4 - జయాభివ్యాహారము - (జయలను దేవతలను శపించుట)

సూత ఉవాచ : -

బ్రాహ్మణా వై ముఖాత్సృష్టా జయా దేవాః ప్రజేప్పయా

సర్వే మంత్రశరీరాస్తే స్మృతా మన్వంతరేష్విహ

దర్శశ్చ పౌర్ణమాసశ్చ బృహత్సామ రథంతరమ్

చితిశ్చ సుచితీశ్చైవ హ్యాకూలీః కూతిరేవ చ

విజ్ఞాతశ్చైవ విజ్ఞాతా మనో యజ్ఞశ్చ ద్వాదశః

దారాగ్నిహోత్రసంబంధం వితత్య యజతేతి చ

ఏవముక్త్వా తు తాన్ బ్రహ్మా తతైవాంతరథాత్ ప్రభుః

తతస్తే నాభ్యనందంత తద్వాక్యం పరమేష్ఠినః

సన్యస్యస్యేహ చ కర్మాణి వాసనాః కర్మజాశ్చ వై

యమేపేవావతిష్ఠంతే దోషం దృష్ట్వా లు కర్మసు

క్షయాతిశయయుక్తం చ తే దృష్ట్వా కర్మణాం ఫలమ్

జుగుప్సంతః ప్రసూతిం చ నిఃసత్త్వా నిర్మమా భవన్

అంజన్న కాంక్షమాణాస్తే నీరుక్షా దోషదర్శినః

అర్ధం ధర్మం చ కామం చ హిర్వాతే వై వ్యవస్థితాః

 పరమం జ్ఞానమస్థాయ తత్సంక్షిష్య సుసంస్థితాః

తేషాం తు తమభిప్రాయం జ్ఞాత్వా బ్రహ్మా ను కోపితః

తానబ్రవీత్తతో బ్రహ్మా నిరుత్సాహాన్సురానథ

ప్రజార్థమిహ యూయం వై మయా సృషా స్థ నాన్యథా

ప్రసూయధ్వం యజధ్వమ్ చేత్యుక్తవానస్మి వః పురా

యస్మాద్వాక్యమనాదృత్య మమ వైరాగ్యమాస్థితాః

జుగుప్సమానాః స్వం జన్మ సంతతిం సౌభ్యనందత

 కర్మణాం న కృతోభ్యాసో హ్యమృతత్వాభికాంక్షయా

 తస్మాద్యూయమహావృత్తం సప్తకృత్వో హ్యవాప్యథ

 తే శత్తే బ్రహ్మణా దేవా జయస్తం వై ప్రసాదయన్

 క్షమాస్మాకం మహాదేవ యదజ్ఞానాత్మకం ప్రభో

ప్రణతానై సానునయం బ్రహ్మా తాసబ్రవీర్పునః

 లోకేప్యథానుభుంజీత కః స్వాతంత్ర్యమిహార్షతి

 మయా గతం తు సర్వం హి కథమచ్ఛందతో మమ

ప్రతిపత్స్యంతి భూతాని శుభం వా యదీవోత్తరమ్

 లోకే యదపి కించిద్వై శం వా శం వా వ్యవస్థితమ్

సూతుఁడిట్లు చెప్పెను.

