బ్రహ్మాండ మహా పురాణము
29 - భండాసురవధో
అగస్త్య ఉవాచ :
అశ్వానన మహాప్రాజ్ఞ వర్ణితం మంత్రిణీబలమ్।
విషంగస్య వధో యుద్ధే వర్ణితో దండనాథయా॥
శ్రీదేవ్యాః శ్రోతుమచ్ఛామి రణచక్రే పరాక్రమమ్।
సోదరస్యాపదం దృష్వా భండః కిమకరోచ్ఛుచా॥
కథం తస్య రణోత్సాహః కైః సమం సమయుధ్యత।
సహాయాః కేఽభవంస్తస్య హతభ్రాతృతనూభువః॥
అగస్త్యుడనెను :
ఓ హయగ్రీవ! మహాప్రాజ్ఞ! మంత్రిణీ జలమును వర్ణించితివి. యుద్ధమున చేసిన విషంగ వధను వర్ణించితివి-1. ఇక రణచక్రమున శ్రీదేవి పరాక్రమమును వినదలచితిని. సోదర మరణమును జూచి దుఃఖముతో భండాసురుడేమిచేసెను-2 ఆతని రణోత్సాహమెట్టిది? ఎవరితో యుద్ధము జేసెను. చంపబడిన సోదరులు పుత్రులును గల యాతనికి సహాయకులెవరుండిరి?-3.
హయగ్రీవ ఉవాచ:
ఇదం శృణు మహాప్రాజ్ఞ సర్వపాపనికృంతనమ్।
లలితాచరితం పుణ్యమణిమాదిగుణప్రదమ్॥
వైషువాయనకాలేషు పుణ్యేషు సమయేషు చ।
సిద్ధిదం సర్వపాపఘ్నం కీర్తిదం పంచపర్వసు॥
తదా హతౌ రణే తత్ర శ్రుత్వా నిజసహోదరౌ।
శోకేన మహాతావిష్టో భండః ప్రవిలలాప సః॥
వికీర్ణకేశోథ రణే మూర్ఛితః పతితస్తదా।
న లేభే కించిదాశ్వాసం భ్రాతృవ్యసనకర్శితః॥
పునఃపునః ప్రవిలపన్ కుటిలాక్షేణ భూరిశః।
అశ్వాస్యమానః శోకేన యుక్తః కోపమవాప సః॥
ఫాలం వహన్నతిక్రూరం భ్రమద్భ్రుకుటిభీషణమ్।
అంగారపాటలాక్షశ్చ నిఃశ్వసన్ కృష్ణసర్పవత్॥
ఉవాచ కుటిలాక్షం ద్రాక్ సమస్తపృతనాపతిమ్।
క్షిప్రం ముహుర్మహుః స్పృష్ట్వా ధున్వానః కరవాలికామ్ ॥
క్రోధహుంకారమాతన్వన్గర్జన్నుత్పాతమేఘవత్॥
యయైవ దృష్టయా మాయాబలాద్యుద్దే వినాశీతాః।
భాతరో మమ పుత్రాశ్చసేనానాథాః సహస్రశః॥
తస్యాః స్త్రీయాః ప్రమత్తాయాః కంఠోత్థైఃశోణితద్రవైః।
భ్రాతృపుత్రమహాశోకవహ్నిం నిర్వాపయామ్యహమ్॥
గచ్ఛ రే కుటీలాక్ష త్వం సజ్జీకురు పతాకినీమ్।
ఇత్యుక్త్వా కఠినం వర్మ వజ్రపాతసహం మహత్॥
దధానో భుజమధ్యేన బధ్నన్ పృష్ఠే తథేషుధీ।
ఉద్దామమౌర్వినిఃశ్వాసకఠోరం భ్రామయన్ ధనుః॥
కాలాగ్నిరివ సంక్రుద్దో నిర్జగామ నిజాత్ పురాత్।
తాలజంఘాదికైః సార్ధం పూర్వద్వారే నివేశితే (తైః) ॥
చతుర్భిర్దృతశస్త్రౌఘైర్ధృతవర్మభిరుధ్ధతైః ।
పంచత్రింశచ్చమూనాథైః కుటిలాక్షపురఃసరైః॥
సర్వసేనాపతీంద్రేణ కుటిలాక్షేణ సక్రుధా।
మీలితేన చ భండేన చత్వారింశచ్చమూవరా॥
దీప్తాయుధా దీప్తకేశా నిర్జగ్ముర్దీప్తకంటకాః ।
ద్విసహస్రాక్షౌహిణీనాం పంచాశీతిః పరార్ధికా॥
తదేనమన్వగాదేకహేలయా మథితుం ద్విషః।
భండాసురే వినిర్యాతే సర్వసైనికసంకులే॥
శూన్యకే నగరే తత్ర స్త్రీమాత్రమవశేషితమ్।
అభిలో నామదైత్యేంద్రో రథవర్యో మహారథః॥
సహస్రయుగ్యసింహాడ్యమారురోహ రణోద్ధత॥
తత్వరే విజ్వలజ్జ్వాలాకాలాగ్నిరివ దీప్తిమాన్।
ఘాతకో నామ వై ఖడ్గశ్చంద్రహాససమాకృతిః॥
ఇతస్తతశ్చలంతీనాం సేనానాం ధూలిరుత్థితా।
వోడుం తాసాం భరం భూమిరక్షమేవ దేవం యయౌ॥
కేచిద్భూమేరపర్యాప్తః ప్రచేలుర్వ్యోమరర్త్మనా।
కేషాంచిత్ స్కంధమారూఢాః కచిచ్చేలుర్మహారథాః॥
న దీక్షు న చ భూచక్రే న వ్యోమని చ తే మముః।
దుఃఖదుఃఖేన తే చేలురన్యోన్యాశ్లేషపీడితాః॥
అత్యంతసేనాసమ్మర్దాద్రథచక్రైర్విచూర్ణితాః।
కేచిత్పాదేన నాగానాం మర్ధతా న్యపతన్భువి॥
ఇత్థం ప్రచలితా తేన సమం సర్వైశ్చ సైనికైః।
వజ్రనిష్పేషసదృశో మేఘనాదో వ్యధీయత॥
తేనాతీవ కఠోరేణ సింహనాదేన భూయసా।
భండదైత్యముఖోత్థేన విదీర్ణమభవజగత్॥
సాగరాః శోషమాపన్నాశ్చంద్రార్కౌ ప్రపలాయితౌ।
ఉడూని స్యపతన్ వ్యోమ్నో భూమిర్దోలాయిత్వాఽభవత్॥
దీఙ్నాగాశ్చాభవంస్త్రస్తాః మూర్భితాశ్చ దివౌకసః।
శక్తినాం కటకం చాసీదకాండత్రాసవిహ్వలమ్॥
ప్రాణాన్ సంధారయామాసుః కథంచిన్మధ్య ఆహమే।
శక్తయో భయవిభ్రాష్టాన్యాయుధాని పునర్ధధుః॥
వహ్నిప్రాకారవలయం ప్రశాంతం పునరుత్థితమ్।
దైత్యేంద్రసింహనాదేన చమూనా థనుఃస్వనైః॥
క్రందనైశ్చాపి యోద్ధృణామభూచ్ఛబ్దమయం జగత్।
తేన నాదేన మహతా భండదైత్యవినిర్గమమ్।
నిశ్చిత్య లలితాదేవీ స్వయం యోద్ధుం ప్రచక్రమే॥
అశక్యమన్యశక్తీనామాకలయ్య మహాహవమ్।
భండదైత్యేన దుష్టేన స్వయముద్యోగమాస్థితా॥
చక్రరాజరథస్తస్యాః ప్రచచాల మహోదయః।
చతుర్వేదమహాచక్రపురుషార్థమహోదయః॥
ఆనందధ్వజసంయుక్తో నవభిః పర్వభిర్యుతః।
నవపర్వస్థదేవీభిరాకృష్టగురుధన్విభిః॥
పరార్ధాధిక సంఖ్యాతపరిహారసమృద్ధిభిః।
పర్వస్థానేషు సర్వేషు పాలితః సర్వతోదిశమ్॥
దశయోజనమున్నద్ధశ్చతుర్యోజనవిస్తృతః ।
మహారాజ్ఞిచక్రరాజో రథేంద్రః ప్రచలన్ బభౌ॥
తస్మిన్ ప్రచలితే జుష్టే శ్యామయా దండనాథయా।
గేయచక్రం తు బాలాగ్రే కిరిచక్రం తు పృష్ఠతః॥
అన్యాసామపి శక్తీనాం వాహనాని పరార్ధశః।
నృసిహోష్ట్రనరవ్యాలమృగపక్షిహయాస్తథా॥
గజభేరుండశరభవ్యాఘ్రవాతమృగాస్తథాః।
ఏతాదృశశ్చ తిర్యంచోప్యఽన్యే వాహనతాo గతాః॥
ముహురుచ్చావచాః శక్తీర్భండాసురవధోద్యతాః।
యోజనాయామవిస్తారమపతద్ద్వారమండలమ్॥
వహ్నిప్రారచక్రస్య న పర్యాప్తం చమూపతేః॥
జ్వాలామాలినికో నిత్యా ద్వారస్యాత్యంతవిస్తృతిమ్।
వీతతాన సమస్తానాం సైన్యానాం నిర్గమైషిణీ॥
