233 - ప్రాకృతలయ నిరూపణమ్‌

నైమిత్తిక ప్రాకృత ప్రళయకథనము

వ్యాసులు:

సప్తర్షిస్థాన మాక్రమ్య స్థితేంభసి ద్విజో త్తమాః

ఏకార్ణవం భవత్యేత త్త్రైలోక్య మఖిలం తతః

అథ విఃశ్వాసజో విష్ణో ర్వాయుస్తా న్జలదాం స్తతః

నాశం నయతి భో విప్రా వర్షణామధికం శతమ్‌

సర్వభూతమయోచింత్యో భగవాన్భూత భావనః

అనాదిరాది ర్విశ్వస్య పీత్వా వాయుమశేషతః

ఏకార్ణవే తత స్తస్మిన్‌ శేషశయ్యా స్థితః ప్రభుః

బ్రహ్మరూపధరః శేతే భగవా నాదికృద్ధరిః

జనలోకగతైః సిద్ధైః సనకాద్యైరభిష్టుతః

బ్రహ్మలోకగతై శ్చైవ చింత్యమానో ముముక్షుభిః

ఆత్మమాయామయీం దివ్యాం యోగనిద్రాం సమాస్థితః

ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్పరమేశ్వరః

ఏష నైమిత్తికో నామ విప్రేంద్రాః ప్రతిసంచరః

నిమిత్తం తత్ర యచ్ఛేతే బ్రహ్మరూపధరో హరిః

యదా జాగర్తి సర్వాత్మా స తదా చేష్టతే జగత్‌

నిమీలత్యేతదఖిలం మాయాశయ్యాశయేచ్యుతే

పద్మయోనే ర్దినం యత్తు చతుర్యుగ సహస్రవత్‌

ఏకార్ణవకృతే లోకే తావతీ రాత్రిరుచ్యతే

తతః ప్రబుద్ధో రాత్ర్యంతే పునః సృష్టిం కరోత్యజః

బ్రహ్మస్వరూపధృగ్విష్ణు ర్యథా వః కథితం పురా

ఇత్యేష కల్ప సంహార అంతర ప్రలయో ద్విజాః

నైమిత్తికో వః కథితః శృణుధ్వం ప్రాకృతం పరమ్‌

వ్యాసులు:

ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ ప్రళయ మేఘములు వర్షించుటచే కలిగిన జలము సప్త మహర్షు లుండు స్థానము వరకు వ్యాపింపగా ఈ త్రైలోక్య మంతయు ఏక సముద్ర మగును. విష్ణు వంతట తన నిట్టూర్పు వాయువు తోనే నూరేండ్లకు పై బడిన కాల వ్యవధిలో నశింప జేయును. సర్వ భూత మయుడును ఊహింప నలవి కాని వాడు భూతముల నన్నిటిని సృష్టించు వాడు ఆది లేకయు లోకమునకు ఆదియగు విష్ణు భగవానుడు వాయువు నంతటిని పూర్తిగా పీల్చి వేసి బ్రహ్మ రూపమును ధరించి ఆ ఏకార్ణవమున శేష శయ్యపై పరుండును. అప్పు డతనిని జనలోక మందలి సనకాది సిద్ధులు బ్రహ్మ లోకము నందలి వారు స్తుతించు చుందురు. మోక్షము కోరిన వారు ధ్యానించు చుందురు. ఆ పరమేశ్వరుడు వాసు దేవుడను తన స్వరూపమును చింతించుచు తన స్వమాయా రూప యగు యోగ నిద్ర నాశ్రయించి యుండును. ప్రళయాంతమున హరి సృష్టికి నిమిత్త కారణుడుగా బ్రహ్మ రూపము ధరించి శయనించి యుండుటచే దీనికి నైమిత్తిక ప్రళయమని పేరు. వేయి చతుర్యుగముల పరిమాణము కల బ్రహ్మ దేవుని పగటి వలెనే అతని రాత్రియు అంతే పరిమాణము కలది. అంత కాలము గడచిన తరువాత విష్ణువు మరల బ్రహ్మ యొక్క రూపముతో సృష్టిని ఆరంభించును. ఇట్లు ఓ విప్రులారా! మీకు నైమిత్తిక ప్రళయ విధము తెలిపితిని. ఇక ప్రాకృత ప్రళయము తెలిపెదను వినుడు.

