13 - కాల సద్భావవర్ణనము

సూత ఉవాచ:-

బ్రహ్మణః సృజతః పుత్రాన్ పూర్వం స్వాయంభువేoఽతరే

గాత్రేభ్యో జజ్ఞిరే తస్య మనుష్యా సురదేవతాః

పితృవన్నన్య మానాస్తం జజ్ఞిరేపితరోఽపి చ

తేషాం నిసర్గః ప్రాగుక్తః సమాసాత్ శ్రూయతాం పునః

దేవాసురమనుష్యాంశ్చ సృష్ట్వా బ్రహ్మాభ్యమన్యత

పితృవన్మన్యమానా వై జజ్ఞిరేఽస్యోపపక్షతః

మధ్వాదయః షడృతవః పితౄంస్తాన్ పరిచక్షతే

ఋతవః పితరో దేవాః శాస్త్రేఽస్మిన్ నిశ్చయం గతాః

మన్వంతరేషు సర్వేషు హ్యరీతానాగతేషు వై

ఏతే స్వాయంభువే పూర్వముత్పన్నాశ్చాంతరే శుభే

అగ్నిష్వాల్తో స్మృతి నామ్నా తథా బర్హిషదశ్చ వై

అయత్వానస్తథా తేషామాసన్యే గృహమేధినః

అగ్నిష్వాత్తా స్మృతాస్తే వై పితరో నాపొతాగ్నయః

యజ్వానస్తేషు యే త్వాసంపితరః సోమసీథినః

స్కృతా బర్హిషదస్తే వై పితర స్త్వగ్నిహోత్రిణః

ఋతవః పితరో దేవాః శాస్త్రేఽస్మిన్ నిశ్చయం గతిః

మధుమాధవౌ రసౌ జ్ఞేయౌ శుచిశుక్రౌ చ శుష్మిణౌ

నభాశ్చైవ నభస్యశ్చ జీవావేశావుదాహృతౌ

సూతుఁడిట్లు పలికెను :

పూర్వము స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మ పుత్రులను సృజించుచుండ, మనుష్యులు, అసురులు, దేవతలు ఆతని శరీరేంద్రీయముల నుండి యుద్భవించిరి. (1) పితరులు కూడ నాతనిని పితగా దలపోసి, యుద్భవించిరి. వారి సృజన విధాన మంతకుఁబూర్వము వర్ణింపం బడినది. అయినను సంక్షిప్తముగా దానిని వినుము. (2) దేవతలను, అసురులను, మనుష్యులను సృజించి బ్రహ్మ వారిని చూచి గర్వించెను. ఇది కాక వేడొక సృజనమును గూడ సాతఁడు తలపోసెను. పితరుల వలె తలంపఁబడు పితృదేవతలు ఆతని పార్వభాగముల నుండి యుదయించిరి. వసంతముతో ఆరంభించు ఆరు ఋతువులు మొదలయినవి ఆ బ్రహ్మయొక్క పార్వ భాగముల నుండి యుదయించినవి. వానిని పితరులనిపిలిచిరి. “ఋతవః పితరో దేవాః” అని వేదసూక్తము. (4) గతించిన మన్వంతరములందు, రానున్న మన్వంతరములందు అన్ని మన్వంతరములందీ విధానమే పునరావృతమైనది. పూర్వము ఇయ్యవి శుభవంతములయిన స్వాయంభువ మన్వంతరముల నుదయించినవి. (5) వారు అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అను నామములతో స్మరింపఁదిడీరి. వారిలో గృహస్థులు కానీవారు, యజ్ఞముల నాచరించనివారు, ఆగ్నీష్వాత్తుల సంఘమునకు సంబంధీంచిన పితరులుగా స్మరింపఁబడిరి. వారు నిత్యము నియమ పూర్వకముగా యథావీధి అగ్నిహోత్రముల నాచరించిన వారుకారు. (6,7) వారిలో (ఆ పితరులలో) యజ్ఞముల నాచరించినవారు సోమపీథులు (యజ్ఞముల యందు సోమరసమును ద్రాగినవారు). ఆ పితృవర్గములలో అగ్నిహోత్రము లాచరించిన వారినీ బర్హిషదులనుగా స్మరించిరి. వేదముల యందు “ఋతువులు, పితరులు, దేవతలు”, అని స్పష్టముగాఁ జెప్పం బడినది. మధుమాధవ మాసములు (చైత్ర, వైశాఖములు) రసములుగా తెలియవలయును. శుచి, శుక్ర మాసములు (జ్యేషా షాఢములు) శుష్మిణులు (శృంగార పరములయినవి). నభ, నభస్యలు (శ్రావణ భాద్రపదములు) రెండును జీవములని యుదాహరింపఁబడినవి. (7,8,9)