అథ సా జగతాం మాతా మహారాజ్ఞి మహోదయా।
నిర్జగామాగ్నిపురతో వరద్వారాత్ప్రతాపిణీ॥
దేవదుందభయో నేదుః పతితాః పుష్పవృష్టయః।
మహాముక్తాతపత్రం తద్దవి దీప్తమదృశ్యత॥
నిమిత్తాని ప్రసన్నాని శంసకాని జయశ్రియాః।
అభవంల్లలితాసైన్యే ఉత్పాతాస్తు ద్విషాం బలే॥
హాయగ్రీవుడనేను :- ఓ మహాప్రాజ్ఞా! అగస్త్యా! ఈ లలితా చరితమును వినుము. ఇది సర్వపాపములను గత్తిరించునది. పుణ్యమైనది. అణిమాది గుణములనిచ్చునది-4, విషువత్తునకు సంబంధించిన ఆయన ప్రారంభకాలములందును, (విషువత్తు = రాత్రి+పవలును సమ పరిమాణములో నున్న దినములు) పుణ్యసమయములందును ఐదు పర్వములందును ఈ చరితము సిద్ధినిచ్చును. సర్వపాపముల బోద్రోలును. కీర్తినిచ్చును-5. అప్పుడు రణమున తన సోదరులిద్దరు (విషంగ విశుక్రులు) చంపబడుటను విని భండాసురుడు మిక్కిలి దుఃఖితుడై యేడ్చెను-6. చెదరిన తలవెంట్రుకలు గలవాడై భూమిపై మూర్చిల్లిపడెను. సోదర మరణమున కృశించిన వాడై యే మాత్రమును అశ్వాసమును (ఓదార్పును) పొందలేదు-7. మరల మరల నేడ్చుచు కుటిలాక్షుని చేత ననేక పర్యాయములు ఓదార్చబడుచు శోకముతోనుండియు కోపమును బొందెను-8. ఫాల మతిక్రూరముగా నుండెను. బోమ్మముడులు తిరుగుచు భయంకరముగా నుండెను. కన్నులు నిప్పులవలె నెళ్తానయ్యెను. నల్ల సాగుబామువలె దుసగొట్టుచెండెను-9. వేగముగా మాటిమాటికి కరవాలికను (ఖడ్గమును) దాకి విదిల్చుచుండెను. ఉత్పాత మేఘమువలె కోపముతో హుంకరించుచుండెను. వెంటనే సేనాపతియైన కుటిలాక్షునితో నిట్లనెను-10, 11. యుద్ధమున తనచూపు మాత్రముననే బలాత్కారముగా నా సోదరులు, పుత్రులు వేలకొలదీ సేనానాయకులును, ఈమెచే చంపబడిరి-12. ప్రమత్తయైన యాసీ యొక్క కంఠమునుండి వెడలిన రక్తధారలచే భ్రాతృపుత్ర మహాశోకమనెడి యగ్నిని నేను జల్లార్పుదును-13. ఓరీ! కుటీలాక్షా! నీవు వెళ్లుము. సేనను సిద్దము జేయుము-అని చెప్పి, వజ్రపాతమును గూడ సహించునట్టి కవచమును తొడిగి, భుజముల మధ్యన వీపున రెండమ్ముల పొడులను గట్టుకొని, గొప్పనైన సెరీరంకారముతో కఠినమైన ధనువును ట్రిప్పుచు-15. ప్రళయ కాలాగ్నివల కోపించినవాడై తన పురమునుండి బయలుదేరెను. పురద్వారమున నుంచబడిన తాలజంఘాదులు-16. నలుగురు శస్త్రసమూహములను కవచములను ధరించి యుద్దతులైన వారే యాతనిని వెంబడించిరి. కుటిలాక్షుడు మొదలగు ముప్పది యైదుగురు సేనానాయకులును తోడువెడలిరి. కోపించిన సర్వేసేనా పతీంద్రుడైన కుటిలాక్షుడును గలిసిన భండాసురునితో దీప్తమైన యాయుధములు గలవారు, దీప్తములైన కేశములు గలవారు ఉద్దీప్తములైన రోమాంచములు (పులకలు) గలవారును వెడలిరి. రెండువేల యేనుబదియైదక్షౌహిణుల సైన్యము-19. ఒకే హేలలో శత్రువులను జంపుటకు భండాసురుని వెంబడించినది. సర్వసైనిక సంకులుడై భండాసురుడు బయలుదేరగా-20. అచట శూన్యకనగరమున ఒక స్త్రీ మాత్రమే మిగిలినది. భండాసురడెక్కిన రథము ఆభిలమనుపేరుగలది. మహారథము వేయి వాహనములుగానున్న సింహములతో నొప్పినది. దానిని రణోద్దతుడైన భండాసురుడెక్కేను -21. విశేషించి మండుచున్న జ్వాలలుగల ప్రళయ కాలాగ్ని వలె బ్రకాశించుచు చంద్రహాస సమమైన యాకారముగలిగి యాతడు ధరించిన ఘాతకమును ఖడ్గము యుద్ధమునకు త్వరపడెను-22. ఇటునటు కదులచున్న సేనలవల్ల ధూళి పైకెగసినది. అదీ ఆ సేనల భారమును భరింపలేక ఆకాశమునకు పయనమైన భూమియా యన్నట్లున్నదీ-23. కొందరు భూమిచాలనివారైయాకాశమార్గమున గదిలిరి. కొన్ని రథములు కొందరి భుజములపై నెక్కి కదిలినవి-24. దిక్కులలోగాని, భూమండలమునగాని, చివరకాకాశమునగాని ఆసేనలిముడలేదు. ఒండొరుల నొరయుచు నొండొరుల పీడించుచు దుః ఖదుఃఖముగా కదలిరి-25. కొందరు మిక్కుటమైన సేనలతో సమ్మర్గము జెందిరి, కొందరు రథ చక్రములతో పొడిరి. కొందరు ఏనుగుల పాదములతో దొక్కబడి భూమిపై బడిరి-26. ఈ విధముగా సర్వసైనికులతో గదలుచున్న భండాసురని చేత వజ్రఘోషతో సమానమైన మేఘనాదముజేయబడినదీ-27. భండాసురునిముఖమునుండి వెలువడిన యాకోరసింహనాదముతో జగమంతయు బ్రద్దలయ్యెను-28. సముద్రము లెండినవి. చంద్రసూర్యులు పారిపోయిరీ, నక్షత్రములాకాశమునుండి పడినవి, భూమి యూగసాగేను-29. దిగ్గజములు భయము జెందినవి. దేవతలు మూర్చిల్లిరి. శక్తులనగరము అకస్మాత్తుగావచ్చిన భయముతో వివశమైనది-30. అతికష్టముగా యుద్దమధ్యమున ప్రాణముల ధరించుచుండిరి. శక్తులు భయముచే జారవిడిచిన యాయుధముల మరల ధరించిరి-31. వహ్నిప్రాకార వలయము ప్రశాంతమై మరల లేచినది. భండాసురుని సింహనాదముచేతను, సేనానాయకులు ధనుష్టంకారములచేతను-32. యోద్ధల యరపుల చేతను జగమంతయు శబ్దమయమైనది. ఆ మహానాదము చేత భండాసురుడు బయలుదేరెనని నిశ్చయించి శ్రీలలితాదేవి స్వయముగా యుద్ధము జేయుటకు బయలుదేరెను-83. భండాసురునితోడియుద్ధము తక్కిన శక్తులకశక్యమని గమనించినది. స్వయముగనే యుదోద్యోగమునకు బూనినది-34. ఆమె యొక్క మహాభివృద్ధిగల చక్రరాజ రథము కదిలెను. దానికి నాలుగు వేదములు మహాచక్రములు. నాలుగు పురుషార్థములు అభయము (ధర్మార్థకామమోక్షములచే భయము లేనిది)-35. ఆనందమే ధ్వజముగా