బ్రహ్మ మహా పురాణము
184 - బృందావన గమనమ్
వ్యాసులు:
విముక్తో వసుదేవోపి నందస్య శకటంగతః
ప్రహృష్టం దృష్టవాన్నందం పుత్రోజాతోమమేతివై
వసుదేవోపి తం ప్రాహ దిష్ట్యాదిష్ట్యేతిసాదరమ్
వార్థకేపి సముత్పన్న స్తనయోయం తవాధునా
దత్తోహి వార్షికః సర్వోభవద్భిర్నృపతేః కరః
యదర్థమాగత స్తస్మాన్నాత్ర స్థేయం మహాత్మనా
యదర్థమాగతః కార్యం తన్నిష్పన్నం కిమాస్యతే
భవద్భిర్గమ్యతాం నంద తచ్ఛీంఘ్రం నిజగోకులమ్
మమాపిబాలకస్తత్ర రోహిణీ ప్రసవో హియః
స రక్షణీయో భవతా యథాయం తనయో నిజః
వ్యాసులు:
వసుదేవుడు కారాగృహ ముక్తినం నందుని బండి యెక్కి నాకు పుత్రుడు గల్గి నాడని యానంద భరితుడగు చున్న నందుని జూచెను. మఱియు నతనితో నాదరము గొని నీకి వార్థక మందు పిల్లవాడు గల్గినాడు. రాజునకు మీరేటేట జెల్లింప వలసిన పన్ను గట్టుటకు వచ్చియది చెల్లింప బడె గదా వచ్చిన పని యైనది. శీఘ్రముగ గోకుల మున కేగుడు నాకు నక్కడ రోహిణి యందు శిశువు పుట్టినాడు మీ బిడ్డనట్లు వానిని తమరు రక్షింప వలయును. అనియె.
వ్యాసులు:
ఇత్యుక్తాః ప్రయయుర్గోపా నందగోపపురోగమాః
శకటారోపితైర్భాండై కరందత్త్వా మహాబలాః
వసతాం గోకులేతేషాం పూతనా బాలఘాతనీ
సుప్తం కృష్ణముపాదాయ రాత్రౌచ ప్రదదౌస్తనమ్
యస్మై యస్మైస్తనం రాత్రౌపూతనా సంప్రయచ్ఛతి
తస్యతస్య క్షణేనాంగం బాలకస్యోపహన్యతే
కృష్ణస్తస్యాః స్తనం గాఢం కరాభ్యామతిపీడితమ్
గృహీత్వా ప్రాణసహితం పపౌక్రోధసమన్వితః
సా విముక్తమహారావా విచ్చిన్నస్నాయుబంథనా
పపాత పూతనా భూమౌ మ్రియమాణాతిభీషణా
తన్నాదశ్రుతి సంత్రాసాద్విబుద్దాస్తే వ్రజౌకసః
దదృశుః పూతనోత్సంగే కృష్ణంతాంచ నిపాతితామ్
ఆదాయ కృష్ణం సంత్రస్తా యశోదాచ తతోద్విజాః
గోపుచ్చభ్రమణాధ్యైశ్చ బాలదోషమపాకరోత్
గోపురీష ముపాదాయ నందగోపోపిమస్తకే
కృష్ణస్య ప్రదదౌ రక్షాం కుర్వన్నిద ముదైరయత్
వ్యాసులు:
నందాది గోపకులిట్లు తెలుప బడి బండ్ల మీద ధన భాండముల నెక్కించుకొని తెచ్చిన ధనమును పన్ను జెల్లించి వ్రేపల్లె యందుండగా బాలఘాతిని యైన పూతన వచ్చి నిదిరించు చున్న కృష్ణు నెత్తుకొని యొకరేయి పాలిచ్చెను. ఆమె యెవ నెవ్వనికి చను గుడిపేనో వాని వాని శరీరము నశించు చుండును. కృష్ణుడా రాక్షసి స్తనము నిరు చేతుల నొత్తి పట్టుకొని కోపమున పాలతో బాటు ప్రాణములం ద్రావి వైచెను. అది యర్చుచు ప్రేవులు దెగి ప్రాణములు వాసి పుడమిం బడి పోయెను. దాని యర్పు విని హడలి పోయి మేల్కని వ్రేపల్లె లోని జనము పూతన యొడిలో నున్న కృష్ణుని గూలిపడి యున్న యా రక్కసినిం గాంచిరి. యశోద తటాలున కృష్ణు నెత్తుకొని జడిసి పోయి అవుతోక తలచుట్టు తిప్పుట నుదుట గోమయము బొట్టు వెట్టుట మున్నగు నంగ రక్షలు సేసి చంటి పిల్లల కగు దోషమును వారించెను. మఱియు నాతల్లి యిట్లు రక్షా కవచముం బఠించెను.
