బ్రహ్మాండ మహా పురాణము
6 - కల్పమన్వంతరాఖ్యానవర్హనమ్
శ్రీసూత ఉవాచ :-
ఇత్యేవం ప్రథమం పాదం ప్రకృత్యర్థం ప్రకీర్తితమ్ ।
శ్రుత్వా తు సంహృష్టమనాః కాపేయః సంశయాయతి॥
ఆరాధ్య వచసా సూతం తస్యార్థం త్వపరాం కథామ్ ।
అథ ప్రభృతి కల్పజ్ఞః ప్రతిసంధీః ప్రచక్షతే
సమశీతస్య కల్పస్య వర్తమానస్య చానయోః ।
కల్పయోరంతరం యత్ర ప్రతిసంధిశ్చ యస్తయోః॥
ఏతత్ వేదితుమిచ్ఛామీ యథావత్కుశలో హ్యసి ।
కాపీయేనైవముక్తస్తు సూతః ప్రవదతాం వరః॥
త్రైలోక్యస్యోద్భవం కృత్స్నమాభ్యాతుముపచక్రమే ।
సూత ఉవాచ :-
అత్ర చే వర్ణయిష్యామి యాథాతథ్యేన సువ్రతాః ॥
కల్పం భూతం భవిష్యం చ ప్రతీసంధిశ్చ యస్తయోః.
మన్వంతరాణి కల్పేషు యాని యాని చ సువ్రతాః ॥
యశ్చోయం వర్తతే కల్పో వారాహః సాంప్రతః శుభః॥
అస్మాత్కల్పాతు యః పూర్వః కల్పో తీతః సనాతనః ।
తస్య చాస్య చ కల్పష్య మధ్యావస్థాం నిబోధత॥
ప్రత్యాగతే పూర్వకల్పే ప్రతిసంధిం విన్నానఘాః ।
అన్యః ప్రవర్తతే కల్పో జనలోకాదయః పునః.॥
పుచ్ఛిన్నప్రతిసంధిస్తు కల్పాత్కల్పః పరస్పరమ్ ।
వృచ్ఛిద్యంనే ప్రజాస్సర్వాః కల్పాంస్తే సర్వశస్తదా.
సూతుఁడిట్లు పలికెను.
ప్రకృత్యర్థము ముఖ్యముగా వివరింపబడిన ప్రథమ పాదమును వీని కాయుఁడు సంతోషించెను. కానీ కొన్ని సంశయములతనికి కలిగెను. (వాయు పురాణములో కాశ్యపేయుఁడని యున్నది.) (1) ఆతని నాతండు పలుకులతో నారాధించెను. వేతోక కథను సొతని వలన వినఁదలఁచి, అందులకై యతనితో “కల్పజ్ఞ! ఓ ఋషి, నీవు కల్పము నందలి విషయముల నెఱింగినవాఁడవు. 'ప్రతిసంధీ'ని గూర్చి ఇక నా కొలకు వివరింపుము. దానిని వినఁగోరుచున్నాను. అయ్యాడీ రెండు కల్పములకు మధ్యకాలము. గతించిన కల్పము, ఇప్పుడు వర్తమానముగా నున్న కల్పము. ఈ రెండు కల్పముల మధ్య గల పరిణామ కాల సంభవమయిన ప్రతిసంధి వృత్తాంతమును వీనంగోరెదను, నీవీ వృత్తాంతమున కుశలుండవు. (2-3) ఇట్లు కాపేయుని చేనడుగఁబడి, వాగ్విదులలో శ్రేష్ఠుఁడయిన సూతుఁడు శ్రీలోకోద్భవ చరిత్రను సర్వమును చెప్పు నారంభించేను. (4) షూతుఁడిట్లనెను : ఓ సువ్రతులారా! యథాతథము జరిగినది జరిగినట్లు జరిగిపోయిన కల్పమునుగూర్చి, భవిష్యత్కల్పమును గూర్చి ఆ రెండినడుమ ప్రవర్తిల్లిన ప్రతిసంధిని గూర్చి యిఁక వర్ణించెదను. (5) ఓ సువ్రతులారా! కల్పము లందలీ వివిధములయిన మన్వంతరముల గూర్చి వర్ణించెదను. ఇప్పుడు వర్తమాన కల్పము వరాహకల్పము. ఇది శుభంకరమైనది. (6) ఈ కల్పమునకు పూర్వము జరిగిన సనాతనమయిన కల్పము, ప్రస్తుత కల్పము - ఈ రెంటికీని మధ్యగల స్థితిని ఎఱుంగుము. ఓయనఘులారా! ప్రతిసంధి లేకయే గత కల్పము మరలిపోయి (ఈమధ్య కాలము) వేళిక కల్పము జనలోకము మొదలగు వానితో మరల ప్రవర్తిల్లును. (8) కల్పము నుండి కల్పమునకు పరస్పరము, ఒక దానిని వేతాక దాని నుండి విభజించు పరిణామ సమయ స్థితి యుండును. కల్పాంతము నందు సర్వప్రజలు సర్వప్రాణులు పూర్తిగా వినాశన మొందును.
తస్మాత్కల్పాత్తు కల్పస్య ప్రతిసంధిర్న విద్యతే ।
మన్వన్తరే యుగాఖ్యానామవిచ్ఛిన్నాస్తు సంధయః.
పరస్పరాత్రవర్తనే మన్వన్తరయుగైస్సహ ।
ఉక్తా యే ప్రక్రియార్థన పూర్వకల్పాః సమాసతః.
తేషాం పరార్థకల్పానాం పూర్వో యస్మాత్తు యః పరః ।
అసీత్కల్పే వ్యతీతే వై పరారాత్పరమస్తు యః.
కల్పా స్వన్యే భవిష్యా యే హ్యపరార్ధగుణీకృతాః ।
ప్రథమః సాంప్రత స్తేషాం కల్పోయో వర్తతే ద్విజాః.
అస్మిన్ పూర్వే పరార్దే ము ద్వితీయః పర ఉచ్యతే ।
ఏష సంస్థితకాలపు ప్రత్యాహారస్తతః స్మృతః.
అస్మాత్కల్పాత్తతః పూర్వం కల్పోతీతః పురాతనః ।
చతుర్యుగసహస్రాస్తే సహ మన్వనరైః పురా.
క్షీణే కల్పే తతస్తస్మిన్ దాహకాల ఉపస్థితే ।
తస్మిన్ కాలే తపో దేవా అసన్వైమానీకాస్తు యే.
నక్షత్రగ్రహతారాశ్చ చంద్రసూర్యాదయస్తు తే ।
అష్టావింశశిరేవైతాః కోట్యస్తు సుకృతాత్మనామ్.
మన్వన్తరే యథైకస్మిన్ చతుర్ధశసు వై తథా ।
త్రీణి కోటిశతాన్యాసన్ కోట ద్వినవతిపథా.
అథాధికా సప్తతిశ్చ సహస్రాణాం పురా స్మృతా ।
ఏకైకస్మింస్తు కల్పే వై దేవా వైమానికా స్మృతాః.
అథ మన్వంతరేష్వాసంశ్చతుర్ధశసు భే దివీ ।
దేహశ్చ పితరశ్చైవ ఋషయో మృతపాస్తథా.
కల్పము సమాప్తమయి, మఱియొక కల్పము ఆరంభించుటకు మధ్య కాలమునకు ప్రతిసంధియందురు. (మూలమున ప్రతిసంధిగ్న విద్యతే యని యున్నది. ప్రతీసంధి యుండకుండుట యసంభవము. అందుచే అనువాదమిట్లు చేయవలసివచ్చినది). మన్వంతరము నందు సంధీ సమయములకు యుగములని పేరు. ఆ యుగములు, యుగసంధులు : అవి అవిచ్చిన్నములు. మన్వంతరములు సంధీ సమయమందలి యుగములతో పరస్పరము కూడి ప్రవర్తిల్లును. ప్రక్రియా పాదమున పూర్వకల్పములు సూక్ష్మముగా పేర్కొనంబడినవి. (10,11) ప్రతి కల్పమునకు పూర్వార్ధము, పరార్థము లుండును. అందుచే నొక కల్పము చనగా దానీ పరార్ధము, వచ్చెడి కల్పము యొక్క పూర్వార్ధముతో ననుసరింపం బడును. అట్లే ఇతర కల్పములు తమ పరార్థ కల్ప భాగములతో ననుసరింపఁబడును. ఓ బ్రాహ్మణోత్తములారా! వర్తమాన మగు నీ కల్పమట్టి వానిలో మొదటిది. దీనికి పూర్వార్ధము పరార్ధము కలవు. ద్వితీయార్థమునకు (రెండవదానికి 'పర' అందురు. అయ్యది సంస్థిత కాలము. తరువాత ప్రలయకాలము (విలీనమగుకాలము) వచ్చునని యెఱుంగవలెను. (12,14) ఈ కల్పమునకు పూర్వమొక పూర్వ కల్పము కలదు. అదీ ప్రాచీనమయినది. అయ్యది మన్వంతరములతో సహా, చతుర్యుగ సహస్రముల యనంతరము గడచిపోయినదీ. (15) కల్పము పరిసమాప్తి పొందుటకు సమయమానన్నము కాగా, దాహాకాలము (ప్రళయకాలము) సమీపించగా, దేవతలు విమానముల సంచరింతురు. (16) నక్షత్రములు, గ్రహములు, తారలు, చంద్రసూర్యాదులు - మున్నగు వారందరు ఇరువది యెనిమిది కోట్ల సంఖ్య వారు. వారందరు సుకృతాత్ములు. పదునాలుగు మన్వంతరములందును వీరి సంఖ్య యొక్కటీయే. అందుచే వారి మొత్తము సంఖ్య (14 X 28) = 392 కోట్లు, (18} అంతీయేకాక, ప్రతికల్పములో, విమానముల సంచరించు దేవతలు 70 వేలు అధికమని గ్రహింపవలెను. (19) పదునాలుగు మన్వంతరములలో దేవతలు, పితరులు, ఋషులు - కలరు. వారు అమృతమును ద్రాగుదురు, వారు స్వర్గమున నుందురు.
తేషామనుచరాశ్చైవ పత్మ్యః పుత్రాస్తథైవ చ।
వర్ణాశ్రమాతిరిక్తాశ్చ తస్మిన్ కాలే ము ఖే సురా.
