బ్రహ్మ మహా పురాణము

187 - రామ కృష్ణ కృత బహువిధ లీలా వర్ణనమ్‌

వ్యాసులు:

తస్మి న్రాసభదైతేయే సానుజే వినిపాతితే

సర్వగోపాల గోపీనాం రమ్యం తాలవనం బభౌ

తత స్తౌ జాతహర్షౌ తు వసుదేవసుతా వుభౌ

 శుశుభాతే మహాత్మానౌ బాలశృంగా వి వర్షభౌ

చారయంతౌ చ గా దూరే వ్యాహంతౌ చ నామభిః

నియోగపాశస్కంధౌ తౌ వనమాలా విభూషితౌ

సువర్ణాంజనచూర్ణాభ్యాం తదా తౌ భూషితాంబరౌ

మహేంద్రాయుధ సంకాశౌ శ్యేత కృష్ణావి వాంబుదౌ

చేరతు ర్లోకసిద్ధాభిః క్రీడాభి రితరేతరమ్‌

సమస్త లోకనాథానాం నాథభూతౌ భువం గతౌ

మనుష్యధర్మాభిరతౌ మానయంతౌ మనుష్యతామ్‌

తజ్ఞాతాగుణయుక్తాభిః క్రీడాభి శ్చేరతు ర్వనమ్‌

తతస్త్వాందోలికాభిశ్చ నియుద్ధైశ్చ మహాబలౌ

వ్యాయామం చక్రతు స్తత్ర క్షేపణీయై స్తథాశ్మభిః

వ్యాసులు:

గర్దభా సురుడు తమ్ములతో హతుడైన దరువాత గోపీ గోపాల బృందమునకు దాళ వనము చక్కని విహార స్థాన మయ్యెను. బలరాములు లేగొమ్ములు గల వృషభము లట్లా గోప సమాజమున రాణించిరి. ఆల మందలను దూర దూరములకు దోలికొని పోయి వానిని రకరక ములైన పేరులం బిలుచు చుండిరి. లేగల పలుపులను భుజము లందు వైచుకొని వన మాలలు దాల్చి సువర్ణాంజన చూర్ణముల చేత మెరయు వలువలం దాల్చి యింద్ర ధనస్సు లట్లు తెలుపు నలుపు మోఘము లట్లు గన వచ్చుచు విచిత్రములైన జాతీయము లయిన యాట లాడుచు విహరింప జొచ్చిరి. సర్వలోక నాథులు నందరకు దిక్కై యవనిం జొచ్చి మనుష్య ధర్మా భిరతులై మానవత్వమును సమ్మానించుచు మానవజాతి కనుగుణ మైన యాట లాడుచు నా వనమున గ్రీడించిరి. మఱియు తూగు టుయ్యా లలూగుచు కుస్తీ మొదలైన జిన్న చిన్న యుద్దము లందల పడుచు నుండీల బద్దలు గొని మీదికి రాళ్ళు విసరుట మొదలగు విచిత్ర వ్యాయామములను వినోదించు చుండిరి.