యశోద:
రక్షతు త్వామశేషాణాం భూతానాం ప్రభవోహరిః
యస్యనాభిసముద్భూతాత్పంకజాద భవజ్జగత్
యేన దంష్ట్రాగ్రవిధృతా ధార యత్యవనీ జగత్
వరాహరూప ధృగ్దేవః స త్వాం రక్షతుకేశవః
గుహ్యం స జఠరం విష్ణుర్జంఘే పాదౌ జనార్దనః
వామనో రక్షతు సదా భవంతంయః క్షణాదభూత్
త్రివిక్రమక్రమాక్రాంత త్రైలోక్య స్పురదాయుధః
శిరస్తేపాతు గోవిందః కంఠం రక్షతు కేశవః
ముఖబాహూ ప్రబాహూచమనః సర్వేంద్రియాణిచ
రక్షత్వవ్యాహతైశ్వర్యస్తవ నారాయణోవ్యయః
త్వాం దిక్షుపాతు వైకుంఠో విదిక్షు మధుసూదనః
హృషీకేశోంబరే భూమౌ రక్షతు త్వాంమహీధరః
యశోద:
ఎవని బొడ్డునం బొడమిన తామర పువ్వు నుండి జగత్తు పొడమినదో యా సర్వభూత కర్తయగు హరి నిన్ను రక్షించు గాక! ఎవ్వని కోరు తుట్టతుద ధరింప బడిన ధారుణి సర్వ జగత్తును ధరించు చున్నదో ఆ వరాహ రూపముల దాల్చిన వేల్పు కేశవుడు నిన్ను రక్షించు గాక! నీ గుహ్యమును జఠరమును విష్ణువు నీ పిక్కలను బాదములను జనార్దనుడు రక్షించు గాక! ఎవ్వడు వామన మూర్తియై క్షణములో మూడడుగు లిడి ముల్లోకముల నాక్రమించె నా వామన మూర్తి యాయుధముల గొని నిన్ను బ్రోచు గాక, గోవిందుడు నీ శిరస్సును గాపాడు గాక! కేశవుడు నీ కంఠమును రక్షించుత! నీ ముఖము నీ బాహువులు నీముం జేతులను మనస్సును సర్వేంద్రియ ములను ఆ వ్యాహ తైశ్వర్యుడు అవ్యయుడు నగు నారాయణుడు రక్షించు గాక! నలు దిక్కుల నిన్ను వైకుంఠు డేలుగాక! విదిక్కు లందు మదుసూదనుడు బ్రోచుగాక! అంబర వీథిని హృషీకేశుడు మహీధరుడు భూమి యందును నిన్ను రక్షించుత!
వ్యాసులు:
ఏవం కృత స్వస్త్యయనో నందగోపేన బాలకః
శాయితః శకటస్యాధో బాలపర్యంకికాతలే
తే చ గోపా మహద్దృష్ట్వా పూతనాయాః కలేబరమ్
మృతాయాః పరమంత్రాసం విస్మయం చ తదాయయుః
వ్యాసులు:
అని యిట్లు యశోదమ్మ చేత మంగళా శాసనములు సేయ బడి బాలకుడు బండి క్రింద పొత్తళ్ల బరుండ బెట్ట బడియె. గోపకు లట గూలిన పూతన కళేబరముం జూచి చచ్చిన దానిం జూచియు నడలిపోయి యబ్బుర మందిరి.
