బ్రహ్మాండ మహా పురాణము
17 - దండనాథాశ్యామలాసేనాయాత్రా నామ సప్తదశోఽధ్యాయః
దండనాథాది నిర్యాణే సంఖ్యాతీతైః సీతప్రభైః।
ఛత్రైర్గగనమారేజే నిఃసంఖ్యశశిమండితమ్॥
అన్యోన్యసక్తైర్ధవలచ్ఛత్రైరంతరనీభవత్ ।
తిమిరం నునుదే భూయస్తత్కాండమణిరోచిషా॥
వజ్రప్రభాధగధగచ్ఛాయాపూరిదిఙ్ముఖాః।
తాలవృంతాః శతవిధాః క్రోడముఖ్యా బలేఽచలన్॥
చండో దండోదయ స్త్రీవ్రా భైరవాః శూలపాణయః।
జ్వలత్కేతపిశంగాభాస్తడిదాసురదిజ్ముఖాః॥
దహత్య ఇవ దైత్యాఘాంఘీక్ష్ణైర్మార్గణవప్నాభిః।
ప్రచేలుర్దండనాథాయాస్సేనా నాసీరధావితా॥
అథ పోత్రీముఖీదేవీసమాసాకృతిభూషణాః।
తత్సమానాయుధకరాస్తత్సమానస్వవాహనాః॥ తీక్ష్ణదంష్ట్రవినిష్యూతవహ్నిధూమామితాంబరాః।
తమాలశ్యామలాకారాః కపిలాః క్రూరలోచనాః॥
సహస్రమహిషారూఢాః ప్రచేలుః సూకరాననాః।
అథ శ్రీదండనాథా చ కిరిచక్రరథోత్తమాత్॥
అపరుహ్య మహాసింహమారురోహ స్వవాహనమ్।
వజ్రఘోషఇతి ఖ్యాతం ధూతకేసరమండలమ్॥
వ్యక్తాస్త్వం వికటాకారం విశంకటవిలోచనమ్।
దంష్ట్రాకటకటత్కారబధిరీకృతదిక్తటమ్ ॥
ఆదీకూర్శకఠోరాస్థి ఖర్పరప్రతిమైరృఖైః ।
పిబంతమివ భూచక్రమాపాతాలం నిమజ్జభిః॥
యోజనత్రయముత్తుంగం వ్యగాదుద్ధూతవాలధిమ్।
సింహవాహనమారుహ్య వ్యచలద్దండనాయికా॥
తస్యామసురసంహారే ప్రవృత్తాయాం జ్వలత్కృధి।
ఉద్వేగం బహులం ప్రాప త్రైలోక్యం సచరాచరమ్॥
కిమసౌ ధక్ష్యతి రుషా విశ్వమద్యైవ పోత్రిణీ।
కిం వా ముసలఘాతేన భూమిం ద్వేధా కరిష్యతి ॥
అథవా హలనీర్ఘాతైః క్షోభయష్యతి వారిదీన్।
ఇతి త్రస్తహృదః సర్వే గగనే నాకినాం గణాః ॥
దూరాద్ద్రుతం విమానైశ్చ సత్రాసం దదృశుర్గతాః।
వవందిరే చ తా దేవా బద్ధాంజలిపుటాన్వితాః
ముహుర్ద్వాదశనామాని కీర్తయంతో నభస్తలే॥
ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున దండనాథాశ్యామలాసేనా యాత్రయను పదునేడవ యధ్యాయము.