తెస్తైః సాయుజ్యగైస్సార్థం ప్రాప్తే వస్తుమయే తదా ।
తుల్యనిష్ఠాభవన్ సర్వే ప్రాప్తి హ్యాభూతసంప్లవే.
తతస్తే వశ్యభావిత్వాత్ బుద్ధ్యాః పర్యాయమాత్మనః ।
త్రైలోక్యవాసినో దేవా ఇహ తానాభిమానినః.
స్థితికాలే తదా పూర్ణే ఆసన్నే పశ్చిమోత్తరే ।
కల్పవసానికా దేవాస్తస్మిన్ప్రాప్తిహ్యుపప్లమే.
తదోత్సుకా విషాదేన త్యక్తస్థానానీ భాగశః ।
మహర్లోకాయ సంవిగ్నాస్తతస్తే దధిరే మనః.
.తే యుక్తానుపపద్యంతే మహతీం చ శరీరికే ।
విశుద్ధిబహుళాస్సర్వే మానసీం సిద్ధిమాస్థితాః.
తైః కల్పవసిభిసార్ధం మహానామోదీతస్తదా ।
బ్రాహ్మజ్ఞః క్షత్రియైర్వైశ్యాస్తద్భవైశ్చాపరైర్జనైః.
గత్వా తు తే మహర్లోకం దేవసంఘాశ్చతుర్దశ ।
తతస్తే జనలోకాయ సోద్వేగా దధిరే మనః.
ఏతేన క్రమయోగేన యయుస్తే కల్పవాసినః ।
ఏవం దేవయుగొనాం తు సహస్రాణి పరస్పరమ్.
విశుద్ధిబహుళాస్సర్వే మానసీం సిద్ధిమాస్థితాః ।
తైః కల్పవాసిభిః సార్ధం జన ఆసాదితస్తు వై.
వారికి అనుచరులయిన సేవకులు, భార్యలు, పుత్రులు గలరు. ఆ కాలమున ఆకాశమున సంచరించు దేవతలకు వర్ణములు కానీ ఆశ్రమములు కాని లేవు. (21) అందుచే, సర్వజీవులు, వస్తువులతో సహా వినాశనమును సమీపింపఁగా, నెల్లరును తుల్య స్థానులు తుల్యనిషా వంతులు నయిరి. వారందరితో నీ సమాన స్థితిలో వారు సాయుజ్యము నందిరి. సాయుజ్యమనఁగా భగవత్పదార్థముతో నైక్యము నొందుట. (22) పరమాత్మతో సాయుజ్యమును అవశ్యభావిత్వము నొంది (యెటింగి) త్రైలోక్యవాసులు, తత్తతానముల యందు ఒండొరుల గమనించు కొనిరి. పోరు పొందిన వివిధ స్థానముల యందు గర్వము నొందిరి. స్థితికాల మాసన్నము కాగా, పరిపూర్ణమగుడు), పశ్చిమోత్తర కాలము తప్పనిది కాగా, (పూర్వపూర్వతర కాలసమయము), సర్వనాశనము ఉపపన్నమయిన, కల్పము యొక్క తుది దినములలలో నుత్సాహవంతులయిన దేవతలు, కొంతవఱకు తమ నివాస స్థానమయిన సత్యలోకమును విడిచిరి. అటు పిమ్మట వారు తమ స్థానములను క్రమముగా విడిచి, సంవిగ్నులయి, మహర్లోకమునకు తమ మనస్సుల నున్ముఖములు గావించిరి. (22, 25) వారు మనస్సమాధానమున యుక్తులై యొక యోగస్థానమును శరీరమున పొందిరి. వారందరు విశుద్ధి బహుళులు నగుట మనస్సంబంధమైన సిద్ధిని పొందిరి. {26) వారందరు కలవాసులతో కూడి బ్రాహ్మణులతో, క్షత్రియులతో, వైశ్యులతో, ఇతర జనములలో మహర్లోకమును జేరిరి. (27) మహర్లోకమునకు జేరిన వెనుక, చతుర్దశ దేవసంఘములు ఉద్వేగవంతులయిరి. వారు వారి మనస్సుల జనలోకమును గూర్చి భావించిరి. (28) ఇట్టి క్రమయోగమున కల్పవాసీనులు సాగిపోయిరి. ఇట్లే దేవతా సంఖ్యామానములో సహస్ర యుగములు పరస్పరము జరిగినవి. (29) వారందరు విశుద్ధి విశేషులు. అందుచే మానసికమైన సిద్ధిని పొందిరి. (మానసీం సిద్ధిం - ఆధ్యాత్మిక శక్తిని), కల్పవాసులతో సహితము జనలోకము పొందఁబడినది. (30)
తత్ర కల్పాన్ దశ స్థిత్వా సత్యం గచ్ఛంతి వై పునః ।
గత్వా తే బ్రహ్మలోకం వై అపరావర్తినీం గతిమ్.
ఆధిపత్యం విమానే వై ఐశ్వర్యేణ తు తత్సమాః ।
భవస్తి బ్రహ్మణా తుల్యా రూపేణ విషయణ చ.
