లోమహర్షణుడు:
క్షీరోదేన యథా ద్వీపో జంబూసంజ్ఞో భివేష్టితః
సంవేష్ట్య క్షార ముదధిం ప్లక్షద్వీప స్తథా స్థితః
జంబూద్వీపస్య విస్తారః శతసాహస్రస్శమితః
స ఏవ ద్విగుణొ విప్రా ప్లక్ష ద్వీపేప్యుదాహృతః
సప్త మేధాతిథేః పుత్రాః ప్లక్షద్వీపేశ్వరస్యవై
శ్రేష్ఠః శాంతమయో నామ శిశిర స్తదనంతరమ్
సుఖోదయ స్తథానందః శివః క్షేమక ఏవ చ
ధ్రువశ్చ సప్తమ స్తేషాం ప్లక్ష ద్వీపేశ్వరా హి తే
పూర్వం శాంతభయం వర్షం శిశిరం సుఖదం తథా
ఆనందం చ శివం చైవ క్షేమకం ధ్రువమేవ చ
మర్యాదాకారకా స్తేషాం తథాన్యే వర్ష పర్వతాః
సప్తైవ తేషాం నామాని శృణుధ్వల ముని సత్తమాః
గోమేదశ్చైవ చంద్రశ్చ నారదో దుందుభి స్తథా
సోమకః సుమనాః శైలో వై భ్రాజశ్చైవ సప్తమః
లోమహర్షణుడు:
క్షీర సముద్రముచే జంబూ ద్వీపము చుట్ట బడినట్లు ప్లక్ష ద్వీపము లవణోదధిచే పరవృతమై యున్నది. జంబూద్వీప విస్తృతి లక్ష యోజనములు, దానికి రెట్టింపు ప్లక్ష ద్వీపము. ప్లక్ష ద్వీపేశ్వరుడు మేధాతిది. వాని కుమారు లేడ్వురు. శాంతమయుడు (జ్యేష్ఠుడు), శిశిరుడు, సుఖోదయిడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు. వారీ ద్వీపము నేలిన వారు. వారి పేర మఠ్యాదా(హద్దు) కౌరవ పర్వతము లేడు గలవు. అట్లే వర్ష పర్వతములు మఱి యేడు గలవు. మునులారా! వాని పేర్లు వినుడు. గోమోదము, చంద్రము, నరదము, దుందుభి, సోమకము, సుమనస్సు, వైభ్రాజము అనునవి.
వర్షాచలేషు రమ్యేషు వర్షేష్వే తేషు చానఘాః
వసంతి దేవగంధర్వ సహితాః నహితం ప్రజాః
తేషు పుణ్యా జనపదా వీరా న మ్రియతే జనః
నాధయో వ్యాధయో వాపి సర్వకాలసుఖం హితత్
తేషాం నద్యశ్చ సప్తై వవర్షాణాం తు సముద్రగాః
నామత స్తాః ప్రవక్ష్యామి శ్రుతాః పాపం హరంతి యాః
అనుతప్తా శిఖాచై వ విప్రాశా త్రిదివా క్రముః
అమృతా సుకృతా చై వ నప్తైతాస్తత్ర నిమ్నగాః
ఏతే శైలా స్తథా నద్యః ప్రధానాః కథితా ద్విజాః
క్షుద్ర నద్యస్తథా శైలా స్తత్ర సంతి సహస్రశః
తాః పిబంతి సదా హృష్టా నదీ ర్జనపదాస్తు తే
అవసర్పిణీ నదీ తేషాం న దై వోత్సర్పిణీ ద్విజాః
పుణ్యాత్ములారా! రమ్యములగు నీ వర్ష పర్వతము లందును, వర్షము లందును ప్రజలు దేవ గంధర్వులతో గూడి వసింతురు. అందలి దేశములు పవిత్రములు. వీర్య వంతములు. ఆందు జనులు మృతి నందరు. అధి వ్యాధులు లేక సర్వ కాలము సుఖముందురు. అందు నదులు గూడ ఏడే. సముద్రగాములు వానిపేర్లు ఆనుతప్త, శిఖ, విప్రాశ, త్రిదివ, క్రము, అమృత, సుకృత అనునవి. వినినంతనే పాపములు హరించునవి. ప్రధానము లైన నదులు, పర్వతములు పేర్కొన బడినవి. చిన్నచిన్న నదులు పర్వతములు వేల కొలది గలవు. ఆచటి వారు ఎప్పుడును ఆ నదీ జలములనే త్రాగు చుందురు. కాని నదులు తగ్గవు పెరుగవు.
