బ్రహ్మ మహా పురాణము

45 - పురుషోత్తమ క్షేత్ర వర్ణనమ్‌

మునులు:

తస్మిన్‌క్షేత్రవరే పుణ్యే వైష్ణవే పురుషోత్తమే

కిం తత్ర ప్రతిమా పూర్వం నస్థితా వైష్ణవీ ప్రభో

యేనాసౌ నృపతిస్తత్ర గత్వా సబలవాహనః

స్థాపయామాస కృష్ణం చ రామం భద్రం శుభప్రదమ్‌

సంశయో నో మహానత్ర విస్మయశ్చ జగత్పతే

శ్రోతుమిచ్చామహే సర్వం బ్రూహి తత్కారణం చనః

మునులు:

పురుషోత్తమ మను నా పుణ్య వైష్ణవ క్షేత్రము నా రాజు ససైన్య పరివారముగ సేవించి యందు బలరామ కృష్ణులను ప్రతిష్టించి పూజించె నని విందు మాకథ సవిస్తరముగ నానతిమ్మన బ్రహ్మ వారల కిట్లనియె

బ్రహ్మ:

శృణుధ్వం పూర్వసంవృత్తాం కథాం పాపప్రణాశినీమ్‌

ప్రవక్ష్యామి సమాసేన శ్రియా పృష్టః పురా హరిః

సుమేరోః కాంచనే శృంగే సర్వాశ్చర్య సమన్వితే

సిద్ద విద్యాధరైర్యక్షైః కిన్నరైరుపశోభితే

దేవదానవ గంధర్వై ర్నాగైరప్పరసాం గణైః

మునిభి ర్గుహ్యకై స్సిద్దైః సౌపర్ణైః సమరుద్గణైః

అన్యై ర్దేవాలయైః సాద్యైః కశ్యపాద్యైః ప్రజేశ్వరైః

వాలఖిల్యాదిభి శ్చైవ శోభితే సుమనోహరే

కర్ణికారవనైర్దివ్యైః సర్వర్తు కుసుమోత్కరైః

జాతరూప ప్రతీకాశై ర్బూషితే సూర్య సన్నిభైః

అన్యైశ్చ బహుభిర్వృక్షైః శాలతాలాదిభిర్వనైః

పున్నాగాశోక సరళన్యగ్రోధామ్రాత కార్జునైః

పారిజాతామ్రఖదిర నీపబిల్వ కదంబకైః

ధవఖాదిర పాలాశ శీర్షామలక తిందుకైః

నారంగ కోలవకుళ లోద్ర దాడిమదారుకైః

సర్జైశ్చ కర్ణైస్తగరైః శిశిభూర్జన నింబకైః

అన్యైశ్చ కాంచనైశ్చైవ ఫలభారైశ్చ నామితైః

నానాకుసుమ గంధాడ్యై ర్బూషితే పుష్పపాదపైః

మాలతీ యూధికా మల్లీ కుందబాణ కురుంటకైః

పాటలాగస్త్యకుటజ మందార కుసుమాదిభిః

అన్యైశ్చ వివిధైః పుష్పైర్శనసః ప్రీతిదాయకైః

నానావిహగ సంఘైశ్చ కూజద్భిర్మధుర స్వరైః

పుంస్కోకిల రుతై ర్దివ్యై మత్తబర్హిణనాదితైః

ఏవం నానావిధై ర్వృక్షైః పుష్పైర్నానా విధైస్తథా

ఖగైర్నానా విధైశ్చైవ శోభితే సురసేవితే

తత్ర స్థితం జగన్నాథం జగత్ర్సష్ఠార మవ్యయమ్‌

సర్వలోక విధాతారం వాసుదేవాఖ్య మవ్యయమ్‌

ప్రణమ్య శిరసాదేవీ లోకానాం హితకామ్యయా

పప్రచ్ఛేమం మహాప్రశ్నం పద్మజా తమనుత్తమమ్‌

బ్రహ్మ:

శ్రీదేవి యడుగగా మున్ను శ్రీహరి తెలిపిన పుణ్య కథను వినుండు. సుమేరు పర్వతము యొక్క సువర్ణ శిఖరము నందు సిద్ధ విద్యాధర కిన్నరులు, సంచరించు చోట, వాలఖిల్యాది మహర్షులు విహరించు చక్కని ప్రదేశమందు నానా తరులతా కుసుమ ఫల భరితమైన చోట కోకిలలు, చిలుకలు, నెమళ్లు మనోహరముగ కూయు తావున దేవతలు కొలువ గొలువున్న వాసుదేవుని జగన్నాధుని సమీపించి శిరసు వంచి నమస్కరించి శ్రీదేవి సర్వలోక హితము గోరి ఇట్లని ప్రశ్నించెను.