గలది. తొమ్మిది పర్వములు (అంతస్థులు-భాగములు) గలది. ఆనవపర్వములందు దేవులు బాణమేక్కుపెట్టి లాగి పట్టిన గురుధనువులు గలవారై సంసిద్దముగా నున్నారు-36. వారు పరార్థ సంఖ్యకంటే మించిన పరివారముతో సమృద్ధముగా నున్నారు. వీరిచే అన్ని పర్వస్థానములందన్ని దిక్కులందును రథము రక్షింపబడుచున్నది-37. ఆ రథము పదీయోజనముల యెత్తైనది. నాలుగు యోజనముల విస్తారముగలది. అల్జీ మహారాజ్ఞియొక్క చక్రరాజమైన రథశ్రేష్టము ముందుకు కదులుచు ప్రకాశించేను-38. ఈ విధముగా సేవింపబడిన యారథము దండనాథయైన శ్యాముచేత కదలినది, బాలగేయచక్రరథమును ముందుగను, కిరిచక్రరథమును వెనుకను కదిలించేను-39. నరులు సింహములు ఒంటెలు సర్పములు మృగములు పక్షులు గుఱ్ఱములు-40. ఏనుగులు భేరుండములు శరభములు పులులు గాలినెదిరించి పరుగిడు ఇట్టివంటి మృగములు-ఇటువంటి మరికొన్ని మృగములు-ఇటువంటి వేలకొలది వాహనములతో నితరశక్తులు గూడ కదిలిరీ-(40-41) కింద మీద బహుప్రకారముల వ్యాపించిన శక్తులు మాటిమాటికి భండాసుర వధకై యుద్యుక్తలగుచున్నారు. వహ్నిప్రకారచక్ర (మండల)ము యొక్క ద్వారమండలము ఒక యోజనము పొడవు-విస్తారములు గలిగియున్నను సేనాపతికి చాలలేదు-42. జ్వాలామాలినిక యను నిత్యాశిక్షి సైన్యములు బయలువెడలుటకై, ద్వారమును మిక్కిలి విస్తారముగా దేరను-43. ఆ తరువాత జగన్మాతయు, మహాభివృద్ధి గలదీయు, ప్రతాపవంతురాలును ఐన మహారాజ్ఞి అగ్నిపురమునుండి వరద్వారము గుండా బయలువెడలెను-44. దేవదుందుభులు మ్రోగినవి. పుష్పవర్షములు గురిసినవి. ఆ పెద్ద ముత్యముల గొడుగు ఆకాశమును బ్రకాశింపజేయునదిగా గనబడెను-45, లలితా సైన్యమున జయశ్రీ సూచకముగా నిర్మల శాంతములైన నిమిత్తములు (శకునములు) సంభవించి శత్రుసైన్యమున మాత్రము ఉత్పాతములు గలిగినవి-46.
తతః ప్రవవృతే యుద్ధం సేనయోరుభయోరపి।
ప్రసర్పద్విశిఖైః స్తోమబద్ధాంధతమసచ్ఛటమ్॥ . హన్యమానగజస్తోమసృతశోణితబిందుభిః।
హ్రీయమాణశిరశ్ఛన్నదైత్యశ్వేతాతపత్రికమ్॥
న దిశో న నభో నాగా న భూమిర్న చ కించన।
దృశ్యతే కేవలం దృష్టం రజోమాత్రం చ మూర్ఛితమ్॥ నృత్యత్కబంధనివహావిర్భూతతటపాదపమ్।
దైత్యకేశసహస్రైస్తు శైవాశాంకురకోమలా॥
శ్వేతాపత్రవలయశ్వేతపంకజభాసురా। చక్రకృత్తకరిగ్రామపాదకూర్మపరంపరా॥
శక్తిధ్యస్తమహాదైత్యగలగండశిలోచ్చయా।
విలూనకాండైః పతితైః సఫేనా బలచామరైః॥
తీక్ష్ణాసివల్లరీజాలైర్నిబిడీకృతతీర్థభూః।
దైత్యవీరేక్షణాశ్రేణిముక్తిసంపుటభాసురా॥
దైత్యవాహనసంఘాతనక్రమీనశతాకులా।
ప్రావహచ్ఛోణితనదీ సేనయోర్యుధ్యమానయో॥
ఇత్థం ప్రవవృతే యుద్ధం మృత్యోశ్చ త్రాసదాయకమ్।
చతుర్ధయుద్దదివసే ప్రాతరారభ్య భీషణమ్।
ప్రహరద్వయపర్యంతం సేనయోరుభయోరపి॥
తతః శ్రీలలితాదేవ్యా భండస్యాథాభవద్రణః।
అస్త్రప్రత్యస్తసంక్షోభైస్తుములీకృతదిక్తటః॥
ధనుర్జ్యాతలటంరహంకారైరతిభీషణః।
తూణీరవదనాత్ కృష్ణధనుర్వరవినిఃసృతైః॥
విముకైర్విశిఖైర్భీమైరాహవే ప్రాణహారిభిః॥
హస్తలాఘవవేగేన న ప్రజ్ఞాయత కించన।
మహారాజ్జీ కరాంభోజవ్యాపారం శరమోక్షణే॥
శృణు సర్వం ప్రవక్ష్యామి కుంభసంభవ సంగరే॥
సంధానే త్వేకథా తస్య దశధా చాపనిర్గమే।
శతధా గమనే దైత్యసైన్యప్రాప్తౌ సహస్రధా॥
దైత్యాంగసంగే సంప్రాప్తాః కోటిసంఖ్యాః శిలీముఖాః॥
పరాంధకారం సృజతీ భిందతీ రోదసీ శరైః।
మర్మాభినత్ప్రచండస్య మహారాజ్ఞి మహేషుభిః॥
వహత్కోపారుణం నేత్రం తతో భండః సదానవ ।
వవర్ష శరజాలేన మహతా లలితేశ్వరీమ్॥
అంధతామిస్రకం నామ మహాస్త్రం ప్రముమోచ సః।
మహాతరణిబాణేన తన్నునోద మహేశ్వరీ॥
పాఖండాస్త్రం మహావీరో భండః ప్రముముచే రణే।
గాయత్ర్యస్త్రం తస్యనుత్యై ససర్జ జగదంబికా॥
అంధాస్త్రమసృజద్భుండః శక్తిదృష్టివినాశనమ్।
చాక్షుష్మతమహాస్త్రేణ శమయామాస తత్ర్పసూః॥
శక్తినాశాభిధం భందో ముమోచాస్త్రం మహారణే।
విశ్వావసో రథాస్త్రేణ తస్య దర్పమపాకరోత్॥
అంతకాస్త్రం ససర్జోచ్ఛైః సంక్రుద్ధో భండదానవః।
మహామృత్యుంజయాస్త్రేణ నాశయామాస తద్బలమ్॥
సర్వాస్త్రస్మృతినాసౌఖ్యమస్త్రం భండో వ్యముంచత।
ధారణాస్త్రేణ చక్రేశీ తద్భలం సమనాశయత్॥
భయాస్త్రమసృజదండః శక్తీనాం భీతిదాయకమ్।
అభయంకరమైంద్రాస్త్రం ముముచే జగదంబికా॥
మహారోగాస్త్రమసృజచ్ఛక్తి సేనాసు దానవః।
రాజయక్ష్మాదయో రోగాస్తతోఽ భూవన్ సహస్రశః॥
తన్నివారణసిద్ధ్యర్థం లలితా పరమేశ్వరీ ।
నామత్రయమహామంత్రమహాస్త్రం సా ముమోచ హ॥
అచ్యుతశ్చాష్యనంతశ్చ గోవిందస్తు శరోత్థితాః।
హుంకారమాత్రతో దగ్ధ్వ రోగాంస్తాననయన్ముదమ్॥
నత్వా చ తాం మహేశానీం తద్భక్తవ్యాధిమర్దనమ్।
విధాతుం త్రిషు లోకేషు నియుక్తాః స్వపదం యయుః॥
ఆయుర్నాశనమస్త్రం తు ముక్తవాన్ భండదానవః।
కాలసంకర్షణీరూపమస్త్రం రాజ్ఞీ వ్యముంచతః॥
మహాసురాస్త్రముద్దామం వ్యసృజద్భండదానవః।
తతః సహస్రశో జాతా మహాకాయా మహాబలాః॥
మధుశ్చ కైటభశ్చైవ మహిషాసుర ఏవ చ।
ధూమ్రలోచనదైత్యశ్చ చండముండాదయోఃఽసురా॥
చిక్షుభశ్చామరశ్చైవ రక్తబీజోఽసురస్తథా।
శుంభశ్చైవ నిశుంభశ్చ కాలకేయా మహాబలాః॥
ధూమ్రాభిధానాశ్చ పరే తస్మాదత్సముత్తితాః।