న తేష్వస్తి యుగావస్థా తేషు స్థానేషు నప్తసు
త్రేతాయుగసమః కాలః సర్వదైవ ద్విజో త్తమాః
ప్లక్షద్వీపాదికే విప్రాః శాక ద్విపాంతికేషు వై
పంచవర్షసహస్రాణి జనా జీవం త్యనామయాః
ధర్మ శ్చతుర్విదస్తేషు వర్ణాశ్రమవిబాగజః
వర్ణాశ్చ తత్ర చత్వార స్తా న్బుధాః ప్రవదామి వః
ఆ ప్రదేశము లేడింటి యందును యుగ వ్యవస్థ లేదు. ఎల్లప్పడు త్రేతా యుగ సమముగనే కాలము నడచును. ప్లక్ష ద్వీపము మొదలు శాక ద్వీపము దనుక జనులు అయిదు వేలేండ్లా యువు గల్గి నీరోగులయి యుందురు, వర్ణాశ్రమ విభాగానుసార మక్కడ ధర్మము నాల్గు విదములుగ నుండును. అక్కడ వర్ణములు నాలుగు. వానిని మీకు చెప్పు చున్నాను వినుడు.
అర్యకాః కురవశ్చైవ వివిశ్వా భావినశ్ఛ యే
విప్రక్షత్రియ వైశ్యాస్తే శూద్రాశ్చ ముని సత్తమాః
ఆర్యకులు, కురువులు, వివిళ్వులు, భావులు ననుపేర విప్ర క్షత్రియ వైశ్య శూద్రూలు అను నాలుగు వర్ణముల వారుందురు.
జంబూవృక్షప్రమాణస్తు తన్మధ్యే సుమహాతరుః
ప్లక్ష స్తన్నామ సంజ్ఞోయం ప్లక్షద్వీపో ద్విజోత్తమాః
ఇజ్యతే వాత్ర భగచాం స్తైర్వ ర్ణై రార్యకాదిభిః
సోమరూపీ జగత్ర్సష్టా సర్వః సర్వేశ్వరో హరిః
ప్లక్షద్వీపప్రమాణేన ప్లక్ష ద్వీపః సమావృతః
తధై వేక్షురసోదేన పరివేషానుకారిణాః
ఇత్యేత ద్వో ముని శ్రేష్ఠాః ప్లక్ష ద్వీప ఉదాహృతః
సంక్షే పేణ మయా భూయః శాల్మలం తం నిబోధత
జంబూ ద్వీపమున జంబు వృక్షమున్నట్లు అంత పరిమాణము గల జువ్వి చెట్టు ప్లక్ష ద్వీప మధ్య మందున్నది. అందుచే దానికా పేరు గల్గినది, అందు ఆర్యకాది వర్ణముల వారిచే జగత్కర్తయు సర్వేశ్వరుడును సోమ రూపియు నగు నాహరి ఆరాధింప బడును, ప్లక్ష ధ్వీప ప్రమాణము గల ఇక్షు (చెఱకు రసము) సముద్రముచే ప్లక్ష ద్వీప మావరింప బడి యున్నది. మునులారా! ఇట్లు మీకు ప్లక్ష ద్వీపము సంగ్రహముగ వర్ణించితిని. ఇక నాచే శాల్మల ద్వీపమును గూర్చి తెలిసి కొనుడు.