తల్లిప్సు రసుర స్తత్ర ఉభయోః రమమాణయోః

ఆజగామ ప్రలంబాఖ్యో గోపవేషతిరోహితః

సౌవగాహత నిఃశంకం తేషాం మధ్య మమానుషః

మానుషం రూప మాస్థాయ ప్రలంబో దానవో త్తమః

తయో శ్చిద్రాంతర ప్రేప్సు రతిశీఘ్ర మమన్యత

కృష్ణం తతో రౌహిణేయం హంతుం చక్రే మనోరథమ్‌

హరిణా క్రీడనం నామ బాల క్రీడనకం తతః

ప్రక్రీడితా స్తుతే సర్వేద్వౌ ద్వౌ యుగపదుత్పతన్‌

శ్రీదామ్నాసహ గోవిందః ప్రలంబేన తథా బలః

గోపాలై రపరై శ్చాన్యే గోపాలాః సహ పుప్లువుః

శ్రీదామానం తతః కృష్ణః ప్రలంబం రోహిణీ సుతః

జితవా స్కృష్ణపక్షీయై ర్గోపైరన్యైః పరాజితాః

తే వాహయంత స్త్వన్యోన్యం భాండీరస్కంధ మోత్య వై

పున ర్నివృత్తా స్తే సర్వే యేయే తత్ర పరాజితాః

సంకర్షణం తు స్కంధేన శీఘ్ర ముత్షిప్య దానవః

న తస్థౌ ప్రజగా మైవ స చంద్ర ఇవ వారిదః

అశక్తో వహనే తస్య సంరంభా ద్దానవోత్తమః

వవృధే సుమహాకాయః ప్రావృషీవ బలాహకః

సంకర్షణస్తుతం దృష్ట్వా దగ్ధశై లోపమాకృతిమ్‌

స్రగ్దామలంబాభరణం ముకుటాటోపమస్తకమ్‌

రౌద్రం శకటచక్రాక్షం పాదన్యాసచలత్షితిమ్‌

హ్రియమాణ స్తతః కృష్ణ మిదం వచన మబ్రవీత్‌

కృష్ణ కృష్ణ హ్రియే తైష పర్వతోదగ్రమూర్తినా

కేనాపి పశ్య దైత్యేన గోపాలచ్ఛద్మరూపిణా

య దత్ర సాంప్రతం కార్యం మయామధునిషూదన

తత్కథ్యతాం ప్రయా త్యేష దురా త్మాతిత్వరాన్వితః

త మాహ రామం గోవిందః స్మితభి న్నౌష్ఠసంపుటః

మహాత్మా రౌహిణేయస్య బలవీర్యప్రమాణవిత్‌

అంతట ప్రలంబాసురుడు గోప వేషమున మాటువడి యా గోపకుల నడుమ బ్రవేశించెను. అవకాశము వెదకుచు నా బలరామ కృష్ణులను నప్పట్టున సంహరింప దలచెను. ఒండొరులను భుజముల నెక్కించుకొని మోయుట యనునొక వింత యాటకు జొచ్చి బలరాములతో దలపడెను. శ్రీదాముడను గోపకునితో గృష్ణుడు ప్రలంబునితో బలరాముడు మఱి గోపకులతో గోపకులు నెగిరి యెగిరి యయ్యాటలో వినోదించిరి. కృష్ణుడు శ్రీదాముని బలరాముడు ప్రలంబుని నోడించిరి. కృష్ణుని వైపు గొల్ల లెదిరి గొల్లలను గెలిచిరి. ఓడిన వారోడని వారిని భాండీర స్కందము దాక మోసికొని పోయి తీసికొని రావలెనను బందెము వెట్టి యాడుకొన జొచ్చిరి. ఆ దానవుడు తానే యోడినట్లు నటించి మబ్బులో నున్న చంద్రునట్లు తాను బలరాము నెత్తుకొని పోవుచు నా బరువు మోయ లేనట్లు వర్ష మేఘమట్టి తన కాయమును బెంచెను. బలరాముడు కార్చిచ్చున గాలు పర్వత మట్లు పూలమాలలు వ్రేల దలపై కిరీటము దాల్చి బండి చక్రముల బట్టి మిడి గ్రుడ్లతో రౌద్రకారుడై పాదము లతాకిడిచే భూమి యదర దనను మోసికొని పోవుచున్న వానిని గని కృష్ణా! పెద్దకొండ వలెనై మాయా గోపాల రూపముతో రాక్షసుడే యొకడు నన్ను మోసికొని పోవు చున్నాడు. వీడు పరమ దుర్మార్గుడు. ఇప్పుడు నేనేమి చేయవలెనో దెలుపు మన గోవిందుడు చిరునవ్వునం బెదపులు తెరువ బడ బలరాముని బల పరాక్రమము లెరిగిన వాడు కావున నిట్లనియె.

