బ్రహ్మ మహా పురాణము
224 - ఉమా మహేశ్వర సంవాదే మానవానా ముత్తమ గతి ప్రాప్తి వర్ణనమ్
ధర్మనిరూపణము
ఉమాదేవి:
భగవన్సర్వభూతేశ సురాసురనమస్కృత
ధర్మాధర్మే నృణాం దేవం బ్రూహి మే సంశయం విభో
కర్మణా మనసా వాచా త్రివిధై ర్దేహినః సదా
బధ్యంతే బంధనైః కైర్వా ముచ్యంతే వాధ కథం వద
కేన శీలేన వై దేవ కర్మణా కీదృశేన వా
సమాచారైర్గుణైః కైర్వాః స్వర్గం యాంతీహమానవాః
ఉమాదేవి:
సర్వ ప్రాణులకు ఈశుడవును దేవతల చేతను రాక్షసుల చేతను నమస్కరింప బడు ఓ భగవాన్! శివా! మానవుల ధర్మాధర్మము లను నాకు తెలిపి సంశయము తీర్చుము. మానవులు మానసికములు వాచికములు శారీరకములు అగు ఏ త్రివిధ కర్మ బంధములచే బంధింప బడుదురు? ఎట్లు విడుదల పొందుదురు? ఓ దేవా! ఏ శీలముచే ఎటు వంటి కర్మచే ఏ ఆచరణములచే గుణములచే వారు స్వర్గము పోందుదురు?
శివుడు:
దేవి ధర్మార్థ తత్త్వజ్ఞే ధర్మనిత్య ఉమే సదా
సర్వ ప్రాణహితః ప్రశ్నః శ్రూయతాం బుద్ది వర్ధనః
సత్య ధర్మరతాః శాంతాః సర్వలింగ వివర్జతాః
నాధర్మేణ సధర్మేణ బధ్యంతే చిన్న సంశయాః
ప్రళయోత్పత్తి తత్త్వజ్ఞాః సర్వజ్ఞాః సర్వదర్శినః
వీతరాగా విముచ్యంతే పురుషాః కర్మ బంధనైః
కర్మణా మనసా వాచా యే న హింసంతి కించన
యే న మజ్జంతి కిస్మింశ్చత్తే న బధ్నంతి కర్మభిః
ప్రాణాతిపాతా ద్విరతాః శీలవంతో దయాన్వితాః
తుల్య ద్వేష్య ప్రియాదాంతాముచ్యంతే కర్మబంధనైః
సర్వభూతదయావంతో విశ్వాస్యాః సర్వజంతుషు
తక్త్యహింస్ర సమాచారా స్తే సరాః స్వర్గగామినః
పరస్వనిర్మమావిత్యం పరదార వివర్జతాః
ధర్మలబ్ధార్థ భోక్తార స్తే నరాః స్వర్గగామినః
మాతృవత్స్వసృవచ్చైవ నిత్యం దుహితృవచ్చ యే
పరదారేషు వర్తంతే తే సరాః స్వర్గగామినః
స్వదార నిరతాయే చ ఋతుకాలాభిగామినః
అగ్రామ్య సుఖభోగాశ్చ తే నరాః స్వర్గగామినః
సైన్యాన్ని వృత్తాః సతతం సంతుష్టాః స్వధనేన చ
స్వభాగ్యాన్యుపజీవంతి తే నరాః స్వర్గగామినః
పరదారేషు యే నిత్యం చారిత్రావృతలోచనాః
జితేంద్రియాః శీలపరాస్తే నరాః స్వర్గగామినః
ఏష దైవకృతో మార్గః నేవితవ్యః సదా సరైః
అకషాయ కృతశ్చైవ మార్గః సేవ్యః సదా బుధైః
అవృథాపకృతశ్చైవ మార్గః సేవ్యః సదా బుధైః
దానకర్మతపోయుక్తః శీలశౌచదయాత్మకః
స్వర్గమార్గమభీష్సద్బిర్నసేవ్యస్త్వత ఉత్తరః
శివుడు:
