వ్యాసులు:
మఖే ప్రతిహతే శక్రో భృశం కోపసమన్వితః
సంవర్తకం నామ గణం తోయదానా మ థాబ్రవీత్
భో భో మేఘా నిశ మ్యైత ద్వదతో వచనం మమ
అజ్ఞా నాంతర మే వాశు క్రియతా మవిచారితమ్
నందగోపః సుదుర్భుద్ధి ర్గోపై రన్యైః సహాయవాన్
కృష్ణాశ్రయ బలాధ్మాతోమఖభంగ మచీకరత్
ఆజీవో యః పరం తేషాం గోపత్వస్య చ కారణమ్
తా గోవో వృష్టిపాతేన పీడ్యంతాం వచనా న్మమ
అహ మ ప్యద్రిశృంగాభం తుంగ మారుహ్య వారణమ్
సాహాయ్యం వః కరిష్యామి వాయూనాం సంగమేన చ
ఇ త్యాజ్ఞప్తాః సురేంద్రేణ ముముచుస్తే బలాహకాః
వాతవర్షం మహాభీమ మభావాయ గవాం ద్విజాః
తతః క్షణేన ధరణీ కకుభోంబర మేవ చ
ఏకం ధారామహాసారపూరణే నాభవ ద్ద్విజాః
గావస్తు తేన పతతా వర్షవాతేప వేగినా
ధుతాః ప్రాణా న్జహుః సర్వా స్తిర్యఙ్ముఖశిరోధరాః
క్రోడేన వత్సా నాక్రమ్య తస్థు రన్యా ద్విజో త్తమాః
గావో వివత్సా శ్చ కృతా వారిపూరేణ చాపరాః
వత్సాశ్చ దీనవదనాః పవనాకంపికంధరాః
త్రాహి త్రా హీత్యల్ప శబ్దాః కృష్ణ మూచు రివార్తకాః
తత స్త ద్గోకులం సర్వం గోగోపీగోపసంకులమ్
అతీ వార్తం హరి ర్దృష్ట్వా త్రాణా యాచింతయత్తదా
ఏతత్కృతం మహేంద్రేణ మఖభంగ విరోధినా
త దేత దభిలం గోష్ఠం త్రాతవ్య మధునా మయా
ఇమ మద్రి మహం వీర్యా దుత్పాట్యోరుశిలాతలమ్
ధారయిష్యామి గోష్ఠస్య పృథుచ్చత్ర మివోపరి
ఇతి కృత్వా మతిం కృష్ణో గోవర్ధన మహీధరమ్
ఉత్పాట్యైగరకరేణైవ ధారయామాన లీలయా
గోపాంశ్చాహ జగన్నాథః సముత్పాటితభూధరః
విశధ్వ మత్ర సహితాః కృతం వర్ష నివారణమ్
సునిర్వాతేషు దేశేషు యథాయోగ్య మి హాస్యతామ్
ప్రవిశ్య నాత్ర భేతవ్యం గిరిపాతస్య నిర్భయైః
ఇత్యుక్తా స్తేన తే గోపా వివిశు ర్గోధనైః సహ
శకటారోపితై ర్భాండై ర్గోప్య శ్చాసారపీడితాః
కృష్ణొపి తం దధారైవం శైల మత్యంత నిశ్చలమ్
ప్రజౌకోవాసిభిర్హర్షవిస్మితాక్షై ర్నిరీక్షితః
గోపగోపీజనై ర్హృష్టైః ప్రీతివిస్తారి తేక్షణైః
సంస్తూయమానచరితః కృష్ణః శైల మధారయత్
సప్తరాత్రం మహామేఘా వవర్షు ర్నందగోకులే
ఇంద్రేణ చోదితా మేఘా గోపానాం నాశకారిణా
తతో ధృతే మహాశైలే పరిత్రాతే చ గోకులే
మిథ్యాప్రతిజ్ఞో బలభి ద్వారయామాన తాన్ఘనాన్
వ్యభ్రే నభసి దేవేంద్రే వితథే శక్రమంత్రితే
నిష్క్రమ్య గోకులం హృష్టః స్వస్థానం పున రాగమత్
వ్యాసులు:
