9 - రుద్ర ప్రసవ వర్ణనము - భృగాదుల జననము

సూత ఉవాచ:-

రుద్రం ధర్మం మనశ్చైవ రుచిం చైవాకృతిం తథా ।

పంచ కర్తౄన్ హి తదా మనసా వ్యసృజత్ర్పభుః ॥

ఏతే మహాభుజాస్సర్వే ప్రజానాం స్థితి హేతవః ।

ఔషధీః ప్రతిసంధత్తే రుద్రః క్షీణః పునః పునః ॥

ప్రాప్తౌషధిఫలైర్దేవః సమ్యగిష్టః ఫలార్థిభిః ।

త్రిభిరేవ కపాలైస్తు త్ర్యంబకైరోషధీక్షయే ॥

ఇజ్యతే మునిభిర్యస్మాత్తస్మాత్ త్ర్యంబక ఉచ్యతే ।

గాయత్రీ చైవ త్రిష్టుప్ చ జగతీ చైవ తాః స్మృతాః ॥

అంబికానాం మయా ప్రోక్తా యోనయః సవనస్పతేః ।

తాభిరేకత్వభూతాభిస్త్రివిధాభిః స్వవీర్యతః॥

త్రిసాధనః పురోడాశస్త్రికపాలస్తతః స్మృతః ।

త్ర్యంబకః స పురోడాశస్తేనేహ త్ర్యంబకః స్మృతః ॥

ధత్తే ధర్మః ప్రజాః సర్వా మనో జ్ఞానకరం స్మృతమ్ ।

ఆకృతిః సురుచే రూపం రుచి శ్రద్ధాకరః స్మృతః ॥

సూతుండు ఇట్లు చెప్పెను.

మనసా, ప్రభువైన బ్రహ్మ, సృష్టి ప్రతినిధులయిన పంచకర్తలను సృజించెను. వారు రుద్రుండు, ధర్మము, మనస్సు, రుచి, ఆకృతి. వీరందరు మహాభుజులు, శక్తిమంతులు. వారే ప్రజా రక్షణాది స్థితి హేతువులు. ఓషధులు క్షీణింపఁగా మరల మరల రుద్రుఁడు వానిని ప్రతి సంధానము చేయును. పునరుత్పత్తి చేయును. (2) ఫలార్థులయిన వారు ప్రాప్తములయిన ఫలములచే, ఓషధులచే ప్రభువును పూజించిరి. ఓషధులు క్షీణించినప్పుడు కపాలత్రయముచే రుద్రునకు ఋషులు క్రతువు నొనర్చిరి. (కపాలములు పళ్లెములవంటివి. అట్టివి మూఁడు వానిలో రొట్టె నుంచి రుద్రునికై ఋషులు యజ్ఞమాచరించిరి. అందుచే ఆతఁడు త్ర్యంబకుఁడయ్యెను. త్రికపాలముల ద్రవ్యమును రుద్రునకు సమర్పించిరి. అందుచే రుద్రుఁడు త్ర్యంబకుఁడయ్యెను. ఇంతకుఁ బూర్వము నేను చెప్పినట్లు, గాయత్రి, శ్రీష్టుష్, జగతీ - అను వైదికచ్ఛందస్సులు మూఁడు అంబకములకు (కపాలములకు) ఉత్పత్తి స్థానము - (యోని) వానీతో వనస్పతి (ఓషధులు) కూడనట్టిదే. ఈ మూఁడును కలిసికొనీ ఏకత్వము నొందును. (పురోడాశ ప్రదానమును పవిత్రీకరించు మంత్రములుగా నీ మూఁడు ఛందస్సులుపయోగింపబడి ఏకత్వము నొందును. ) పురోడా శమీ మంత్రముల కలయికచే, వాని ప్రత్యేక శక్తిచే వీర్యవంతమగును. అందుచే నీ పురోడాశము త్రికపాలముగా స్మరింపఁబడుచున్నది. (మూడు కపాలములలోనా పదార్థము నుంచుటచే). అందుచేతనే ఈ పురోడాశము త్ర్యంబకముగా చెప్పబడినది. అందుచే నీ పురోడాశము సమర్పింపం బడిన ప్రభువు రుద్రుఁడు, త్ర్యంబకుఁడుగా స్మరింపఁబడుచుస్నాఁడు. (6) ధర్మము ప్రజల నెల్లర నుద్ధరించును పాలించును. జ్ఞానము నొసంగునది మనస్సు. సుందర రూపము. ఆకృతి, శ్రద్ధను కలిగించునది రుచి.