ధర్మ తత్త్వమును ఎఱిగి నిరతము దాని యందే ఉండు ఓ దేవి! సర్వ ప్రాణులకు హితకరమై బుద్దిని వృద్ది చేయు నీ ప్రశ్నమునకు సమాధానము చెప్పెదను వినుము, సత్య ధర్మము లందు అసక్తులై శాంతులై అన్ని బాహ్య లక్షణము లను వదలి సంశయ రహితులగు వారు బంధనములకు లో బడుదురు. అట్టివారు ప్రపంచో త్పత్తి ప్రళయముల తత్త్వము తెలిసి సర్వజ్ఞలై కోరికలు లేక కర్మ బంధముల నుండి ముక్తి పొందుదురు. త్రికరణములతో ఏ ప్రాణిని హింసించక దేని యందు అసక్తి నొందని వారు దయ కలిగి ప్రాణి హింస చేయక సత్ శీలము ప్రియాప్రియముల యందు సమ బుద్ది కలిగి సర్వ ప్రాణులకు విశ్వసనీయులై ఇంద్రియ నిగ్రహము కలిగిన వారు కర్మలచే బంధింప బడరు. స్వర్గమును పొందుదురు. ఇతరుల ధనముల యందు దారల యందు అసక్తి లేక వారిని తల్లిగా చెల్లెలుగా తలచుచు తన భార్యను ఋతు కాలమున మాత్రమే మొరటు సుఖమునకు కాక ధర్మమునకై కలియుచు ధర్మముచే ఆర్జించిన దానితో జీవించుచు తృప్తి నొందుచు దొంగ తనములేక సత్ర్పవర్తనము ఇంద్రియ జయము కలవారు స్వర్గము నొందుదురు. వ్యర్థముగా ఏ ప్రాణికి అపకారము చేయక మనస్సున మాలిన్యము లేక దానము సత్కర్మము తపస్సు శీలము శుచిత్వము దయ కలిగి జీవించు ఈ మార్గము దైవము నిర్ణయించి నది. వివేకము కలిగి దీనినే మానవుడు అనుసరించ వలెను.
ఉమాదేవి:
వాచా తు బధ్యతే యేన ముచ్యతే హ్యథవా పునః
తాని కర్మాణి భో దేవ వద భూతపతేనఘ
ఉమాదేవి:
పూజ్యుడవగు దేవ! భూతపతీ! బంధమునకు కాని ముక్తికి కాని హేతువు లగు కర్మలను తెలపుము.
శివుడు:
ఆత్మహేతోః పరార్థే వా ఆధర్మాశ్రిత మేవ చ
యే మృషా న వదంతీహ తే నరాః స్వర్గగామినః
వృత్త్యర్థం ధర్మహేతోర్వా కామకారాత్తథైవ చ
అనృతం యే న భాషంతే తే నరాః స్వర్గగామినః
శ్లక్ష్ణాం వాణీం స్వచ్చవర్ణాం మధురాం పాపవర్జితామ్
స్వగతేనాభి భాషంతే తేనరాః స్వర్గగామినః
పరుషం యే న భాషంతే కటుకం నిష్టురం తథా
నపైశున్యరతాః సంత స్తే నరాః స్వర్గగామినః
పిశునం న ప్రభాషంతే మిత్రభేదకరం తథా
పరపీడాకరం చైవ తే నరాః స్వర్గగామినః
యే వర్జయంతి పరుషం పరద్రోహం చ మానవాః
సర్వభూత సమాదాంత స్తే సరాః స్వర్గగామినః
శఠప్రలాపా ద్విరతా విరుద్ద పరివర్జకాః
సౌమ్య ప్రలాపినో నిత్యం తే నరాః స్వర్గగామినః
న కోపాద్వ్యాహరంతే యే వాచం హృదయ దారిణీమ్
శాంతిం విందతి యే క్రుద్దా స్తే నరాః స్వర్గగామినః
ఏష వాణీకృతో దేవి ధర్మః సేవ్యః సదా నరైః
శుభసత్యక గుణైర్నిత్యం వర్జనీయ మృషా బుధైః
శివుడు:
తన కొఱకే కాని పరుల కొఱకే కాని జీవన మునకే కాని ధర్మమునకై కాని తన స్వేచ్ఛచే కాని అసత్యము పలుక రాదు. పరుషము కటువు నిష్టురము కొండెములు మిత్ర భేదము కలిగించునది ఇతరులకు బాధ ద్రోహమును కలిగించు నది అగు మాట పలుకక మృదువై స్వచ్చ వర్ణములు కలిగి పాపము లేక తీయనైన పలుకులు అంతఃకరణ శుద్దిగా కోపము లేక మనోహరముగా పలుకు వారు స్వర్గమును పొందుదురు. వాచిక మగు ధర్మ స్వరూపము ఇది.
