బ్రహ్మ మహా పురాణము

55 - మార్కండేయాఖ్యానమ్‌

బ్రహ్మ:

స నిష్క్ర మ్యోదరాత్తస్య బాలస్య మునిసత్తమాః

పున శ్చైకార్ణవాముర్వీమపశ్యజ్జనవర్జితామ్‌

పూర్వదృష్టం చ తం దేవం దదర్శ శిశురూపిణమ్‌

శాఖాయాం వటవృక్షస్య పర్యంకోపరిసంస్థితమ్‌

శ్రీవత్స వక్షసం దేవం పీతవస్త్రం చతుర్భుజమ్‌

జగదాదాయ తిష్ఠంతం పద్మపత్రాయతేక్షణమ్‌

సోపి తం మునిమాయాంతం ప్లవమానమచేతనమ్‌

దృష్ట్వాముఖా ద్వినిష్క్రాంతం ప్రోవాచ ప్రహసన్నివ

బ్రహ్మ:

మార్కండేయుడు ఆ పాపని కడుపు నందుండి వెడలి వెలుపల నొక్కటే సముద్ర మయిన భూమిని నిర్జన మయిన దానిని దర్శించెను. మున్ను చూచిన యా బాలుని కూడ మర్రికొమ్మపై వటపత్ర పర్యంకమున నున్న శిశువును గాంచెను. శ్రీవత్స చిహ్నమురమున దీపింప పీతాంబరము ధరించి యా పద్మపత్ర లోచనుడు జగత్తును జేకొని యున్నట్లు దర్శించెను. ఆ బాలుడు కూడ తన ముఖము నుండి వెడలి యా మహార్ణవమున దేలి చేష్టలు దక్కియున్న నా మునిని జూచి

శ్రీ భగవానుడు:

కచ్చిత్త్వయోషితం వత్స విశ్రాంతం చ మమోదరే

భ్రమమాణశ్చ కిం తత్ర ఆశ్చర్యం దృష్టవానసి

భక్తోసి మే మునిశ్రేష్ఠ శ్రాంతోసిచ మమాశ్రితః

తేన త్వాముపకారాయ సంభాషే పశ్య మామిహ

శ్రీ భగవానుడు:

 “వత్సా! నాకడుపు నందు బ్రవేశించి విశ్రమించితివా? అందిటు నటు పరిభ్రమించి యేమి వింత జూచితివి? ఓ మునిశ్రేష్ఠ! నాకు భక్తుడవు. నాయండ చేరితివి. అలసితివి. కావున నీకుపకారము చేయ సంభాషించు చున్నాను. నావంక జూడుమని యల్లన నవ్వుచు భగవంతుడనియె.

బ్రహ్మ:

శ్రుత్వా స వచనం తస్య సంప్రహృష్టతనూరుహః

దదర్శ తం సుదుష్ప్రేక్షం రత్నైర్దివ్యైరలంకృతమ్‌

ప్రసన్ననిర్మలా దృష్టిర్ముహూర్తాత్తస్య భో ద్విజాః

ప్రసాదాత్తస్య దేవస్యప్రాదుర్భూతా పునర్నవా

రక్తాంగుళితలౌపాదౌ తతస్తస్య సురార్చితౌ

ప్రణమ్య శిరసా విప్రా హర్ష గద్గదయా గిరా

కృతాంజలిస్తదా హృష్టో విస్మితశ్చ పునః పునః

దృష్ట్వా తం పరమాత్మానం సంస్తోతు ముపచక్రమే

బ్రహ్మ:

ఆ మాట విని యుప్పొంగి యొడలు గగుర్పొడవ నీ కన్నుల గనరాని దివ్య రత్నాలంకృతు డయిన యమ్మేటి వేల్పుని మార్కండేయుడు దర్శించెను. అంత నాముని తద నుగ్రహమున మిగుల నిర్మలమై ప్రసన్నమై మరల క్రొత్త సొగసు నొంది యావిర్భవించెను. ఎఱ్ఱని వ్రేళ్ళు గల యా మేటివేల్పు అడుగుల తలవాంచి వ్రాలి సువంద్యము లయిన యా పాద ద్వందము నకు బ్రణమిల్లి హర్ష గద్గదము లయిన మాటలతో కృతాంజలియై యానంద భరితుడై యచ్చెరు వొందుచు మరిమరి జూచి యా పరమాత్మను స్తుతించుట కారంభించెను.

