బ్రహ్మ మహా పురాణము
13 - పురు వంశ వర్ణనమ్
బ్రాహ్మణులు:
పూరోర్వంశం వయం సూత శ్రోతుమిచ్ఛామ తత్త్వతః ద్రుహ్య స్యానో ర్యదోశ్చైవ తుర్వసోశ్చపృధక్పృధక్
బ్రాహ్మణులు:
సూత! పురు వంశమును, ద్రుహ్యుడు అనువు యదువు తుర్వసుడు నను వారి వంశములను వేర వేర వినవల తునుని కోరుచున్నాము.
లోమహర్షణుడు:
శృణుధ్వం మునిశార్దూలాః పూరో ర్వంశం మహాత్మనః విస్తరేణాను పూర్వ్యాచ్చ ప్రథమం వదతోమమ
లోమహర్షణుడు:
ముని పుంగవులరా! మొదట మహాత్ముడైన పూరువు వంశమును గూర్చి మొదటి నుండి విస్తారముగా జెప్పు చున్నాను. వినుడు.
పూరోః పుత్ర స్సువీరోభూ న్మనన్యు స్తస్య చాత్మజః రాజా చాభయదో నామ మనస్యో రభవత్సుతః
తథై వాభయదస్యాసీ త్సుధన్యా నామ పార్ధివః సుధన్వనః సుబాహుశ్చ రౌద్రాశ్వ స్తస్య చాత్మజః
రౌద్రాశ్వస్య దశార్ణేయః కృకణేయు స్తధైవ చ కక్షేయుః స్థండిలేయుశ్చ సన్నతేయ స్తథైవచ
ఋచేయుశ్చ జలేయుశ్చ స్థలేయుశ్చ మహాబలః ధనేయుశ్చ వనేయుశ్చ పుత్రకాశ్చ దశఃస్త్రియః
భద్రా శూద్రా చ మద్రా చ శలదా మలదా తధా ఖలదా చ తతో విప్రా సలదా సురసాపి చ
తధా గోచపలాచ స్త్రి రత్నకూటా చ తా దశ ఋషిర్జాతోత్రివంశే చ తాసాం భర్తాప్రభాకరః
పూరువు కుమారుడు సువీరుడు, వానికి మనుస్యుడు, వానికి అభయదుడు. వానికి సుధన్వుడు, వానికి సుబాహువు, వానికి రౌద్రాశ్వుడు, రౌద్రాశ్వునకు దశార్ణేయుడు, కృకణేయువు, కక్షేయువు, స్థండిలేయువు, నన్నతేయువు, ఋచేయువు, జలేయువు, బలశాలి యగు స్థలేయువు, ధనేయువు, వనేయువు నను పది మంది గల్గిరి. మరియు భద్ర, శూద్ర, మద్ర, శలద, మలద, ఖలద, నలద, సురస, గోచవల, స్త్రిరత్నకూట యను పది మంది కుమార్తెలు జనించిరి. అత్రి వంశ మందు దయించిన ప్రభాకరుడను ఋషి వారందరకు భర్త యయ్యెను.
భద్రాయాం జనయామాస సుతం సోమం యశస్వినమ్ స్వర్భానునా హతే సూర్యే పతమానే దివో మహీమ్
తమోభిభూతే లోకే చ ప్రభా యేన ప్రవర్తితా స్వస్తి తేస్త్వితి చోక్త్వా వై పతమానో దివాకరః వచనాత్తస్య విప్రర్షేర్న పపాత దివో మహీమ్ అత్రి శ్రేష్ఠాని గోత్రాణి యశ్చకార మహాతపాః
యజ్ఞేష్వత్రే ర్బలం చైవ దేవై ర్యస్య ప్రతిష్ఞితమ్ స తాసు జనయామాస పుత్రికా స్త్వాత్మకామజాన్
దశపుత్రాన్మ హాసత్త్వాం స్తప స్యుగ్రే రతాం స్తధా తేతు గోత్రకరా విప్రా ఋషమో వేదపారగాః
అతడు భద్ర యందు యశస్వియగు సోముని గనెను. సూర్యుడు రాహువుచే నిహతుడై (గ్రహణ మందు) యాకాశము నుండి పడి పోవుచున్న తఱి, లోక మంధకార బంధురమైన యెడ యీ ప్రభాకరుని వలననే వెలుగేర్పడెను. నీకు స్వస్తి (శుభము) గలుగు గాక యని ప్రభాకరు డన్నంత, సూర్యు డంతరిక్షము నుండి క్రిందికింబడ డయ్యెను. ప్రభాకరుడత్రి ప్రధానము లయిన అత్రేయస గోత్రములకు కర్తయయ్యె. యజ్ఞము లందత్రికి బలము దేవతలచే కల్పింప బడెను. (ఇప్పటికిని యజ్ఞ సదస్సు నందాత్రేయన గోత్రుల కగ్రపూజ యిచ్చుట సంప్రదాయ సిద్ధ మైనది.) ప్రభాకరుడా పది మంది పత్నుల యందు పది మంది కుమారులను వేద పారగులను గోత్ర కర్తలను గాంచెను. వారు స్వస్త్యాత్రేయ లనుపేర ప్రఖ్యాతి గనిరి.
స్వస్త్యాత్రేయా ఇతి ఖ్యాతాః కించ త్రిధనవర్జితాః కక్షెయో స్తనయాస్త్వాసంస్త్రయ ఏవ మహారధాః
నభానర శ్చాక్షుపశ్చ పరమన్యు స్తదైవ చ సభాసరస్య పుత్రస్తువిద్వా న్కాలానలో నృపః
కాలానలస్య ధర్మజ్ఞః సృంజయో నామ వై సుతః సృంజయ స్యాభవ త్పుత్రో వీరో రాజా పురంజయః
జనమేజయో మునిశ్రేష్టాః పురంజయనుతోభవత్ జనమేజయస్య రాజర్షే ర్మహాశాలోభవత్సుతః
దేవేషు న పరిజ్ఞాతాః ప్రతిష్ఠిత యశా భువి మహా మనా నామ సుతొ మహాశాలస్య విశ్రుతః
జజ్ఞే వీరః సురగణౖః పూజితః సుమహామనాః మహామనాస్తు పుత్రౌ ద్వౌ జనయామాస భోద్విజాః
ఉశీనరం చ ధర్మజ్ఞం తితిక్షుం చ మహాబలమ్ ఉశీనరస్య పత్న్యస్తు పంచరాజర్షివంశజాః
నృగా కృమిర్నవా దర్వా పంచమీ చ దృషద్వతీ ఉశీనరస్య పుత్రాస్తు పంచ తాసు కులోద్వహాః
తపసా చైవ మహతా జాతా వృద్ధస్య చాత్మజాః నృగాయాస్తు నృగః పుత్రః కృమ్యాం కృమిరజాయత
నవాయాస్తు నవః పుత్రో దర్వాయా స్సువ్రతోభవత్ దృషద్వత్యాస్తు సంజజ్ఞె శిబి రౌశీనరో నృపః
శిబేస్తు శిబియో విప్రా యోధోయస్తు నృగస్య హ నవస్య నవరాష్ట్రంతు కృమేస్తు కృమిలాపురీ
సువ్రతస్య తథాంబష్టాః, శిబిపుత్రా న్నిబోధత శిబేస్తు శిబయః పుత్రా శ్చత్వారో లోకవిశ్రుతాః
వృషదర్భః సువీరశ్చ కేకయో మద్రక స్తధా తేషాం జనపదాః స్ఫీతా కేకయా మద్రకా స్తధా
వృషదర్భాః సువీరాశ్చ తితిక్షోస్తు ప్రజా స్త్విమాః తితిక్షు రభవ ద్రాజా పూర్వస్యాం దిశి భో ద్విజాః
త్రివిధ ధన శూన్యులు. (సూర్యుడు పడిపోవుట జూచి ఆత్రేయుడగు ప్రభాకరు డాయనకు స్వస్తి యగుగాక యన్నందున నా గోత్రము వారికీ బిరిదు వచ్చిన దన్న మాట) కక్షేయుని కుమారులు మువ్వురు. మహారధులు సభానరుడు, చాక్షుషువు, పరమన్యువు ననువారు. సభానరుని కుమారుడు విద్యాంసుడగు కాలానలుడు. వాని కుమారుడు ధర్మజ్ఞుడగు సృంజయుడు వాని పుత్రుడు వీరుడు, మహా రాజునగు పురంజయుడు వాని కుమారుడు జనమేజయుడు. మహాశాలుడు జనమేజయిని పుత్రుడు. మహాశాలుడు దేవతలలో విఖ్యాతుడు. సుప్రతిష్ట గన్నవాడు, నయ్యెను. మహాశాలుని కుమారుడు మహామనుడు దేవ పూజితుడు. మిక్కిలి గొప్ప మనస్సు గలవాడు. ఆయన కొడుకులు ధర్మజ్ఞుడగు ఉశీనరుడు, మహా బలశాలి యగు తితిక్షుడు నను వారిద్దరు. ఉశీనరుని పత్ను నైదుగురు. రాజర్షి వంశము వారు. నృగ, కృమి, నవ, దర్వ, దృషద్వతి యనువారు. వారి యందు ఉశీనరునకు వార్ధక దశలో తపః ప్రభావముచే కులోద్వహులైన కుమారు లైదుగురు. నృగకు నృగుడు, కృమకి కృమి, నవకు నవుడు, దర్వకు సువ్రతుడు, దృషద్వతికి శిబియనుజౌశినర ప్రభువు జన్మించిరి. శిబికి శిబులయుడను నల్గురు కొడుకులు నృగునికి యౌధేయులు గల్గిరి. నవునిది నవయను రాష్ట్రము. కృమిది కృమిలాపురి, సువ్రతుని కంబష్టులు గల్గురి. శిబ యొక్క నల్గురు కుమారులు వృషదర్భుడు, సువీరుడు, కేకయుడు, మద్రకుడునను వారు, వారిదేళములు సర్వ సంవత్స మృద్ధములగు కేకయములు, మద్రకములు వృషదార్భములు సువీరములు నను ప్రసిద్ధి నందినవి. తితిక్షువు పూర్వ దిక్కునకు రాజయ్యెను.
