44 - చతుశ్చత్వారింశోధ్యాయః

హయగ్రీవ ఉవాచ :

ప్రవిశ్య తు ఉపస్థానమనీయ నిజమాసనమ్

 అభ్యుక్ష్య విధివన్మంతైధురూక్షక్రమయోగతం

స్వాత్మానం దేవతామూర్తిం ధ్యాయంస్తత్రావిశేషతః

ప్రాఙ్ముఖో దృఢమాబద్ధ పద్మాసనమనన్యధీః

త్రిఖండామనుబధ్నీయాదుర్వాదీనభివంద్య చ

ద్విరుక్తబాలాబీజాని మధ్యాద్యంగులిషు క్రమాత్

తలయోరపి విన్యస్య కరశుద్ధిపురఃసరమ్

అగ్ని ప్రాకారపర్యంతం కుర్యాత్వా స్రణ మంత్రవిత్

ప్రతిలోమేన పాదాద్యమనులోమేన కాదికమ్

వ్యాపకన్యాసమారోష్య వ్యాపయన్వాగ్భవాదిభిః వ్యక్తి

కారణసూక్ష్మస్థూలశరీరాణి కల్పయేత్ నాభౌ

హృది భృవోర్మధ్యే బాలాబీజాన్యథ న్యసేత్

మాతృకాం మూలపుటితాం న్యసేన్నాభ్యాదిషు క్రమాత్

బాలాబీజాని తాన్యేవ ద్విరావృత్యాథ విన్యసేత్

మధ్యాదీకరశాఖాసు తలయోరపి నాన్యథా

నాభ్యాదావథ విన్యస్య న్యసేదథ పదద్వయే

జానూరుసిగ్గుహ్యమూలనాభిహ్ళాన్మూర్గసు క్రమాత్

నవాసనాని బ్రహ్మాణం విష్ణుం రుద్రం తథేశ్వరమ్

సదాశివం చ పూషాణం తూలికాం చ ప్రకాశకమ్

విద్యాసనం చ విన్యస్య హృదయే దర్శయేత్తతః

పద్మత్రిఖండయోగ్యాభ్యాం ముద్రామోష్ఠపుటేన చ

వాయుమాపూర్య హుహుం హుత్వి తిప్రాణోధ్య

కుండలీమ్  మంత్రశక్త్యా సమున్నీయ ద్వాదశాంతే

శివైకతామ్  భావయిత్వా పునస్తం చ స్వస్థానే వినివేశ్య చ

వాగ్భవాదీని బీజాని మూలహృద్భాహంషు న్యసేత్

సమస్తమూర్థి దోర్మూలమధ్యాగ్రేషు యథాక్రమమ్

హస్తా విన్యస్య చాంగేషు హ్యంగుషాదితలావధి

హృదయాదౌ చ విన్యస్య కుంకుమం న్యాసమాచరేత్

శుద్ధ తృతీయ బీజేన పుటితాం మాతృకొం పునః

ఆద్యభజద్వయం న్యస్య హ్యాంత్యబీజం న్యసేదితి

, పునర్భూతలవిన్యాసమాచరేన్నాతివిస్తరమ

వర్గాష్టకం న్యసేన్మూలే నాథా హృదయకంఠయోఃl

ప్రాగాథాయైషు శషసాన్ మూలహృన్మూర్థసు న్యసేత్

కక్షకట్యంసవామాంసకటిహృత్స చ విన్యసేత్

 ప్రభూతాధః షడంగాని దాదివర్గెస్తు విన్యసేత్

ఋషిస్తు శబ్దబ్రహ్మ స్యాచ్ఛందో భూతలిపిర్మతా

శ్రీమూలప్రకృతిస్త్వస్య దేవతా కథితా మనోః

అక్షసకుస్తకే చోర్డ్వే పుష్పసాయకకార్ముకే

వరాఖీతీకరాభైశ్య ధారయంతీమసూషమామ్

రక్షణాక్షమయీం మాలాం వహంతీ కంఠదేశతః

హారకేయూరకటకచ్ఛన్నవీరవిభూషణామ్

దివ్యాంగరాగసంభిన్నమణికుండలమండితామ్

లిపికల్పదృమస్యాధో రూపిపంకజవాసినీమ్

సాక్షాబ్లిషిమయీం ధ్యాయేదౌరవీం భక్తవత్సలామ్

అనేకకోటిదూతీభిః సమంతాత్సమలంకృతామ్.

ఏవం ధ్యాత్వా న్యసేద్భూయో భూతలే ష్వక్షరాన్ క్రమాత్

మూలాద్యాజ్ఞావసానేషు వర్గాష్టకమదో న్యసేతి

శషసాన్నూ సంన్యస్య స్వరానే ష్వేవ విన్యసేత్

హాదీరూర్ధ్వా దిపంచాస్యేష్వగ్రే మూలే చ మధ్యమే

అంగుళీమూలమణిబంధయోరోష్ణోశ్చ పాదయోః

 జఠరే పార్వయోర్ధక్షవామయోర్నాభిపృష్ఠయోః

శషసాన్ మూలపన్మూర్థ స్వేతా వా లాదికాన్య

సేవ్ హ్రస్వాః పంచాఢ సంధ్యర్థాశ్చత్వారో హయరా వలె

అకౌ ఇగేనగతాదౌ క్రమో యం శిష్టవర్గకే

శషసా ఇతి విఖ్యాతా ద్విచత్వారింశదక్షరాః

ఆద్యః పంచాక్షరో వర్లో ద్వితీయశ్చతురక్షరః11

పంచాక్షరీ తు షడ్వర్గీ త్రివర్లో నవమో మతః

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ధనేశేంద్రయమాః క్రమాత్

వరుణశ్చైవ సోమశ్చ శక్తి త్రయమిమే

నవ వర్ణానామీశ్వరాః ప్రోక్తాః క్రమో భూతలిపేరయమ్

ఏవం సృష్టా పారో విపరీతః సంహృతావమన్యేవ

స్థానాని యోజనీయా విసర్గలిందూ చ వర్ణాంతా

ధ్యానపూర్వం తతః ప్రాణో రత్యాదిన్యాసమాచరేత్

జపాకుసుమసంకాశాః కుంకుమారుణవిగ్రహాః

కామవామాధిరూఢంకా ధ్యేయాః శరధనుర్ధరా

రతిప్రీతియుతః కామః కామిన్యాః కాంతణష్యతే

కాంతిమాన్మోహనీయుక్తకామాంగః కలహప్రియామ్

అన్వేతి కామచాఠీస్తు విలాసిన్యా సమన్వితః

కామః కల్పలతాయుక్తః కాముకః శ్యామవర్ణయా

శుచిస్మితాన్వితః కామో బంధకో విస్తృతాయుతః

రమతో విస్మితాక్ష్యా చ రామోలియం లేలిపోనయా

రమణ్యా రతినాథోపీ దిగ్వసాధ్యో రతిప్రియ

వామయా కుల్దయా యుక్తో రతినాథో ధరాయుతః

రమాకాంతో రమోపాస్యో-రమమాతో నిశాచరః1.

కల్యాణ్ మోహినీనాథో నందకశోత్తమాన్వితః

నందీ సురోత్తమాభ్యో నందనో నందయితా పునఃI

సులావణ్యాన్వితః పంచబాణో బాలనిధీశ్వరః కలహప్రియయా

యుక్త స్తథా రతిసఖః పునః ఏకాక్ష్యా పుష్పధన్వాపి

సుముఖేశో మహాధను నీలీ జటిల్యో భ్రమణః క్రమశః

పాలినీపతి భ్రమమాణః శివాకాంతో భ్రమో

భ్రాంతశ్చ ముగ్ధయా భామకో రమయా ప్రాస్తో భామితో భృంగ ఇష్యతే

థాంతాచారో లోచనయా దీర్ఘజిహ్వికయా పునః

భ్రమావహం సమన్వేతి మోహనస్తు రతిప్రియామ్

మోహకస్తు పలాశోక్ష్యా గృహిణ్యాం మోహ

ఇష్యతే వికటేశో మోహధరో వర్ధనోయం ధరాయుతః

 మదనాథో నూపమస్తు మన్మథో మలయాన్వితః

మాదకో హోదినీయుక్తః సమిచ్ఛన్విశ్వతోముఖీ

నాయకో భంగపూర్వసు గాయకో నందినీయుతః

గణకో నామయా జేయః కాల్యా నర్తక ఇష్యతే.