ఉమాదేవి:
మనసా బధ్యతే యేన కర్మణా పురుష సదా
తన్మే బ్రూహి మహాభాగ దేవదేవ పినాకధృక్
ఉమాదేవి:
ఓమహాభాగా! దేవదేవా! పినాక ధారీ! పురుషుని బంధించు మానసిక కర్మలను తెలుపుము.
మహేశ్వరుడు:
మానసేనేహ ధర్మేణ సంయుక్తాః పురుషాః సదా
స్వర్గం గచ్ఛంతి కల్యాణి తన్మే కీర్తయతః శృణు
దుష్ప్రణీతేన మనసా దుష్ప్రణీతాంతరాకృతిః
నరో బధ్యేత యేనేహ శృణు వా తం శుభాననే
అరణ్యే విజనే న్యస్తం పరస్వం దృశ్యతే యదా
మనసాపి న గృహ్ణంతి తే నరాః స్వర్గగామినః
తథైవ పరదారాన్యే కామవృత్తా రహోగతాః
మనసాపి న హింసంతి తే నరాః స్వర్గగామినః
శత్రుం మిత్రం చ యే నిత్యం తుల్యేన మనసా నరాః
భజంతి మైత్రం సంగమ్య తే నరాః స్వర్గగామినః
శ్రుతవంతో దయావంతః శుచయః సత్యసంగరాః
స్వైరర్థైః పరిసంతుష్టా స్తే నరాః స్వర్గగామినః
అవైరా యే త్వనాయాసా మైత్ర చిత్తరతాః సదా
సర్వభూతదయావంత స్తే నరాః స్వర్గగామినః
జ్ఞాతవంతః క్రియావంతః క్షమావంతః సుహృత్ప్రియాః
ధర్మాధర్మవిదో నిత్యం తే నరాః స్వర్గగామినః
శుభనా మశుభానాం చ కర్మణాం ఫలసంచయే
నిరాకాంక్షాశ్చ యే దేవి తే నరాః స్వర్గగామినః
పాపోపేతా న్వర్జయంతి దేవద్విజపరాః సదా
సముత్థాన మనుప్రాప్తా స్తే నరాః స్వర్గగామినః
శుభైః కర్మఫలైర్దేవి మయైతే పరికీర్తితాః
స్వర్గమార్గ పరా భూయః కిం త్వం శ్రోతుమిహేచ్ఛసి
మహేశ్వరుడు:
మానవుని స్వర్గలోక గతికి సాధన మగు మానసిక ధర్మములు చెప్పెదను వినుము. అతడు మనస్సును చెడు దానినిగా చేసిన కర్మచే బద్ధు డగును. అరణ్యమున నిర్జన ప్రదేశమున పర ధనము కనబడినను గ్రహించ తలచక ఏకాంతమున లభించినను పరదారల కోరక శత్రులను మిత్రులను సమముగా మైత్రితో చూచుచు వేదశాస్త్రా ధ్యయనము దయ శౌచము సత్యము కలిగి తమ ధనముతో తృప్తులై ఏ ప్రాణియందు దయయే కాని వైరము లేని వారు స్వర్గమును పొందుదురు. జ్ఞానము సత్కర్మలు ఓర్పు మంచి మనస్సు కలవారిపై ప్రీతి ధర్మాధర్మ జ్ఞానము కలిగి తామాచరించు శుభ, అశుభ కర్మలలో వేని యొక్క ఫలము నందును కోరికలు లేక జీవించు వారు స్వర్గము నొందుదురు. ఈ చెప్పిన మానసిక పాపములను విడిచి దేవ బ్రాహ్మణ భక్తి కలిగి నిత్యము సత్కర్మల యందు ప్రయత్న పరులయి యుండు వారు స్వర్గము పొందుదురు. మానసిక సత్కర్మలు నీకు తెలిపితిని. మఱి ఏమి విన గోరెదవు?