ఉషద్రధొ మహావీర్యః ఫేన స్తస్య సుతోభవత్ ఫేనస్య సుతపా జజ్ఞే తతః సుతపసో బలిః
జాతో మానుష యోనౌ తు సరాజా కాంచనేషుథిః మహాయోగీ సతు బలి ర్బభూవ నృపతిః పురా
పుత్రా నుత్పాదయామాన పంచ వంశకరా న్భువి ఆంగః ప్రధమతో జజ్ఞే వంగః సూహ్య స్తథైవ చ
పుండ్రః కలింగశ్చ తథా బాలేయం క్షత్రముచ్యతే బాలేయా బ్రాహ్మణాశ్చైవ తస్య వంశకరా భువి
బలేశ్చ బ్రహ్మణా దత్తో వరః ప్రీతేన భో ద్విజాః మహాయోగిత్వమాయుశ్చ కల్పస్య పరిమాణతః
బలే! చాప్రతిమత్వం వై ధర్మతత్వార్ధ దర్శనమ్ సంగ్రామే చాప్యజేయత్వం ధర్మే చైవ ప్రధానతామ్
త్రైలోక్య దర్శనం చాపి ప్రాధాన్యం ప్రసవే తథా చతురో నియతా స్వర్ణాం స్త్వం చ స్థాపయితేతిచ
ఇత్యుక్తొ విభునా రాజా బలిః శాంతిం హాం యయౌ కాలేన మహతా విప్రాః స్వం చ స్థాన ముపాగమత్
తేషాం జనపదాః పంచ అంగా వంగా ససుహ్మకాః కాళీంగాః వుండ్రకాశ్చైవ ప్రజా స్త్వంగస్య సాంప్రతమ్
అంగపుత్రో మహానాశీ ద్రాజేంద్రో దధివాహనః దధివాహన పుత్రస్తు రాజా దినిరథోభవత్
పుత్రో దివిరథస్యాసీచ్ఛ క్రతుల్య పరాక్రమః విద్వా న్ధర్మరథో నామ తస్య చిత్రరథః సుతః
తేన ధర్మరథేనాథ తదా కాలంజరే గిరౌ యజతా సహ శక్రేణ సోమః పీతో మహాత్మనా
అథ చిత్రరథస్యాపి పుత్రో దశరథోభవత్ లోమపాద ఇతిఖ్యాతో యస్య శాంతా సుతాభవత్
తస్య దాశరధి ర్వీరళ్చతురంగో మహాయశాః ఋష్యశృంగప్రసాదేన జజ్ఞే వంశవివర్ధవః
తితిక్షుని కుమారుడు ఉషద్రధుడు. వాని కుమారుడు ఫేనుడు, వానికి సుతవుడు వానికి బలి కలిగిరి. బలి మనుష్య జన్మ మెత్తెను. అతడు బంగారపు తూణీరము (అమ్ముల పొది) గలవాడు. మహా యోగియై రాజ్య మేలెను. వంశోద్దారకులగు నైదుగురు కుమారులను భూమి యందు గనెను. వారు అంగుడు, వంగుడు, సుహ్ముడు, పుండ్రుడు, కళింగుడు ననువారు, వారి పరంపర బాలేయ మనుపేర క్షత్ర వంశము ప్రసిద్ధి గాంచెను. లేయాలను, బ్రాహ్మణులను, బలి వంశోద్ధారకులును, గూడ నైరట. బ్రాహ్మ సంతోషించిన వాడై బలికి మహా యోగిత్వము కల్ప పూర్ణాయువు, ధర్మతత్తార్ధ మెఱుంగుడి సాటి లేని బలమును సంగ్రామ మంద జేయత్వము ధర్మ ప్రాధాన్యము, తైలోక్య దర్శనము, సంతాన ప్రాధాన్యము చాతుర్వర్ణ్య వ్యవస్థాపనము నను లక్షణములను వరముగ నొసంగెను; ఇందు వలన బలి పరమ శాంతి వడసెను. కాలక్రమమున నతడు స్వస్థానమును (పాతాళమును) చేరెను. అంగాదుల పేర నాయా దేశములు ప్రసిద్ధినంది యున్నవి. అంగుని కొడుకు దధివాహనుడు. వాని కొడుకు దివిరధుడు. వాని పుత్రుడు ఇంద్రతుల్య పరాక్రముడు విద్వాంసుడు నగు ధర్మరధుడు వాని పుత్రుడు చిత్రరథుడు, ధర్మరథుడు కొలం జరాద్రిపై యజ్ఞము చేసి యింద్రునితో గూడి సోమ పానము జేసెను. చిత్రరథుని తనయుడు దశరధుడు, లోమ పాదుడను ఖ్యాతి నందెను. ఆయన కూతురు శాంత. ఆ దశరధునికి శాంతా భర్తయైన ఋష్యశృంగుని యనుగ్రహముచే చతురంగు డనువాడు వంశోద్ధారకుడై జనించెను.
చతురంగస్య పుత్రస్తు పృథులాక్ష ఇతి స్మృతః పృథులాక్షసుతో రాజా చంపో నామ మహాయశాః
చంపస్య తు పురీ చంపా యా మాలిన్యభవత్పురా పూర్ణభద్రప్రసాదేన హర్యంగోస్య సుతోభవత్
తతో వైభాండకి స్తస్య వారణం శక్రవారణమ్ అవతార యామాస మహీం మంత్రై ర్వాహనముత్తమమ్
హర్యంగస్య సుత స్తస్య రాజా భద్రరథః స్మృతః పుత్రో భద్రరథస్యాసీ ద్భృహత్కర్మా ప్రజేశ్వరః
బృహద్దర్భః సుత స్తస్య యస్మాజ్షజ్ఞే బృహన్మనాః బృహన్మనాస్తు రాజేంద్రో జనయామాస వైసుతమ్
నామ్నా జయద్రథం నామ యస్మా ద్డృఢరథోనృపః ఆసీద్దృఢరథస్యాపి విశ్వజి జ్జనమేజయీ
దాయాద స్తస్య వై కర్ణో వికర్ణ స్తస్య చాత్మజః తస్య పుత్రశతం త్వాసీ దంగానాం కులవర్ధనమ్
ఏతేంగవంశజాః సర్వే రాజానః కీ ర్తితా మయా సత్యవ్రతా మహాత్మానః ప్రజావంతో మహారథాః
ఋచేయోస్తు మునిశ్రేష్టా రౌద్రాశ్వతనయస్య వై శృణుధ్వం సంప్ర వక్ష్యామి వంశం రాజ్ఞస్తుభోద్విజాః
చతురంగునికి పృధులాక్షుడు, వానికి చంపుడు గలిగెను (ఈతని రాజధానియే చంపాపురి. ఇంతకు మున్నీ నగరము ‘మాలిని’ యన బడెను.) అతనికి పూర్ణభ్రదుని ప్రసాదమున హర్యంగుడు గల్గెను. వైభాండకి (ఋష్య శృంగముని) మంత్రములతో నింద్రుని ఉత్తమ వాహనమైన ఐరావతమును ఆ హర్యంగుని యేనుగుగా భూమికి దింపెను. హర్యంగుని తనయుడు ఛద్రరధుడను రాజు. వాని కోడుకు బృహత్కర్మ యను నరేంద్రుడు, వాని పుత్రుడు బృహద్దర్భుడు వాని తనయుడు బృహన్మనుడు, రాజేంద్రుడగు వాని కుమారుడు జయద్రధుడు వాని పుత్రుడు దృఢరథ మహారాజు, వాని సుతుడు విశ్వ జిత్తయిన జనమేజయుడు. వాని కుమారుడు వైకర్ణుడు. వాని పుత్రుడు వికర్ణుడు వానికి నూర్గురు కొడుకులు గల్గిరి. వారంగవంశ వర్ధనులు, ఆంగ వంశరాజుల నందరిని తెల్పి యుంటిని, వారందరు సత్యవ్రతులు, మహత్ములు, సంతాన వంతులు, మహారదులు, రౌద్రాశ్వ తనయుడైన ఋచేయుని వంశమిక వర్ణించెద, వినుడు.