మార్కేండయుడు:

దేవ దేవ జగన్నాథ మాయాబాలవపుర్థర

త్రాహిమాం చారుపద్మాక్ష దుఃఖితం శరణాగతమ్‌

సంతోప్తోస్మి సుర శ్రేష్ఠ సంవర్తాఖ్యేన వహ్నినా

అంగార వర్షభీతం చ త్రాహిమాం పురుషోత్తమ

శోషితశ్చ ప్రచండేన వాయునా జ్వలతామునా

విహ్వలోహం తథా శ్రాంతస్త్రాహి మాం పురుషోత్తమ

తాపితశ్చ తవామాత్యైః ప్రలయావర్తకాదిభిః

న శాంతిమధిగచ్ఛామి త్రాహిమాం పురుషోత్తమ

తుషితశ్చ క్షుధావిష్ణో దుంఖితశ్చ జగత్పతే

త్రాతారం నాత్ర పశ్యామి త్రాహిమాం పురుషోత్తమ

అస్మిన్నేకార్ణ వే ఘోరే వినష్టే సచరాచరే

నచాంతమధిగచ్ఛామి త్రాహిమాం పురుషోత్తమ

తవోదరే చ దేవేశ మయా దృష్టో చరాచరమ్

విస్మితో హం విషణ్ణశ్చ త్రాహిమాం పురుషోత్తమ

సంసారేస్మిన్నిరాలంబే ప్రసీద పురుషోత్తమ

ప్రసీద విబుధ శ్రేష్ఠ ప్రీద విబుధప్రియ

ప్రసీద విబుధాంనాథ ప్రసీదవిబుధాలయ

ప్రసీద సర్వలోకేశ జగత్కారణ కారణ

ప్రసీద సర్వకృద్దేవ ప్రసీద మమభూధర

ప్రసీద సలిలావాన ప్రసీద మధుసూదన

ప్రసీద కమలాకాంత ప్రసీద త్రిదశేశ్వర

ప్రసీద కంసకేశిఘ్న ప్రసీదారిష్టనాశన

ప్రసీద కృష్ణ దైత్యఘ్న ప్రసీదదనుజాంతక

ప్రసీద మథురావాస ప్రసీదయదునందన

ప్రసీద శక్రావరజ ప్రసీదవరదావ్యయ

త్వం మహీత్వం జలం దేవ త్వమగ్నిస్త్వం సమీరణః

త్వం నభస్తవ్వం మనశ్చైవ త్వమహంకార ఏవ చ

త్వం బుద్దిః ప్రకృతశ్చైవ స్తత్వాద్యాస్త్వం జగత్పతే

పురుషస్త్వం జగద్వ్యాపీ పురుషాదపి చోత్తమః

త్వమింద్రయాణి సర్వాణి శబ్దాద్యా విషయాః ప్రభో

త్వం దిక్పాలాశ్చ ధర్మాశ్చ వేదా యజ్ఞాః సదక్షిణాః

త్వమింద్రస్త్వం శివో దేవ స్త్వం హవిస్త్వం హుతాశనః

త్వం యమఃః పితృరాట్దేవః త్వం రక్షాధిపతిః

స్వయమ్‌ వరుణ స్త్వమపాం నాథః త్వం వాయుస్త్వం ధనేశ్వర

త్వమీశాన స్త్వ మనంత స్త్వం గణేశశ్చ షణ్ముఖంః

వసవస్త్వం తథా రుద్రాస్త్వమాదిత్యాశ్చ ఖేచరాః

దానవాస్త్వం తథా యక్షాస్త్వం దైత్యాః సమరుద్గణాః

సిద్ధాధాశ్చాస్సరసో నాగా గంధర్వాస్త్వం సచారణాః

పితరో వాలఖిల్యాశ్చ ప్రజానాం పతయోచ్యుత

మునయ స్త్వమృషిగణా స్త్వమశ్వినౌ నిశాచరాః

అన్యాశ్చ జాతయ స్త్వంహి యత్కించిజ్జీవ సంజ్ఞితమ్‌

కించాత్ర భహునో క్తేన బ్రహ్మాది స్తంబగోచరమ్‌

