మునులు:
అహో సుమహ దాఖ్యానం భవతా పరికీర్తితమ్
భారతానాం చ సర్వేషాం పార్థివానాం తథైవ చ
దేవానాం దానవానాం చ గంధర్వోరగ రక్షసామ్
దైత్యనా మథ సిద్ధనాం గుహ్యకానాం తథైవ చ
అత్యద్భుతాని కర్మాణి విక్రమా ధర్మనిశ్చయాః
వివిధాశ్చ కథా దివ్యా జన్మ చాగ్ర్య మను త్తమమ్
సృష్టిః ప్రజాపతే స్సమ్యక్త్వయా ప్రోక్తా మహామతే
ప్రజాపతీనాం సర్వేషాం గుహ్యకాప్సరసాం తథా
స్థావరం జంగమం సర్వముత్పన్నం వివిధం జగత్
త్వయా ప్రోక్తం మహాభాగ శ్రుతం చై త న్మనోహరమ్
కథితం పుణ్యఫలదం పురాణం శ్లక్షయా గిరా
మనః కర్ణసుఖం సమ్య క్ర్పీణా త్యమృత సంమతమ్
ఇదానీం శ్రోతు మిచ్ఛామః సకలం మండలం భువః
వక్తు మర్హసి సర్వజ్ఞ పరం కౌతూహలం హి నః
యావంతః సాగరా ద్వీపా స్తథా వర్షణి సర్వతాః
వనాని సరితః పుణ్యదేవాదీనాం మహామతే
యత్ప్రమాణమిదం సర్వం యదాధారం యదాత్మకమ్
సంస్థాన మస్య జగతో యథావ ద్వక్తు మర్హసి
మునులు:
మహామతి వగు నీవు భారత రాజుల యొక్కయు, దేవ దానవ గంధర్వ యక్షో రగాదుల యొక్కయు అద్భుతములగు చరిత్రలను స్థావర జంగమాదుల సృష్ట్యాదులను మృదు మధురముగ, మన శ్ర్శవణానంద కరముగ జెప్పితివి. ఆహా! ఇప్పుడు భూమండల స్వరూపము విన గుతూహలులమై యున్నాము. భువనకోశ సంస్థాన మవధానమున విననున్న మాకది యాదరములో నాన తిమ్మని మును లడిగిరి.
లోమహర్షణుడు:
మునయః శ్రూయతామేత త్సంక్షేపా ద్వదతో మమ
నాస్య వర్షశతేనాపి వక్తుం శక్యోతివి స్తరః
జంబూప్లక్షాహ్వయౌ ద్వీపౌ శాల్మలశ్చాపరో ద్విజాః
కుశః క్రౌంచ స్తథా శాకః పుష్కరశ్చైవ సష్తమః
ఏతే ద్వీపాః సముద్రైస్తు సప్తస ప్తభిరావృతాః
లవణేక్షు సురాసర్పిర్దధి దుగ్ధజలైః సమమ్
జంబూద్వీపః సమస్తానా మేతేషాం మధ్య సంస్థతః
తస్యాపి మధ్యే విపేంద్రా మేరుః కనకపర్వతః
చతురశీతి సాహస్రై ర్యోజనైస్తస్య చోచ్ర్ఛయః
ప్రవిష్టః షోడ శాధస్తా ద్ద్వాత్రింశ న్మూర్ధ్ని విస్తృతః
మూలే షోడశ సాహస్రై ర్విస్తార స్తస్యసర్వతః
భూపద్మస్యాస్య శైలోసౌ కర్ణికాకార సంస్థితః
లోమహర్షణుడు:
మునులారా! ఇది నూఱేండ్లు సెప్పినం దీరదు, సంక్షేపించి తెల్పెద వినుండు. జంబూ + ప్లక్ష + శాల్మల + కుశ + క్రౌంచ + శాక + పుష్కరములు అనునవి సప్త ద్వీపములు. ఇవి లవణ = ఉప్పు, ఇక్షు = చెఱకు రసము, సురరా = కల్లు, సర్పిః = నెయ్యి, దధి = పెరుగు, దుగ్ధ = పాలు, జల = నీరు, నుంగల యేడు సముద్రములచే జుట్టుకొన బడినవి. వీని నడుమ జంబూ ద్వీప మున్నది. దానికి నడుమ “మేరువు” అను బంగారు కొండ యున్నది. అది యెనుబది నాల్గు యోజనముల యెత్తు, పదునారు వేల యోజనముల లోతు, ముప్పది రెండు వేల యోజనములు వైశాల్యముగల యుపరి భాగము కలిగి యున్నది. మూలము పదునాఱు వేల యోజనముల విస్తారమై యున్నది. భూమి యను పద్మమున కది నడిమి కర్ణిక = (దుద్దు) వలె నున్నది.