శ్రీదేవి:

బ్రూహిత్వం సర్వలోకేశ సంశయం మే హృది స్థితమ్‌

మర్త్యలోకే మహాశ్చర్యే కర్మభూమౌ సుదుర్లభే

లోభమోహ గ్రహగ్రస్తే కామక్రోధ మహార్ణవే

యేన ముచ్యేత దేవేశ! అస్మాత్సంసార సాగరాత్‌

అచక్ష్వ సర్వదేవేశ! ప్రణతాం యది మన్యసే

త్వదృతే నాస్తి లోకేస్మిన్వక్తా సంశయ నిర్ణయే

శ్రీదేవి:

సర్వేశ్వరా! నా సంశయము వారింపుము. మర్త్య లోకమున మిక్కిలి యాశ్చర్యము గొలుపు నది కర్మభూమి (భారత వర్షము) అచట జన్మ యంత సులభము గాదు. లోభ మోహాదు లను మొసళ్లు సంచరించు కామ క్రోధము లను మహా సముద్రము నందు జనన మరణాదుల నుండి తరించుట కనువైన యుపాయము దెలుపుము. నీకన్న ఈ సంశయమును వారిపంగల వక్త లేడు. మాయెడల దయగొని తెలుప దలపు గలదేని యను గ్రహింపుము.

బ్రహ్మ:

శ్రుత్త్వైవం వచనం తస్యా దేవదేవో జనార్దనః

ప్రోవాచ పరయా ప్రీత్యా పరం సారామృతోపమ్‌

బ్రహ్మ:

శ్రీదేవి పలుకులు విని దేవదేవుడు పరమ ప్రీతితో నమృతో పమానము సర్వవేద శాస్త్ర సారము నైన విషయము నిట్లు పనసించెను.

శ్రీభగవానుడు:

సుఖోపాస్యః సుసాధ్యశ్చాభిరామశ్చ సుసత్ఫలః

అస్తే తీర్తవరే దేవి విఖ్యాతః పురుషోత్తమః

నతేన సదృశః కశ్చిత్త్రిఘలోకేఘ విద్యతే

కీర్త నాద్యస్య దేవేశి ముచ్యతే సర్వపాతకైః

నవిజ్ఞాతో మరైః సర్వై ర్న దైత్యైర్న చదానవైః

మరిచ్యా ద్యై ర్మునివరై ర్గోపితం మే వరాననే

తత్తేహం సంప్రవక్ష్యామి తీర్థ రాజం చ సాంప్రతమ్‌

భావేనై కేన సుశ్రోణి శ్రుణుష్వ వరవర్ణినీ

అసీత్కల్పే సముత్పన్నే నష్ఠే స్థావర జంగమే

ప్రలీనా దేవగంధర్వ దైత్య విద్యాధరోరగాః

తమోభూత మిదం సర్వం నప్రాజ్ఞాయత కించన

తస్మింజాగర్తి భూతాత్మా పరమాత్మా జగద్గురుః

శ్రీమాన్‌ త్రిమూర్తి కృద్దేవో జగత్కర్తా మహేశ్వరః

వాసుదేవేతి విఖ్యాతో యోగాత్మా హరిరీశ్వరః

సో సృజద్యోగ నిద్రాంతే నాభ్యంభోరుహ మధ్యగమ్‌

పద్మకేసర సంకాశం బ్రహ్మాణం భూతమవ్యయమ్‌

తాదృగ్భూతస్తతో బ్రహ్మసర్వలోక మహేశ్వరః

పంచభూత సమాయుక్తం సృజతే చ శనైః శనైః

మాత్రాయోనీని భూతాని స్థూలసూక్ష్మాణి యానిచ

చతుర్విధాని సర్వాణి స్థావరాణి చరాణి చ

తతః ప్రజాపతి ర్బహ్మా చక్రే సర్వచరాచరమ్‌

సంచింత్య మనసా త్మానం ససర్జ వివిధాః ప్రజాః

మరీచ్యాదీ న్మునీ స్సర్వా న్దేవాసుర పితౄనపి

యక్ష విద్యాధరాం శ్చాన్యాన్‌ గంగాధ్యాః సరిత స్తథా

నరవానర సింహాంశ్చ వివిధాంశ్చ విహంగమాన్‌

జరాయూనంద జాన్దేవి స్వేదజోద్భేదజాం స్తథా

బ్రహ్మక్షత్రం తథా వైశ్యం శూద్రంచైవ చతుష్టయమ్‌

అంత్యజాతాంశ్చ మ్లేచ్ఛాంశ్చ ససర్జ వివిధాస్పృథక్‌

యత్కంచిజ్ఞీవసంజ్ఞం తు తృణగుల్మపిపీలికమ్‌

బ్రహ్మాభూత్వా జగత్సర్వం నిర్మమే స చరాచరమ్‌

దక్షిణాంగే తథాత్మానం సంచింత్య పురుషం స్వయమ్‌

వామే చైవ తు నారీం స ద్వీథాభూతమకల్పయత్‌

తతః ప్రభృతి లోకే స్మిన్ర్పజా మైథున సంభవాః

అథమోత్తమ మధ్యాశ్చ మమక్షేత్రాని యానిచ

ఏవం సంచింత్య దేవో సౌ పురా సలిలయోనిజః

జగామ ధ్యానమాస్థాయ వాసుదేవాత్మికాం తనుమ్‌

ధ్యాన మాత్రేణ దేవేన స్వయమేవ జనార్దనః

తస్మిన్క్షణే సముత్పన్నః సహస్రాక్షః సహస్రపాత్‌

సహస్రశీర్షా పురుషః పుండరీక నిభేక్షణః

సలిలధ్వాంత మేఘాభః శ్రీమాన్‌ శ్రీవత్సలక్షణః

అపశ్య త్సహసా తం తు బ్రహ్మా లోక పితామహః

అసనై రర్ఘ్యపాద్వైశ్చ అక్షతై రభినంద్య చ

తుష్టావ పరమైః ప్తోత్రై ర్విరించిః సుసమా హితః

తతో హ ముక్త వాన్దేవం బ్రహ్మాణం కమలోద్భవమ్‌

కారణం వద మాం తాత మమ ధ్యానస్య సాంప్రతమ్‌

శ్రీభగవానుడు:

సుఖముగను, సులభముగను, నుపాసించి సాధింప దగిన మహా ఫలము నొసంగు దివ్య క్షేత్ర మొకటి పురుషోత్తమ మనుపేర ప్రసిద్ధమై యున్నది. అది కీర్తన, స్మరణ వందనాదు లచే సర్వ పాపముక్తి నీయ గలది. సురాసురులు మరీచ్యాది ముని వరులు గూడ దాని నెఱుగురు. అట్టి తీర్థ రాజమును గూర్చి నీకు దెలుపు చున్నాను. సుందరీ! ఏకాగ్ర చిత్తవై వినుము. కల్పాంత ప్రళయ మందు, స్థావర జంగమాత్మక మైన జగమెల్ల లయ మందెను. అంధకార బంధుర మయ్యెను. ఆ పెంజీకటి కవ్వల నున్న వాడు మేలు కొన్నవాడు ఒక్కడే పరమాత్మ. ఆయనయే సర్వభూత స్వరూవుడు. త్రి మూర్తులకు కర్త. వాసుదేవుడను వాడు. యోగీశ్వరుడు. అయన యోగనిద్ర నుండి మేల్కొని తన నాభి కమలము నుండి కమల దళకాంతి నంపన్న మగు బ్రహ్మ యనెడి యొక మూర్తిని సృజించెను. ఆ బ్రహ్మ పంచ భూత పంచీ కృతముయిన ప్రపంచమును సృజించెను. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము లనెడి పంచ తన్మాత్రలకు కారణములైన ఆకాశము, వాయువు, తేజస్సు, ఉదరము, భూమి యనెడి స్థూల సూక్ష్మము లైన పంచ భూతములను సృజించెను. ఆ మీద నా ప్రజాపతి మనసు నాత్మ వంకకు మరల్చి సంకల్పించి మరీచ్యాది మునులను సర్వ దేవతలను పితృ దేవతలను, యజ్ఞములను, విద్యాధరులను, గంగాది నదులను, నర వానర సింహ శార్దూలాది మృగములను, జరాయుజ, అండజ, శ్వేదజ, ఉద్భిజ్ఞము లను నాలుగు విథములైన చరాచర భూత జాలమును సృజించెను. బ్రహ్మ, క్షత్ర , వైశ్య, శూద్రులను నాలుగు వర్ణములను, అంత్యజులను, మ్లేచ్చులను వేర్వేర సృజించెను. పిపీలికాది జీవకోటి యాయన సృజించి నదే. ఆ సృష్ఠి కర్త తన కుడి భాగమందు తననే పురుష రూపముగా భావించి యెడమ భాగమున స్త్రీని భావించి స్త్రీ పుంస రూపమున ద్విధా భావము నంచెను. మానసిక సృష్టి యిట్లు జరిగిన తరువాత స్త్రీ పుంసాత్మక మిథునము నుండి సృష్టి యావిర్భ వించెను. అట నుండియే మైధున సంభవమైన సృష్టి యారంభ మైనది. ఉత్తమ, మధ్య మాధమ భేదమున తయారయిన యీ యుపాధు లన్నియు నా యొక్క క్షేత్రములు. ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ సృష్టి యొనరించి యించుక నాలోచించి ధ్యాన నిష్ఠుడై వాసుదేవ తత్త్వమందు వాసు దేవత్మక మైన మూర్తిని ధరించెను. ధ్యాన మాత్రముచే నా జనార్ధనుడు తానే యా క్షణమున సహస్రాక్షుడు, సహస్ర పాదుడు, సహస్ర శీర్షుడు నైన పురుషుడై యావిర్భ వించెను. తెల్ల తామర పూల వంటి నేత్రముల సజల జలదచ్ఛాయ మైన శరీరము, శ్రీవత్స చిహ్నము, మొదలైన లక్షణము లతో నొక ప్రాకృత మంగళ స్వరూపమున సాక్షాత్కరించెను. లోకపితా మహుడగు బ్రహ్మ హఠాత్తుగా నమ్మూర్తిని దర్శించి అసన అర్ఘ్య పాద్య సమర్పణము చేసి యక్షతల బూజించి యభి వాదనము జేసి పరమ మంగళ స్తుతులచే స్తుతించెను. విరించి మనస్సును ఒదిగించి చేసిన యా స్త్రోత్రమును విని తండ్రి యిపుడు నను ధ్యానించుటకు కారణ మేమని ప్రశ్నించితిని.

బ్రహ్మ:

జగద్దితాయ దేవేశ మర్త్యలోకైశ్చ దుర్లభమ్‌

స్వర్గద్వారస్య మార్గాణి యజ్ఞదాన వ్రతానిచ

యోగః సత్యం తపః శ్రద్ధా తీర్థాని వివిథానిచ

విహాయ సర్వమేతేషాం సుఖం తత్సాధనం వద

స్థానం జగత్పతే మహ్యా ముత్కృష్టం చ యదుచ్యతే

సర్వేషాముత్తమం స్థానం బ్రూహి మే పురుషోత్తమ

విధాతుః వచనం శ్రుత్వా తతోహం ప్రోక్త వాన్ప్రియే

శృణు బ్రహ్మస్ప్రవక్ష్యామి నిర్మలం భువి దుర్లభమ్‌

బ్రహ్మ:

దేవేశ! స్వర్గ ద్వారమునకు దారులు, యజ్ఞ దాన వ్రతములు, యోగము, సత్యము, శ్రద్ధ వివిధ తీర్థములు తెలుప బడినవి. అయ్య నుష్ఠానము దుర్లభము. వాని నన్నిటిని మించిన సులభ సాధనము లోక హితము కొఱకు తెల్పుము. ఓ వాసుదేవ! పరమోత్తమ మయిన పుణ్య స్థానము నానతిమ్ము. అన విధాత పలుకులు విని యాతని కిట్లు చెప్పితిని.