జ్వేల్లకః కాలకర్ణాధ్యః కందరో మత్త ఇష్యతే

నర్తకః శ్యామలాకాంతో విలాసీ ఝుషయాన్వితః

ఉన్మతాముపసంగమ్య మోదతే కామవర్ధనః

ధ్యానపూర్వం తతః శ్రీకంఠాదివిన్యాసమాచరేత్ సిందూరకాంచనసమోభయభాగమర్ధనారీశ్వరం

గిరిసుతాహరభూపషచిహ్నమ్ పాశద్వయాక్షవలయోష్టదహస్తమేవ

స్మృత్వాన్యసేల్లిపిపదేషు సమిహితార్థమ్

శ్రీకంఠానంతసూక్ష్మాచ త్రిమూర్తీరమరేశ్వరః

ఉర్వీతో భారభూతిశ్చాతిధీశః స్థాణుకో హరః

చండీశో భౌతికః సద్యోజాతశ్చానుగ్రహేశ్వరః

అక్రూరశ్చ మహాసేనః స్యురేతే వరమూర్తయః

తతః క్రోధీశచండీశో పచాతకశివోత్తమౌః

తథైకరుద్రకూరైకనేత్రాః సచతురాత(న)నా?

అజేశః శర్వసోమేశా హరో లాంగలిదారుకౌ

అర్ధనారీశ్వరశ్చోమాకాంతశ్చాపాధ్యదండినౌ

అత్రిర్మీనశ్చ మేషశ్చ రౌహీతశ్చ శిఖీ తథా

ఖడ్గదండద్విదండౌ చ సుమహాకాలవ్యాలినౌTI

భుజంగేశః పినాకీ చ ఖద్దేశశ్చ ఐకస్తథా

శ్వేతో హ్యథశ్చ లకులీ శివః సంవర్తకస్తథా

పూర్ణోదరీ చ విరజా తృతీయా శాల్మలీ తథా:

లోలాక్షీ వర్తులాక్షీ చ దీర్ఘణా తథైవ చll

సుదీర్ఘముఖగోముఖ్యై నవమి దీర్ఘజిహ్వికా

కంజరీ చోర్ధ్వకేశా చ ద్విముఖీ వికృతాననా

సత్యలీలాకలావిద్యాముఖ్యాః స్యుః స్వరశక్తయః

 మహాకాలీ సరస్వత్యౌ సర్వసిద్ధిసమన్వితే

గౌరీ త్రైలోక్య విద్యా చ తథా మంత్రాత్మశక్తికా

లంబోదరీ భూతమతా ద్రావిణీ నాగరీ తథా

ఖేచరీ మంజరీ చైవ రూపిణీ వీరిణీ తథా

కోటరా పూతనా భద్రా కాలీ యోగిన్య ఏవ చ

 శంఖనీ గర్జినీ కాలరాత్రికూఠిన్య ఏవ చ కపర్దినీ

తథా వజ్రా జయా చ సుముఖేశ్వరీ రేవతీ

మాధవీ చైవ వారుణీ వాయవీ తథా రక్షావధారిణీ

చాన్యా తథా చ సహజాహ్వయా

లక్ష్మీళ్ళ వ్యాపినీమాయే సంఖ్యాతా వర్ణశక్తయః

ద్విరుక్త బాలాయా వర్ణి రంగం కృత్వాథ కేవలైః

షోడా న్యాసం ప్రకుర్వీత దేవతాత్మశ్వసిద్ధయే

విఘ్నేశాదీంస్తు తత్రాదౌ విన్యసేద్ద్యానపూర్వకమ్ తరుణారుణసంకాశానజవక్రాంస్త్రిలోచనాన్