ఇంద్రోత్సవము సేయ బని లేదను గోపకుల నిశ్చయముచే మిక్కిలి కోపించి యింద్రుడు సంవర్తకమును మేఘ గణముం గూర్చి యిట్లనియె. ఓ మేఘములారా! నేను బలుకు వచనము నాలింపుడు. నా యాజ్ఞను అవిరామముగ వెంటనే కావింపుడు. నందుడు దుర్బుద్ధియై గొల్లలం గూడ గట్టుకొని కృష్ణుని యాశ్రయ బలముచే నుబ్బి ఉత్సవ భంగము సేసివాడు. ఆ గొల్లలకు జీవ నాధారము, గోపాలు రనిపించు కొనుటకు గారణమును గోవులే. కావున వానిని రాళ్ళవాన గురిసి బాధింపుడు. నేనును కొండ శిఖర మట్లున్న యైరావత గజము నెక్కివచ్చి వాయువుల తోడ మీకు దోడ య్యెదను. ఇట్లింద్రునిచే నాజ్ఞాపింప బడి మేఘములు గోవులుచెడ జడుపు గొలుపు జడివాన గురిసినవి. క్షణములో నీ ధరణి దిక్కులు నాకాశము నొక్కటిగ నేక ధారగ గురిసిన కుంభ వృష్టిచే నావులు దెబ్బతిని మెడలు తలలు తిఱుగ బడి పడి పోయినవి. కొన్ని గోవులు దూడలను ఱొమ్ముల నదిమి కొన్నవి. కొన్ని గోవులు దూడల కెడమైనవి. కొన్ని యావులు గాలికి నొడలు వడక బిక్క మొగము పెట్టి కావుకావు మన్నట్లం బారవములు సేసి యల్లన గృష్ణునిం గూర్చి మొర వెట్టికొన్నవి. గోవులు గోపికలు గోపకులతో నా గోకులమెల్ల బెగడువడి వ్యాకులమౌట గని హరి వారిని రక్షింప నాలోచించెను. ఉత్సవ భంగమునకు బగగొని యింద్రుడిది చేసెను. నేనీ గోవ్రజముం గాపాడ వలయును. ఈ కొండం బెల్లగించి యీ గోష్ఠమున కెల్ల గొడుగుగా నెత్తి పట్టెదను గాక అని నిశ్చయించి యా గోవర్ధన గిరి నొంటి ఱెక్క నవలీలగ నెత్తి పట్టెను. మఱియును జగన్నాథుడు వాన కడ్డు సేసితిని. ఈ కొండ గొడుగు క్రింద కందఱు రండు రండు. గాలి తాకిడి లేనియెడ ననువగు చోటుల మీరు సరుదు కొనుడు. ఈ కొండ విరిగి మీదపడు నేమోయని యీ క్రింద నిలుచుటకు జడియ వలదన హరి పలుకు విని గోధనములతో బండ్లకెక్కించి కొన్న కుండలు మండలతో గోపకులు గోపికలు వాన దెబ్బదిని యా కొండ క్రిందికిం జొచ్చిరి. కృష్ణుడు నా శైలముం గేలల్లాడకుండ నెత్తి వట్టెను. వ్రజ వాసులు నానంద పడి యచ్చెరువు గొని విచ్చిన వెదకన్ను లప్పగించి కృష్ణ డప్పంగని బాలకృష్ణ లీలలం గొనియాడిరి. స్వామియు నదియొక యాటగా నేడు రాత్రులేక ధారగా నింద్రాజ్ఞ గొని మేఘములు గురియ నేకధాటి నా గోవర్ధనము నెత్తికొనెను. హరియట్ల ప్పెనుగొండ నెత్తికొన గోకులము రక్షణగొన బలారి తన ప్రతిన యబద్ధమయి యాకనమున మబ్బు విరిసి నట్ల తన యాలోచనలు వమ్మయిపో గోకులము వెడలి సంబర పడి స్వస్థానమునకు దిరిగి వచ్చెను.
