బ్రహ్మ మహా పురాణము
35 - పార్వతీ తపో వర్ణనమ్
బ్రహ్మ:
తత స్తా మబ్రువన్ దేవా స్తదా గత్వా తు సుందరీమ్
దేవి! శీఘ్రేణ కాలేన ధూర్జటి ర్నీలలోహితః
స భర్తా తవ దేవేశో భవితా మా తపః కృథాః
తతః ప్రదక్షిణీ కృత్య దేవా విప్రా గిరేః సుతామ్
జగ్ము శ్చాదర్శనం తస్యాః సా చాపి విరరామ హ
సా దేవీ సూక్త మిత్యేవ ముక్త్వా స్వస్యాశ్రమే శుభే
ద్వాః జాత మశోకంచ సముపాశ్రిత్య చాస్థితా
అధా గా చ్చంద్రతిలక స్త్రిదశార్తిహరో హరః
వికృతం రూప మాస్థాయ హ్రస్వబాహుక ఏవచ
విభగ్ననాసికో భూత్వా కుంబజం కేశాంతపింగలః
ఉవాచ వికృతాస్యశ్చ “దేవి త్వాం వరయా మ్యహమ్”
అథోమా యోగసంసిద్ధా జ్ఞాత్వా శంకర మాగతమ్
అంతర్భావవిశుద్ధాత్మా కృపానుష్ఠానలిప్సయా
తమువా చార్ఘ్యపాద్యాభ్యాం మధుపర్కేణ చైవ హ
సంపూజ్య సుమనోభి స్తం బ్రాహ్మణం బ్రాహ్మణప్రియా
బ్రహ్మ:
అఖిల దేవతా మండలి యా జగజ్జనని కడకేగి, ఓదేవీ! తపము వలదు. శీఘ్ర కాలములో నా నీలకంఠు డేతెంచి నీకు భర్త కాగలడు. అని నచ్చజెప్పి ప్రదక్షిణము చేసి వెళ్ళిపోయిరి. ఆమె తపస్సు విరమించెను. తన పర్ణశాల గుమ్మమున నున్న యశోకము క్రింద నామె వసించెను. అంతట నిందు తిలకుడు సురార్తిహరుడునగు హరుడు వికృత రూపియై పొట్టి చేతులు, సొట్ట ముక్కు, రాగి జడలు, వికృత ముఖము, మఱిగుజ్జు నైవచ్చి దేవి! నిన్ను నేను వరింతు ననియె. ఉమయు యోగ సిద్ధిచే నాతని శంకరునిగా గ్రహించి విశుద్ధాంతరంగయై ఆర్ఘ్య పాద్యాదులు మధు పర్కములు నొసంగి బ్రాహ్మణా కారమున నున్న స్వామిని బ్రాహ్మణ ప్రియ గావున యధావిధి నర్చించి యిట్లనియె.
పార్వతి:
భగవ న్నస్వతంత్రాహం పితా మే త్వగ్రణీర్గృహే
స ప్రభు ర్మమ దానే వై కన్యాహం ద్విజపుంగవ
గత్వా యాచస్వ పితరం మమ శైలేంద్ర మవ్యయమ్
స చేద్దదాతి మాం విప్ర తుభ్యం తదుచితం మమ
తతః స భగవాన్ దేవ స్తధైవ వికృతః ప్రభుః
ఉవాచ శైలరాజానం సుతాం మే యచ్ఛ శైలరాట్
స తం వికృతరూపేణ జ్ఞాత్వా రుద్ర మథావ్యయమ్
భీతః శాపాచ్చ విమనా ఇదం వచన మబ్రవీత్
పార్వతి:
“స్వామీ! నేను అస్వతంత్రను. మా తండ్రి శైలాధిపతి యింట నున్నారు. ఆయన కన్యా దానము చేయ సమర్థుడు. అతని నర్థింపుము. ఆయన నన్ను నీకిచ్చునేని యది నా కుచితము”. అంత నా విప్రుడు గిరిరాజు కడకేగి “తనకు కన్యా దానము చేయుమని” యర్థించెను. ఆతడీ వికృత రూపని శివునిగా గ్రహించి శాప భీతిచే నిట్లనియె.