శాల్మల స్యేశ్వరో వీరో వఫుష్మాం స్తత్సుతా ద్విజాః
తేషాం తు నామసంజ్ఞాని స ప్తవర్షాని తానివై
శ్వేతోథ హరితశ్చైవ జీమూతో రోహిత స్తథా
వైద్యుతో మానసశ్చైవ సుప్రభశ్చ ద్విజోత్తమాః
శాల్మలశ్చ సముద్రోసౌ ద్వీపే నేక్షురసోదకః
విస్తారః ద్విగుణేనాథ సర్వతః సంవృతః స్థితః
తత్రాపి పర్వతా! సప్త విజ్ఞేయా రత్నయోనయః
వర్షాభివ్యంజకాస్తే తు తథా సప్తైవ నిమ్నగాః
కుముద శ్చోన్నత శ్చైవ తృతీయస్తు బలాహకః
ద్రోణొ యత్ర మహౌషద్యః స చతుర్ధో మహీధరః
కంకస్తు పంచమ ష్టష్ఠో మహిషః స స్తమ స్తధా
కకుద్మా న్పర్వతరః సరిన్నామాన్యతో ద్విజాః
శ్రోణీ తోయా వితృష్ణా చ చంద్రా శుక్రా విమోచనీ
నివృత్తిః సప్తమీ తాసాం స్మృతాస్తాః పాపశాంతిదాః
ఇక శాల్మల ద్వీపము, దీనికి వీరుడైన వువష్మంతు డధీశ్వరుడు. వాని కుమారుల నామములతో శ్వేతము, హరితము, జీమూతము’ రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభమునను వర్ష పర్వతము లేడును ప్రసిద్ధములు. శాల్మల ద్వీపము ఇక్షు రస సముద్రముచే పరి వేష్టితము. ఈ ద్వీపము ప్లక్ష ద్వీపమునకు రెట్టింపు ప్రమాణము గలది. అక్కడ రత్న గర్భములైన సప్త కులా చలములు సప్త నదులు గలవు. అందు కుముదము, ఉన్నతము, వలాహకము, ద్రోణము. కంకము, మహిషము, కకుద్మంతము అను పర్వతము లున్నవి. ద్రోణగిరి యందు మహౌషధు లుండును, ఇందలి నదులు శ్రోణి, తోయ, వితృష్టా, చంద్ర శుక్ర, విమోచని, నివృత్తి అనునవి. అవి స్మరణ మాత్రాన పాపముల హరించును.
శ్వేతం చ లోహితం చైవ జీమూతం హరితం తథా
వైద్యుతం మానసం చై వనుప్రభం నామ సప్తమమ్
సపెతాని తు వర్షాణి చాతుర్వర్ణ్యయుతాని చ
వర్ణాశ్చ శాల్మలే యే చ వసంత్యేషు ద్విజోత్తమాః
కపిలాశ్చారుణాః పీతాః కృష్ణాశ్చైవ పృథక్పధక్
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చైవ యజంతి తమ్
భగవంతం సమస్తస్య విష్ణు మత్మాన మవ్యయమ్
వాయుభూతం మఖశ్రేష్ఠై ర్యజ్వానో యజ్ఞసంస్థితమ్
దేవానామత్ర సాన్నిధ్య మతీవ సుమనోహరే
శాల్మలిశ్చ మహావృక్షో నామ నిర్వృత్తికారకః
ఏష ద్వీపః సముద్రేణ సురోదేన సమావృతః
విస్తారా చ్ఛాల్మలేశ్చైవ సమేన తు సమంతతః
సురోదకః పరివృతః కుశద్వీపేన పర్వతః
శాల్మలస్య తు విస్తారా ద్ద్విగుణేన సమంతతః
ఇందలి వర్షములు శ్వేతము, లోహితము, జీమూతము, హరితము, వైద్యుతము, మానసము, సుప్రభము ననునవి. ఇందు చాత్యుర్వర్ణ వ్యవస్థ యున్నది, కపిల = తేనె రంగు, అరుణ = ఎఱుపు, పీత = పసువు, కృష్ణము = నలుపు అను రంగులు గల్గి క్రమముగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిందు నివసింతురు. ఇచట యాగ కర్తలకుపాస్య దైవము విష్ణువు. యజ్ఞ మందు వాయు స్వరూపునిగ నా దైవమును యజ్వలు సేవింతురు. అతి మనోహరమైన యీ ద్వీప మందు దేవతలు సన్నిధి సేసి యుందురు. శాల్మల వృక్ష ముండుటచే నీ ద్వీపమునకు శాల్మల ద్వీపమని పేరు. కుశ ద్వీపము చుట్టును నురా సముద్ర మున్నది. అది శాల్మల ద్వీపమునకు రెట్టింపు విస్తారము గలది.