కృష్ణ:

కి మయం మానుషో భావో వ్యక్త మో వావలంబ్యతే

పర్వాత్మ న్సర్వగుహ్యానాం గుహ్యో దుహ్యాత్మనాత్వయా

స్మరాశేషజగదీశ కారణం కారణాగ్రజ

ఆత్మాన మేనం తద్వ చ్చ జగ త్యేకార్ణవే చయః

భవా నహం చ విశ్వాత్మ న్నేత మేవ హి కారణమ్‌

జగతోస్య జగత్యర్థే భేదేనావాం వ్యవస్థితౌ

త త్స్మర్యతామమేయాత్మంస్త్వయాత్మాజహిదానవమ్‌ మానుష్యమేవమాలంబ్యబంధూనాంక్రియతాంహితమ్‌

కృష్ణ:

సర్వాత్మకుడు సర్వ రహస్యము లకు రహస్యము నైన నీవు మానవ రూపము ధరించుట వినోదార్థము. ఒకానొక కారణమున నాకు నన్నవై యశేష జగత్ర్పభు వైన నీవు సర్వ కారణమైన నీ స్వరూపమును దలచు కొనుము. జగమెల్ల నేకార్ణవమై నపుడు నీవును నేను నుంగలిసి యేకైక పరబ్రహ్మ మగుటయు, నీ జగము నిలుపుటకు వేరగుటకు వేరగుటయు సత్యము. కావున తన్ను దానెరిగి యీ దానవుని సంహరింపుము. మానుష భావమిట్లు పూని మన వారికీ బంధువులకు హితవు జేయుము.

వ్యాసులు:

ఇతిసంస్మారితో విప్రాః కృష్ణేన సుమహాత్మనా

విహస్య పీడయామాస ప్రలంబం బలవా న్బలః

ముష్ఠినా చాహన న్మూర్థ్ని కోపసంరక్తలోచనః

తేన చాస్య ప్రహారేణ బహిర్యాతే విలోచనే

స నిష్కాసితమస్తిష్కో ముఖాచ్ఛోణిత ముద్వమన్‌

నిపపాత మహీపృష్ఘే దైత్యవర్యో మమార చ

ప్రలంబం నిహతం దృష్ఠ్వా బలేనాద్బుతకర్మణా

ప్రహృష్టా స్తుఘ్టువుర్గోపాః సాదు సాధ్వితిచాబ్రువన్‌

సంస్తూయమానో రామస్తు గోపైర్దైత్యే నిపాతితే

ప్రలందే సహవృష్ణేన పునర్గోకుల మాయయౌ

వ్యాసులు:

ఇట్లు కృష్ణ భగవానునిచే జ్ఞప్తి చేయబడి హలి యల్లన నవ్వి ప్రలంబుని బట్టియెత్తి కోపముచే కన్ను లెర్రబడ బిడికిట వాని నడి నెత్తిపై గ్రుద్దెను. ఆ దెబ్బతో వాడు కనుగ్రుడ్లు వెలికి జన తల పగిలి నోట రక్తము గ్రక్కికొని భూమిపై బడి మృతి నొందెను. అద్భుతమైన బలముచే బలుడట్లు ప్రలంబుని గూల్ప గోపకులు బాగు బాగని యానంద భరితులై రాముని స్తుతించిరి. అవ్వల గోపకులతో కృష్ణునితో బలరాముడు గోకులమున కేతెంచెను.