దండనాథ బయలు దేరినప్పుడు లెక్కకు మిక్కుటమైన తెల్లగొడుగులతో లెక్కలేని చంద్రమండలములతో ఆకాశమువలె ప్రకాశించినది-1. ఒండొంటినంటియున్న తెల్లగొడుగులలోపల ఘనీభవించిన చీకటిని ఆ గొడుగుల దండములకు బొదిగిన మణుల కాంతులు తరిమివేయుచున్నవి-2. విసనకట్టలు తనలో పొదిగిన వజ్రముల ధగధగ ప్రభలతో దీట్ముఖములు నిండినవి. అప్పుడు వెంటనే శత విధములైన పందులు మొదలగునవి రంధ్రములలో జొచ్చినవి-3. చండుడు, దండుడు మొదలగువారు, తీవ్ర స్వభావములుగల భైరవులు.శూలములు చేత ధరించి జ్వలించుచున్నకేశముల పిశంగ వర్ణములు గలిగి మెఱుపులవలె దీజ్ముఖములను బ్రకాశింపజేసిరి-4. దండనాథయొక్క సేనాగ్రమున పరువెత్తిన శక్తులు తమ భాణాగులచే రాక్షస సమూహములను గెల్చుచున్నట్లు కదలినవి-5. తరువాత, వరాహముఖమైనదేవి కదలినది. ఆమె వెంటనే ఆమెతో సమానమైన యాకారములు భూషణములు ఆయుధములు, తమ వాహనములు :గలిగి కదిలినవి. వారి కోరలనుండి బయలుదేరిన యగ్నుల ధూమములాకాశము నిండినవి. వారియాకారములు తమాల శ్యామలములు. వారి కన్నులు కపిలములై క్రూరములు, ఈ వారాహీసైన్యము వేయిదున్నల పైనధిరోహించి కదిలినది. తరువాత ఆత్రీదండనాథ కిరిచక్రరథోత్తమమునుండి-8. దిగి తన వాహనమైన మహాసీంహము నధిరోహించెను. దాని పేరు వజ్రమౌషము అని ప్రసిద్ది, అది తన జూలు విదిల్చినది-9. నోరు తెరచినది. ఆకారము వికటమైనది. కన్నులు విశాలములైనవి. కోఅల కటకట ధ్వనులు. దీంగంతములను బధిరముజేసినవి-10. దాని గోళ్లు ఆదివారాహముయొక్క కఠినమైన తలపుళైయెముక వలె కఠినమైనవి. భూమిపై నిలబడి మోపినను భూచక్రమునంతయు త్రాగుచున్నవాయన్నట్లు పాతాళము చివరి వరకు మునిగిపోవుచున్నదీ.-11. మూడుయోజనముల యెత్తుండి తోకను పైకెత్తిన ఆ సింహము .నారోహించి దండనాయిక (రణమునకు) కదలైను-12. మండుచున్న క్రోధముతో ఆయసురసంహారము జరుగగనే సచారచరమైనముల్లోకములు మిక్కిలి యద్వేగమును బొందేసు-13. ఈ పోరాహా (వరాహముఖి) యిపుడే విశ్వమంతయు దహించివేయునా? రోకలిదెబ్బతో భూమినిరెండుగా జేయునా?-14. లేదా నాగలిపోటులచే సముద్రములనన్నింటిని క్షోభింపజేయునా? -అని . ఆకాశమునందలి దేవతల గణములు తమ యేదలలో భీతిజేందిరి-15. దూరముగా విమానములలో బోయిన దేవతలామెను జూచిరి. చేతులు జోడించి మాటి మాటికి ఆమె పండ్రెండు నామములను ఆకాశమున కీర్తించుచు ఆమెకు నమస్కరించిరి-16.
అగస్త్య ఉవాచ :
కాని ద్వాదశ నామాని తస్యా దేవ్యా వద ప్రభో।
అశ్వానన మహాప్రాజ్ఞ యేషు మే కౌతుకం మహత్॥
హయగ్రీవ ఉవాచ :
శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవః।
యదాకర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి ॥
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ॥
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ తథా।
వార్తాలీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేర్వరీ తథా॥
అరీఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే।
నామద్వాదశకాభిఖ్యవజ్రపంజరమధ్యగః।
సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః॥