జ్యోతిష్మతః కుశద్వీపే శృణుధ్వం తస్య పుత్రకాన్
ఉద్భిదో వేణుమాంశ్ఛైవ స్వైరధో రంధనో ధృతిః
ప్రభాకరోథ కపిల స్తన్నామ్నా వర్ష పద్ధతిః
తస్యాం వసంతి మనుజైః సహ దైతేయ దానవాః
తథైవ దేవగంధర్వా యక్షకింపురుషాదయః
వర్ణా స్తత్రాపి చత్వారో నిజానుష్ఠానతత్పరాః
దమినః శుష్మిణః స్నేహా మాందహాశ్చ ద్యిజో త్తమాః
బ్రాహ్మణాఃక్షత్రియావై శ్యాఃశూద్రాశ్ఛాను క్రమోదితాః
యథో క్తకర్మక ర్తృత్వా త్స్యాధికారక్షయాయ తే
తత్ర తే తు కుశద్వీపే బ్రహ్మరూపం జనార్దనమ్
యజంతః క్షపయం త్యుగ్ర మధికారఫలప్రదమ్
విద్రుమో హేమశై లశ్చ ద్యుతిమా న్పుష్టిమాం స్తథా
కుశేశయో హరిశ్చైవ స ప్తమో మందరాచలః
వర్షాచలాస్తు సప్తైతే ద్వీపే తత్ర ద్విజోత్తమాః
ఇందు రాజైన జ్యోతిష్మంతుని కుమారులు ఉద్భిదుడు, వేణుమంతుడు, స్వైరధుడు, రంధనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అను వారి పేరులతో వర్షములు నున్నవి. ఇందు మనుజులతో బాటు దైత్య, దానవ, దేవ, గంధర్వ, యక్ష, కింపురుషులును వసింతురు. ఇక్కడ స్వధర్మానుష్ఠాన పరులయిన బ్రహ్మణాది చతుర్వర్ణ ప్రజలు వరుసగా దములు, శుష్మిణులు, స్నేహులు, మాందహులు ననుపేర నుందురు. అక్కడ పరబ్రహ్మ రూపుడు జనార్ధను డారాధ్య దైవము. అచట జనులు జనార్దను గూర్చి యజ్ఞములు సేసి ఆధికారిక పురుఘలుగా నవతరింప వలసిన పురాకృత పుణ్యకర్మ ఫలమును క్షయింప జేసి కొందురు. అనగా కేవల నైష్కర్మ్య విషయ మయిన ముక్తినే కోరుదురని తాత్పర్యము. విద్రుమము, హేమశైలము, ద్యుతిమంతము, పుష్టి మంతము, కుశేశయము, హరి మందరము ననునవి యచ్చట వర్షపర్వతము లేడు.
నద్యశ్చ సప్త తాసాం తు వక్ష్యే నామా న్యనుక్రమాత్
ధూతపాపా శివాచైవ పవిత్రా సమ్మతి స్తథాః
విద్యుదంభో మహీ చాస్య సర్వపాపహరా స్త్విమాః
అన్యాః సహస్రశ స్తత్ర క్షుద్రనద్యః స్తథాచలాః
కుశద్విపే కుశస్తంబః సంజ్ఞయా తత్స్మృతం తతః
తత్ర్పమాణేన స ద్వీపో ఘృతొదేన సమావృతః
ఘృతోదశ్చ సముద్రో వై క్రౌంచద్వీపేన సంవృతః
క్రౌంచద్వీపో మునిశ్రేష్ఠాఃశ్రూయతాంచాపరో మహాన్
ధూతపావ, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుదంభస్సు, మహీ యనునవి మరికొన్ని చిన్న చిన్న యేరులు వేల కొలది సర్వపాప హరము లైన వక్కడ నున్నవి. కుశ ద్వీప మధ్యమున కుశస్థంబ మున్నది. అందుచే దాని కాపేరు గల్గినది. ఘృత సముద్రము క్రౌంచ ద్వీపముచే నావృతమయి యట నున్నది,
కుశద్వీపస్య విస్తారా ద్ద్విగుణో యస్య విస్తరః
క్రౌంచద్వీపే ద్యుతిమతః పుత్రా స ప్త మహాత్మనః