హిమవా న్హేమకూటశ్చ నిషధ స్తస్య దక్షిణే
నీలః శ్వేతశ్చ శృంగీ చ ఉత్తరే పర్షపర్వతాః
లక్షప్రమాణౌ ద్వౌ మధ్యే దశహీనా స్తథా పరే
సహస్రద్వితయోచ్ఛాయాస్త్రావద్వి స్తారిణశ్చతే
హిమవంతము, హేమ కూటము, నిషధము నను నవి దానికి దక్షిణ మునను, నీలము, శ్వేతము, శృంగి యనునవి యుత్తరము నను వర్ష పర్వతము లున్నవి. రెండు నడుమ నున్నవి. అవి లక్ష యోజన ప్రమాణములు, తక్కినవి తొంబది వేల యోజనముల ప్రమాణము గలవి. రెండు వేల యోజనముల యెత్తు, అన్ని యోజన ముల వెడల్పు గలవి.
భారతం ప్రథమం వర్షం తతః కింపురుషం స్మృతమ్
హరి వర్షం తధైవాన్య న్శేరో ర్దక్షిణతో ధ్విజాః
రమ్యకం చోత్తరం వర్షం తస్యైవ తు హిరణ్మయమ్
ఉత్తరాః కురవశ్చైవ యథావై భారతం తథా
నవసాహస్రమే కైక మేతేషాం ద్విజసత్తమాః
భారత, కింపురుష, హరి వర్షములు మేరువునకు దక్షిణమున నున్నవి. రమ్యకము ఉత్తర మందున్నది. అది కనక మయము. ఉత్తర కురు భూము లక్కడనే యున్నవి. ఈ వర్షము లొక్కొక్కటి భారత వర్షము వలె తొమ్మిదివే యోజనముల వైశాల్యము గలవి.
ఇలావృతం చ తన్మధ్యె సౌవర్ణో మేరు రుచ్ఛ్రితః
మేరో శ్చతుర్దిశం తత్ర నవసాహస్ర విస్తృతమ్
ఇలావృతం మహాభాగాశ్చత్వారశ్చాత్ర పర్వతాః
విష్కంభా వితతా మేరో ర్యోజనాయుత విస్తృతాః
పూర్వేణ మందరో నామ దక్షిణే గంధమాదనః
విపులః పశ్చిమే పార్మ్వే సుపార్మ్వ శ్చోత్తరే స్థితః
కదంబ స్తేషు జంబూశ్చ పిప్పలో వట ఏవ చః
ఏకాదశ శతాయామాః పాదపా గిరికేతవః
జంబూద్వీవస్య సా జంబూ ర్నామహేతుర్ద్విజో త్తమా
ఇలావృతమ దాని నడుమ బంగారు మేరుగిరి గలదు. మేరుపు నలు దిశల నిలావృతము తొమ్మిది వేల యోజనముల వైశాల్యము గలది. ఇందు నాల్గు పర్వతములు మేరుపునకు విష్కంభములు. (గడియలు) పది వేల యోజనముల పొడవు గలవి. తూర్పున మందర పర్వతము, దక్షిణమున గంధ మాదనము, పడమట విపులము, ఉత్తరమున సుపార్శ్వము ననునవి గలవు. వీని యందు క్రమముగ కదంబము (కడిమి), జంబువు (నేరేడు), పిప్పలము (రావి), వటము (మఱ్ఱి) యను చెట్లు పదునొకండ వందల యోజనముల విరివి గల వృక్షములు “గిరి కేతువులు” (పర్వతాగ్ర పతాకము లట్టివి) గలవు. జంబూ వృక్ష సమృద్ధిం బట్టి యది జంబూ ద్వీపమ్ము నాబరగె.