ఏతైర్నామభిరభ్రస్థాః సంకేతాం బహు తుష్టువుః।
తేషామనుగ్రహర్ధాయ ప్రచచాల చ సా పునః॥
అథ సంకేతయోగిన్యా మంత్రనాథాపదస్పృశః ।
నిర్యాణసూచనకరీ దివి దద్ధ్వాన కాహలీ॥
శృంగారప్రాయభూషాణాం శూర్దూలశ్యామలత్విషామ్।
వీణా సంయతపాణీనాం శక్తీనాం నీర్యయౌ బలమ్॥
కాశ్చిద్గాయంతి నృత్యంతి మత్తకోకిలనిఃస్వనాః।
వీణావేణమృదంగాద్యా సవిలాసపదక్రమాః॥
ప్రచేలుః శక్తయః శ్యామా హర్షయంత్యో జగజ్జనానీ।
మయూరవాహనాః కాశ్చిత్కతిచ్ఛింసవాహనాః॥
కతిచిన్నకులారూఢాః కతిచిత్కోకిలాసనాః।
సర్వాశ్చ శ్యామలాకారాః కాశ్చిత్కర్ణీరథస్థితాః ॥
కాదంబమధుమత్తాశ్చ కాశ్చిదారూఢసైంధవాః।
మంత్రనాథాం పురస్కృత్య సంప్రచేలుః పురః పురః ॥
అథారుహ్య సముత్తుంగధ్వజచక్రం మహారథమ్ ।
బాలార్కవర్ణకవచా మదాలోలవిలోచనా॥
ఈషత్ప్రస్వేదకణికా మనోహరముఖాంబుజా।
ప్రేక్షయంతీ కటాక్షౌఘైః కించిద్రూవల్లిలాండవై॥
సమస్తమపీతలైన్యం శక్తీనాముద్ధతోద్ధతమ్।
పిచ్ఛత్రికోణచ్ఛత్రేణ బిరుదేన మహేయసా॥
ఆసాం మధ్యే న చాన్యాసాం శక్తీనాముజ్జ్వలోదయా।
నిర్జగామఘనశ్యామశ్యామలా మంత్రనాయికా॥
తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః।
తాని షోడనామాని శృణు కుంభసముద్భవ॥
సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా।
మంత్రజీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా।
వీణావతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా।
నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ॥
సదామదా చ నామాని షోడశైతాని కుంభజ।
ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతీ శరీరవాన్॥
తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్టత్యసంశయమ్ ॥
మంత్రినాథా యత్రయత్ర కటాక్షం వికీరత్యసౌ।
తత్ర తత్ర గతాశంకం శత్రుసైన్యం పతత్యలమ్॥
లలితాపరమేశాన్యా రాజ్యచర్యా తు యావతీ।
శక్తీనామపి చర్చా యా సా సర్వత్ర జయప్రదా॥
అథ సంగీతయోగిన్యాః కరస్థాచ్ఛుకపోతకాత్।
నిర్జగామ ధనుర్వేదో వహన్ సజ్జం శరాసనమ్॥
చతుర్బాహయుతో వీరస్త్రిశిరాస్త్రివిలోచనః ।
నమస్కృత్య ప్రధానేశీమిదమాహస భక్తిమాన్ ॥
దేవి భండాసురేంద్రస్య యుద్ధాయ త్వం ప్రవర్తసే।
అతస్తవ మయా సాహ్యం కర్తవ్యం మంత్రినాయికే॥
చిత్రజీవమిమం నామ కోదండం సుమహత్తరమ।
గృహాణ జగతామంబ దానవానాం నిబర్హణమ్॥
ఇమౌ చాక్షయబాణాధ్యౌ తూణీరా స్వర్ణచిత్రితా।
గృహాణ దైత్యనాశాయ మమానుగ్రహహేతవే॥
ఇతి ప్రణమ్య శిరసా ధనుర్వేదేశ భక్తితః।
అర్పితాంశ్చాపతూణీరాఞ్జగ్రాహ ప్రియకప్రియా॥
చిత్రజీవం మహాపాపమాదాయ చ శుకప్రియా।
విస్ఫారం జనయామాస మౌర్వీముద్వాద్య భూరిశః॥
సంగీతయోగీనీ చాపధ్వనినా పూరితం జగతో।
నాకాలయానాం చ మనోనయనానందసంపదా॥
యంత్రిణీ తంత్రిణీ చేతి ద్వే తస్యాః పరిచారికే।
శుకం వీణాం చ సహసా వహంత్యా పరిచేరతు॥
ఆలోలవలయక్వాణవర్దిష్ణుగుణనిస్వనమ్।
ధారయంతీ ఘనశ్యామా చకారాతిమనోహరమ్॥
చిత్రజీవశరాసేన భూషితా గీతయోగినీ ।
కదంబినీవ రురుచే కదంబచ్ఛత్రకార్ముకో॥
కాలీకటాక్షవత్తీక్స్ణో నృత్యద్భుజగభీషణః।
ఉల్లసన్ దక్షిణే పాణౌ విలలాస శిలీముఖః॥
