యోగాధ్యాయము
మునులు:
ఇదానీం బ్రూహి యోగం చ దుఃఖసంయోగ భేషజమ్
యం విదిత్వావ్యయం తత్ర యుంజామః పురుషోత్తమమ్
శ్రుత్వా స వచనం తేషాం కృష్ణ ద్వైపాయనస్తదా
అబ్రవీత్పరమప్రీతో యోగీ యోగవిదాం వరః
మునులు:
సంసార దుఃఖ నివార ణౌషధ మగు యోగమును తాము తెలిపినచో దాని యందు పురుషోత్తము డగు అవ్యయుడగు విష్ణుని అనుసంధానము చేయుదుము. అని మహర్షులు కోరగా యోగ వేత్తలలో శ్రేష్ఠుడగు వ్యాసుడు మిగుల సంతోషముతో యోగ ప్రకారమును ఇట్లు చెప్ప నారంభించెను.
వ్యాసులు:
యోగం వక్ష్యామి భో విప్రాః శృణుధ్వం భవనాశనమ్
యమభ్యస్యాప్నుయాద్యోగీ మోక్షం పరమదుర్లభమ్
శ్రుత్వాదౌ యోగశాస్త్రాణి గురుమారాధ్య భక్తితః
ఇతి హాసం పురాణం చ వేదాంశ్చైవ విచక్షణః
ఆహారం యోగదోషాంశ్చ దేశకాలం చ బుద్దిమాన్
జ్ఞాత్వా సమభ్యసేద్యోగం నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః
భుంజన్సక్తుం యవాగూం చ తక్రమూలఫలం పయః
యావకం కణపిణ్యాక మాహారం యోగసాధనమ్
న మనోవికలే ధ్మాతే న శ్రాంతే క్షుధితే తథా
న ద్వంద్వే న చ శీతే చ న చోష్ణే నానిలాత్మకే
సశభ్దే న జలాభ్యాశే జీర్ణగోష్టే చతుష్పథే
సరీసృపే శ్మశానే చ న నద్యంతేగ్ని సంనిధౌ
న చైత్యే న చ వల్మీకే సభయే కూపసంనిధౌ
న శుష్క పర్ణనిచయే యోగం యుంజీత కర్హిచిత్
దేశానేతాన నాదృత్య మూఢత్వాద్యో యునక్తి వై
ప్రవక్ష్యే తస్య యే దోషా జాయంతే విఘ్నకారకాః
బాధిర్యం జడతా లోపః స్మృతేర్మూకత్వమంధతా
జ్వరశ్చ జాయతే సద్య స్తద్వదజ్ఞాన సంభవః
తస్మాత్సర్వాత్మనా కార్యా రక్షా యోగవిదా సదా
ధర్మార్థకామమోక్షాణాం శరీరం సాధనం యతః
వ్యాసులు:
ఓ విప్రులారా! సంసార నాశక మగు యోగమును తెలిపెదను. దాని నభ్యసించి యోగియైన వాడు పరమ దుర్లభ మగు మోక్షమును పొంద గలుగును. మొదట యోగ శాస్త్రములను శ్రవణము చేసి భక్తితో గురువును ఆరాధించి యోగ విషయముల నెఱిగి ఇతిహాస పురాణ వేదములతో చెప్పిన విషయములను ఆహార గుణ దోషములను దేశకాల స్థితిగుణ దోషములను తెలిసి కొని పిమ్మట సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతుడై ఎవరి నుండి ఏదియు ప్రతిగ్రహించుట పై ఆశను మాని యోగము న్యభసింప వలెను. పేల పిండి గంజి మజ్జిగ దుంపలు వేళ్లు పండ్లు రవ్వతో వండిన అన్నము యవ పిండితో చేసిన వంట యోగ సాధనకు పనికి వచ్చు ఆహారము. మనస్సు ఆవేశము చెంది యున్నప్పుడు మనస్సు వికలమై యున్నప్పుడు శ్రమగా అకలిగా ఉన్నప్పుడు చలి ఉష్ణము గాలి భాదించు చున్నప్పుడు ధ్వనులు వినబడు చుండగా నీటి సమీపమున శిథిలమైన గో స్థానములో నాలుగు బాటలు కలిసిన ప్రదేశములో పాములు తిరుగు చోట శ్మశానములో నదుల చివరలలో అగ్ని సమీపమున చైత్యముల గ్రామములలో జనులు సమావేశ మగుటకును దేవతా భావనతో పూజించుటకును నాటిన చెట్ల దగ్గరను, పుట్టల దగ్గరను భయమునకు అవకాశము గల చోట్లను బావుల దగ్గరను ఎండిన ఆకుల కుప్పల దగ్గరను యోగ సాధన ఎప్పుడును చేయరాదు. ఒకవేళ ఇట్టిచోట్ల యోగ సాధనను మూఢుడై చేసిన యెడల చెవుడు బుద్ది మాంద్యము జ్ఞాపక శక్తి లోపము మూగి తనము గ్రుడ్డి తనము జ్వరము కలుగును. అజ్ఞానము సంభవించును. నాలుగు పురుషార్థము లకును దేహమే సాధనము కావున పై విషయములను పాటించి దేహమును రక్షించు కొనుచు యోగ సాధన చేయ వలెను.