మహాగజప్రమాణాని జంబ్వా స్తస్యాః ఫలాని వై
పతంతి భూభృతః పృష్ఠే శీర్యమాణాని సర్వతః
రసేన తేషాం విఖ్యాతా తత్ర జంబూనదీతి వై
సరిత్ర్పవర్తతే సా చ పీయతే తన్నివాసిభిః
న ఖేదో న చ దౌర్గంధ్యం న జరా నేంద్రియక్షయః
తత్పానస్వస్థమనసాం జననాం తత్ర జాయతే
తీరమృ త్తద్రసం ప్రాప్య సుఖవాయువిశోషితా
జాంబూనదాఖ్యం భవతి సువర్ణం సిద్ధభూషణమ్
ఆ నేరేడు పండ్లు మహా గజ ప్రమాణ రూపమున రాలు చుండునట. అవి ప్రిదిలి కారిన రసమేరై పారి జంబూనది యనం బరగు. ఆ జంబూ రసము ద్రావిన వారు కష్టము, దుర్వాసన, ముదిమి, ఇంద్రియ క్షయము నెఱుంగరు. ఆ జంబూ నది యోడ్డు నంగల మన్ను ఆ రసముచే దడిసి సుఖ వాయువున నారి జాంబూ నదమను బంగార మేర్పడును. ఆది సిద్ధ భూషణము అనగా సిద్ధులు ధరించున దన్నమాట.
భద్రాశ్వం పూర్వతో మేరోః కేతుమాలం చ పళ్చిమే
వర్షే ద్వేతు మునిశ్రష్ఠా స్తయో ర్మధ్యే త్విలా వృతమ్
వనం చై త్రరథం పూర్వే దక్షిణే గంధమాదనమ్
వైభ్రాజం పశ్చిమే తద్వ దుత్తరే నందనం స్మృతమ్
అరుణోదం మహాభద్ర మసితోదం సమానసమ్
సరాం స్యేతాని చత్వారి దేవ భోగ్యాని సర్వదా
మేరువునకు తూర్పు దెస భద్రాశ్వము. పడమట కేతుమాలము. అను రెండు వర్షము లున్నవి. వానికి నడుమ ఇలా వృతము. తూర్పున చైత్ర రథము, దక్షిణమున గంధమాదనము, పడమట వైభ్రాజము, ఉత్తరమున నందన వనము నున్నవి. అరుణోదము, మహాభద్రము, అసితోదము, మానసము అను సరస్సులు నాల్గు దేవ భోగ్యములు గలవు.
