204 - ఇంద్ర కృష్ణ సంవాదః షోడశ సహస్ర స్త్రీ పరిగ్రహ వర్ణనమ్‌

వ్యాసులు:

సంస్తుతో భగవానిత్థం దేవరాజేన కేశవః

ప్రహస్య భావగంభీర మువాచేదం ద్విజో త్తమాః

వ్యాసులు:

భగవంతుడిట్లు దేవేంద్రునిచే బొగడొంది భావ గంభీరముగ నవ్వి యిట్లు పలికెను.

శ్రీ భగవానుడు:

దేవరాజో భవానింద్రో వయం మర్త్యా జగత్పతే

క్షంతవ్యం భవతైవైత దపరాధకృతం మమ

పారిజాతతరుశ్చాయం నీయతాముచితాస్పదమ్‌

గృహీతోయం మయాశక్ర సత్యావచనకారణాత్‌

వజ్రం చేదం గృహాణత్వం యష్టవ్యం ప్రహితం త్వయా

తవైవైత్ప్రహరణం శక్ర వైరివిదారణమ్‌

శ్రీ భగవానుడు:

జగన్నాథా!నీవు దేవ ప్రభువవు. ఇంద్రుడవు. మేము మానవులము. నా చేసిన యీ యపరాధము నీవు క్షమింప వలయు, ఈ పారిజాత తరువును యథా స్థానమునకు గొంపొమ్ము. సత్యభామ వచనానుసారము నేనిద్ధానిం గొని వచ్చితిని. నీచే విసర బడిన యీ వజ్రాయుధము పూజ నీయము. దీనిని నీవే చేకొనుము. శత్రువులం జీల్చు నీ ప్రహరణము (ఆయుధము) నీదే. అన నింద్రుడిట్లనియె.

శక్రుడు:

విమోహయసి మామీశం మర్త్యోహమితి కిం వదన్‌

జానీమస్త్వాం భగవతోనంతసౌఖ్యవిదో వయమ్‌

యోసి సోసి జగన్నాథ ప్రవృత్తౌ నాథ సంస్థితః

జగతః శల్యనిష్కర్షం కరోష్యసురసూదన

నీయతాం పారిజాతోయం కృష్ణ ద్వారవతీం పురీమ్‌

మర్త్యలోకే త్వయా ముక్తే నాయం సంస్థాప్యతే భువి

శక్రుడు:

స్వామి! నేను మర్త్యుడ నని పలికి నన్ను తబ్బిబ్బు జేయ నేల? భగవంతుడగు నీ వలని యనంత సౌఖ్యమును నెఱిగిన (రుచి మఱగిన) మేము నిన్నె ఱుగుదుము. జగన్నాథ! నీవెవ్వడవో యాతడే యగుదువు గాక! (నీ స్వరూపమును గూర్చి తర్కింప పని లేదన్న మాట) అయినను ప్రవృత్తి యందు న్నావు. (నివృత్తి యందు కేవలము నీవు సాక్షివి. కూటస్థ బ్రహ్మ మయినను) జగత్కంటకుల నిష్కర్షను (= పెల్లగించి వేయుటను) జేయు చున్నావు (దుష్ట సంహారము కొఱ కవతరించితి వన్నమాట) కావున ఈ పారిజాతమును ద్వారవతి కింగొం పొమ్ము. మర్త్య లోకము నీవు విడిచిన తర్వాత నీ వృక్షమట నుండదు.

వ్యాసులు:

తథేత్యుక్త్వా తు దేవేంద్ర మాజగామ భువం హరిః

ప్రయుక్తైః సిద్ధగంధర్వైః స్తూయమాన స్తథర్షిభిః

జగామ కృష్ణ స్పహసా గృహీత్వా పాదపోత్తమమ్‌

తతః శంఖముపాధ్యాయ ద్వారకోపరి సంస్థితః

వ్యాసులు:

అన హరియు నింద్రునితో నట్లు కానిమ్మని యాతని తోడి సిధ్ధ గంధర్వులు ఋషులునుం గొనియాడ భూలోకమున కేతెంచి ద్వారకా నగరముపై నుండి శంఖముం పూరించి పుర వాసుల కానంద మొదవించెను.