 ఏవమేతే ప్రజాపాలాః ప్రజానాం స్థితి హేతవః ।

అధాస్య సృజతః సర్గం ప్రజానాం పరివృద్ధయే ॥

న వ్యవర్థంత తాః సృష్టాః ప్రజాః కేనాపి హేతునా ।

తతః స విదధే ఋద్ధిమర్థనిశ్చయగామినీమ్ ॥

అథాత్మనీ సమద్రాక్షీత్తమోమాత్రం తు చారిణీమ్ ।

రజః సత్వం పరిత్యజ్య వర్తమానాం స్వకర్మతః ॥

తతః స తేన దుఃఖేన శుచం చక్రే జగత్పతిః ।

తమశ్చ వ్యనుదత్పశ్చాత్ రజసా తు సమావృణోత్ ॥

తత్తమః ప్రతినుత్తం వై మిథునం సంప్రసూయత ।

అధర్మాచరణాత్తస్య హింసా శోకో వ్యజాయత ॥

తతస్తస్మిన్ సముద్భూతే మీథునే వరణాత్మకే ।

తత స భగవానాసీత్ ప్రీతశ్చైతం హి శిశ్రియే॥

ఏవం ప్రీతాత్మనస్తస్య స్వదేహార్ధాద్వినిస్రుతా ।

నారీ పరమకళ్యాణీ సర్వభూతమనోహరా ॥

సాహి కామాత్మనా సృష్టా ప్రకృతేః సా స్వరూపిణీ ।

శతరూపేతి సా ప్రోక్తా సా ప్రోక్తైవ పునః పునః ॥

ఈ విధముగా ధర్మము, మనస్సు, ఆకృతి - అను ప్రజాపాలురయిన మువ్వురును ప్రజాస్థితికి కారణములు. ప్రజాభివృద్దికోటకు సృష్టి సొతఁడు కొనసాగించుచున్నను ఏమి కారణముననో ప్రజావృద్ది (బాహుళ్యము)కాలేదు. అందుచే వృద్ధి నొనర్చుటకు యత్నించుచు తన మనస్సును ఆలోచనచే బ్రద్దలు కొట్టుకొనెను. (తీవ్రముగా నాలోచించెను.) (9) అప్పుడు తనయందు తమోమాత్రమే సంచరించుట నతఁడు గ్రహించెను. కనుగొనెను). ఆ తమో మాత్ర రజస్సును సత్త్వమును పరిత్యజించి స్వకర్మతః వర్తించుచుండుట ప్రభువు చూచెను. (10) అందుచే నా దుః ఖముచే జగత్పతి సంతాపము నొందెను. ఆతఁడు తమస్సును త్రోసి వైచెను. తరువాత దానిని రజస్సుచే సమావరణ మొనర్చెను కప్పెను.) (11) ఆతనిచే త్రోసివేయబడిన తమస్సు ఒక మీథునము ప్రసవించెను. (పుట్టించెను). దాని అధర్మాచరణము వలన హింసయు శోకము పుట్టెను. (12) వరణ (ఆవరణ) రూపమున మిథునము సంజాతము కాగా భగవానుడు సంప్రీతుఁడయ్యెను. దాని నాశ్రయించెను. (18) ఇట్లు సంప్రీతుఁడయిన యాతని దేహము యొక్క అర్ధభాగము నుండి, సర్వకల్యాణి, సర్వభూతమనోహరయైన నారి (స్త్రీ) బహిర్గమించెను. (14) ఆ సుందర స్త్రీ ప్రకృతి నుండి సంతానాభిలాషియైన యతనిచే సృజింపఁబడెను. ఆమె శతరూపయని పిలువఁబడెను. ఆమె మరల మరల అట్లే శతరూపయనియే పిలువబడుచు వచ్చెను. (15).

తతః ప్రజా సముద్భూతా యథా ప్రోక్తా మయా పురా।

 ప్రక్రియాయాం యధా తుభ్యం త్రేతామధ్యే మహాత్మనః ॥

యదా ప్రజాస్తు తాః సృష్టా న వ్యవర్ధత ధీమతః ।

తతోఽన్యాన్మానసాన్పుత్రానాత్మనః సదృశోఽసృజత్ ॥

భృంగ్వంగిరోమరీచీంశ్చ పులస్త్యం పులహం క్రతుమ్ ।

దక్షమత్రిం వసిష్ఠం చ నిర్మమే మానసాన్ సుతాన్ ॥

నవబ్రహ్మాణ ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః ।

బ్రహ్మా యతాత్మకానాం తు సర్వేషామాత్మయోనీనామ్ ॥

తతోఽసృజత్పునః బ్రహ్మా ధర్మం భూతసుఖావహమ్ ।

ప్రజాపతిం రుచిం చైవ పూర్వేషామేవ పూర్వజౌ ॥

బుద్ధితః ససృజే ధర్మం సర్వభూతసుఖావహమ్ ।

మనసస్తు రుచిర్నామ జజ్ఞేయోఽవ్యక్త జన్మనః ॥

భృగుస్తు హృదయాత్ జజ్ఞే ఋషిః సలీలయోనినః ।

ప్రాణాద్ధక్షం సృజన్ బ్రహ్మా చక్షుర్భ్యాం తు మరీచినమ్॥

అభిమానాత్మకం రుద్రం నీర్మమే నీలలోహితమ్ ।

శీరసోంగిరసం చైవ శ్రోత్రాదత్రిం తథైవ చ ॥

ఇంతకు పూర్వము ప్రక్రియా పాద కథనములో నేను చెప్పినట్లు, త్రేతాయుగ మధ్యకాలమున ఆ మహాత్మురాలి నుండి ప్రజ సముద్భూత మయ్యెను. (16) బుద్ధిమంతుఁడయిన యాతనీ వలన సృజింపఁబడిన ప్రజానీకము సంఖ్యాబలమున వృద్ధి కాలేదు. అప్పుడాఁతడు తన్ను పోలిన మానసిక పుత్రుల నితరులను సృజించెను. (17) అతఁడు మనసా, భృగువు, అంగిరసుడు, మరీచి, పులస్త్యుఁడు, పులహుడు క్రతువు, దక్షుఁడు, అత్రి, వసిష్ఠుఁడు అను తొమ్మండుగురు పుత్రులను సృజించెను. (18) వీరు నవబ్రహ్మలుగా పురాణముల నీశ్చయత్వము నొందిరి. వారు యతాత్ములు, ఆత్మయోనులు, బ్రహ్మపుత్రులు - బ్రహ్మలు. భూతములకు సర్వసుఖావహమయిన ధర్మము నాతఁడు (బ్రహ్మ) సృజించెను. ఈ థర్మము, రుచి, ఇద్దరు పూర్వులందరికంటే పూర్వముదయించిన పెద్దలు. (2) బ్రహ్మ సర్వభూతములకు. జనండ సుఖావహమయిన ధర్మమును బుద్దీతః సృజించెను. రుచి యను పేరొందినవాఁడు. ఆవ్యక్తజన్ముఁడయిన పరమాత్మ యొక్క మనస్సు నుండి జన్మించెను. (22) సఖీలు పోనీయగు. భృగువు, ప్రభువు హృదయమునుండి యుదయించెను. బ్రహ్మ తన ప్రాణము నుండి దక్షుని, మరీచినీ, నేత్రములనుండి సృజించెను. (23) నీలలోహితుఁడయిన రుద్రుని తన, యభిమానము నుండి బ్రహ్మ సృజించెను శిరస్సు నుండి ఆంగీరసుని, శోత్రము (చెవి) నుండి యట్లే అత్రిని బ్రహ్మ సృజించెను.

