బ్రహ్మాండ మహా పురాణము
46 - అధ్యాయము
వసిష్ఠ ఉవాచ :-
స గచ్ఛన్పథి శుశ్రావ మునిభ్యస్తత్వమాదితః ।
రాజపుత్రవ్యవసితం పిత్రోః స్వర్గతమేవ చ ॥
పితుస్తు జీవహరణం శిరోహరణమేవ చ ।
తస్మృతేరేవ మరణం శ్రుత్వా మాతుశ్చ కేవలమ్ ॥
వీలలాప మహాబాహుద్దుఃఖశోకసమన్వితః ।
తమథాశ్వాసయామాస తుల్యదుఃఖో కృతవ్రణకి ॥
హేతుభిః శాస్త్రనిర్దిష్టిర్వీర్యసామర్థ్యసూచకైః ।
యుక్తిలౌకికదృషాంక్రీస్తచ్ఛోకం సంష్యశామయత్ ॥
సాంక్వితసేన మేథావీ ధృతిమాలంబ్య భార్గవః ।
ప్రయమౌ సహితః సఖ్యా భాతృణాం తు దీద్భక్షయా ॥
స ఖాన్ దృష్ట్వాభివాద్యైతానుఃఖితాన్షుఃఖకర్శితః ।
శోకామర్షయుతనైశ్చ సహ తగ్గి దినత్రయమ్ ॥
తతోస్య సుమహాస్క్రోధః స్మరతో నిధనం పితుః ।
బభూవ సహాసా సర్వలోకసంహరణక్షమః ॥
మాతురర్థ కృతాం పూర్వం ప్రతిష్ణోం సత్యసంగరః ।
దృఢీచకార హృదయే సర్వక్షత్రవధోద్యతః ॥
క్షత్రవంశ్యానశేషేణ హత్వా తద్దేహలోహితైః ।
కరిష్యే తర్పణం పిత్తోరితి నిశ్చిత్య భార్గవః ॥
భాతృణాం చైవ సర్వేషామాఖ్యాయాత్మసమీపాతమ్ ।
ప్రయయౌ తదనుజ్ఞాతః కృత్వా సంస్థాం పితుఃక్రియామ్ ॥
అకృతవ్రణసంయుక్తః ప్రాప్య మాహిష్మతీం తతః ।
తద్భాహ్యోపవనే స్థిత్వా సస్మార స మహోదరమ్ ॥
స తస్మై రథచాపాద్యం సహసాశ్వసమన్వితమ్ ।
ప్రేషయామాస రామాయ సర్వసంహననాని చ ॥
రామోపి రథమారుహ్య సన్నద్ధః సశరం ధనుః ।
గృహీత్వాపూరయచ్ఛంఖం రుద్రదత్తమమిత్రజిత్ ॥
జ్యాఘోషం చ చకారోచ్చే రోదసీ కంపయన్నివ ।
సహసాహోథ సారథ్యం చక్రే సారధినాం వరః ॥
రథజ్యాశంఖనాదైస్తు వథాత్పిత్రోరమర్షిణః ।
తస్యాభూన్నగరీ సర్వా సంక్షుబ్ధాశ్చ నరద్విపాః ॥
వసిష్ఠుఁడిట్లనెను.