శైలరాజు:
“భగవ న్నావమన్యేహం బ్రాహ్మణాన్ భువిదేవతాః
మనీషితం తు యత్ పూర్వం తచ్ఛృణుష్వ మహామతే
స్వయంవరో మే దుహితు ర్భవితా విప్రపూజితః
వరయే ద్యః స్వయం తత్ర స భర్తాస్యా భవిష్యతి”
తచ్ఛ్రుత్వా శైలవచనం భగవాన్ వృషభధ్వజః
దేవ్యా సమీప మాగమ్య ఇద మాహ మహామనాః
దేవి పిత్రా త్వనుజ్ఞాతః స్వయంవర ఇతిశ్రుతిః
తత్ర త్వం వరయిత్రీ యం స తే భర్తా భవేదితి
త దాపృచ్ఛృ గమిష్యామి దుర్లభాం త్వాం వరాననే
రూపవంతం సముత్సృజ్య వృణో ష్యసదృశం కథమ్
శైలరాజు:
భూ దేవులగు విప్రుల నవమానింప బోను, నాయ భిప్రాయము మనవి చేసెద. మా అమ్మాయి స్వయంవరమున నెవ్వని వరించునో యత డామెకు భర్త యగును.” అన వృషభ ధ్వజుడు తిఱిగి వచ్చి “దేవీ! మీ తండ్రి స్వయంవరమున నీవెవ్వని వరింతువు వాని కిచ్చునని వినికిడి. నీవు నీకీడగు రూపవంతుని విడచి తగని వాని నేల వరింతువు.” కాన నాకందవు. నీతో జెప్పి వెళ్లుచున్నా ననెను.
బ్రహ్మ:
తేనోక్తా సా తదా తత్ర భావయంతీ తదీరితమ్
భావంచ రుద్రనిహితం ప్రసాదం మనసస్తథా
సంప్రాప్తో వాచ దేవేశం మా తేభూ ద్బుద్ధి రన్యథా
అహం త్వాం వరయిష్యామి నాద్భుతం తు కథంచన
అథవా తే స్తి సందేహో మయి విప్ర కథంచన
ఇహైవ త్వాం మహాభాగ వరయామి మనోగతమ్ “
గృహీత్వా స్తబకం సా తు హస్తాభ్యాం తత్ర సంస్థితా
స్కంథే శంభోః సమాధాయ దేవీ ప్రాహ వృతోసి మే
తతః స భగవాన్ దేవ స్తథా దేవ్యా వృత స్తథా
ఉవాచ త మశోకం వైవాచా సంజీవయన్నివ
బ్రహ్మ:
అంత నా యుమాదేవి యమ్మాటను భావన చేసి తనపై నాతడిడిన భారమును గ్రహించి దానితో బాటు చూపిన మనః ప్రసన్నతను నాలక్షించి “దేవేశ! నీకు నుఱొక తలంపు వలదు. నేను నిన్ను వరించెద. ఆశ్చర్య మక్కరలేదు. సందేహ మున్నదా? ఇదిగో యిక్కడే నా కోరిక విభుడవగు నిన్ను నేను వరించు చున్నాను. అని పుష్పగుచ్ఛ మొక్కటి రెండు చేతలం గొని శంభుని మూపున నుంచి యాదేవి దేవ దేవుంగని యిప్పుడ వరింప బడితి వనియె. అంతనా శివుడామె కూర్చుండిన యా శోకముంగని దానికి మాటచే ప్రాణము పోయు చున్నాడా యన్న ట్లిట్లనియె.