పులస్త్యం చ తథోదానాత్ వ్యానాచ్చ పులహం పునః।

 సమానజో వసిష్ఠశ్చ హ్యపానాన్నీర్మమే క్రతుమ్ ॥

ఇత్యేతే బ్రహ్మణః పుత్త్రాః ప్రజాదౌ ద్వాదశ స్మృతః ।

ధర్మస్తేషాం ప్రథమజో దేవతానాం స్మృతస్తు వై ॥

భృగ్వాదయస్తు యే సృష్టాస్తే వై బ్రహ్మర్షయః స్మృతాః ।

గృహమేథపురాణాస్తే ధర్మస్తైః ప్రాక్ ప్రవర్తితః॥

ద్వాదశైతే ప్రసూయన్తే ప్రజాః కల్పే పునః పునః।

తేషాం ద్వాదశ తే వంశా దివ్యా దేవగుణాన్వితాః ॥

క్రియావన్తః ప్రజావన్తో మహర్షిభిరలంకృతాః ।

యదా తైరిహ సృష్టైస్తు ధర్మాద్యైశ్చ మహర్షిభిః॥

సృజ్యమానాః ప్రజాశ్చైవ న వ్యవర్థంత ధీమతః ।

తమోమాత్రావృతః సోఽభూచ్ఛోకప్రతిహతశ్చ వై॥

యథాఽఽవృతః స వై బ్రహ్మా తమోమాత్రా తు సా పునః ।

పుత్రాణాం చ తమోమాత్రా అపరా నీఃసృతాఽభవన్ ॥

ప్రతిస్రోతాత్మకోఽధర్మో హింసా చైవాఽశుభాత్మికా ।

తతః ప్రతిహతే తస్య ప్రతీతే వరణాత్మకే॥

అతఁడు ఉదానము నుండి (పంచ ప్రాణములలో నొకటీ) పులస్త్యుని ప్యానము నుండి పులహుని సృజించెను. మరల సమానము నుండి వసిష్ఠుని అపానము నుండి క్రతువును సృజించెను. ప్రజా సృష్టికి మొదట ఈ పండ్రెండుగురు బ్రహ్మ పుత్రులుగా స్మరింపఁబడిరి. ఆ దేవతలలో ధర్మము మొదట పుట్టినవాఁడు ఆతఁడే, ప్రథమజుండు. తరువాత సృజింపబడిన భృగ్వాదులు బ్రహ్మరులుగా తలంపబడిరి. వారు పురాతన గృహమేధులు. ధర్మము. ముందుగా ఫారిచే ప్రవర్తింపఁబడినది. (26) ప్రతికల్పము నందు. ఈ పండ్రెండుగురు, పునః పునః ప్రజోత్పత్తిని కలిగింతురు. వారలలో ఆ పండ్రెండు వంశములు దీవ్యములు, దేవతాగుణ సంపన్నములు. (27). వారు క్రియావంతులు, యజనములు నాచరించినారు. ప్రజా (సంతాన) వంతులు, ఆ వంశములు మహరలచే నలంకృతములయినవి. ధర్ముఁడు మొదలగు మహరులచే నుత్పాధింపం బదిన సంతతి అభివృద్ధి పొందలేదు. అప్పుడు ధీమంతుఁడయిన బ్రహ్మ తమో మాత్రావృతుఁడయ్యెను. చింతా వ్యధితుఁడయ్యెను. (29). బ్రహ్మ తమో మాత్రావృతుఁడు. కాగా వాని పుత్రులకును వేరొక విధమయిన తమో మాత్ర. నిసృతమయ్యెను. (పొడమెను). అధర్మము.ప్రతీక్రేతాత్మకముగా ఎదురుగా ప్రవహించేను. అశుభత్మికయయిన యహింస కూడ ఎదురోడెను. తమోమాత్రమయిన ఆవరణచే నాతడు ప్రతిహతండు కాగా, ప్రకాశవంతమయిన తన తనువును బ్రహ్మ పరిత్యజించేను.