ఉమాదేవి:
మహాన్మే సంశయః కశ్చి న్మర్త్యాస్ప్రతి మహేశ్వర
తస్మాత్త్వం నిపుణేనాద్య మమ వ్యాఖయాతుమర్హసి
కేనాయుర్లభతే దీర్ఘం కర్మణా పురుషః ప్రభో
తపసా వాపి దేవేశ కేనాయుర్లభతే మహత్
క్షీణాయుః కేన భవతి కర్మణా భువి మానసః
విపాకం కర్మణాం దేవ వక్తుమర్హస్యనిందిత
అపరే చ్చ మహాభాగ్యా మందభాగ్యా స్తథా పరే
ఆకులీనాః కులీనాశ్చ సంభవంతి తథా పరే
దుర్దర్శాః కేచిదాభాంతి నరాః కాష్ఠమయాఇవ
ప్రియదర్శాస్తథా చాన్యే దర్శనాదేవ మానవాః
దుష్ప్రజ్ఞాః కేచిదాభాంతి కేచిదాభాంతి పండితాః
మహాప్రజ్ఞా స్తథా చాన్యే జ్ఞాన విజ్ఞాన భావినః
అల్పవాచా స్తథా కేచి న్మహావాచా స్తథా పరే
దృశ్యంతే పురుషా దేవ తతో వ్యాఖయా తుమర్హసి
ఉమాదేవి:
ఓ మహేశ్వరా! మానవుల విషయమున నాకొక సంశయము కలదు. మీరు దానిని వివరించి తీర్చ వలయును. ఏ కర్మచే ఏ తపస్సుచే దీర్ఘాయువు లభించును? ఏ కర్మచే ఆయువు క్షీణించును? కర్మ విపాకము ఎట్టిది? కొందఱు మహాభాగ్యము కలవారు మఱి కొందరు మంద భాగ్యులు అగుటకు కొందరు గొప్ప కులమున మఱి కొందరు తక్కువ కులమున పుట్టుటకు కొందఱు కొయ్య బొమ్మల వలె కురూపులు మఱి కొందరు అందగాండ్రు కొందఱు ప్రజ్ఞా హీనులు మఱి కొందఱు మహా ప్రజ్ఞ కల పండితులు జ్ఞాన విజ్ఞాన వంతులు కొందఱు అల్ప వాక్కు కలవారు మఱి కొందఱు గొప్ప వాక్పాటవము కలవారు ఐ కన బడుటకు హేతువును తాము నాకు వివరించ వలయును.