ఉత్తమం సర్వక్షేత్రాణాం ధన్యం సంసారతారణమ్‌

గో బ్రాహ్మణహితం పుణ్యం చాతుర్వర్ణ్యం సుభోదయమ్‌

భుక్తి ముక్తిప్రదం నౄణాం క్షేత్రం పరమదుర్లభమ్‌

మహాపుణ్యంతు సర్వేషాం సిద్ధిదం వై పితామహ

తస్మాదాసీ త్సముత్పన్నం తీర్థరాజం సనాతనమ్‌

విఖ్యాతం పరమం క్షేత్రం చతుర్యుగ నిషేవితమ్‌

సర్వేషామేవ దేవానా మృషీణాం బ్రహ్మచారిణామ్‌

దైత్య దానవ సిద్దానాం గంధ ర్వోరగ రక్షసామ్‌

నాగ విద్యా ధరాణాంచ స్థావరస్య చరస్య చ

ఉత్తమః పురుషో యస్మాత్త స్మాత్స పురుషోత్తమః

దక్షిణస్యోదధేస్తీరే న్యగ్రోధో యత్ర తిష్ఠతి

దశయోజన విస్తీర్ణం క్షేత్రం పరమ దుర్లభమ్‌

యస్తు కల్పే సముత్పన్నే మహ దుల్కానిబర్హణే

వినాశం నైవమభ్యేతి స్వయం తత్రైవ మాస్థితః

దృష్టిమాత్రే వటే తస్మిం శ్ఛాయామాక్రమ్య చాసకృత్‌

బ్రహ్మహత్యా త్ర్సముచ్యేత పాపే ష్వన్యేషు కాకథా

ప్రదక్షిణా కృతా యైస్తు వమస్కారశ్చ జంతుభిః

సర్వే విధూత పాప్మానస్తే గతాః కేశవాలయమ్‌

న్యగ్రోధస్యోత్తరే కించి ద్గక్షిణే కేశవస్యతు

ప్రాసాదః స్తత్ర తిష్ఠేత్తు పదం ధర్మమయం హి తత్‌

ప్రతిమాం తత్ర వై దృష్ట్యా స్వయం దేవేన నిర్మితామ్‌

అనాయాసేన వై యాంతి భువసం మే తతో నరాః

గచ్ఛమానాంస్తు తాన్ర్పేక్ష్య ఏకదా ధర్మరాట్ప్రియే

మదంతిక మసు ప్రాప్య ప్రణమ్య శిరసా బ్రవీత్‌

సంసార తారకము సర్వోత్తమ క్షేత్రము, చాతుర్వర్ణ సుఖ సాధనము. భుక్తిముక్తి ప్రదము, శీఘ్ర సిద్ధిదము, చతుర్యుగము లందును సుస్థిరమై సేవింప దగినది. సర్వదేవ దానవ యోనులకును సుసేవ్యమై యున్న తీర్థ రాజము పురుషోత్తమునికి నావాస మైన “పురుషోత్తమము” అను క్షేత్రము గలదు. ఆది దక్షిణ సముద్ర తీర ముందున్నది. పది యోజనములు వైశాల్యము గలది. అటవొక మఱ్ఱి వృక్షము గలదు. కల్పాంత మందు కాలాగ్ని విజృంభించి నపుడు కూడ యది నశింపదు. నేను స్వయముగా నచటనే యున్నాను. ఆ వట వృక్షమును దర్శించి యా క్రింది నీడలో విశ్రమించిన వాడు బ్రహ్మ హత్యా పాపము నుండి విడివడును. తక్కిన మహా పాపము మాట చెప్పనేల! దానికి ప్రదక్షిణ నమస్కారములు చేసిన వారు విష్ణు లోకమున కేగుదురు. ఆ మఱ్ఱి కించుక దక్షిణమున కేశవుని యాలయ మున్నది. అది ధర్మమయము. భగవంతుడు తానే నిర్మించు కొన్న ప్రతిమ (విగ్రహం) గలదు. దానిని దర్శించిన వారు అనాయాస ముగ వైకుంఠము కేగుదురు. అట్లేగు చున్న జీవులను చూచి యమ ధర్మరాజు నాకడ కేతెంచి శిరసు వంచి మ్రొక్కి యిట్లనియె.

