బ్రహ్మాండ మహా పురాణము
50 - సగరుఁడు ఔర్వాశ్రమమున కరుగుట
జైమినిరువాచ :-
ఏవం స రాజా విధివత్పాలయామాస మేదినీమ్ ।
సప్తద్వీపవతీం సమ్యక్సాక్షాద్ధర్మ ఇవాపరః ॥
బ్రాహ్మణాదీంస్తథా వర్ణాన్స్వేస్వే ధర్మే పృథక్పృథక్ ।
స్థాపయిత్వా యధాన్యాయం రరక్షావ్యాహతేంద్రియః ॥
ప్రజాశ్చ సర్వవర్గేషు యథాశ్రేష్ఠానువర్తినః ।
వర్ణాంశైవానులోమ్యేన తద్వదధేషు చ క్రమాత్ ॥
న సతి స్థవిరే బాలం మృత్యురభ్యుపగచ్ఛతి ।
సర్వవర్ణేషు భూపాలే మహీం తస్మిన్ ప్రశాసతి ॥
సీతాన్యపేతబాధాని తదా రాష్ట్రాణి కృత్నతః ।
తేష్వసంఖ్యా జనపదాశ్చాతుర్వర్ణ్యజనావృతాః ॥
తే చాసంఖ్యగృహగ్రామశతోపేతా విభాగశః ।
దేశాశ్చావాసభూయిషా నృపే తస్మిన్ ప్రశాసతి ॥
అనాశ్రమీ ద్విజః కశ్చిన్న బభూవ తదా భువి ।
ప్రజానాం సర్వవర్ణేషు ప్రారంభాః ఫలదాయినః ॥
స్వోచితాన్యేవ కర్మాణి ప్రారంభంతే చ మానవాః ।
పురుషార్టోపసన్నాని కర్మాణి చ తదా నృణామ్ ॥
మహోత్సవసముద్యుక్తాః పురగ్రామప్రజాకరాః ।
అన్యోన్యప్రియకామాశ్చ రాజభక్తిసమన్వితాః ॥
న నిందితో భిశస్తో నా దరిద్రో వ్యాధితోపి పో ।
ప్రజాసు కచ్చిల్లట్టో వా కృపతో వారికి నాభవత్ ॥
జనాః పరగుణప్రీతాః స్వసంపరాభికాంక్షిణః ।
గురుషు ప్రణతా నిత్యం సద్విద్యావ్యసనాదృతాః ॥
పరాపవాదభీతాశ్చ స్వదారరతయోలినీశమ్ ।
నిసర్గాళలసంసర్గవీరతా ధర్మతత్పరాః ॥
ఆస్తికాః సర్వశోభూవన్ ప్రజాస్తస్మిన్ ప్రశాపతి ।
ఏవం సుబాహుతనయే స్వప్రతాపార్ణితాం మహీమ్ ॥
ఋతవశ్చ మహాభాగ యథాకాలానువర్తినః ।
శాలిభూయిష్ఠసస్యాధ్యా సదైవ సకలా మహీ ॥
బభూవ నృపశార్దూలే తస్మిన్ రాజ్యం ప్రశాసతి ॥
జైమిని ఇట్లు చెప్పెను :
ఈ విధముగా రాజు భూమినంతటినీ విధియుతముగ పాలించెను. సప్తద్వీపవతియగు మేదినీ, సాక్షాధర్మమున కపరమూర్తివలె ఆతడేలెను. బ్రాహ్మణులు మొదలగు నాయా వర్ణముల వారిని వారి వారీ ధర్మ నిర్వాహణమున స్థాపించెను. ఇంద్రియములచే అవ్యావృతుఁడయి ఇంద్రియ నిగ్రహము గలిగి న్యాయము నతిక్రమింపకుండ రాజు పాలించెను. సర్వవర్ణములయందు. ప్రజలు వారిలో శ్రేష్టులయిన వారి ననుసరించి వర్తించిరి. సర్వవర్ణముల వారు తమ పద్ధతిని వర్ణక్రమాదుల యుత్తమత్వమును ననుసరించిరి. వారు వారి ఆశయములను సౌఖ్యముగా ననుభవించిరి. రాజు రాజ్యము చేయుచుండ ముదుసలులు బ్రతికియుండగా మృత్యువు బాలలను చెనకకుండెను. (4) అడ్డంకులు బాధలు లేకయే, రాష్ట్రమంతయు సర్వత్ర పుష్టి నొందెను. దేశమున అసంఖ్యాకములయిన జనపదములుండెను. అందు, చతుర్వర్ణ ప్రజలు జీవించుచుండిరి. (5) ఆ జనపదములు గృహగ్రామ శతములచే నిండియుండెను. రాజు రాజ్యము సలుప దేశములావాసభూయిష్ఠమలు, ఆ దేశములో అనాశ్రమియైన ద్విజుఁడొక్కడును లేఁడు. సర్వ ప్రజలయందు సర్వవర్గములయందు ఆరంభించిన కార్యములు ఫలప్రదములు. మానవులందరు తమకు చితములయిన కర్మలనే చేయుచుండిరి. మానవుల కర్మలన్నియు చతుర్విధ పురుషార్టోపన్నములు. పురములు గ్రామములు మహోత్సవ సముద్యుక్తములు. ప్రజలందరు పరస్పర ప్రీయమును కోరెడువారు. రాజభక్తి సమన్వితులు. ప్రజలలో నెవ్వడును నిందితుఁడు కాడు, శపుండు కాఁడు, దరిద్రుఁడు కాఁడు వ్యాధి పీడితుఁడు కాఁడు, లుబ్ధుఁడు కాని కృపణుఁడుకాని కాఁడు. ప్రజలు పరగుణముల యందు ప్రీతిగలవారు. ఉత్తములతో సంపర్కమును . కాంక్షించువారు. గురువులకునమస్కరించు వినయులు. సద్విద్యను నేర్చెడు వ్యసనము నండాసక్తి కలవారు. వారందరు పరాపవాదభీతులు. స్వభార్యారతులు. స్వభావముచే ఖలులతోడి సంసర్గమునకు విముఖులు, ధర్మతత్పరులు. సగరుడు భూమీని శాసింప ప్రజలందరాస్తికులు. ఈ విధముగా సుభహుతనయుఁడయిన సగరుడు, తన ప్రతాపముచే నార్జించిన భూమీనీ, పరిపాలించెను. ఋతువులు యథాకాలానుగములు. భూమియందు శాలి, ధాన్య, సస్యమధికముగా గలిగిన నృపశార్దూలుఁడు రాజ్యము పాలింప సర్వము సుభిక్షమై యొప్పెను.
యస్యాష్టాదశమండలాధిపతిభిః సేవార్ధమభ్యాగతైః ।
ప్రఖ్యాతోరుపరాక్రమై ర్పృపశతైర్మూర్ధాభిషిక్తైః పృథక్ ॥
సంవిష్టైర్మణీవిష్ణరేషు నితరామధ్యస్యమానామరైః ।
శక్రస్యైవ వీరాజితే దివిసభా రత్నప్రభోద్భాసితా ॥
సంకేతావిషయాంతరాభ్యుపగమాః సర్వేపి సోపాయనాః కృత్వాసైన్యనివేశనాని పరితఃపుర్యాః పృథక్ పార్థివాః ।
ద్రష్టుం కాంక్షితరాజకాః సతనయా విజ్ఞాపయంతో ముహుర్గాస్దైరేవ నరేశ్వరాయ సుచిరం వత్స్యంతమంతఃపురే ॥
నమన్నరేంద్రముకుటశ్రేణీనామతీఘర్షణాత్ ।
కిణీకృతా విరాజైతే చరణా తస్య భూభుజః ॥
సేవాగతనరేంద్రౌఘవినికీర్ణిః సమంతతః ।
రత్నైర్భాతి సభా తస్య గుహా సోమే రవీ యథా ॥
ఏవం స రాజా ధర్మేణ భాసువంశశిఖామణిః ।
అనన్య శాసనాముర్వీమన్వశాసదరిందమః ॥
ఇత్ధం పాలయతః పృధ్వీం సగరస్య మహీపతేః ।
న చాపపాత ముత్ పుర్రముఖాలోకనజృంభితా ॥
వినా తం దుఃఖితో వ్యర్థం చింతయామాస నైకథా ।
అహో ! కష్టమపుత్రోహమస్మిన్వంశే ధ్రువం తు యత్ ॥
ప్రయాంతి నూనమస్మాకం పితరః పిండవిప్లవమ్ ।
నిరయాదపి సత్పుత్రే సంజాతే పితరః కిల ॥
ప్రీత్యా ప్రయాంతి తధేహం జాతకర్మక్రియోత్సుకాః ।
మహతా సుకృతేనాపి సంప్రాప్తస్య దీవం కిల ॥
అపుత్రస్యామరాః సర్గే ద్వారం నోద్ఘాటయంతి హి ।
పితా తు లోకముభయోః స్వర్లోకం తత్పితామహాః ॥
జేష్యంతి కిల సత్పుత్రే జాతే వంశద్వయేపి చ ।
అనపత్యతయాహం తు పుత్రీణాం యా భవేద్గతిః ॥
నతాం ప్రాప్స్యామి వై నూనం సుదుర్లభతరా హి సా ।