అవృష్ట్యగ్న్యాదిభిః సమ్యక్కృతే శయ్యాలయే ద్విజాః

సమస్తేష్వేవ లోకేషు పాతాళేష్వభిలేషు చ

మహదాదే ర్వికారస్య విశేషాత్తత్ర సంక్షయే

కృష్ణేచ్ఛాకారితే తస్మి న్ప్రవృత్తే ప్రతిసంచరే

అపో గ్రసంతి వై పూర్వం భూమేర్గంధాదికం గుణమ్‌

ఆత్తగంధా తతో భూమిః ప్రలయాయ ప్రకల్పతే

ప్రనష్టే గంధ తన్మాత్రే భవత్యుర్వీ జలాత్మికా

అపస్తదా ప్రవృత్తా స్తు వేగవత్యోమహాస్వనాః

సర్వ మాపూరయంతీదం తిష్ఠంతి విచరంతి చ

సలిలేనై వోర్మిమతా లోకాలోకాః సమంతతః

అపామపి గుణో యస్తు జ్యోతిషా పీయతే తు సః

నశ్యంత్యాపః సుతప్తాశ్చ రసతన్మాత్ర సంక్షయాత్‌

తతశ్చాపోమృతరసా జ్యోతిష్ట్వం ప్రాప్నువంతి వై

అగ్న్యవస్థే తు సలిలే తేజసా సర్వతో వృతే

స చాగ్నిః సర్వతో వ్యాప్య ఆదత్తే తజ్జలం తదా

సర్వమాపూ రయత్యగ్ని స్తదా జగదిదం శనైః

అర్చిభిః సంతతే తస్మిం స్తిర్యగూర్ధ్వ మధ స్తథా

జ్యోతిషోపి పరం రూపం వాయురత్తి ప్రభాకరమ్‌

ప్రలీనే చ తతస్తస్మి న్వాయు భూతేభిలాత్మకే

ప్రనష్టే రూపతన్మాత్రే కృతరూపో విభావసుః

ప్రశామ్యతి తదా జ్యోతి ర్వాయుర్దోధూయతే మహాన్‌

నిరాలోకే తదా లోకే వాయు సంస్థే చ తేజసి

తతః ప్రలయమాసాద్య వాయు సంభవ మాత్మనః

ఊర్ధ్వం చ వాయుస్తిర్యక్చ దోధవీతి దిశో దశ

వాయోస్త్వపి గుణం స్పర్శ మాకాశం గ్రసతే తతః

ప్రశామ్యతి తదా వాయుః ఖం తు తిష్ఠత్యనావృతమ్‌

ఆరూపమరసస్పర్శ మగంధవ దమూర్తిమత్‌

సర్వమాపూరయచ్చైవ సుమహత్ర్పకాశతే

పరి మండలత స్తత్తు ఆకాశం శబ్దలక్షణమ్‌

శబ్దమాత్రం తథాకాశం సర్వమావృత్యతిష్ఠతి

తతః శబ్దగుణం తస్య భూతాది ర్గ్రసతే పునః

భూతేంద్రియేషు యుగప ద్భూతాదౌ సంస్థితేషు పై

అభిమానాత్మకో హ్యేష భూతాది స్తామసః స్మృతః

భూతాదిం గ్రసతే చాపి మహాబుద్ధి ర్విచక్షణా

ఉర్వీ మహాంశ్చ జగతః ప్రాంతేంతర్బాహ్యత స్తథా

ఏవం సప్తమహాబుద్ధిః క్రమాత్ర్పకృతయ స్తథా