శివుడు:
హంత తేహం ప్రవక్ష్యామి దేవి కర్మఫలోదయమ్
మర్త్యలోకే నరః సర్వో యేన స్వం ఫలమశ్నుతే
ప్రాణాతి పాతీ యోగీంద్రో దండహస్తో నరః సదా
నిత్యముద్యతశస్త్రశ్చ హంతి భూతగణాన్నరః
నిర్దయః సర్వభూతేభ్యో నిత్యముద్వేగకారకః
అపి కీటపతంగానా మశరణ్యః సునిర్ఘృణః
ఏవంభూతో నరోదేవి నిరయం ప్రతిపద్యతే
విపరీతస్తు ధర్మాత్మా స్వరూపజేణాభిజాయతే
నిరయం యాతి హింసాత్మా యాతి స్వర్గమహింసకః
యాతనాం నిరయే రౌద్రాం సకృచ్ఛ్రాం లభతే నరః
యః కశ్చిన్నిర యాత్తస్మా త్సము త్తరతి కర్హిచిత్
మానుష్యం లభతే వాపి హీనాయుస్తత్ర జాయతే
పాపేన కర్మణా దేవి యుక్తో హింసాదిభిర్యుతః
అహితం సర్వభూతానాం హీనాయురుప జాయతే
శుభేన కర్మణా దేవి ప్రౌణిఘాత వివర్జితః
నిక్షిప్తశస్త్రో నిర్దండో న హింసతి కదాచన
న ఘాత యతి నో హంతి ఘ్నంతం నై వానుమోదతే
సర్వభూతేషు సస్నేహో యథా త్మని తథా పరే
ఈదృశః పురుషో నిత్యం దేవి దేవత్వమశ్నుతే
ఉపపన్నాన్సుఖాన్భోగాన్ సదాశ్నాతి ముదాయుతః
అథచేన్మానుషే లోకే కదాచిదుపపద్యతే
ఏష దీర్ఘాయుషాం మార్గః సువృత్తానాం సుకర్మణామ్
ప్రాణిహింసావిమోక్షేణ బ్రహ్మణా సముదీరితః
శివుడు:
దేవీ! మర్త్య లోకమున ప్రతి మానవుడును తన కర్మకు తగినట్లు ఫలమును పొందు విధమును చెప్పెదను వినుము. యోగీంద్రుడే ఐనను ఎప్పుడును చేతిలో దండమును ఆయుధము లను ధరించి ప్రాణి సమూహముల ప్రాణముల హింసించుచు వాటిపై దయలేక వానికి భయమే కలిగించుచు కీటకము లను పక్షులకు కూడ రక్షణ నీయని వాడు నరకము పొందును. ఇట్టి ఏ హింసను చేయని వాడు స్వర్గము పొందును. అట్టి ధర్మాత్ముడు స్వస్వ రూపము తోనే ఉండును. హింసకుడు నరకమున భయంకరము క్లేశ ములతో కూడినదియు అగు యాతనను పొంది ఎట్లోదాని నుండి బయట పడిన తరువాత కూడ మానవుడై జన్మించి నను క్షీణాయు వగును. పాప కర్మలు చేయుచు ప్రాణులను హింసించుచు వానికి అహితు డగుటయే ఆయుః క్షయమునకు హేతువు. శుభ కర్మల ఆచరించుచు ఆయుధము ధరించక ఏ ప్రాణిని దండించక హింసించక ఏ ప్రాణిని తానై చంపక చంపింపక చంపు వారిని అను మోదించక తన యందు వలెనే ఇతర ప్రాణి యందు భావము కలిగి ప్రాణుల యందు స్నేహము కల నరుడు దేవత్వమును పొందును. సముచితము లగు సుఖముంను అనుభవించి స్వర్గమున సంతోషమును పొందును. ఒకప్పుడు ఒట్టి వాడు మానవుడై జన్మించి నను దీర్ఘాయు డగును. ప్రాణి హింసను విడుచుటయే దీర్ఘాయువును పొందుటకు మార్గమని బ్రహ్మ విధించెను.
Summary of chapter 117 of the Brahma Mahā Purana is as follows:
Umā questions Maheśvara about the conduct that leads men to heaven and the karmic causes of different conditions at birth — intelligence or ignorance, blindness, sickness, or impotence. Śiva answers systematically: generosity, reverence for brāhmaṇas and guests, non-violence, humility, and honor for elders lead to heaven and rebirth in auspicious families; miserliness, arrogance, violence, and disrespect lead to hell and degraded births. The chapter is a detailed karma-vipāka teaching presented as an intimate dialogue between Śiva and Pārvatī.