స్వాం తనుం స తదా బ్రహ్మా సమపోహత భాస్వరామ్ ।

ద్విధా కృత్వా స్వకం దేహమర్థేన పురుషోఽభవత్ ॥

అర్దేన నారీ సా తస్య శతరూపా వ్యజాయత।

ప్రకృతిభిర్భూతధాత్రీ సా కామాద్వై సృజతః ప్రభోః ॥

సా దివం పృథివీం చైవ మహిమ్నా వ్యాప్య సుస్థితా ।

బ్రహ్మణః సా తనుః పూర్వా దీపమావృత్య తిష్ఠతః ॥

యా త్వర్థా సృజ్యతే నారీ శతరూపా వ్యజాయత ।

సా దేవీ నియతం తప్త్వా తపః పరమదుశ్చరమ్ ॥

భర్తారం దీప్తయశసం పురుషం ప్రత్యపద్యత ।

స వై స్వాయంభువః పూర్వం పురుషో మనురుచ్యతే ॥

తస్యైకసప్తతియుగం మన్వంతరమిహోచ్యతే ।

లబ్ధ్వాతు పురుషః పత్నీం శతరూపామయోనిజామ్ ॥

తయా స రమతే సార్ధం తస్మాత్సా రతిరుచ్యతే ।

ప్రథమః సంప్రయోగః స కల్పాదౌ సమవర్తత ॥

విరాజమసృజత్ బ్రహ్మా సోఽభవత్పురుషో విరాట్ ।

సమ్రాట్ స శతరూపస్తు వైరాజస్తు మనుః స్మృతః ॥

తరువాత నతఁడు స్వశరీరమును. రెండుగా చేసెను. స్వకీయార్ధదేహమున నతఁడు పురుషుఁడయ్యెను మిగిలిన తన శరీరార్ధ భాగము ఒక స్త్రీ (నారి) యయ్యెను. ఆమె. శతరూప, ఆ శతరువయే- భూతధాత్రి జీవకోటి కన్నిటికిని జనని ఏలయన పరమేశ్వరుఁడయిన బ్రహ్మ కామాదులచే సృజించెను. (33) స్వమహిమచే ఆశతరూపు భూమిని ఆకాశమును వ్యాపించి సంస్థితయై యుండెను, దీపమును (ఆకాశమును) యావత్తు. నాక్రమించియున్న. బ్రహ్మయొక్క పూర్వమయిన తనువు (34) నారీ రూపమునసృజింపఁబడిన బ్రహ్మయొక్క రెండవదియైన శరీర భాగమే అదీ శతరూప. ఆ. శతరూప శత సహస. సంవత్సరము తీవ్రమయిన తపమాచరించెను; ప్రదీప్త యశస్వియైన పురుషుని భర్తగా బడసేను. ఆతఁడే మనువుగా వ్యవహరింపఁబడెను. ఆతఁడే పురుషుఁడు స్వాయంభువుఁడు - మున్నుగా నుద్భవించినవాఁడు. (36). డెబ్బది చతుర్యుగవర్గములు. ఒక మన్వంతరమగును, ఆ. పురుషుఁడు, అయోనిజ యయిన- శతరూపను. భార్యగా పొంది ఆమెతో రమించెను. అందుచేఆమె “రతి”గా వ్యవహరింపఁబడెను. కామ సుఖభోగేచ్ఛ రతి యయ్యెను. బ్రహ్మ 'విరాట్టు'ను సృజించెను. (సర్వత్ర ప్రకాశించునట్టివాఁడు) ఆ విరాట్టే పురుషుఁడు అయ్యెను, శతరూప తో కూడిన యతఁడే వైరాజుఁడు, మనువు, సమ్రాట్టుగా స్మరింపఁబడెను.

స వైరాజః ప్రజాసర్గం ససర్జ పురుషో మనుః ।

 వైరాజోత్పురుషాద్వీరౌ శతరూపా వ్యజాయత ॥

ప్రియవ్రతోత్తానపాదౌ పుత్రౌ పుత్రవతాం వరౌ ।

కన్యే ద్వే సుమహాభాగే యాభ్యాం జాతా ఇమాః ప్రజాః ॥

దేవీ నామ్నా తథాకూలిః ప్రసూతిశ్చైవ తే శుభే ।

స్వాయంభువః ప్రసూతిం తు దక్షాయ వ్యసృజత్ప్రభుః ॥

రుచేః ప్రజాపతేశ్చైవ ఆకూతిం ప్రత్యపాదయత్ ।

ఆకూత్యాం మిథునం జజ్ఞే మానసస్య రుచేః శుభమ్ ॥

యజ్ఞశ్చ దక్షిణా చైవ యమలౌ కౌ బభూవుః ।

యజ్ఞస్య దక్షిణాయాం చ పుత్త్రా ద్వాదశ జజ్ఞిరే ॥

యమా ఇతి సమాఖ్యాతా దేవాః స్వాయం భువేతరే ।

యమస్య పుత్త్రా యజ్ఞస్య తస్మాద్యమాస్తు తే స్మృతాః ॥

అజితాశ్చైవ శుక్రాశ్చ ద్వౌ గణౌ బ్రహ్మణః స్మృతా ।

యామాః పూర్వం పరిక్రాంతి యేషాం సంజ్ఞా దీవౌకసః ॥

స్వాయం భువసుతాయాం తు ప్రసూత్యాం లోకమాతరః ।

తస్యాం కన్యాశ్చతుర్వింశర్ధక్షస్త్వజనయత్ ప్రభుః ॥

(కపిలర్షి సాంఖ్యములోని ప్రకృతి పురుషుడు ఇచ్చట శతరూపా మనుషులుగా నిరూపింపఁబడిరి. వైరాజ, మను, పురుష సమ్రాట్ - అను పదములో పురుషునకే పర్యాయ పదములుగా నుపయోగింపబడినవి) ఆ పురుషుఁడు, ఆ వైరాజు, ఆ మనువు, ఆ సమ్రాట్టే ప్రజలను: కనెను సృజించెను. శతరూప పురుషుఁడు, వైరాజునయిన యతని వలన వీరులయిన యిరువురు కుమారులను గనెను. వారు ప్రియవ్రతుఁడు, ఉత్తానపాదుఁడును. పుత్రవంతులయిన గృహమేధులు కోరుకొను పుత్ర శ్రేష్ఠులలో వీరుత్తములు. ఆ శతరూప ఇరువురు కుమార్తెలను గూడ కనెను, వారిరువురు మహాదృష్ట (భాగ్య) శీలులు, వారి వలన నీ ప్రజానీకముత్పన్నమయ్యెను. (41) వారిరువురు ఆకూతీ, ప్రసూతి అనువారు. ఇరువురును పరమ శుభవ్యక్తులు. స్వాయంభువుఁడైన బ్రహ్మ ప్రసూతి సాముక కన్యను దక్షుని కొసంగేను. (42) ఆకూతినీ రుచి యను ప్రజాపతి కతఁడొసంగెను. బ్రహ్మ మానస పుత్రుఁడయిన రుచికి ఆ కూతీవలన మీథున ముదయించిరి. ఆ మిధునము యజ్ఞము, దక్షిణ, యజ్ఞ దక్షిణలు మిథున యుగ్మము. వారికి పండ్రెండుగురు పుత్రులుదయించిరి. (44) స్వాయం భువ మన్వంతరమున వారు దేవులు (దేవతలు) : పోరినే యములందురు (యామాః), పోరు మిథునములయిన యజ్ఞ దక్షిణల వలన నుదయించిన కవలలగుటచే “యాములియిరి. (45) అజితులుశుక్రులు అను రెండు దేవతా గణములు స్మరింపబడినవి. యాములు ముందుగా పరిక్రాంతులు (ప్రదక్షిణములాచరించిన వారు వారికే దీవోకసు లను పేరు కలిగెను. దక్షుఁడు స్వాయంభువసుతమైన ప్రసూతి వలన ఇరువది నలుగురు కుమార్తెలను గనెను. వారే చతుర్వింశ న్మాతృకలు. (47)