తత్ర తే హ్యవతిష్ఠస్తే ప్రీతియుక్తాశ్చ సంయమాన్ ।
ఆనందం బ్రహ్మణః ప్రాష్య ముచ్యనే బ్రహ్మణా సహ.
అవశ్యభావినార్థన ప్రాకృతేనైవ తే స్వయమ్ ।
మానార్చనాభిః సంబద్ధాస్తదా తత్కాలభావితాః.
స్వపతో బుద్ధిపూర్వం తు బోధో భవతి వై యథా ।
తథా తు భావితే సేవాం తథానందః ప్రవర్తతే.
ప్రత్యాహారైస్తు భేదానాం యేషాం భిన్నోని శుష్మిణామ్ ।
తైః సార్ధం వర్థతే తేషాం కార్యాణి కరణాని చ.
నానాత్వదర్శినాం తేషాం బ్రహ్మలోకనిపాసినామ్ ।
వీనివృత్తాధికారాణాం స్వేన ధర్మేణ తిష్ఠతామ్.
తే తుల్యలక్షణాః సిద్ధాః శుద్ధాత్మనో నిరంజనాః ।
ప్రాకృతే కరణోపేతాః స్వాత్మన్యేవ వ్యవస్థితాః.
ప్రఖ్యాపయిత్వా చాత్మానం ప్రకృతిస్వేష తత్త్వతః।
పురుష్యాబహుత్వేన ప్రతీతా తత్రవర్తతే.
ప్రవర్తితే పునః సర్గే తేషాం సాకారణాత్మనామ్ ।
సంయోగే ప్రకృతిర్జ్ఞేయా ముక్తానాం తత్త్వదర్శినామ్॥
అచ్చట వారు పదికల్పములుండీ, మరల సత్యలోకమునకు పోవుదురు. (బ్రహ్మలోకము సత్యలోకము). బ్రహ్మలోకమున కరిగిన వెనుక వారు పునరావృత్తి రహిత లోకము నందుదురు. (31) అచ్చట పునారవృత్తిరహితత్వము నొందిన జీవుఁడు, బ్రహ్మలోకమున ప్రజాసృష్టి సంబంధి అధికారము తప్ప తక్కిన టైశ్వర్యాదులతో బ్రహ్మతో సమానత్వము వహించును. ఆధిపత్యము నందు తక్క మిగిలిన టైశ్వర్య విషయమున, రూప విషయమున, వారందరు బ్రహ్మతో తుల్యులు అగుదురు. వారు విషయజ్ఞానమున బ్రహ్మ సమానులు అగుదురు. (32) అచ్చట వారు (బ్రహ్మ సంసర్గమున) సంయమముతో ప్రీతియుక్తులై యుందురు. బ్రహ్మవలన వారానందము నొంది, బ్రహ్మతో సహా వారు విముక్తిని పొందుదురు. (33) ప్రకృతీ సంబంధమయిన అవశ్యభావులయిన విషయముల వలన, వారందు గౌరవము, పూజ, మున్నగు వానితో నుండి పోవుదురు. ఈ పూజాదులందు సహజముగా సంబద్ధములు. తత్కాల భావితములు, (వారు బ్రహ్మ లోకమున పొందిన ప్రత్యేకత్వము తోడనే యుండి పోవుదురు. వాయుపురాణము.) (34) నిద్రపోవు వ్యక్తి విషయమై విషయ పరిజ్ఞానము బుద్ధి పూర్వకము స్ఫుటముగా ప్రకాశింపనట్లు, పవిత్రులై సేవా పరులయిన వారి యందు ఆనందము ప్రకాశింప మొదలిడును. (35) పరస్పర భేదభావము లజంగినప్పుడు ఆనందము ప్రకాశింప మొదలిడును, ఈ యానందానుభవము జ్యోతిష్మంతుల విషయమై (తేజస్వంతుల విషయమున) భిన్నభిన్నముగా నుండును, వారి వారి కార్యములతో కరణములతో ఆనందానుభూతి వృద్ధి చెందును. (36) నానోత్వమును పాటించుచు, పోరీవారి అధికారములను నుపసంహరించుకొనిన వారియొక్క స్వధర్మ నిర్వహణులయొక్క బ్రహ్మలోక వాసులయొక్క సిద్ధులు సమాన లక్షణములు కలిగియుండును, పారు పవిత్రాత్ములు. వారి ఆత్మలు పరిశుద్ధములు, నీరంజనములు. వారి ప్రకృతస్థితిలో వారు జ్ఞానేంద్రియముల గలిగియున్నారు. ఈ జ్ఞానేంద్రియములతోవారు తమతమ ఆత్మలయందు పరిపుష్టులై ప్రవర్తించెదరు. (38) తన్ను సుస్థాపించుకొని, ప్రకృతి, పురుషుని కంటే తత్త్వతః భిన్నముగాను, బహుత్వ కలీతముగాను, ప్రవర్తించును. (39) మరల సృష్టి ఆరంభించిన వెనుక, ప్రకృతి విముక్తులయిన ఆత్మలతో సంబంధమున గ్రహింపఁబడవలేను. వారో తత్త్వమును గ్రహింతురు. వారుపస్థితములయిన కారణములతో తాదాత్మ్యము వహించి యుందురు. (40)