తన్నామాని చ వర్షాణి తేషాం చక్రే మహామనాః
కుశగో మందగ శ్చోష్ణః పీవరోథాంధకారకః
ముని శ్చ దుందుభిశ్చైవ సపైతే తత్సుతా ద్విజాః
తత్రాపి దేవగంధర్వసేవితాః సుమనోరమాః
వర్షాచలా మునిశ్రేష్ఠా స్తేషాం నామాని భో ద్విజాః
క్రౌంచశ్చ వామనశ్చైవ తృతీయ శ్చాంధకారకః
దేవవ్రతో ధమశ్చైవ తథాన్యః పుండరీకవా న్
దుందుభిశ్చ మహాశైలో ద్విగుణాస్తే పరస్పరమ్
ద్వీపా ద్వీపేఘ యే శై లా స్తథా ద్వీపాని తే తథా
వర్షాష్వేతేషు రమ్యేషు వర్ష శైలవరేషు చ
నివసంతి నిరాతంకాః సహ దేవగణైః ప్రజాః
పుష్కలాః పుష్కరా ధన్యా స్తే ఖ్యాతాశ్చ ద్విజో త్తమాః
బ్రహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చానుక్రమోదితాః
తత్ర నద్యో మునిశ్రేష్ఠా యాః పిబంతి తు తే సదాః
సప్త ప్రధానాః శతశ స్తథాన్యాః క్షుద్రనిమ్నగాః
గౌరీ కుముద్వతీ చైవ సంధ్యా రాత్రి ర్మనోజవా
ఖ్యాతిశ్చ పుండరీకా చ సప్తైతా వర్షనిమ్నగా
తత్రాపి వర్ణై ర్భగవా స్పుష్కరాద్యై ర్జనార్దనః
ధ్యానయోగే రుద్రరూప ఇజ్యతే యజ్ఞసన్నిధౌ
క్రౌంచద్వీపః సముద్రేణ దధిమండోదకేనతు
ఆవృతః సర్వతః క్రౌంచద్వీపతుల్యేన మానతః
దధిమండోదకశ్చాపి శాకద్వీపేన సంవృతః
క్రౌంచద్వీపస్య విస్తారద్విగుణేన ద్విజో త్తమాః
ఇక క్రౌంచ ద్వీపము కుశ ద్వీపము కంటె రెట్టింపు విరివి గలది. ఇచట ద్యుతిమంతుని కుమారు లేడుగురు పరిపాలకులు. కుశగుడు, మందగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారకుడు, ముని, దుందుభి యనువారు. దేవ గంధర్వ నిషేవితములు రమ్యములు నైన వర్ష పర్వతము లిందున్నవి. అవి క్రౌంచము, వామనము, అంధకారకము. దేవవ్రతము, ధమము, పుండరీక వంతము, దుందుభి అనునవి యొక దానికంటె నొకటి రెట్టింపు ప్రమాణము గలవి. ఇక్కడ దేవగణ ములతో గూడి పుష్కరులు పుష్కలులు ననువారు ధన్యులై చరింతురు. బ్రహ్మణాది చతుర్వర్ణములు నిందు గలవు. ఇందు ప్రధాన నదులేడు. గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజప, ఖ్యాతి, పుండరీక యనునవి. అక్కడ పుష్కరాదులచే ధ్యాన యోగమున యజ్ఞమందు రుద్ర రూపుడైన జనార్దను డారాధింప బడును. ఇది మీగడ సముద్రముచే ఆవృతము. అది యా ధ్వీప పరిమాణము గలది. దాని చుట్టును శాక ద్వీప మున్నది.
శాకధ్వీపేశ్వర స్యాపి భవ్యస్య సుమహాత్మనః
సప్తైవ తనయా స్తేషాం దదౌ వర్షాణి సప్త సః
జలదశ్చ కుమారశ్చ సుకుమారో మనీకః
కుసమోదశ్చ మోదాకిః సప్తమశ్చ మహాద్రుమః
తత్సంజ్ఞాస్యేవ తత్రాపి సప్తవర్షా ణ్యను క్రమాత్