యమధర్మరాజు:

నమస్తే భగవన్దేవ లోకనాథ జగత్పతే

 క్షీరోద వాసినం దేవం శేషభోగాను శాయినమ్‌

వరం వరేణ్యం వరదం కర్తారమకృతం ప్రభుమ్‌

విశ్వేశ్వర మజం విష్ణుం సర్వజ్ఞమపరాజితమ్‌

నీలోత్పల దళ శ్యామం పుండరీక నిభేక్షణమ్‌

సర్వజ్ఞం నిర్గుణం శాంతం జగద్ధాతార మవ్యయమ్‌

సర్వలోక విధాతారం సర్వలోక సుఖావహమ్‌

పురాణం పురుషం వేద్యం వ్యక్తావ్యక్తం సనాతనమ్‌

పరావరాణాం స్రష్టారం లోకనాథం జగద్గురుమ్‌

శ్రీవత్సోరస్క సంయుక్తం వనమాలా విభూషితమ్‌

పీతవస్త్రం చతుర్భాహుం శంఖచక్ర గదా ధరమ్‌

హారకేయూర సంయుక్తం ముకుటాంగద ధారిణమ్‌

సర్వలక్షణ సంపూర్ణం సర్వేంద్రియ వివర్జితమ్‌

కూటస్థమచలం సూక్ష్మం జ్యోతి రూపం సనాతనమ్‌

భావాభావ వినిర్ముక్తం వ్యాపినం ప్రకృతేః పరమ్‌

నమస్యామి జగన్నాథ మీశ్వరం సుఖదమ్‌ ప్రభుమ్‌

ఇత్యేవం ధర్మరాజస్తుపురా న్యగ్రోధ సన్నిథౌ

స్తుత్వా నానావిధైః స్తోత్రైః ప్రణామ మకరోత్తదా

తం దృష్ట్వాతు మహాభాగే ప్రణతం ప్రాంజలి స్థితమ్‌

స్తోత్రస్య కారణం దేవి పృష్టవా నహమంతకమ్‌

వైవస్వత మహాబాహో సర్వదేవోత్తమో హ్యసి

కిమర్ధం స్తుతవాన్మామాం త్వం సంక్షేపాత్త ద్బ్రవీహిమే

ఆస్మిన్నాయతనే పుణే విఖ్యాతే పురుషోత్తమే

ఇంద్రనీల మయీ శ్రేష్ఠా ప్రతిమా సార్వకామికీ

తాం దృష్ట్వా పుండరీకాక్ష భావేనైకైన శ్రద్ధయా

శ్వేతాఖ్యం భవనం యాంతి నిష్కామాశ్చైవ మానవాః

ఆతః కర్తుం నశక్నోమి వ్యాపార మరిసూదన

ప్రసీద సుమహాదేవ సంహర ప్రతిమాం విభో

శ్రుత్వా వైవస్వత స్యై తద్వాక్యమేతదువాచ హ

యమ తాం గోపయిష్యామి సికతాభిః సమంతతః

తతః సా ప్రతిమా దేవి వల్లిభిర్గోపితా మయా

యథా తత్ర నపశ్యంతి మనుజాః స్వర్గకాంక్షిణః

ప్రచ్ఛాద్య వల్లికైర్దేవి జాతరూప పరిచ్ఛదైః

యమంప్రస్థాపయామాస స్వాం పురీం దక్షీణాం దిశమ్‌

యమధర్మరాజు:

జగన్నాధ స్వామీ! నీకు నమస్కారము. శ్రీవత్స వక్షస్థల, పద్మమాలా భూషిత, పీతాంబరధారీ, శంఖచక్ర గదా ధరా! హార కేయూర భూషితా! కిరీటాం గద ధారియునై సాక్షాత్కరించు జగద్గురు వగు నీకు సగుణమూర్తికి వందనము. ప్రకృతికి నవ్వలనై సర్వేంద్రియ రహితుడై కేవల జ్ఞాన జ్యోతియై సర్వ సాక్షియై నిర్విశేష సుఖానుభవము జ్ఞానము స్వరూపముగా గల్గియున్న కేవలాత్మను నిన్ను నమస్కరించు చున్నాను. అన విని పరమాత్మ నన్ను నీ విపుడెందులకు స్తుతించితివో క్లుప్తముగా నానతిమ్ము అని పురుషోత్తము డనియె. స్వామీ! పురుషోత్తమము” అను నీ పుణ్యాలయమున ఇంద్ర నీలమణి మయమైన యీ ప్రతిమ సర్వాభీష్టములను దీర్చునది. దానిని శ్రద్ధతో దర్శించి ఏకాగ్ర చిత్తమున సేవించి మానవులు నిష్కాములై శ్వేత భవన మునకు వెళ్ళుదురు.

కావున పాపులన్న వారు లేరు. పాపులను దండించు నధికారము నాకున్నను దాని యవసరము లేనందున నా పదవికి గౌరవము పోయినది. కావున నీ ప్రతిమ నుపహరింపు మనెను. అది విని యిసుకలో దాచెద నంటిని. అన్నట్లు నేను దాచితిని. బంగారు తీగల పొదరింట దాచి యముని దక్షిణ దిశకు పంపితిని.

బ్రహ్మ:

లుప్తాయాం ప్రతిమాయాం తు ఇంద్రనీలస్య భోద్విజాః

తస్మి క్షేత్రవరే పుణ్యే విఖ్యాతే పురుషోత్తమే

యో భూతస్తత్ర వృత్తాంతో దేవదేవో జదార్దనః

తం సర్వం కథయామాస స తస్యైభగవాన్పురా

ఇంద్రద్యుమ్నస్య గమనం క్షేత్ర సందర్శనం తథా

క్షేత్రస్య వర్ణనం చైవ ప్రాసాదకరణం తథా

హయమేధస్య యజనం స్వప్న దర్శనమేవచ

లవణస్యోదధే స్తీరే కాష్ఠస్య దర్శనం తథా

దర్శనం వాసుదేవస్య శిల్పరాజస్య చద్విజాః

నిర్మాణం ప్రతిమాయాస్తు యథా వర్ణం విశేషతః

స్ధాపనం చైవ సర్వేషాం ప్రాసాదే భువనోత్తమే

యాత్రాకాలేచ విప్రేంద్రాః కల్ప సంకీర్తనం తథా

మార్కండేయస్య చరితం స్థాపనం శంకరస్యచ

పంచ తీర్థస్య మాహాత్మ్యం దర్శనం శూలపాణినః

వటస్య దర్శనం చైవ వ్యుష్టిం తస్య చభోద్విజాః

దర్శనం బలదేవస్య కృష్ణస్య చ విశేషతః

సుభద్రాయాశ్చ తత్రైవ మాహాత్మ్యం చైవ సర్వశః

దర్శనం నరసింహస్య వ్యుష్టి సంకీర్తనం తథా

అనంత వాసు దేవస్య దర్శనం గుణకీర్తనమ్‌

శ్వేత మాథవ మాహాత్మ్యం స్వర్గద్వారస్య దర్శనమ్‌

ఉదధే ర్దర్శనం చైవ స్నానం తర్పణ మేవచ

సముద్రస్నాన మాహాత్మ్య మింద్ర ద్యుమ్నస్య చద్విజాః

పంచతీర్థ ఫలం చైవ మహాజ్యేష్ఠం తధైవచ

స్థానం కృష్ణస్య హలినః పర్వయాత్రాఫలం తథా

వర్ణనం విష్ణులోకస్య క్షేత్రస్యచ పునః పునః

పూర్వం కథితవాన్సర్వం తస్యై స పురుషోత్తమః

బ్రహ్మ:

ఇంద్రనీల ప్రతిమట్లు మరుగు పడిన మీదట జరిగిన కథను విష్ణువు లక్ష్మికి చెప్పెను. ఆ చెప్పిన విషయ సంగ్రహము మూలము వలననే సుభముగ తెలియు చున్నది. కావున పునరుక్తిగా ననువాదము చేయబడ లేదు.