తత్రోపవర్గణాం తేషాం న పునర్మార్గగామినామ్ ।
అభావః పునరుత్పన్నః శాంతారామర్చిషామీవ ఈఈ
తతస్తేషు గతేషూర్ధ్వం త్రైలోక్యేషు మహాత్మసు ।
ఏతైః సార్థం మహర్లోకస్తదో నాసాదితస్తు వై॥
తచ్ఛిష్యా వై భవిష్యత్తీ కల్పదాహ ఉపస్థితే ।
గంధర్వాద్యాః పిశాచాశ్చ మానుషా బ్రాహ్మణాదయః ॥
పశవః పక్షిణశ్చైవ స్థావరాశ్చ సరీసృపాః ।
తిష్ఠత్సు తేషు తత్కాలం పృథివీతలవాసిషు ॥
సహస్రం యత్తు రశ్మీనాం స్వయమేవ విభావ్యతే ।
తత్సప్తరశ్మయో భూత్వా ఏకైకో జాయతే రవిః ॥
క్రమేణోత్తిష్ఠమానాస్తే తీన్ లోకాన్ ప్రదహంత్యుత ।
జంగమాః స్థావరాశ్చైవ సద్యః సర్వే చ పర్వతాః ॥
శుష్కా పూర్వమనావృష్ట్యా సూర్యైస్తే చ ప్రధూపితాః ।
తదా తు వీవశాస్సర్వే నిర్దగ్ధః సూర్యరశ్మిభిః ॥
జంగమాః స్థావరాశ్చైవ ధర్మాధర్మాత్మకాస్తు వై।
దగ్గరేపోస్తదా తే తు భూతపాపా యుగాన్తరే ॥
ఖ్యాతాతపా వినిర్ముక్తాః శుభయా చాతిబంధయా ।
తతస్తే హ్యుపపర్యంతే తుల్యరూపైర్లనైర్జనాః ॥
ఉషిత్వా రజనీం తత్ర బ్రహ్మణా వ్యక్తజన్మనః ।
పునః సర్గే భవంతీహ మానసా బ్రహ్మణః సుతాః ॥
ముక్తులయిన యట్టివారు పూర్వమార్గమును బట్టియే (సంసారమార్గము) తిరిగిరారు. పారభావులు. ఉత్పన్న స్థితిలేనివారు. వారు చల్లారిపోయిన అగ్నిహోత్రమును పోలినవారు. (41) ఆ మహాత్ములు త్రిలోకములందు నూర్థ్వమునకు వీరందరితో కలిసిపోయిన వెనుక, హరిచే మహర్లోకము ఆక్రమింపబడదు. (42) కల్పము యొక్క దాహము (ప్రళయము) ఉపస్థితముకాగా, గంధర్వులు, పిశాచములు, మనుష్యులు, బ్రాహ్మణులు మొదలగు వారు వారి శిష్యులగుదురు. (ఇందు శిష్యులను పదము కంటే 'శిష్ట' అను పదముండిన సమంజసమనిపించును, (43) అట్లే పశువులు, పక్షులు, స్థావరములు, సరీసృపములును (ప్రాకుసవి - పాములు నలికిల పాములు మొదలయినవి). ఆ సమయమున పృథివీ తల వాసులందే యుండిపోగా, (44) వేయి రూపముల (కిరణములతో, ప్రత్యక్షమయిన) నొప్పు సూర్యరశ్ములు (కలిసిపోయి, కేంద్రీకృతములై) ఏడు కిరణములుగా నగును. (సప్తరశ్ములు). ఒక్కొక్కరశ్మి యొక్కోక్క సూర్యుఁడగును. (45) (కల్పదాహము) క్రమముగా ప్రజ్వరిల్లి మూఁడు లోకములను దహించును. స్థావరములు, జంగమములు, నదులు, సర్వ పర్వతములు, మున్నగునవి యెవ్వి అనావృష్టి చేతను శుష్కములయినవో, సూర్యులచే బాధితములు ప్రధూపితములయినవో యవి సూర్యరశ్మిచే పూర్తిగా దగ్ధములైనవి. నిస్సహాయములయినవి. ఉత్తమ గుణ ధర్మవంతములు, దుష్ట గుణ ధర్మవంతములునయిన ప్రకృతి స్థమయిన స్థావర జంగమ రూపవస్తువులు దగ్గ శరీరములగును. రెండు యుగములకు గల మధ్యకాలములో నవి పోయిన పాపములు కలిగినవగును. (46,48) అవి యన్నియు ఖ్యాతములు. అవి సూర్యుని ఆతపము నుండి శుభవంతమయిన వర్షముచే . వినిర్ముక్తములు. తమతో సమాన రూప ధర్మములు గలిగిన జనములతో నీ జనములు కలియుదురు. (49) అవ్యక్తము నుండి పుట్టిన బ్రహ్మ యొక్క యొక రాత్రి కాలము నచ్చట వసించి, తరువాత సృష్టి క్రమములో వారు బ్రహ్మ యొక్క మానస సుతులయిరి.
తతస్తేషూపపన్నేషు జనై ప్రైలోక్యవాసిషు ।
నిర్ధగ్ధేషు చ లోకేషు తదా సూర్యైస్తు సప్తభిః.