ఇషశ్చైవ తథోర్జశ్చ స్వధావతావుదాహృతౌ

సహశ్చైవ సహాస్యశ్చ ఘోరావేతావుదాహృతౌ

తపాశ్చైవ తపస్యశ్చ మన్యుమాతౌ తు శైశీరౌ

కాలావస్థాసు షట్స్వేతే మాసాభ్యా వై వ్యవస్థితాః

ఇమే చ ఋతవః ప్రోక్తాశ్చేతనాచేతనేషు వై

ఋతవో బ్రహ్మణః పుత్రా: విజేయాస్తేఽభిమానీనః

మాసార్ధమాసస్థానేషు స్థానినో ఋతవో మతాః

స్థానానాం వ్యతిరేకేణ జ్ఞేయాః స్థానాభిమానినః

అహోరాత్రాణి మాసాశ్చ ఋతవశ్చాయనానీ చ

సంవత్సరాశ్చ స్థానానీ కామాఖ్యా హ్యభిమానినామ్

ఏతేషు స్థానినో యే తు కాలావస్థా వ్యవస్థితాః

తత్సత త్త్వాస్తదాత్మానస్తాన్ వక్ష్యామీ నిబోధత

పార్వణ్యస్తిథయః సంధ్యాః పక్షా: మాసార్థసమ్మితాః

నిమేషాశ్చ కలాకాష్ఠా ముహూర్తా దివసాః క్షయాః

ద్వావర్ధమాసౌ మాసస్తు ద్వేమాసావృతురుచ్యతే

ఋతుత్రయం చాష్యయనం ద్వేఽయనే దక్షిణోత్తరే

సంవత్సరః సమేతశ్చ స్థానాన్యేతాని స్థానినామ్

ఋతవస్తు నిమేః పుత్త్రా విజ్ఞేయాస్తే తథైవ షట్

ఇష, ఊర్ణ మాసములు (అశ్వయుజము, కార్తీకము) రెండును స్వధావంతములని చెప్పఁబడినవి. సహ, సహస్య మాసములు రెండు (మార్గశీర్పము, పుష్యము) ఘోరములనీ చెప్పఁబడినవి. (10) తపస్, తపస్య మాసములు రెండు (మాఘ ఫాల్గుణములు)ను శీతకాలమునకు సంబంధించినవి. వీనిని మన్యు ముంతములందురు. (11} కాల గణన సూచకములయిన మాసములు ఋతుషట్కమున చెప్పఁబడినవి. వీనిని ఋతువులందురు. ఈ ఋతువులు బ్రహ్మయొక్క పుత్రులు. ఇయ్యవీ చేతనో చేతనములయిన వస్తువులతో తాదాత్యము చెందునట్టివిగా గ్రహింపవలయును. (12) మాసముల, అర్దమాసములు (పక్షములు), స్థానములందు ఋతువులు స్థానములు గలిగినవిగా స్మరింపఁబడినవి. స్థానములను మారినప్పుడు స్టాణాభిమానులను గ్రహింపవలెను. (13) పగలు, రాత్రులు, మాసములు, ఋతువులు, అయనములు, సంవత్సరములు, ఇవి యన్నియును స్థానములు. వానియందభిమానము గల దేవతల నామములు క్రమముగా నీయబడినవి. (14) అ స్థానములతో దాదాత్మ్యము పొందునట్టివారు, అందే అస్థితులయి యున్నవారు, వారే కాలము యొక్క స్థితులు దానిని వారు తమ ఆత్మలనుగా-దలంచుచున్నారు. ఏలయన వారును ఆదినమాసాదులును నిజమునకు ఒక్కటియే యగుట. వారినిట్లే అవగాహనము చేసికొనవలయును. (15) వారి పొరి కాలమాన స్థితులు - తిథులు (పార్వణ్యములు - శుక్లపక్ష తిథులు), సంధ్యలు, పక్షములు, మాసార్ధ తుల్యములు, నిమేషములు, కలలు, కాష్ఠములు, ముహూర్తములు, దివసములు, రాత్రులు; (16) రెండర్ధమాసములు మాసము. రెండు మాసములు ఒక ఋతువు; మూఁడు ఋతువులోక అయనము; రెండు అయనములు (ఉత్తర, దక్షిణ) - అన్నియును కలిపి యొక సంవత్సర మగును. ఇయ్యవీ ఆయా స్థానికులకు స్థానములు; ఋతువులు “నీమి” బిడ్డలు. అట్లే అవి ఆరుగా గ్రహింపవలయును. (17,18)