సర్వాస్తాశ్చ మహాభాగాః సర్వాః కమలలోచనాః ।

యోగపత్న్యశ్చ తాః సర్వాః సర్వాస్తా యోగమాతరః ॥

సర్వాశ్చ బ్రహ్మవాదిన్యః సర్వా విశ్వస్య మాతరః ।

శ్రద్ధాలక్ష్మీర్థృతిస్తుష్టిః పుష్టిర్మేధా తధా క్రియా ॥

బుద్ధిర్లజ్జా వసుః శాంతిః సిద్ధిః కీర్తిస్త్రయోదశ ।

పత్న్యర్థం ప్రతిజగ్రాహ ధర్మో దాక్షాయణీః ప్రభుః ॥

ద్వారాణ్యేతాని చైవాస్య విహితాని స్వయంభువా ।

యాఽన్యా, శిష్టాయవీయస్య ఏకాదశ సులోచనాః॥

సతీ ఖ్యాతిశ్చ సంభూతిః స్మృతిః ప్రీతిః క్షమా తథా ।

సన్నతిశ్చానసూయా చ ఊర్జా స్వాహా స్వథా తథా ॥

తాస్తదా ప్రత్యగృహ్ణంత పునరన్యే మహర్షయః ।

రుద్రో భృగుర్మరీచిశ్చ ఆంగిరాః పులహః క్రతుః॥

పులస్త్యోఽత్రి ర్వసిష్ఠశ్చ పితరోఽగ్నిస్తథైవ చ ।

సతీం భవాయ ఫ్రాయచ్యత్ఖ్యాతిం చ భృగమే తథా॥

మరీచయే తు సంభూతీం స్మృతిమంగిరసే దదౌ ।

ప్రీతించైవ పులస్త్యాయ క్షమాం వై పులహాయ చ ॥

క్రతవే సన్తతిం నామ అనసూయాం తథాఽత్రయే ।

ఊర్జాం దదౌ వసిష్ఠాయ స్వాహాం చైవాగయే దదౌ ॥

వారందఱు మహాభాగలు, అదృష్టవంతురాండ్రు, వారందఱు కమలలోచనలు. వారందరు యోగుల పత్నులు. వారందరు యోగమతలు, వారందరు బ్రహ్మ వాదినులు (బ్రహ్మను గూర్చి వివరించువారు). వారందరు విశ్వమునకు తల్లులు. (48,49) శ్రద్ద, ల... ధృతి, తుష్టి, పుష్టి మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతి, సిద్ది, కీర్తి - అను నీ పదమూగురు దక్ష పుత్రికలను, పత్నులనుగా ధర్ముడు ప్రతిగ్రహించెను. (50) వీరందరు స్వయంభువుని సృష్టి క్రియకు ద్వారములుగా స్వయంభువుఁడు నిర్ణయించెను. వీపాతము చేసెను. మీగిలిన పదకండుగురు, సులోచనలు. (51) వారు సతీ, ఖ్యాతి, సంభూతి, స్మృతీ, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జా, స్వాహా, స్వధా, అనువారు. వీరందటిని ఇతర మహర్పులు పత్నులనుగా ప్రతి గ్రహించిరి. .ఆ మహర్షులు - రుద్రుఁడు, భృగువు, మరీచి, అంగిరసుఁడు, పులహుడు, క్రతువు, పులస్త్యుండు, అత్రి, వసిష్ఠుఁడు, అగ్ని పితరుండును. అతఁడు (స్వయంభువుఁడు) సతినీ భవునకు, ఖ్యాతినీ భృగువునకు, సంభూతినీ మరీచికి, అంగిరసునకుస్మృతిని, పులస్త్యునకు ప్రీతిని, పులహునకు క్షమను, సంతతిని క్రతువునకు, అత్రికి, అనసూయను, వసిష్ఠునకు ఊర్జను, అగ్నికి స్వాహను, దేవ పితృలకు స్వధను, ఇచ్చెను.