పాశాంకుశవరాభీతిహస్తాన్ శక్తిసమన్వితాన్

విఘ్నేశో విఘ్నరాజశ్చ వినాయకశివోత్తమౌ

విఘ్నకృద్విఘ్నహర్తా చ విఘ్నరాద్గణనాయకః

ఏకదంతో ద్విదంతశ్చ గజవక్రో నిరంజనః

కపర్గవాన్ దీర్ఘముఖః శంకుకర్ణో వృషధ్వజ

గణనాథో గజేంద్రస్యః శూర్పకర్ణక్రిలోచనః

లంబోదరో మహానాదశ్చతుర్మూర్తిః సదాశివః

ఆమోద్దుర్మదశ్చైవ సుముఖశ్చ ప్రమోదకః

ఏకపాదో ద్విపాదశ్చ శూరో వీరశ్చ షణ్ముఖ

వరదో నామ దేవశ్చ వక్రతుండో ద్విదంతకః

సేనానీగ్రామణిర్మతో మత్తమూషకవాహనః

జటీ ముండీ తథా ఖఢ్ వరేణ్యో వృషకేతనః

భక్ష్యప్రియో గణేశశ్చ మేఘనాదో గణేశ్వరః

ఏతే గణేశా వర్ణానామేకపంచాశతః క్రమాత్

శ్రీశ్చ ప్రీశ్చైవ పుష్టిశ్చ శాంతిస్తుష్టిః సరస్వతీ

రతీర్మేధా తథా కాంతిః కామినీ మోహినీ

తధా తీవ్ర చ జ్వాలినీ నందా సుయశాః కామరూపిణీ

ఉగ్రా తేజోవతీ సత్యా విఘ్నేశానీ స్వరూపిణీ

 కామార్తా మదజిహ్వా చ వికటా ఘూర్జితాననా

భూతిర్భూమిర్ద్వరమ్యా చామరూపా మకరధ్వజా

వికర్ణభ్రుకుటీ లజ్జా దీరఘాణా ధనుర్ధరీ

తథైవ యామినీ రాత్రిశ్చంద్రకాంతా శశిప్రభా

లోలాక్షీ చపలా ఋజ్వీ దుర్భగా సుభగా శివా

 దుర్గా గుహప్రియా కాలీ కాలజిహ్వా చ శక్తయః1

గ్రహన్యాసం తతః కుర్యాద్ధ్యానపూర్వం సమాహితః

వరదాభయహస్తాభ్యాన్ శక్యాలింగితవిగ్రహాన్

కుంకుమక్షీరరుధిరకుందకాంచనకంబుభిః

అంభోదధూమతిమమిరైః సూర్యాదీన్ సదృశాస్

స్మరేత్. హృదయాధ్ రవిం న్యస్య శీర్షి సోమం దృశోః

కుజము హృది శుక్రం చ హృన్మధ్యే బుధం కండే

బృహస్పతిమ్! నాభై శనైశ్చరం వల్లే రాహు కేతుం పదద్వయే

జ్వలత్కాలానలప్రఖ్యా వరదాభయపాణయ

తారా న్యసేత్తతో ధ్యాయన్ సర్వాభరణభూషితాః

భాలే నయనయోః కర్ణద్వయే. నాసాపుటద్వయే

కంతే సంధద్వయే పశ్చా త్ర్కూర్పయోర్మణిబంధయోః స్తనయోర్నాభికట్యూరజానుజంఘాపదద్వయే

యోగినీవ్యాసమాదధ్యాద్విశుడ్లో హృదయే తథా

నాభై స్వాధిష్ఠితే మూలే భ్రూమధ్యే మూర్థని క్రమాత్

పద్మేందుకర్ణికామధ్యే వర్ణశక్తీర్ధలేషకథ దలాగ్రేషు

తు పద్మస్య మూర్ఖ సర్వాళ్ళ విన్యసేత్ అమృతో

నందినీంద్రాణీ త్వీశానీ చాత్యుమా తథా

ఊర్ధ్వకేశీ ఋద్విదుషీ లకారికా తథైవ

చ ఏకపాదాత్మికైశ్వర్యకారిణీ చొపధాత్మికా

తతోనింబికాథో-రక్షాత్మికేతి షోడశ శక్తయః

కాలికా ఖేచరీ గాయత్రీ ఘంటాధారిణీ తథా

నాదాత్మికా చ చాముండా ఛత్రికా చ జయా తథా

ఝంకారిణీ చ సంజ్ఞా చ టంకహస్తా తతః పరమ్

టంకారిణీ చ విష్ణోయాః శక్తయో ద్వాదశ మాత్

డంకారీ టంకారిణీ చణామినీ తామసీ తథా

 ఢంకారిణీ దయా ధాత్రీ నాదినీ పార్వతీ తథా

ఫట్ కారిణీ చ విజేయాః శక్తయో ద్వయపన్నగాః

వర్ధినీ చ తథా భద్రా మజా చైవ యశస్వినీ

రమా చ లామినీ చేతి షడేతాః శక్తయః క్రమాత్

నారదా శ్రీస్తథా షంధా శశ్వత్య పి చ శక్తయః

చతసోపే తథైవ ద్వే హాకినీ చ క్షమా తథా తతః

పాదే చ లింగే చ కుక్షౌ హృద్రోఃశిరస్సు చ

దక్షాదీవామపాదాంతం రాశీన్మేషాదిన్న్యసేత్

తతః పీఠాని పంచాశదేకం చక్రం మనో

న్యసేత్ వారాణసీకామరూపం నేపాలం పౌండ్రవర్ధనమ్!

వరస్థిరం కాన్యకుణ్ణం పూర్ణశైలం తథార్భుదమ్

 ఆమ్రతకేశ్వరైకామం త్రిగ్రోతః కామకోష్ఠకమ్ 

 కైలాసం భృగునగరం కేదారం చంద్రపుష్కరమ్.