(ఈ ప్రకరణము యొక్క అభిప్రాయమిది. ఒకే వర్గమునకు చెందిన దేవతలు ప్రతి మన్వంతరమున పుట్టుదురు. ఆధిపత్యము వహింతురు. దీనికి కారణము ఈ పురాణ కర్తయిట్లు చెప్పుచున్నాఁడు. మొదటీ మన్వంతరమున ‘జయ’ అను దేవతావర్గము భగవదోజ్ఞను పాటించి ప్రజాసృష్టి నొనరింపలేదు. వారు మోక్ష మార్గము నవలంబించిరి. అందుచే బ్రహ్మ వారలను ప్రతి మన్వంతరమున 7 సార్లు జన్మించవలయునని శపించెను. ఇప్పటి మన్వంతరమువరకు అది వైవస్వత మన్వంతరము. అందుచే ప్రతి మన్వంతరమునను 'జయ'లను ఏడు వర్గముల దేవతలు పుట్టిరి. జయవర్గము -1 (పురాణముల ననుసరించి) యాములు, (స్వాయంభువ మన్వంతరమున) 2. తుషితులు - (స్వారోచిషమున) 3. సత్యులు (ఉత్తమమన్వంతరమున) 4. హరులు (తామస మన్వంతరమున) 5. వైకుందులు వైవస్వత మన్వంతరమున) 6. సాధ్యులు - చాక్షుష మన్వంతరమున, 7. ఆతిథ్యులు - వైవస్వతమన్వంతరమున) జయదేవతలు బ్రహ్మయొక్క ముఖము నుండీ, ప్రజల సృష్టింపవలయునను కోరికతో సృజింపం బడిరి. వారందరు భిన్నభిన్న మన్వంతరములలో 'మంత్రము'లే శరీరముగా గలవారు (వారు మంత్ర శరీరులు). దర్శలు, పూర్ణమాసలు, బృహత్తులు, సామములు, రథంతరములు. చేతులు, సుచీతులు, ఆకూతులు, కూతులు, (2) విజ్ఞాతలు, విజ్ఞాతలు, మనస్సులు యజ్ఞములు అను 12 గురు వివాహమాడి భార్యను గ్రహించి అగ్నిహోత్రములను పాటించుకొనుచు మీ యజ్ఞముల నాచరింపుడు. జయదేవతలతో ఇట్లాడి అచ్చటనే ఆ ప్రభువు అంతర్జానుఁడయ్యెను. అంత వారు (ఆజయలు) పరమేష్టియయిన బ్రహ్మవాక్కులను అంగీకరింపలేదు. (4) కర్మల యందు దోషమును గమనించి, వారు కర్మలు విసర్జించిరి. వాసనలను గూడ పరిత్యజించిరి. (వాసనలు - కోరికలు - లేదా అజ్ఞాత లోకాభీ రుచులు. వాసనలు కర్మసంజాతములు. వారు యమాది సాధన చతుష్టయమునకు సంయుక్తులయిరి. కర్మల ఫలము క్షయాతిశయ యుక్తము - (నాశనముతో నధికముగా గూడినవి). ప్రసూతి విషయమున (సంతాన విషయమున- ప్రజాసృష్టి) జుగుప్సావంతులయిరి. వారు నిస్సత్తులయిరి, నిర్మములు (వాంఛారహితులు) నయిరి. వారు జన్మరాహిత్యమును కాంక్షించిరి. కర్మలాచరించుట వలనఁగలుగు దోషదర్శనముచే కర్మపరీత్యాగము చేసిరి, వారు అర్ధ,కామములను ధర్మమును విసర్జించిరి. తురీయ పురుషార్థమయిన మోక్షమునందు వ్యవస్థితులైరి. (7) వారు పరమమైన జ్ఞానము పొంది, దానిని సంక్షిప్త మొనరించి యందే సుసంస్థితులయిరి. (8) వారి యభిప్రాయమును గ్రహించి బ్రహ్మ కుపితుఁడయ్యెను. తరువాత నిరుత్సాహవంతులయిన దేవతలను చూచి, బ్రహ్మ “మీరందరు పూర్వము నాచే ప్రజా సృజనార్థము సృజింపఁబడితిరి. మరియొక దానికి కాదు. అధికముగా ప్రజలను కనుఁడు. యజ్ఞములను విశేషముగా చేయుఁడు. అంతియేకాక ఇంతకు పూర్వము మీకిది చెప్పియే యుంటిని”. మీరు నా వాక్యమును అనాదరించీతీరి, వైరాగ్యమును స్వీకరించితిరి. మీరు మీ జన్మlడ జుగుప్సావంతులయితిరి. సంతానము నభినందింప కుంటిరి. మీరు కర్మలయందు అకృతాభ్యాసులు. దీనికి కారణము మీ మోక్షేచ్ఛ. అందుచే మీకు ఏడు పర్యాయములు జన్మములు కలుగును” అనెను. (11) ఈ విధముగా ఆ జయదేవతలు బ్రహ్మచే శపింపఁబడి, ఆ బ్రహ్మను ప్రసన్నుని చేసికొనిరి. “ఓ మహాదేవ! అజ్ఞానజములయిన మా దోషములను క్షమించుము”. అని ప్రార్థించిరి. వారందరు బ్రహ్మకు సాష్టాంగప్రణామమాచరించి, తనముందు మోకరిల్లిన వారిని చూచి బ్రహ్మ సానునయముగా నిట్లనెను. ప్రపంచమున ప్రతివ్యక్తి ప్రతివస్తువును ఒక పరిమితికి (హద్దుకు) లోనే అనుభవింపవలయును. అంతియేకాని, కర్మబంధముల నుండి యెవ్వడు స్వాతంత్ర్యమనుభవించును? అంతయు నాచే వ్యాప్తమయి యున్నది. ఎల్లవారు ప్రపంచమున మంచిదియో చెడ్డదియో నా యిచ్ఛానుసారముకాక వేరుగా నెట్లు ఆచరింపఁగలరు? శుభవంతముకాని అన్యముకాని ఈ ప్రపంచమున నున్న యెల్ల పదార్థము, బుద్యాత్ముం డనైన నాచే పరివ్యాప్తమై యున్నది. (15)