పదాదైంద్రాతిలాభిన్నమృద్ధం రాజ్యమఖండితమ్ ॥
మమ యత్తదపుణ్యస్య యాతి నిష్ఫలతామిహ ।
ఇదం మత్పూర్వజై రేవ సింహాసన మధిష్ఠితమ్ ॥
ఆతని రాజసభ రత్నప్రభలచే నుద్భాసించుచు, అమరావతి యందలి ఇంద్రసభవలె ప్రకాశించును. ఇంద్రుని యొక్క సభ, ఆసనములు మణులచే నలంకరింపఁబడి దేవతలచే నాసీనములై యుండునట్లు సగరుని రాజసభ సేవార్థ మరుదెంచిన అష్టాదశ మండలాధిపులచే, ప్రఖ్యాలోరు పరాక్రమాన్వితులతో మూర్థాభిషిక్తులతో నలంకృతము. వారందరు రాజ సేవార్థమరుదెంచినవారే. వారందరు ప్రత్యేక మణిమయా సనములనుపవసించిరి. సామంతరాజులు వివిధ మండలముల నుండి ఉపాయనములతో ప్రభువును దర్శించుటకు వచ్చిరి. అట్టి సమయములలో ఆ సామంత నృపులు తమ సైన్య నివేశనములను, పట్టణము చుట్టును ప్రత్యేకముగా నిర్మించిరి. వారి వారి పుత్రులతో ప్రభువును దర్శింష కాంక్షితులై యుండిరి. వారు ద్వారమునందున్న ద్వారపాలకులచే నరేశ్వరునకు విజ్ఞాపన మంపుకొన, ఆ ద్వారపాలకులు రాజాంతఃపురమునందు చిరకాలము నుండి పోవుదురు. రాజ దర్శనమునకు అవకాశము విజ్ఞాపనమందించుటకు సమయము లభింప దుర్లభమయ్యెను. వచ్చి నమస్కరించు నరేంద్రుల యొక్క కిరీటపంక్తుల యొక్క అతిఘర్షణము వలన ఆ మహారాజేంద్రుని చరణములు కిణీభూతములై (కాయలుగా) ప్రకాశించెను.(18) సేవార్థ మరుగుదెంచిన నరేంద్ర సమూహములచే వినికీర్ణమై రాజసభ సమంతతః రత్నములు అనర్ఘమణులు సర్వత్ర ప్రకాశించుట వలన సుమేరు గుహవలె ప్రకాశించెను. ఏవం విధముగా భానువంశశిఖామణీయైన రాజు ధర్మబద్దముగా నరిందముఁడై అనన్యశాసనమయిన భూమిని పాలించెను. ఇట్లు సగరమహీపతి భూమిని పాలించుచుండ, ఆతనికి పుత్రముఖదర్శనము లేక రాజు అత్యంతము పలుమార్లు విచారించెను. అహో ! కష్టము సంప్రాప్తము. నేను అపుత్రకుఁడనైతిని. తన్మూలమున మావంశమున పితరులు పిండములు లేనివారగుదురు. వంశమున ఒక్క సత్పుత్రుండు జనింప, పీతరులు, నరకము నుండి కూడ జాతకర్మ క్రియోత్సుకులై తధృహమున కరుదెంచెదరు. అత్యంత సుకృతాచరణమున స్వర్గము సంప్రాప్తమయినను, అపుత్రకునకు దేవతలు స్వర్గద్వారమును తెరువరు, ఒక సత్పుత్రుండుద్బవింప, తండ్రి (పితరుఁడు) ఉభయలోకముల (ఈ లోకమున పరలోకమున) ఆనందమొందును. ఆతని పితామహులు, రెండు వంశముల యందు స్వర్లోకము నొందుదురు. పుత్ర ప్రాప్తి లేనందున, పుత్రవంతులకు గలుగు సద్గతినీ నేను నిజముగా పొందజాలను. అది సుదుర్లభతరము. నా సమృద్ధమైన అఖండ రాజ్యము. ఇంద్ర రాజ్యముకంటే భిన్నమయినది కాదు. నాకీ పుణ్యము లేనందున ఆ టైశ్వర్యాదులు నిష్ఫలములు. నాకు పుత్రులు లేనందున మా పూర్వులచే నధిష్టితమయిన యీ సింహాసనము
అపుత్త్రత్వేన రాజ్యం చ పరాధీనత్వమేష్యతి ।