శాంతవాం శ్చక్రకుంజశ్చ కురరీ మాల్య వాం స్తథా
వైకంక ప్రముఖా, మేరోః పూర్వతః కేసరాచలాః
త్రికూటః శిశిరశ్చైవ పతంగో రుచకస్తథా
నిషధాదయో దక్షిణత వ్తెస్య కేసరపర్వతాః
శిఖివాసః సవై దూర్యః కపిలో గంధమాదనః
జానుధి ప్రముఖా స్తద్వ త్పశ్చిమే కేసరాచలాః
మేరో రనంతరాస్తే చ జఠరాదిష్వవస్థితాః
శంఖ కూటోథ ఋషభో హంసో నాగస్తథాపరాః
కాలంజరాద్యాశ్చ తథా ఉత్తరే కేసరాచలాః
చతుర్దశసహస్రాణి యోజనానాం మహాపురీ
మేరోరుపరి విప్రేంద్రా బ్రహ్మణః కథితా దివి
తస్యాం సమంతత శ్చాషౌ దిశాసు విదిశాసు చ
ఇంద్రాది లోకపాలానాం ప్రఖ్యాతాః ప్రవరాః పురః
విష్ణుపాద వినిష్క్రాంతాః ప్లావయం తీందుమండలమ్ః
సమంతా ద్బ్రహ్మణః పుర్వాం గంగా పతతి వై దివి
సా తత్ర పతితా దిక్షు చతుర్థా ప్రత్యపద్యత
సీతా చాలకనందా చ చక్షుర్భద్రాచవై క్రమాత్
పూర్వేణ సీతా శై లాచ్చ శైలం యాం త్యంతరిక్షగాః
తతశ్చ పూర్వవర్షేణ భద్రా శ్వేనైతి సార్ణవమ్
తథైవాలకనందా చ దక్షిణే నై త్య భారతమ్
ప్రయాతి సాగరం భూత్వా సప్తభేదా ద్విజో త్తమాః
చక్షుశ్చ పశ్చిమగిరీ నతీత సకలాం స్తతః
పశ్చిమం కేతుమాలాఖ్యం వర్షమన్వేతి సార్ణ వమ్
భద్రా తథోత్తరగిరీ నుత్తరాంశ్చ తథా కురూన్
శాంతవంతము, చక్రకుంజము, కురరీ, మాల్యవంతము, వైకంకము ననునవి మేరుపు యొక్క కేసర పర్వతములు. త్రికూటము, శిశిరము. పతంగము, రుచకము, నిషధము, మొదలైనవి దక్షిణ దిశ మేరుపు యొక్క కేసర పర్వతములు, శిఖి వాసము, వైదూర్యము, కపిలము, గంధమాదనము, జానుథి మొద లైనవి మేరు పశ్చిమ కేసర గిరులు. అవి మేరువు నంటి జఠరాది స్ధానము లందున్నవి. శంఖ కూటము, ఋషభము, హంసము, నాగము, కాలంజరము, మొదలగునవి మేరూత్తర దిశ కేసర శైలములు. మేరువు మీద బ్రహ్మ యొక్క నగరము పదునాలుగు వేల యోజనముల వైశాల్యము గలది. ఆందెనిమిది మూల లందు అష్ట దిక్పాలుర పురములు గలవు. విష్ణు పాదము నుండి వెడలి చంద్ర మండలమున ప్రవహించుచు నాకాశ గంగ బ్రహ్మ పురి నలు వైపుల పడు చున్నది. అట్లుపడి నాల్గు దెసల నాల్గు పాయలైనది. సీత, అలకనంద, చక్షువు, భద్ర. సీత పూర్వ శైలము నుండి మరియొక శైలమున కంతరిక్ష సంచారము సేయును. అవ్వల భద్రాశ్వవర్ష పర్వతము మీదుగా సముద్రుం బొందును. ఆలకనంద దక్షిణ దిశగా భారత వర్షముం జేరి యేడు భాగములయి సముద్రము జొచ్చును. చక్షువు పడమటి గిరులన్నియు దాటి పడమటం గల కేతుమాల వర్షముల జొచ్చి సముద్రముం గలియును. భద్ర ఉత్తర గిరులం దాటి యుత్తర కురు భూములం బ్రవహించి ఉత్తర సముద్రముం జేరును.