బుద్ధ్యాత్మనా మయా వ్యాప్తం కో మాం లోకేతివర్తయేత్

భూతానామీహితం యచ్చ యచ్చా ప్యేషాం విచింతితమ్

తథోపచరీతం యచ్చ తత్సర్వం వీదీతం మమ

మయాబద్ధమిదం సర్వం జగత్థావరజంగమమ్

ఆశామయేన బంధేన కస్తం ఛత్తుమిహోత్సహేత్

యస్మాద్వహతి దృప్తో వై సర్వార్థమిహ నాన్యథా

ఇతి కర్మాణ్యనారభ్య కామం ఛందాద్విమోక్షతే

 ఏవం సంభాష్య తాన్ దేవాన్ జయానధ్యాత్మచేతసః

అథ వీక్ష్య పునశ్చాహ ధ్రువం దండ్యాన్స్పజాపతిః

యస్మాన్మామలిసంధాయ సన్యాసాదిః కృతః సుధాః

తస్మాత్స విపులోయతో వ్యాపారస్త్వథ మత్కృతః

భవితా చ సుభోదరో దివ్యభావేన జాయతామ్

ఆత్మచ్ఛందేన వో జన్మ భవిష్యతి సురోత్తమాః

మన్వంతరేషు సంసిద్ధాః సప్తస్వావిర్భవిష్యథ

వైవస్వతాంతేషు సురాస్తథా స్వాయంభువాదీషు

 ఏవం చ బ్రహ్మణా తత్ర శ్లోకో గీతః పురాతనః

త్రయీ విద్యా బ్రహ్మమయప్రసూతిః శ్రాద్ధం తపో యజ్ఞమనుప్రదానమ్

 ఏతాని నిత్యైః సహసా రజోభిర్భూత్వా విభుర్వసతే నక్షత్రశస్తమ్

ఏవం శ్లోకార్థముక్త్వా తు జయాన్ దేవానథాబ్రవీత్

 వైవస్వతేంఒతర్కే తీతే మత్సమీపమిహైష్యథ

తతో దేవస్తిరోభూత ఈశ్వరో హ్యకుతోభయః

 ప్రపన్నా ధారణామాద్యం యుక్త్వా యోగబలాన్వితామ్

 తతస్తీన రుషా శత్తేస్తేజభవన్ద్వాదశాజితాః

జయా ఇతి సమాఖ్యాతాః కృతా ఏవం విసన్నిభాః

 తతః స్వాయంభువే తస్మిన్సర్దేశితీతే తు వై సురాః

పునస్తే తుషితా దేవో జాతః స్వారోచిషేంతరే

ఉత్తమస్య మనోః పుత్రాః సత్యాయం జజ్ఞిరే తదా

తతః సత్యాః స్కృతి దేవా ఔత్తమే చింతరే మనోః

హరిణ్యాం నామ తుషితా జజ్ఞిరే ద్వాదశైవ తు

హరయో నామ తే దేవాః యజ్ఞభాజస్తదాభవన్

సర్వము నాకెఱుక. లోకమున నెవ్వఁడు నన్ను దాటి పోవంగలుగును? భూతములు కోరునట్టిది నేనేఱుఁగుదును. ఆ భూతములు ఊహించినది యెఱుంగుదును. వారు దేని నాచరించుదురో అదియు కూడ నెంగుదును. స్థావర జంగమాత్మకమయిన యీ సర్వజగత్తు ఆశా మయమయిన బంధముచే నాచే నీగళింపఁబడినది. ఎవ్వఁడు దీనిని ఛేదింపగుత్సహించును? దృవుఁడయినవాఁడు గర్వాంధుఁడు) తనతో సర్వార్థముల గ్రహించి