ఋతుపుత్త్రాః స్మృతాః పంచ ప్రజాః స్వార్తపలక్షణాః

 యస్మాచ్చైవార్తవేభ్యస్తు జాయంతే స్థాణుజంగమాః

ఆర్తవాః పితరస్తస్మాత్ ఋతువశ్చ పితామహాః

సమేతాస్తు ప్రసూయంతే ప్రజాశ్చైవ ప్రజాపతేః

తస్మాత్ స్మృతః ప్రజాసం వై వత్సరః ప్రపితామహః

స్థానేషు స్థానినో హ్యేతే స్థానాత్మానః ప్రకీర్తితాః

తదాఖ్యాస్తత్ససత్త్వాశ్చ తదాత్మానశ్చ తే స్మృతాః

ప్రజాపతిః స్మృతో యస్తు స తు సంవత్సరో మతః

సంవత్సరసుతో హ్యగ్ని ఋత ఇత్యుచ్యతే బుధైః

ఋతాత్తు ఋతవో యస్మాత్ జజ్ఞిరే ఋతవస్తతః

మాసాః షడర్తవో జ్ఞేయస్తేషాం పంచర్తపాః స్మృతాః

ద్విపదాం చతుష్పదాం చైవ పక్షిణాం సర్పతామపి

స్థావరాణాం చ పంచానాం పుష్పం కాలార్తవం స్మృతమ్

ఋతుత్వమార్తవత్వం చ పితృత్వం చ ప్రకీర్తితమ్

ఇత్యేతే పితరో జ్ఞేయా ఋతవశ్చాత్తపాశ్చ యే

సర్వభూతాని తేభ్యో యదృతుకాలాద్విజజ్ఞిరే

తస్మాదేతే హి పితర ఆర్తవా ఇతి నః శ్రుతమ్

మన్వంతరేష్విహ త్వేతే స్థితాః కాలాభిమానినః

కార్యకారణయుక్తాస్తు ఐశ్వర్యాద్వ్యాప్య సంస్థితాః

స్థానాభిమానినో హ్యేతౌ తిష్టంతీహ ప్రసంగమాత్

పంచవిధ ప్రజలు ఋతు పుత్రులుగా చెప్పబడుచున్నారు. వారు మానవులు, చతుష్పాత్తులు, పక్షులు, సరీసృపములు, వృక్షములు. వారందరు ఆర్తవ లక్షణములు కలవారు, ఋతు సంబంధమైన మార్పులు గలిగి యుందురు. స్థాణువులు, జంగములు నయినవి ఋతువుల వలన పుట్టిరి. ఋతు ధర్మములు, స్త్రీల రజః ప్రవృత్తి ధర్మములు మొదలయినవి, ఆర్తవులు తండ్రులు ఋతువులు పితామహులు. వారు సమేతులయినప్పుడు కలిసినప్పుడు) ప్రజాపతి యొక్క ప్రజలుదయింతురు. (19,20) అందుచేతనే వత్సరము ప్రజల పితామహుడుగా స్మరింపఁబడినది. వారు స్థానముల యందు స్థానితులు. వారు స్థానాత్ములుగా కీర్తింపఁబడిరి. (21) అందుచేతనే వారి వారి నామములు కలిగినవారుగా, వారి సత్త్వము కలిగిన వారుగా, తదాత్ములుగా స్మరింపఁబడిరి. తత్కారణమున ప్రజాపతిగా సంవత్సరము వ్యవహరింపం బడినది. (22) పండితులు సంవత్సర సుతుఁడైన అగ్నిని ఋతుండందురు. వారు ఋతువుల పుట్టుట వలన ఋతువులుగా పిలువబడిరి. (23) సంవత్సరములు ఆరు ఋతువులు కలవి. ద్విపాదులు, చతుష్పాదులు, పక్షులు, సరీసృపములు, స్థాణులు - ఇవి పంచార్తవములు. వీనికి ఋతు ధర్మములయిన మార్పులు కలవు. పుష్పము కొలార్తవము. ఋతుత్వము ఆర్తత్త్వము పితృత్వముగా కీర్తింపఁబడినవి. (25) ఇట్లు ఋతువులు, ఆర్తవములు పితరులుగా తెలియవలయును. ఏలయన (ఋతువులు పితృదేవతలుగా వర్ణింపఁబడినవి. ఈ పితరుల యొక్క కుమార్తెల నామముల విషయమున పురాణములలో భేదమున్నది.) ఋతుకాలమును బట్టి సర్వభూతములు వానికి ఉద్భవించినవి. (ఋతువు - గర్భోత్పత్తికి అనుకూలమయిన కాలము). అందుచే ఆర్తవములు పితరులుగా మేము వింటిమి. ఇయ్యవి మన్వంతరముల యందు కాలాభిమానీనులుగా నుండిరి. (27) వారు కార్యకారణత్వ ప్రాప్తులు. వారు వారి యాధిక్యమున సర్వమును వ్యాపించి యుండిరి. నిజముగా వీరు స్థానాభిమానినులతో తాదాత్మ్యము వహింతురు. వారితోడి ప్రత్యేక సంబంధము వలన వారుండిరి. (28)