వ్యాసులు:
ముమోచ కృష్ణోపి తదా గోవర్ధనమహాగిరిమ్
స్వస్థానే విస్మితముఖై ర్దృష్ట స్తైర్ర్వజవాసిభిః
ధృతే గోవర్ధనే శైలే పరిత్రాతే చ గోకులే
రోచయామాన కృష్ణస్య దర్శనం పాకశాసనః
సోధిరుహ్య మాహానాగ మైరావత మమిత్రజిత్
గోవర్ధనగిరౌ కృష్ణం దదర్శ త్రిదశాధిపః
చారయంతం మహావీర్యం గాశ్చ గోపవపుర్ధరమ్
కృత్స్నస్య జగతో గోపం వృతం గోపకుమారకైః
గరుడం చ దద ర్మోచ్చై రంతర్ధానగతం ద్విజాః
కృతచ్ఛాయం హారే ర్మూర్ధ్ని పక్షాభ్యాం పక్షిపుంగవమ్
అవరుహ్య స నాగేంద్రా దేకాంతే మధుసూదనమ్
శక్రః సస్మిత మాహేదం ప్రీతివిస్ఫారితేక్షణః
వ్యాసులు:
కృష్ణుడును గోవర్ధన గిరిని యధా స్ధానమున దించెను. వ్రజ వాసులెన లేని యుల్లాసమున నవ్వింతం గనిరి. ఈవిధముగ గిరినెత్త గోకులము రక్షణముగొన నింద్రుడు కృష్ణ దర్శనము సేసి కొననెంచి యైరావత మెక్కి క్రిందికిం దిగివచ్చి యయ్యాల కాపరిని జగమ్మున కెల్ల కాపరింగా గరుడుండు తన ఱక్కలు విప్పి కల్పించిన నీడ క్రింద గరుడ వాహనా రూఢుడై యున్న సాక్షా ద్విష్ణువుని మధుసూదనునిం గని గజరాజము నుండి దిగి యేకాంత మునం దల్లన నగుచు ప్రీతిచే కన్నులు విప్పార నిట్లనియె.
గోవర్ధన పట్టాభిషేకము
కృష్ణ కృష్ణ శ్రుణుష్వేదం యదర్థ మహ మాగతః
త్వ త్సమీపం మహాబాహో నైత చ్చింత్యం త్వయాస్యథా
భారావతరణార్థాయ పృథివ్యాః పృథివీతలమ్
అవతీర్ణోఖిలాధార స్త్వ మేవ పరమేశ్వర
మహభంగవిరుద్ధేన మయా గోకులనాశకాః
సమాదిష్టా మహామేఘా స్తై శ్చైత త్కదనం కృతమ్
త్రాతా స్తాపా త్త్వయా గావః సముత్పాట్య మహాగిరిమ్
తే నాహం తోషితో వీర కర్మణాత్యద్భుతేన తే
సాధితం కృష్ణ దేవానా మద్య మన్యే ప్రయోజనమ్
త్వయాయ మద్రి ప్రవరః కరే ణైకైన చోద్ధృతః
గోభి శ్చ నోదితః కృష్ణ త్వ త్సమీప మిహాగతః
త్వయా త్రాతాభి రత్యర్థం యుష్మ త్కారణకారణాత్
సత్వాం కృష్ణాభిప్రేక్ష్యామి గవాం వాక్యప్రచోదితః
ఉపేంద్రత్వే గవా మింద్రో గోవింద స్త్వం భవిష్యసి
ఆ థోపవాహ్యా దాదాయ ఘంటా మైరావతా ద్గజాత్
అభిషేకం తయా చక్రే పవిత్ర జలపూర్ణయా
క్రియమాణేభిషేకే తు గావః కృష్ణస్య తత్క్షణాత్
ప్రస్రవోద్భూతదుగ్ధార్ద్రాం సద్య శ్చక్రు ర్వసుంధరామ్
అభిషిచ్య గవాం వాక్యా ద్దేవేంద్రో వై జనార్దనమ్
ప్రీత్యా సప్రశ్రయం కృష్ణం పున రాహ శచీపతిః
కృష్ణా కృష్ణా! విను మేనిటకు నీ సన్నిధి కెందులకు వచ్చతినో యిది మఱొక లాగున భావింప వలదు. భూ భారము దింప నియ్యిలపై నీవతరించిన నిఖిలా ధారుడవు. పరమేశ్వరుడవు నీవే. నన్ను గూర్చిన మహోత్సవమునకు భంగమయ్యె నన్న విరోధమున గోకులముం జెఱుప నేను బంపిన కార్మబ్బులచే నింత రగడు జరిగినది. నీ వా గిరినెత్తి యాదవులం గాంచితిని. అవ్వింతంగని నేనును సంతుష్టుడ నైతిని దేవతల కార్యమిద్దాన నెరవేరినది. నా ప్రయోజనము చక్కగ సిద్ధించినదని నేను దలచెదను. నీ రక్షణ మందిన గోవులు నీ యవతార కారణమునకు గారణ మైనవి. ప్రేరణ సేయ నీ దరి కేతెంచితిని. గోవిందుడ వీవే యిపు డుపేంద్రుడను కాగలవు. అని యైరావతము మెడ నుండి గంటను జేకొని పవిత్ర జల పూర్ణమైన యద్దానిచే హరి కభిషేకము గావించెను. గో ప్రేరణచే ఆ జరిపిన యా గోవర్ధన పట్టాభిషేక వైభవ మందు గోవులు నిండ చేసిన క్షీరధారలచే నా క్షణ మయభిషేకించి యి వ్వసుంధరం గూడ నిండ దడిపినవి. శచీపతి ప్రీతిగోని వినయముతో గృష్ణుంగని మఱియు నిట్లనియె.
