ఋషులు:
సహి న స్తృస్తి ర స్తీహ శృణ్వతాం భగవత్కథామ్
పునరేప పరం గుహ్యం వక్తు మర్హ స్యశేషతః
అనంత వాసుదేవస్య న సమ్యగ్వర్ణితం త్వయా
శ్రోతు మిచ్ఛామహే దేవ! విస్తరేణ వదస్వ నః
ఋషులు:
భగవంతుని కథను ఎంత విన్నను మాకు దృప్తి కలుగట లేదు. అనంత వాసుదేవుని మహిమను దాము వర్ణించి నారు. కాని యందలి రహస్యమును విస్తరించి పలుకుడు అన బ్రహ్మ యిట్లనియె.
బ్రహ్మ:
ప్రవక్ష్యామి మునిశ్రేష్ఠాః సారాత్సారతరం పరమ్
అనంతవాసుదేవస్య మాహాత్మ్యం భువి దుర్లభమ్
ఆదికల్పే పురా విప్రా స్త్వహ మవ్యక్తజన్మవాన్
విశ్వకర్మాణ మాహూయ వచనం ప్రోక్తవా నిదమ్
వరిష్ఠం దేవశిల్పీంద్రవమ విశ్వకర్మాగ్ర కర్మిణమ్
ప్రతిమాం వాసుదేవస్య కురుశైలమయీం భువి
యాం ప్రేక్ష్య విధివద్భక్తా స్సేంద్రా వై మానుషాదయః
యేన దానవ రక్షోభ్యో విజ్ఞాయ సుమహద్భయమ్
త్రిదివం సమనుప్రాప్య సుమేరుశిఖరం చిరమ్
వాసుదేవం సమారాధ్య నిరాతంకా వసంతి తే
బ్రహ్మ:
ముని శ్రేష్ఠులార! పరమ సారమైన అనంత వాసుదేవుని మహిమ భూలోక వాసుల కందనిది. ఆది కల్పమందు అవ్యక్త జన్యుండ నగు నేను విశ్వకర్మం బిలిచి యిట్లంటిని. ఆతడు దేవశిల్పి శ్రేష్ఠుడు విశ్వకర్మ లందరికి నగ్రేసరు డయిన పనివాడు. వాసుదేవుని ప్రతిమను శిలామయ మైన దానిం జేయుము. దానిం దర్శించి ఇంద్రాది దేవతలు మనుష్యాది భూలోక వాసులు దానవుల వలన, రక్షస్సుల వలన గలుగు భయము తొలగి స్వర్గముంబొంది సుమేరు శిఖర మందెల్ల కాలము నా వాసుదేవు నారాధించి యే యడ్డును లేక నివశింప గలరు.
మమ తద్వచనం శ్రుత్వా విశ్వకర్మాతు తత్ క్షణాత్
చకార ప్రతిమాం శుద్ధాం శంఖచక్రగదాధరామ్
సర్వలక్షణ సంయుక్తాం పుండరీకాయతేక్షణామ్
శ్రీవత్స లక్ష్మ సంయుక్తా మత్యుగ్రాం ప్రతిమోత్తమామ్
వన మాలావృతోరస్కాం ముకుటాంగదధారిణీమ్
పీతవస్త్రాం సుపీనావసాం కుండ లాభ్యామలంకృతామ్
ఏవం సా ప్రతిమా దివ్యా గుహ్యయంత్రైస్తదా స్వయమ్
ప్రతిష్ఠాకాల మాసాద్య మయాసౌ నిర్యితాపురా
తస్మిన్ కాలే తదా శక్రో దేవరాట్ ఖేచరై స్సహ
జగామ బ్రహ్మ సదన మారుహ్య గజము త్తమమ్
ప్రసాధ్య ప్రతిమాం శక్రః స్నానదానైః పునః పునః
ప్రతిమాం తాం సమారాధ్య (దాయ) స్వపురం పునరాగమత్
తాం సమారాధ్య సుచిరం యతవాక్కాయ మానసః
వృత్రాద్యానసురాన్ క్రూరా న్నముచి ప్రముఖానపి
నిహత్యం దానవాన్ భీక్తవాన్ భువనత్రయం
ఇట్లేను తెలుప విని విశ్వకర్మ యాక్షణము యొక్క ప్రతిమం దయారు సేసెను. శంఖ చక్ర గదలం గొని శ్రీవత్స చిహ్నము వనమాలయుం దాల్చి తెల్ల దామర పూవులట్టి నేత్రములు గల్గి కిరీటము భుజకీర్తులు ధరించి పీతాంబరము గట్టకొని మణి కుండలము మెఱయ శోభించు నందమగు విగ్రహమది నిర్మింజేసి రహస్య మంత్రములచే నేనే యొక పుణ్య లగ్నమందు ప్రతిష్ఠ సేసితిని. ఆ సుముహూర్తమునకు దేవరాజు వేల్పులం గూడి యైరావత మెక్కి బ్రహ్మ సదనమున కేగి స్నాన దానాదు లొనరించి యా విగ్రహమును మఱి మఱి పూజించి తన నగరమునకు తిరిగి వచ్చెచు. అచట నవ్విగ్రహము నర్చించి త్రికరణములను నియమించు కొని వృత్రుడు సముచియ మొదలుగా గల యసురులం జంపి ముల్లోకముల నేలెను.