అగ్నిష్వాత్తా బర్హిషదః పితరో వివిధాః పునః

జజ్ఞే స్వధా పితృభ్యస్తు ద్వే కన్యే లోకవిశ్రుతే

మేనా చ ధారణీ చైవ యాభ్యాం ధృతమిదం జగత్

తే ఉభే బ్రహ్మవాదిన్యౌ యోగిన్యౌ చైవ తే ఉభే

పితరస్తే నిజే కన్యే ధర్మార్థం ప్రదదుః శుభే

అగ్నిష్వాత్తాస్తు యే ప్రోక్తాస్తేషాం మేనా తు మానసీ

ధారణీ మాననీ చైవ కన్యా బర్హిషదాం స్కృతా

మేరోస్తాం ధారణీం నామ పత్న్యర్థం వా సృజన్ శుభామ్

పితరస్తే బర్హిషదః స్మృతా యే సోమపాయినః

అగ్నిష్వాత్తాస్తు తాం మేనాం పత్నీం హిమవతే దదుః

ఉపహూతా స్మృతా యే వై తద్దౌహిత్రాన్నిబోధత

మేనా హిమవతః పత్నీ మైనాకం సా వ్యజాయిత

గంగాం సరిద్వరాం చైవ పత్నీ యా లవణోదధేః

మైనాకస్యాత్మజః క్రౌంచః క్రౌంచద్వీపో యతః స్మృతః

మేరోస్తు ధారణీ పత్నీ దివ్యౌషధిసమన్వితమ్

మందరం సుషువే పుత్రం త్రిస్రః కన్యాశ్చ విశ్రుతాః

వేలాం చ నియతీం చైవ తృతీయాం చాయతీం విదుః

ధాతుశ్చైవాయతిః పత్నీ విధాతుర్నియతిః స్మృతా

పితృదేవతలు విభిన్నులు. అగ్నీష్వాత్తులు, బరీషదులు. స్వధా పితరులకు లోక విశ్రుతలయిన ఇరువురు కన్యలు కలిగిరి. (29) వారు మేనయు ధారణియు. వారిరువురి వలన యావజ్జగత్ ధరింపఁబడినది. వారిరువురు బ్రహ్మవాదినులు, అంతీయే కాక వారిరువురు యోగినులు కూడ. (30) పవిత్రురాండ్రయిన ఇరువురు కన్యలను ధర్మార్థము పితరులొసంగిరి. ఇంతకుఁ బూర్వము చెప్పఁబడిన వారా అగ్నీష్వాత్తులు, వారికి మేన మానసీపుత్రిక. (31) ధార బరీ షదుల మానసీ పుత్రిగా చెప్పుదురు. బర్హిషదుఁడు ధారణిని మేరువునకు భార్యగా నొసంగేను. పితరులయి బార్హిషదులు సోమపాయులు. అగ్నిష్వాత్తులు మేనసు హిమవంతునకు పత్నిగా నొసంగీరీ. (33) వారు పహూతులుగా చెప్పఁబడిరి. వారీ కూతుంద్ర కుమారుల నెఱుంగుఁడు. హిమవంతుని పత్నియైన మేన మైనాకుని ప్రసవించెను. (34) ఆ హిమవంతునకే సరీద్వరమైన గంగ కలిగినది. ఆమెను అతఁడు లవణోదధికి భార్యగా నొసంగెను. క్రౌంచము యొక్క కుమారుడు మైనాకుఁడు. ఆ క్రౌంచము నుండియే క్రౌంచ ద్వీపమును నామము కలిగినది. (35) మేరువు పతియయిన ధారణి దివ్యౌషధులతో కూడిన మందర మను పుత్రుని లోకవీశ్రుతులయిన మువ్వురు కుమార్తెలను కనెను. (36) ఆ ముగ్గురు పుత్రికలు, వేల, నియతి, అయతి - అనువారు. ఆయతి ధాతయొక్క భార్య, నీయత విధాతృనీభార్య. (37)

స్వాయంభువేంఽతరే పూర్వం యయోర్వై కీర్తితాః ప్రజాః

 సుషువే సాగరాద్వేలా కన్యా మేకా మనిందితామ్

సవర్ణాం నామ సాముద్రిం పత్నీం ప్రాచీనబర్హిషః

సవర్ణాయాం సుతా జాతా దశప్రాచీనబర్హిషః

సర్వే ప్రచేతసో నామ ధనుర్వేదస్య పారగః

తేషాం స్వాయంభువో దక్షః పుత్త్రత్వం జగ్మివాన్ ప్రభుః

త్ర్యంబకస్యాఖ్శాపేన చాక్షుషస్యాంతరే మనోః

ఏతత్ శ్రుత్వా తతః సూతమపృచ్ఛచ్ఛాంశపాయనిః

ఉత్పన్నః స కథం దక్షో హ్యభిశాపాద్భవస్య తు

చాక్షుషస్యాంతరే పూర్వం తన్నః ప్రబ్రూహి పృచ్ఛతామ్

ఇత్యుక్తః కథయామాస సూతో దక్షాశ్రయాం కథామ్

శాంశపాయనిమామంత్ర్య త్ర్యంబకాచ్ఛాపకారణమ్

సూత ఉవాచ :