వృష్ట్యా క్షితా వైవితాయాం విజయేష్వర్ణవేషు చ।
సాముద్రాశ్చైవ మేఘాశ్చ ఆపః సర్వాశ్చ పార్థివాః ॥
శరవణా ప్రజంత్యేవ సలిలాఖ్యా స్తథానుగాః ।
ఆగతాగతికం చైవ యదా తత్సలిలం బహు ॥
సంఛాద్యేమాం స్థితాం భూమీమర్ణవాఖ్యం తదా భవత్ ।
ఆభాతి యస్మాత్ స్వాభాసో భాతఱో వ్యాప్తిదీప్తిషు ॥
సర్వతః సమనుప్రాప్త్యా తాసాం చాంభో విభావ్యతే ।
తదంతస్తనుతే యస్మాత్ సర్వాం పృథ్వీం సమంతతః ॥
ధాతుస్తనోతి విస్తారే న చైతాస్తనవః స్మృతాః ।
శర ఇత్యేష శీర్ణ తు నానార్ధే ధాతురుచ్యతే ॥
ఏకార్ణవే భవత్యాపో న శీఘాస్తేన తే నరాః ।
తస్మిన్ యుగసహస్రాంతే సంస్థితే బ్రహ్మణోహని ॥
ఈవత్కలే రజన్యాం చ వర్తంత్యాం సలిలాత్మనా ।
తతస్తు సలిలే తస్మిన్నష్టాగ్నే పృథివీతలే ॥
ప్రశాంతవాతోఒంధకారే నిరాలోకే సమంతతః ।
ఏతేనాధిష్ఠితం పాదం బ్రహ్మాస పురుషః ప్రభుః ॥
విభాగమస్య లోకస్య ప్రకర్తుం పునరైచ్ఛత ।
ఏకార్ణవే తదా తస్మిన్నష్టే స్థావరజంగమే ॥
ముల్లోకవాసులయిన జనములతో (కూడియుండ) దగ్గపటలముకాఁగా, సప్త సూర్యులచే లోకములన్నియు భస్మీభూతములు కాగా, (51) భూమియంతయు వర్షముచే సంస్లావితము (నిండినది) కాగా, సముద్రములు నిర్జనము లయ్యెను. సముద్రోత్పన్నములయిన మేఘములు, నీరును, భూమినుండి పుట్టిన సర్వవస్తువులు (52) ముక్కలు ముక్కలై శరముల వలే చెదరిపోయెను. అప్పుడవి 'సలీల' నామధేయములయ్యెను. వరదలు ఒండొంటితో కలిసికొని బహుళములయ్యెను. (53) నీరు భూమినంతను ఆవరించియుండ, అప్పుడీ భూమి ‘అర్జవ'మను పేరొందెను. 'భా' ధాతువునకు వ్యాప్తి దీప్తుల యందు అర్థము. (54) నీటికి అంభస్సులని పేరు - ఏలయన - అవి ప్రకాశించు; వ్యాపించును నీరు సర్వత్ర వ్యాపించెను, (55) ప్రపంచమందంతటను, తనలో తానును, నీరు వ్యాపించి యుండుటచే ఈతనువః” వ్యాపించునవి {తనుః) అను పేరొందెను. “తను” అనుధాతువు వ్యాపించుట యను అర్థమున నుపయోగింపబడును. 'సర్' లేదా 'సృ' అనుధాతువు బహ్వర్థములలో ప్రయోగింపబడును. దాని యర్థము “వికీర్ణము” చెందుట, “ముక్కలగుట"... విశీర్ణము చెందుట. (56) ప్రపంచమంతయు నీరు నిండగా నీరు ప్రవహించుట మానెను. (శీఘ్రగతి నొందలేదు.) అందుచే వానికి నీరాః అను పేరు వచ్చినది. సహస్ర యుగముల యంతమందు, బ్రహ్మయొక్క 'దీవా' కాలము (పగటికాలము) సమాప్తము కాగా, మరల అంతకాలమే రాత్రి సమయముగా, సలిల మందు వ్యాప్తముకాఁగా, అగ్నులు చల్లారెను. యావత్ జలప్రపంచములో భూభాగమంతయు నష్టమయ్యెను. అప్పుడు వాయువు ప్రశాంత మొందెను. చలనము లేక యుండెను. అప్పుడెచ్చటను వెల్లురను మాట లేక అంధకారము అంతటను వ్యాపించెను. అప్పుడే ప్రపంచమంతయు 'పురుషునిచే అధిష్టితమయ్యెను. అతఁడే ప్రభువు. బ్రహ్మ, (59) ఆతఁడు మరల ప్రపంచమును విభాగము చేయఁగోరెను. ఆ యనంతజలములో, స్థావరములు, జంగములయిన వన్నియును ప్రలయమును చెందెను. (60)
తదా భవతి స బ్రహ్మా సహస్రాక్షః సహస్రపాత్ ।
సహస్రశీర్షా పురుషో రుక్మవర్ణో జితేంద్రియః ॥