తయోర్విహరతో రేవం రామకేశవయో ర్ర్వజే

ప్రావృడ్వ్యతీతా వికసత్సరోజా చాభవ చ్ఛరత్‌

విమలాంబరనక్షత్రే కాలే చాభ్యాగతే వ్రజమ్‌

దదర్శేంద్రోత్సవారంభప్రవృత్తా న్వ్రజవాసినః

కృష్ణ స్తా నుత్సుకా న్దృష్ట్వా గోపా నుత్సవలాలసాన్‌

కౌతూహలా దిదంవాక్యం ప్రాహ వృద్ధా న్మహామతిః

కోయం శక్రమహో నామ యేనవో హర్షఆగతః

ప్రాహతం నందగోపశ్చ పృచ్ఛంత మతిసాదరమ్‌

రామ కేశవు లట్లు విహరించు చుండగ వర్ష ఋతువు గడచి తామర పూలు వికసింప శరద్దృతువు వచ్చెను. ఆకాశము స్వచ్ఛమై నక్షత్రములు కాంతులం జిమ్మ జక్కని యా సమయ మందు వ్రేవల్లె జనము ఇంద్రోత్స వారంభము సేయ గుతూహల పడుట చూచి కృష్ణుడు పెద్ద వాండ్రతో ముచ్చటగ ఈ యింద్రోత్సవ మనగా నేమి? దీనికి మీరింత యానంద పడుటకు గారణ మేమి యని యడుగ నందు డతనితో నిట్లనియె.

మేఘనాం పయపా మీశో దేవరాజః శతక్రతుః

యేన సంచోదితా మేఘా వర్షం త్యంబు మయం రసమ్‌

తద్వృష్టిజనితం సవ్యం వయ మన్యేచ దేహినః

వర్తయామోపభుంజానా స్తర్పయామశ్చ దేవతాః

క్షీరవత్య ఇమాగావో వత్సవత్యశ్చ నిర్వృతాః

తేన సంవర్థితై స్సస్యైః పుష్టా స్తుష్టా భవంతివై

నాసస్యా నా తృణాభూమి ర్న బుభుక్షార్దితో జనః

దృశ్యతే యత్ర దృశ్చంతే వృష్టిమంతో బలాహకాః

భౌమ మేతత్స యోగోభిర్థత్తే సూర్యస్యవారిదః

పర్ణన్యః సర్వలోకస్య భవాయ భువి వర్షితి

తస్శాత్ప్రావృషి రాజానః శక్రం సర్వే ముదాన్వితాః

మషేసురేశ మర్ఘంతి వయ మనే చ దేహినః

నందగోపస్య వచనం శ్రుత్వేత్థం శక్రపూజనే

కోపాయ త్రిదశేంద్రస్య ప్రాహ దామోదర స్తదా

మేఘములకును జలములకును దేవేంద్రు డధిపతి. అతని ప్రేరణముచే జల రూపమున సర్వప్రాణ ధారక మయిన రసము నవి వర్షించును. ఆ వర్షముచే బండిన పంటను మనము మఱి యితర ప్రాణులు. దిని బ్రతుకుదుము. దేవతలను దానిచే దృప్తి పరుతుము. ఆవులు పాలిచ్చును. లేగ తలతో నవి వాన వలన గల్గిన సస్యము సంతృప్తి వడును. సస్య సమృద్ధి పచ్చిక (మేత) సమృద్ధి మేఘ నిమిత్తమే. సకాలమున వర్షించు మేఘములు గలచోట నాకలి కలమటించు జన ముండదు. సూర్య కిరణముల చేత మేఘ మీ భూమి యందలి యుదకమును జేకొని ధరించును. సర్వలోక జీవనమునకు భూమిపై నది వర్షించును. అందు వలన వర్షఋతువు నందెల్ల రాజులు సంతోషముతో నీ యుత్సవము నందు దేవేంద్రుని గొలుతురు. మనము మఱి యెల్ల జీవులు నమర పతిని గొలుచుటయు నందులకే. అని తెలుప నందుని మాట విని యింద్రుని బూజించు విషయమున కృష్ణుడు దేవేంద్రునకు గోపము గలుగ నిట్లనియె.