ఆశ్రమే విజనే గుహ్యే నిఃశభ్దే నిర్భయే నగే
శూన్యాగారే శుచౌ రమ్యే చై కాంతే దేవతాలయే
రజన్యాః పశ్చిమే యామే పూర్వే చ సుసమాహితః
పూర్వాహ్ణే మధ్యమే చాహ్ని యుక్తాహారో జితేంద్రియః
ఆసీనః ప్రాజ్ముఖో రమ్య ఆసనే సుఖనిశ్చలే
నాతినీచే న చోచ్ర్చితే నిస్పృహః సత్యవాక్శుచిః
యుక్తనిద్రో జితక్రోధః సర్వభూతహితే రతః
సర్వద్వంద్వ సహో ధీరః సమకాయాంఘ్రీమస్తకః
నాభౌ నిధాయ హస్తౌ ద్వౌ శాంతః పద్మాసనే స్థితః
సంస్థాప్య దృష్టిం నాసాగ్రే పాణానాయమ్య వాగ్యతః
సమాహృత్యేంద్రియగ్రామం మనసా హృదయే మునిః
ప్రణవం దీర్ఘముద్యమ్య సంవృతాస్యః సునిశ్చలః
రజసా తమసో వృత్తిం సత్త్వేన రజసస్తథా
సంచాద్య నిర్మలే శాంతే స్థితః సంవృతలోచనః
హృత్పద్మకోటరే లీనం సర్వవ్యాపి నిరంజనమ్
యుంజీత సతతం యోగీ ముక్తిదం పురుషోత్తమమ్
కరణేంద్రియ భూతాని క్షేత్రజ్ఞే ప్రథమం న్యసేత్
క్షేత్రజ్ఞశ్చ పరే యోజ్య స్తతో యుంజతి యోగవిత్
మనో యస్యాంతమభ్యేతి పరమాత్మని చంచలమ్
సంత్యజ్య విషయాం స్తస్య యోగసిద్దిః ప్రకాశితా
యదా నిర్విషయం చిత్తం పరే బ్రహ్మణి లీయతే
సమాధౌ యోగయుక్తస్య తదాభ్యేతి పరం పదమ్
అసంసక్తం యదా చిత్తం యోగినః సర్వకర్మ సు
భవత్యానంద మాసాద్య తదా నిర్వాణ మృచ్ఛతి
శుద్దం ధామత్రయాతీతం తుర్యాఖ్యం పురుషోత్తమమ్
ప్రాప్య యోగబాలద్యోగీ ముచ్యతే నాత్ర సంశయః
నిఃస్పృహః సర్వకామేభ్యః సర్వత్ర ప్రియదర్శనః
సర్వత్రానిత్యబుద్దిస్తు యోగీ ముచ్యేత నాన్యధా
ఇంద్రియాణి న సేవేత వైరాగ్యేణ చ యోగవిత్
సదా చాభ్యాసయోగేన ముచ్యతే నాత్ర సంశయః
న చ పద్మాసనాద్యోగో న నాసాగ్రనిరీక్షణాత్
మనసశ్చేంద్రియాణాం చ సంయోగో యోగ ఉచ్యతే
ఏవం మయా మునిశ్రేష్టా యోగః ప్రోక్తో విముక్తిదః
సంసారమోక్ష హేతుశ్చ కిమస్యచ్ర్చోతు మిచ్చథ
శ్రుత్వా తే వచనం తస్య సాధు సాద్వితి చాబ్రువన్
వ్యాసం ప్రశస్య సంపూజ్య పునః ప్రష్టుం సముద్యతాః
ఆశ్రమములో జనులు లేని చోట రహస్య స్థానమున శబ్దము విన బడని చోట నిర్భయము చోట కొండ మీద శూన్య గృహమున శుచి స్థానమున అందమైన చోట ఏకాంత స్థానమున దేవాలయమున రాత్రి యొక్క మొదటి జామున చివరి జామున పగలు ప్రాతః కాలమున మధ్యాహ్నమున యోగ సాధన చేయ తగును. తగిన ఆహారమును మితముగా భుజించుచు ఇంద్రియముల జయించి సుఖమును నిశ్చలమును నై ఎక్కువ ఎత్తును కాని రమ్య మైన ఆసనమున ప్రాజ్ముఖుడై కూర్చుండ వలెను. సత్య వచనుడు శుచి తగినంత నిద్ర కలవాడు క్రోధము జయించిన వాడు సర్వ భూతములకు హితమును కోరు వాడు చలి వేడి మొదలగు అన్ని ద్వంద్వముల