ద్వితీయే చ యుగే ప్రాప్తే త్రేతాయాం రాక్షసాధిపః
బభూవ సుమహావీర్యో దశగ్రీవః ప్రతాపవాన్
దశవర్ష సహస్రాణి నిరాహారో జీతేంద్రియః
చచార వ్రత మత్యుగ్రం తపః పరమ దుశ్చరమ్
తపసా తేన తుష్టోహం వరం తస్మై ప్రదత్తవాన్
అవధ్యః సర్వదేవానాం సదైత్యోరగరక్షసామ్
శాపప్రరహరణై రుగ్రై రవద్యో యమకింకరైః
వరం ప్రాప్య తదారక్షయక్షాన్ సర్వగణానిమాన్
ధనా ధ్యక్షం వినిర్జిత్య శక్రం జేతుం పముద్యతః
సంగ్రామం సుమహాఘోరం కృత్వా దేవైః సరాక్షసః
దేవరాజం వినిర్జిత్య తదా ఇంద్రజిదాహ్వయః
రాక్షస స్తత్పుతో నామ మేఘనాదః ప్రలబ్థవాన్
ఆమరావతీం తతః ప్రాప్య దేవ రాజగృహే శుభే
దర్శాంజన సంకాశాం రావణస్తు బలాన్వితః
ప్రతిమాం వాసుదేవస్య సర్వలక్షణ సంయుతాం
శ్రీవత్స లక్ష్మ సంయుక్తాం పద్మపత్రాయతేక్షణామ్
వనమాలావృతోరస్కాం ముకుటాంగద భూషితామ్
శంఖచక్రగదా హస్తాం పీతవస్త్రాం చతుర్భుజామ్
సర్వాభరణ సంయుక్తాం సర్వకామ ఫలప్రదామ్
విహాయ రత్న సంఘాంశ్చ ప్రతిమాం శుభ లక్షణామ్
పుష్పకేణ విమానేన లంకాం ప్రాస్థాపయత్ ద్రుతమ్
రెండవ త్రేతా యుగము రాగా మహావీర్యుడు రావణుడు పుట్టెను. పది వేలేండ్లు నిరాహారియై జితేంద్రియుడై యసాధ్య మైన ఉగ్ర తపముల జేసెను. దాన నేను సంతుష్టుడనై దేవతలకు దైత్యులకు నాగులకు రాక్షస్సులకును నీవవధ్యు డగుదువని వర మిచ్చితిని. యమ కింకరులకు కూడ వాడవధ్యుడయ్యె. వాని కొడుకింద్రజిత్తు మేఘ నాదుడను పేరొంది యింద్రునిం గెల్చి స్వర్గ రాజ్యము వడసె. రావణు డమరావతిని స్వాధీనము సేసుకొని యింద్ర గృహమందు వాసుదేవ మూర్తిని యింత మున్ను వర్ణించినయ యాకృతిని దర్శించెను. అంతట నట గెల్చుకొన్న రత్నములను (శ్రేష్ఠము లగు సామగ్రిని) వదలి వేసి యా వాసుదేవ విగ్రహ మును విమానము మీద లంకకు గొని తెచ్చెను.