కదాచిచ్ఛకటస్యాధః శయానోమధుసూదనః
చిక్షేప చరణాపూర్ద్వం స్తనార్థీ ప్రరురోద చ
తస్య పాదప్రహారేణ శకటం పరివతర్తితమ్
విధ్వస్త భాంఢకుంభం తద్విపరీతం పపాతవై
తతో హాహాకృతః సర్వో గోపగోపీజనో ద్విజాః
ఆగత్యచ తదాజ్ఞాత్వా బాలము త్తానశాయినమ్
గోపాః కేనేతిజగదుః శకటం పరివర్తితమ్
తత్రైవ బాలకాః ప్రోచుర్బాలే నానేస పాతితమ్
రుదతా దృష్ట మస్మాభిః పాదవిక్షేపతాడితమ్
శకటం పరివృత్తం వై నైతదన్యస్య చేష్టితమ్
ఒకతఱి నా బండి క్రింద బరుండిన మధుసూదనుండు రెండు పాదములు మీదికెత్తి పాలకై యేడ్చు చుండెను. ఆ స్వామి పాదముల తోవున కా బండి తలక్రిందు లాయె. అందున్న పాల కడవ లెల్ల బోర్ల పడియె. అంత నాగోప గోపీ జనము హాహాకార మొనరించిరి. అందఱు వచ్చి వెల్లగిల పరున్న శిశువుం గని యీ బండి యెవ్వని వలన దిరుగు వడినదని యడిగిరి. అటనున్న పిల్ల లీ పిల్లవాని వలననే యిది వడినది. ఏడ్చుచు నీతడు పాదము లాడింప నవి తగిలి యీ బండి తలక్రిందు లైన దీపని మఱి యెవ్వనిది గాదనిరి. అది విని గోపకు లింకను వింత వడిరి.
తతః పునరతీవాసన్‌గోపా విస్మితచేతసః
నందగోపోపి జగ్రాహ బాలమత్యంత విస్మితః
యశోదా విస్మయారూఢా భ్నగభాండ కపాలకమ్
శకటం చార్చయామాస దధి పుష్పఫలాక్షతైః
గర్గశ్చ గోకులేతత్ర వసుదేవప్రచోదితః
ప్రచ్చన్న ఏవ గోపానాం సంస్కారము కరోత్తయోః
జ్యేష్ఠం చ రామమిత్యాహ కృష్ణం చైవ తథాపరమ్
గర్గో మతిమతాం శ్రేష్ఠో నామ కుర్వన్ మహామతిః
అల్పేనైవ హి కాలేన విజ్ఞాతౌతౌ మహాబలౌ
ఘృష్ట జానుకరౌ విప్రా బభూవతు రుభావపి
కరీష భస్మ దిగ్ధాంగౌ భ్రమమాణా వితస్తతః
న నివారయితుం శక్తా యశోదా తౌన రోహిణీ
గోవాటమధ్యే క్రీడంతౌ వత్సవాటగతౌ పునః
తదహర్జాతగోవత్స పుచ్ఛాకర్షణ తత్పరౌ
యదాయశోదా తౌ బాలావేక స్థానచరావుభౌ
శశాక నో వారయిత్తుం క్రీడంతా వతిచంచలౌ
దామ్నా బద్ ధ్వా తదా మధ్యేనిబబంధ ఉలూఖలే
కృష్ణ మక్లిష్టకర్మాణమాహ చేద మమర్షితా
యదిశక్తోసి గచ్ఛ త్వమతి చంచల చేష్టిత
ఇత్యుక్త్వా చ నిజం కర్మ సా చకార కుటుంబినీ