ప్రయాణించుచు రాముఁడు మార్గములో మునుల వలన తన తండ్రి యొక్క మరణము రాజకుమారులు తన తండ్రిని చంప ప్రయత్నించుట, తండ్రి స్వర్గతుడగుట, తండ్రి యొక్క శిరస్సును వారు హరించుట మొదలగు వృత్తాంతమును మొదట నుండి వినెను. తండ్రి మరణము వలన తల్లి మరణించుట విని రాముఁడు దుఃఖముచే శోకముచే సమన్వితుఁడై విలపించెను. అతనితో సమానదుఃఖము ననుభవించు అకృతవ్రణుఁడు ఆతని నోదార్చెను. శాస్త్ర నిర్దిష్టమయిన హేతువులచే, వీర సామర్థ్య సూచకములయిన యుక్తులచే, శాస్త్ర దృష్టాంతములచే అకృతవ్రణుఁడు ఆతని శోకమును శాంతింపఁజేసెను. ఊరడింపఁబడి, ధైర్యమవలంబించి, మేధావీయైన భార్గవుఁడు, తన స్నేహితునితో సోదరులను చూడ ప్రయాణించెను (5) దుఃఖ కర్శితుఁడయిన రాముడు వారలను కలిసికొనెను. దుఃఖితులయిన వారలకు నమస్కరించెను శోకము నపనయింపఁజేసికొని, వారలతో నాతండొక మూఁడు దినములుండెను. తండ్రి మరణమును స్మరించుకొను నాతనికి అత్యధికముగ కోపమావహించెను. ఆ కోపము సర్వలోక సంహరణ దక్షమయినది. పూర్వము తల్లి కొఱకు చేసిన ప్రతిజ్ఞను సత్య సంగరుఁడయిన రాముఁడు హృదయమునందు దృఢనిశ్చయము చేసికొనెను. సర్వక్షత్రియవధకై యుద్యమించెను. సర్వక్షత్రియవంశ్యులను సంపూర్ణముగా (అశేషముగా) మిగులకుండ చంపి, వారి శరీరము నుండి స్రవించిన రక్తముచే పితరులకు తర్పణము చేయ నిశ్చయించు కోనెను. తన హృదయ సంకల్పమును తన సోదరులందరకును రాముఁడు చెప్పి, వారి అంగీకారము నొంది గృహముకడ చేయవలసిన పితృ విధుల నన్నింటిని జరిపి, బయలుదేరెను. (10) తరువాత అకృతవణునితో కూడ మాహిష్మతి కరిగెను. ఆ మాహిష్మతీ పుర బాహ్యాద్యానమున నీలంబడి మహోదరుని రాముఁడు స్మరించెను. మహోదరుఁడు రామునకు వెంటనే రథ చాపాదులను సర్వసంహననములతో ‘అశ్వసమ’న్వితముగా పంపెను. శత్రు విజయుఁడైన రాముఁడు రథము నిరోహించెను. శరముతో ధనువును గ్రహించెను. రుద్ర దత్తమయిన శంఖమును పూరించెను, (13) ఆకాశము కంపించునట్లుగా జ్యాఘోషమును చేసెను. సహసాహుఁడు సారథులలో శ్రేష్ఠుఁడు, ఆతఁడు సారథ్య మొనర్చెను. రథము యొక్క గుణము (వారి యొక్క) యొక్క శంఖము యొక్క నాదముతో తండ్రి మరణమున క్రుద్ధుడయిన రామునిచే ఆ మహిష్మతీ నగరము ప్రజలతో ఏనుగులతో సంక్షోభిల్లెను. (15)
రామం త్వాగతమాజ్ఞాయ సర్వక్షత్త్రకులాంతకమ్ ।
సంక్షుబ్ధాశ్చక్రురుద్యోగం సంగ్రామాయ నృపాత్మజాః ॥
అథ పంచరథాః శూరాః శూరసేనాదయో నృప ।
రామేణ యోద్ధుం సహితా రాజభిశ్చక్రురుద్యమమ్ ॥
చతురంగబలోపేతాస్త్రతస్తే క్షత్రియర్షభాః ।
రామమాసాదయామాసుః పతంగా ఇవ పావకమ్ ॥
నివార్య ఖానాపతతో రథేనైకేన భార్గవః ।
యుయుధే పార్థివైః సర్వైః సమరేమీతవిక్రమః ॥
తతః పునరభూద్యుద్ధం రామస్య సహ రాజభిః ।
జఘాన యత్ర సంక్రుధో రాజ్ఞాం శతముదారధీః ॥
తతః స శూరసేనాదీన్ హత్వా సప్లవాహవాన్ ।
