38 - మదన దహనమ్‌

బ్రహ్మ:

ప్రవిష్టే భవనం దేవే సూపవిష్టే వరాసనే

స వక్రో మన్మథః క్రూరో దేవం వేద్ధుమనా భవత్‌

త మనాచారసంయుక్తం దురాత్మానం కులాధమమ్‌

లోకా స్సర్వా న్పీడయంతం సర్వాంగావరణాత్మకమ్‌

ఋషీణాం విఘ్నకర్తారం నియమానాం వ్రతై స్సహ

చక్రాహ్వయస్య రూపేణ రత్యా సహ సమాగతమ్‌

అథా తతాయినం విప్రాః! వేద్ధుకామం సురేశ్వరః

నయనేన తృతీయేన సావజ్ఞం సమవైక్షత

తతో స్య నేత్రజో వహ్నిః జ్వాలామాలా సహస్రవాన్‌

సహసా రతిభర్తార మదహ త్సపరిచ్ఛమ్‌

స దహ్యమానః కరుణ మార్తో క్రోశత వి స్వరమ్‌

 ప్రసాదయం శ్చ తం దేవం పపాత ధరణీతలే

అథ సో గ్నిపరీతాంగో మన్మథో లోక తాపనః

 పపాత సహసా మూర్ఛాం క్షణేన సమపద్యత

పత్నీ తు కరుణం తస్య విలలాప సుదుఃఖితా

దేవీం దేవం చ దుఃఖార్తా అయాచ త్కరుణావతీ

తస్యా శ్చ కరుణాం జ్ఞాత్వా దేవౌ తౌ కరుణాత్మకౌ

ఊచతు స్తాం సమాలోక్య సమాశ్వాస్య చ దుఃఖితామ్‌

బ్రహ్మ:

మహా దేవుడు నిజభవన మందాసనమున గూర్చుండ దుష్టుడగు మన్మథు డాయనను వేధింప నేతించెను. అది యెరింగి యయ్యాత తాయిని శిక్షింప నిటలాక్షుండు తృతీయ నేత్రమున వీక్షింప నమ్ముక్కంటి మంట కెఱయై యనంగుడు మూర్చ వడెను. ఆయన సతి రతి మిక్కిలి శోకించెను. అంత జాలిగొని యా యుమా శంకరులు రతీ దేవింగని యిట్లనిరి.

ఉమామహేశ్వరులు:

దగ్ధ ఏవ ధ్రువం భద్రే! నా స్యో త్పత్తి రిహే ష్యతే

అశరీరో పి తే భద్రే కార్యం సర్వం కరిష్యతి

యదా తు విష్ణు ర్భగవా న్వసుదేవసుతః శుభే

తదా తస్య సుతో య శ్చ పతి స్తే సంభవిష్యతి

ఉమామహేశ్వరులు:

కల్యాణీ! శరీరము లేకయు నీ భర్త పూర్వ మట్లు సర్వకార్య సమర్ధుం డగును. విష్ణువు కృష్ణావతార మెత్తినపు డాతనికి కుమారుడై నీ పతి జనింప గలడు అని వర మిచ్చిరి.

బ్రహ్మ:

తతః సా తు వరం లబ్ధ్వా కామపత్నీ శుభాననా

జగా మేష్టం తదా దేశం ప్రీతియుక్తా గతక్లమా

దగ్ధ్వా కామం తతో విప్రాః స తు దేవో వృషధ్వజః

రేమే తత్రో మయా సార్ధం ప్రహృష్ట స్తు హిమాచలే

కందరేషు చ రమ్యేషు పద్మినీషు గుహాసు చ

ని ర్ఝరేషు చ రమ్యేషు కర్ణికారవనేషు చ

నదీ తీరేషు కాంతేషు కిన్నరా చరితేషు చ

శృంగేషు శైలరాజస్య తటాకేషు సరస్సు చ

వనరాజిషు రమ్యాసు నానాపక్షిరుతేషు చ

తీర్ధేషు పుణ్యతోయేషు మునీనా మాశ్రమేషు చ

ఏతేషు పుణ్యేషు మనోహరేషు దేశేషు విద్యాధర భూషితేషు

గంధర్వ యక్షామరసేవితేషు రేమే స దేవ్యా సహిత స్త్రినేత్రః

దేవై స్సహేం‌ద్రై ర్ముని యక్షసిధ్ధై ర్గంధర్వ విద్యాధర దైత్యముఖ్యైః

అన్యై శ్చ సర్వై ర్వివిధై ర్వృతో సౌ తస్మి న్నగే హర్ష మవాప శంభుః

నృత్యంతి తత్రా ప్సరస స్సురేశా గాయంతి గంధర్వగణాః ప్రహృష్టాః

దివ్యాని వాద్యా న్యథ వాదయంతి కేచిద్ద్రుతం దేవవరం స్తువంతి

ఏవం స దేవః స్వగణై రుపేతో మహాబలై శ్శక్రయమాగ్నితుల్యైః

దేవ్యాః ప్రియార్థం భగనేత్రహంతా గిరిం న తత్యాజ తదా మహాత్మా

దేవ్యా సమం తు భగవాం స్తిష్టం స్తత్ర స కామహా

అకరోత్కిం మహాదేవ ఏతదిచ్ఛామ వేదితుమ్‌

బ్రహ్మ:

అచట నప్సరస లాడిరి గంధర్వులు పాడిరి. కొందరు దివ్య వాద్యములను వాయించిరి. కొందరు స్తుతించిరి. ఇంద్రయ మాగ్ని తుల్యులగు ప్రమథ గణములతో నిట్లు శివుడు కూడి విహరించుచు దేవికి బ్రియమ్ము గూర్ప నాగిరిని విడువ డయ్యెను. ఆ మీద దేవేశుండేమి కావించెనని ఋషు లడుగ.

బ్రహ్మ:

భగవా న్హిమవచ్ఛృంగే స హి దేవ్యాః ప్రియేచ్ఛయా

గణేశై ర్వివిధాకారైః హాసం సంజనయ న్ముహుః

దేవీం బాలేందుతిలకో రమయం శ్చ రరామ చ

మహానుభావైః సర్వజ్ఞైః కామరూపధరై శ్శుభైః

అథ దేవ్యాససాదై కా మాతరం పరమేశ్వరీ

ఆసీనాం కాంచనే శుభ్ర ఆసనే పరమాద్భుతే

అథ దృష్ట్వా సతీం దేవీ మాగతాం సురరూపిణీమ్‌

ఆసనేన మహార్హేణా సంపాదయ దనిందితామ్‌

ఆసీనాం తా మథో వాచ మేనా హిమవతః ప్రియా

బ్రహ్మ:

భగవంతుడా హిమ గిరి శిఖరంబున దేవికి వినోదము గూర్ప ప్రమధ గణములు పలు రూపులు దాల్చి యాడునట్లొనర్చి దేవికి బరిహాసము గల్పించెను. అటుపై గిరికన్య యొంటరిగ బంగారు పీఠముపై గూర్చున్న జనని సన్నిధి కేగెను. మేనా దేవియు దేవరూపిణియగు శర్వాణి కాసనమిడి యాదరించి యామె కూరుచున్న తర్వాత నిట్లు పలుకరించెను.

మేన:

చిరస్యాగమనం తే ద్య వద పుత్రి! శుభేక్షణే

దరిద్రాక్రీడనై స్త్వం హిభర్త్రా క్రీడసి సంగతా

యే దరిద్రా భవంతి స్మ తథైవ చ నిరాశ్రయాః

ఉమే త ఏవం క్రీడంతి యథా తవ పతి శ్శుభే

మేన:

 కుమారీ! చిర కాలమునకు నీవు వచ్చితివి. ఆట వస్తువుల లేమికి గురియై భర్తతో నాడుకొను చున్నావు. ఎవ్వరు లేనివారు దిక్కు లేనివారో వారీ విధముగ నీ మగని వలె వినోదింతురు.

బ్రహ్మ:

సై వ ముక్తా థ మాత్రా తు నాతిహృష్టమనా భవత్‌

మహత్యా క్షమయా యుక్తా న కించి త్తా మువాచ హ

విసృష్టా చ తదా మాత్రా గత్వా దేవ మువాచ హ

బ్రహ్మ:

అని తల్లి పలుక విని పార్వతి యంతరంగ మందంతట సంతోష పడలేక పోయెను. మిక్కిలి యోర్మితో గూడి యామె కించుకయు బదులీయ దయ్యెను. మరియు దల్లిచే విడువ బడి యేగి మహా దేవుని కిట్లనియె.

పార్వతి:

భగవ న్దేవ దేవేశ! నే హ వత్స్యామి భూధరే

అన్యం కురు మమావాసం భువనేషు మహాద్యుతే

పార్వతి:

స్వామి! దేవ దేవేశ్వర! ఈ పర్వత మందు వసింపను. ఓ తేజోనిధీ! ఈ భువనములంటెందేని నాకు వేఱొక నివాస మేర్పరుపుము.