తే సర్వే దానవశ్రేష్ఠాః కఠోరైః శస్త్రమండలై॥
శక్తిసేనాం మర్థయంతో నర్దంతశ్చ భయంకరమ్।
హాహేతి క్రందమానాశ్చ శక్తయో దైత్యమర్ధితాః॥
లలితాం శరణం ప్రాప్తాః పాహిపాహీతి సత్వరమ్।
అథ దేవీ భృశం క్రుద్ధా రుషాట్టహాసమాతనోత్॥
తతః సముత్థితా కాచిదుర్గా నామ యశస్వినీ।
సమస్తదేవతేజోభిర్నిర్మితా విశ్వరూపిణీ॥
శూలం చ శూలినా దత్తం చక్రం చక్రిసమర్పితమ్।
శంఖం వరుణదత్తం చ శక్తిర్దత్తా హవిర్భుజా॥
చాపమక్షయతూణీరౌ మరుద్దత్తా మహామృధే।
వజ్రాజ్రిదత్తం చ కులిశమ్ చషకం ధనదారీతమ్॥
కాలదండం మహాదండం పాశం పాశధరార్పితమ్।
బ్రహ్మదత్తాం కుండికాం చ ఘంటామైరావతార్పితామ్॥
మృత్యుదత్తౌ ఖడ్గఖేటౌ హారం జలధినార్పితమ్।
విశ్వకర్మప్రదత్తాని భూషణాని చ బిభ్రతీ॥
అంగైః సహస్రకిరణశ్రేణిభాసురరశ్మిభిః।
ఆయుధాని సమస్తాని దీపయంతి మహోదయైః
అన్యదత్తైరథాన్యైశ్చ శోభమానా పరిచ్ఛదైః।
సింహవాహనమారుహ్య యుద్ధం నారాయణీ వ్యధాత్॥
తయా తే మహిషప్రఖ్యా దానవా వినిపాతితాః ।
చండికాసప్తశత్యాం తు యధా కర్మ పురాకరోత్॥
తథైవ సమరం చక్రే మహిషాదిమదాపహమ్।
తత్కృత్వా దుష్కరం కర్మ లలితాం ప్రణనామ సా॥
మూకాస్త్రమసృజద్దుష్టః శక్తిసేనాసు దానవః ।
మహావాగ్వాదినీ నామ ససర్జాస్త్రం జగత్ర్పసూః॥
విద్యారూపస్య వేదస్య తస్కరానసురాధమాన్ ।
ససర్థ తత్ర సమరే దుర్మదో భండదానవః॥
దక్షహస్తాంగుష్ఠనఖాన్మహారాజ్ఞా తిరస్కృతః।
అర్ణవాస్త్రం మహావీరో భండదైత్యో రణే ఽసృజత్॥
తత్రోద్దామపయఃపూరే శక్తి సైన్యం మమజ్జ చ ।
అథ శ్రీలలితాదక్షహస్తతర్జనికానఖాత్।
ఆదీకూర్మ సముత్పన్నో యోజనాయతవిస్తరః॥
ధృతాస్తేన మహాభోగఖర్పరేణ ప్రధీయసా।
శక్తయో హర్షమాపన్నాః సాగరాస్త్రళయం జహం॥
తత్సాముద్రం చ భగవాన్ సకలం సలిలం పపౌ।
హైరణ్యాక్షం మహాస్త్రం తు విజయే దుష్టదానవః॥
తస్మాత్సహస్రశో జాతాః హిరణ్యాక్షః గదాయుధాః।
తైర్హన్యమానే శక్తీనాం సైన్యే సంత్రాసవిహ్వలే ॥
ఇతస్తతః ప్రచలితే శిథిలే రణకర్మణి॥
అథశ్రీలలితాదక్షహస్తమధ్యాంగుళినఖాత్ ।
మహావరాహః సమభూచ్ఛ్వేతః కైలాససంనిభః॥
తేన వజ్రసమానేన పోత్రిణాభివిదారితాః।
కోటిశస్తే హిరణ్యాక్షాః మర్ద్యమానాః క్షయం గతాః॥
అథ భండస్త్వతిక్రోధాత్థుభ్రకుటీం వితతాన హ।
తస్య భృకుటితో జాతా హిరణ్యాః కోటిసంఖ్యకాః ।
జ్వలదాదిత్యవద్దీప్తా దీపప్రహరణాశ్చ తే।
అమర్దయచ్ఛక్తి సైన్యం ప్రహ్లాదం చాప్యమర్దయన్॥
యః ప్రహ్లాదోఽస్తీ శక్తీనాం పరమానందలక్షణః ।
స ఏవ బాలకో భూత్వా హిరణ్యపరిపీడిత॥
లలితాం శరణం ప్రాప్తస్తేన రాజ్ఞీకృపామత్ ।
అథ శక్త్యా నందరూపం ప్రహ్లాదం పరిరక్షితమ్॥
దక్షహస్తానామికాగ్రం ధునోతి స్మ మహేశ్వరీ ।
తస్మాద్ధూతసటాజాలః ప్రజ్వలల్లోచనత్రయః॥
హింస్రాస్యః పురుషాకారః కంఠస్యాథో జనార్దనః।
నఖాయుధః కాలరుద్రరూపీ హోరాట్టహాసవాన॥
సహస్రసంఖ్యదోర్దండో లలితాజ్ఞానుపాలకః।
హిరణ్యకశిపూన్ సర్వాన్ భండభ్రుకుటిసంభవాస్॥
క్షణాద్విధారయామాస నభైః కులిశకర్కశైః।
బలీంద్రాస్త్రం మహాఘోరం సర్వదేవతనాశనమ॥
అముంచల్లలితాదేవీం ప్రతి భండమహాసురః ॥
తదస్త్రదర్పనాశాయ వామనాః శతశోఽభవన్ ।
మహారాజ్జీదక్షహస్తకనిష్టాగ్రాన్మహౌజస॥
క్షణేక్షణే వర్ధమానాః పాశహస్తా మహాబలాః।
బలీంద్రానస్త్రసంభూతాన్ బధ్నంతః పాశబంధనైః॥
దక్షహస్తకనిష్టాగ్రాజ్ఞాతాః కామేశయోషితః।
మహాకాయా మహోత్సాహాస్తదస్త్రం సమనాశయమ్॥
హైహయాస్త్రం సమసృజద్భండదైత్యో రణాజీరే
తస్మాత్సహస్రశో జాతాః సహస్రార్జునకోటయః॥
అథ శ్రీలలితావామహస్తాంగుష్ఠనఖాదితః।
ప్రజ్వలన్ భార్గవో రామః సక్రోధః సింహనాదవాన్॥
ధారయా దారయన్నేతాన్ కుఠారస్య కఠోరయ।
సహస్రార్జునసంఖ్యాతాన్ క్షణాదేవ వ్యనాశయన్॥
అథ క్రుద్ధో భండదైత్య క్రోధాద్ధుం కారమాతనోత్।
తస్మాద్దుంకారతో జాతశ్చంద్రహాసకృపాణవాన్॥
సహస్రాక్షౌహిణీరక్షఃసేనయా పరివారితతః।
కనిష్ఠం కుంభకర్ణం చ మేఘనాదం చ నందనమ్॥
గృహీత్వా శక్తిసైన్యం తదతిదూరమవర్ధయత్॥
అథశ్రీలలితావామహస్తతర్జనికానఖాత్ ।
కోదండరామః సమభూలక్షణేన సమన్వితః॥
జటామకుటవాన్ వల్లీబద్ధతూణీరపృష్ఠభూః।
నీలోత్పలదలశ్యామో ధనుర్విస్తారయస్ ముహుః॥
నాశయామస దివ్యా స్త్రైః క్షణాద్రాక్షససైనికమ్।
మర్దయామాస పౌలస్త్యం కుంభకర్ణం చ సోదరమ్॥
లక్ష్మణో మేఘనాదం చ మహావీరమనాశయతే॥
ద్వీవిదాస్త్రం మహాభీమమసృజద్భండదానవః।
తస్మాదనేకశో జాతాః కపయః పింగలోచనాః॥
క్రోధేనాత్యంతతామ్రస్యాః ప్రత్యేకం హనుమత్సమాః।
వ్యనాశయచ్ఛక్తి సైన్యం క్రూరక్రేంకారకారిణ॥
అథ శ్రీలలితావామహస్తమధ్యాంగులీనఖాత్ ।
ఆవిర్భభూవ తాలాంకః క్రోధమధ్యారుణేక్షణః॥
నీలాంబర పినద్ధాంగః కైలాసాచలనిర్మలః।
ద్వివిదాస్త్రసముద్భూతాన్ కపీన్ సర్వాన్ వ్యనాశయత్
రాజాసురం నామ మహత్ససర్జాస్త్రం మహాబలః।
తస్మాదస్త్రాత్సముద్భూతా బహవో నృపదానవాః॥
శిశుపాలో దంతవక్త్రః శాల్వః కాశీపతిస్తథా।
పౌండ్రకో వాసుదేవశ్చ రుక్మీ డింభకహంసకౌ॥
శంబరశ్చ ప్రలంబశ్చ తథా బాణాసురోఽపి చ ।
కంసశ్చాణూరమల్లశ్చ ముష్టికోత్పలశేఖరౌ॥
అరిష్టో ధేనుకః కేశీ కాలియో యమలార్జునౌ।