దక్షస్యాసన్సుతా హ్యష్టౌ కన్యాయా: కీర్తితా మయా

స్వేభ్యో గృహేభ్య ఆనాయ్య తాః పితాభ్యర్చయధృహే

తతస్త్వభ్యర్చితాః సర్వా న్యవసంస్తాః పితుర్గృహే

తాసాం జ్యేష్ఠా సతీ నామ పత్నీ యా త్ర్యంబకస్య వై

నాజహావాత్మజాం తాం వై దక్షో రుద్రమభిద్విషన్

అకరోత్సం న తిందక్షేన కదా చిన్మహేశ్వరః

ఈ యిరువురి సంతానము పూర్వము స్వాయంభువ మన్వంతర కథనమున చెప్పఁబడినది. సాగరుని వలన వేల (సముద్ర తీరము) అనిందితురాలయిన కుమార్తెను కనెను. (38) నముద్రుని కూతురయిన సువర్ణ ప్రాచీన బర్హి యొక్క భార్య మాయెను. ప్రాచీన బరికి సవర్ణ వలన పదిమంది సుతులు పుట్టిరి. (39) వారందరు ప్రచేతసులని పిలువంబడిరి. వారందరు ధనుర్వేదపారగులు. వారికి స్వాయం భువుఁడయిన (తనకు తా పుట్టినవాఁడు) దక్షుఁడు పుత్రుఁడయ్యెను. (40) ఇయ్యదీ చాక్షుష మన్వంతరమున త్ర్యంబకుని శాపమువలన కలిగెను. దీనిని విని శాంశపొయని సూతునడిగెను. “చాక్షుష మన్వంతరమున పూర్వము దక్షుఁడేట్లు భవుని శాపముననుత్పన్నుఁడయ్యెను? అడుగుచుంటిమి. మాకు చెప్పుము.”(42) ఇట్లు అడుగబడి దక్షునికి సంబంధించిన కథను సూతుఁడు శాంశపాయనని సంబోధించి త్ర్యంబక శాపకారణమును చెప్పెను.

సూతుడిట్లు చెప్పెను.

ఇంతకుం బూర్వము చెప్పితిని కదా!  దక్షునకు ఎనమండ్రు కుమార్తెలు కలరు. వారందఱని పోరి వారి భర్త గృహముల నుండి తీసికొని వచ్చి స్వగృహమున పొరల నందఱును దక్షుఁడు గౌరవించెను. (44) ఇట్లు ఆదరముతో గౌరవింపఁబడి వారందరు పితృగృహమున వసించిరి. వారిలో పెద్దది సతి. ఆమె త్ర్యంబకుని పత్ని. (45) రుద్రుని యందు ద్వేషముచే దక్షుండామెను పిలువలేదు. మహేశ్వరుఁడెన్నఁడు దక్షునకు వంగి నమస్కరింపలేదు. (46)

జామాతా శ్వశురే తస్మిన్స్వభావాత్తేజసి స్థితః

తతో జ్ఞాత్వా సతీ సర్వాః స్వసౄః ప్రాప్తాః పితుర్గృహమ్

జగామ సాప్యనాహూతా సతీ తత్స్వపితుర్గృహమ్

తాభ్యో హీనాం పీతా చక్రే సత్యాః పూజామసంమతామ్

 తతోఽబ్రవీత్సా పీతరం దేవీ క్రోధాదమర్షితా

యవీయసీభ్యోప్యధమాం పూజాం కృత్వా మమ ప్రభో

అసత్కృత్య పితర్మాం త్వోం కృతవానసి గర్హితమ్

అహం జ్యేష్ఠా వరిష్ఠా చ త్వం మాం సత్కర్తుమర్హసి

ఏవముక్తోఽ బ్రవీదేనాం దక్షః సంరక్తలోచనః

త్వత్తః శ్రేష్ఠా వరిష్ఠాశ్చపూజ్యా బాలాః సుతా మమ

తాసాం చైవ తు భర్తారస్తే మే బహుమతాః సతీ

బ్రహ్మీష్ఠా: సుతపస్కాశ్చ మహాయోగాః సుధార్మికాః

గుణైశ్చైవాధికాః శ్లాఘ్యః సర్వే తే త్ర్యంబకాత్సతి

వసిష్ఠోఽత్రి: పులస్త్యశ్చ హ్యంగిరా పులహః క్రతు:

భృగుర్మరీచశ్చ తథా శ్రేష్ఠా జామాతరో మమ

యస్మాన్మాం స్పర్థతే శర్వః సదా చైషావమన్యతే

తేన త్వాం న విభూషామీ ప్రతికూలో హి మే భవః

ఇత్యుక్తవాంస్తదా దక్షః సంప్రమూడేన చేతసా

శాపార్థమాత్మనశ్చైవ యే చోక్తాః పరమర్షయః

తథోక్తా పీతరం సా వై కృద్దా దేవీదమబ్రవీత్

 అల్లుఁడయిన దక్షుఁడు, ఆత్మతేజస్థితుఁడయి (తన గొప్పతన మెంచుకోని గర్వించిన స్వభావము వలన) మామ యయిన శివునకు వంగి నమస్కరింపలేదు. తన చెల్లిండ్రందరు తన తండ్రి గృహమున కరిగీరని తెలిసికొని సతీదేవి, తాను తండ్రిచే పిలువఁబడకయే పితృగృహమునకు వెళ్లాను. దక్షుండామెకు ఇతర కుమార్తెల కంటే తక్కువయైన గౌరవము చేసెను. తదల్పపూజాదికమామెకు అసమ్మతమయ్యేను. (47,48) అంత సతీదేవి క్రోధమున మండిపడి తండ్రి “ఓ ప్రభూ! (ఓతండ్రీ!) నా కంటే చిన్నవారయిన చెల్లెండ్ర కంటే అల్పము అధమమునయిన పూజను నా కొనరించి, నన్ననాదరించి నీవు గరితమయిన కృత్యమాచరించతివి. నేనో వీరందరికంటెను పెద్దను. శ్రేష్ఠురాలను. నీవు నాకధికముగ సత్కార మొనర్పఁదగినవాడవు. (49, 50).” ఆమె యిట్లు పలుకఁగా దక్షుండు సంరక్తలోచనుఁడయి “ఈనో కుమార్తెలు నీకంటే శ్రేష్ఠురాండ్రు. నీకంటే ఉత్తమురాండ్రు. నీకంటే పూజ్యలు. (50) ఓ సతీ! పోరి భర్తలు కూడ సోకు నధికముగా గౌరవింపఁదగినవారు. వారు బ్రహ్మిస్తులు, వేదముల యందు నిపుణులు. తపస్వులు - అధిక తపస్సాచరించినవారు. మహాయోగులు; సుధార్మికులు; గుణమున నధికులు; వారందరు త్ర్యయంబకునికంటే శ్లాఘింపఁదగినవారు. వశిష్ఠుఁడు, అత్రి, పులస్త్యుఁడు, అంగీరసుఁడు, పులహుడు, క్రతువు, భృగుఁడు, మరీచి - అందరు శ్రేష్ఠులు. సా జామాతలు. శర్వుఁడు నన్ను తిరస్కరించెను. నన్ను సదా అవమానించును. ఆతఁడు సాకు ప్రతికూలుఁడు అందుచే నిన్ను గౌరవించను.” అని సంప్రమూఢ మయిన బుద్ధిచే పలికెను. తత్ఫలిత మాతనికి, ఆతనిచే నుదహరింపఁబడిన మహరులకు శాపకారణమయ్యెను”, తండ్రి యిట్లు పలుకంగా క్రోధోద్రిక్తురాలయిన సతీదేవి తండ్రితో నిట్లు పలికెను. (51-56)