శివ:

సదా త్వ ముచ్యమానా వై మయా వాసార్ధ మీశ్వరి!

అన్యం న రోచితపతీ వాసం వై దేవి! కర్హిచిత్‌

ఇదానీం స్వయ మేవ త్వం వాస మన్యత్రశోభనే

కస్మా న్మృగయసే దేవి త న్మే వద శుచిస్మితే

శివ:

అన విని దేవి! నివాసార్ధమై నే నెల్లపుడు చెప్పు చున్నను వేఱొక నివాస మున కెన్నడు నిష్ట పడ వైతివి. ఇప్పుడు నీ యంతట నీవే ఓ కళ్యాణి! వేఱొక నివాసము నెందులకు వెదకెదవో? నాకది తెలువు మన దేవి యిట్లనియె.

పార్వతి:

గృహం గతా స్మి దేవేశ! పితు రద్య మహాత్మనః

దృష్ట్వా చ తత్ర మే మాతా విజనే లోకభావనే

ఆసనాదిభి రభ్యర్చ్య సా మా మేవ మభాషత

“ఉమే! తవ సదా భర్తా దరిద్రః క్రీడనై శ్శుభే

క్రీడతే న హి దేవానాం క్రీడా భవతి తాదృశీ”

య త్కిల త్వం మహాదేవగణై శ్చ వివిధై స్తథా

రమసే తదనిష్టం హి మమ మాతు ర్వృధ్వజ!

పార్వతి:

మహానుభావుడు మా తండ్రి యింటి కిప్పుడే నేను వెళితిని. మాయమ్మ యచ్చట నన్నుగని యేకాంతమున నాకా సనాదులిడి యాదరించి యిట్లనియె. ఉమా! నీ మగడు దరిద్రుడు. నిరంతరము నాట వస్తువులతో (బొమ్మలతో) నాడు కొనును. దేవతల కటువంటి యాట కూడ దనెను. మహాదేవ! నీవు ప్రమథ గణములతో పలు రకములగు భూత ప్రేత పిశాచములతో వినోదింతువు. వృషభ వాహన! అది మాయమ్మ కిష్టము గాదనియె.

బ్రహ్మ:

తతో దేవః ప్రహస్యా హ దేవీం హాసయితుం ప్రభుః

బ్రహ్మ:

ఈశ్వరుడది విని యాదేవిని పరిహసింప జేయుట కిట్లనియె.

శివుడు:

ఏవ మేవ న సందేహః కస్మా న్మన్యు రభూ త్తవ

కృత్తివాసా హ్య వాసా శ్చ శ్మశాననిలయ శ్చ హ

అనికేతో హ్యరణ్యేషు పర్వతానావ గుహాసు చ

విచరామి గణై ర్నగ్నై ర్వృతోంభోజవిలోచనే

మా క్రుధో దేవి మాత్రే త్వం తథ్యం మాతా వద త్తవ

న హి మాతృసమో బంధు ర్జంతూనా మస్తి భూతలే

న మే స్తి బంధుభిః కించి త్కృత్యం సురవరేశ్వర

తథా కురు! మహాదేవ! యథా హం సుఖ మాప్నుయామ్‌

శివుడు:

ఇంతీ! మీయమ్మ యన్నది సత్యము. నీకేల కోపము? నేనిదిగో కృత్తి వాసుడను. నిర్వాసుడను. శ్మశాన వాసిని. నిలువ నీడ లేని వాడను. అడవులలో కొండలలో గుహలలో దిగంబరుల గుంపులతో దిరుగుదును. మీయమ్మ యెడ గినియకుము. తల్లికి సాటి యగు చుట్టము మఱిలేదు. అని హరుడన నా యిల్లాలు నాకు బంధువులతో బనిలేదు. నేను సుఖ పడు మార్గ మేదైన చేయ మనియె.

బ్రహ్మ:

శ్రుత్వా స దేవ్యా వచనం సురేశ స్తస్యాః ప్రియార్థే స్వగిరం విహాయ

 జగామ మేరుం సురసిద్ధసేవితం భార్యాసహాయః స్వగణై శ్చ యుక్తః

బ్రహ్మ:

పరమేశ్వరుడు ప్రియురాలి ప్రీతి కొఱకామెతో కైలాసము నుండి ప్రమథ గణ పరివారముతో సురసిద్ద సేవితమగు మేరువున కేగెను.