తత్రాపి పర్వతాః సప్త వర్షవిచ్ఛేదకారకాః
పూర్వ స్తత్రోదయగిరి ర్జలధార స్తథాపరః
తదా రైవతకః శ్యామ స్తథై వాంభోగిరి ర్ద్విజాః
ఆస్తి కేయ స్తథా రమ్యః కేసరీ పర్వతోత్తమః
శాక శ్చత్ర మహావృక్షః సిద్ధగంధర్వ సేవితః
యత్పత్రవాత సంస్పర్శా దాహ్లాదో జాయతే పరః
తత్ర పుణ్యా జనపదా శ్చాతుర్వర్ణ్య సమన్వితాః
నివసంతి మహాత్మానో నిరాతంకా నిరామయాః
నద్యశ్చాత్ర మహాపుణ్యా స్సర్వ పాపభయాపహాః
సుకుమారీ కుమారీ చ నళీనీ రేణుకా చ యా
ఇక్షుశ్ఛ ధేనుకాచైవ గభస్తిః స ప్తమీ తథా
అన్యాశ్చ శతశ స్తత్ర క్షుద్రనద్యో ద్విజోత్తమాః
మహీధరా స్తథా సంతి శతశోథ సహస్రశః
తాః పిబంతి ముదా యుక్తా జలదాదిషు యే స్థితాః
వర్షేషు యే జనవదా శ్చతుర్ధార్థ సమన్వితాః
నద్యశ్చాత్ర మమాపుణ్యాః స్వర్గాదభ్యేత్య మేదినీమ్
ధర్మహాని ర్న తేష్వస్తి న సంహర్షో న శుక్తథా
మర్యాదా వ్యుత్క్రమో నాపి తేష్తు దేశేషు స ప్తసు
మగాశ్చ మాగదాశ్చైవ మానసా మందగా స్తథా
మగా బ్రామ్మణభూయిష్ఠా మాగధాః క్షత్రియాస్తు తే
వైశ్యాస్తు మానసా స్తేషాం శూద్రా జ్ఞేయాస్తు మందగాః
శాకద్వీపే స్థితై ర్విష్ణుః సూర్యరూపధరో హరిః
యథోక్తై రిజ్యతే సమ్య క్కర్మభి ర్నియతాత్మభిః
శాక ద్వీప పతియైన భవ్యునికి జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మనీరకుడు, కుశమోదుడు, మోదాకి, మహాద్రుముడు నను పుత్రులు గలరు. అందలి వర్షములు వారి పేర నున్నవి. అందేడు వర్ష పర్వతములు ఉదయగిరి, జలధార = రైవతకము, శ్యామము, అంభోగిరి, అస్తికేయము, కేసరి యనునవి. సిద్ద గంధర్వ సేవితమై యిచట శాకమను (టీకు గాని కడిమి గాని) మహావృక్ష మున్నది. దాని యాకుల గాలి తాకినచో పరమా హ్లాదము గల్గును. అక్కడ పవిత్రము లయిన చతుర్వర్ణ ప్రజలతో గూడిన జనపదములు గలవు. ఆచటి జనులు నిరాతంకులు ఏ అభ్యంతరములు లేనివారు నిరోగులు. నదులు మహా పుణ్యములు. పాపభయ హరములు. సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, ధేనుక, గభస్తి అనునవి యేడు చిన్నచిన్న యేరులు, గిరులు వేలున్నవి. జలదాది గిరులపై వసించు జను లానదీ సలిలము లను ద్రావుదురు. ఈ నదులు స్వర్గము నుండి వచ్చినవి. అచటి ప్రజలలో ధర్మహాని సుఖ దుఃఖములు, శాస్త్రము హద్దుమీరి నడచుట అనునవి లేవు. మగులు మాగధులు మానసులు మందగులు నను పేర బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజ లచట నివసింతురు. శాక ద్వీప వాసుల కుల దైవము విష్ణువు, సూర్య రూపుడుగా యథావిధి శ్రీహరి యీ ప్రజలచే నర్చింప బడును.