ఋచేయో స్తనయో రాజా మలినారో మహీపతిః
మతినారసుతా స్త్వాసం స్త్రయః పరమధార్మికాః
వసురోధః ప్రతిరథః సుబాషుశ్చైవ ధార్మికః సర్వే వేదవిదశ్చైవ బ్రహ్మణ్యాః సత్యవాధివః
ఇలా నామ తు యస్యాసీత్కన్యావై మునిసత్తమాః బ్రహ్మవాదీ న్యపిస్త్రీ సాతంసు స్తామభ్యగచ్ఛత
తంసోః సుతోథ రాజర్షి ర్ధర్మనేత్రః ప్రతాపవాన్ బ్రహ్మవాదీ పరాక్రాంత స్తస్య భార్యోపదానవీ
ఉపదానవీ తతః పుత్రాం శ్చతురోజనయ చ్ఛుభాన్ దుష్యంతమథ సుష్మంతం ప్రవీర మనఘం తథా
ఋచేయుని తనయుడు మతినారుడు, వాని కొడుకులు పరమ ధార్మికులు ముగ్గురు. వసురోధుడు, సుబాహువు అనువారు. అందరు వేదవిదులు, బ్రహ్మణ్యులు, సత్యసంగరులు, మతినారుని కూతురు ఇల ఆమె స్త్రీయయ్యు బ్రహ్మ వాదిని యయ్యె. ఆమె తంసుని భార్య. వారి కొడుకు రాజర్షి ప్రతాప శాలియైన ధర్మనేత్రుడు అయిన బ్రహ్మావాది, పరాక్రమ వంతుడు అతని భార్య ఉపదాసవి. వారి కుమారులు నల్వురు దుష్యంతుడు, సుష్మంతుడు, ప్రవీరుడు, అనఘడు ననువారు.
దుష్యంతస్య తు దాయాదో భరతో నామ వీర్యవాన్ స సర్వదమనో నామ నాగాయుతబలో మహాన్
చక్రవర్తీ సుతో జజ్ఞే దుష్యంతస్య మహాత్మనః శకుంతలాయాం భరతో యస్య నామ్మా తు భారతాః
భరతస్య వినష్టేషు తనయేషు మహీపతేః మాతౄణాం తు ప్రకోపేన మయా తత్కధితం పురా
బృహస్పతే రంగిరసః పుత్రోవిప్రో మహామునిః అయాజయ ద్భరద్వాజో మహద్భిః క్రతుభిర్విభుః
పూర్వం తు వితధే తస్య కృతే వై పుత్రజన్మని తతోథ వితథో నామ భరద్వాజో త్సుతో భవత్
కతోథ వితథే జాతే భరతస్తు దివం యమౌ వితధం చాభిషి చ్యాధ భరద్యాజో వనం యయౌ
దుష్యంతునికి శకుంతల యందు దయించిన వాఁడు భరతుడు. సర్వదమనుడను ఖ్యాతి నందెను. అతడు పదివేల యేనుగుల బలము గలవాడు. చక్రవర్తి, అయన పేరనే భారత వర్షము ఆందలి ప్రజలు భారతులను పేరును పొందిరి. భరతుని తనయులు మాతృ శాపమున నశించిరి. ఆ కథ మున్న తెలిపితిని. బృహస్పతి (అంగిరస్సు) యొక్క కుమారుడు భరద్వాజుడు భరతునిచే బెక్కు యాగములు చేయించెను. కాని అవి పుత్ర సంతానము విషయములో వితధములు (వ్యర్థములు) కాగా భరద్వాజుని వలన (నియోగము వలన) అతనికి వితథుడను పుత్రుడు కలిఁగెను. వాడు కలిగిన వెంటనే భరతుడు దివమునకు వెళ్ళెను. అతనికి పట్టము గట్టి భరద్వాజుడు వనంబున కేగెను.
స చాపి విత థః పుత్రాన్ జనయామాస పంచవై సుహోత్రంచ సుహోతారం గయం గర్గం తథైవ చ
కపిలంచ మహాత్మానం సుహోత్రస్య సుతద్వయమ్ కాశికంచ మహాసత్యం తథా గృత్సమతిం ప్రభుమ్
తథా గృత్సమతేః పుత్రా బ్రాహ్మణాః క్షత్రియా విశః కాశికస్య తు కాశేయః పుత్రో దీర్ఘ తపా స్తథా
బభూస దీర్ఘతపసో విద్వా న్ధన్వంతిరిః సుతః ధన్వంతరేస్తు తనయః కేతుమానితి విశ్రుతః
తథా కేతుమతః పుత్రో విద్వా న్భీమరథః స్మృతః పుత్రో భీమరధస్యాపి వారాణ స్యధిపో భవత్
దివోదాస ఇతి ఖ్యాతః సర్వక్షత్ర ప్రణాశనః దివోదాసస్య పుత్రస్తు వీరోరాజా ప్రతర్దనః
ప్రతర్దనస్య పుత్రౌ ద్వౌవత్సో భార్గవ ఏవఛ అలర్కో రాజపుత్రస్తు రాజా సన్మతిమాన్‌భువి
హైహయస్య తు దాయాద్యం హృతవా న్వై మహీపతిః ఆజహ్రే పితృదాయాద్యం దివోదాసహృతం బలాత్
భద్రశ్రేణ్యస్య పుత్రేణ దుర్ధమేన మహాత్మానా దివోదాసేన బారేతి ఘృణయా సౌ విసర్జితః
అష్టారధో నామ నృపః సుతో భీమరధస్య వై తేన పుత్రేణ బాలస్య ప్రహృతం తస్య భో ద్విజాః
వైరస్యాం తం మునిశ్రేష్ఠాః క్షత్రియేణ విధిత్సతా
వితధునికి అయిదుగురు సుతులు గల్గిరి, సుహోత్రుడు, సుహోత, గయుడు, గర్గురు, కపిలుడు ననువారు. సుహోత్రుని కొడుకులు సత్యవాదియగు కాశికుడు, నరపతి యగు గృత్సమతి. గృత్సమతి పుత్రులు బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులును. కాశికుని కుమారుడు (కాశేయుడు) దీర్ఘతపుడు. దీర్ఘతపుని కుమారుడు విద్వాంసుడైన ధన్వంతరి. ఆయన కుమారుడు కేతుమంతుడు వాని కుమారుడు విద్వాంసుడైన భీమరధుడు, వాని కుమారుడు వారణాసి ప్రభువగు దిశోదానుడు, దిశోదాను కొడుకు వ్రతర్ధనుడు వీరుడైన ప్రభువు అతని కుమారులు వత్సడు, బార్గవుడు, వత్స రాజు పుత్రుడగు అలర్కుడను ఠాణు బుద్ధిమంతుడు. హైహయుని దాయాద్యమును (రాజ్యమును) హరించెను అంతియ గాక దివోదానుడు హరించిన పితృ రాజ్యమును తిరిగి సంపాదించు కొనెను.
అలర్క కాశిరాజస్తు బ్రహ్మణ్యః సత్యసంగరః
షష్టిం వర్షసహస్రాణి షష్టిం వర్షశతాని చ యువా రూపేణ సంపన్న ఆసీ త్కాశికులోద్వహః
లోబాముద్రాప్రసాదేన పరమాయు రవాప సః వయసోంతే మునిశ్రేష్ఠా హత్వా క్షేమకరాక్షసమ్
రమ్యాం నివేశయామాస పురీం వారణసీం నృపః అలర్కస్య తుదాయాదః క్షేమకోనామ పార్ధివః
క్షేమకస్య తు పుత్రోవై వర్షకేతు స్తతో భవత్ వర్షకేతోశ్చ దాయాదో విభుర్నొమ ప్రజేశ్వరః
ఆనర్తస్తు విభో! పుత్రః సుకుమారస్తతో భవత్ సుకుమారస్య పుత్రస్తు సత్యకేతుర్మహారథః
సుతో భవన్మహాతేజా రాజా పరమధార్మికః వత్సస్య వత్సభూమిస్తు భర్గభూమిస్తు భార్గవాత్
ఏతే త్వంగిరసః పుత్రా జాతా వంశేథ భార్గవే బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ మునిసత్తమాః
అలర్కుడు కాశీ రాజు బ్రహ్మణ్ముడు సత్యసంగరుడు అరువది ఆరు వేలేండ్ల యువకుడై రూప సంపన్నుడై యుండెను. లోపాముద్ర ప్రసాదమున దీర్ఘాయువు నొందినాడు. చివరి వయస్సున క్షేమక రాక్షసుని జంపి రమ్యమైన వారాణసీ నగర నిర్మాణము సేసెను. అలర్కుని కొడుకు క్షేమకుడు వాని సుతుడు వర్షకేతుడు, వాని తనయుడు విభువు. విభుని కొడుకు ఆనర్తుడు. నుకుమారుడు వాని కొడుకు, వాని తనయుడు సత్యకేతువు ధర్మమూర్తి. వత్సునకు వత్సభూమి, భార్గవుని వలన భర్గభూమియు కలిగెను, భార్గవ వంశము నందు అంగిరసుని పుత్రులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు గలరు.