స్వధాం చైవ పితృభ్యస్తు తాస్యపత్యానీ మే శృణు ।

 ఏతాః సర్వా మహాభాగాః ప్రజాస్త్వానుసృతాః స్థితాః ॥

మన్వంతరేషు సర్వేషు యావదాభూతసంప్లవమ్ ।

శ్రద్ధా కామం ప్రజజ్ఞేఽథ దరో లక్ష్మీసుతః స్మృతః ॥

ధృత్యాస్తు నియమః పుత్రస్తుష్ట్యాః సంతోష ఉచ్యతే ।

పుష్ట్యా లాభః సుతశ్చాపి మేధాపుత్రః శ్రుతస్తథా ॥

క్రీయాయాస్తనయౌ ప్రోక్తౌ దమశ్చ శమ ఏవ చ ।

బుద్ధేర్భోధః సుతశ్చాపి అప్రమాదశ్చ తావుభౌ ॥

లజ్జాయా వీనయః పుత్త్రో వ్యవసాయో వసోః సుతః ।

క్షేమః శాంతేః సుతశ్చాపి సుఖం సిధ్ధేర్వ్యజాయత ॥

యశః కీర్తే సుతశ్చాపి ఇత్యేతే ధర్మసూనవః ।

కామస్య తు సుతో హర్షో దేవ్యాం సిద్ధ్యాం వ్యజాయత ॥

ఇత్యేష వై సుఖోదర్కః సర్గో ధర్మస్య సాత్త్వికః ।

జజ్ఞే హింసా త్వధర్మాద్వై నికృతిం చానృతం చ తే॥

నికృత్యనృతయోర్జజ్ఞే భయం నరక ఏవ చ ।

 మాయా చ వేదనా చాపి మిథునద్వయమేతయోః ॥

మయాజ్ఞజ్ఞేఽథ వై మాయా మృత్యుం భూతాపహారిణీం ।

వేదనాయాం తతశ్చాపి జజ్ఞే దుఃఖం తు రౌరవాత్ ॥

ఇంక పారీ సంతానము నాలకించుము. వారందరు మహాభాగలయిన స్త్రీలు, వారి సంతానము వినయవంతులు.. తీరిగీ విప్లవము వచ్చు వలకు వారందరు సర్వ మన్వంతరములందు వారినే యనుసరించి యుండిరి. (57 శ్రద్దకు కొమము పుట్టెను. లక్ష్మీసుతుండు (59-67) (శ్లోకములలో ఆయా గుణములు వ్యక్తులుగా చిత్రింపఁబడినవి. ఆయా గుణ సంభూతములయిన సుగుణ దుర్గణములు పొని పుత్రులుగా చిత్రింపఁబడినవి), దర్పుఁడుగా ప్రఖ్యాతుఁడు. (58) ధృతీయొక్క కుమారుఁడు నియముఁడు  (ధృతి = ధైర్యము; నియమము - నీగ్రహము). తుష్టి కుమారుఁడు సంతోషుఁడు. పుష్టి--కుమారుఁడు లాభుఁడు. మేధకు పుత్రుఁడు శ్రుతుండు (విద్యావంతుఁడు) (59) క్రియ యొక్క కుమారులు దమము, శమము. బుద్ధి కుమారులు బోధ, అప్రమాదము. (60) లజ్జ కుమారుఁడు వినయము; వసువు కుమారుఁడు వ్యవసాయము. (61} శాంతి కుమారుడు క్షేమము. సిద్ద కుమారుఁడు సుఖము, కీర్తీకుమారుడు యశము. వీరందరు ధర్మము యొక్క శుభ సంతానము. కామము యొక్క సుతుఁడు హర్షము. ఇతఁడు సిద్దీ యందు కలిగెను. (62) అధర్మము వలన హింస నికృతి, అనృతము అనుబిడ్డలిద్దరు కలిగిరి, ఈ నికృతీ అనృతములవలన భయనరకములుదయించినవి. పొనికే మాయ వేదన లుదయించేను. (64) మాయ సర్వభూతాప హారిణి యగుమృత్యువును, కనెను. వేదన నుండి గౌరవము వలన దుఃఖము పుట్టెను.

 మృత్యోర్వ్యాధిర్జరా శోకక్రోధాసూయా విజజ్ఞిరే ।

దుఃఖోత్తరాః స్మృతా హ్యేతే సర్వే చాధర్మలక్షణాః ॥

తేషాం భార్యాస్తి పుత్త్రో వా సర్వే హ్యనిధనాః స్మృతాః ।

ఇత్యేష తామసః సర్గో జజ్ఞే ధర్మ నియామకః ॥

ప్రజాః సృజేతి వ్యాదిష్టో బ్రహ్మణా నీలలోహితః ।

సోఽభిధ్యాయ సతీం భార్యాం నిర్మమే చాత్మసంభవాన్ ॥

నాధికాన్న చ హీనాంస్తాన్మానసానాత్మనా సమాన్ ।

సహస్రం చ సహస్రాణామసృజత్కృత్తివాససః॥

తుల్యానేవాత్మనా సర్వాన్ రూపతేజోబలశ్రుతైః ।

పింగళాస్సనిషంగాంశ్చ కపర్దీ నీలలోహితాన్ ॥

విశీఖాన్ హీనకేశాంశ్చ దృష్టిఘ్నాంస్తాన్ కపాలినః ।

మహారూపాన్విరూపాంశ్చ విశ్వరూపాంశ్చ రూపిణః ॥

రథినో వర్మిణశ్చైవ ధన్వీనోఽథ వరూధినః ।

సహస్రశతబాహూంశ్చ దివ్యభౌమాంతరీక్షగాన్॥

స్థూలశీర్షానష్టదంష్ట్రాన్ ద్విజిహ్వాంస్తు త్రిలోచనాన్ ।

అన్నాదాన్పిశితాదాంశ్చ ఆజ్యపాన్ సోమవాంస్తథా॥

అతిమేడ్రోగ్రకాయాంశ్చ శితికంఠోగ్రమన్యుకాన్ ।

సనిషంగతనుత్రాంశ్చ ధన్వినోహ్యసిచర్మిణః॥

మృత్యువు వలన వ్యాధికి జర (ముసలితనము) శోకము, క్రోధము, అసూయ కలిగెను. (జనించిరి). ఇవి యన్నియు తుదను దుఃఖము నే కలిగించునవి. అంతియేకాక ఇవి యన్నియు అధర్మము యొక్క లక్షణములు. (66) వారి భార్య, పుత్రుఁడు తదితరులందరు అనిధనులుగా . మృత్యు రహితులుగా తలంపఁబడిరి. ఇట్లు ధర్మనియామకముగో తామస సృష్టి కలిగెను. (67) “సంతానమును సృజించుము” అని బ్రహ్మచే నీల లోహితుఁడాదేశింపఁ బడేను. ఆతఁడు స్వభార్యయైన 'సతిని గూర్చి తలపోసెను. ఆమె వలన సంతానమును గనెను. (68) ఆ ప్రజ ఆ నీలలోహితున కంటే అధికులును గారు, హీనులునుగారు, అతనితో సమానులయిన ఆతని మానస పుత్రులు. అట్టి కుమారులను (చర్మము ధరించిన పారలను) గజచర్మ ధారులను వేలకు వేలుగా నతఁడు సృజించెను. (69) వారందరికీని ఈ లక్షణములు గుణములు నున్నవి. స్వరూపమున, తేజస్సున, బలమున, పాండిత్యమున ఆతనితో సమానులు. వారు పింగళ వర్ణులు. వారు జటాజూటములు కలిగిన కపర్దులు. వారు నిషంగములు (అమ్ములపొదులను ధరించిన వారు. వారి శరీరచ్చాయ నీలలోహిత వర్ణమిశ్రమము. వారు విశిఖులు, హీనకేశులు, చూపులచే నితరుల జంప జాలినవారు; వారు కపాలముల ధరించినవారు. వారు సుందర రూపులు, వికృతరూపులు, విశ్వరూపులు; (భయంకర రూపులు). వారు రథముల నారోహించినవారు, కవచముల ధరించినవారు; వారు ధన్వులు, అనేక సంఖ్య గల సేన గలవారు; వారికి వందలాది వేలాది బాహువులు కలవు; వారు ఆకాశమున భూమియందు స్వర్గము నందు నెల్లడల పో గలిగినవారు; వారికి స్థూలములయిన శీరములు, ఎనిమిది దంష్టలు, రెండు నాలుకలు, మూడు నేత్రములు. కొందరన్నమును తిందురు; కొందరు మాంసాశనులు; కొందరు నేతిని త్రాగుదురు; కొందరు సోమ రసమును సేవింతురు. వారు మిక్కిలి అతి మేడ్రములు గలవారు; భయంకర కాయులు, నల్లని కంఠ ములు గలవారు; వారు కోపోద్రిక్తులు; వారికి అమ్ములపొదులు, కవచములు, ధనుస్సులు, కత్తులు, చర్మములు కలవు.

ఆసీనాన్ ధావతశ్చాపి జృంభతశ్చాప్యధిష్ఠితాన్ ।

 అధీయానాశ్చ జపతో యుంజతో ధ్యాయతస్తథా ॥

జ్వలతో వర్షతశ్చైవ ద్యోతమానాన్ ప్రధూపితాన్ ।

బుద్ధాన్ బుద్ధతమాంశ్చైవ బ్రహ్మస్వాన్ బ్రహ్మదర్శినః ॥

నీలగ్రీవాన్ సహస్రాక్షాన్ సర్వాంశ్చైవ క్షమాచరాన్ ।

అదృశ్యాన్ సర్వభూతానాం మహాయోగాన్ మహౌజసః ॥

రుదతో ద్రవతశ్చైవ ఏవం యుక్తాన్ సహస్రశః ।

అయాతయామాన్ సృజతం రుద్రమేతా సురోత్తమామ్ ॥

దృష్ట్వా బ్రహ్మాఽబ్రవీదేనం మాస్రాక్షీరీదృశీః ప్రజాః ।

న స్రష్టవ్యాఽత్మన స్తుల్యా ప్రజా నైవాధికా తథా ॥

అన్యాః సృజస్వ భద్రం తే ప్రజాస్త్వం మృత్యుసంయుతాః ।

నారభర్తే హి కర్మాణి ప్రజా విగత్యమృత్యవః ॥

ఏవముక్తోఽబ్రవీదేనం నాహం మృత్యుజరాన్వీతాః ।

ప్రజాః ప్రక్ష్యామి భద్రం తే స్థితోఽహం త్వం సృజ ప్రభో ॥

ఏతే యే వై మయా సృష్ణా వీరూపా నీలలోహితాః ।

సహస్రం హి సహస్రాణామాత్మనో మమ నిఃసృతాః ॥

ఏతే దేవా భవిష్యన్తి రుద్రా నామ మహాబలాః ।

పృథివ్యామంతరిక్షే చ రుద్రాణ్యస్తాః పరిశ్రుతాః॥

కొందరాసీనులు (కూర్చుండియున్నవారు) : కొందరు పరువెత్తు చుండిరి. కొందఱు ఆవలించుచుండిరి. కొందరాసనముల నధిష్టింతురు. కొండరాధీయానులు (వేదముల జదువువారు). కొందరు జపము సల్పుచుండిరి. కొందరు యోగాసనముల వేయుచుండిరి. కొందరు ధ్యానించు చుండిరి. (75) కొందరు, నిప్పువలె జ్వలించుచుండిరి. కొందరు వరించుచుండిరి; కొందరు ప్రకాశించుచుండిరి. కొందరు ప్రధూపితులు. పొగలు జిమ్ము చుండిరి. కొందరు బుద్దులు (ప్రజ్ఞావంతులు) ; కొందరు ప్రబుద్దతములు మేల్కొనియున్నవారు, సర్వ కార్యాచరణ సిద్దులు, పండితులు, కొందరు బ్రహ్మధనులు; కొందరు బ్రహ్మ దర్శినులు. (76) కొందరు నీలగ్రీవులు, సహస్రాక్షులు; వారందరు భూమియందు సంచ రించువారే. వారు సర్వభూతములకదృశ్యులు. కానరారు. వారు మహాయోగ సిద్ధులు, మహా కాంతి మంతులు; (77) కొందరు తప్పెటలు కొట్టు చున్నారు. కొందరీటునటు పారుచున్నారు. రుద్రుఁడిట్టి గుణ లక్షణో హేతులను సురోత్తములను, సహస్ర సంఖ్యలో ఒక యామ కాలములో సృజించుటను గమనించి బ్రహ్మ “ఓ రుద్రా! ఇట్టి ప్రజలను సృజింపమానుము. నీతో తుల్యులైన వారిని గాని, నీ కంటే నధికులయిన ప్రజలను సృష్టింపవలదు. నీకు భద్రమగును. మరణ ధర్ములయిన ఇతరులయిన ప్రజలను సృష్టించుము. నీకు పుణ్యము కలుగును. మృత్యు భయరహితులయిన వ్యక్తులు కర్మ నాచరింపరు.” (80) అని పలికెను. అప్పుడు రుద్రుఁడు బ్రహ్మతో మృత్యు జరా సమన్వితులయిన ప్రజలను నేను సృజింపను. నీకు భద్రమగు గాక. నేను సృజింపమనియుండెదను, నీవే సృజింపుము” ఈ విరూపులు, నీలలోహితులు, సహస్ర సంఖ్యతో సోచే సృజింపం బడిన ప్రజ నా నుండియే వినీఃసృతులు. (పుట్టిరి).(82) వీరందరు రుద్ర నాములు. మహాబలులు, దేవతలగుదురు. రుద్రాణ్యులని వీరందరు పృథివియందు అంతరిక్షము నందు పరిశ్రుతులు. బాగుగా తెలిసినవారు. (83)