శ్రీపీఠం చేకవీరాం చ జాలంధ్రం మాలవం తథా

కులాన్నం దేవికోటం చ గోకర్ణం మారుతేశ్వరమ్

అట్టహాసం చ విరజం రాజవేశ్మమహాపథమ్

కోలాపురకైలాపురకాలేశ్వరజయన్తికాని

ఉజ్జయిన్యపి చిత్రా చ క్షీరకం హస్తినాపురమ్

ఉడీరాం చ ప్రయాగం చ షష్టిమాయాపురం తథా

గౌరీశం సలయం చైవ శ్రీశైలం మరుమేవ చ

పునర్గిరివరం పశ్చాన్మహేంద్రం వామనం గిరీమ్

స్యాద్ధిరణ్యపురం పశ్చాన్మహాలక్ష్మీపురం తథా

పురోద్యానం తథా ఛాయాక్షేత్రమహంర్మనీషిణః

లిపిక్రమసమాయుక్తాంల్లిపిస్థానేషు విన్యసేత్

అనాన్యథోక్తస్థానేషు సంయుక్తాంల్లిపి సంక్రమాత్షోడా

న్యాసో మయా ఖ్యాతః సాక్షాదీశ్వరభాషితః

ఏవం విన్యస్తదేహస్తు దేవతావిగ్రహో భవేత్ తతః

షోడా పురః కృత్వా శ్రీచక్రన్యాసమాచరేత్

అంశాద్యానంద్యమూర్యంతం మంత్రైస్తు వ్యాపకం చరేత్

 చక్రేశ్వరీం చక్రసమర్పణమంత్రాన్ హృదిన్యసేత్

అన్యాన్యభోక్త స్థానేషు గణపత్యాధికాన్ న్యసేత్

దక్షిణేరుసమం వామం సర్వాంశ్చ క్రమశో న్యసేత్

గణేశం క్షేత్రపాలం చ యోగినీం బటుకం తథా

ఆదాబింద్రాదయో న్యస్యాః పాదాంగుష్ఠద్వయాగ్రకే

జాను పార్శ్వాంసమూర్దాస్యపార్వజానుష

 మూర్ధని మూలాధారేణిమాదీనాంసిధీనాం దశకం తతఃII

న్యస్తవ్యమంసదోఃపృష్ఠవక్షస్సు ప్రపదో

సిజి దోర్దేశపృష్ఠయోర్మూర్ధపాదద్వితయయో క్రమాత్

అణిమాచైవ లఘిమా తృతీయా మహిమా తథా

ఈశిత్వం చ వశిత్వం చ ప్రాకామ్యం ప్రాప్తి రేవ చ

ఇచ్చాసిధీ రససిద్ధిర్మోక్షసిద్ధిరితిస్మృతాః

తతో విప్ర న్యసేథీమాన్ మాతృణామష్టకం క్రమాత్

పాదాంగుష్ఠయుగే దక్షపార్వే మూర్ధని వామతః

వామజానౌ దక్షణానౌ దక్షవామాంసంయోస్తథా

బ్రాహ్మీమాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా

వారాహీ చ తంద్రాణీ చాముండా చైవ సప్తమీ

మహాలక్ష్మీశ్చ విజేయా మాతరోవై క్రమాద్బుధై

ముద్రాదేవీర్యసేదష్టావేష్వేవ ద్వే చ తే పునః

మూర్ధాంఖ్యోరపి ముద్రాసు సర్వసంక్షోభిణీ తథా

సర్వవిద్రావిణీ పశ్చాత్సర్వార్ణాకర్షిణీ తథా

సర్వాద్యా వశకరిణీ సర్వాద్యా ప్రియకారిణీ

మహాంకుశీ చసర్వాద్యా సర్వాద్యా ఖేచరీ తథా

శ్రీఖండా సర్వబీజాచ ముద్రా సర్వ ప్రపూరికా

యోనియుద్రేతి విజేయాస్తత్ర చక్రేశ్వరీం న్యసేత్

త్రైలోక్యమోహనం చక్రం సమర్థ్య వ్యాష్య వర్మణిః

తతః కలానాం నిత్యానాం క్రమాత్ షోడశకం న్యసేత్

కామాకర్షణరూపా చ శబ్దాకర్షణరూపిణీకి

అహంకారాకర్షిణీ చ శబ్దాకర్షణరూపిణీ

స్పర్శాకర్షణరూపా చరూపాకర్షణరూపిణీ

రసాకర్షణరూపాచ గంధాకర్షణరూపిణీ

చిత్తాకర్షణరూపా చ ధైర్యాకర్షణరూపిణీ

స్మృత్యాకర్షణరూపా చ హృదాకర్షణరూపిణీ

శ్రద్ధాకర్షణరూపా చ హ్యాత్మాకర్షణరూపిణీ

అమృతాకర్షిణీ ప్రోక్తా శరీరాకర్షిణీ తథా

స్థానాని దక్షిణం శ్రోత్రం పృష్టమంసశ్చ కూర్పరః

దక్షహస్తతలస్యాథ పృష్ఠం తత్సిక జానున్నీ

తజ్ఞంఘాప్రపదే వామప్రపదాదివిలోమతః చక్రేశీం

న్యస్య చక్రం చ సమర్య వ్యాప్య వర్మణి

న్యసేదనంగకుసుమదేవ్యాదీనామథాష్టకమ్

శంఖజత్రూరుజంఘాసు వామే తు ప్రతిలోమత

అనంగకుసుమా పశ్చాద్వీతీయానంగమేఖలా

అనంగమదనా పశ్చాదనంగమదనాతురా

అనంగరేఖా తత్పశ్చాద్వేగాఖ్యానంగపూర్వికా

తతోనంగాంకుశా పశ్చాదనంగాధారమాలినీ

చక్రేశీం న్యస్య చక్రం చ సమర్ప వాప్య

వర్మణి శక్తిదేవీర్యసేత్సర్వసంక్షోభిణ్యాదికా అధ

లలాటగండయోరంసే పాదమూలే చ జానుని

ఉపద్యధశ్చ జంఘాయాం తథా వామే విలోమతః

సర్వసంక్షోభిణీ శక్తి: సర్వవిద్రావిటీ తథా

సర్వాద్యాకర్షిణీ శక్తి: సర్వప్రహ్లాదినీ తథా

సర్వసంమోహినీ శక్తిః సర్వాద్యా స్తంభినీ తథా

సర్వాద్యా జృంభిణీ శక్తిః సర్వాద్యా వశకారిణీ

సర్వాద్యా రంజనీ శక్తిః సర్వాద్యోన్మాదినీ తథా

సర్వార్థసాధినీ శక్తిః సర్వాశాపూరిణీ తథా

సర్వమంత్రమయీ శక్తిః సర్వద్వంద్వక్షయంకర

 చక్రేశీం న్యస్య చక్రం చ సమర్య వ్యాప్య వర్మణి

సర్వసిద్ధిప్రదాదీనాం దశకం చాథ

విన్యసేత్ దక్షనాసాపుటే దంతమూలేదక్షస్తనే తథా

 కూర్పరే మణిబంధే చ న్యసే ద్వామే విలోమతః

సర్వసిద్ధిప్రదా నిత్యం సర్వసంపత్ర్పదా తథా

సర్వప్రియంకరా దేవీ సర్వమంగలకారిడీ

సర్వాఘమోచినీ శక్తిః సర్వదుఃఖవిమోచినీ

సర్వమృత్యుప్రశమినీ సర్వవిఘ్నవినాశినీ

సర్వాంగసుందరీ చైవ సర్వసౌభాగ్యదాయినీ

చక్రేశం న్యస్య చక్రం చ సమర్ప్య వ్యాష్య వర్మణి

సర్వాజ్ఞాద్యాన్న్యసేద్వక్షస్యపి దంతస్థలేష్వథ

సర్వజ్ఞా సర్వశక్తిశ్చ సర్వజ్ఞానప్రదా తథా

సర్వజ్ఞానమయీ దేవీ సర్వవ్యాధివినాశినీ

సర్వాధారస్వరూపా చ సర్వపాపహరా తథా

సర్వానందమయీ దేవీ సర్వరక్షాస్వరూపిణీ

విజేయా దశమీ చైవ సర్వేప్పితఫలప్రదా

చక్రేశీం న్యస్య చక్రం చ సమర్ప్య వ్యాప్య వర్మణి

ప్రాగ్వామాద్యాశ్చ విన్యస్య పక్షిణ్యాద్యాస్తతః సుధీః

దక్షే తు చిబుకే కంతే స్తవే నాభౌ చ పారశ్వయోః

వామా వినోదినీ విద్యా వశీతా కామికీ మతా

కామేశ్వరీ పరా ప్లేయా మోహినీ విమలా తథా

అరుణా జయినీ పశ్చాత్తథా సర్వేశ్వరీ మతా

కౌలినీతి సముల్తాని తానెం నామాని సూరిభిః

చక్రేశ్వరీం న్యసేచ్చక్రం సమర్ప్య వ్యాష్య వర్మణి

హృది త్రికోణం సంభావ్య దీక్ష ప్రాగాదితః క్రమాత్

తద్భహిర్విస్యసేద్దీమానాయుధానాం చతుష్టయమః

న్యసేదగ్న్యాదికోణేషు మధ్యే పీఠచతుష్టయమ్

మధ్యవృత్తం న్యసిత్వా చ నిత్యాషోడశకం న్యసేత్'