అతీత్యోత్తర మంబోధిం పమభ్యేతి ద్విజో త్తమాః
అనీలనిషధాయామౌ మాల్య వద్గంధమాదనౌ
తయో ర్మధ్యగతో మేరుః కర్ణికాకారసంస్థితః
భారతాః కేతుమాలా శ్చ భద్రాశ్వాః కురవ స్తథా
పత్రాణి లోకశైలస్య మర్యాదాశై లబాహ్యతః
జఠరో దేవకూటశ్చ మర్యాదాపర్యతా వుభౌ
తౌ దక్షిణో త్తరాయామా వానీలనిషధాయతౌ
గంధమాదనకై లాసౌ పూర్వపశ్చాత్తు తావుభౌః
ఆశీతియెజనాయామా వర్ణవాంత ర్వ్యవస్థతౌ
నిపధః పారియాత్రశ్చ మర్యాదాపర్వతా వుభౌ
తౌ దక్షిణో త్తరాయామా వానీలనిషధాయతౌ
మేరోః పళ్చిమ దిగ్భాగే యథా పూర్వే తథా స్థితౌ
త్రిశృంగో జారుథిశ్చైవ ఉత్తరౌ వర్షపర్వతౌ
పూర్వ వశ్చాయతా వేతా వర్ణవాంతర్వ్యవస్థితౌ
ఇత్యేతే హి మయా ప్రోక్తా మర్యాదా పర్వతా ద్విజాః
జఠరావస్థితా మేరో ర్యేషాం ద్వౌ ద్వౌ చతుర్దిశం
మేరో శ్చతుర్ధిశం యేతు ప్రోక్తాః కేసరవర్వతాః
శీతాంతాద్యా ద్విజా స్తేషామతీవ హి మనోహరాః
శైలానా మంతర ద్రోణ్యః సిద్ధచారణ సేవితాః
సురమ్యాణి తథా తాసు కాననాని పురాణి చ
లక్ష్మీ విష్ణ్వగ్ని సూర్యేంద్ర దేవానాం మునిస త్తమాః
తా స్వాయతనవర్యాణి జుష్టాని నరకింకరైః
గంధర్వయక్షరక్షాంసి తథాదైతేయ దానవాః
క్రీడంతి తాసు రమ్యాసు శైలద్రోణి ష్వహర్నిశమ్
భౌమా హ్యేతే స్మృతాః సర్గా ధర్మిణా మాలయా ద్విజాః
నై తేషు పాపకర్తారో యాంతి జన్మశతై రపి
నీల పర్యతము నుండి నిషధ పర్వతము వరకు పొడవయినదై మాల్యవంతము గంధమాధనమును గలవు. వాని నడిమి భాగమున తామర పువ్వు లోని దుద్దువలె మేరు వున్నది. మర్యాదా పర్వతమునకు ఆవల లోకాలోక మను పర్వతము నకు భారతములు, కేతు మాలములు, భద్రాశ్వములు, కురు భూములును రేకుల ట్లున్నవి. జఠరము దేవకూటము అనునవి రెండు మర్యాదా పర్వతములు, అవి దక్షిణోత్తరము లందు నీల పర్వతము నుండి నిషధ పర్వతము దాక వ్యాపించి యున్నవి. గంధమాదన కైలాస పర్వతములు తూర్పు పడమర లందు నెనుబది యోజనముల పొడవు గలవై నీల పర్వతము నుండి నిషధ పర్వతము వరకు వ్యాపించి సముద్రములో జొచ్చి యున్నవి. నిషధము, పారియాత్రము అనునవి రెండును మర్యాదా పర్వతములు. ఆ రెండు దక్షిణోత్తరము లందు నీల పర్వతము నుండి నిషధ పర్వతము వరకు దైర్ఘ్యము గలవై మేరు పర్వతమునకు పశ్చిమ భాగము నందు యధా పూర్వముగ నున్నవి. త్రిశృంగము, జారుధియు నుత్తరదిశ వర్ష పర్వతములు. తూర్పు పడమరగా వ్యాపించి యవి సముద్ర మధ్యమున నున్నవి. మర్యాదా గిరులు నాచే చెప్ప బడినవి. వీనిలో రెండు రెండు పర్వతములు మేరు పర్వతము నకు జఠర (గర్భ) భాగములుగా నలు దెసల నున్నవి. మేరువు నలుదెసల గల కేసర పర్వతములు చెప్ప బడినవి. అవి చల్లని ఆద్యంతములు గలవి. వాని లోపల గల లోయలు మనోహరములై సిద్ద చారణ సేవితములై యుండును. వానియందు రమ్యము లైన పురములు వనంబులు గలవు. లక్ష్మి, విష్ణువు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు దేవతల ఆలయ శ్రేష్టములు నర కిన్నరులచే సేవితము లై యొప్పును. రమ్యము లైణ ఆ పర్వత ద్రోణు (లోయ) లందు రేయిం బవళ్ళు గంధర్వ యక్ష రాక్షస దైత్య దానవులు గ్రీడించు చుందురు. ఇవి భౌమ స్వర్గములు. అనగా భూమి మీదనున్న స్వర్గ భూములు. ధర్మ నిష్టులకు నివాసములు ఇందెన్ని జన్మముల కైనను పాపాత్ములు చేర జాలరు.