ఇమం చోదాహరంత్యత్ర శ్లోకం నారాయణం ప్రతి ।
ఆపో నారాస్తమ్రనవ ఇత్యర్థననుశుశ్రుమ ॥
అపూర్యమాణా సత్రాస్తే తేన నారాయణః స్మృతః ।
సహస్రశీర్షా సుమనాః సహస్రపాత్ సహస్రచక్షుర్వదనః సహస్రకృత్ ।
సహస్రబాహుః ప్రథమ ప్రజాపతిస్త్రయీమయోలియం పురుషో నిరుచ్యతే ॥
ఆదిత్యవర్ణో భువనస్య గోప్తా ఏకో హ్యమూర్తః ప్రథమస్వసౌ విరాట్ ।
హిరణ్యగర్భః పురుషో మహాత్మా సంపద్యతే వై మనసః పరస్తాత్ ॥
కల్పాదౌ రజసోద్రిక్తో బ్రహ్మా భూత్వా సృజత్ ప్రభుః ।
కల్పాంతే తమసోద్రిక్తః కాలోభూత్వాగ్రసళ్పునః ॥
స వై సారాయణో భూత్వా సత్త్వోద్రిక్తో జలాశయే ।
త్రిధా విభజ్య చాత్మానం త్రైలోక్య సంప్రవర్తతే ॥
సృజతి గ్రసతే చైవ వీక్ష్యతే చ త్రిభిః స్వయమ్ ।
ఏకార్ణవే తదా తస్మిన్ నష్ట స్థావరజంగమే ॥
చతుర్యుగసహస్రాంతే సర్వతః స జలావృతే ।
బ్రహ్మా నారాయణాఖ్యస్తు స చకాశే భవే స్వయమ్ ॥
చతుర్విధాః ప్రజాఃసర్వా బ్రహ్మశక్త్యా తమోవృతాః ।
పశ్యన్తి తం మహర్లోకే కాలం సుప్తం మహర్షయః ॥
అప్పుడు ఆ బ్రహ్మ సహస్రాక్షుఁడు, సహస్రపాదుఁడు, సహస్ర శీర్షుఁడు, బంగారు వర్ణములు కలవాఁడు, జితేంద్రియుఁడు నయిన పురుషుఁడగును. (61) ఈ సందర్భమున నారాయణుని గూర్చి యీ క్రింది శ్లోకము చెప్పుఁబడినది. “జలములు సారములు. అవియే 'తనవము’లు వ్యాపించునవి. (అవియే శరీరములదాల్చును). అవి నింపబడును (ఆఫూర్యమాణములు) వానియందు ఆతఁడుపసించుటచే “నారాయణడు”అనీ స్మరింపఁబడెను, (62) ప్రథముడయిన ప్రజాపతి (ప్రజలకు ప్రభువు) సుమనస్కుడు. (మంచి మనము కలవాఁడు). ఆతనికి సహస్ర శీర్షములు, సహస్ర పాదములు, సహస్ర నేత్రములు, సహస్ర వదనములు సహస్ర బాహువులు, కలవు. ఆతఁడు సహస్ర కార్యములనొనర్చును. ఆతనినే త్రయీమయుడనీ (వేదమయుఁడని) నిర్వచింతురు. (63) ఆతఁడాదిత్యవరుఁడు; సూర్య సమానవర్ణుఁడు; సర్వ విశ్వ రక్షకుఁడు; ఆతఁడు కేవలుఁడు. ఒక్కడే. ఆతఁడు మూర్తి రహీతుఁడు; ఆతఁడే ప్రథముఁడయిన విరాట్ (విశ్వరూపుఁడు). ఆతఁడే హిరణ్యగర్భుడు; మహాత్ముడు, ఆతఁడు మనస్సుచే గ్రహింప శక్యుఁడు కాఁడు. (64) కల్పారంభమునందు, ఆతఁడు రజోగుణ విరాజితుఁడయిన బ్రహ్మ అప్పుడు ప్రపంచమునతఁడు సృజించెను, కల్పాంతమందోతఁడే తమో గుణావిష్ణుఁడు. ఆతఁడు కొలుఁడై (సంహర్తయై) సర్వమును గ్రసించును. (65) ఆతఁడే నారాయణుఁడై సత్త్వగుణోద్రిక్తుఁడై జలాశయమున (జలమయ ప్రపంచమున) స్వయముగా త్రివిధముల విభక్తుఁడై మూఁడు లోకములందు ప్రవర్తించును. (66) స్వకీయమయి త్రివీధ లక్షణములచే అతఁడు సృజించును. గ్రసించును (నాశనము) చేయును. చూచును (పరిరక్షించును - పాలించును.) (67) చతుర్యుగములు ఒకవే జరుగగా, అంతటను జలమయమై యుండఁగా (స్థావర జంగమాదులు నశించగా), బ్రహ్మ , నారాయణాఖ్యతో స్వయముగా విశ్వమున ప్రకాశించును. (68) స్వేదజ, అండజ, ఉద్బీజ్జ, జరాయుజములనెడి చతుర్విధ సృష్టి, బ్రహ్మశక్తిచే తమోవృతములు. మహర్లోకమున మహర్షులు నిద్రించుచున్న 'కాలు'నీ (యముని) చూచెదరు.