కామేశ్వరీ తథా నీత్యా నీత్యా చ భగమాలినీ

నిత్యక్లిన్నా తథా నిత్యా నిత్యా భేరుందినీ మతా

వహ్నివాసినికా నిత్యా మహావజ్రేశ్వరీ తథా

నిత్యా చ దూతీ నిత్యా చ త్వరితా తు తతః

పరమ్ కులసుందరకా నిత్యా కుల్యా నిత్యా తతః పరమ్

నిత్యానీలపతాకా చ నిత్యా తు విజయా పరా

తతస్తు మంగలా చైవ నిత్యపుర్వా ప్రచక్ష్యతే

ప్రభామాలినికా నిత్యా చిత్రా నిత్యా తథైవ చ

ప్రభామాలినీకా నిత్యా చిత్రా నిత్యా తథైవ

చ ఏతాఫ్రికోణాంతరేణ పాదతో హృది విన్యసేత్

నిత్యా ప్రమోదినీ చైవ నీత్యా త్రిపురసుందరీ

తన్మధ్యే విద్యసేద్దేవీమఖండజగదాత్మికామ్

చక్రేశ్వరీం హృదిన్యస్య కృత్వా చక్రసముద్ధృతమ్

ప్రదర్య ముద్రాం యోన్యాభ్యాం సర్వానందమనుం జపేత్

ఇత్యాత్మనసు చక్రస్య చక్రదేవీ భవిష్యతి

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే

చతుశ్చత్వారింశోధ్యాయః 44

సమాప్తం లలితోపాఖ్యానమ్

శ్రీ మత్ర్పతాపగడపత్తనమధ్యవర్తిత్రీరామపూర్వకగధాభిధవాసినేదమ్

సంశోధితం నిఖిలమాన్యపురాణకం యద్ బ్రహ్మాండసంజైమిహ తద్విదుషాం ముదే స్తు

రఘునాథేనేదం యత్క్వచిదస్తీహాప్యసంశుద్ధమ్

సంశోధితమపి దయయా తత్క్షంతవ్యం హ్యశేషేణ

 ఓం నమోభగవతే వాసుదేవాయః రామాయనమః

సమాప్తమిదం బ్రహ్మాండమహాపురాణమ్

హయగ్రీవుడనేను : జపస్థానమున బ్రవేశించి, తనయాసనమును దెచ్చి, మంత్రములతో శాస్త్రీయముగా అభ్యుక్షణమును జేసి, గురువు చెప్పిన క్రమయోగమును బట్టి-1. స్వాత్మగా దేవతామూర్తిని ధ్యానముజేయవలె. (తనకు దేవతామూర్తికిని భేదములేని విధముగా ధ్యానింపవలె). అప్పుడు ప్రాజ్ముఖుడై (తూరుపుమొగమై యుండవలె. పద్మాసనమున గూర్చుండవలే, అన్యబుద్ధిరానీక ఏకాగ్రబుద్ధీయే యుండవలె-2. శ్రీఖండముద్రను జూపవలె, గురువు మొదలగువారినభినందింపవలె రెండుమారులు పలికిన బౌలామంత్రబీజాక్షరములను నడిమి వేలివరుసలో -3. రెండు చేతుల వేళ్లపై కరన్యాసముగానుంచి కరశుద్ధిపూర్వకముగా ఆర్నీ ప్రాకారము వఱకు మంత్రవేత్త  స్వాస్త్రముతో జేయవలె-4. ప్రతి లోమముతో పాదాద్యమును, అనులోమముతో కోరికమును జేయవలె. పోగవాదులతో వ్యాపకన్యాసమునారోపించి వ్యాపించి జేయుచు-5. వ్యక్తములతో కారణ-సూక్ష్మ-స్థూల శరీరములను కల్పింపవలె. తరువాత, నాభియందు, హృదయమందు, భ్రూమధ్యయందును బాలా బీజములనుంచవలె-6, మూలముతో సంపుటీకృతమైన మాతృకను నాభ్యాదులలో క్రమముగా నుంచవలె. ఆబాలా బీజములనే రెండు మారులావర్తించి యుంచవలె.(7) మధ్యమము మొదలగు వ్రేళ్లయందు రెండేసి తలములపైనుంచవలె తరువాత నాభి మొదలగువాని యందును. తఱువాత రెండు పాదములందును ఉంచవలె-8. మోకాళ్లయందు, తొడలయందు, పిరుదలందు, స్త్రీపురుషావయములందు, మూలాధారము(గుదము)నందు, బొడ్డునందు, హృదయమునందు, శిరస్సునందు క్రొత్త యాసనములను కల్పించి వరుసగా బ్రహ్మను, విష్ణువును, రుద్రుని, ఈశ్వరుని సదాశివుని, సూర్యుని, తూలికను, ప్రకాశకమును, విద్యాసనమునుంచి తరువాత హృదయమున పద్మ త్రిఖండ-యోనులను ముద్రలను దర్శింపవలెను-10. ఓష్ణపుటముతో (పెదవులతో) వాయువును నింపవలె. “హుం హుం హుత్” అని కుండలినిని మేలుకొలుపవలె-11. మంత్రశక్తితో దానిని పైకి రప్పించవలె. ద్వాదశాంతమున శివైకత్వమును భవించ వలె. మరల నాకుండలినిని న్యస్థానమున  బ్రవేశింప జేయవలె-12. వాగ్భవబీజములను మూలాధార-హృదయ -బాహువులందుంచవలె, రెండు చేతులను వ్రేళ్ల పైభాగము వరకు, మొత్తము శిరమునందు బాహువుల యొక్క మూల-మధ్య అగ్రములైన యవయవములందును ఉంచవలె, హృదయాదులందు గూడనుంచీ కుంకుమన్యాసముజేయవలె-14, పవిత్రమైన మాతృకను తృతీయ బీజముతో సంపుటితముగా జేయవలె. మొదట రెండు బీజములనుంచి తరువాత అంత్యబీజమునుంచవలె-15. తరువాత కొద్దీ వీస్తరముగా భూతలవిన్యాసము జేయవలె.. మూలాధారమున, నాభియందు, హృదయమున, కంఠమునను వర్గాష్టకమునుంచవలె-16. ముందు ఈ మూలాధార-హృదయ-శిరస్సులందు. శషసలనుంచవలె. తరువాత, చంకలు, నడుము, భుజములు, ఎడమ భుజము, నడుము, హృదయము-వీనియందుంచవలె-17. ప్రభూతములైన (పెద్దవియైన) క్రిందీ యాంగములందు దాదివర్గములనుంచవలె. ఋషి శబ్దబ్రహ్మ భూతలిపి ఛందము-18. ఈ మంత్రమునకు శ్రీమూలప్రకృతీ దేవత ఎత్తైన అక్షమాల-పుస్తకములు పుష్పబాణములు విల్లును-19, వరము అభయమును చేతులలోధరించినది, సాటిలేనిది, రక్షణకోఆంకైన అక్షమాలను కంఠదేశమున ధరించినది-20. కంఠహారములు, భుజభూషణములు, కంకణములు, మీనిచే గప్పబడిన వీరవీభూషణములు గలది, దీవ్యమైనమైపూతతోను మణికుండలములతోను అలంకరింపబడినది-21. “లిపి కల్పద్రుమము” యొక్క క్రింద రూపము దాల్చి యున్నకమలముననున్నది. భక్తవత్సలయైనది. సాక్షాత్తులిసీమయి-ఇట్టి భైరవీనీధ్యానించవలె-22. అనేక కోటిదూతులతోనంతట నలంకరింపబడిన యామెను ఈ విధము ధ్యానించి మరల అక్షరక్రముననుసరించీ భూతలముననుంచవలె-25. తరువాత మూలాధారము మొదలు ఆజ్ఞాచక్రావసానమువరకు వర్గాష్టకము నుంచవలె. శషసలను శిరస్సుననుంచి స్వరముల (అచ్చులను గూడ వీనిలోనే యుంచవలెను-24. హాదులను ఊర్ద్వము మొదలు ఐదు ముఖములందును, అగ్రమున; మూలమున, మధ్యమున, అంగుళీమూలమున, మజీబంధమున, బాహువులందున, పాదములందున-25. జఠరమున, కుడియెడమ, ప్రక్కలందు, నాభియందు, వీపునందును ఉంచవలె, శషసలను లాదీకములను మూలస్థానమున హృదయమున, శిరముననుంచవలెను-26. ఐదుహ్రస్వాచ్చులు (అణఉబలు) సంధ్యచ్చులు నాలుగు (ఏఐఓటి) “హయర'లు 'వల'లు 'అక'లు ఖగ-నగ-ఇది. శిష్టవర్ధకమున క్రమము-27. శషసలు-వీయన్నీయు నలుబడిదిండు అక్షరములు. మొదటిది ఐదక్షరముల వర్గము, రెండవది నాలుగక్షరముల