భూతం భవ్యం భవిష్యం చ త్వం జగత్సచరాచరమ్‌

య త్తేరూపం పరం దేవ కూటస్తమచలంధ్రువమ్‌

బ్రహ్మాద్యాస్తన్న జానంతి కథమన్యేలప్పమేధసః

దేవ శుద్ధస్వభావో సి నిత్యస్త్వం ప్రకృతేః పరః

అవ్యక్తః శాశ్వతో నంతః సర్వవ్యాపీ మహేశ్వరః

త్వమాకాశః పరః శాంతో అజస్త్వం విభురవ్యయః

మార్కండేయ కృతస్తవము

దేవదేవ! మాయా బాల మూర్తిధర! పద్మాక్ష! దుఃఖితుడనై శరణొందిన నన్ను రక్షింపుము. ప్రళయ కాలాగ్నికి నుడికి పోయితిని నిప్పుల వర్షమునకు జడిసి పోతిని. ప్రళయ ప్రచండ వాయువునకు నారిపోతిని. అలసి విహ్వలుడ నయి ప్రథయావర్తమునకు నదిరిపోయి శాంతి గనజాల కున్నాను. ఆకలి దప్పులకు వశుడ నైతిని. పురుషోత్తమా! నేనొక రక్షనిందు గననైతిన. రక్షింపుము. ఈ ఏకార్ణవ వ్రళయ మందు చరాచరము సురిగి పోయిన యీ ఘోరదశ యందు నంతుదరి గన లేకున్నాను. దేవేశ! నీ యుదర గోళమున చరాచర ప్రపంచమును గంటిని. ఆశ్చర్య విషాద ములందు చున్నాను. దిక్కలేని యీ సంసారమున పరమేశ! ప్రసన్నుడవు కమ్ము. ఓ వేల్పుమేటి! ప్రసాదముం జూపుము. దేవనాధ! అనుగ్రహింపుము గ్రహింపుము. జగత్కారణులకు కారణుడవు. నీవ పంచ భూతములు. అహంకారము నీవు. మహత్తత్వము బుద్ధినీవు. ప్రకృతివి. సత్వాది గుణ త్రయము నీవు. నీవ దిక్పాలకుడవు. అష్ట వసువులు నీవు. ఏకాదశ రుద్రులు, ద్వాధ శాదిత్యులు, గంధర్వులు, దేవ దానవులు, మరుత్తులు, పితృ దేవతలు, వాలఖిల్యాదులు, ప్రజావతులు, సప్త ఋషులు, అశ్వినులు, మఱి మనసుకు మాటకు నందని యశేష జీవ సంతతి బ్రహ్మాది స్తంబ పర్యంత బూత భవ్య భవిష్య జ్ఞాలము నీ రూపము. అంతకును మీదనున్న కూటస్థుడవు నీవు. బ్రహ్మాదులు నిన్నెరుగరు. అల్ప మేధసులు నీ జాడ నెట్లెరుగుదురు. నీను నిత్య శుద్ద బుద్ధ ముక్త స్వభావుడవు. ప్రకృతి కవ్వల వాడవు. అవ్యక్తుడవు. అనంతుడవు. అంతట నున్న వాడవు. ఆకాశము వలె శాంతుడవు.

ఏవం త్వాం నిర్గుణం స్తోతుం కః శక్నోతి నిరంజనమ్‌

స్తుతోసి యన్మయా దేవ వికలేనాల్పచేతసా

తత్సర్వం దేవదేవేశ క్షంతుమర్హసి చావ్యయ

ఇట్లు నిర్గుణుడు, నిరంజనుడు అయిన నిన్ను యెవ్వరు స్తుతింప గలరు. మనసు చెదిరిన నల్పమతి నయిన నేను నిన్ను స్తతించితిని . ఇదెల్ల క్షమింప నర్హుడవు. ఓ అవ్యయ! దేవ దేవేశ! వందనము.