బ్రహ్మ:
యదాభవేన్మహాజ్యైష్ఠీ రాశినక్షత్రయోగతః
ప్రయత్నేన తదా మర్త్యై ర్గంతవ్యం పురుషోత్తమమ్
కృష్ణందృష్ట్వా మహాజ్యైష్ఠ్యాం రామంభద్రాం చ భోద్విజాః
నరో ద్వాదశయాత్రాయాః ఫలం ప్రాప్నోతిచాధికమ్
ప్రయాగే చ కురుక్షేత్రే నైమిశే పుష్కరే గయే
గంగాద్వారే కుశావర్తే గంగాసాగరసంగమే
కోకాముఖే శూకరే చ మథురాయాం మరుస్థలే
శాలగ్రామే వాయుతీర్థే మందరే సింధుసాగరే
పిండారకే చిత్రకూటే ప్రభాసే కనఖలే ద్విజాః
శంఖోద్ధారే ద్వారకాయాం తథా బదరికాశ్రమే
లోహకుండే చాశ్వతీర్థే సర్వపాపప్రమోచనే
కామాలయే కోటితీర్థే తథా చామరకంటకే
లోహార్గళే జంబుమార్గే సోమతీర్థే పృథూదకే
ఉత్పలావర్తకే చైవ పృథుతుంగే సకుబ్జకే
ఏకామ్రకే చ కేదారే కాశ్యాం చ విరజే ద్విజాః
కాలాంజరే చ గోకర్ణే శ్రీశైలే గంధమాదనే
మహేంద్రే మలయేవింధ్యే పారియాత్రే హిమాలయే
సహ్యేచ శుక్తిమంతేచ గోమంతే చార్బుదే తథా
గంగాయాం సర్వతీర్థేషు యామునేషుచ భో ద్విజాః
సారస్వతేషు గోమత్యాం బ్రహ్మపుత్రేషు సప్తసు
గోదావరీ భీమరథీ తుంగభద్రా చ నర్మదా
తాపీ పయోష్టీ కావేరీ శిప్రాచర్మణ్వతీ ద్విజాః
వితస్తా చంద్రభాగా చ శతద్రుర్బాహుదా తథా
ఋషికుల్యా కుమారీ చ విపాశా చ దృషద్వతీ
సరయూ ర్నాకగంగాచ గండకీచ మహానదీ
కౌశికీ కరతోయా చ త్రిస్రోతా మధువాహినీ
మహానదీ వైతరిణీ యాశ్చాన్యా నానుకీర్తితాః
ఆథవా కిం బహూక్తేన భాషితేన ద్విజోత్తమాః
పృథివ్యాం సర్వతీర్థేషు సర్వేష్వాయతనేషు చ
సాగరేషు చ శైలేషు నదీషు చ సరస్సు చ
యత్ఫలం స్నానదానేన రాహుగ్రస్తే దివాకరే
తత్ఫలం కృష్ణమాలోక్య మాహాజ్యైష్ఠ్యాం లభేన్నరః
తస్మాత్సర్వప్రయత్నేన గంతవ్యం పురుషోత్తమే
మహాజ్యైష్ఠ్యాం మునిశ్రేష్ఠా సర్వకామఫలేప్సుభిః
దృష్ట్వా రామం మహాజ్యేష్ఠం కృష్ణం సుభద్రయా సహ
విష్ణులోకం నరోయాతి సముద్ధృత్య సమంకులమ్
భుక్త్వా తత్ర వరాన్భోగా న్యావదాభూతసంప్లవమ్
పుణ్యక్షయాదిహాగత్య చతుర్వేదీ ద్విజోభవేత్
స్వధర్మనిరతః శాంతః కృష్ణభక్తో జితేంద్రియః
వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షమవాప్నుయాత్
బ్రహ్మ:
మహాజ్యేష్ఠి పర్వము నందు పురుషోత్తమ క్షేత్రము సేవింప దగినది. శ్రీకృష్ణుని బలరాముని సుభద్రను ఆనాడు దర్శించుట వలన ప్రయాగ మొదలైన పుణ్య క్షేత్రములను సేవించిన పుణ్యము ద్వాదశ క్షేత్ర యాత్రా ఫలము లభించును. గోదావరి మొదలైన పుణ్య నదులు సేవించిన ఫలము కూడ సిద్ధించును. భూమి యందు గల సర్వ దేవాలయ ములను, నదీ సాగర పర్వత తీర్థములను సేవించి స్నాన దానాదులు చేసిన పుణ్యము కృష్ణ దర్శనము చేత లభించును. అంతేగాక విష్ణు లోకము కూడ లభించి అచ్చట పుణ్యానుభవ మయిన తరువాత కర్మభూమి యందు జనించి చతుర్వేదా ధ్యయనము జేసి వేదోక్తాచార ధర్మ నిరతుడై కృష్ణ భక్తుడై విష్ణుభక్తి యోగము నంది మానవుడు మోక్షము పొందును.
Summary of chapter 64 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
Twelve specific sacred pilgrimages within and around the Puruṣottama kṣetra are enumerated, each with its prescribed route, ritual procedures, and specific spiritual fruits. The cumulative merit of completing all twelve is described as conferring everything from worldly prosperity to final liberation. The chapter systematizes the pilgrimage experience at the kṣetra as a practical guide for devoted pilgrims.