వ్యగ్రాయా మథ తస్యాం స కర్షమాణ ఉలూఖలమ్
యమలార్జునయోర్మధ్యే జగామ కమలేక్షణః
కర్షతా వృక్షయోర్మధ్యే తిర్యగేవ ములూఖలమ్
భగ్నావుత్తుంగ శాఖాగ్రౌ తేన తౌ యమలార్జునౌ
తతః కటకటాశబ్ద సమాకర్ణన కాతరః
అజగామ వ్రజజనో దదృశే చ మహాద్రుమౌ
భగ్నస్కందౌ నిపతితౌ భగ్నశాఖౌ మహితలే
దదర్శచాల్పదంతాస్యం స్మితహాసం చ బాలకమ్
తయోర్మధ్యగతం బద్ధం దామ్నాగాఢం తథోదరే
నందగోపుడా బిడ్డ నెత్తికొని వెఱగు వడియె. యశోద యబ్బుర పడి పగిలిన కుండ పెంకులు గల బండిని పెరుగు పూలు పండ్లు నక్షతలచే నర్చించెను. గర్గాచార్యుల గోకుల మందు వసుదేవు ప్రేరణముచే (కంస భీతిచే) నెవ్వనికిం దెలియ రాకుండనే యా బలరామ కృష్ణులకు జాతకర్మాది సంస్కారము లొనరించె. ఆ ముని పెద్ద వానిని రాముడని యవ్వలి వానిని కృష్ణుడని పేర్కొనియె. అత్యల్ప కాలము ననే యా బాలురు మహాబల సంపన్ను లయిరి. కాలు సేతు లాడించుచు గ్రమముగా బ్రాకుచు వెలి బూడిద మెడల బూసుకొని యిట్టుటు నడయాడు చుండ నా యన్నదమ్ముల నా తల్లి యశోద పట్టలేని దయ్యెను. గోవాటము నందు లేగల దొడ్డి యందు నాబాలు రానాడే పుట్టిన లేగ దూడల తోకలు గొని లాగుచు నిద్ద రోక్కచోట నడ యాడుచు నాట లాడుచుండ యశోద వారి బట్ట లేనిదయ్యె. ఒక్కతఱి నాతల్లి కినుకు గని కృష్ణుని ద్రాడుగొని ఱోలికిం గట్టి ఓరోరి అల్లరి పిల్లవాడ! నీ చేత నైన నేది వెళ్లు మెటు వోదవో చూచెదనని యింటి పనులు సక్కవెట్టు తొందరలో నుండ రోలిడ్చు కొంచు పోయిపోయి కమల నయనుడు హరి రెండు మద్ది చెట్ల నడుమం జొచ్చి యిరుకు త్రోవం జనుచుండ ఱోలు తిఱగుడు వడి తాక నాచెట్లు పెను గొమ్మల గూలి పడి పోయెను. అంత నచ్చట పొడమిన కటకటా శబ్దము విని బెదరి వ్రేపల్లె నము గ్రమ్ముకొని యా పెను మ్రాకుల మొదళ్ళు పెల్లగిలి కొమ్మలు విఱిగి పుడమి బడంజూచిరి. దానితో బాటు వచ్చియు రాని పలు వరుస మందహాస నింపు గులుక నామ్రాకు లజంట నట్ట నడుమ బొజ్జ దిఱుగ పెనురజ్జువున గట్ట బడినా పలు దిట్టనా చిట్టి కుఱ్ఱం గనిరి.