 శతరుద్రే సమామ్నాతా భవిష్యన్తీహ యజ్ఞయాః ।

యజ్ఞభాజో భవిష్యన్తీ సర్వే దేవగణైః సహ ॥

మన్వన్తరేషు యే దేవా భవిష్యన్తీహ ఛందజాః ।

తైః సార్ధమిజ్యమానాస్తే స్థాస్యన్తీహాయుగక్షయాత్ ॥

ఏవముక్తస్తతో బ్రహ్మా మహాదేవేన స ప్రభుః ।

ప్రత్యువాచ తథా భీమం హృష్యమాణః ప్రజాపతిః॥

ఏవం భవతు భద్రం తే యధో తే వ్యాహృతం ప్రభో ।

బ్రహ్మణా సమనుజ్ఞాతే తతః సర్వమభూత్కిల ॥

తతః ప్రభృతి దేవః స న ప్రాసూయత వై ప్రజాః ।

ఊర్ధ్వరేతాః స్థితః స్థాణుర్యావదాభూతసంప్లవమ్ ॥

యస్మాత్ప్రోక్తం స్థితోఽస్మీతి తస్మాత్ స్థాణుర్బుధైః స్మృతః ।

జ్ఞానం తపశ్చ సత్యం చ హ్యైశ్వర్యం ధర్మ ఏవ చ ॥

వైరాగ్యమాత్మసంబోధః కృత్న్యాన్యేతాని శంకరే ।

సర్వాన్ దేవాన్ ఋషీంశ్చైవ సమేతానసురైస్సహ ॥

అత్యేతి తేజసా దేవో మహాదేవస్తతః స్మృతః ।

అత్యడి దేవానైశ్వర్యాద్బలేన చ మహాసురాన్ ॥

వీరందరు శతరుద్రీయమున పేర్కొనబడిరి. వారందరు యజ్ఞయులగుదురు. దేవ గణములతో సహితముగా వారందరు యజ్ఞము నందు పాల్గొను యజ్ఞ ఫొక్కులగుదురు. (84) ఛందస్సు నుండి (వేదముల నుండి " తమంత కోరికతో) పుట్టిన వారితో సహితము పూజింపబడుచు, మన్వంతరమున ఈ యుగాంతము వఱకు, వారందరుందురు” (85) అని చెప్పెను. ఇట్లు ఈశ్వరునిచే పలుకఁబడి బ్రహ్మ మిక్కిలి సంతోషించి రుద్రునితో. "ప్రభో । భద్రంతే. నీవు చెప్పినట్లుగానే యగుగాక” అనెను. బ్రహ్మచే ననుజ్ఞాతమయి స్వరము ఇట్లు జరిగేను. (87) అప్పటి నుండి ప్రభువయిన స్థాణుఁడు సంతానప్రజనన మొనరింపలేదు. ఊర్ద్వ రేతుఁడై (బ్రహ్మచారియై - అసఖలిత రేతస్కుడై) ప్రళయాంతము వరకట్లే యుండి పోయెను. “స్థితోస్మి" అని భగవంతుఁడయిన రుద్రుడు బ్రహ్మతో పలికి యుండుటచే ఆతఁడు “స్థాణుఁడని” పండితులలో ప్రఖ్యాతు డయ్యెను. జ్ఞానము, తపస్సు, సత్యము, ఐశ్వర్యము, ధర్మము, వైరాగ్యము, ఆత్మసంబోధము (జ్ఞానము) - మున్నగు సర్వగుణములు శంకరుని యందుండిపోయెను. (90) తన తేజస్సుచే శంకరుఁడు (రుద్రుఁడు) సర్వదేవతలను, ఋషీశ్వరులను, అసురలతో సహా అధిగమించేను. అధీకుఁడయ్యెను. అందుచేతనే రుద్రుఁడు ఒక్కడే “మహాదేవు”ఁడయ్యెను. అతఁడు దేవతలను ఐశ్వరమునను, బలమున మహాసురులను మించి యుండెను.

 జ్ఞానేన చ మునీన్ సర్వాన్ యోగాద్భూతాని సర్వశః ।

ఏవమేవ మహాదేవః సర్వదేవనమస్కృతః ప్రజామనుద్యమాం సృష్ట్వా సర్గా దుపరరామహ ॥

ఇతి శ్రీ బ్రహ్మాండమహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదే

రుద్రప్రసవవర్ణనం నామ నవమోధ్యాయః॥

అతఁడు మునులను జ్ఞానము చేతను, సర్వ భూతములను తన యోగము చేతను, అతిశయించెను. ఇట్లు సర్వత్ర మహాదేవుఁడెల్లరచే నమస్కృతుఁడయ్యెను. ప్రజలను సృష్టించి, తరువాత అనుద్యముఁడై, సృష్టి నుండి యీతఁడు విరమించెను. 

ఇది వాయు ప్రోక్తము, మహాపురాణము అయిన బ్రహ్మాండ పురాణమున పూర్వ భాగమందు ద్వితీయానుషంగ పాదమున "రుద్రప్రసవవర్ణన" మను నవమాధ్యాయము సమాప్తము.