తస్మాదౌర్వాశ్రమమహం గత్వా తం మునిపుంగవమ్ ॥
ప్రసాదయిష్యే పుత్రార్థం భార్యాభ్యాం సహితో ధునా ।
గత్వా తస్మైత్వపుత్రత్వం వినివేద్య మహాత్మనే ॥
స యద్వక్ష్యతి తత్సర్వం కరిష్యే నాత్ర సంశయః ।
ఇతి సంచింత్య మనసా సగరో రాజసత్తమః ॥
ఇత్యేష కృత్యవిద్రాజగ్గంతుమౌర్వాశ్రమం ప్రతి ।
స మంత్రిప్రవరే రాజ్యం ప్రతిష్టాప్య తతో వనమ్ ॥
ప్రయయా రథమారుహ్య భార్యాభ్యాం సహితో ముదా ।
జగామ రథహోషేణ మేఘనాదాతిశంకిభిః ॥
సళేక్షణిర్లక్ష్యమాణా మార్గోపాంతే శిఖండిభిః ।
ప్రియాభ్యాం దర్శయనైజన్సారంగాంస్తిమితేక్షణాన్ ॥
క్షణమూర్ధ్వముఖాన్సద్యః పలాయనపరాన్ పునః ।
వృక్షాన్పుషఫలోపేతాన్వీలోక్య ముదితో భవతి ॥
అమ్లానకుసుమైః స్వాదుఫలైః శాద్వలభూమికైః ।
సుస్నిగ్ధపల్లవచ్ఛాయైరభితః సంభృతం నగైః ॥
చూతాగ్రపల్లవాస్వాదస్నిగ్ధకంఠపీకారవైః ।
శ్రోత్రాభిరామజనకైః సంఘృష్టం సర్వతోదిశమ్ ॥
సర్వర్తుకుసుమోపేతం భ్రమద్భమరమండితమ్ ।
ప్రసూనస్తబకానమవల్లరీవేల్లితద్రుమమ్ ॥
కపీయూధసమాక్రాంతవనస్పతీశతావృతమ్ ।
ఉన్మత్తశిఖసారంగకూజత్పక్షిగణాన్వీతమ్ ॥
గాయద్విద్యాధరవధూగీతికాసుమనోహరమ్ ।
సంచరత్కీన్నరీద్వంద్వవిరాజద్వనగహ్వరమ్ ॥
హంససారచక్రాహ్వకారండవశుకాదిభభిః ।
సుస్వరైరావృతోపాంతైః సరోభిః పరివారితమ్ ॥
సరస్స్వంబుజకట్టారకుసుమోత్పలరాశిషు ।
శనైః పరివహన్మందమారుతాపూర్ణదిజ్ముఖమ్ ॥
ఏవం విధగుణోపేతమధిగాహ్య తపోవనమ్ ।
గచ్ఛన్ రథేనాథ నృపః ప్రహర్షం పరమం యయౌ ॥
ఉపశాంతాశయః సోథ సంప్రాప్యాశ్రమమండలమ్ ।
భార్యాభ్యాం సహితః శ్రీమాన్వాహాదవరురోహ వై ॥
ఈ రాజ్యము పరాధీనత్వము నొందును. అందుచే ఔర్వాశ్రమమునకు భార్యాద్వయముతోపోయి ఆ ముని పుంగవుని పుత్రార్ధము ప్రసన్నుని చేసికొందును. ఇప్పుడు భార్యా సహితుఁడనై యరిగి నాయపుత్రత్వమును నివేదించెదను. ఆతఁడేది చెప్పిననది నిస్సంశయముగ నాచరింతును” అనీ రాజసత్తముఁడయిన సగరుఁడు మనస్సులో నీ విధముగా నాలోచించి, కార్యవిదుఁడు ఔర్యాశ్రమమునకు పోవుటకు, మంత్రి ప్రవరుని యందు రాజ్యమును ప్రతిష్టాపించి అరణ్యమునకు బయలు దేరెను. సంతోషముతో భార్యాద్వయముతో రథమారోహించెను. రథ ఘోష మేఘనాదమని అనుమానించి స్తిమిత దృక్కులతో నెమిళ్లచే చూడబడెను. స్తిమితేక్షణములయిన లేళ్లను ప్రియురాండ్రకు రాజు చూపించుచుండెను. తలలు పైకెత్తి వెంటనేదించి పలాయనపరములయిన లేళ్లను రాజు భార్యలకుఁజూ పెను. పుష్పఫలోపేతములయిన వృక్షములను చూచి రాజు ఆనందకంద ళుఁడయ్యెను. (35) వాడి పోవని పుష్పములతో, స్వాదుఫలములతో, పచ్చనిగరికభూములతో, దట్టము మధురమునయిన చిగుళ్ల నీడలతో, చుట్టును చెట్లు నిండి