ఇంద్రుడు:
గవా మేత త్కృతం వాక్యా త్తథాన్య దపి మే శృణు
య ద్బ్రవీమి మహాభాగ భారావతరణేచ్ఛయా
మమాంశః పురుషవ్యాఘ్రః పృథివ్యాం పృథివీధర
అవతీర్థోర్జునో నామ స రక్ష్యో భవతా సదా
భారావతరణే సఖ్యం స తే వీరః కరిష్యతి
స రక్షణీయో భవతా యథాత్మా మధుసూదన
ఇంద్రుడు:
ఈ వైభవ మంతయు గోవుల మాటం బట్టి చేసితిని. ఒక విన్నపము గావించెద నాలింపుము. నా యంశమున నియ్యవని పై మహా పురుషుడై అర్జునుం డవతరించి యున్నాడు. అతడు తమ రక్షణ కర్హుడు. భూ భారము నందు నీతో జెలిమి చేయ గలడు. వానిని నీవు నిన్ను వలె గాపాడ వలయును. అన భగవంతు డిట్లనియె.
గోవిందుడు:
జానామి భారతే వంశే జాతం పార్ధం త వాంశతః
త మహం పాలయిష్యామి యావ దస్మి మహీతలే
యావ న్మహీతలే శక్ర స్థాస్యా మ్యహ మరిందమ
నతావ దర్జునం కశ్చి ద్దేవేంద్ర! యుధి జేష్యతి
కంసో నామ మహాబాహు ర్దైత్యోరిష్ట స్తథా పరః
కేశీ కువలయాపీడో నరకాద్యా స్తథాపరే
హతేషు తేషు దేవేంద్ర భవిష్యతి మహాహవః
తత్ర విద్ధి సహస్రాక్ష భారావతరణం కృతమ్
స త్వం గచ్ఛ న సంతాపం పుత్రార్ధే కర్తు మర్హసి
నార్జునస్య రిపుః కశ్చి న్మమాగ్రే ప్రభవిష్యతి
అర్జునార్థే త్వహం సర్వా న్యుధిష్ఠిరపురోగమాన్
నివృత్తే భారతే యుద్ధే కుంత్యై దాస్యామి విక్షతాన్
ఇత్యుక్తః సంపరిష్వజ్య దేవరాజో జనార్దనమ్
ఆరు హ్యైరావతం నాగం పున రేవ దివం యయౌ
కృష్ణోపి సహితో గోభి ర్గోపాలైశ్చ పున ర్ర్వజమ్
ఆజగా మాథ గోపీనాం దృష్టిపూతేన వర్త్మనా
గోవిందుడు:
భారత వంశమున నీ యంశమున పార్ధుడు పుట్టుట నే నెఱుంగుదును. వానిని నే నవని నున్నంత దనుక పాలింతును. ఆ యర్జును నెవ్వడును యుద్ధమున గెలువ జాలడు. కంసుడు అరిష్టుడు కేశి కువలయా పీడుడు నరకుడు మఱి యెందరో కూలిన తరువాత మహా యుద్దము జరుగ గలదు. దాన భూ భారము హరించును. అందుచే నీ వేగుము. నీ పుత్రునకై నీవు పరితాప పడకుము. అర్జునునికి శత్రువను వాడొక్కడు నాముందుండ బోడు. అర్జును కొఱకే నేను యుదిష్టి రాదులను భారత యుద్ధము జరిగిన తరువాత క్షేమమున నున్న వారిని గుంతికి సమర్పింతును. అని హరి పలుక దేవాధి పతి జనార్ధనుం గౌగలించి కొని యైరావత మెక్కి దివంబున కరిగెను. కృష్ణుడును గోవులతో గోపాలురతో గొల్ల పల్లెను గోపికల చూపులచే బవిత్ర మైన త్రోవ నేతెంచెను.
Summary of chapter 81 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The bull-demon Ariṣṭāsura terrorizes Vṛndāvana; his massive form shakes the earth. The gopīs and gopas flee in terror. Kṛṣṇa fearlessly confronts the demon, wrestles him by the horns, and kills him. The victory over Ariṣṭa is celebrated by the cowherds and celestial beings alike, further establishing Kṛṣṇa's identity as the supreme protector of all who take refuge in him.