గేయచక్రరథారుణాం తాం పశ్చాచ్చ సిషేవిరే।
తద్వచ్ఛామలశోభాడ్యా దేవ్యో బాణధనుర్ధరాః॥
సహస్రాక్షౌహిణీసంఖ్యాస్తీవ్రవేగా మదాలసాః।
ఆపూరయంత్యః కకుభం కలైః కిలికిలారవైః॥
ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవా గస్త్యసంవాదే లలితోపాఖ్యానే
దండనాథాశ్యామలాసేనాయాత్రానామ సప్తదశోఽధ్యాయః॥
అగస్త్యుడనెను: ఆదేవి యొక్క పండ్రెండు నామములెవ్వి? మాకు మిక్కిలి కుతూహలముగలదు. ఓ ప్రభో! అశ్వముఖ! మహాప్రాజ్ఞ తెలుపుము-17. హయగ్రీవుడనెను. ఓ ఘటోద్భవ! అగస్త్య! అదేవియొక్క పండ్రెండు నామములను వినుము. వానిని వినినంతమాత్రమున ఆదేవి ప్రసన్నురాలగును. పంచమీ, దండనాథ, సంకేత, సమయేశ్వరీ-18. సమయసంకేత, వారాహి, పోత్రిణీ, వార్తాలీ, మహాసేనా, ఆజ్ఞా, చక్రేశ్వరీ-19. అరిఘ్నీ-ఓ మునీ ఇవి పండ్రెండు నామములు నీకు చెప్పితిని. ఈ నామద్వాదశ పంజర మధ్యముననున్న మానవుడు సంకటమునందు గూడ దుఃఖమును బొందడు-20. ఆకాశముననున్న దేవతలు ఈ నామములతో సంకేతను మిక్కలి స్తుతించిరి. వారిననుగ్రహించుటకే యామెకూడ మరల కదిలినది-21. అంత, మంతనాథ పదమును స్పృశించి సంకేతయోగిని యొక్క బయలుదేరుటను (యాత్రను) సూచించు ఢంకమ్రోగెను-22. శృంగారమునీండిన సొమ్ములు గలిగి పూలవంటి కాంతియు శ్యామలవర్ణమును గలిగి, వీణను చేత ధరించిన శక్తుల సైన్యము బయలుదేరెను-23. కొందఱు మత్త కోకిల కంఠములతోగానము చేయుచున్నారు, నాట్యము చేయుచున్నారు. సవిలాస పదవిక్రమలై (పదవిన్యాసముగలవారై వీణా-వేణు-మృందంగాదులను వాయించుచు శ్యామవర్ణముగల శక్తులు జగజ్జనములను సంతోషింపజేయుచు కదిలిరి. వారిలో మయూర వాహనాలు కొందరు. హంసవాహనలు కొందరు-25 ముంగిసలపై నెక్కినవారు కొందరు. కోకిలల సెక్కీక్రవారు కొందరు. అందరును. శ్యామలాకారలు. కొందరు క్రీడాశకటములందున్నారు. కొందరు కడిమిపూల మధువుచే మత్తెక్కిన వారు. కొందరు గుఱ్ఱములనెక్కినవారు. వీరందరు మంత్రనాథను ముందడుకొని చక్కగా ముందుముందుగా బయలుదేరిరి-27. ఆ తరువాత, మంత్రనాయిక ఎత్తైన పతాకము చక్రములును గల రథమెక్కి బయలుదేరెను. ఆమే కవచము- బాలసూర్యవర్ణము. కన్నులు మదాలోలములు-28. ముఖకమలము చిరుచెమట బిందువుల నందముగానున్నది. కనుబొమ్మలనుద్దతముగా తాండవింపజేయుచు(కదలించుచు) క్రీగంటి చూపులతోనచటి. యుద్దతోద్దతమైన శక్తులసైన్యములను పర్యవేక్షించుచున్నది. తనసామర్థ్యమునకు చిహ్నముగా (బిరుదముగా) నేమలీయీకత్రికోణముగల, గొప్పఛత్రము ధరించినది-30. ఇతర శక్తులమధ్యన గాక తనశక్తులమధ్య ఉజ్జ్వలమైన (పైకి వేలిగిన) యుదయముగలది. మేఘశ్యామయైనది. ఇట్టి శ్యామలమైన మంత్రనాయిక బయలుదేరినదీ-31. స్వర్గవాసులైన దేవతలు ఈమెను పదునారు నామములతో స్తుతించిరి. ఓ అగస్త్యమునీ! ఆ పదునారు నామములను వినుము-32. సంగీతయోగిని, శ్యామ, శ్యామల, మంత్రసాయిక, మంత్రిణి, సచివేశీ, ప్రధానేశీ, శుకప్రియ-33. వీణావతి, వైణికీ, ముద్రిణీ, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేశీ, కదంబవనవాసినీ-34. సదామద-ఓ యగస్త్యా ఇవి యా పదునారు నామములు. ఈ నామములతో సచివేశానిని ఒక్కమారు