క్షణేన పాతయామాస క్షితా క్షత్రియమండలమ్ ॥
తతస్తే భగ్నసంకల్పా హతస్వబలవాహనాః ।
హతశిష్టానృపతయో దద్రుపుః సర్వతోదిశమ్ ॥
ఏవం వీర్రావ్య సైన్యాని హత్వా జిత్వాథ సంయుగే ।
జఘాన శతశో రాజ్ఞః శూరాజ్ఛరవరాగ్నినా ॥
తతః క్రోధపరీత్మా దగ్గు కామోఖిలాం పురీమ్ ।
ఉదేరయద్భార్గవో స్త్రం కాలాగ్నిసదృశప్రభమ్ ॥
జ్వాలాకవలితాశేషపురస్రాకారమాలినీమ్ ।
పురీం సహస్త్యశ్వనగాం సడదాహాస్త్రపావకః ॥
దహ్యమానాం పురీం దృష్ట్వా ప్రాణత్రాణపరాయణః ।
జీవనాయ జగామాశు వీతిహోత్రథయాతురః ॥
అస్రాగ్నినా పురీం సర్వాం దగ్జాహత్వా చ శాత్రవాన్ ।
ప్రాశయానోఫీలాన్ లోకాన్ సాక్షాత్కాల ఇవాంతకః ॥
అకృత ప్రణ సంయుక్తః సహసాహేన చాన్వితః ।
జగామ రథహోషేణ కంపయన్నివ మేదినీమ్ ॥
వినిఘ్నన్ క్షత్రియాన్ సర్వాన్ సంశామ్య పృథివీతలే ।
మహేంద్రాద్రిం యయౌ రామస్తపసే ధృతమానసః ॥
తస్మిన్నష్టచతుష్కం చ యావత్ క్షత్త్రసముద్గమమ్ ।
ప్రత్యేత్య భూయస్తద్ధత్యై బద్ధదీక్షో ధృతవ్రతః ॥
సర్వక్షత్రకులాంతకుఁడయిన రాముని ఆగమనము నెఱింగి నృపాత్మజులు సంక్షుబ్ధులైరి. ఆతనితో యుద్ధము చేయుటకు సముద్యోగించిరి, అంత, శూరసేనాదులయిన యైదుగురు శూరులు పంచరథులు తోడి రాజులతో వచ్చి రామునితో యుద్ధమాచరింప నుద్యమీంచరీ, (17) చతురంగ బలోపేతులయి క్షత్రియ శ్రేష్టులు మిడుతలు (పతంగముల) జాజ్వల్యమానముగా దహించు అగ్నిలో సురుకు విధముగా, రామునితో యుద్దమునకుద్యమించిరి. వచ్చి పడునట్టి వారలనందరను ఒకే యొక రథముతో భార్గవుఁడు నివారించి, యుద్దమునందు సర్వపార్దీవులతో యుద్ధము చేసెను. అంత రామునకు రాజులతో సహా యుద్దమయ్యెను. ఆ యుద్ధమున ధీమంతుఁడు రాముఁడు శూరసేనాదులను సంక్రుద్దుం డై చంపెను. సబల వాహనములను సంహరించి, క్షణకాలములో రాముఁడు క్షత్రియ సముహమును నేలమట్టము గావించెను. (21) అంత భగ్న సంకల్పులు, హత స్వబటవాహనులు నయిన మిగిలిన రాజులు నలుదిక్కులకును పరువులెత్తిరి. ఈ విధముగా పలాయనము జేయుచున్న సైనికులను, చంపి, వందలాది రాజులను యుద్ధమున వధించి, శూరులను శరాగ్నిచే దహించి, క్రోధపరీతాత్ముడయిన రాముఁడు అఖిల మాహిష్మతీ నగరమును దగ్గపటలము చేయగోరెను. భార్గవుఁడు కాలాగ్ని సదృశమయిన అస్త్రమును విడిచెను. ఆ పావకాస్త్రము జ్వాలలతో పురస్రాకారమాలీనిని కబలీకరించి హస్త్యశ్వనగర సహితముగా నగరమును దహించివైచెను. దహింపబడుచున్న నగరమును చూచి, అస్త్రాన్ని భీతులై యాపురాధిపతి ప్రాకారరక్షణకై పారిపోయెను. అస్త్రముల వలని అగ్నిచే నగరమును పూర్తిగా దహించి, శాత్రవులను వధించి ప్రపంచమును దహించుటకు వచ్చిన సాక్షాత్ కాలాగ్నివలె అకృతవ్రణుడు సహసాహుడు అనుగమింప, రథమౌషమున భూమినీ వణీంకిపఁజేయుచున్నాఁడో యనునట్లు రాముఁడు బయలుదేరెను. సర్వక్షత్రియులను పృథివీతలము నుండి సంహరించి, రాముఁడు శాంతించేను. తపస్సాచరింప రాముఁ డు మహేంద్రాద్రి కరిగెను. (29) ఈ మధ్యకాలములో క్షత్రియులు యుద్ధమునకు వచ్చిరి. అందుచే రాముఁడు తపస్సు నుండి వచ్చి వారిని చంప ప్రతినఁ బూనెను. (30)