ప్రత్యా హారైస్తు తాః సర్వాః ప్రవిశంతి పరస్పరమ్‌

యేనేద మావృతం సర్వ మండ మప్సు ప్రలీయతే

సప్తద్వీప సముద్రాంతం సప్తలోకం సపర్వతమ్‌

ఉదకావరణం హ్యత్ర జ్యోతిషా పీయతే తు తత్‌

జ్యోతిర్వాయౌ లయం యాతి యాత్యాకాశే సమీరణః

ఆకాశం చైవ భూతాది ర్గ్రసతే తం తథా మహాన్‌

మహాంతమేభిః సహితం ప్రకృతి ర్గ్రసతే ద్విజాః

గుణసామ్య మనుద్రిక్త మన్యూనం చ ద్విజోత్తమాః

అనావృష్టి అగ్ని మొదలగు ఉపద్రవములతో భూలోక పాతాళాది లోకము లందలి ఉపరి తలమున గల పదార్థము లన్నియు మొదట నశించును. తరువాత విష్ణుని ఇచ్ఛకు లోబడి మహాదాది ప్రకృతి వికారము లన్నియు నశించును. ఇదే ప్రాకృత ప్రళయము. దాని క్రమమిది. మొదట జలము పృధివి యొక్క గంధ గుణమును హరించును. అంతట పృథివియు జల రూపము ధరించును. అపుడవి మహా ధ్వనితో మహా వేగమున ప్రవహించి లోకాలోక పర్వతము వరకు నిండి పోవును. అంతట అగ్ని తత్త్వము జలమును దానిలోని రస తన్మాత్రను హరించును. అంతట జలము జల రూపము వదలి అగ్నిగా నగును. అపుడీ జల మంతయు పృథివి లేక జలము లేక కేవల మగ్ని జ్వాలలతో నిండి యుండును. అంతట వాయువు అగ్ని యొక్క విశేష గుణ మగు రూప తన్మాత్రను హరించును. అప్పుడు అగ్ని యంతయు అగ్నిత్వమును కోల్పోయి వాయువుగా నగును. ప్రపంచ మంతయు వాయువు మాత్రమే అయి అది పది దెసల వీచు చుండును. అంతలో అకాశము వాయువు యొక్క విశేష గుణమగు స్పర్శ తన్మాత్రను తన లోనికి లయము చేసి కొనుటచే వాయువు వాయువుగా నుండక లయము నొందుటచే అంతటను ఆకాశము కేవల శూన్య తత్త్వము మాత్రము ఉండును. అంతలో ఆకాశము యొక్క విశేష గుణమగు శబ్ద తన్మాత్రను భూతాది తత్త్వము తనలో లయ మొందించు కొనును. అదియు మహత్తత్త్వము నందును అదియు ప్రకృతి యందును లయము నొందును. అదియే త్రి గుణముల సామ్యావస్థ. అనగా అప్పుడు సత్త్వ రజన్తమో గుణములలో ఏ యొక్కటియు ఎక్కువగ ఉద్రేకింపక మూడును సమ స్థితిలో నుండును.