పోఁదలంచును. కర్మల నాచరింప మొదలుపెట్టక స్వతంత్రవిధాన మోక్షము పొందగోరును. ఆ జయాది దేవతలతో నీ విధముగా సంభాషించెను. జయాది దేవతలో ఆధ్యాత్మచేతస్కులు. వారల మరల వీక్షించి బ్రహ్మ జయాదులందరును నీచముగా దండ్యార్థులు. ఓ దేవతలారా! నాతో చెప్పకయే మీరు మోక్షాభిప్రాయమును (సన్న్యాసము నందు అభిరతిని) వహించితిరి. అందుచే నాచే వీపులమయిన కార్యాచరణము ఆచరింపఁబడినది. ఇయ్యది మీకు సుఖోదరముగా పరిణమించుత. ఆ భావము దివ్యత్వముచే పుట్టునుగాక. (21) ఓ సురో త్తములారా ! మీ మీ యిచ్చానుకూలముగా (తదాత్మీయ ఛందేన) జన్మమగుగాక. ఏడు మన్వంతరములయందు మీరు సీదులుగా ఆవర్బివింతురు. ఆ మన్వంతరములు స్వాయంభువ మన్వంతరములో ఆరంభమయి వైవస్వత మన్వంతరముతో సమాప్తము నొందును. ఇట్లు చెప్పి బ్రహ్మ పురాతనమైన యొక శ్లోకమును వినిపించెను. (23) “మూఁడు వేదములు, బ్రహ్మమయప్రసూతి. శ్రాద్ధము, తపము యజ్ఞము, అనుప్రదానము (కానుక (దానము) లొసంగుట, వీనితో నిత్యమయిన రజోగుణముతో ప్రభువు కూడియుండును (?) ఈ విధముగా విభుఁడు శ్లోకార్థమును చెప్పి జయాది దేవతలతో ఇట్లు పలికెను. (అర్థమును కూడ వివరించిన పిమ్మట) మీరందరు వైవస్వత మన్వంతరము గతించిన తర్వాత నా సమీపమునకు వచ్చెదరు.” అని చెప్పి అకుతోభయుఁడు (ఎందు, ఎవరి వలనను భయమన్నది లేని ప్రభువు బ్రహ్మ అయిన బ్రహ్మ అంతర్థానము నొందెను, ఆ బ్రహ్మ ఆద్యమయిన ధారణమును వహించి యోగబలాన్వితుఁడై తిరోహితుఁడయ్యెను. (26) అంత పండ్రెండుగురయిన అజితులు కోపముతో శపింపఁ బ్రడిరి. ఈ విధముగా జయులు (విజయులు) అనీ ఖ్యాతి పొందిన జయాదులు పరాజితులయిరి. (27) స్వాయంభువ మన్వంతరము గడచిన తరువాత, స్వారోచిష మన్వంతరములో ఆ దేవతలు తుషితులుగా పుట్టిరి. పోరు ఉత్తముఁడయిన మనువునకు కుమారులుగా సత్యయును భార్యయందు పుట్టిరి. అందుచే సత్యులు ఔత్తమ మన్వంతరమున సత్యులుగా జ్ఞాపకముంచుకొనంబడిరి, (29) ఆ పండ్రెండుగురు. దేవతలు (తుషితులు) హారిణియందు జన్మించిరి. వీరు హరులను నామములతో యజ్ఞభాక్కులయిరి. యజ్ఞహోమాదుల స్వీకరించిరి.