పూతనా శకటశ్చైవ తృణావర్తాదయోఃఽసురా॥
నరకాభ్యో మహావీరో విష్ణురూపీ మురాసురః।
అనేకే సహసేనాభిరుత్థితాః శస్త్రపాణయః॥
తాన్ వినాశయితుం సర్వాన్ వాసుదేవః సనాతనః।
శ్రీదేవీవామహస్తాబ్జానామికానఖసంభవః॥
చతుర్వ్యూహం సమాతేనే చత్వారస్తే తతోఽభవత్।
వాసుదేవో ద్వితీయస్తు సంకర్షణ ఇతి స్మృతః॥
ప్రద్యుమ్నశ్ఛానిరుద్దశ్చ తే సర్వే ప్రోద్యతాయుధా:।
తానశేషాన్ దురాచారాన్ భూమిభారప్రవర్తకాన్॥
నాశయామాసురుర్వీశవేషచ్ఛన్నాన్మహాసురాన్॥
అథ తేషు వినష్టేషు సంక్రుద్ధో భండదానవః।
ధర్మవిప్లావకం ఘోరం కల్యస్త్రం సమముంచత॥
తతః కల్యస్త్రతో జాతా ఆంధ్రాః పుండ్రాశ్చ భూమిపాః।
కిరాతాః శబరా హుణా యవనాః పాపవృత్తయః॥
వేదవిప్లావకా ధర్మద్రోహిణః ప్రాణహింసకాః।
వర్ణాశమేషు సాంకర్యకారిణో మలినాంగకాః॥
లలితాశక్తి సైన్యాని భూయోభూయో వ్యమర్దయన॥
అథ శ్రీలలితావామహస్తపద్మస్య భాస్వతః।
కనిష్ఠికానభోద్భూతః కల్కిర్నామ జనార్దనః॥
అశ్వారూఢః ప్రదీప్తశ్రీరట్టహాసం చకార సః ।
తస్యైవ ధ్వనినో సర్వే వజ్రనీష్పేషబంధునా॥
కిరాతా మూర్ఛితా నేశుః శక్తయశ్చాపి హర్షితాః।
దశావతారనాథాస్తే కృత్వేదం కర్మ దుష్కరమ్॥
లలితాం తాం నమస్కృత్య దిద్ధాంజలిపుటాః స్థితాః।
ప్రతికల్పం ధర్మరక్షాం కర్తుం మత్స్యాదిజన్మభిః।
లలితాంబానీయుక్తాస్తే వైకుంఠాయ ప్రతస్థిరే॥
ఇత్థం సమస్తేష్వస్త్రేషు నాశీతేషు దురాశయః।
మహామోహాస్త్రమసృజచ్ఛక్తయస్తేన మూర్ఛితాః
శాంభవాస్త్రం విసృజ్యాంబా మహామోహస్త్రమక్షిణోత్।
అస్త్రప్రత్యస్త్రధారాభిరిత్థం జాతే మహాహవే।
అస్తశైలం గభస్తీశో గంతుమారభతారుణః॥
అథ నారాయణాస్త్రేణ సా దేవీ లలితాంబికా।
సర్వా అక్షౌహిణీస్తస్య భస్మసాదకరోద్రణే ॥
అథ పాశుపతాస్త్రేణ దీప్తకాలానలత్విషా।
చత్వారింశచ్చమూనాథాన్మహారాజ్జీ వ్యమర్దయత్॥
అథైకశేషం తం దుష్టం నిహతాశేషబాంధవమ్।
క్రోధేన ప్రజ్వలంతం చ జగద్విప్లవకారిణమ్॥
మహాసురం మహాసత్త్వం భండం చండపరాక్రమమ్।
మహాకామేశ్వరాస్త్రేణ సహస్రాదిత్యవర్చసా ।
గతాసుమకరోన్మాతా లలితా పరమేశ్వరీ॥
తదస్త్రజ్వాలయాక్రాంతం శూన్యకం తస్య పట్టనమ్।
సస్త్రీకం చ సబాలం చ సగోష్ఠధనధాన్యకమ్॥
నిర్దగ్ధమాసీత్సహసా స్థలమాత్రమశిష్యత।
భండస్య సంక్షయేణాసీత్రైలోక్యం హర్షనర్తితమ్।
ఇత్థం విధాయ సురకార్యమనింద్యశీలా శ్రీచక్రరాజరథమండలమండనశ్రీః।
కామేశ్వరీ త్రిజగతాం జననీ బభాసే విద్యోతమానవిభవా విజయశ్రీయాఢ్యా॥
సైన్యం సమస్తమపీ సంగరకర్మఖీన్నం భండాసురప్రబలబాణకృశానుతప్తమ్।
అస్తం గతే సవితరి ప్రథితప్రభావా।
శ్రీదేవతాశిబిరమాత్మన ఆనినాయ॥
యో భండదానవవధం లలితాంబయేమం।
క్లుప్తం సకృత్పరతి తస్య తపోధనేంద్ర।
నాశం ప్రయాంతి కదనాని ధృతాష్టసిద్ధేర్భుక్తిశ్చ ముక్తిరపి వర్తత ఏవ హస్తే॥
ఇమం పవిత్రం లలితాపరాక్రమం।
సమస్తాపాపఘ్నమశేషసిద్ధిదమ్ ।
పఠంతి పుణ్యేషు దినేషు యే నరా।
భజంతి తే భాగ్యసమృద్ధిముత్తమామ్॥
ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే
భండాసురవధో నామైకోనత్రింశోఽధ్యాయః॥
సమాప్తం చ యుద్ధఖండమ్॥
ఆ తరువాత ఉభయ సేనలకు యుద్ధము జరిగినది. ప్రసరించు బాణములతో ఒక సమూహముగా యుద్ధభూమిపై చిమ్మచీకటులు కప్పబడినవి-47. గజసమూహములు చంపబడుచుండెను. వానినుండి రక్తబిందువులు ప్రసరించుచుండెను. రాక్షసుల శిరముల పైకప్పుగానున్న తెల్లగొడుగులు హరింపబడుచున్నవి-48. దిక్కులుగాని, ఆకాశముగాని, యేనుగులుగాని, భూమికాని వేయేల నేమియు గనబడుటలేదు. కేవలము అచట అంతట వ్యాపించీ కప్పిన ధూలి కనబడుచున్నదీ-49. యుద్ధము జేయుచున్న యుభయ సేనల రక్తమొక నదియై ప్రవహించినది. తలలు తెగి నాట్యమాడుచున్న మొండెములు ఒడ్లలో కుప్పజెప్పలై చేరుటచే అచట వృక్షముల నవీ యావిష్కరించినట్లున్నవి. రాక్షసులతలెంట్రుకల గుంపులు నాచుగానుండి యానదీని కోమలగా జేసినవి. తెగిపడిన వెల్లగొడుగులు ఆ నదికి తెల్లకమలములవలె బ్రకాశించుచున్నవి. చక్రములచే తెగిపడిన యేనుగుపాదములు ఆనదిలో తాబేళ్ల వరుసల వలె శోభిల్లుచున్నవి-51.శక్తులచే ఖండింపబడిన మహారాక్షసుల గళములు చెక్కిల్బును ఆ నదీలో గండశిలలుగా దొరలుచున్నవి. కాండములు (పట్టుకొను కట్టెలు) తెగిపడిన సైనికుల చామరములు. ఆనది నురగలవలె శోభిల్లుచున్నవి-52. వాడియైన కత్తులనెడి తీగల గుంపులతో దట్టముగా జేయబడిన తీరప్రదేశములు గలిగియున్నది. మృతరాక్షసవీరుల కండ్లవరుసలు మౌక్తిక సంపుటముల వలె నొప్పుచున్నవి. (ముత్యాల మూటలవలేను ముక్తి స్థానములవలేను నొప్పుచున్నవి). రాక్షసుల నూర్లకొలది వాహన సమూహములన్నియు ఆ నదిలో మొసళ్లవలేను మీనముల వలెను బ్రకాశించుచున్నవి. ఈ విధముగా యుద్దము చేయుచున్న యుభయ సేనల రక్తనది ఒక నదివలెనే ప్రవహించుచున్నది-54. ఈ విధముగా చతుర్ధ దీవసయుద్ధము ప్రాతఃకాలము మొదలుకొని రెండుజాముల వరకు మృత్యుభయంకరమై యుభయ సేనల మధ్య జరిగెను-55. ఆ తరువాత భండాసురునకు లలితాదేవితో యుద్దమయ్యేను. అస్త్ర ప్రత్యస్తముల సంక్షోభములతో దీకుల తటములు