వాజ్మమనఃకర్మభిర్యస్మాదదుష్టాం మాం విగర్హసే

తస్మాత్ర్యజామ్యహమిమం దేహం తాత తవాత్మజమ్

తతస్తేనావమానేన సతీ దుఃఖాదమర్షితా

అబ్రవీద్వచనం దేవీ నమస్కృత్య స్వయంభువే

యత్రాహముపపద్యే చ పునర్దేహేన భాస్వతా

తత్రాప్యహామ సంభూతా సంభూతా ధార్మికాదపి

గచ్ఛేయం ధర్మపత్నీత్వం త్ర్యంబకస్యైవ ధీమతః

తత్రైవాథ సమాసీనా యుక్తాత్మానం సమాదథే

ధారయామాస చాగ్నేయీం ధారణాం మనసాత్మనః

తత ఆత్మసముత్థోఽ స్యా వాయునా సముదీరితః

సర్వాంగేభ్యో వినిఃసృత్య వహ్నిస్తాం భస్మసాత్కరోత్

తదుపశ్రుత్య నిధనం సత్యా దేవోఽథ శూలభృత్

సంవాదం చ తయార్బుద్ధ్వా యాథాతథ్యేన శంకరః

దక్షస్య చ ఋషీణాం చ చుకోప భగవాన్ ప్రభుః

రుద్ర ఉవాచ :-

సర్వేషామేవ లోకానాం భూర్లోకస్త్వాదీరుచ్యతే

 తం సదా ధారయిష్యామీ నిదేశాత్పరమేష్ఠినః

అస్యాం క్షీతౌ ధృతా లోకాః సర్వే తిష్ఠంతి భాస్వరాః

తానహం ధారయామీహ సతతం చ తదాజ్ఞయా

వాజ్మనః కర్మలచే దోష రహితనయిన నన్ను నీవవమానించితివి. అందుచే నీ శరీరము నుండి పుట్టిన యీనా దేహమును త్యజించు చున్నాను.” అంత అవమానము చేతను, దుఃఖము చేతను, అగౌరవము చేతను బాధపడిన సతీదేవి స్వయంభువునకు నమస్కరించి ఈ పలుకులు పలికెను. “ఎచ్చట నేను తిరిగి ప్రకాశవంతమయిన దేహమున, అయోనిజగా పుట్టినను లేదా ధార్మికుఁడు పవిత్రుఁడునయిన వానికి పుట్టినను, నేను ధీమంతుఁడయిన త్ర్యంబకునకు (59) పత్నీత్వమునే పొందెదను'. అని అచ్చటనే సమాసీనురాలయి, యోగము నొందెను. ఆమె తనయాత్మను పరమాత్మతో సమైక్య మొనర్చెను. తన మనస్సుతో 'ఆగ్నేయిధరణ' మామే వహించెను. అంత ఆమె నుండి పుట్టిన అగ్ని సర్వాంగముల నుండి ప్రజ్వలించెను. వాయువుచే దహింపఁబడి ఆమె శరీరము భస్మసోత్కృతమయ్యెను. (62) శూలధారియైన యీశ్వరుఁడు సతీదేవి మరణమును గూర్చి వినెను. ఆమె సంవాదమును యథాతథమున శంకరుఁడేటింగెను. భగవానుఁడు దక్షుని యందు 'ఋషీశ్వరుల యందు క్రోధోద్రిక్తుం డయ్యెను. (62)

రుద్రుఁడిట్లనెను :

అన్నిలోకములలో భూర్లోకము మొట్టమొదటిదని చెప్పబడుచున్నది. ఆ భూర్లోకమును పరమేష్టి యొక్క విదేశమున ఎల్లప్పుడు ధరించెదను. భాస్వరములయిన మిగిలిన లోకములన్నియు భూర్లోకమును ధరింప ధరింపఁబడినవగును. ఆ పరమేశ్వరుని యాజ్ఞచే దానినిందునే ధరించెదను.