వర్గము-28 పంచాక్షరి షడ్వరి తొమ్మిదవది త్రివర్ణము అనబడినది. బ్రహ్మ విష్ణువు - రుద్రుడు - కుబేరుడు- ఇంద్రుడు - యముడు- వరుణుడు, సోముడు- శక్తిత్రయము- వీరు వరుసగా తొమ్మండుగురు-వర్ణములకీశ్వరులు అనబడిరి. ఇది భూతలిపియొక్క క్రమము-30. ఈ విధముగా సృష్టియందుపాఠము విపరీతము. సంహృతియందు ఇవియే స్థానములు. వర్ణాంతములుగా విసర్గ బిందువులను చేర్పవలెను-31. ధ్యానమునకన్న పూర్వము ప్రాజ్ఞుడు రత్యాదిన్యాసమునాచరింపవలె. తరువాత మందారపు పూవువలెను-కుంకుమవలేను ఎఱ్ఱని యాకారముగలవారును-32. కాముని (కామేశ్వరుని) వామ భాగముననున్న వారు. విల్లమ్ముల ధరించినవారు ధ్యానింపదగినవారు. రతి ప్రీతియుతుడైన కాముడు కామినికి కాంతుడుగా కోరబడును-83. కాంతిమంతుడు, మోహినీయుక్తుడు కామాంగుడు విలాసీనితో గూడినవాడై కలహప్రియురాలినీ కామచారములతోననుసరించును-34, కాముడు కల్పలతతోగూడినవాడు. కాముకుడు: శ్యామవర్ణతో గూడినవాడు. కాముడు శుచిస్మితతో గూడినవాడు. బంధకుడు విస్మస్మితాయుతుడు-35, రమణుడు విస్మీతాక్షితో గూడినవాడు. ఈ రాముడు లేలిపోనతోగూడిన వాడు. రతినాథుడు (కాముడు)రమణితో గూడినవాడు, రతిప్రియుడు (కాముడు) దిగ్వస్తతో (దిగంబరితో) నొప్పినవాడు-56, రతినాథుడు వామన కుంజతో గూడినవాడు. అతడే ధరతోగూడినవాడు. రమాకాంతుడు రమచేనుపాసింపదగినవాడు. ఆమెను రమించుచు నిశాచరుడు. (రాత్రియంతయు రమించువాడు)-37. కల్యాణుడు మోహినీకి నాథుడు. సందకుడు ఉత్తమతోగూడిన వాడు. నంది. సురోత్తమతోనొప్పినవాడు. నందనుడు స్త్రీలనునందింపజేయువాడు-38. మంచి లావణ్యతో గూడినవాడు పంచబాణములుగలవాడు. బాలనిధీశ్వరుడు కలహప్రియతో గూడినవాడు అట్లే రతీయే సఖిగాలవాడు-39, పుష్పధనుడు గూడ ఏకాక్షితో గూడినవాడు. మహాధనుష్కడు  సుముఖకు ఈశుడు. నల్లనివాడు జటలుగలవాడు క్రమముగా భ్రమణుడు వీడు పాలినికీపతి-40. భ్రమించువాడు శివకు కాంతుడు, భీముడు ముగ్గచే భ్రాంతుడు-భామకుడు - రమచేపొందబడినవాడు. వాడు భ్రమితుడై భృంగమనబడును-41. భాంతాచారుడు లోచనతోగూడిన వాడు, భ్రమావహుడు దీర్ఘజిహ్వికతో గూడిన వాడు. మోహనుడు రతిప్రియను అనుసరించును-42- మోహకుడు. పలాశాక్షితోగూడువాడు. అతనికి గృహిణియందే మోహమనబడినది. మోహధరుడు వికటకీశుడు. వర్ధనుడు ధరాయుతుడు-43. అనూపముడు మదకునాథుడు, మన్మథుడు మలయతోగూడినవాడు, మాదకుడు ప్రదీనితోగూడినవాడు. ఈ విధముగా గోరుచు విశ్వతోముఖియగును-44. భృంగపూర్వుడు నాయకుడు గాయకుడు నందినితోగూడినవాడు. గణకుడు సామతోగూడినవాడు. నర్తకుడు. కాలీ(ళి)తో గూడినవాడు. జైల్లకుడు కాలకర్ణితోగూడినవాడు. కందర్పుడు మత్తుడనబడును. నర్తకుడు శ్యామలకు కాంతుడు విలాసవంతుడు రషతోగూడినవాడు -46.కామవర్ధనుడు ఉన్మత్త నుసంగమించి యానందిచును. తరువాత ధ్యానపూర్వకముగా శ్రీకంఠాదిన్యాసమునుజేయవలె-47. సిందూరవర్ణము కాంచనవర్ణము-సమముగాను భయభాగములందును గలవాడును, పార్వతీ పరమేశ్వరులయలంకార చిహ్నములు గలవాడును, రెండుపాశములు, అక్షమాల వరాభయము హస్తములందుగలవాడునునైన యర్థనారీశ్వరుని స్మరించి కోరిన కోరికనే నెరవేరుటకై లిపీస్థానములలోనుంచవలె-48. శ్రీకంఠుడు, అనంతుడు, సూక్ష్ముడు, త్రిమూర్తి, అమరేశ్వరుడు, ఉర్వీశుడు భారభూతి, అతిధీశుడు, స్థాణుకుడు, హరుడు-49. చండీశుడు, భౌతికుడు, సద్యోజాతుడు, అనుగ్రహేశ్వరుడు, అక్రూరుడు, మహాసేనుడు-వీరు వరమూర్తులు-50. అట్లే ఏకరుద్రుడు, కూర్ముడు, ఏకనేత్రుడు, చతురాననుడు-51. అజేశుడు, శర్వుడు, సోమేశుడు, హరుడు, లాంగలి, దారుకుడు, అర్థనారీశ్వరుడు, ఉమాకాంతుడు, పాండ్యుడు, దండి-52. అత్రి, మీనుడు, మేషుడు, రౌహితుడు, శిఖి, ఖడ్లదండుడు ద్విదండుడు, సుమహాకాలుడు, వ్యాళి-53. భుజంగేశుడు పినాకి, ఖడ్గశుడు, బకుడు, శ్వేతుడు, అభ్రుడు, లకులీశుడు, శివుడు, సంవర్తకుడును నరమూర్తులు-54. పూర్ణోదరి, విరజ, మూడవదీశాల్మీలి, లోలాక్షి, వర్తులాక్షి దీర్ఘఘాణ-55. సుదీర్ఘముఖి, గోముఖి, తొమ్మిదవది దీర్ఘజిహ్విక. కుంజరీ, ఊర్ధ్వకేశ, ద్విముఖి, వికృతానన-56. సత్యలీల, కల, వీధ్యమొదలగువారు. సర్వశక్తులు. సర్వసిద్దులతోగూడిన మహాకాళీ-సరస్వతులు-57. గౌరి, త్రైలోక్యవిద్య, మంత్రాత్మశక్తిక, లంబోదరీ, భూతమత, ద్రావీణి, సొగరి-58, ఖేచరి, మంజరీ, రూపిణీ, వీరిణి, కోటర, పూతన, భద్రా, కాళి, యోగిని-59. శంఖిని, గర్జిని, కాలరాత్రి, కూర్గిని, కపర్దిని, వజ్ర, జయ, సముఖేశ్వరి-60.. రేవతీ, మాధవి, వారుణి, వాయవి, రక్షావధారిణి, తక్కిన సహజాహ్వయ-61. లక్ష్మీ, వ్యాపిని, మాయ, వీరందరు వర్ణశక్తులనబడినారు. దేవతాత్మాత్వసిద్దికొకు కేవలము రెండు మారులుచ్చరించిన పోలా మంత్రము యొక్క వర్ణములతో రంగమును జేసి పదునాలుగాన్యాసము జేయవలె. అచట ఓఘ్నశుడు మొదలగు వారిని మొదట ధ్యానపూర్వకముగా విన్యాసము జేయవలె-63. వారు బాలసూర్యకాంతిగలవారు. గజముఖముగలవారు. మూడుకన్నులుగలవారు, పాశము-అంకుశము-వర-అభీతులు, హస్తములందుగలవారు. శక్తిసమన్వితులు-64 విఘ్నేశుడు, విఘ్నరాజు, వినాయకుడు, శ్రీవోత్తముడు, విప్నుకృత్తు, విఘ్నహంత, విఘ్నరాట్టు, గణనాయకుడు -65 ఏకదంతుడు, ద్విదంతుడు, గజవక్రుడు, నిరంజనుడు, కపర్దవంతుడు, దీర్ఘముఖుడు, శంకుకర్ణుడు, వృషధ్వజుడు,-66. గణనాథుడు, గజేంద్రాస్యుడు, శూర్పకర్ణుడు, త్రిలోచనుడు, లంబోదరుడు, మహానాదుడు, చతుర్మూర్తి, సదాశివుడు -67 ఆమోదుడు, దుర్మదుడు, సుముఖుడు, ప్రమాదకుడు, ఏకపాదుడు, ద్విపాదుడు, శూరుడు, వీరుడు, షణ్ముఖుడు, -68 