భృగ్వాదయో యథోద్దిషాస్తస్మిన్ కాలే మహర్షయః ।
సత్యాదయస్తథా త్వష్టా కల్పే లీనే మహర్షయః ॥
తదా వివర్తమానైస్తిర్మహ త్పరిగతం పరామ్ ॥
గత్యర్ధాదృషతేరాతోర్నామనిష్పత్తిరుచ్యతే ।
యస్మాదృషతి సత్తెన మహత్తస్మాన్మహర్షయః॥
మహర్లోకస్థితైరృష్టః కాలః సుప్తస్తదా చ తైః ।
స్వద్యాః సప్త యే త్వాసన్ కల్పే తీశే మహర్షయః ॥
ఏవం బ్రహ్మా తాసు తాసు రజనీషు సహస్రశః ।
దృష్టవస్తస్తదా నీతోః కాలం సుప్తం మహర్షయః ॥
కల్పస్యాతౌ సుబహుళ యస్మాత్పంస్థాశ్చతుర్ధశ ।
కల్పయామాస వై బ్రహ్మా తస్మాత్కల్పో నిరుచ్యతే ॥
స స్రష్టా సర్వభూతానాం కల్పాదిషు పునః పునః ।
వ్యక్తావ్యక్తి మహాదేవస్తస్య సర్వమిదం జగత్ ॥
ఇత్యేష ప్రతిసంబంధః కీర్తితఃకల్పయోర్ధ్వయోః ।
సాంప్రతం ఏ తయోర్మధ్యే ప్రాగవస్తా బభూవ హ ॥
కీర్తితస్తు సమాసేన పూర్వకల్పే యథాతథమ్ ।
సాంప్రతం సంప్రవక్ష్యామీ కల్పమేతం నిబోధత ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే, వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయే అనుషంగపాదే।
కల్పమన్వంతరాఖ్యాన వర్ణనం నామ షష్ఠోధ్యాయః॥
ఆ కాలమున చెప్పఁబడిన ఋషులు భృగ్వాదులు. కల్పము సమాప్తము నొందుసరికి ఉన్న మహర్షులు సత్య, మొదలగు వారు ఎనమండ్రు. పరిభ్రమమాణులైన వారిచే పరిగత పరీవృతమైనది. మహత్. (70) 'ఋ' ధాత్వర్థము 'గతా కదలిక యందు రూఢము. ఆ 'ఋ' ధాతువు నుండియే “ఋషి' అన్న నామ నిష్పత్తి కలిగిన దందురు. “యస్మాత్ ఋషత్ సత్తేన తస్మాత్ మహత్” వారు వారి సత్త్వముచే సంచరించు చుందురు కొన వారు మహాత్ములు. మహరులునైరి. (71) నిద్రపోవుచున్న కాలుఁడు సత్యాదులచే (సత్త్వాదులచే) చూడబడెను. ఆ ఋషులు ఏడుగురు. వారు గతకల్పమున మహర్లోకమున నుండిరి. (72) ఇట్లు బ్రహ్మ ఆయా సహస్ర సంఖ్యాక రాత్రులు మానక పనిచేయును, ఆతనిచే ఆనీతులయిన యా మహర్పులు కాలుఁడు (యముఁడు) నిద్రించుచుండగా చూచిరి. (73) కల్పము యొక్క ఆదియందు బ్రహ్మ పదుషాలుగు సంస్థలను (భువనములను) కల్పించేను. అవి విధములయినవి, అయ్యది (కల్పింపఁబడినదగుటచే) కల్పమని నిర్వచింపఁబడినది. (74) ఆతం డే పునః పునః మరల, మరల, సర్వజీవద్భూతములను కల్పముల యొక్క ఆరంభమున సృజనకర్త. సష్ట, ఆ మహాదేవుఁడు వ్యక్తుఁడు (తెలియ బడువాఁడు) అవ్యక్తుఁడు, (తెలియబడనివాఁడు - మూర్తిమంతుఁడు మూర్తి రహితుఁడు). ఏతద్ విశ్వమంతయు నాతని చేతనే సృజింపం బడినది. (75) ఈ రెండు కల్పములకు మధ్యగల సంబంధ మీ. వీధముగా వర్ణింపబడినది. ఇప్పటి యీ కల్పము ఆ రెండింటి కల్పముల మధ్య ప్రాగవ స్థితమైనది, (76) ఉన్నదున్నట్లుగా, జరిగినది జరిగినట్లు పూర్వకల్ప స్థితి సూక్ష్మముగా వర్ణింపఁబడినది. ఇప్పుడు, ఇంక, ప్రస్తుత కల్పమును గూర్చి చెప్పెదను. దానిని చక్కగా గ్రహించుము.
ఇది వాయుప్రోక్త బ్రహ్మాండ మహాపురాణమున, పూర్వభాగమున అనుషంగ పాదమున కల్పమన్వంతరాఖ్యాన వర్ణనమను ఆరవ అధ్యాయము.
Summary of chapter 6 of the Brahmānda Mahā Purana is as follows:
With majestic reverence, this section introduces the boundless cycles of cosmic time, outlining the immeasurable epochs known as Kalpas and Manvantaras. It instills a sense of profound humility in the mortal heart by detailing the vast, rhythmic breaths of the cosmos during which universes are born, sustained, and dissolved. The devoted mind is guided to look beyond transient earthly existence and meditate upon the eternal, unchanging nature of the supreme lord who governs these infinite temporal waves.