పురాధ్యక్షః స్థితః శ్రీమాన్ ధర్మాత్మా స విభీషణః
రావణస్యానుజో మంత్రీ నారాయణ పరాయణః
దృష్ట్వా తాం ప్రతిమాం దివ్యాం దేవేంద్ర భవనచ్యుతామ్
రోమాంచితతను ర్భూత్వా విస్మయం సమపద్యత
ప్రణమ్య శిరసాదేవం ప్రహృష్టే నాంతరాత్మనా
ఆద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం తపః
ఇత్యుక్త్వా స తు ధర్మాత్మా ప్రణిపత్య ముహుర్ముహుః
జ్యేష్ఠం భ్రాతర మాసాద్య కృతాంజలి రభాషత
రాజన్ ప్రతిమయా త్వం మే ప్రసాదం కర్తుమర్హసి
యామా రాధ్య జగన్నాధ ని స్తరేయం భవార్ణవమ్
భ్రాతుర్వచన మాకర్ణ్య రావణస్తం తదాబ్రవీత్
గృహాణ ప్రతిమాం వీర త్వనయా కిం కరోమ్యహమ్
స్వయంభువం సమారాధ్య త్రైలోక్యం విజయీ త్వహమ్
నానాశ్చర్యమయం దేవం స్వర్వభూత భవోద్భవమ్
అప్పుడు మంత్రియు నగరాధ్యక్షుడయి యున్న విఖీషణుడు ధర్మమూర్తి గావునను నారాయణ భక్తి పరాయణుడయి నందున నింద్ర భవనము నుండి దిగి వచ్చిన యా విష్ణు విగ్రహముం గని మేను పులకరించి యచ్చెరువంది తల వంచి నమస్కరించి సంతుష్టాం తరంగుడై ఇప్పుడు నా జన్మము ధన్య మయ్యె. ఇప్పుడు నా తపస్సు ఫలించినది. అని మఱిమఱి సాలి మ్రొక్కి పెద్దన్న యగు రావణుని కడకేగి దోసిలొగ్గి ప్రభూ! ఈ ప్రతిమను నాకు బ్రసాదింపుము. దీని నారాధించి సంసార సముద్రముం దాటెదను. అన దశాననుడు తీసికొను మిదిగో విగ్రహము. దీనితో నేనేమి చేయుదును. సర్వభూత కారణుడగు బ్రహ్మ నారాధించి ముల్లోక విజయము గావించితి ననియె.
విభీషణో మహాబుద్ధి స్తదాతాం(రాసాద్య) ప్రతిమాం శుభామ్
శతమష్టోత్తరం చాబ్దం సమారాధ్య జనార్దనమ్
అజరామరణంప్రాప్త మణిమాదిగుణై ర్యుతమ్
రాజ్యం లంకాధిపత్యం చభోగాన్ భుంక్తే యథేప్సితాన్
విభీషణు డచ్చెరువు గొలుపు నామూర్తిని గ్రహించి నూట యెనిమి దేండ్లు పూజించి జరా మరణములు లేని స్థితిని (చిరంజీవిత్వమను) అణిమాది విభూతులను బడసి లంకా రాజ్యా ధిపతియై యభీష్ట భోగముల ననుభవించు చున్నాడు.
మునులు:
అహోనో విస్మయో జాతః శ్రుత్వేదం పరమామృతమ్
అనంతవాసుదేవస్య సంభవం భువి దుర్లభమ్
శ్రోతు మిచ్ఛామహే దేవ విస్తరేణ యథాతథమ్
తస్య దేవస్య మాహాత్మ్యం వక్తు మర్హస్యశేషతః
మునులు:
అనవిని మును లహో! చాల యాశ్చర్య కరమైన కధ వింటిమి. అయ్యనంత వాసుదేవ ప్రభావమింకను విస్తరముగ తెలుపుమన బ్రహ్మ యిట్లనియె
బ్రహ్మ:
తదా స రాక్షసః క్రూరోదేవగంధర్వకింనరాన్
లోకపాలాన్ సమనుజాన్ మునిసిద్ధాంశ్చ పాపకృత్
విజిత్య సమరే సర్వా నాజహార తదంగనాః
సంస్థాప్యనగరీంలంకాం పునః సీతార్థ(తాంచ)మోహితః
చలితోమృగరూపేణ సౌవర్ణేన చరావణః