చాతుర్వర్ణ్యం హి దేవానాం తే చా ప్యేకత్ర భుంజతే

నాహం తైస్సహ భోక్ష్యే వై తతో దాస్యంతి తే పృథక్

యస్మాదవమతా దక్షా మత్కృతేఽనాగసా సతీ

ప్రశస్తాశ్చేతరః సర్వాః స్వసులో భర్తృభి స్సహ

తస్మాద్వైవస్వతే ప్రాప్తే పునరేతే మహర్షయః

ఉత్పద్యంతే ద్వితీయే వై మమ యజ్ఞేహ్యయోనీజాః

హుతే వై బ్రహ్మణా శుక్రే చాక్షుషస్యాంతరే మనోః

అభివ్యాహత్య సర్వాంస్తాన్ దక్షం చైవాశపత్పునః

భవితా మానుషో రాజా చాక్షుషస్సత్వమన్వయే

ప్రాచీన బర్హిషః పౌత్రః పుత్రశ్చైవ ప్రచేతసామ్

దక్ష ఏవేహ నామ్నా తు మారిషాయాం జనీష్యతి

కన్యానాం శాలీనాం త్వం వైప్రాప్తే వైవస్వరేంఽతరే

విఘ్నం తత్రాష్యహం తుభ్యమాచరిష్యామి దుర్మతే

ధర్మయుక్తే చ తే కార్యే ఏకస్మింస్తు దురాసదే

సూత ఉవాచ :

తదుపశ్రుత్య దక్షస్తు రుద్రం సోఽభ్యశపత్పునః

యస్మాత్వం మత్కృతేఽనిష్టమృషీణాం కృతవాసి

తస్మాత్సార్ధం సురైర్యజ్ఞేన త్వాం యక్ష్యంతి వై ద్విజాః

హుత్వాఽహుతిం తవ క్రూర హ్యపః స్ప్రక్ష్యంతి కర్మసు

ఇహైవ వత్స్యసి తదా దివం హిత్వా యుగక్షయాత్

దేవతల యొక్క చాతుర్వర్ణ్య విభజనమున్నది. అయినను వారందజొకచో భుజింతురు, వారీతో సహ నేను భోజనము స్వీకరింపను అందుచే వారు నాకు వేలుగా భోజనము సమర్పింతురు. ఓ దక్షా! నా కారణమున దోష రహితురాలయిన సతీదేవి నీ వలన నవమానింపం బడిన కారణమునను, ఇతరులయిన నీ కూతుండ్రందరు వారివారి భర్తలతో ప్రశంసింపఁబడిన కారణమునను, వైవస్వత మన్వంతరము ప్రారంభము కాగా, అయోనిసంభవులయిన యీ ఋషీశ్వరులు నేను చేయు ద్వితీయ యజ్ఞమున, నుద్భవించెదరు. [67) అని వారందడితో చెప్పిన పిమ్మట “చాక్షుష మన్వంతరమున శుక్ర హోమము బ్రహ్మచే నిర్వహింపఁబడినప్పుడు నీవు చాక్షుష వంశమున మనుష్య సంబంధమయిన రాజువగుదువు. నీవు ప్రాచీన బర్షియొక్క పౌత్రునిగాను, ప్రచేతసుని యొక్క పుత్రునిగాను జన్మింతువు. నీవు దక్షుఁడవను నామముననే శాఖినుల కుమార్తెగా పుట్టెదవు. (70) వైవస్వత మన్వంతరము రాగా, అందుకూడ, ఓ దురాత్మా! ఓ దుర్మతీ! ధర్మయుక్తమయిన యొక కార్యము నందు, అయ్యదేంత దురాసదము (చేరరానిదీ అయినను, నేను వీఘ్నమాచరించెదను.”

సూతుఁడిట్లు పలికెను :

దక్షుడీ పలుకులు వినెను. రుద్రునాతఁడు మరల శపించెను. “నీవు నా కారణమున ఋషీశ్వరులకనిష్టము నాచరించితివి. కాన ద్విజులు యజ్ఞములందు, దేవతలతో సహా, నిన్ను పూజింపరు. ఓ క్రూరుఁడా! వారు యజ్ఞక్రియల యందు నీకు ఆహుతుల సమర్పీంచిన తరువాత పవిత్రులగుటకు పవిత్ర జలముల స్పృశించెదరు, యుగాంతమున వారు స్వర్గమును వీడి యందేవసించెదరు. (73) అనెను.