దొమ్మీగానైనవి. దిక్కులు విడివిడిగా తెలియనంతగా గలిసినవి-56. ధనువుల సొరీరంకారములచేతను హుంకారముల చేతను రణము మిక్కిలి భయంకరముగా నున్నది. లలితాదేవియొక్క చేతి నైపుణ్యమున ప్రాణహారి బాణములు అమ్ములపొదీయను ముఖము నుండి ప్రయోగింపబడుచున్నవా? లేక ధనువునుండి ప్రయోగింపబడుచున్నవా? అనిపించు చున్నది. ఆ వేగమున నేదియు స్పష్టముగ దెలియుటలేదు-57. ఓ యగస్త్యా! యుద్ధమున ఆమే శరప్రయోగ నైపుణ్యమంతయు జెప్పేద వినుము-58. ఆమె బాణమునెక్కుబెట్టినపు డొకటీగనే యుండును. ధనస్సు నుండి విడివడినపుడు పదియగును. పోవునపుడు నూరగును. ఇక దైత్య సైన్యమును జేరినపుడు వేయియగును. దైత్యుల శరీరములదాకినపుడు ఆబాణములు కోటి సంఖ్యలే తాకును-59. మహారాజ్ఞియైన లలితాదేవీ తనబాణములచేత గాఢాంధకారమును సృజించినది. ఆకాశమును, బ్రద్దలుకొట్టినది. తరువాత ప్రచండుని యొక్క మర్మములను ఛేదించినది-60. తరువాత భండాసురునీ కన్నులు కోపముచే నెఱనైనవి. వాడు మహేశ్వరిపై శరజాలమును వర్షించెను-61. వాడు అంధతామిస్రమను వస్త్రమును ప్రయోగించెను. మహేశ్వరి దానిని మహాతరణి (సూర్యుడి) అను బాణముచేత నివారించేను-62. మహావీరుడు భండుడు రణమున ఖండాస్త్రమును ప్రయోగించెను, జగదంబ దాని నివారణమునకై గాయత్ర్యస్తమును సృజించి ప్రయోగించెను-63. భండుడు శక్తుల దృష్టి వినాశకమైన యధాస్త్రమును సృజించి ప్రయోగించెను. లలితాదేవి చాక్షుష్మతమను మహాస్త్రముతో దానిని శమింపజేసెను-64. భండుడు మహారణమున శక్తినాశమను వస్త్రమును బ్రయోగించెను. లలితాదేవి విశ్వావసువను (సూర్యుడను) సస్తముతో వాని మదమును బోగొట్టేను-65. కోపించిన భండాసురుడు గోప్పదైన అంతకాస్త్రమును సృష్టించి ప్రయోగించెను. లలితాదేవి మహామృత్యుంజయాస్త్రముతో దానిని నశింపజేసెను-66. భండుడు సర్వాస్తస్మతీ నాశనను నస్త్రమును బ్రయోగించేను. చక్రేశ్వరియైన లలిత ధారణాస్త్రమును (మేధా-అనునస్త్రమున)దాని బలమును నశింపజేసెను-67. శక్తులకు భయమును గలుగుజేయుటకు భండుడు భయాస్త్రమును బ్రయోగించెను అంబిక అభయంకరమైన టైంద్రాస్త్రమును ప్రయోగించి యాభయమును నివారించేను-68. భండాసురుడు - శక్తి సేనలలో మహారోగాస్త్రమును ప్రయోగించెను. దానివల్ల రాజయక్ష్మ మొదలగు వేలకొలది రోగములు శక్తిసేనలో గలిగినవి-69. దాని నివారణ సిద్ధికై లలితాపరమేశ్వరి సామత్రయమహామంత్రమహాస్త్రమును ప్రయోగించెను-70. అపుడు బాణమునుండి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడును బయలుదేరి హుంకారమాత్రమున రోగములనన్నింటిని దహించి ముదమును బొందించెను-71. వారు మహేశ్వరికి నమస్కరించి ముల్లోకములో ఆమెభక్తుల రోగముల నశింపజేయుటకై నీయోగింపబడి తమస్థానములకు వెడలిరి-72. భండాసురుడు ఆయుర్నాశనాస్త్రమును బ్రయోగించెను. దానికి కాలసంకర్షణీ యనునస్త్రమును దేవి ప్రయోగించెను-73. భండాసురుడు గొప్పనైన మహాసురాస్త్రమును సృజించి ప్రయోగించెను. దానినుండి వేలకొలది మహాకాయులు మహాబలులు నైన-74. మధువు, కైటభుడు, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, చండముండాది రాక్షసులు. పుట్టిరీ-75. చిక్షుభుడు, పామరుడు, రక్తబీజరాక్షసుడు (తన రక్తమునుండి రాక్షసులననేకుల బుట్టింపగలవాడు), శుంభుడు, నిశుంభుడు, మహాబలులైన కాలకేయులు-76. ధూములను వారు, మరికొందరు. ఆయస్త్రమునుండి బయలుదేరిరి. వారందరు రాక్షసశ్రేష్టులు, వారు తమకఠినములైన శస్త్రసమూహములతో-77. శత్రు సేనను మర్ధించిరి. భయంకరముగా గర్జించిరి. దైత్యులచే మగ్గింపబడి సేనాశక్తులు హాహాయని యరచుచు వేగముగా రక్షింపుము రక్షింపుము అని లలితాదేవిని శరణము పొందిరి. అంత దేవి మీక్కిలి కోపించినదై కోపముతో పెద్దగా నట్టహాసము చేసేను-79. ఆయట్టహాసమునుండి దుర్గయను నొక యశస్విని (కీర్తిగలది) బయలుదేరినదీ, ఆమే సమస్త దేవతేజములతో నిర్మింపబడిన విశ్వరూపిణి-80. ఆమెకు శూలి (ఈశ్వరుడు) శూలమునిచ్చెను. చక్రి (విష్ణువు) చక్రమునిచ్చెను. వరుణుడు శంఖమునిచ్యెను. అగ్ని శక్తినిచ్చెను-81. మహాయుద్ధమునకై మరుత్తు (వాయువు)ధనువును అక్షయ తూణీరములను (అమ్ములపొదులను) ఇచ్చెను. వజ్జీ (ఇంద్రుడు) వజ్రాయుధమునిచ్చెను. కుబేరుడు . చషకమును (పానపాత్రము)ఇచ్చెను-82. యముడు కాలదండమును, మహాదండమును, పాశమును పాశధరుడు (యముడు)ఇచ్చెను. బ్రహ్మ కుండికను (కమండలువును) ఇచ్చెను. బరావతము ఘంటనిచ్చెను-83. మృత్యుదేవత ఖడ్గమును డాలును ఇచ్చెను. సముద్రము షోరము నిచ్చెను. విశ్వకర్మ భూషణములనిచ్చెను. ఆమె యంగములు సూర్యుల పంక్తులా యన్నట్లు కిరణములతో ప్రకాశించుచు తాను ధరించిన సమస్తాయుధములను ప్రకాశింపజేయుచున్నవి-85. ఇంకను ఇతరులు ఇతరములైన పరికరములనిచ్చిరి. వీటనన్నింటిని ధరించి దుర్గ యుజ్వలముగా బ్రకాశించేను. సింహవాహనమునెక్కి నారాయణీ యుద్ధముజేసెను -86. ఆమె మహిషాసురుడు మొదలగు దానవులను జంపెను. చండీక పూర్వము సప్తశతిలో జేసినట్లే-87. యిచటగూడ మహిషాది దానవుల జంపెను. ఆ దుష్కరమైన పనిని