ప్రోచ్యతే ప్రకృతిర్హేతుః ప్రధానం కారణం వరమ్‌

ఇత్యేషా ప్రకృతిః సర్వా ప్యక్తా వ్యక్త స్వరూపిణీ

వ్యక్త స్వరూపమవ్యక్తే తస్యాం విప్రాః ప్రలీయతే

ఏకః శుద్ధోక్షరో నిత్యః సర్వవ్యాపీ తథా పునః

సోవ్యంశః సర్వభూతస్య ద్విజేంద్రాః పరమాత్మనః

నశ్యంతి సర్వా యత్రా పి నామజాత్యాది కల్పనాః

సత్తామాత్రాత్మకే జ్ఞేయే జ్ఞానాత్మన్యాత్మనః పరే

న బ్రహ్మ తత్పరం ధామ పరమాత్మా పరేశ్వరః

స విష్ణుః సర్వమేవేదం యతో నావర్తతే పునః

ప్రకృతిర్యా మయాఖ్యాతా వ్యక్తా వ్యక్త స్వరూపిణీ

పురుషశ్చాప్యుభావేతౌ లీయేతే పరమాత్మని

పరమాత్మా చ సర్వేషా మాధారః పరమేశ్వరః

విష్ణునామ్నా న వేదేషు వేదాంతేషు చ గీయతే

పవ్రృత్తం చ వివృత్తం చ ద్వివిధ కర్మ వైదికమ్‌

తాభ్యా ముభాభ్యాం పురుషై ర్యజ్ఞమూర్తిః స ఇజ్యతే

ఋగ్యజుఃసామభి ర్మార్గ్రైః ప్రవృత్తై రిజ్యతే హ్యసౌ

యజ్ఞేశ్వరో యజ్ఞపుమా స్పురుషైః పురుషోత్తమః

జ్ఞానాత్మా జ్ఞానయోగేన జ్ఞానమూర్తిః స ఇజ్యతే

నివృతైర్యోగమార్గైశ్చ విష్ణుర్ముక్తిఫలప్రదః

హ్రస్వదీర్ఘప్లుతైర్యత్తు కించిద్వ స్త్వభిధీయతే

యచ్చ వాచా మవిషయ స్తత్సర్వం విష్ణురవ్యయః

వ్యక్తః స ఏవ మప్యక్తః స ఏవ పురుషోవ్యయః

పరమాత్మా చ విశ్వాత్మా విశ్వరూపధరో హరిః

వ్యక్తావ్యక్తాత్మికా తస్మి న్ర్పకృతిః సా విలీయతే

పురుషశ్చాపి భో విప్రా యస్తదవ్యాకృతాత్మని

ద్విపరార్ధాత్మకః కాలః కథితో యో మమా ద్విజాః

తదహస్తవ్య విప్రేంద్రా విష్ణోరీశస్య కథ్యతే

వ్యక్తేతు ప్రకృతౌ లీనే ప్రకృత్యాం పురుషే తథా

తత్రాస్థితే విశా తస్య తత్ర్పమాణా తపోధనాః

నై వాహస్తస్య చ నిశా నిత్యస్య పరమాత్మనః

ఉపచారత్తథా ప్యేత త్తస్యేశస్య తు కథ్యతే

ఇత్యేష మునిశార్దూలాః కథితః ప్రాకృతో లయః

ఈ ప్రకృతినే ప్రధాన హేతువు పరమ కారణము అనియు వ్యవహరింతురు. ఇది వ్యక్త అవ్యక్త స్పష్ట అస్పష్ట స్వరూపము కలది. ఈ వ్యక్తావ్యక్త తత్త్వము అవ్యక్తత్త్వములో లయము నందును. ఆ అవ్యక్తమే అక్షరము నాశము లేనిది నిత్యము సర్వ వ్యాపియై యుండును. అదియు సర్వ భూతాత్మకు డగు పరమాత్మ యొక్క అంశమే. సత్తా మాత్ర జ్ఞాన మాత్ర సత్‌ చిత్‌ రూపుడును అన్ని తత్త్వముల కంటె గొప్పవాడును అగు ఆ పరమాత్ము నందే ఈ ప్రాపంచిక వ్యవహారమునకు సంబంధించిన నామము జాతి మొదలగు కల్పన లన్నియు లయము పొందును. ఆ తత్త్వమే బ్రహ్మము పరంధామము పరమాత్మ పరమేశ్వరుడు విష్ణువు అనబడును. అతనిని చేరిన వారు మరల జన్మ లోనికి రారు. వ్యక్తావ్యక్త స్వరూప యగు ప్రకృతియు అవ్యక్త రూపుడు అక్షరుడును పురుషుడును ఈ రెండును పరమాత్మ యందు లయ మగును. అయనయే అన్ని తత్త్వములకును అశ్రయమగు చోటు. అతడు విష్ణువను పేరుతో వేదముల వేదాంతముల యందు గానము చేయబడు చున్నాడు. వేదోక్త మగు కర్మలు ప్రవృత్తి ప్రధానములు నివృత్తి ప్రధానములు అని రెండు విధములు. ఋగ్యజుః సామ వేదానుసారి యగు మార్గమున యజ్ఞేశ్వరుడుగా యజ్ఞ పురుషుడుగా పరమాత్మ నారాధించుట ప్రవృత్తి మార్గము. జ్ఞానమూర్తి, చిద్రూపుడు అగు ఆయనను జ్ఞాన యోగమున ఉపాసించుట నివృత్తి మార్గము. ఆయన తత్త్వము వాక్కులకు అంద రానిది. ద్విపరార్ధ పరిమితి గల కాలము విష్ణువునకు ఒక పగలు అంతే ఆయనకు రాత్రి పరిమాణమును. ఇది కూడ లోక సామ్యమును బట్టి చెప్పుటయే కాని ఆ పరమాత్మునకు పగలును రాత్రియు అనునవి లేవు. ఓ ఋషులారా! ఈ చెప్పినది ప్రాకృత లయ స్వరూపము.