నవయం కృషికర్తారో వాణిజ్యాజీవినో న చ

గావోస్మ ద్దైవతం తాత వయం వనచరా యతః

ఆన్వీక్షకీ త్రయీ వార్తా దండనీతి స్తథాపరా

విద్యాచతుష్టయం త్వేత ద్వార్తామత్ర శృణుష్వమే

కృషిర్వణిజ్యా తద్వచ్చ తృతీయం పశుపాలనమ్‌

విద్యాహ్యేతా మహాభాగా వార్తా వృత్తిత్రయాశ్రితా

కర్షకాణాం కృషిర్వృత్తిః పణ్యంత త్పణ్వజీవినామ్‌

అస్మాకం గాః పరావృత్తి ర్వార్తా భేదై రియం త్రిభిః

విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్‌

నైవ పూజ్యార్చనీయా చ సైవ తస్యోపకారికా

యో యస్యాః ఫలమశ్నన్వై పూజయత్యపరాం నరః

ఇహచ ప్రేత్య చై వాసౌ తాత నాప్నోతి శోభనమ్‌

పూజ్యంతాం ప్రధితాః సీమాః సీమాంతం చ పునర్వనమ్‌

వనాంతా గిరయః సర్వే సా చాస్మాకం పరాగతిః

గిరియజ్ఞ స్త్వయం తస్మా ద్గోయజ్ఞశ్చ ప్రవర్త్యతామ్‌

కి మస్మాకం మహేంద్రేణ గావః శైలాశ్చ దేవతాః

మంత్రయజ్ఞపరా విప్రాః సీరయజ్ఞాశ్చ కర్షకాః

గిరిగోయజ్ఞశీలాశ్చ వయ మద్రివనాశ్రయాః

తస్మాద్గోవర్థనః శైలో భవద్భి ర్వివిధార్హణైః

ఆర్చ్యతాం పూజ్యతాం మేధ్యం పశుం హత్వా విధానతః

సర్వఘోషస్య సందోహా గృహ్యంతాం మా విచార్యతామ్‌

భోజ్యంతాం తేన వైవిప్రా స్తథాన్యేచాపి వాంఛకాః

త మర్చత కృతేహోమే భోజితేషు ద్విజాతిషు

శరత్పుష్పకృతాపీడాః పరిగచ్ఛంతు గోగణాః

ఏతన్మమ మతం గోపాః సంప్రీత్యా క్రియతే యది

తతః కృత్వా భవే త్ర్పీతిర్గవా మద్రే స్తథా మమ

ఇతి తస్య వచః శ్రుత్వా సందాద్యాస్తే వ్రజౌకసః

 ప్రీత్యుత్భుల్లముఖా విప్రాః సాధుసా ధ్విత్యథాబ్రువన్‌

శోభనం తే మతంవత్స తదేతద్భవతోదితమ్‌

తత్కరిష్యా మ్యహంసర్వం గిరియజ్ఞః ప్రవర్త్యతామ్‌

తథా చ కృతవంత స్తే గిరియజ్ఞం వ్రజౌకసః

దధిపాయసమాంసాద్యై ర్దదుః శైలబలిం తతః

ద్విజాంశ్చ భోజయామాసుః శతశోథ సహస్రశః

గావః శైలం తతశ్చక్రు రర్చితంత ప్రదక్షిణమ్‌

వృషభాశ్చాభినర్దంతః సతోయా జలదా ఇవ

గిరిమూర్దని గోవిందః శైలోహ మితి మూర్తిమాన్‌

బుభుజేన్నం బహువిధం గోపవర్యాహృతం ద్విజాః

కృష్ణ స్తేనై వరూపేణ గోపైః సహగిరేః శిరః

అధిరుహ్యార్చయామాస ద్వితీయామాత్మనస్తనుమ్‌

అంతర్ధానం కృతేతస్మిన్గోపా లబ్ధ్వా తతోవరాన్‌

కృత్వా గిరిమహం గోష్ఠం నిజ మభ్యాయయుః పునః