తతస్తే హఠయో దేవాః ప్రాప్తే చారిష్ఠవేంతరే

వికుంఠాయాం పునస్తే వై వరిష్ణా జజ్ఞిరే సురాః   

వైకుంఠా నామ తే దేవాః పంచమస్యాంతరే మనోః

తతస్తే వై పునర్దేవా వైకుంఠాః ప్రాప్యచాక్షుషమ్

తతస్తేవే పునస్సాధ్యః సంక్షీణే చాక్షుషేంతరే !

ఉపస్థితే పునః సర్లే మనోర్వైవతస్య హ

అంశేన సాధ్యాస్తేఖాదీత్యాం మారీచాత్కశ్యపాత్పునః

జజ్ఞిరే ద్వాదశాదీత్యా వర్తమానేంతరే సురాః

యదా చైతే సముత్పన్నాశ్చాక్షుషస్యాంతరే మనోః

శప్తాః స్వయంభువా సాధ్య జజ్ఞిరే ద్వాదశామరాః

ఏవం శ్రుణోతి యో మర్త్యో జయస్తస్య భవేత్సదా

జయానాం శ్రద్ధయా యుక్తః ప్రత్యధ్యాయం తు గచ్ఛతి

 ఇత్యేతా వృత్తయః సప్త దేవానాం జన్మలక్షణాః 

పరిక్రంతా మయా వోద్య కిం భూయః శ్రోతుమిచ్ఛథ

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

జయాభివ్యాహారో నామ చతుర్థోధ్యాయః

అరిష్టవ మన్వంతరము రాగా రైవత?) ఆ ఉత్తములయిన దేవతలయిన హరులు వికుంఠయందు జన్మించిరి. (31) ఐదవ మన్వంతరమున వారు వైకుంఠులనంబడిరి. చాక్షుష మన్వంతరము ప్రాపింపగా వైకుంఠులను ఆ దేవతలు సాధ్యులుగా జన్మించిరి. చాక్షుష మన్వంతరము సమాప్తమయినది. వైశ్వానరమనువుయొక్క సృష్టి ఆరంభమయ్యెను, అసాధ్యులు, స్వకీయములయిన యంశలచే, మరీచి కుమారుఁడయిన కశ్యపునకు అదితికిని గలిగిరి. వర్తమాన మన్వంతరమున ఆ దేవతలు పండ్రెండుగురు ఆదిత్యులుగా పుట్టిరి. (34) ఈ ద్వాదశామరులు చాక్షుష మన్వంతరమున సముత్పున్నలుకాగా, వారు స్వయంభువుఁడైన బ్రహ్మచే శపింపఁబడిరి. వారు ఆ ద్వాదశాదిత్యులు సాధ్యులుగా కీర్తింపఁబడిరి. (35) ఏ మర్త్యుండీ నామములను వినునో అతనికి జయము సర్వదా సంపన్నమగును. ఆతనికి జయాది దేవతలయందు భక్తి ప్రపత్తులు కలుగును.

ఇంక మనము మఱొక అధ్యాయమునకుఁబోవుదము. ఈ ఏడు వృత్తులు దేవతా లక్షణములు. వారి వృత్తాంతము నేడు మీకు వినిపించితిని. ఇంక నేది మీరు నా వలన వీనంగోరెదరో చెప్పుఁడు.

ఇది వాయుప్రోక్తము మహాపురాణమునయిన బ్రహ్మాండమునందు మధ్యమభాగమున తృతీయమైన యుపోద్ఘాతపాదమున జయాభివ్యాహారమను నాలుగవ అధ్యాయము.