శాకద్వీప స్తతో విప్రాః క్షీరోదేన సమంతతః
శాకద్వీపప్రమాణేన వలయేనేవ వేష్టితః
క్షీరాబ్ధిః సర్వతో విప్రాః పుష్కరాఖ్యేన వేష్టితః
ద్వీపేన శాక ద్వీపాత్తు ద్విగుణేన సమంతతః
పుష్కరే సవనస్యాపి మహావీతోభవత్సుతః
ధాతకిశ్చ తయో స్త్వద్వ ద్ద్యే వర్షేనామసంజ్ఞితే
మహావీతం తథైవాన్య ద్ధాతకీఖండసంజ్ఞితమ్
ఏకశ్చాత్ర మహాభాగాః ప్రఖ్యాతో వర్షపర్వతః
మానసోత్తరసంజ్ఞోవై మధ్యతో వలయాకృతిః
యోజనానాం సమస్రాణి ఊర్ధ్వం పంచాశ దుచ్ఛ్రితః
తావదేవ చ విస్తీర్ణః సర్వతః పరిమండల
పుష్కరద్వీపవలయం మధ్యేన విభజన్నివ
స్థితోసౌ తేన విచ్ఛిన్నం జాతం పర్షద్వయం హి తత్
వలయాకారమే కైకం తయో ర్మధ్యే మహాగిరిః
దశవర్ష సహస్రాణి తత్ర జీవంతి మానవాః
శాక ద్వీపము అదే ప్రమాణము గల క్షీరాభ్దిచే నావరింప బడి యున్నది. క్షీరాభ్ది పుష్కర ద్వీప సమావృతము, శాక ద్వీపము కంటె రెట్టింపు ప్రమాణము కలది పుష్కరము. పుష్కర ద్వీప మందు సవనుని కుమారులు మహావీతుడు, ధాతకి యను వారు. వారి పేర వర్షములు రెండు. ఇక్కడ వర్ష పర్వతము మానసోత్తర మనున దొక్కటియే. అది యీ ద్వీపము నడుమ వలయా కారమున నున్నది. ఏబదివేల యోజనముల యెత్తు, అంతే వెడల్పు గలది. అది పుష్కర ద్వీప మండలమును నడిమికి రెండు భాగములు సేయు చున్న ట్లున్నది. దాని మూలమునే యీ ద్వీపము రెండు వర్షములుగా విభక్త మైనది. అవి వలయా కారములు. వాని నడుమ పెద్ద గిరి కలదు. అచటి జనులు పది వేలెండ్లు జీవింతురు.
నిరామయా విశోకాశ్చ రాగద్వేషవివర్జితాః
అధమో త్తమౌ న తే ష్వాస్తాం న వధ్యవధకౌ ద్విజాః
నేర్ష్యాసూయా భయం రోషో దోషో లోభాదికం నచ
మహావీతం బహి ర్వర్షం ధాతకీఖండ షుంతతః
మానసోత్తర శైలస్య దేవ దైత్యాది సేవితమ్
సత్యానృతే న తత్రాస్తాం ద్వేపే పుష్కర సంజ్ఞితే
న తత్ర నద్యః శైలా వా ధ్వీపే వర్షద్వయాన్వితే
వారు రాగద్వేష శోకములు లేనివారు. ఆరోగ్య వంతులు వారిలో అధమోత్తమ భేదము లేదు. చంపువాడు చంపబడు వాడును లేరు. ఈర్ష్యాసూయ లెరుగరు, భయము రోషము దోషము లోభము శూన్యములు. మానసోత్తర పర్వతమునకు మహావీత ఖండము వెలుపలిది. ధాతకీ ఖండము లోపలిది. దేవదైత్యులు వసింతురు. ఈ వర్ష ద్వయమున పుష్కర ద్వీపమందు సత్యా నృతము (వాణిజ్యము) లేవు. నదులు లేవు కొండలు లేవు. ద్వీపములు లేవు.
తుల్యవేషాస్తు మనుజా దేవైస్తత్త్రైకరూపిణః
వర్ణాశ్రమాచారహీనం ధర్మాహరణ వర్టితమ్
త్రయీవార్తాదండనీతిశుశ్రూషారహితం చ తత్
వర్షద్వయం తతో విప్రా భౌమస్వర్గోయ ముత్తమః
సర్వస్య సుఖదః కాలో జరారోగవివర్జితః
పుష్కరే ధాతకీఖండో మహావీతేచ వై ద్విజాః
న్యగ్రోధః పుష్కరద్వీపే బ్రహ్మణః స్థాన ముత్తమమ్
తస్మి న్నివసతి బ్రహ్మా పూజ్యమానః సురాసురైః
స్వాదూదకేన దధినా పుష్కరః పరివేష్టిత
సమేన పుష్కర స్వైవ విస్తరా న్మండలా త్తథా
మనుష్య లందరి వేష మొక్కటే. వారు దేవసమ రూపులు. అట వర్ణా శ్రమాచా రధర్మవి చక్షణ లేదు. వేదత్రయము వార్త దండనీతి శుశ్రూష యనునవి లేనేలేవు. ఈవర్ష ద్యయము భూలోక స్వర్గమే. కాలము జరా రోగములు లేక సర్వ సుఖప్రద మగును ఈరెండు ఖండము లందు పుష్కర ద్వీప మందు న్యగ్రోధ (మఱ్ఱి) మహా వృక్షము బ్రహ్మ యుండు స్థానము. బ్రహ్మ యచట సురాసురులచే పూజింప బడుచుండును. తియ్యని నీటి సముద్రముచే నది చుట్టు కొన్నది. దాని ప్రమాణము పుష్కర ద్వీప సమానము.