మనము కర్షకులము గాము. వర్తక మును జేసి జీవించు వారము కాము. గోవులే మనకు దైవము. వనము నందు సంచరింతుము. ఆన్వీక్షకి త్రయీ వార్తా (వర్తకము) దండనీతి అని విద్య నాల్గు విధములు. వీనిలో వార్త యనగ వ్యవసాయము వాణిజ్యము పశు పాలనము నను పేర మూడు వృత్తులు చెప్ప బడినవి. కర్షకులకు గృషి పణ్య జీవులకు (వర్తకులకు) వర్తకము వృత్తులు మన కన్ననో గోపాలనము ముఖ్య వృత్తి. ఈ విధముగ వార్త యనునది మూడే తెఱంగుల చెప్పబడినది. ఎవ్వడే విద్యను నేర్చునో యదే వానికి పరమ దైవము. అదే పూజింప దగినది ఆరాధింప దగినదియు అదే వాని కుపకారము కూడ. ఒకదాని ఫలము అనుభవించుచు వేరొక విద్యను బూజించు వాడు ఇహపరము లందు శుభ మందడు. ప్రసిద్ధమైన మన హద్దులను (ఆవుల దొడ్లను) బూజింతము. వాని కన్నిటికి హద్దు గానున్న వనమును బూజింతము. వనములకు బరమావధు లైన కొండలు మనకు పరమ దైవములు. కావున గిరి యజ్ఞము (కొండ దేవతల పూజ) గో యజ్ఞము (గో పూజ) మనము కావింతము. ఇంద్రునితో మనకేమి పని? గోవులు కొండలు మనకు దేవతలు. విప్రులు మంత్ర యజ్ఞ పరులు. మంత్రా నుష్ఠానమే వారికి యజ్ఞము. కర్షకులకు యజ్ఞము నాగలి. కొండ లందును అడవు లందు నుండు మనకు గొండలను గోవులను గొలుచుటే యజ్ఞము (పూజ). కావున తామందరు రకరకము లైన పూజా ద్రవ్యములచే బశువును బలియిచ్చి యథా విధిగ గోవర్ధన గిరి నర్చింపుడు. వ్రేపల్లెలో నున్న సర్వ సంభారములను జేకొనుడు ఆలోచింప వలదు. ఆ సామాగ్రిచే విప్రేలకు మఱి యన్నార్దులకు సంతర్పణము జేయుదుము గాక! ఆ అర్చింప బడిన కొండ నుద్ధేశించి హోమములు సేసి ద్విజులకు సంతర్పణము సేసిన తరువాత శరద్దృతువు నందలి పూలను శిరముల దాల్చి మన యావుల మందలె వ్రేపల్లెకు మరలును గాక! ఇది నామతము. దీనిని బ్రీతితో జేసిన యెడల గోవులకు బ్రీతి గల్గును. గోవర్ధన గిరికిని నాకును కూడ సంతోష మగును. అని తెలుప గృష్ణుని పలుకులు విని నందాదు లందరు సంతోషముచే మోములు విప్పార బాగు బాగని వత్సా! నీ యభిప్రాయము పరమ శోభనము. నీ చెప్పిన మాట నేమను సరింతుము ఈ గిరి యజ్ఞము సాగింప బడుగాక! యని ప్రజ వాసులెల్లరు పెరుగు పాయసము మాంసములతో గొండకు బలి యిచ్చిరి. నూర్లు వేలుగ విప్రులకు విందులు సేసిరి. అట్లు కొలువ బడిన యా గిరికి గోవులు ప్రదక్షిణము సేసినవి. నజల జలదము లట్లు వృషభములు రంకెలు వేయుచు గిరిప్ర దక్షిణము సేసెను. గోవిందుడు కొండ నెత్తమున గూర్చుండి నేనే మూర్తి ధరించిన కొండ దేవతనని యా గోప శ్రేష్టులు గొనివచ్చి నివేదించిన పలు తెరంగులైన యన్నముల నారంగించెను. మఱియు నదే రూపమున కృష్ణుడు గిరి శిఖరమున కెక్కి యది తన రెండవ మూర్తిగ బూజించెను. తరువాత నతడంతర్థానము కాగ యతని వనల గోపకులు వరములం బొంది యిట్లు గోవర్ధ నోత్సవము సేసి తమతమ గోష్ఠములకు (గోశాలలకు) తరలి వచ్చిరి.