శివుడు:
యస్మా త్తవ సుపుణ్యేన స్తబకేన వృతో స్మ్యహమ్
తస్మాత్త్వం జరయా త్యక్త స్త్వమరః సంభవిష్యసి
కామరూపీ కామపుష్పః కామదో దయితో మమ
సర్వాభరణ పుష్పాఢ్యః సర్వపుష్ప ఫలోపగః
సర్వాన్నభక్షక శ్చైవ అమృతాస్వాద ఏవచ
సర్వగంధశ్చ దేవానాం భవిష్యసి దృఢప్రియః
నిర్భయః సర్వలోకేషు భవిష్యసి సునిర్వృతః
ఆశ్రమం చేద మత్యర్థం చిత్రకూటేరి విశ్రుతమ్
యో హి యాస్యతి పుణ్యార్థో సోశ్వమేధ మవాప్స్యతి
యస్తు తత్ర మృత శ్చాపి బ్రహ్మలోకం స గచ్ఛతి
యశ్చాత్ర నియమై ర్యుక్తః ప్రాణాన్ సమ్యక్ పరిత్యజేత్
స దేవ్యా స్తపసా యుక్తో మహాగణపతి ర్భవేత్
శివుడు:
“ఓ అశోకమా! నీ పూల గుత్తిచే నేను వరింప బడినాడ గావున నీకు ముదిమి యుండదు. అమర మయ్యెదవు గాక! నీవు సర్వాభరణ కుసుమ ఫలభరితమై కామ రూపివై సర్వ కామప్రదమై, కామ పుష్పమవై సర్వాన్న భక్షకమై అమృతా స్వాదివై సర్వ పరిమళ పూర్ణమై దేవతల కత్యంత ప్రియము కాగలవు. నీ కెందును భయము గల్గదు. నీవు సంపూర్ణ తృప్తుడ వయ్యెదపు. ఈ యశో కాశ్రమము చిత్ర కూటమను ఖ్యాతినంద గలదు. ఇటకు యాత్ర చేసిన వా డశ్వమేధ యాగఫల మందును. ఇచట ప్రాణోత్ర్కమణ మందిన యతడు దేవి యొక్క తపస్సుతో గూడి మహా గణపతి యగును.
బ్రహ్మ:
ఏవ ముక్త్వా తదా దేవ అపృచ్ఛ్వ హిమవత్సుతామ్
ఆంతర్దధే జగత్ స్రష్టా సర్వభూతప ఈశ్వరః
సాపి దేవీ గతే తస్మిన్ భగవ త్యమితాత్మని
తత ఏవోన్ముఖీ భూత్వా శిలాయాం సంబభూవహ
ఉన్ముఖీ సా భవ త్తస్మిన్ మహేశే జగతాంప్రభౌ
నిశేవ చంద్రరహితా న బభౌ విమనా స్తదా
అథ శుశ్రావ శబ్దంచ బాల స్యార్తస్యశైలజా
సరస్యుదకసంపూర్ణే సమీపే చాశ్రమస్యచ
స కృత్వా బాలరూపం తు దేవదేవః స్వయం శివః
క్రీడాహేతో స్సరోమధ్యే గ్రాహగ్రస్తో భవత్తదా
యోగమాయాం సమాస్థాయ ప్రపంచోద్భవకారణమ్
తద్రూపం సరసో మధ్యే కృత్వైవం సమభాషత
బ్రహ్మ:
పై ప్రకారము అశోకమునకు వరమిచ్చి శివుడు గిరి కన్యతో వెళ్ళి వత్తునని చెప్పి యంతర్ధాన మందెను. ఆయన వంకనే మోము నిలిపి యాదేవి యచట నొక శిల యందు చంద్రుడు లేని రాత్రి యట్లు విరహ వ్యధాకుల మనస్కయయి యుండెను. అంతలో శైలకన్య యాశ్రమ సమీపమున నుదక పూర్ణమైన సరస్సు నందు నార్తుడైన యొక్క బాలుని మాట వినెను. శివుడు బాలరూప దాల్చి యా సరోవర మందు క్రీడించుచు మొసలి పట్టు కొన్నట్లు సృష్టి హేతువైన యోగ మాయంబూని నటించి యిట్లనియె.