చెలువొందెను. మామిడి చిగుళ్లను తినుటచే స్నిగ్ధములైన కంఠములుగల పికరవములతో శోత్రాభిరామమై దిక్కులు సర్వత్ర నిండి యుండెను. సర్వర్తువుల వికసించు పుష్పములతోగూడి, వానిచుట్టును భ్రమించు భ్రమరములచే నలంకృతములై, ప్రసూనస్తబకములతో వంగిన లతలతో పెనవేసికొనబడినవృక్షములు, కపి సమూహములచే నిండి చెలగుచున్న వనస్పతీ శతావృతములు, మదించిన నెమళ్లు, సారంగములు మొదలగు కూజత్పక్షి గణావృతములు, పాడుచుండు విద్యాధర వధూగీతికా సుమనోహరములు, సంచరించు కీన్నరీ ద్వంద్వములచే ప్రకాశించు వనగహ్వరములు, హంసములు, సారసములు, చక్రవాకములు, కారండవములు, శుకములు మొదలగు వాని సుస్వరములతో నిండి పొలు పొందు సరోవరములతో నిండినవి, సరస్సులందలి, అంబుజములు కల్హారములు మొదలయిన కుసుమ సమూహముల నుండి మెల్లగా వీచు మారుతపోతములచే నిండిన దిబ్ముఖములు - నయిన గుణవంతములయిన తపోవనభూముల ప్రయాణించి, రథమున పోవుచు రోజు పరమ హర్శమొందెను, ఆశ్రమ మండల సమీపమును చేరి రాజు ఉపశాంతాశయుఁడయ్యెను. భార్యలతో గూడి శ్రీమంతుఁడు రాజు వాహనము నుండి యవతరించెను. (44)
ధుర్యాన్విశామయేత్యుక్త్వా యంతారమవనీపతిః ।
ఆససాదాశ్రమోపాంతం మహర్షేర్భావితాత్మనః ॥
స శ్రుత్వా మునిశిష్యేభ్యః కృతనిత్యక్రియాదరమ్ ।
మునిం ద్రష్టుం వినీతాత్మా ప్రవివేశాశ్రమం తదా ॥
మునిమధ్యే సమాసీనమృషిబృందైః సమన్వితమ్ ।
ననామ శిరసా రాజా భార్యాభ్యాం సహితో ముదా ॥
కృతప్రణామం నృపతిమృషిరౌర్వః ప్రతాపవాన్ ।
ఉపవిశేతి ప్రేమ్ణవై సహకాభ్యాం సమాదీశత్ ॥
అర్ఘ్యపాద్యాదిభిః సమ్యక్పూజయిత్వా మహామునీః ।
ఆతిథ్యేన చ వన్యేన సభారం తమతోషయత్ ॥
అధాతిథ్యోపవిశ్రాంతం ప్రణమ్యాసీనమగ్రతః ।
రాజానమబ్రవీదార్వః శనైః మృద్వక్షరం వచః ॥
కుశలం నను తే రాజ్యే బాహ్యేష్వాభ్యంతరేషు చ ।
అపి ధర్మేణ సకలాః ప్రజాసం పరిరక్షసి ॥
అపీ జేతుం త్రివర్గం త్వముపాయైః సమ్యగీహసే ।
ఫలంతి హి గుణాస్తుభ్యం త్వయా సమ్యకుచోదితాః ॥
దిష్ట్యా త్వయాజితాః సర్వే రిషవో నృపసత్తమ ! ।
ద్విష్ట్యా చ సకలం రాజ్యం త్వయా ధర్మేణ రక్ష్యతే ॥
ధర్మ ఏవ స్థితిర్యేషాం తేషాం నా స్యత విప్లవః ।
న తం రక్షతి కీం ధర్మః స్వయం యేనాభి రక్షితః ॥
పూర్వమేవాహమశౌషం విజిత్య సకలాం మహీమ్ ।
సబలో నగరీం ప్రాప్తః కృతదరో భవానితి ।
రాజ్ఞాం తు ప్రవరో ధర్మో యత్రజాపరిపాలనమ్ ।
భవంతి సుఖినో నూనం తేనైవేహ పరత్ర చ ॥
స భవాన్ రాజ్యభరణం పరిత్యజ్య మదంతికమ్ ।
భార్యాభ్యాం సహితో రాజన్ సమాయాతోసి మే వద ॥
జైమిని రువాచ :-
ఏవముక్తస్తు మునినా సగరో రాజసత్తమః ।