వరదుడు, నామదేవుడు, వక్రతుండుడు, ద్వీదంతకుడు, సేనాని, గ్రామణి, మత్తుడు, మత్తమూషకవాహనుడు -69 జటి, ముండి, ఖద్ధి, వరేణ్యుడు,వృషకేతనుడు. భక్ష్యప్రియుడు, గణేశుడు, మేఘనాదుడు, గణేశ్వరుడు, -76- వీరు వరుసగా ఏబది వర్ణములకు గణేశులు, శ్రీ స్త్రీ, పుష్టి శాంతి, తుష్టియు, సరస్వతి,-71 రతి, మేధ, కాంతి, కామిని, మోహిని, తీవ్ర, జ్వాలినీ, నంద, సుయశ, కామరూపిణి -72 ఉగ్ర, తేజోవతి, సత్య, విఘ్నేశాని, స్వరూపిణి, కామార్త, మదజిహ్వ, వికట, ఘూర్జీతానన, -73 భూతి, భూమి, ద్విరమ్య, అమారూప, మకరధ్వజ, వికర్ణభ్రుకుటి, ఆజ్ఞ, దీర్ఘమౌణీ, ధనుర్ధరీ, -74 యామిని, రాత్రీ, చంద్రకాంత, శశిప్రభ, లోలాక్షి, చపల, ఋజ్వి, దుర్బగ, సుభగ, శివ,-75. దుర్గ, గుహప్రియ, కాలి, కాలజిహ్వ - వీరు శక్తులు, ధ్యానపూర్వకముగా సమాహీతుడై, తరువాత గ్రహన్యాసముజేయవలె-76, వరద -అభయ, చిహ్నములుగల చేతులతో నొప్పినవారు, శక్తిచే ఆలింగింపబడిన విగ్రహముగల వారు, కుంకుమ క్షీరము, రక్తము, మల్లెమొగ్గ, బంగారము, శంఖము వీనితోను, మేఘము-ధూమము- చీకటీ-వీనితోనుపోలిన వారినిగా సూర్యాదులను తొమ్మండుగురిని స్మరింపవలె. హృదయముక్రింద సూర్యునుంచవలె. శిరమున చంద్రునుంచవలె. కన్నులలో కుజునుంచవలె-78. హృదయమున శుక్రుని, హృదయమధ్యమున బుధుని, కంఠమున పృహస్పతిని, నాభియందు శనైశ్చరుని, ముఖమున రాహువును, పదద్వయమున కేతువును ఉంచవలె-75.తరువాత, మండుచున్న కాలాగ్నితో సమానులు, వరద-అభయ చిహ్నములు హస్తములందుగలవారును, సర్వాభరణముల చేనలంకరింపబడినవారునునైన తారలను ధ్యానించుచు న్యసించవలె-80. నుదుట కన్నులలో, చెవులలో, ముక్కురంధ్రములలో, కంఠమున, భుజములపైనను, తరువాత మోచేతులలో, మణికట్టులలోను-81. స్తనములలో,నాభియందును, నడుమునందును, తొడలయందును, మోకాళ్లయందును, పిక్కలయందును, పాదములయందును శుద్దుడైయోగినీ న్యాసముజేయవలె. అట్లే హృదయమున-82, నాభియందు, స్వాధిష్టానమందును మూలాధారమందును, భ్రూమధ్యమున, శిరమున క్రమముగా పద్మ-ఇందుకర్ణికల మధ్యన దళములందు వర్ణశక్తులను, -83.తరువాత దళాగ్రములందు పద్మము యొక్కశిరమున అన్నిశక్తులను వ్యిన్యసిపంపలే అమృత, నందిని, ఇంద్రాణి, ఈశానీ, అత్యుమ-84 ఉర్ధ్వకేశి, ఋద్విదుషి, (అచ్చుకారిక, ఏకపాదాత్మక,ఐశ్వర్యాకారిణీ, ఔషధాత్మిక-85. అంబిక, రక్షాత్మక, అనునవి పదునాలు శక్తులు. కాలిక, ఖేచరి, గాయత్రీ, ఘంటాధారిణి-86. నాదాత్మక, చాముండ, ఛత్రిక, జయ, ఝుంకారిణి, సంజ్ఞ, టంకహస్త, ఓంకారి మీరు క్రమముగా పండ్రెండుగురు శక్తులు. ఢంకారి, టంకారిణి, జామీని, తామసీ, ధంకారిణి, దయ, ధాత్రి, నాదిని, పార్వతి, ఫటికారిణీ, ద్వయ పన్నగశక్తులు(పదుగురు శక్తులు)-89. వర్దిని, భద్ర, మజ్జ, యశస్వినీ, రమ, లామనీ, వరుసగా నీయాఱుగురు శక్తులు-90. . నారద, శ్రీ, షండ, శశ్వతీ- ఇవి ఈ నాలుగు శక్తులు, హాకిని, క్షమ ఇవి రెండు శక్తులు-1, తరువాత పాదమున, భీంగమున, కడుపునందు, హృదయమున, బాహువులందు, శిరమున, కుడినుండి యొడమపాదముచివరి వరకు మేషాదిరాశులను విన్యసింపవలె-92. తరువాత ఏబదీ ఫీఠములు, ఒక చక్రమము-మనస్సు--వీనిని విన్యసింపవలె. వారాణసి, కామరూపము, నేపాలము, పౌండ్రవర్థనము-93. కాన్యకుబ్జము వరస్థిరము, పూర్ణశైలము, అర్బుదము. ఆమ్రతకేశ్వరము ఏకామము, త్రీస్తోతము, కామకోర్ధకము-4 కైలాసము భగునగరము, కేదారము చంద్రపుష్కరము, శ్రీపీఠము, ఏకవీర, జాలంధ్రము, మాలవము-95. కులాన్నము, దేవికోటము, గోకర్ణము, మారుతేశ్వరము, అట్టహాసము, విరజము, రాజవేశ్మము, "మహాపథము-96. కోలాపురము, ఏలాపురము, కాలేశ్వరము, జయంతిక, ఉజ్జయిని, చిత్రీ, క్షీరకము, హస్తినాపురము-97. ఉడీర, ప్రయాగ, షష్టిమాయాపురము, గౌరీశము, సలయము, శ్రీశైలము, మరువు -98. గిరివరము, తరువాత మహేంద్రము, వామనగిరి, హిరణ్యపురము, మహాలక్ష్మీపురము-69. పురోద్యానము, ఛాయాక్షేత్రమునుగూడ విద్వాంసులు చెప్పుదురు. వీనిని లిపిక్రమసమాయుక్తములుగా జేసి లీపిస్థానములలో విన్యసింపవలె-100. తరువాత, లీపీసంక్రమమువల్ల చెప్పిన స్థానములలో తక్కిన వానిని గూడ విన్యసింపవలె. సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పిన షోడాన్యాసము నాచే చెప్పబడినది-101. ఈ విధముగా విశ్వసించిన దేహముగలవాడు దేవతా విగ్రహుడేయగును. తరుపోత ముందు అణు విభాగములు చేసి శ్రీ చక్రన్యాసమునాచరింపవలె-102. అంశాలగాయిత్తు 'ఆనంద్యమూర్తివరకు మంత్రములతో వ్యాపకమును చేయవలె, చక్రేశ్వరుని, చక్రసమర్పణ మంత్రములను హృదయమునన్యసింపవలె-103. తరువాత తక్కినవానిని చెప్పిన స్థానములలో గణపతి మొదలగు వారిని న్యసింపవలె కుడితొడకు సమముగా ఎడమతొడనుంచి అందరి నచట క్రమముగా విన్యసంపవలే -104 గణేశుని క్షేత్రపాలుని, యోగినిని, బటుకుని నుంచవలె, మొదట. నీంద్రాదులను కాలిబొటనవ్రేళ్ల చీవరలలోను-105. మోకాలు ప్రక్కభుజములుశిరము-ముఖము-ప్రక్కమోకాళ్ళు, శిరములు వీనితోను ఉంచవలె. మూలాధారమున పద్యణిమాది సిద్దులనుంచవలె-106. తరువాత (వానినే భుజములు బాహువులు- వీపు- రొమ్ము- పాదాగ్రములు, పిరుదులు, బాహుదేశములు- వెన్ను-శిరము. రెండుపాదములు వీనియందు క్రమముగానుంచవలె-107, అజీమ-లఘిమ- మూడవది మహిమ- ఈశిత్వము- వశిత్వము- ప్రాకామ్యము- ప్రాప్తిఇచ్చాసిద్ది -రససిద్ది- మోక్షసిద్ధి ఇవి పండ్రెండు సిద్ధులనబడినవి-108. తరువాత ఓ బ్రాహ్మణా! అగస్త్యా బుద్ధిమంతుడు ఎనిమిది మాతలను క్రమముగా కాలి బొటన వ్రేళ్లజంటలోను, కుడిప్రక్కన, శిరమున, ఎడమ వైపున;ఎడమ మోకాలిలోను, కుడిమోకాలిలోను, కుడియెడమ భుజములలోను-110. (ఉంచవలె) బ్రాహ్మి-మహేశ్వరి- కౌమారి-వైష్ణవి-వారాహీ ఇంద్రాణీ- ఏడవది చాముండ మహాలక్ష్మి-వీరు క్రమముగా ఏడుగురు మాతలు అని బుధులు దెలియవలె. వీనియందే ఎనమండుగుర ముద్రాదేవతల నుంచవలె, వీనిలోనే అయిరువురినుంచవలె-112. శిరమున పాదమున సర్వసంక్షోభిణీ-సర్వవిద్రావిణి ముద్రలు తరువాత సర్వార్ణాకర్షిణి-113, సర్వాద్యవశకరిణి, సర్వాద్యప్రియకారిణి, సర్వాద్యమహాంకుశి, సర్వాధ్యఖేచరి-114. త్రిఖండ సర్వబీజ, సర్వప్రపూరికాముద్ర యోనిముద్ర అని తెలియవలె, అచట చక్రేశ్వరి నుంచవలె-115, త్రైలోక్యమోహనమైన చక్రమును సమర్పించీ శరీరమున వ్యాపకము జేయవలె. తరువాత వరుసగా పదునాలు నిత్యకళలునుంచవలె-116, కామాకరణరూప, శబ్దాకర్షణరూపిణి, అహంకారాకర్షిణి, శబ్దాకరణరూపిణి-117. స్పర్శాకర్షణరూప రూపాకరణరూపిణి. రసాకర్షణరూప గంధాకర్షణరూపిణి-118 చిత్తాకర్షణరూప ధైర్యాకర్షణ రూపిణీ, స్కృత్యాకర్షణ రూప హృదయాకర్షణరూపిణి-119 శ్రద్దాకర్షణరూప ఆత్మాకర్షణరూపిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణిగా చెప్పబడినది. -120. స్థానములు- ఎడమచెవి, వీపు, భుజము, మోచేయి, కుడిచేతి పైన-వీపు, పిరుదు-మోకాళ్ళు- పీక్కలు-121. పాదాగ్రములు, ఎడపాదాగ్రములు మొదలుకొని విలోమముగ చక్రేశ్వరిని న్యసించి చక్రమునర్చించి శరీరమున వ్యాపనము జేయవలె-122. తరువాత ఎనమండుగురును అనంగకుసుమదేవ్యాదులను నొసలు, మూపుయొక్కసంధులు, తొడలు, పిక్కలు, న్యసింపవలె. ఎడమవైపున ప్రతిలోమముగా న్యసింపవలె-123. అనంగకుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర -124, అనంగరేఖ, వేగయను అనంగపూర్విక, అనంగాంకుశ, అనంగాధారమాలిని-125. చక్రేశ్వరి వీనిని విన్యసించి చక్రమునర్చించి శరీరమున వ్యాపకకర్మచేయవలె. ఆ తరువాత సర్వంక్షోభిణ్యాదులైన శక్తి దేవతలను విన్యసింపవలె. -126 నొసట, చెక్కిళ్లయందు, భుజమునందు, పాదమూలమునందు మోకాలియందు పిక్కపైన క్రిందను, ఎడమవైపున విలోమముగ న్యసింపలె-127. సర్వసంక్షోభిణీ శక్తి, సర్వవిద్రావిడి, సర్వాద్యాకర్షిణీశక్తి, సర్వప్రహ్లాదీని, సంమోహినీశక్తి, సర్వాద్యోస్తంభిని, సర్వాద్యాజృంభిశక్తి, సర్వాద్యావశకారిణి-124 సర్వాద్యారంజనీశక్తి, సర్వాద్యోన్మాదిని, సధినీశక్తి, సర్వాశాపూరిణీ-130. సర్వమంత్రమయీశక్తి, సర్వద్వంద్వక్షయంకర. చక్రేశ్వరిని విన్యసించి చక్రమునర్చించి శరీరమున వ్యాకపము జేయవలె-131. తరువాత సర్వసిద్ధి ప్రదాదుల పదుగురిని విన్యసింపవలె. కుడివైపున ముక్కుపుటమున, దంతమూలమున కుడిస్తనమున-132. మోచేతియందు, మణికట్టునందు, విన్యసింపవలె. ఎడమవైపున విలోమముగానుంచవలె. నిత్యము సర్వసిద్ధిప్రద సర్వసంపత్ర్పద-133. సర్వప్రియంక్వారాదేవి, సర్వమంగళకారిణి, సర్వాఘమోచనీశక్తి, సర్వదుఃఖవిమోచిని-134. సర్వమృత్యుప్రశమిని, సర్వవిఘ్నవినాశిని, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయినీ-135. చక్రేశ్వరిని వీస్యసించి, చక్రము నర్చించి, శరీరమున వ్యాకపము జేయవలె. తరువాత, సర్వాజ్ఞాద్యులను - తొమ్మున, దంత స్థలమున విన్యసింపలే, -136 సర్వజ, సర్వశక్తి, సర్వజ్ఞానప్రద, సర్వజ్ఞానమయీదేవి, సర్వవ్యాధివినాశినీ-137. సర్వాధారస్వరూపక సర్వపాపహర, సర్వానందమయీదేవి, . సర్వరక్షాస్వరూపిణి, పదవది సర్వేప్సిత ఫలప్రద-138. చక్రేశ్వరిని విన్యసించి చక్రము నర్చించి శరీరమున వ్యాపకము చేయవలె, ముందు (తూర్పున) వామాదులను విన్యసించి తరువాత పక్షిణ్యాదుల విన్యసింపలలె. 139 కుడివైపున - గదవయందు, కంఠమున, స్తనమున, నాభియందు, ప్రక్కలందు, పామా, వినోదిని, విద్య, వశిత, కామిక-140 కామేశ్వరి, పరా, మోహిని విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని, అని ఆశక్తులనామములను పండితులు చెప్పిరి. -141. చక్రేశ్వరిని విన్యసింపవలె. చక్రమునర్చించి శరీరమున వ్యాపకమును జేయవలె. హృదయమున త్రికోణమును సంభావించి తూరుపు మొదలగుదిక్కులందు వరుసగా-142. వీన్యసింపవలె. బుద్ధిమంతుడు వానికి వెలుపలగూడ నాలుగాయుధములను ఆగ్నేయది మూలలందు విన్యసీంవలె, మధ్యన నాలుగు పీఠములనుంచవలె-148. మధ్యవృత్తమును న్యసించి నిత్యాషోడశికను న్యసింపవలె. నిత్యాకామేశ్వరి, నిత్యాభగమాలిని-144, నిత్యక్లిన్న, నిత్యాభేరుండినీ నిత్యావహ్నివాసినిక, నిత్యామహావజ్రేశ్వరి-145, నిత్యాదూతీ, నిత్యాత్వరిత, నిత్యాకులసుందరీక, -146. నిత్యానీలపతాక, నిత్యాపరావీజయ, నాత్యామంగల-147. నిత్యాప్రభామాలినిక, నిత్యాచిత్ర-వీరిని త్రికోణాంతరముగా ఏమనుండీ హృదమయమువరకు విన్యపింపవలె-148. నిత్యాప్రమోదిని, నిత్యాత్రిపురసుందరి, హరిమధ్యన అఖండజగదాత్మకమైనదేవిని విన్యసింపవలె-149. చక్రేశ్వరిని హృదయమున విన్యసించి, చక్రమును పైకెత్తబడిన దానినిగా జేసి యోని ముద్రను ప్రదర్శించి, సర్వానందమంత్రమును జపించవలె. -150. ఈ విధముగ ఆత్మచక్రమునకు చక్రదేవి దేవిగాగలదు. -151.

ఇది శ్రీ బ్రహ్మాండమహా పురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున నలుబదీ నాల్గవ అధ్యాయమున లిలితోపాఖ్యానము సమాప్తము.

శ్రీమత్పతాపగడపత్తనమధ్యముననుండు శ్రీరామగథ నివాసియైన రఘునాథునిచే సంశోధింపబడిన యీ నిఖిలమాన్య బ్రహ్మండపురాణము మొత్తము విద్వన్మోదము గూర్చుగాత. రఘునాథునిచే శోధించడినను ఎచటనైనను సంశుద్ధము గానీది ఉన్నచో దయతో ఆ మొత్తమును క్షమింపగోరెద.

ఓం భగవతే వాసుదేవాయ. రామాయ నమః

ఈ బ్రహ్మాండపురాణము సర్వమూ సమాప్తము