బాలుని రూపమున వున్న శివుడు:
త్రాతు మాం కశ్చి దిత్యాహ గ్రాహేణ హృతచేతసమ్
ధిక్కష్టం బాల ఏవాహ మప్రాప్తార్థమనోరథః
ప్రయామి విధనం వక్త్రే గ్రాహస్యాస్య దురాత్మనః
శోచామి న స్వకం దేహం గ్రాహగ్రస్తః సుదుఃఖితః
యథా శోచామి పితరం మాతరం చ తపస్వినీమ్
గ్రాహగృహీతం మాం శ్రుత్వా ప్రాప్తం నిధన ముత్సుకౌ
ప్రియపుత్రా వేకపుత్రౌ ప్రాణాన్ నూనం త్యజిష్యతః
అహోబత సుకష్టం వై యోహం బాలోకృతాశ్రమః
అంతర్గ్రాహేణ గ్రస్త స్తు యాస్యామి నిధనం కిల
బాలుని రూపమున వున్న శివుడు:
ఎవడేని నన్ను మొసలి బారినుండి రక్షించుగాక! అయ్యో! మొసలి నోట బడి నాడను. నాకై నా దేహమునకై నే నేడ్వను. కాని నాకై యింట నెదురు చూచు నా తల్లిదండ్రుల గూర్చి చింతించు చున్నాను. వారికి నేనొక్కడనే తనయుడను. నా యందెంతేని ప్రేమ, మక్కువ గొన్న వారు. గావున యీ విషయము విని ప్రాణములం బాసెదరు. ఎంత కష్టము వచ్చినది. బాలుడను. అకృతాశ్రముడను. (ఉపనయన మేని కాని వాడను) ఈ మొసలి వాతబడి మృత్యువాత కెఱయ య్యెదను గదా! అని దుఃఖించెను.
బ్రహ్మ:
శ్రుత్వా దేవీ తు తం నాదం విప్రస్యా ర్తస్య శోభనా
ఉత్థాయ ప్రస్థితా తత్ర యత్ర తిష్ఠ త్యసౌ ద్విజః
సా పశ్య దిందువదనా బాలకం చారురూపిణమ్
గ్రాహస్య ముఖమాపన్నం వేపమాన మవస్థితమ్
సోపి గ్రాహవరః శ్రీమాన్ దృష్ట్వా దేవీ ముపాగతామ్
తం గృహీత్వా ద్రుతం యాతో మధ్యం సరస ఏవ హి
స కృష్యమాణ స్తేజస్వీ నాద మార్తం తదాకరోత్
అథా హ దేవీ దుంఖార్తా బాలం దృష్ట్వా గ్రహావృతమ్
బ్రహ్మ:
బాలకుని మాటలు విని యా కల్యాణి అయ్యిందువదన బయలుదేరి సుందరు డగు నా బాలకుని మొసలి నోటబడి కొట్టుకొను చున్నట్లు చూచెను. ఆ మొసలి యును దేవిని చూచి యా బాలుని నోట గఱుచుకొని సరస్సు లోనికిం బాఱను. బాలకు డాక్రందించు చుండెను. అది చూచి పార్వతి మొసలితో నిట్లనియె.
పార్వతి:
గ్రాహరాజ!మహాసత్వ! బాలకం హ్యేకపుత్రకమ్
విముం చేమం మహాదంష్ట్ర క్షిప్రం భీమపరాక్రమ
పార్వతి:
ఓ గ్రాహరాజ! మహా పరాక్రమా! ఈ బాలకుని త్వరగ విడిచి పెట్టుము. ఈతడు తల్లిదండ్రులకు నేకైక పుత్రుడు
మొసలి:
యో దేవి! దివసే షష్ఠే ప్రథమం సముపైతి మామ్
స ఆహారో మమ పురా విహితో లోకకర్తృభిః
సోయం మమ మహాభాగే షష్ఠేహని గిరీంద్రజే!
బ్రహ్మణా ప్రేరితో నూనం నైనం మోక్ష్యే కథంచన
మొసలి:
దేవి! ఆఱవ రోజున ముందుగా నీ సరస్సున కేతెంచు నతడు నీకా హారమగు నని నాకు బ్రహ్మ యేర్పాటు చేసెను. నేడీతడు లభించెను. బ్రహ్మ ప్రేరణమిది. వీనినేమైన వదల ననియె. అంత వారి కిరువురకు నిట్లు సంవాద మయ్యెను.