తతశ్చ దామోదరతాం స యయౌ తామబంధనాత్
గోపవృద్ధాస్తతః సర్వే నందగోవ పురోగమాః
మంత్రయామసురుద్విగ్నా మహోత్పాతాతిభీరవః
స్థానేనేహ న నః కార్యం వ్రజామోన్యత్ మహావనమ్
ఉత్పాతా బహవో హ్యత్ర దృశ్యంతే నాశహేతవః
పూతనాయా వినాశశ్చ శకటస్య విపర్యయః
వినా వాతాది దోషేణ ద్రుమయోః పతనం తథా
బృందాపనమితః స్థానాత్తస్మాద్గచ్చామ మాచిరమ్
యావద్భౌమమహోత్పాత దోషో నాభిభవేద్ వ్రజమ్
ఇతి కృత్వా మతిం సర్వే గమనే తే వ్రజౌకసః
ఊచుః స్వం స్వం కులం శీఘ్రం గమ్యతాం మా విలంబ్యతామ్
తతః క్షణేన ప్రయయుః శకటైర్గోధనైస్తథా
యూథశో వత్సపాలీశ్చ కాలయంతో వ్రజౌకసః
సర్వావయవ నిర్దూతం క్షణమాత్రేణ తత్తదా
దామముచే నుదరమునం గట్టబడిన వాడు గావున దాన నాతడు దామోదరు డయ్యె. అవ్వల గోప వృద్దులు నందాదులు చెదరి పోయి యెడనెడ నిట్లు గల్గు మహోత్పాతము లకు జడిసి పోయి యిచ్చోటు వలన బని లేదెట కేని కారడవికి బోవుదమని కొనిరి. పెక్కు రకముల వ్రేపల్లెం దోచు నుత్పాతము లివి. పూతన గూలుట బండి తలక్రిందు లగుట పెనుగాలి మఱి యే దోషము లేక చెట్లు గూలి పడుట యివన్నియు మనకు నాశన హేతువులు అందుచే నిట నుండి లేచి యిపుడు బృందావనమున కేగుదుము గాక! భౌమ మయిన యుత్పాత దోష మేర్పడ కుండ నీ పల్లెను విడచి పోవలయు నని నిశ్చయించిరి. మఱియు దమదమ వారిని బందుగులను విలంబము వలదు లెండని హెచ్చరించి యందఱు బండ్లెక్కి గో ధనములతో (మందలతో) నాలమే పరులను వ్రజ వాసులను పిలిచి కొనుచు మందలుగా దరలి చనిరి. క్షణ ములో నా వ్రజవాటము సర్వా వయవ భంగము పొంది కాకికూతల వెఱవై పోయెను.
కాకకాకి సమాకీర్ణం వ్రజస్థాన మభూద్విజాః
బృందావనం భగవతా కృష్ణేనా క్లిష్టకర్మణా
శుభేన మనసా ధ్యాతం గవాం వృద్దిమభీప్సతా
తతస్తత్రాతి రూక్షేపి ఘర్మకాలే ద్విజోత్తమాః
ప్రావృట్కాల ఇవాభూచ్చ సవశష్పం సమంతతః
స సమావాసితః సర్వోవ్రజో బృందావనే తతః
శకటీవాట పర్యంత చంద్రార్థా కార సంస్థితిః
వత్సపాలౌ చ సంవృత్తౌ రామదామోదరౌతతః
తత్ర స్తితౌ తౌ గోష్ఠే చ చేరతుర్భాలలీలయా
బర్హిపత్ర కృతాపీడౌ వన్య పుష్పావతంసకౌ
గోపవేణు కృతాతోద్య పత్రవాద్య కృతస్వనౌ
కాక పక్ష ధరౌ బాలౌ కుమారా వివపావకౌ
హసంతౌ చరమంతౌ చ చేరతుస్తం మహద్వనమ్
క్వచిద్ధసంతా వన్యోన్యం క్రీడమానౌ తథాపరైః
గోపపుత్రైః సమం వత్సాంశ్చారయంతౌ విచేరతుః
కాలేన గచ్చతా తౌతు సప్తవర్షౌ బభూవతుః