హర్షముత్పాదయామాస ద్వారకావాసినాం ద్విజాః

అవతీర్యాథ గరుడా త్సత్యభామాసహాయవాన్‌

నిఘ్కటే స్థాపయామాస పారిజాతం మహాతరుమ్‌

యమభ్యేత్యజనః సర్వో జాతిం స్మరతి పౌర్వికీమ్‌

వాస్యతే యస్య పుష్పాణాం గంధేనోర్వీ త్రియోజనమ్‌

తత స్తే యాదవాః సర్వే దేవగంధర్వమానుషాన్‌

దదృశుః పాదపే తస్మిన్కుర్వతో ముఖదర్శనమ్‌

కింకరైః సముపానీతం హస్త్వశ్వాది తతో ధనమ్‌

స్త్రియశ్చ కృష్ణో జగ్రాహ నరకస్య పరిగ్రహాత్‌

తతః కాలే శుభే ప్రాప్త ఉపయేమే జనార్దనః

తాః కన్యా నరకావాసా త్సర్వతో యాః సమాహృతాః

ఏకస్మిన్నేవ గోవిందః కాలేచాసాం ద్విజోత్తమాః

జగ్రాహ విధివత్పాణీ న్పృథగ్దేహ స్స్వధర్మతః

షోడశస్త్రీసహస్రాణి శతమేకం తథాధికమ్‌

తావంతి చక్రే రూపాణి భగవాన్మధుసూధనః

ఏకైకశశ్చతాః కన్యా మేనిరే మధుసూదనమ్‌

మమైవ పాణిగ్రహణం గోవిందః కృతవానితి

నిశాసు జగతః స్రష్టా తాసాం గేహేషు కేశవః

ఉవాస విప్రాః సర్వాసాం విశ్వరూపధరో హరిః

అవ్వల సత్యభామతో గరుడునిం దిగి పారిజాత తరువును సత్యభామ పెరటిలో నాటించెను. నగర మందలి జనమా స్వర్గ తరవుం దర్శించి పూర్వ జన్మ స్మృతి నందిరి. ఆ పారిజాతము యొక్క పూవుల వాసనచే మూడు యోజనముల దాక పరిమళించుట మఱియు యాదవు లెల్లరు నాతరువునం దద్దమందు వలె దమ ముఖ దర్శనము సేయుటయే గాదు దేవ గంధర్వ మానుషుల నెల్లర నందు దర్శించిరి. ప్రాగ్జ్యోతిషము నుండి నౌకరులు గొని వచ్చిన ఏన్గులు గుఱ్ఱములు ధనము స్త్రీలను కృష్ణుడు నరకుని పరిగ్రహము నుండి గ్రహించెను. అవ్వల నొక సుమూహుర్త మందు నరకుని చెఱ నుండి విడిచి రప్పింప బడిన యాకన్య లందఱను (అవివాహిత లన్నమాట) తన కుల ధర్మాను సారము పదునాఱు వేలమీద నొక వంద మందిని యథా శాస్త్రముగా పాణి గ్రహణ మొనరించు కొనెను. అయ్యెడ భగవంతుడా తడందఱ కన్ని రూపములం దాల్చెను. అక్కన్యకలును నెక్కొక్కతె కొక్కొక్కనిగా గృష్ణుం భావించి ఎవరి మట్టుకు వారు గోవిందుడు నా పాణియే గ్రహించి నా చేతినే చే నెసని యను కొనిరి రాత్రు లందు జగత్సృష్టి కర్త యగు మాధవుడు యోగీశ్వ రేశ్వరుండు గావున విశ్వరూప ధరుండై యంతఱి యిండ్ల నిన్ని రూపుల తానొక్కడే సంచరించెను.