భద్రాశ్వే భగవాన్విష్ణురా స్తే హయశిరా ద్విజాః
వారాహః కేతుమాలే తు భారతే కూర్మరూపధృక్
మత్స్యరూపశ్చ గోవిందః కురుష్వాస్తే సనాతనః
విశ్వరూపేణ సర్వత్ర సర్వః సర్వేశ్వరో హరిః
భద్రాశ్వ పర్వత మందు విష్ణు భగవానుడు హయగ్రీవ స్వరూపుడై యుండును. కేతుమాల మందు వరాహ మూర్తి భారత మందు కూర్మ మూర్తి, కురుభూము లందు సనాతను డగు గోవిందుడు మత్స్యమూర్తి యునై యుండును. సర్వత్ర సర్వ స్వరూపు డై యా సర్వేశ్వరుడు హరి విశ్వరూపు డై యుండును. సర్వాత్మకు డైన యా విష్ణువు అందరికి ఆధార భూతుడై యుండును.
నర్వస్యా ధార భూతోసౌ ద్విజా! ఆస్తేఖిలాత్మకః
యాని కింపురు షా ద్యాని వర్షాణ్యష్టౌ ద్విజోత్తమాః
న తేషు శోకో నాయాసో నోద్వేగః క్షుద్భయాదికమ్
సుస్థాః వ్రజాః నిరాతంకాః సర్వదుఃఖవివర్జితాః
దశద్వాదశవర్షణాం సహస్రాణి స్థిరాయుషః
నై తేషు భౌమా న్యన్యాని క్షుత్పిపాసాది నో ద్విజాః
కృతత్రేతాదికా చైవ తేఘ స్థానేషు కల్పనా
సర్వేష్వే తేషు వర్షేషు సప్తసప్త కులాచలాః
బ్రాహ్మణులారా! కింపురుషాది వర్షము లెనిమిదింటి యందు గల జీవులకు శోకము ఆయాసము ఉద్వేగము ఆకలి దప్పిక భయము మొదలైన వుండవు. ఆచటి ప్రజలు స్వస్థులు, నిరాతంకులు (అడ్డు లేని వారు) ఏ దుఃఖ స్పర్శయు లేనివారు గను పది పండ్రెండు వేల యేండ్లాయువు గలవారుగ నుందురు. ఆ వర్షము లందు ఇతరములగు భూమి యందలి బాధలు కృత త్రేతాది యుగ విభాగము లేదు. వాని యందన్నిట నేడేసి కుల పర్వతము లున్నవి. అందుండి వందల కొలది నదులు పుట్టినవి.
Summary of chapter 18 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The dimensions and nature of the seven oceans — of salt water, sugarcane juice, wine, clarified butter, curd, milk, and fresh water — surrounding the seven continents are described. The proportional sizes of each continent and its encircling ocean are given, along with the various beings and kingdoms inhabiting these regions of the purāṇic cosmos.