తతః క్రుద్ధేన రామేణ రణే సౌమిత్రిణాసహ
రావణస్య వధార్థాయ హత్వావాలిం మనోజవమ్
అభిషి క్తశ్చసుగ్రీవో యువరాజోంగద స్తథా
హనుమన్నలనీలశ్చ జాంబవాన్ పనసస్తథా
గవయశ్చగవాక్షశ్చపాఠీనః పరమౌజసః
ఏతెశ్చాన్యేశ్చబహుభి ర్వానరైః సమహాబలైః
సమావృతో మహాఘోరై రామో రాజీవలోచనః
గిరీణాం సర్వసంఘాతైః సేతుం బధ్వా మహోదధౌ
బలేనమహతారామః సము త్తీర్య మహోదధిమ్
సంగ్రామ మతులంచక్రే రక్షోగణసమన్వితః
యమహస్తం ప్రహస్తం చనికుంభంకుంభమేవచ
నరాంతకం మహావీర్యం తథాచైవ యమాంతకమ్
మాలాఢ్యం మాలాకాఢ్యం చ హత్వా రామస్తు వీర్యవాన్
పునరింద్రజితం హత్వాకుంభకర్ణం సరావణమ్
వై దేహీం చాగ్నినాశోధ్యదత్వా రాజ్యం విభీషణే
వాసుదేవం సమాదాయ యానం పుష్పకమారుహత్
లీలయా సమనుపప్రాప దయోధ్యాం పూర్వపాలితామ్
కనిష్ఠం భరితం స్నేహాచ్ఛత్రుఘ్నం భక్తవత్సలః
అభిషిచ్య తదారామః సర్వరాజ్యేథి రాజవత్
పురాతనీం స్వమూర్తిం చ సమారాధ్య తతోహరిః
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ
భుక్త్వా సాగరపర్యంతాం మేదినీం సతురాఘవః
రాజ్యమాసాధ్య సుగతిం వైష్ణవం పదమావిశత్
తాంచాపి ప్రతిమాం రామః సముద్రేశాయ దత్తవాన్
ధన్యోరక్షయితాసి త్వం తోయరత్నసమన్వితః
బ్రహ్మ:
అయ్యెడ నా రాక్షసుడు దశ కంఠుడు దేవ గంధర్వ కిన్నరుల వోడించి లోకపాలుర నవని పాలు రందపస్వులను సిద్ధులను గెలిచి వారి యిల్లాండ్ర గొనితెచ్చి తన రాజధాని యందు లంకలో ననుంచి సీతాదేవి యెడ మోహ వివశుడై బంగారు లేడి రూపు (మారీచు) నితో బయలు దేరి సీత నపహరించెను. అంత కోపించన రాముడు లక్ష్మణునితో గూడి యుద్ధము నందు రావణునిం జంపుటకై తొలుత వాలిం జంపి సుగ్రీవుని వానర రాజ్యమంద భిషిక్తుని గావించెను. అంగదుని యువరాజుం జేసెను. హనుమదాది కపి వీరులతో కొండలం బడవైచి సముద్రమునకు సేతువుం గట్టి సేనలతో వార్థిదాటి అనుపమ మైన రణ మొనరించి ప్రహస్త నికుంభ కుంభకర్ణాదుల నింద్రజిత్తునుం జంపి రావణం బరిమార్చి అగ్ని శోధనము సేసి జానికిం గ్రహించి విభీషణునికి లంకా రాజ్య మొసంగి యటనున్న వాసుదేవ మూర్తింగొని పుష్పక మెక్కి యవలీలగ లీలామానుష మూర్తి రామచంద్ర మూర్తి యయోధ్య కేతెంచి భక్త వత్సలుండ రామచంద్ర ప్రభువు భక్తి భరితు నిందమ్ముని భరతుని పిన తమ్ముని శత్రుఘ్నుని సర్వ సామ్రాజ్యధినేత లట్లు గౌరవించి సనాతన వాసుదేవ మూర్తి నారాధించి పదనొకండు వేలేండ్లు అయోధ్యను బాలించి యా విష్ణు విగ్రహమును సముద్రుని కొసంగెను. అట్లొసంగుచునో వారిథీ! నీవు ధన్యుడవు. ఈ మూర్తి రక్షణము నీ పని. నీవు సర్వరత్న నిధివి అనెను.