ఆజమీఢో పరో వంశః శ్రూయతాం ద్విజసత్తమాః సుహోత్రస్య బృహ త్పుత్రో బృహత స్తనయాస్తృయః
ఆజమీఢో ద్విమీఢశ్చ పురుమీఢశ్చ వీర్యవాన్ అజమీఢస్య పత్న్యస్తు తిస్రోవై యశసాన్వితాః
నీలీ చ కేశినీ చైవ ధూమినీ చ వరాంగనాః
ఆజమీఢస్య కేశిన్యాం జజ్ఞేజహ్నుః ప్రతాపవాన్
ఆజహ్రే యో మహాసత్రం సర్వమేధమఖం నిభుమ్ పతిలోభేన యం గంగా వినీతేవ ససారహ
నేచ్చతః ప్లావయామాస తస్య గంగా చ తత్సదః తత్తయా ప్లావితం దృష్ట్వా యజ్ఞవాటం సమంతతః
జహ్ను ర ప్యబృవీ ద్గంగాం క్రుద్ధో విప్రాస్తదా నృపః ఏష తే త్రిషు లోకేషు సంక్షిప్యాపః పిబా మ్యహమ్
అస్యగంగే వలే పస్యసద్యః ఫల మవాప్నుహి తతః పీతాం మహాత్మానో దృష్ట్వా గంగాం మహర్షయః ఉపనిన్యు ర్మహాభాగా దుహితృత్వేన జాహ్నవీమ్
యువనాశ్వస్య పుత్రీం తు కావేరీం జహ్నరావహత్ గంగాశాపేన దేహార్ధం యస్యాః పశ్చాన్న దీకృతమ్
జహ్నోస్తు దయితః పుత్రో ఆజకో నామ వీర్యవాన్ ఆజకస్య తు దాయాదో బలాకాశ్వో మహీపతిః
బభూవ మృగయాశీలః కుశికస్తస్య చా త్మజః పహ్లవైః సహ సంపృద్ధో రాజా వసచరైః సహ
కుశికస్తు తపస్తే పే పుత్ర మింద్రసమం విభుమ్ లభేయమితి తం శక్ర స్త్రాసా దభ్యెత్య జజ్ఞీవాన్
స గాధి రభవ ద్రాజా మఘవా కౌశికః స్వయమ్ విశ్వామిత్రస్తు గాధేయో విశ్వామిత్రా త్తథాష్టకః
అష్టకన్య సుతో లౌహిః ప్రోక్తో జహ్నుగణోమయా
బ్రహ్మణోత్తములారా! అజమీడుని వంశము వినబడు గాక! సుహోత్రుని పుత్రుడు బృహన్నామకుడు వాని తనయులు ముగ్గురు. అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు. అజమీఢుని భార్యలు నీలిని, కేశిని, ధూమీని యను వారు. అజమీఢునకు కేశిని యందు ప్రతాప వంతుడగు జహ్నువు కలిగెను, అతడు సర్వమేధ మను మహాసత్ర యాగ మొనరించెను. గంగాదేవి యాయనను భర్తగా రించి వినీతురాలి వలె నభిసరించెను. అతడు యిష్ట పడకున్నంత నాతని యజ్ఞ సదస్సును ముంచెత్తెను. జహ్ను వందులకు కోపించి యిదిగో నీ నీరమును సంక్షేపించి త్రాగెదను చూడుమని త్రాగి వైచెను. ఋషులు చూచి యామె నాతని కుమార్తెగా నొనర్చిరి. యువనాశ్వుని కూతురగు కావేరి నాతడు పరిణయ మయ్యెను. గంగా శాపమున నవ్వల కావేరి యొక్క సగము మేను నదీ రూప మయ్యెను. జహ్నుని తనయుడు అజకుడు, వాని కుమారుడు బలాకాశ్వుడు, వాని సుతుడు మృగయా ప్రియుడు కుశికుడు, అడవి జాతులతో పెరిగి నాడు. అత డింద్రతుల్యు డగు సుతుడు కావలె నని తపము జేసెను. ఇంద్రుడ డలి గాధియను పేరుతో దానే స్వయముగ వాని కుద యించెను. గాధి తనయుడు విశ్వామితుడు, అష్టకుడాతని కొడుకు, వాని కొడుకు తౌహీ, ఇది జహ్ను గణము.
ఆజమిడోవరో వంశః శ్రూయతాం ముని సత్తమాః
అజమీఢాత్తు నీల్యాం వై సుశాంతి రుదపద్యత పురుజాతిః సుశాంతేశ్చ బాహ్యాశ్వః పురుజాతితః
బాహ్యాశ్వతనయాః పంచ స్ఫీతా జనపదావృతాః ముద్గలః సృంజయశ్చైవ రాజా బృహదిషు న్తథా
యవీనరశ్చ విక్రాంత కృమిలాశ్వశ్చ పంచమః పంచైతే రక్షణా యాలం దేశానా మితి విశ్రుతాః
పంచానాం తే తు పంచాలాః స్ఫీతా జనపదావృతాః అలం సంరక్షణే తేషాం పంచాలా ఇతి విశ్రుతాః
అజమిఢుని రెండవ వంశము. అజమీఢునికి నీలి యందు సుశాంతి పుట్టెను. వానికి పురుజాతి, వానికి వాహ్యాశ్వుడు వానికి అయిదుగురు కల్గిరి. ముద్గలుడు సృంజయుడు, బృహదిషు రాజు. పరాక్రమ శాలి యగు యువీనరుడు, కృమిలాశ్వుడు. ఈ అయుదుగురు దేశములను రక్షింప జాలుదురు. అని ప్రసిద్ధి.
ముద్గలస్య తు దాయాదో మౌద్గల్యః సు మహాయశాః ఇంద్రసేనా యతో గర్భం బ్రధ్నశ్వం ప్రత్యపద్యత
అసీ త్పంచజనః పుత్రః సృంజయస్య మహాత్మనః సుతః పంచజనస్యాపి సోమదత్తో మహీపతిః
సోమదత్తస్య దాయాదః సహదేవో మహాయశాః
సహదేవసుతశ్చాపి స్ణోమకో నామ విశ్రుతః
అజమీఢనుతో జాతః క్షీణే వంశే తు సోమకః సోమకస్య సుతో జంతు ర్యస్య పుత్రశతం బభౌ
తేషాం యవీయా స్పృషతో ద్రుపదస్య పితా ప్రభుః అజమీఢాః స్మృతాశ్చైతే మహాత్మానస్తు సోమకాః
ముద్గలుని దాయాదుడు మౌద్గల్యుడు, ఆయన వలన ఇంద్రసేన బ్రధ్నశ్వుడును కోమరుం గన్నది. సృంజయుని కుమారుడు పంచజనుడను వాడు. వాని కొడుకు సోమదత్తుడు. వాని కొడుకు కీర్తిశాలి సహదేవుడు. వాని పుత్రుడు సోమకుడు. అజమీడు వంశము యొక్క క్షీణదశలో సోమకుడు పుట్టెను. వాని కొడుకు జంతువు. వానికి నూర్గురు కుమారులు. వారిలో చిన్నవాడు వృషతుండు. వాని కొడుకు ద్రుపదుడు. ఇంత వరకు అజమీఢ వంశము. వారు సోమకులను పేరుతో ప్రఖ్యాతి గనిరి.
మహిషీ త్వజమీఢస్య ధూమినీపుత్ర గర్ధినీ పతివ్రతా మహాభాగా కులజా మునిసత్తమాః
సా చ పుత్రార్థినీ దేవీ వ్రతచర్యాస మన్వితా తతో వర్షాయుతం తప్త్వా తపః పరమదుశ్చరమ్
హుత్వాగ్నిం విధివ త్సాతు పవిత్రా మితభోజనా అగ్నిహోత్ర కుశేష్వేవ సుష్వాప మునిసత్తమాః
మునిశ్రేష్టులారా! అజమాఢుని మహిషి ధూమిని పతివ్రత. వ్రతాచరణ పరాయణ. సంతతికై పదివేలేండ్లు దుశ్చరమైన తప మాచరించి అగ్ని హోత్రము సేయుచు మిత భోజనయై అగ్నిహోత్ర సమీప దర్భలందు శయించెను.
ధూమిన్యా స తయా దేవ్యా త్వజమీఢః సమీయివాన్ ఋక్షా సంజనయామాస ధూమ్రవర్ణం సుదర్శనమ్
ఋక్షా త్సంవరణో జజ్ఞే కురుః సంవరణాత్తథా యః ప్రయాగా దతిక్రమ్య కురుక్షేత్రం చకార హ
పుణ్యం చ రమణీయం చ పుణ్య కృద్భి ర్ని షేవితమ్ తస్యాస్వవాయః సుషుహా న్యస్య నామ్నాథ కౌరవాః
కురోశ్చ పుత్రా శ్చత్వారః సుథన్వా సుథను స్తథా పరీక్షిచ్చ మహాబాహుః ప్రవరశ్చారిమేజయః
పరీక్షితస్తు దాయాదో ధార్మికో జనమేజయః శ్రుతసేనో గ్రనేనశ్చ భీమసేనశ్చ నామతః
ఏతే సర్వే మహాభాగా విక్రాంతా బలశాలినః జనమేజయస్య పుత్రస్తు సురధో మతిమాం స్తథా
సురథన్య తు విక్రాంతః పుత్రో జజ్ఞే విదూరథః విదూరథస్య దాయాద ఋక్ష ఏవ మహారథః
ద్వితీయస్తు భరద్వాజా న్నామ్నా తేనైన విశ్రుతః ద్వావృక్షౌ సోమవంశేస్మిన్ద్వావేవచ పరీక్షితౌ
భీమసేనా స్త్రయో విప్రా ద్వౌ చాపి జనమేజయౌ
అమెతో అజమీఢుడు నమావేశమంది ధూమ్రవర్ణుడు చక్కని వాడునగు ఋక్షుడను కుమారుని గాంచెను. ఋక్షుని వలన సంవరణుడు వానికి కురువు గల్గెను. అతడు ప్రయాగ నుండి వెళ్ళి కురుక్షేత్రము నిర్మించెను. అది పవిత్రము, రమణీయము, పుణ్య వంతులచె సేవింప బడునది. ఆయన వంశీయులే కౌరువులు. కురుని కుమారులు నల్వురు, సుధన్వుడు, సుధనుడు, పరీక్షిత్తు మహాపరాక్రమ వంతుడగు అరిమేజయుడు. పరీక్షిత్తు కొడుకులు జనమేజయుడు, శ్రుతసేనుడు, అగ్రసేనుడు, భీమసేనుడు, వీరందరు శూరులు, బలశాలురు. జనమేజయుని తనయుడు బుద్ధి శాలియగు సురధుడు. వాని సుతుడు విదూరథుడు, వాని కొడుకు మహారథుడగు ఋక్షుడు. రెండవ వాడు భరధ్వాజుని వలన నదే పేర ప్రఖ్యాతి వడెసెను. సోమ వంశ మందిద్దరు ఋక్షులు, ఇద్దరు పరీక్షిత్తులు, ముగ్గురు భీమసేనులు, ఇద్దరు జనమేజయులు గల్గిరి.