సహించు వాడు మనసున నిబ్బరము కలవాడు శరీరము పాదములు శిరస్సు సమముగా నుంచిన వాడు కావలెను. హస్తములను నాభిపై నిలిపి శాంతుడై పద్మాసనమున నుండ వలెను. మౌనియై దృష్టిని ముక్కు కొనపై నిలిపి ప్రాణాయామము చేయవలెను. జ్ఞానేంద్రియముల నైదింటిని మనస్సుతో కూడ హృదయము లోనికి ఉపసంహరించ వలెను. మునియై ప్రణవమును దీర్ఘముగా పూనికతో ఉచ్చరించుచు మిగుల నిశ్చలుడై తమో గుణ వ్యాపారము రజో గుణము చేతను రజో గుణ వ్యాపారమును సత్య గుణము చేతను కప్పి వేసి కన్నులు మూసి కొని నిర్మల శాంత స్థితిలో నుండ వలెను. ఇట్లు హృదయ గుహ యందు దాగిన వాడును సర్వ వ్యాపియు నిరంజనుడును అగు పురుషోత్తముని తన చిత్తమున అనుసంధానము చేయ వలెను. జ్ఞాన కర్మేంద్రియము లను భూతములను మొదట క్షేత్రజ్ఞుడు అగు జీవ చైతన్యము నందును తరువాత ఆ క్షేత్రజ్ఞుని పరమాత్మ తత్త్వము నందును అనుసంధానము చేయ వలెను. సహజ చంచల మగు మనస్సు బాహ్య విషయ సుఖములను వదలి పరమాత్ముని చేరిన వానికి యోగ సిద్ది నిశ్చయముగా కలుగును. చిత్తము విషయముల పైకి పోక బ్రహ్మము నందు లయ మొందినచో యోగ సమాధి ఫలమును సిద్దింప జేయుటచే సాధకుడు పరమ పదమును పొందును. యోగ సాధకుని చిత్తము ఏ కర్మాచరణము నందును ఆసక్తి నొందక ఆనందమును పొంది నప్పుడు యోగ సాధకుడు మోక్ష సిద్ది నొందును. ఏ కోరికలును లేక అన్నిటిని ప్రీతికరమైన వానిని గానే చూచుచు పరతత్త్వము తప్ప మిగిలిన దంతయు అనిత్య మని ఎఱుగనిదే మోక్షము సిద్ధింపదు. యోగ సాధకుడు వైరాగ్యముతో నుండ వలెను. ఇంద్రియ సుఖముల సేవింప రాదు. యోగము నభ్యసింప వలెను. పద్మాసముతో కూర్చుండుట నాసాగ్రమున దృష్టి నిలుపుట మాత్రమున యోగ సిద్ధి కలుగదు. మనస్సు ఇంద్రియములు కలిసి లయము నొందుటయే యోగము. ఓ ముని శ్రేష్ఠులారా! సంసార మోక్ష సాధన మగు యోగ ప్రకారమును తెలిపితిని. మఱి యేమి విన గోరుదురో ఆడుగుడు.
Summary of chapter 128 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The Sāṃkhya philosophical system — the enumeration of Prakṛti, Puruṣa, the twenty-five tattvas (evolutes of nature), and the process by which the individual soul becomes bound and liberated — is reviewed. The correspondence between Sāṃkhya's analytical understanding of reality and Yoga's practical means of liberation is established, affirming that both paths, though apparently different in method, lead to the same supreme goal.