నిర్వహించి యా లలితకు నమస్కరించెను -88. ఇంతలో దుష్టుడే భండాసురుడు శక్తిసేనలో మూకాస్త్రమును బ్రయోగించెను. జగజ్జనని దానికి మహా వాగ్వాదీని యనునస్త్రమును సృజించి ప్రయోగించెను-89. అట సమరమున భండాసురుడు విద్యారూపమైన వేదమును దొంగిలించు రాక్షసాధములను సృజించెను -90. మహారాజ్ఞి కుడిచేతి యంగుష్ఠనఖము నుండి తిరస్కరించెను. అప్పుడు భండాసురుడు మహావీరుడు రణమున అర్ణవాస్త్రమును సృజించెను-91. అట గొప్పనైన జల ప్రవాహమున శక్తి సైన్యము మునిగెను. అంత, లలితాదేవి కుడిచేతి చూపుడువ్రేలి గోటినుండి ఆదీకూర్మము (తాబేటి రూపమునున్న విష్ణువు) ఒక యోజనము పొడవు వెడల్పు గలదై పుట్టెను-92. దాని విశాలమైన చిప్పచే ధరింపబడిన వారై శక్తులు హర్షమును బొంది భయమును వదలిరీ-94. కూర్మరూపియైన భగవంతుడు ఆ సముద్ర జలమునంతయు ద్రాగివైచెను. అంతదుష్ట రాక్షసుడు హైరాణ్యాక్షమను మహాస్త్రమును వదిలేను-94. దాని నుండి గదాయుధులైన వేలకొలదీ హిరణ్యాక్షులు బుట్టిరి. వారిచే కొట్టబడుచున్న శక్తి సైన్యము భయముతో వివశమైనది. ఇటునటు పరుగిడి యుద్దకర్మలో శిథిలమైనది-95. తరువాత శ్రీలలితాదేవి కుడిచేతి నడిమీ వ్రేలిగోటి నుండి కైలాసమువలే తెల్లనైన మహా వరాహము పుట్టినదీ-96, ఆ వజ్రసమానమైన వరాహముతో చీల్చిబడినవారై కోట్లకొలది. హిరణ్యాక్షులు మర్ధింపడుచు నశించిరి-97. అంత భండుడతిక్రోధమున కనుబొమ్మల ముడిచెను. దాని నుండి కోటి సంఖ్యలతో హిరణ్యులు (హిరణ్యకశిపులు) పుట్టిరి-98. వారు మండుచున్న సూర్యుని వలె బ్రకాశించువారు. దీప్తాయుధములు గలవారు. వారు శక్తిసైన్యమును ప్రహ్లాదుని మర్థించిరి-99. వాస్తవముగా శక్తుల యొక్క ప్రహ్లాదమే ప్రహ్లాదభోలకరూపమున హీరణ్యునిచే పీడింపబడేను-100. లలితను శరణుబొందీ యామెకృపను బొందెను. తరువాత, శక్త్యానంద రూపుడైన ప్రహ్లాదుని రక్షించుటకై-101. మహేశ్వరి కుడిచేయి యుంగరపు వేలిగోటిని విదిలించేను. దానినుండి పైకెగసిన జూలుగలిగి, మండుచున్న మూడు కన్నులుగలిగి-102. క్రూరముఖము గలిగి, కంఠము క్రింద పురుషాకారుడై విష్ణుని యవతారమైన నరసింహుడు జనించెను. అతనికి గోళ్లు ఆయుధములు. ప్రళయకాలరుద్రరూపుడు, భయంకరముగా నట్టహాసము జేయువాడు-103. వేయిభుజములు గలవాడు. లలితాదేవీ యాజ్ఞను పాలించువాడు. అతడు భండభ్రుకుటినుండి పుట్టిన-104. హిరణకశిపులందరిని క్షణములో వజ్రమువలె కఠినములైన గోళ్లతో చీల్చెను. అపుడు భండమహాసురుడు లలితాదేవిపై దైవత వినాశకమూ భయంకరమైన బలీంద్రాస్త్రమును ప్రయోగించెను-105. అంత, మహారాజ్ఞి యొక్క కుడిచేతి చిటికెన వ్రేలికొననుండి గొప్ప ఓజోవంతులైన నూర్లకొలది వామనులు ఆ బలీంద్రాస్త్రదర్పమును నశింపజేయుటకై పుట్టిరీ-106. పోరు క్షణక్షణము వృద్ధిబొందుచు మహాబలులై పాశహస్తులై అస్త్రమున బుట్టిన బలీంద్రులను, పాశములతో బంధించిరి-107. లలితాదేవి కుడిచేతి చిటికెన వ్రేలికొననుండి పుట్టిన మహాకాయులు మహోత్సాహలు మహాకామేశ యోషితులు (మహాకామేశుని స్త్రీలు) ఆ బలీంద్రాస్త్రమును నశింపజేసిరి-108. భండాసురుడు రణరంగమున హైహయాస్త్రమును సృజించెను. దాని నుండి వేలకొలది కోట్ల కొలది సహస్రార్జునులు (సహస్రహస్తములుగల యర్జునులు) పుట్టిరి-109. అపుడు శ్రీ లలితాదేవి యొక్క యెడమ చేతిబోటన వేలిగోటినుండి పరశురాముడు పుట్టెను. అతడు కోపముతో మండిపడుచు సింహనాదము జేయుచు కఠినమైన తన గండ్రగొడ్డలి యంచున నీ వేలకొలది కార్తవీర్యార్జునులను చీల్చి చంపెను-111. అపుడు కోపించిన భండాసురుడు హుంకరించెను. దానినుండి చంద్రహాస ఖడ్గమును గలిగి-112. సహస్రాక్షాహీణుల రాక్షససేనతో గూడి కనిష్ఠుడైన కుంభకర్ణుని మేఘనాధుని నందనుని దీసికొని రావణుడు శక్తిసైన్యమును చాలావరకు మర్ధించెను-113. తరువాత లలితాదేవి ఎడమచేతి చూపుడువ్రేలి గోటి నుండి లక్ష్మణునితోబాటు కోదండరాముడు పుట్టెను -114. జడలే కిరీటముగా గలిగి, తీవలతో వీపున నమ్ముల పొదలు గట్టుకొని, నల్ల కలువరేకు వంటి చాయగలిగీ మాటిమాటికీ ధనువును అగుచు-115. దివ్యాస్తములతో క్షణకాలముననే రాక్షస సైన్యమును నశింపజేసెను. తరువాత రావణుని, అతనీతమ్ముడైన కుంభకర్ణుని మర్ధించెను. లక్ష్మణుడు మహావీరుడైన మేఘనాదునీ నశింపజేసెను-116. అంత, భండాసురుడు మహాభయంకరుడైన ద్వివిదాస్రుని సృజించెను. అతని నుండి పింగళలోచనములుగల కపులు అనేకముగా జనించినరి-117. వారు కోపముతో మిక్కిలి యొనైన ముఖములుగలిగి, వారిలోనొక్కక్కరు హనుమంతునితో సమానముగా నుండగా, క్రూరమైన క్రేంకారములజేయుచు శక్తి సైన్యమును నశింపజేసిరీ-118. అంత, శ్రీలలిత ఎడమచేతి నడిమిట్రేలిగోటినుండి బలరాముడు పుట్టెను, ఆతని కన్నులు క్రోధముతో నెఱనైనవి-119. నల్లని వస్త్రములు గప్పుకోన్నవాడు, కైలాసపర్వతమువలే నిర్మలధవళుడు. అతడు ద్వివిదా సంభూతులైన కపులందరిని నశింపజేసెను. మహాబలుడైన భండుడు రాజాసురమను మహాస్త్రమును సృజించెను. అయస్త్రము నుండి యనేకులు రాజరాక్షసులు పుట్టిరి-121. వారు