ఋక్షస్య తు ద్వితీయస్య భీమసేనోభవ త్సుతః
ప్రతీపో భీమసేనాత్తు ప్రతీపస్య తు శాంతనుః దేపాపి ర్బా హ్లికశ్చైవ త్రయ ఏవ మహారథాః
శంతనో స్త్వభప ద్భీష్మ స్తస్మిన్వంశే ద్విజోత్తమాః
రెండవ ఋక్షునికి భీమసేను ముదయించెను, వానికి ప్రతీవుడు. వానికి శాంతనుడు, దేవాపి, బాహ్లీకుడు అను మువ్వురు గల్గిరి. శాంతసునికి భీష్ముడు దయించెను.
బాహ్లికస్య తు రాజర్షే ర్వంశం శృణత భో ద్విజాః
బాహ్లికస్య సుతశ్చైవ సోమదత్తో మహాయశాః జజ్ఞిరే సోమదత్తాత్తు భూరి ర్భూరిశ్రవాః శలః
ఉపాధ్యాయస్తు దేవానాం దేవాపి రభవ న్మునిః చ్యవనపుత్రః కృతక ఇష్ట అసీన్మహాత్మనః
శాంతను స్త్వభవద్రాజా కౌరవాణాం ధురంధరః
బ్రాహ్మణులారా! బాహ్లీకుని వంశము వినుడు. బాహ్లీకునికి కీర్తి శాలియగు సోమదత్తుడు, వానికి భూరిశ్రవుడు శలుడు, దేవాపిముని దేవతుల కుపాధ్యాయు డయ్యె. చ్యవన పుత్రుడు కృతకు డతని కిష్టుడయ్యెను. శాంతనుడు కౌరవ శ్రేష్టుడు రాజయ్యెను.
శంతనోః సంప్రవక్ష్యామి వంశం త్రైలోక్యవిశ్రుతమ్
గాంగం దేవవ్రతం నామ పుత్రం సోజనయత్ప్రభుః సతుభీష్మ ఇతఖ్యాతః పాండవానాం పితామహః
కాళి విచిత్ర వీర్యం తు జనయామాస భోద్విజాః శంతనోర్ధయితం పుత్రం ధర్మాత్మాన మకల్మషమ్
కృష్తద్వెపాయనా చ్చైవ క్షేత్రే వై చిత్రవీర్యకే ధృతరాష్ట్రం చ పాండుం చ విదురం చాప్యజీజనత్
త్రిలోక ప్రసిద్ధమైన శంతను వంశము తెల్పెద. శంతనుని వలన గంగ దేవవ్రతుని గన్నది. అతడే భీష్ముడు. (గాంగేయుడు). పాండవులకు పితా మహుడు. శంతనుని భార్య కాళి విచిత్రు వీర్యుని గాంచెను. విచిత్ర్య వీర్యుని క్షేత్రమందు (భార్య యందు) కృష్ణ ద్వైపాయనుని వలన ద్భతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టిరి.
ధృతరాష్ట్రస్తు గాంధార్యాం పుత్రా నుత్పాదయ చ్ఛతమ్ తేషాం దుర్యోధనః శ్రేష్ఠః సర్వేషామపి స ప్రభుః
పాండో ర్దనంజయః పుత్రః సౌభద్రస్తస్య చాత్మజః అభిమన్యోః పరీక్షిత్తు పితా పారీక్షితస్య హ
పారీక్షితస్య కాశ్యాయాం ద్వౌ పుత్రౌ సంబభూవతుః చంద్రాపీడస్తు నృపతిః సూర్యాపీడశ్చ మోక్షవిత్
చంద్రాపీడస్య పుత్రాణాం శత ముత్త మధన్వినామ్ జానమేజయ మిత్యేవం క్షాత్రం భువి పరిశ్రుతమ్
ధృతరాష్ట్రునికి గాంధారి యందు దుర్యోధనాదులు నూర్గురు గల్గిరి. దుర్యోధనుడు రాజయ్యెను. పాండురాజు కుమారుడు ధనంజయుడు. అయనకు సౌభద్రుడు (సుభద్ర కొడుకు) అభిమన్యుడు. వానికి పరీక్షిత్తు గల్గిరి. పరీక్షిత్తునకు పారిక్షిత్తు (జనమే జయుడు) వానికి కాశి యందు ఇద్దరు సుతులు పుట్టిరి. మహారాజగు చంద్రా పీడుడు, మోక్షజ్ఞుడగు సూర్యా పీడుడు ననువారు. చంద్రా పీడుని కొడుకులు నూర్వురు. మంచి విలుకాండ్రు. జానమేజయ మను పేర నీ క్షత్ర వంశము ప్రసిద్ధి కెక్కినది.
తేషాం జ్యేష్ఠస్తు తత్రాసీ త్పురే వారాణసాహ్వయే సత్యకర్ణో మహాబాహు ర్యజ్వా విపులదక్షిణః
సత్యకర్ణస్య దాయాదః శ్వేతకర్ణః ప్రతాపవాన్ ఆ పుత్రః స తు ధర్మాత్మా ప్రవివేశ తపోవనమ్
తస్మా ద్వనగతా గర్భం యాదవీ ప్రత్యపద్యత సుచారో ర్దుహితా సుభ్రూ ర్మాలినీ గ్రాహమాలినీ
సంభూతే స చ గర్భేచ శ్వేతకర్ణః ప్రజేశ్వరః అన్వ గచ్ఛ త్కృతం పూర్వం మహాప్రస్థాన మచ్యుతమ్
సాతు దృష్ట్యా ప్రియం తం చ మాలినీ పృష్ఠతోన్వగాత్ సుదారోర్దుహితా సాద్వీ వనే రాజీవలోచనా పథి సా సుషువే బాలా సుకుమారం కుమారకమ్
తమపాస్యాథ తత్రైవ రాజానం సాన్వగచ్చత పతివ్రతా మహాభాగా ద్రౌపదీవ పురాసతీ
అందు మొదటి వాడు సత్యకర్ణుడు వారణాసీ నగర మందుండెను. ఈతడు పరాక్రమ శాలి, యజ్వ. విపుల దక్షిణుడు. వాని దాయాదుడు శ్వేతకర్ణుడు. ప్రతాప శాలి. అపుత్రకుడై వనమున కేగెను. అతని వలన వనమున యదు వంశమున పుట్టి నదియు సుచారుని కుమార్తెయు నగు మాలిని (గ్రాహమాలిని) గర్భవతి కాగా శ్వేతకర్ణుడు పూర్వము సంకల్పించిన మహా ప్రస్థానమున కేగెను. మాలినియు ప్రియుని వెంబడించి మార్గ మందు సుకుమారుడైన కుమారుం బ్రసవించెను. అ శిశువు నక్కడనే విడిచి, మహా ప్రస్థానమున పతుల ననుగమించిన ద్రౌపది వలె మహానుభావు రాలగు నామె రాజు ననుగమించెను.
కుమారః సుకుమారోసౌ గిరిపృష్ఠే రురోద హ
దయార్థం తస్య మేఘాస్తు ప్రాదురాస న్మహాత్మనః శ్రవిష్ఠాయాస్తు పుత్రౌ ద్వౌ పైప్పలాదిశ్చ కౌశికః
దృష్ట్వాకృపా న్వితౌ గృహ్య తౌ ప్రాక్షాళయతాం జలే నిఘృష్టౌ తస్య పార్మ్వౌ తు శిలాయాం రుధిరప్లుతౌ
అజశ్యామః స పార్మ్వాభ్యాం ఘృష్టాభ్యాంసుసమాహితః ఆజశ్యామౌతు తత్పార్మ్వౌ దైవేన సంబభూవతుః
అథా జపార్మ్వ ఇతి వై చక్రాతే నామ తస్య తౌ స తు రేమ కశాలాయాం ద్విజాభ్యా మభివర్దితః
రేమకస్య తు భార్యా త ముద్వహ త్పుత్ర కారణాత్ రేమత్యాః స తు పుత్రోభూ ద్ర్మాహ్మణౌ సచివౌతు తౌ
ఆ విడిచి పెట్టిన శిశువు పర్వతమం దేడ్చు చుండగా దయ చూప మేఘములు ఆ మహాత్మునికి నీడ యిచ్చెను. శ్రవిష్ఠా కుమారు లిద్దరు పైప్పలాది కౌశికుడను వారు జాలిగొని యా బాలుని జలము నందు గడిగిరి. అంతకు మున్నేడ్చుచు పాషాణ మందు దొరలిన యా బాలుని రక్తసిక్తమైన శరీరము యిరు పార్శ్వములు మేకవ తెనల్పెక్కినవి. అందువలన నా బాలుని కా మునులు అజపార్శ్వుడు అను నామకరణము గావించిరి. అతడు రేమకుని యింట నిద్దరు బ్రాహ్మణులచే బెంప బడెను. రేమకుని భార్య యతనిని తన పుత్రునిగా నెత్తుకొనగా నామెకతడు కొడు కయ్యెను. అతనికా బ్రాహ్మణులు మంత్రులైరి.
తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ యుగ పత్తుల్యజీవినః స ఏష పౌరవో వంశః పాండవానాం మహాత్మనామ్
శ్లోకోపి చాత్ర గీతోయం నాహుషేణ యయాతినా జరాసంక్రమణే పూర్వం తదా ప్రీతేన ధీమతా
అచంద్రార్క గ్రహా భూమి ర్భవే దియ మసంశయమ్ అపౌరవా మహీ నైవ భవిష్యతి కదాచన
ఏష వః పౌరవో వంశో విఖ్యాతః కధితోమయా
వారిపుత్ర పౌత్రులు సమాన జేవనుతైరి. ఇది పౌర వంశ చరిత్ర. మహానుభావు లైన పాండవుల గథ. ఈ విషయములో పరమ ప్రీతినందిన ధీమంతుడగు నహుష కుమారుడగు యయాతిచే వార్దక దశలో నిట్లొక శ్లోకము గానము చేయ బడినది. ఈ భూమి చంద్రార్క గ్రహ శూన్యమైన కావచ్చును. కాని యెన్నటికి అ పౌరపము కాదు. అనగా పుర వంశాకుర మెన్నటికిని నుండక పోదు. ఇది పౌర వంశచరిత్ర తెలిపితిని.
తుర్వసోస్తు ప్రవక్ష్యామి దృహ్యో శ్చానో ర్యదో స్తథా
తుర్వసోస్తు సుతో వహ్ని ర్గోభాను స్తస్య చాత్మజః గోభానోస్తు సుతో రాజా ఐశాను రసరాజితః
కరంధమస్తు ఐశానో ర్మరుత్త స్తస్య చాత్మజః అన్య స్త్వా విక్షితో రాజా మరుత్తః కథితో మయా
ఇక తుర్వసువు ద్రుహ్యుడు. అనువు యదువు వారి వంశములు చెప్పెద. తుర్వసుని కొడుకు వహ్ని వాని కొడుకు గోభానుడు. అతని కొడుకు ఐశానుడు. ఇతడు పరాజుతడు కానిలాజు వాని కుమారుడు కరంధముడు. వాని పుత్రుడు మరత్తుడు. మఱియొక అవిక్షితుని పుత్రుడగు మరుత్త మహారాజు నాచే వెనుక చెప్పబడెను.
అనపత్యోభవద్రాజా యజ్వా విపుల దక్షిణః దుహితా సంయతా నామ తస్యాసీ త్పృథివీపతేః
దక్షిణార్థం తు సా దత్తా సంవర్తాయ మహాత్మనే దుష్యంతం పౌరవం చాపి లేఖే పుత్ర మకల్మషమ్
ఏవం యయాతి శాపేన జరాసంక్రమణే తదా పౌరవం తుర్వసో ర్వంశం ప్రవివేశ ద్విజోత్తమాః
మరుత్తు విపుల దక్షిణ ములైన యజ్ఞము లాచరించెను. వానికి సంతతి లేదు, సంయతయను కూతురు మాత్రమే గల్గెను. అమె యజ్ఞ దక్షిణగా సంవర్తున కీయ బడినది. అమె దుష్యంతుని కుమారునిం గనెను. ఇట్లు యయాతి శాపముచే తుర్వసుపు వంశము పురు వంశములో చేరెను.
దుష్యంతస్య తు దాయాదః కరూరోమః ప్రజేశ్వరః కరూరోమా దథాహ్లీద శ్చత్వార స్తస్య చాత్మజాః
పాండ్యశ్చ కేరళశ్చైవ కాలశ్చోళశ్చ పార్థివః దృహ్యోశ్చ తనయో రాజ న్బభ్రుసేతు శ్చ పార్దివః
అంగారసేతు స్తత్సుత్రో మరుతాం పతి రుచ్యతే యౌవనాశ్వేన సమరే కృచ్ఛ్రేణ నిహతో బలీ
యుద్ధం సుమహదప్యాసీ న్మాసాన్సరి చరుద్దశ అంగారసేతో ర్దాయాదో గాంధారో నామ పార్థివః
ఖ్యాయతే యస్య నామ్నావై గాంధారవిషయో మహాన్ గాంథారదేశజాశ్చైవ తురగా వాజినాం పరాః
దుష్యంతుని కుమారుడు కరూరోముడను రాజు. వాని కొడుకు అహ్లీదుడు. అతనికి నల్గురు కుమారులు, పాండ్యుడు, కేరశుడు, కాలుడు, చోళరాజు ననువారు. దృహ్యుని కుమారుడు బభ్రుసేతు మహారాజు. అతని కొడుకు అంగార సేతుడు. అతడు మరుత్తులకు రాజు. ఆ వీరుడు యౌవనాశ్యునిచే అతి కష్టముతో యుద్ద మందు గూలచ్చిబడెను. పదునాలుగు మాసములా ఘోర యుద్ధము జరిగెను. అంగార సేతువు కొడుకు గాంధారుడు. అతని పేరనే గాంధారమను దేశము ప్రఖ్యాతి కెక్కెను. గాంధార దేశ మందలి గుఱ్ఱములు ప్రశస్తములు.
అనోస్తుపుత్రోధర్మోభూ ద్ద్యూత స్తస్యాత్మజో భవత్ ద్యూతాద్వనదుహో జజ్ఞే ప్రచేతా స్తస్య చాత్మజః
ప్రచేతసః సుచేతాస్తు కీర్తితా స్తుర్వసోర్మయా బభూవుస్తు యదోః పుత్రాః పంచదేవసుతోపమాః
సహస్రాదః పయోదశ్ఛ క్రోష్టా నీలోంజిక స్తథా సహస్రాదస్య దాయాదా స్త్రయః పరమధార్మికాః
హైహయశ్చ హయశ్చైవ రాజా వేణుహయ స్తథా హైహయ స్యాభవ త్పుత్రో ధర్మనేత్ర ఇతి శ్రుతః
ధర్మనేత్రస్య కార్తస్తు సాహంజ స్తస్య చాత్మజః సాహంజనీ నామ పురీ తేన రాజ్ఞా నివేశితా
ఆసీ న్మహిష్మతః పుత్రో భద్రశ్రేణ్యః ప్రతాపవాన్ భద్రశ్రేణ్యస్య దాయాదో దుర్దమో నామ విశ్రుతః
దుర్దమన్య సుతో ధీమా న్కనకో నామ నామతః కనకస్య తు దాయాదా శ్చత్వారో లోక విశ్రుతాః
కృతవీర్యః కృతౌజాశ్చ కృతధన్వా తథైవచ కృతాగ్నిస్తు చతుర్థోభూ త్కృతవీర్యా దథార్జునః
అనువు కొడుకు ధర్ముడు, ధర్ముని కొడుకు ద్యూతుడు. వాని కొడుకు వనదహుడు. వాని కొడుకు ప్రచేతనుడు. వాని కొడుకు సుచేతనుడు. తుర్వసు వంశీయులని చెప్ప బడిరి. యదు కుమారులు దేవ కుమార తుల్యు లైదుగురు. సహస్రాదుడు, పయోదుడు, క్రోష్ఠనీలుడు. అంజికుడు. సహస్రాదుని కొడుకులు పరమ ధార్మికులు ముగ్గురు. హైహయుడు, హయుడు వేణుహయ రాజు, హైహయుని కుమారుడు ధర్మనేత్రుడు, వాని కొడుకు కార్తుడు, వాని కొడుకు సాహంజుడు, వాని పేర “సాహంబని” యని పుర మేర్పడెను. మహిష్మతుని కొడుకు భద్రశ్రేణ్యుడు, ప్రతాపశాలి. వాన తనయుడు దుర్ధముడు. వాని తనయుడు బుద్ధి మంతుడు కనకుడు. వాని కుమారులు నల్గురు. కృతవీర్యుడు, కృతౌజనుడు, కృతథన్వుడు, కృతాగ్ని, కృతవీర్యుని తనయుడు అర్జునుడు (కార్త వీర్యార్జునుడు).