ద్వాపరం యుగమాసాద్యయదాదేవో జగత్పతిః
ధరణ్యాశ్చానురోధేన భావశైథిల్య కారణాత్
అవతీర్ణః స భగవాన్ వసుదేవకులే ప్రభుః
కంసాదీనాం వథార్థాయ సవకర్షణసహాయవాన్
తదా తాం ప్రతిమాం విప్రాః సర్వవాంఛాఫలప్రదామ్
సర్వలోక హితార్థాయ కస్యచిత్కా రణాంతరే
తస్మింక్షేత్రవరే పుణ్యే దుర్లభే పురుషోత్తమే
ఉజ్జహార స్వయా తోయాత్ సముద్రః సరితాంపతిః
అనియె ద్వాపర యుగ మందు జగన్నాధుండు హరి భూదేవి ప్రార్థనచే ఆమెకు గల్గిన భావ వైకల్యమును వారింప వసుదేవు కులము నంద వతరింపగా సర్వాభిష్ట ప్రదమగు నీ విగ్రహమును సర్వలోక క్షేమము కొఱకు మరి కారణాంతరము నను “పురుషోత్తమము” అను పుణ్యక్షేత్ర మందు సముద్రుడు నీళ్ళ నుండి తానుగా నీ మూర్తిని పైకి లేవ నెత్తెను.
తదాప్రభృతి త్రైవ క్షేత్రే ముక్తిప్రదే ద్విజాః
ఆ స్తేసదేవో దేవానాం సర్వకామ ఫలప్రదః
యే సంశ్రయంతి చానంతం భక్త్యా సర్వేశ్వరం ప్రభుమ్
వాఙ్మనః కర్మభిర్నిత్యం తే యాంతి పరమంపదమ్
దృష్ట్వానంతం సకృద్భక్త్యా సంపూజ్య ప్రణిపత్య చ
రాజసూయాశ్వమేధాభ్యాంఫలం దశగుణం లభేత్
సర్వకామ సమృద్ధేన కామగేన సువర్చసా
విమానే నార్కవర్లేన కింకణీజాలమాలినా
త్రిఃసప్తకులముద్ధృత్య దివ్యస్త్రీగణసేవితః
ఉపగీయమానో గంధర్వై ర్నరో విష్ణుపురం వ్రజేత్
తత్రభుక్త్వా వరాన్ భోగాన్ జరామరణవర్జితః
దివ్యరూపధరః శ్రీమా న్యావదాభూతవంప్లవమ్
పుణ్యక్షయా దిహాయాత శ్చతుర్వేదీ ద్విడోత్తమః
వైష్ణవంయోగ మాస్థాయ తతోమోక్షమవాప్నుయాత్
ఏవంమయా త్వనంతోసౌకీర్తితో మునిత్తమాః
కశ్శక్నోతి గుణాన్వక్తుం తస్య వర్షశతైరపి
అప్పటి నుండి ముక్తిద మయిన యా క్షేత్రమున నీ మూర్తి వెలసి యున్నది. భక్తితో నీ సర్వేశ్వరుని త్రికరణములను నిగ్రహించి యారాధించు భక్తులు పరమ పద మందుదురు. ఈ అనంత వాసుదేవు నొకమారేని దర్శించి నమస్కరించిన యతడు దశాశ్వమేధ రాజసూయ ఫల మందును. ఆ మీద కామగ విమాన మెక్కి సూర్య సమాన వర్చస్సుతో చిఱు గంటలు మ్రోయ నానంద భరితుడై విష్ణులోక మేగును. ఇరువది యొక్క తరముల వారి నుద్ధరింప గలడు. దేవ గంధర్వ గీయామాను డగును. ప్రళయ పర్యంతము నచట ననంత భోగములను భవించి పుణ్యానుభవ మయిన తరువాత నీ యవని కేతెంచి చతుర్వేద విదుడై వైష్ణవ యోగమున మోక్షము లంబిందును. అనంత వాసుదేవుని మహిమ యిది నేను గీర్తించితిని. ఓ ముని వరులారా! వందలేండ్లు వర్ణించిన నిది తుదముట్ట స్తుతింప శక్యము గాదు.
Summary of chapter 69 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The remarkable legend of the sage Kaṇḍu and the celestial damsel Pramlochā is narrated at length. Kaṇḍu, a sage of great tapas, is sent the Apsarā Pramlochā by Indra to disturb his austerities. Though Kaṇḍu initially resists, he eventually lives with her for an extended period — which by the reckoning of divine time spans thousands of years. When Pramlochā finally departs, perspiration from her body blown by the wind becomes the sage-woman Māriṣā, who eventually gives birth to the ten Prajāpatis, establishing a new lineage of cosmic progenitors.