కృతాంజలిపుటో భూత్వా ప్రాహ తం మధురం వచః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే సగరస్యౌర్యాశ్రమగమనం నామ పంచాశత్తమోధ్యాయః ॥
గుఱ్ఱముల విశ్రమింపఁజేయుమని రథసారథికి చెప్పి మహారాజు భావితాత్ముఁడయిన మహర్షి యొక్క ఆశ్రమోపాంతము చేరెను. రాజు మునిశిష్యుల వలన కృతనిత్యక్రియుఁడని యెఱింగి, మునిని దర్శించుటకు, వినీతాత్ముఁడై ఆశ్రమమును ప్రవేశించెను. మునుల మధ్య, ముని బృందములచే సమన్వితుఁడై సమాసీనుఁడై యున్న మునికి భార్యాద్వయముతో కూడుకొనీ సంతోషముతో శిరసా రోజు నమస్కరించెను. (47) ప్రతాపవంతుఁడు ఔర్వుఁడు, నమస్కరించిన రాజును, భార్యలతో కూర్చుండుమని ప్రేమతో వచించెను, ఆ మునీ అర్య పాద్యాదులచే చక్కగా రాజును పూజించి, వన్యసంబంధమైన ఆతిథ్యముచే భార్యలతో నతనీనీ సంతోషపరచెను. అంత ఆతిధ్యము నంది విశ్రమించి మునికి నమస్కరీంచీ, ముందు నాసీనుఁడైన రాజును చూచి, మృద్వక్షరయుతమయిన పలుకులతో ఔర్వమహర్షి మెల్లగా నీట్లనెను. “ఓ రాజా ! నీ రాజ్యమున బాహ్యాభ్యంతరంబుల కుశలమే కదా ! ధర్మముతో నీవు నీ ప్రజలను రక్షించుచుంటివికదా ! ధర్మార్థకామములను త్రివర్గమును ఉపాయములతో జయింప గోరుచుంటివికదా ! సమ్యక్ప్రచోదీతములయి (ఆఱు) గుణములు నీ కొలకు ఫలించుచున్నవికదా ! ఓ నృపసత్తమా ! అదృష్టవశమున సర్వ శత్రువులు నీచే జయింపఁబడిరి ! ధర్మమునందున్న వారికి విప్లవముండదు. ఇంతకు పూర్వమే నేను విని యుంటిని. సమస్త పృధ్విని జయించి ససైన్యముగా కృతదారుఁడవై నగరమును ప్రవేశించి యుంటివనీ. సమ్యక్పాలనము రాజులకు శ్రేష్ఠము. తన్మూలమున రాజులు ఇహాముత్రముల సుఖవంతులు. అట్టి నీవు, రాజ్యపాలనమును విడిచి, భార్యలతో గూడికొని నా సమీపమునకు వచ్చి యుంటివి. కారణము వచింపుము.
జైమిని ఇట్లనెను : -
ముని యిట్లు అడుగగా రాజసత్తముఁడయిన సగరుఁడు కృతాంజలిపుటుఁడై యాతనితో మృదువుగా నిట్లనెను.
ఇది మహాపురాణము వాయుప్రోక్తమునయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున, సగరుని ఔర్వాశ్రమగమనమను ఏబదవ అధ్యాయము.
Summary of chapter 88 of the Brahmānda Mahā Purana is as follows:
In deeply engaging narrative prose, this section covers the saga of king Shāntanu, the vow of Bhīshma, and the birth of the heroic Pāṇḍava princes endowed with divine virtues. It highlights their steadfast adherence to dharma despite facing unimaginable trials, deception, and exile. The faithful listener takes immense inspiration from the Pāṇḍavas, learning that steadfast devotion to lord Kṛshṇa guarantees ultimate victory over every adversity.