బ్రహ్మ మహా పురాణము

183 - కంస విచార కథనమ్‌

వ్యాసులు:

కంసస్త్వథోద్విగ్నమనాః ప్రాహ సర్వన్మహాసురాన్‌

ప్రలంబుకేశిప్రముఖా నాహూయా సురపుంగవాన్‌

వ్యాసులు:

అంతట గంసుండు మనసు తోట్రువడి ప్రలంబుడు కేశి మొదలయిన యసు రప్రముఖులం బిల్చి యిట్లనియె.

కంసుడు:

హే ప్రలంబ మహాబాహో కేశి న్ధేనుక పూతనే

అరిష్టాద్యైస్తథా చాన్యైః శ్రూయతాం వచనం మమ

మాం హన్తుమమరై ర్యత్నః కృతః కిల దురాత్మభిః

మద్వీర్యతాపి తాన్వీరా న్న త్వేతాన్గణయామ్యహమ్‌

అశ్చర్యం కన్యయా చోక్తం జాయతే దైత్యపుంగవాః

హాస్యం మే జాయతే వీరాస్తేషు యత్నపరేష్వపి

తథాపి ఖలు దుష్టానాం తేషామప్యధికం మయా

అపకారాయ దైత్యేంద్రా యతనీయమ్‌ దురాత్మనామ్‌

ఉత్పన్నః కో పి మృత్యుర్మే భూతభవ్యభవత్ర్పభుః

ఇత్యేత ద్బాలికాప్రాహ దేవకీగర్భసంభవా

తస్మాద్బాలేషు పరమోయత్నః కార్యో మహీతలే

యత్రోద్రిక్తం బలం బాలే స హంతవ్యః ప్రయత్నతః

కంసుడు:

ఓ ప్రలంబ! మహావీర! కేశీ! ధేనుక! పూతనా! అరిఫ్ణుడు మున్నగు వారితో నామాట నాలింపుడు. దురాత్ములు అమరులు నన్ను జంప యత్నించు చున్నారు. నేను వీండ్రను లెక్క సేయను. దేవకికి బుట్టిన పిల్ల చెప్పిన మాట లాశ్చర్యముం గల్గించినవి. వారెంత యత్నము సేయు చున్నను వారియెడ నాకు పరిహాసము గల్గు చున్నది. అయినను నా దుష్టుల కపకారము సేయ యత్నింప వలసినదే. త్రికాలము లందు నిత్యమయిన మృత్యువు నా కొఱుకు బుట్టినట్లా బాలిక చెప్పినది. కావున నేపిల్లవాని యందు మిక్కిలి బలము గాన్పించునో వెదకి వానిం దుద ముట్టింపుడు.

వ్యాసులు:

ఇత్యాజ్ఞాప్యాసురాస్కంపః ప్రవిశ్యా గృహం తతః

ఉవాచ వనుదేవంచ దేవకీ మవిరోధతః

వ్యాసులు:

ఇట్లాజ్ఞ ఇచ్చి కంసుడింట బ్రవేశించి, దేవకీ వసుదేవులతో వైరము దోపకుండ యిట్లనియె.

కంసుడు:

యువయో ర్ఘాతితా గర్భా వృథైవైతే మయాధునా

కోప్యన్య ఏవ నాశాయ బాలో మమ సముద్గతః

తదలం పరితాపేన నూనం యద్భావి నో హితే

అర్భరౌః యువయోః! కోవా అయుషోంతే న హన్యతే

కంసుడు:

ఊరక మీ శిశువులను నేను జంపితిని. కాని యెవ్వడో మఱి యొకడు నా నాశనమునకు బుట్టి యున్నాడు. మీరు బాధ పడకుడు. భావి తప్పదు. మీ యిద్దరి పిల్లలు లేరు గదా! అయుర్దాయ సమాప్తి యందెవడు చంప బడడు.

వ్యాసులు:

ఇత్యాశ్వాస్య విముచ్యైవ కంసస్తౌ పరితోష్యచ

అంతర్గృహం ద్విజశ్రేష్ఠాః ప్రవివేశ పునః స్వకమ్‌

వ్యాసులు:

అని దేవకీ వసుదేవుల ననునయించి కారాగారము నుండి వదలిపెట్టి, సంతోష పరచి తన యంతర్గృహముం బ్రవేశించెను.