దేవి:
య న్మయా హిమవచ్ఛృంగే చరితం తప ఉత్తమమ్
తేన బాల మిమం ముంచ గ్రాహరాజ నమోస్తుతే
దేవి:
ఓ మకర రాజమా! హిమగిరి శిఖర మందు నేను జేసిన ఉత్తమ తపస్సు ఫలము నీవు తీసికొని ప్రతి ఫలముగ నీ బాలుని విడిచి పెట్టుము. నీకు నమస్కారము.
మొసలి:
మా వ్యయ స్తపసో దేవి భృశం బాలే శుభాననే
య ద్ర్బవీమి కురు శ్రేష్ఠే తథా మోక్ష మవాప్స్యతి
మొసలి:
ఓ దేవీ! తపము వ్యయ పరచకుము. నే చెప్పినట్లు చేయుము. అట్లైన నితడు ముక్తుడగును.
దేవి:
గ్రాహాధిప! వద స్వాశు యత్ సతా మవిగర్హితమ్
తత్కృతం నాత్ర సందేహో యతో మే బ్రాహ్మణాః ప్రియాః
దేవి:
హే గ్రాహాధిప! సత్పురుషులు నిందింపని యే పనియైన చెప్పుము. తప్పక చేసెదను. సందేహము లేదు. బ్రాహ్మణులు నాకు మిక్కిలి యిష్టులు.
మొసలి:
యత్కృతం వై తపఃకించి ద్భవత్యా పుణ్య ముత్తమమ్
తత్సర్వం మే ప్రయచ్ఛాశు తతో మోక్ష మవాప్స్యతి
మొసలి:
ఓ దేవి! నీవు చేసిన తపము స్వల్ప మైనను నుత్తమ మైనది. ఆ తపము సర్వమును నాకిమ్ము. అట్లైన నీ బాలుడు ముక్తుడగును.
దేవి:
జన్మప్రభృతి య త్పుణ్యం మహాగ్రాహ కృతం మయా
త త్తే సర్వం మయా దత్తం బాలం ముంచ మహాగ్రహ
దేవి:
ఓ మహాగ్రాహమా! మంచిది. ఆజన్మము నేచేసిన పుణ్యమేది గలదో యది సర్వము నీ కొసగు చున్నాను. బాలుని విడువుము.
బ్రహ్మ:
ప్రజజ్వాల తతో గ్రాహ స్తపసా తేన భూషితః
ఆదిత్య ఇవ మధ్యాహ్నే దుర్నిరీక్ష స్తదా భవత్
ఉవాచ చైవం తుష్టాత్మా దేవీం లోకస్య ధారిణీమ్
బ్రహ్మ:
ఇట్లన్యోన్య భాషణములు జరిపిన వెంటనే మొసలి యాదేవి తపస్సు సర్వము స్వీకరించి మధ్యందిన భానుని వలె వెలుగొందెను. మరియు లోకోద్ధారిణి యగు దేవిం గని సంతుష్టాంతరంగుడయి యిట్లు పల్కెను.
మొసలి:
దేవి! కిం కృత్య మేత త్తే సునిశ్చిత్య మహావ్రతే
తపసో ప్యర్జనం దుఃఖం తస్య త్యాగో న శస్యతే
గృహాణ తప ఏవ త్వం బాలం చేమం సుమధ్యమే
తుష్టోస్మి తే విప్రభక్త్యా వరం తస్మా ద్దదామి తే
సా త్వేవ ముక్తా గ్రాహేణ ఉవా చేదం మహావ్రతా
మొసలి:
దేవీ! తపస్సు సంపాదించుట కష్టము దానిని త్యజించుట ప్రశస్తము గాదు. కావున తపస్సును, నీ బాలుని కూడా నీవే స్వీకరింపుము. నీ బ్రాహ్మణ భక్తికి మెచ్చితి నని మకరము పలుక మహావ్రత ధారిణి యగు నామె యిట్లనియె.