క్షత్త్రక్షేత్రేషు భూయశ్చ క్షత్త్రముత్పాదితం ద్విజైః ।
నిజఘాన పునర్భూమౌ రాజ్ఞః శతసహస్రశః ॥
వర్షద్వయేన భూయోపికృత్వా నిఃక్షత్రియాం మహీమ్ ।
షట్చతుష్టయవర్షాంతం తపస్తేపే పునశ్చ సః ॥
భూయోపి రాజన్ సంబుద్ధం క్షత్ర ముత్పాదితం ద్విజైః ।
జఘాన భూమౌ నిశ్శేషం సాక్షాత్కాల ఇవాంతకః ॥
కాలేన తావతా భూయః సముత్పన్నం నృపాత్వయమ్ ।
నిఘ్నంశ్చకార పృథివీం వర్షద్వయమనారతమ్ ॥
అలం రామేణ రాజేంద్ర స్మరతా నిధనం పితుః ।
త్రిఃసప్తకృత్వః పృథివీం తేన నిఃక్షత్రియా కృతా ॥
త్రిఃసప్త్వ కృత్వస్తన్మాతో యదురః స్వమతాడయత్ ।
తావద్రామేణ తస్మాత్తు క్షత్త్రముత్సాదితం భువీ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాధే భార్గవచరితే షట్చత్వారింశత్తమోధ్యాయః ॥
నష్టభర్తృకలయిన రాజభార్యల క్షేత్త్రములందు ద్విజులు క్షత్రియుల నుత్పాదించిరి. రాముఁడు మరల భూమి యందు క్షత్త్రయులను శత సహస్రముగా వధించెను. మరల రెండేండ్లలో భూమీనీ నిఃక్షత్రముగా చేసి తరువాత (24) ఇరువది నాలుగు సంవత్సరములు రాముఁడు తపస్సాచరించెను. ద్వీజులచే నుత్పాదింపఁబడిన యుద్దీపితులయిన క్షత్రియులను ప్రళయ కాలాంతకుని వలె రాముఁడు నిశ్శేషముగా వధించెను. తరువాత కాలాంతరమున కొందరు క్షత్రియులుద్బవించిరి. వారందరను చంపుచు పృథ్వినంతటిని రెండేండ్లు రాముఁడు సంచరించెను. ఇక పితృమరణమును రాముడు స్మరింపనక్కరలేదు. కారణము తన తండ్రి మరణమును స్మరించుచు రాముఁడు భూమీని 21 మారు నిక్షత్రియముగా నొనర్చెను. తల్లీ యురము నందు ఇరువది యొక్కమారు కొట్టుకొని దుఃఖించుటచే రాముఁడు 21 మారు క్షత్త్రియహననము చేసెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యమభాగమున తృతీయోపోద్ఘాత పాదమున భార్గవ చరిత్రమున నలుబది యారవ అధ్యాయము.
Summary of chapter 84 of the Brahmānda Mahā Purana is as follows:
Bringing his warrior mission to a holy conclusion, this chapter describes Parashurāma performing a grand Ashvamedha sacrifice and donating the entire conquered earth to sage Kashyapa and the holy Brāhmaṇas. Having fulfilled his cosmic duty, he retired to the Mahendra mountains to engage in eternal penance and meditation. The devoted soul praises his absolute detachment, observing how he freely gave away the entire world without retaining a single grain for himself.