భగవంతుడు కృష్ణుడు గోవుల క్షేమాభివృద్దు లంగోరి శుభ మయిన మనస్సుతో బృందావనమును ధ్యానించెను. అందుచే మిక్కిలి పరుషమైన గ్రీష్మ కాలమున గూడ వర్షర్తు ధర్మములు దోచి వాన కారునం బోలె నెట జూసిన లేత పచ్చిక లచ్చెరవు గొలిపె. సర్వ గోకుల మట్లు బృందావన నివాసమయ్యె. వారెక్కి వెళ్లిన బండ్లు నిలిపిన యవ్వన వాట మర్ధచంద్రా కారమున శృంగార మొలకించె. రామ దామోదరు లక్కడ యాల కాపరు లైరి. ఆ గోవుల మందలందు గోశాల లందు (గోష్ఠము లందు) సవిలాసముగ నా బలరామ కృష్ణు లాడుకొన జోచ్చిరి. కొండెసిగలం నెమలి పించెములను జెఱవికొని యయ్యడవి పూలం జుట్టులం దురిమి పిల్లగ్రోవు లూది కొనుచు లయా నుగుణముగ వాద్యములు వాయించుచు నిరువంక జునుపములు వ్రెల నగ్ని కుమారుల లోయన్నట్లు (కుమార స్వామి పోలికలతో నన్నమాట) నవ్వుచు గేరుచు గేరింతలు కొట్టుచు నవ్వన మందు సంచరింప దొదంగిరి. ఒండొరులం గని పరియాచకము లాడు కొనుచు నంగడి కాండ్ర గూడి దూడల మరలించు కొనుట నిట్లు సరసన వారేడేండ్ల ప్రాయము వారైరి.
సర్వస్య జగతః పాలౌ వత్సపాలౌ మహాప్రజే
ప్రాపృట్కాల స్తతోతీవ మేఘౌఘ స్థగితాంబరః
బభూవ వారిథారాభిరైక్యం కుర్వన్ దిశామివ
ప్రరూఢనవం పుష్పాఢ్య శక్రగోపవృతామహీ
యథా మారకతేవాసీత్పద్మ రాగవిభూషితా
ఊహురున్మార్గగామీని నిమ్నగాంబాంసి సర్వతః
మనాంసి దుర్వినీతానాం ప్రాప్య లక్ష్మీం నవామివ
వికాలేచ యథాకామం వ్రజమేత్య మహాబలౌ
గోపైః సమానైః సహితౌ చిక్రీడాతేమరావివ
ఎల్ల లోకముల గాచు వారచ్చట నట్లు దూడలం గాచు వారైన తఱి నింగినెల్ల మబ్బుల గ్రమ్మ వారి ధారల దశదిశ లోక్కటి గావించి వానకాల మేతెంచె. ఎటు చూచిన చెట్లు చేమలు తీవలు మొగ్గ దొడిగి కొన్న నలుపూసె. ఇంద్ర గోపములు మెఱసి మరకత మణిం బద్మ రాగములు పొదవి నట్లందము గుల్కి నదీ జల పూరములు కట్టలు ద్రెంచుకొని నడి మంత్రపు సిరినొంది దుందుడుకు వడు చెడగరుల మనస్సు లట్లు ఉన్మార్గములు (దారి తప్పి నడచునవి) అయ్యె. సమయము గాని సమయము నేని స్వేచ్చగ నా మందకు వచ్చి యావీరులు బలరామ కృష్ణు లీడుజోడు వారిం గలిసి యమరు లట్లా బృందావన మందాట లాడిరి.
Summary of chapter 77 of the Brahma Mahā Purana is as follows:
Kṛṣṇa, sporting in the Yamunā, dives into the pool of the venomous serpent Kāliya whose poison has been polluting the river and killing birds and cattle. Kṛṣṇa dances on Kāliya's hoods until the serpent is humbled; Kāliya's wives plead for mercy. Kṛṣṇa, compassionate, spares Kāliya and commands him to go to the ocean, leaving the Yamunā pure. The cowherds who had feared Kṛṣṇa had drowned rejoice at his safe return.