దేవి:
దేహేనాపి మయా గ్రాహ రక్ష్యో విప్రః ప్రయత్నతః
తపః పున ర్మయా ప్రాప్యం న ప్రాప్యో బ్రాహ్మణః పునః
సునిశ్చిత్య మయా గ్రాహ కృతం బాలస్య మోక్షణమ్
న విప్రేభ్య స్తపః శ్రేష్ఠం శ్రేష్ఠా మే బ్రాహ్మణా మతాః
దత్వా చాహం న గృహ్ణామి గ్రాహేంద్ర విహితం హి తే
నహి కశ్చిన్నరో గ్రాహ ప్రదత్తం పునరాహరేత్
దత్త మేత న్మయా తుభ్యం నాదదాని హి తత్ పునః
త్వ య్యేవ రమతా మేత ద్బాల శ్చాయం విముచ్యతామ్
దేవి:
దేహముతో నైనను విప్రుడు నాకు రక్షణీయుడు. తపస్సు మరల సాధించ గలను గాని బ్రాహ్మణుడు సాధ్యుడు కాడు గదా! విప్రుల కంటె తపస్సు గొప్పది కాదు. నేనిచ్చినది మరల స్వీకరింపను. ఇది నీకివ్వ బడినది. ఇచ్చిన దాని నెవ్వడును తిరిగి తీసుకొనడు. తపస్సు నీదె. బాలుని మాత్రము విడిచి పుచ్చు మనియె.
తథోక్త స్తాం ప్రశస్యా థ ముక్త్వా బాలం సమస్యచ
దేవీ మాదిత్యావభాస స్తత్రై వాంత ర ధీయత
బాలోపి సరసస్తీరే ముక్తో గ్రాహేణ వై తదా
స్వప్నలబ్ధ ఇవా ర్థౌఘ స్తత్రై వాంతర ధీయత
తపసోపచయం మత్వా దేవీ హిమగిరీంద్రజా
భూయ ఏవ తపః కర్తు మారేభే నియమస్థితా
కర్తుకామాం తపో భూయో జ్ఞాత్వా తాం శంకరః స్వయమ్
ప్రోవాచ వచనం విప్రా మా కృథా స్తప ఇత్యుత
మహ్య మేత త్తపో దేవి! త్వయా దత్తం మహావ్రతే
తత్తేనై వాక్షయం తుభ్యం భవిష్యతి సహస్రథా
ఇతి లబ్ధ్వా వరం దేవీ తపసోక్షయ ముత్తమమ్
స్వయం వర ముదీక్షంతీ తస్థౌ ప్రీతా ముదా యుతా
ఇదం పఠే ద్యో హి నరః సదైవ బాలానుభావాచరణం హి శంభోః
స దేహభేదం సమవాప్య పూతో భవేద్గణేశ స్తు కుమారతుల్యః
అన విని యమ్మకరము దేవికి నమస్కరించి యాదిత్యుడట్లు వెలుంగుచు నచ్చటనే యంతర్ధాన మయ్యెను. ఆ బాలుడును సరస్తీరమున మొసలిచే విడువ బడి కలలో గన్న వస్తువు వలె నచ్చటనే యంతర్ధాన మయ్యెను. దేవియు తన తపః ఫలము బాలుని నిమిత్తముగా వ్యయ మగుట గని మరల తపస్సు నాచరింప బూనెను. శంకరుడది యెరిగి నీ వింక తపస్సు చేయ వలదు. నీ చేసి నదంతయు నా కర్పించితివి. అది నీ కక్షయము కాగల దనెను. అట్లు వరమును బొంది యా దేవి స్వయంవరము కొఱకు నిరీక్షించు చుండెను. పరమేశ్వరుని యీశిశు లీలను జదివిన వాడు దేహపాతా నంతరము పవిత్రుడై కుమార తుల్యుడై గణా ధీశుడగును.
Summary of chapter 35 of the Brahma Mahā Purana is as follows:
An extensive stotra in praise of Śiva is recited, cataloguing his thousand divine names, cosmic forms, terrific and benign aspects, and universal lordship. The hymn addresses Śiva in his many manifestations — as Mahādeva, Mahākāla, Trilocana, Paśupati, Bhava, Śarva, Ugra, Bhīma, Rudra, and countless others — and extols him as the supreme reality underlying the entire universe.