహ్మ భవనాదూర్ధ్వం వైష్ణవం పద మవ్యయమ్
విమలం విరజం శుద్ధం సంసారాసంగవర్జితమ్
తత్పదం గంతుమిచ్ఛామి త్వత్ప్రసాదాజ్జగత్పతే
శ్వేతుడు:
శిరసు వంచి తద్గత మనస్కుడై స్వామి పరమామృత వాక్యములను విని శ్వేతు డిట్లనియె. ప్రభో! నేను భగవద్భక్తుడ నేని బ్రహ్మ లోకము కంటెను మీదిది, విమలము, విరజము శుద్ధము సంసార సంగ రహితము అవ్యయము నగు విష్ణు పదమును నీ యనుగ్రహమున నందగోరు చున్నాను అని విన్న వించెను.
శ్రీ భగవానుడు:
యత్పదం విబుధాః సర్వే మునయః సిద్ధయోగినః
నాభిగచ్ఛంతి యద్రమ్యం పరం పద మనామయమ్
యాస్యసి పరమం స్థానం రాజ్యామృతముపాస్య చ
సర్వాన్లోకానతిక్రమ్య మమలోకం గమిష్యసి
కీర్తిస్తవాత్ర రాజేంద్ర త్న్రీన్ లోకాంశ్చ గమిష్యతి
సాన్నిధ్యం మమ చైవాత్ర సర్వదైవ భవిష్యతి
శ్వేతగంగేతి గాస్యంతి సర్వే తే దేవదానవాః
కుశాగ్రేణాపి రాజేంద్ర శ్వేతగాంగేయమంబు చ
స్పృష్ట్వా స్వర్గం గమిష్యంతి మద్భక్తా యే సమాహితాః
యస్త్విమాం ప్రతిమాంగచ్ఛేన్మాధవాఖ్యాం శశిప్రభామ్
శంఖగోక్షీరసంకాశామశేషాఘవినాశినీమ్
తాం ప్రణమ్య సకృద్భక్త్యా పుండరీకవిభేక్షణామ్
విహాయ సర్వలోకాన్వై మమ లోకే మహీయతే
మన్వంతరాణి తత్రైవ దేవకన్యాభి రావృతః
గీయమానశ్చ మధురం సిద్ధగంధర్వసేవితః
భునక్తి విపులా న్భోగా న్యథేష్టం మామకై స్సహ
చ్యుత స్తస్మాదిహాగత్య మనుష్యో బ్రాహ్మణో భవేత్
వేదవేదాంగవి చ్ఛ్రీ మాన్భోగవాం శ్చిరజీవితః
గజాశ్వరథయానాఢ్యో ధనధాన్యావృతః శుచిః
రూపవా న్బహుభాగ్యశ్చ పుత్రపౌత్రసమన్వితః
పురుషోత్తమమను ప్రాప్యవటమూలేథసాగరే
త్వక్త్వాదేహం హరింస్మృత్వాతతశ్శాంతపదం వ్రజేత్
శ్రీ భగవానుడు:
దేవ, ముని,సిద్ధ, యోగి గణముల కందని పరమ రమ్య మైన స్థానమునకు నీవు వెళ్ళ గలవు. రాజ్యాసనము, రాజ్యా మృతము, నుపాసించి సర్వ లోకములు దాటి నాలోకమున కేగ గలవు. నీకీర్తి త్రిలోక వ్యాప్త మగును. ఎల్లప్పుడు నా సాన్నిధ్యము కలుగును. ఇది శ్వేత గంగయని దేవ దానవులు గానము చేయుదురు. ఈ శ్వేత గంగా జలమును గుశాగ్రము చేత స్పృశించినా భక్తులు సమాధి నిష్ఠులై స్వర్గమున కేగ గలరు. ఈ శ్వేత మాధవ విగ్రహము వెన్నెల కాంతి మించును. శంఖము గోక్షీరము వలె అచ్ఛమైనది. ఈ మూర్తి సదా అఘ వినాశిని. తెల్ల తామర పూల వలె మెఱయు నేత్ర శోభ గలది. ఈ ప్రతిమకు నమస్కరించి సర్వ లోకములను దాటి నా లోకమందు ననేక మన్వంతరములు దేవ సుందరీ పరివృతుడై మధురముగ గానము చేయ బడు కీర్తి గలవాడై సిద్ధ గంధర్వ సేవితుడై నా భక్తులతో నతడు విపుల భోగముల ననుభవించును. అట నుండి పుడమిపై బ్రాహ్మణుడై వేద వేదాంగ వేత్తయై భోగియై, సమృద్ధుడై, శుచియై, యదృష్ట వంతుడై, రూప వంతుడై పుత్ర పౌత్రాదులతో సుఖించు పురుషోత్తమును మరల జేరి యా వటమూల మందు జేరి యీ సముద్ర మందు హరి స్మరణ చేయుచు దేహమును వదిలి శాంత పద మందును.
Summary of chapter 59 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The extraordinary spiritual merit accruing to those who take a sacred dip in the ocean at the Puruṣottama kṣetra is further extolled. Specific merits — liberation from the sins of many births, assurance of residence in Viṣṇu's abode after death, redemption of ancestors — are enumerated. The sacred ocean adjacent to Puruṣottama's abode is declared spiritually equivalent to all tīrthas combined.