స్తుతించిన మానవుడు సమస్త త్రిలోకములను తన చేత నుంచుకొనగలడు. సంశయములేదు-35. ఈమంత్రనాథ ఎక్కడెక్కడ తన చూపు ప్రసరింపజేయునో అచ్చటచ్చట శత్రుసైన్యము పూర్తిగా పతనముజెందును-36. మొత్తము లలితా పరమేశాని యొక్క చరితము. శక్తుల చర్చయు, అంతటను జయమునిచ్చును-37 ఇక, సంగీతయోగినియొక్క చేతనున్న చిలుకపిల్ల నుండి సర్వసిద్ధముగానున్న ధనువుతోబాటు ధనుర్వేదము ఆవిష్కరించెను-38. నాలుగు బాహువులు, మూడు తలలు, మూడు కన్నులు గల వీరుడు భక్తితో నమస్కరించి ప్రధానేశితోనిట్లనెను-39. దేవీ! భండాసురునితో యుద్ధమునకు నీవు బయలుదేరుచున్నావు. కావున ఓ మంత్రినాయికా! నేను నీకు సహాయము చేయవలసి యున్నది-40. ఇది చిత్రజీవమను ధనువు మిక్కలి గొప్పది. ఓ జగదంబా! దానవ నాశకమైన దీనిని స్వీకరింపుము-41. ఈ అక్షయబాణములతో నొప్పినది, బంగారుతో చిత్రింపబడిన రెండమ్ములపొదులను రాక్షసనాశనముకై నన్ననుగ్రహించుటకు స్వీకరింపుము-42. అని భక్తితో నమస్కరించి ధనుర్వేదముతోబాటు ధనుస్సును అమ్ములపొదులను అర్పింప “ప్రియ కప్రియ” స్వీకరించేను-43. “శుకప్రియ”యు చిత్రజీవమను గొప్పధనువును దీసికొని అనేక పర్యాయములు నారిని మ్రోగించి విశాలశబ్దమును గలుగజేసేను-44. “సంగీత యోగిని” యు వింటి నాదముతో సంపదతో జగమును పూరించెను. స్వర్గవాసులమనమును నయనానందసంపదతో పూరించెను-(45) యంత్రీణి, తంత్రిణి యనువారలిరువురును ఆమె పరిచారికలు. చిలుకను వీణను వహించి వెంటనే వీరామెను సేవింతురు-46. ఘన శ్యామయు కదులుచున్న కంకణ ధ్వనులతో వృద్ధిచెందు ‘నారి’ ధ్వనిని మిక్కిలి మనోహరముగ, వ్యాపింపజేసెను-47. గీతయోగిని చిత్రజీవమను మహాధనువును ధరించి, కదంబచ్చత్రకార్ముకయైన కదంబినీ వలె ప్రకాశించెను-48. కాలికటాక్షమువలె తీక్షమై, నర్తించు నాగుబామువలె భయంకరమైన కుడిచేతిలోని బాణము ప్రకాశించెను-49. గేయచక్రరథమునధిరోహించినయా దేవిని (గీతయోగినిని) వెంబడించుచునే ఆమెవలె శ్యామలశోభతో నొప్పినవారును, బాణములను ధనువును ధరించినవారునైన దేవులు (దేవీశక్తులు) సేవించుచుండిరి-50. తీవ్రవేగమును గలవారును, మదముచే అలసటగానున్నవారును, మధురములైన కిలకిలారావములతో దిక్కులను నింపువారునైన వేయి శక్తిసేనలు వేయి యక్షౌహిణీ సంఖ్యలో నొప్పుచున్నవి-51.
ఇదీ శ్రీబ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున దండనాధాశ్యామలసేనాయాత్రయను పదునేడవయధ్యాయము.
Summary of chapter 129 of the Brahmānda Mahā Purana is as follows:
Continuing the battle narrative, this section details the destruction of key demon generals who attempted to breach the defenses of the divine fortress. It recounts how the Sakti warrior goddesses used celestial missiles and divine intelligence to dismantle the elaborate military traps set by the dark forces. The devout reader praises the vigilant protection offered by the divine mother, who tirelessly guards her devotees against all hidden spiritual dangers.