ఏవం ద్వీపాః సముద్రైస్తు సప్త సప్తభి రావృతాః
ద్వీపశ్చైవ సముద్రశ్చ సమానౌ ద్విగుణౌ పరౌ
పయాంసి సర్వదా సర్వసముద్రేషు సమానివై
న్యూనాతితిక్తతా తేషాం కదాచి న్నైవ జాయతే
స్థాలీస్థ మగ్నిసంయోగా దుద్రేకి సలిలం యథా
తథేందువృద్ధౌ సలిల మంభోధౌ మునిసత్తమాః
ఆన్యూనానతిరిక్తాశ్చ వర్ధం త్యాపో హ్రసంతి చ
ఉదయాస్తమనే త్విందోః పక్షయోః శుక్లకృష్ణయోః
దశోత్తరాణి పంచైవ అంగుళానాం శతానిచ
అపాం వృద్ధిక్షయౌ దృష్టౌ సాముద్రీణాం ద్విజోత్తమాః
భోజనం పుష్కరద్విపే తత్ర స్వయ ముపస్థితమ్
భుంజంతి వడ్రసం విప్రాః ప్రజాః సర్వాస్సదైవహి
ఇట్లు ద్వీపము లేడును సముద్రము లేడింటిచే నావరింప బడి యున్నవి. ద్వీపము లన్నియు సమ ప్రమాణములు. సముద్రము లన్నియు వానికి రెట్టింపు ప్రమాణము గలవి. అన్ని సాగరము లందలి నీరు నెల్లప్పుడును నమము. హెచ్చు తగ్గులు లేవు. నిప్పుచే గిన్నెలో నీరు పొంగినట్లు, చంద్రుని వృద్ధి ననుసరించి అందలి నీరు పొంగును. ఆపొంగు క్రుంగు కూడ నన్నిట సమానమే. అన్ని సాగరములు సమముగ పొంగును తగ్గును. శుక్ల కృష్ణ పక్షము లందు చంద్రోదయాస్త మయము లందు పదునైదు అంగుళములు పొంగుచు క్రుంగుచు నండును. పుష్కర ద్వీప వాసు లందరు నన్ని వేళల స్వయం సంప్రాప్తమైన షడ్రసోపేత భోజనము సేయు చుందురు.
స్వాదూదకస్య పరితో దృశ్యతే లోకసంస్థితిః
ద్విగుణా కాంచనీ భూమిః సర్వజంతువివర్జితా
లోకాలోకస్తత శ్శైలో యోజనాయుతవిస్తృతః
ఉచ్ఛ్రయేణాపి తావంతి సహస్రాణ్యవరోహిసః
తత స్తమః సమావృత్య తం శైలం సర్వతఃస్థితమ్
తమశ్చాండ కటాహేన నమంతా త్పరివేష్టితమ్
పంచాశత్కోటివిస్తారా సేయ ముర్వీ ద్విజోత్తమాః
సహైవాండ కటాహేన సద్వీపా సమహీధరా
సేయం ధాత్రీ విధాత్రీ చ సర్వభూతగుణాధికా
ఆధారభూతా జగతాం సర్వేషాం సా ద్విజో తమాః
స్వాదూదక (మంచి నీటి) సముద్రము చుట్టు లోక మున్నది, దానికి రెట్టింపు బంగారు భూమి, జంతు రహితము. ఆ మీద లోకాలోక పర్వతము పదివేల యోజనములు విరి వైనది, అంతే యెత్తును అంతే లోతు గలది. ఆ శైలము నావరించి చీకటి యున్నది. ఆ చీకటి ఆండకటాహ మంతట నావరించి యున్నది. ఇంత వరకు గల యీ భూమి యేబది కోట్ల యోజనముల ప్రమాణము గలది. బ్రహ్మాండ కటాహముతో ద్వీపములతో పర్వతములతో నీ ధాత్రి విధాత్రి (సృష్టి హేతువు) యై సర్వ భూతములలో గుణాధిక్యము గల దై సర్వ జగదా ధారమై యున్నది.
Summary of chapter 20 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The various hells (narakas) and their specific torments are systematically described. Each hell is named and the sins that lead a soul there are enumerated — from violence against living beings to violations of sacred duties. The agents of Yama administer appropriate punishments, and the chapter serves as a vivid moral teaching on the consequences of adharma.