యోసౌ బాహు సహస్రేణ సప్తస్రేణ సప్తద్వీపేశ్వరోభవత్ జిగాయ పృథివీ మేకో రథేవాదిత్యవర్చసా
సహి వర్షాయుతం తప్త్యా తపః వరమ దుశ్చరమ్ దత్త మారాధయామస కార్తవీర్యోత్రినంభవమ్
తస్మై దత్తో వరా న్ప్రాదా చ్చతురో భూరి తేజసః పూర్వం బాహు సహస్రం తు ప్రార్థితం సుమహ ద్వరమ్
అధర్మేధీయమానస్య సద్భిస్తత్ర నివారణమ్ ఉగ్రేణ పృథివీం జిత్వా ధర్మేణై వానురంజనమ్
సంగ్రామాన్సుబహుఞ్ జిత్వా హత్వా చారీ న్సహన్రశః సంగ్రామే వర్తమానస్య వధం చాభ్యధికా ద్రణే
తన్య భాహుసహస్రం తు యుధ్యతః కిల భో ద్విజాః యోగా ద్యోగీశ్వరస్యేవ ప్రాదుర్భవతి మాయమా
తేనేయం పృథివీ సర్వా సప్తద్వీపా సవత్తనా ససముద్రా ననగరా ఉగ్రేణ విధినా జితా
తేన సప్తసు ద్వీపేషు సప్త యజ్ఞశతాని వై ప్రాప్తాని విధినా రాజ్ఞా శ్రూయంతే మునిసత్తమాః
సర్వే యజ్ఞా మునిశ్రేష్ఠాః సహన్రళత దక్షిణాః సర్వే కాంచనయూపాశ్చ సర్వే కాంచనసేదయః
సర్వే దేవై ర్మునిశ్రేష్ఠా విమానస్థై రలంకృతైః గంధర్వై రప్సరోభిశ్చ నిత్యమే వోపశోభితాః
యస్యయజ్ఞే జగౌగాథాం గంధర్వో నారదస్తఢా వరీదాసాత్మజో విద్వాన్మహిమ్నా తన్య విస్మితః
ఇతడు సప్త ద్వీములేలెను. వేయు బాహువులు కలవాడు. సూర్యునట్లు వెలుగు రథముతో నొక్కడు వసుధా మండల మెల్ల జయించే పది వేలేండ్లు దుశ్చరమైన తపము సేసి దత్తాత్రేయుల నారాధించె. దత్తగురు డాతనకి నాల్గు వరము లిచ్చెను. వేయి చేతులు గల్గుట. అధర్మము నుండి సజ్జనులు రక్షించుట, సర్వ భూమండలము జయించి ధర్మమున ప్రజా రంజనము చేయుట, రణ రంగమున బెక్కుర జయించి అక్కడే సర్వాధికుడైన వాని చేతిలో వధింప బడుట అనునవి యా వరములు. యుద్దము సేయు చుండగా యోగ శక్తిచే యోగీశ్వరుని కట్లు బాహుసహస్ర మావిర్భవించు చుండును. సప్త ద్వీపయైన వసుంధర నాతడు సముద్రములు, నగరములు, పట్టణములతో గూడిన వెల్ల గెల్చుకొనెను. ఏడు ద్వీపము లందు నేడు వందల యజ్ఞముల నతడు నిర్వహించెను. అన్ని యజ్ఞములు శత సహస్ర దక్షిణములు, అన్నియు కాంచన యూపములు, కాంచన వేదికములు, అన్నిటను సర్వ దేవతలు, గంధర్వులు, అప్సరసలు అలంకరించు కొని విమానములపై యరుదెంచి నిత్యము నాతని యజ్ఞము నలంకరించిరి. అ యజ్ఞ మందు దేవర్షియు, వరీదాసు కొడుకును గంధర్వుడును విద్వాంసుడు నగు నారదుడు అతని మహీమ కన్చెరువడి యతిని జన్న మందు ఈ గాధలను గానము చేసెను.
నారదుడు:
న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్ధివాః యజ్ఞైర్దానై స్తపోభిశ్చ విక్రమేణ శ్రుతేన చ
స హి సప్తమ ద్వీపేషు చర్మీ ఖడ్గీ శరాసనీ రథీ ద్వీపా ననుచర న్యోగీ సందృశ్యతే నృభిః
అనష్ఠద్రవ్యతా నైవ న శోకో నచ విభ్రమః ప్రభావేణ మహారాజ్ఞః ప్రజా ధర్మేణ రక్షతః
స సర్వర త్నభా క్సమ్రా ట్చక్రవర్తీ బభూవ హ స ఏవ పశుపాల్యోభూ త్క్షేత్రపాలః స ఏవచః
స ఏవ వృష్ట్యా పర్జన్యో యోగిత్వా దర్జునోభవత్ స వై బాహుసహస్రేణ జ్యాఘత కఠీనత్వచా
భాతి రశ్మి సహస్రేణ శరదీవచ భాస్కరః
నారదుడు:
యజ్ఞ దాన తపస్సులచే, విక్రమముచే, శ్రుతముచే (పాండిత్య ముచే) కార్తవీర్యార్జునుని స్థితినే రాజును పొంద జాలడు, సప్త ధ్వీపము లందును జనముల కాతడు, డాలు, కత్తి, రథము కలవాడై యోగియై యెట్ట యెదుట కనబడు చుండును. ద్రవ్య నష్టము, శోకము, విభ్రమము ననునవి ధర్మపాలనలో నుండు ఆతనికి లేవు. సర్వరత్న భాజనుడు, సమ్రాట్టు, చక్రవర్తియు నై యతడే పశు పాలకుడు, క్షేత్ర పాలుడును గూడ నయ్యెను. యోగి యగుటచే నా కార్త వీర్యార్జునుడు వర్షించుటలో వర్జన్యు డాయెను. మేఘము తానే యయ్యెను. వింటి నారి దెబ్బలచే కఠినమైన చర్మము గల బాహు సహస్రముచే నాతడు శరత్కాల మందు వేయి కిరణములచే వెలుగొందు భాస్కరుడట్లు తేజరిల్లెను.
స హి నాగా న్మనుష్యేషు మాహిష్మత్యాం మహాద్యుతిః
కర్కోటకసుతా న్జిత్వా పుర్యాం తస్యాం న్యవేశయత్ న వై వేగం సముద్రస్య ప్రావృట్కాలేంబుజేక్షణః
క్రీడన్నివ భుజోద్భిన్నం ప్రతిస్రోత శ్చకార హ లుంఠితా క్రీడతా తేన నదీ తద్గ్రాహమాలినీ
చలదూర్మిసహస్రేణ శంకితాభ్యేతి నర్మదా తస్య బాహు సహస్రేణ క్షిప్యమాణే మహోదధౌ
భయాన్నిలీనా నిశ్చేష్టాః పాతాళస్థా మహీసురాః చూర్ణీ కృత మహావీచిం చలన్మీనమహాతిమిమ్
మారుతావిద్ధఫేనౌఘ మావర్తక్షోభసంకులమ్ ప్రావర్తయ త్తధా రాజా సహస్రేణ చ బాహునా
దేవాసురసమాక్షిప్తః క్షిరోదమివ మందరః మందర క్షోభచకితా అమృతోత్పాదశంకితాః
సహసోత్పతితా భీతా భీమం దృష్ట్యా నృపోత్తమమ్ నతా నిశ్చలమూర్థానో బభూవుస్తే మహోరగాః
సాయాహ్నే కదళీషండాః కంపితా ఇవ వాయునా స వై బద్ద్వా ధనుర్జ్యాభి రుత్సిక్తం పంచభిః శరైః
లంకేశం మోహయిత్వా తు సబలం రావణం బలాత్ నిర్జిత్య వశమానీయ మాహిష్మత్యాం బబంధ తమ్
మాహిష్మతీ నగర మందు కర్కౌటకుని కొడుకులను నాగులను జయించి వారి నా నగర మందే మనుష్యులలో నుంచెను. పద్మ నయను డగు నతడు వర్షాకాలము నందు విలాసముగా తన బాహువులచే నుబికిన సముద్ర వేగము నడ నీటి వాలు నెదు రెక్కించెను. క్రీడించు చున్న ఆ కార్తవీర్యార్జునిచే తిరస్క్రతయై యాతడేలు గ్రామమును మాలా కారమున చుట్టుకొని పారు నర్మదా నది చలించు వేల కొలది కెరటములతో భయ పడుచు అతనికీ అభి ముఖముగా వచ్చెను. అతడు వేయి చేతులచే సముద్రమును క్షోభింప చేయగా పాతాళ వాసులగు మహాసురులు భయపడి నిశ్చేష్ఠులయి సముద్ర మందు నక్కినక్కి దాగిరి. మహా తరంగములు చూర్ణితము లాయెను. మహామీన తిమింగ లాది జల జంతువులు చలించి పోయొను. నురుగు రాసులు గాలిచే భగ్న మాయెను. సుడులు సంకుల ములయ్యెను. ఇట్లాతడు మందర గిరి మథన పరిక్షిప్త మగు క్షీరాభ్ధి నట్లుబ్ధిని సంక్షోభ పరచెను. అమృత మథన మందువలె శంకితులయి వేల కొలది నాగులు తటాలున లేచి వెఱచుచు రాజవరుల దిలకించి పడగలు వంచి వినతులై సాయాహ్న మందు వాయు కంపిత ములైన అరటి బోదెల గుంపులట్లు వణంకుచు నాతని శరణ మందిరి. అతడు శర పంచకముచే రక్తము గారి తడిసి పోయిన సేనా సమేతుడైన లంకేశ్వరుని అల్లెత్రాళ్ళతో బంధించి మోహింప జేసి లోగొని మాహిష్మతీ నగరమున బంధించెను.