శిశుపాలుడు, దంతవక్రుడు, శల్వుడు, కాశీపతి, పౌండ్రకుడు, వాసుదేవుడు, రుక్మి, డింభకహంసకులు-122. శంబరుడు, ప్రలంబుడు, బాణాసురుడు, కంసుడు, చాణూరమల్లుడు, ముష్టికోత్పల శేఖరులు-123. అరిష్ణుడు, ధేనుకుడు, కేశి, కాళీయుడు, యమలార్జునులు, పూతన, శకటుడు, తృణావర్తుడు మొదలగు రాజరాక్షసులు-124. మహా వీరుడైన నరకుడు, విష్ణురూపియైన మురాసురుడు అనేకులు సేనలతోబాటు శస్త్రపాణులై బయలుదేరిరి-125. వారినందరిని జంపుటకు శ్రీదేవి యొక్క యెడమ చేతియుంగరపు వేలిగోటినుండి బుట్టినవాడు, సనాతనుడైన వాసుదేవుడు-126. చతుర్వ్యూహమును విస్తరింపజేసెను. దాని నుండి నలుగురు పుట్టిరి. వాసుదేవుడు, రెండవవాడు సంకర్షణుడనబడెను-127. ప్రద్యుమ్నుడు, అనిరుద్దడును. వీరందరు ఆయుధముల నెత్తినవారై దురాచారులు, భూమికీ భారమును బెంచినవారును-128. రాజవేషమున దాగియున్న మహాసురులను నశింపజేసిరి-129. వారు నశింపగా కోపించిన భండాసురుడు ధర్మవిప్లవము జేయు భయంకరమైన కల్యస్త్రమును వదిలెను-130. ఆ కల్యస్తము నుండి రాజులైన ఆంధ్రులు , పుండ్రులును పాపకృత్తులైన కిరాతకులు, శబరులు, హూణులు, యవనులును-131. వేదవిప్లొవకులు, ధర్మద్రోహులు, ప్రాణహింసకులు, వర్ణాశ్రమములతో సాంకర్య కారకులు, మలినములైన యంగములు గలవారును బుట్టిరి, వారు లలితాసైన్యములను మాటిమాటికి మర్ధించిరి-132. అంత, ప్రకాశించుచున్న లలితాదేవి ఎడమచేతి చిటికెన వ్రేలిగోటినుండి బుట్టిన జనార్దనుడు (విష్ణువు)-133. అశ్వారూఢుడై ప్రదీప్తమైన సీరిగలగీ అట్టహాసమునుజేసెను. వజ్రము యొక్క యొరపిడికి బంధువైన యాయట్టహాస ధ్వనికి కిరాతులందరు మూర్చితులై యుద్ధము జేయనశక్తులైరి. శక్తులు గూడ సంతసించిరి. దశావతార సాథులైన వారందరు (నరసింహాదులందరు) ఈ దుష్కరమైన శత్రునాశనకర్మను జేసి-135. లలితాంబకు నమస్కరించి చేతులు జోడించి నిలిచిరి. లలితాంబ వారిని ప్రతికల్పములోను ముత్యాది (ముత్స్యావతారాది) జన్మలతో ధర్మరక్షణము జేయుటకు నియోగించెను. తరువాత వారు వైకుంఠమునకు వెడలిరి-136. ఈ విధముగా అన్ని యస్త్రములు నశింపజేయబడగా, దురాశయుడైన భండాసురుడు మహామోహాస్త్రమును సృజించెను. దానివలన శక్తులు మూర్చిల్లిరి-137. అంబ శాంభవాస్త్రమును వదలి యా మహామోహాస్త్రమును నశింపజేసెను. ఈవిధముగా అప్రత్యస్త్రధారలచే మహాయుద్ధము జరుగగా, సూర్యుడెఱనై యస్తాది. జేరుటకు మొదలిడేను-138. ఆ పిమ్మట లలితాంబిక నారాయణాస్త్రముతో భండాసురుని సమస్తాక్షౌహిణుల సైన్యమును రణమున భస్మముజేసెను-139. తరువాత మండుచున్న కాలాగ్ని కాంతి గల పాశుపతాస్త్రముతో లలితాంబా మహారాజ్ఞి యిరువది నాలుగు సేనానాయకులను హతమార్చెను-140. ఇకదుష్టుడైన భండాసరుడొక్కడే మిగిలెను. సమస్త బొంధవజనము హతమయ్యెను. అపుడు జగద్విప్లవకారియు, కోపముచే మండుచున్నవాడును-141. మహారాక్షసుడు, మహాబలుడు, భయంకర పరాక్రమముగలవాడునైన భండాసురుని వేయిసూర్యులవతే ప్రకాశముగల మహాకామేశ్వరాస్త్రముతో మాతయైన లలితా పరమేశ్వరీ చంపివైచేను-142. అతని పట్టణమైన శూన్యకనగరము స్త్రీ-బాల-గోష్ఠధన ధాన్యములతోబాటు ఆకామేశ్వరాస్త్రజ్వలలచే వెంటనే యాక్రాంతమై-143. నిర్దగ్ధమయ్యెను. కేవలము స్థలము మాత్రము మిగిలినది. భండాసురుని మరణముచే ముల్లోకములు హర్షించి నాట్యముజేసెను-144. అనింద్యశీలయు, శ్రీచక్రరాజ రథమండలమున కలంకార సంపదయైనదియు, త్రిజగత్తుల జననియు, ప్రకాశించు వైభవముగలదియు నైన కామేశ్వరీదేవి యీవిధముగా దేవకార్యమైన భండాసుర వధమును నిర్వర్తించి విజయశ్రీతో నొప్పినదై-145 మహాప్రభావముగలదై సూర్యుడస్తమింపగనే యుద్దచర్యలచే భిన్నమై, భండాసురుని ప్రబలబాణాగ్నితో తపించిన సమస్త సైన్యమును తన శ్రీదేవతా శిబిరమునకు దీసికొనివచ్చెను-146. ఓ తపోధనశ్రేష్టా! క్లుప్తముగానున్న ఈ బంధాసుర వధమును ఒక్కమారైనను పరించిన వానికి యుద్ధములు నశించును. అష్టసిద్దులు సిద్ధించును. భుక్తియు ముక్తియు వినియరచేతిలో నుండును-147. ఈ పవిత్రమును, సమస్త పాపనాశకమును, సమస్త సిద్ధులనిచ్చునదియు నైన లలితా పరాక్రమమును పుణ్యదినములలో పఠించువారు ఉత్తమ భాగ్యసమృద్ధిని బొందెదదరు-148.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున భండాసురవధమను నిరువదితొమ్మిదవ యధ్యాయము- యుద్ధఖండము సమాప్తము.
Summary of chapter 141 of the Brahmānda Mahā Purana is as follows:
Delving into deep Tantric philosophy, this chapter reveals the intricate geometry and mystical significance of the nine enclosures of the Śrī Cakra. It explains how the central point, or Bindu, represents the unmanifest non-dual reality from which the entire universe expands through divine love. The devout reader engages in contemplative meditation, visualizing the sacred geometry to dissolve all sense of separation between the individual soul and the cosmic mother.