శ్రుత్వా తు బద్ధం పౌలస్త్యం రావణం త్వర్జునేన చ తతో గత్వా పులస్త్యస్త మర్జునం దదృశే స్వయమ్
ముమోచ రక్షః పౌలస్త్యం పులస్త్యే నాభియాచితః యస్య బాహుసహస్రస్య బభూవ జ్యాతల స్వనః
యుగాంతే తోయద స్యేవ స్ఫుటతో హ్యశనేరివ అహో బత మృధే వీర్యం భార్గవస్య యదచ్ఛినత్
రాజ్ఞో బాహుసహస్రస్య హైమం తాలవనం యథా తృషితేన కదాచి త్స భిక్షిత శ్చిత్ర భానునా
స భిక్షా మదదా ద్వీరః సప్తద్వీపా న్వాభాససోః పురాణి గ్రామ ఘోషాంశ్చ విషయాంశ్చైవ సర్వశః
జజ్వాల తస్య సర్వాణి చిత్రభాను ర్దిదృక్షయా స తస్య పురుషేంద్రస్య ప్రభావేణ మహాత్మనః
దదాహ కార్తవీర్యస్య శైలాం శ్చైవ వనాని చ స చ శూన్యా శ్రమం రమ్యం పరుణస్యాత్మజస్య వై
దదాహ బలవద్భీత ళ్చిత్రభానుః సహైహయః యం లేభే వరుణః పుత్రం పురా భాస్వంతా ముత్తమమ్
వశిష్ఠం నామ స మునిః ఖ్యాత అపవ ఇత్యుత తత్రాపపస్తు తం క్రోధా చ్ఛప్తవా నర్జునం విభుః
యస్మా న్న వర్జిత మిదం వనం తేమమ హైహయ తస్మా త్తే దుష్కరం కర్మ కృత మన్యో హనిష్యతి
రామో నామ మహాబాహు ర్జామదగ్న్యః ప్రతాపవాన్ ఛిత్వా బాహునసహస్రం తే ప్రమథ్య తరసా బలీ
తపస్వీ బ్రాహ్మణ స్త్వాం తు హనిష్యతి స భార్గవః అనష్టద్రవ్యతా యస్య బభూ వామిత్రికర్షిణః
ప్రతాపేన నరేంద్రస్య ప్రజా ధర్మేణ రక్షతః ప్రాప్త స్తతో స్య మృత్యుర్వై తస్య శాపా న్మహ మునేః
వర స్తథైవ భో విప్రాః స్వయమేవ వృతః పురా
తన కుమారుడట్లు కార్తవీర్యార్జునిచే బంధితు డగుట విని పులస్త్య బ్రహ్మ కార్తవీర్యార్జునుని దర్శించి యాచించిన మీదట రావణు నతడు విడిచి పుచ్చెను. వాని బాహు సహస్రముచే నొనరింప బడిన ధనుష్టంకారము ప్రళయ సమయ పర్జన్య ఘోషణ భీషణమ్మై పిడుగులు పడినట్లు బెట్టద మాయెను. ఏమి అశ్చర్యము! భార్గవ రాముని వీర్యంబు కార్త్యవీర్యుని బాహు సహస్రమును హేమతాళ వనంబు నట్లు భేదించెను. దప్పిక గొని యనులుండొ కప్పుడా కార్తవీర్యుని భిక్షమడుగ నవ్వీరు డాయనకు పురములు గ్రామముల ఘోషములు, పల్లెలు, దేశముల తోడి సప్త ద్వీపములను భిక్షగ నొసంగెను. అగ్నియ వ్వినోద మరయం గోరి యన్నిటిని దహించి వైచెను. కర్త్యావీర్యుని ప్రభావముచే నగ్ని యట్లు పర్వతములు వనములతో గూడ దహించెను. వరుణ కుమారు డాపపుడను వాని యాశ్రమముం గూడ కార్తవీర్యునితో గూడి మసి సేసెను. వరుణ కుమారుడు తేజస్వియు నుత్తముడు నగు వశిష్ఠుడను వాడు. ఆ ముని ఆపవుడను ప్రఖ్యాతి నంచెను, అపవుడు కోపించి అర్జునుని శపించెన. ఓరీ! హైహయ! నా నివసించు వనమును గూడ విడువ వైతివి. కావున నీ చేసిన దుష్కర్మమును మరొక్కడు నాశనము సేయ గలడు. రాముడను పేర నతడు మహావీరుడు జమదగ్నికి కుమారు యుదయించి నీ వేయు బాహువులు నరికి యా బ్రాహ్మణ తపస్యి నిన్ను సంహరింప గల డనెను ప్రతాపముతో శత్రు సంహార మోనర్చును ధర్మముతో ప్రజా పాలన మొనర్చు చున్న యే కార్తవీర్యునకు ద్రవ్య నాశనము లేదో! ఆ కార్తవీర్యార్జునుడు మున్ను పొందిన వరము లన్నియు నీరీతి ఫలించెను. ప్రబలుడైన వాని చేతిలో మరణము నతడు కోరు కొనెను. కోరినట్లు అపవ మహాముని శాపము వలన పరశురాముని చేతిలో నతడు వీరస్వర్గ మందినాడు.
తస్య పుత్ర శతం త్వాసీ త్పంచశేషా మహాత్మనః
కృతాస్త్రాబలినః శూరా ధర్మాత్మానో యశస్వినః శూర సేనశ్చ శూరశ్చ వృషణో మధుపధ్వజః
జయధ్వజశ్చ నామ్నాసీ దావంత్యో నృపతి ర్మహన్ కార్తవీర్యస్య తనయా వీర్యవంతో మహాబలాః
జయధ్వజస్య పుత్రస్తు తాలజంఘో మహాబలః తస్య పుత్రశతం ఖ్యాతా స్తాలజంఘా ఇతి స్మృతాః
తేషాం కులేముని శ్రేష్ఠా హైహయానాం మహాత్మానామ్ వీతిహోత్రాః సుజాతాశ్చభోజాశ్చావంతయః స్మృతాః
తౌండికేరాశ్చ విఖ్యాతా స్తాలజంఘా స్తధైవచ భరతాశ్చ సుజాతాశ్చ బహుత్వా న్నానుకీర్తితాః
వృషప్రభృతయో విప్రా యాదవాః పుణ్యకర్మిణాః వృషో వంశధర స్తత్ర తస్యపుత్రోభవ న్మధుః
మధోః పుత్రశతం త్వాసీ ద్వృషణ స్తస్య వంశకృత్ వృషణా ద్వృష్ణయః సర్వే మధోస్తు మాధవాః స్మృతాః
యాదవా యదునామ్నా తే నిరుచ్యంతే చ హైహయాః న తన్య విత్తనాశః స్యా న్నష్టం ప్రతిలభేచ్చ సః
కార్తవీర్యస్య యో జన్మ కథయేదిహ నిత్యశః ఏతే యయాతి పుత్రాణాం పంచవంశా ద్విజోత్తమాః
అ కార్తవీర్యునకు కుమారులు నూర్గురు. అందై దుగురు మిగిలిరి. వారు బలశాలురు, శూరులు, ధర్మవరులు, కీర్తి శాలురు శూరశేనుడు, శూరుడు, వృషణుడు, మధుపద్వజుడు, జయధ్వజుడు అనువారు. జయధ్వజుడు అవంతీ దేశము నేలిన వాడు, జయధ్వజుని తనయుడు తాలజంఘడు. వాని కుమారులు నూర్గురు “తాలజంఘలు” అను పేర బరగిరి. మహానుభావులగు హెహయుల వంశ మందు నీతిహోత్రులు, సువ్రతులు, భోజులు, అవంతులు, తౌండికేరులు, తాళజంఘులు ప్రసిద్ధులు, భరతులు, సుజాతులు మొదలగు వారు పెక్కు మంది కావున పేర్కొన శక్యము గారు. విప్రులారా! వృషుడు మొదలయి నవ యాదవులు పుణ్యాచరణ పరాయణులు, వృషుడు, వంశధరుడు (మూల పురుషుడు), వాని కుమారుడు మధువు వానికి నూర్గురు కుమారులు, అందు వృషణుడు వంశకర్త. వాని సంతతి వృష్టులు, మధువను వాని సంతతి మాధవు లైరి. యదవు పేర యాదవులని హైహయులు పేరందిరి. కార్తవీర్యుని జన్మ చరిత్ర కధనము నిత్యము చేయు వానికి విత్త నాశనము కలుగదు. పోయిన సొత్తు దొరుకును. బ్రాహ్మణులారా! ఇవి యయాతి కుమారు లయిదుగురి వంశములు.
కీర్తితా లోకవీరాణాం యో లోకా న్థారయంతి వై భూతానీవ మునిశ్రేష్ఠాః పంచస్థావరజంగమాన్
శ్రుత్వా పంచ విసర్గాంస్తు రాజా ధద్మార్థ కోవిదః వశీ భపతి పంచానా మాత్మజానాం తథేశ్వరః
లభేత్పంచవరాం శ్చైవ దుర్లభా నిహ లౌకికాన్ ఆయుః కీర్తిం తఖా పుత్రా నైశ్వర్యం భూతిమేవ చ
ధారణా చ్ఛ్రవణాచ్చైప పంచవర్గస్య భో ద్విజాః క్రోష్టో ర్వంశం ముని శ్రేష్ఠాః శృణుధ్వం గదతో మమ
యదో ర్వంశధరస్యాథ యజ్వనః పుణ్యకర్మణః క్రోష్టో ర్వంశం హి శ్రు త్వైవ నర్వపాపైః ప్రముచ్యతే
యస్యాస్వవాయుజో విష్ణుర్హరి ర్వృష్టి కులోద్వహః
యయాతి కుమారు లయిదుగురు పంచ భూతముల వలె లోక ములను ధరించినారు. కావున వారి చరిత్ర సంకీర్తనముచే పంచభూత జగత్తు చరాచరాత్మక మిదియెల్ల ధరింప బడును. ఉద్దరింప బడును. ఈ పంచవంశ విసర్గము విన్న రాజు ధర్మార్థ నిపుణుడు వశియును (జితేంద్రియుడు) కాగలడు. అయిదు వరములంద గలడు. అవి ఆయువు, కీర్తి, పుత్రులు, ఐశ్వర్యము, విభూతి, ఈ పవిత్ర చరిత్ర. ధారణము వలన, శ్రవణము వలన, నీ చెప్పిన ఫలము నిశ్చయమ. కోష్టు వంశ మిక తెల్పెద. వినుండు, యజ్ఞకర్త ధర్మాత్ముడు వంశ ధారకుడ నగు యదు క్రోష్టుపుల వంశముల వృత్తాంతము సర్వ పాప విమోచకము. ఈ వృష్టి వంశము మందు శ్రీమహా విష్ణువు శ్రీ కృష్ణ రూపమున నవతరించెను.
Summary of chapter 13 of the Brahma Mahā Purana is as follows:
The genealogy and notable members of the Vṛṣṇi clan — the branch of the Yādava dynasty to which Śrī Kṛṣṇa belongs — are narrated. Satrājit and other prominent Vṛṣṇi leaders are introduced. The chapter establishes the royal and heroic context within which Kṛṣṇa's earthly activities unfold and describes the relationships among the Yādava clans.