తతో దేవైః స తైః సార్ధం నేజ్యతే పృథగిజ్యతే

తతోఽభీవ్యాహృతో దక్షో రుద్రేణామితతేజసా

స్వాయంభువీం తనుం త్యక్త్వా ఉత్పన్నో మానుషేష్వీహ

జ్ఞాత్వా గృహపతిర్దక్షో యజ్ఞానామీశ్వరం ప్రభుమ్

సమస్తేనేహ యజ్ఞేన సోఽయజద్దేవతైస్సహ

అథ దేవీ సతీ యా తు ప్రాప్తి వైవస్వతేంఽతరే

మేనాయాం తాముమాం దేవీం జనయామాస శైలరాట్

యా తు దేవీ సతీ పూర్వమాసీత్పశ్చాదుమాభవత్

 సదా పత్నీ భవన్యైషా న తయా ముచ్యతే భవః 

మారీచం కశ్యపం దేవీ యథా దితీరనుప్రతా

యథా నారాయణం శ్రీశ్చ మఘవంతం శచీ యథా

విష్ణుం కీర్తీ రుషా సూర్యం వసిష్టం చాప్యరుంధతీ

నైతాస్తు విజహత్యేతాన్ భర్తౄన్ దేవ్యః కదాచన

ఆవర్తమానాః కల్పేషు జాయంతే తైః పునః సహ

ఏవం ప్రాచేతసో దక్షో జజ్ఞే వై చాక్షు షేఽoతరే

దశభ్యస్తు ప్రచేతేభ్యో మారిషాయాం పునర్నృపః జజ్ఞే తదాభిశాపేన ద్వితీయ ఇతి నః శ్రుతమ్

భృగ్వాదయశ్చ యే సప్త జజ్ఞిరే చ మహర్షయః

ఆద్యే త్రేతాయుగే పూర్వం మనోర్వైవస్వతస్య చ

దేవస్య మహాతో యజ్ఞే వారుణీం బిభ్రతస్తనుమ్

ఇత్యేషోఽనుశయో హ్యాపీత్తయోర్హాత్యంతరానుగః

అప్పటి నుండి దేవతలతో సార్ధము రుద్రుఁడు పూజింపబడలేదు. ఆతఁడు ప్రత్యేకముగా పూజింపఁబడుచుండెను. అంత, అమిత తేజస్విమయిన రుద్రునిచే నిట్లు చెప్పఁబడి, దక్షుఁడు స్వాయంభువమయిన తన శరీరమును పరిత్యజించి మానవులలో నతఁడు జన్మించెను. (74,75) యజ్ఞముల కధిపతి, ప్రభువునైన ఈశ్వరు నేటింగి, దక్షుఁడు (గృహపతి) సమస్త యజ్ఞములతో దేవతలతో సహితముగా ఈశ్వరుని పూజించెను. వైవస్వత మన్వంతరము సంప్రాప్తమైనది. పర్వతరాజయిన హిమవంతుఁడు మేనకయందు దేవియయిన ఉమను పుత్రిగా కనెను. ఆమేయే ఆ పూజ్య సతీదేవి. పూర్వమందుదయించినది. (78) ఆమె భవుని యొక్క నిత్యపత్ని ఈశ్వరుఁడెన్నడును ఆమేచే విడువబడీ యుండలేదు. (78) పత్యనువ్రత పవిత్రమైన అదితి మరీచి సుతుఁడయిన కశ్యపుని ఎన్నడును విడిచి యుండనియట్లు ఉమ యెన్నడును భవుని విడిచి యుండదు. ఇందిరాదేవి సారాయణుననుసరించి యుండునట్లు, శచీదేవి పర్జన్య ప్రభువైన యింద్రుని ననుసరించి యుండునట్లు, ఉమభవుననుసరించి యుండును. (79,80) లక్ష్మి విష్ణుని విడువదు; ఉషాదేవి సూర్యుని వీడిచి యుండదు. అరుంధతీ వశిష్ఠుని విడిచి యుండదు. ఈ పవిత్ర స్త్రీలు పవిత్రలు, వారెన్నడును భర్తలను విడిచి యుండరు. కల్పములు పరీవర్తనము చెందును. ఆ కల్పములలో ఆయా జీవులు దయించుచుందురు. వారితో మరల మరల, వీరును నుదయించుదురు. (80) దక్షుఁడు ప్రాచేతసుని కుమారునిగా పుట్టెను. అది చాక్షుష మన్వంతరము. (81) శాపము వలన దక్షుడు మారిష యందు దశ ప్రచేతసులకు రెండవ పర్యాయము రాజుగా పుట్టియుండెనని మేము వినియుంటిమి. (82) వైవస్వత మన్వంతరమున త్రేతాయుగమున భృగ్వాదులయిన సప్తర్షులు ఇతరులు మొదట జన్మించిరి. మహాత్ముఁడైన మహాదేవుని యజ్ఞము నందు పోరుణ సంబంధమయిన శీరమును వారు పొందిరి.

 ప్రజాపతేశ్చ దక్షస్య త్ర్యంబక స్య చ ధీమతః

తస్మాన్నానుశయః కార్యో వైరేష్వివ కదాచన

జాత్యంతరగతస్యాపి భవితస్య శుభాశుభైః

ఖ్యాతీం న ముంచతే జంతుస్తన్న కార్యం విపశ్చితా

ఇత్యేషా సమనుక్రాంతి కథా పాపప్రమోచనీ

యా దక్షమధికృత్యేహ త్వయా పూర్వం ప్రచోదితా

పితృవంశప్రసంగేన కథాహ్యేషా ప్రకీర్తితాః

పితృణామానుపూర్వేణ దేవాన్వక్ష్యామ్యతః పరమ్

త్రేతాయుగముఖే పూర్వమాసస్వాయంభువేంఽతరే

దేవా యామా ఇతి ఖ్యాతాః పూర్వం యే యజ్ఞసూనమః

ప్రథితా బ్రహ్మణః పుత్రా అజత్వదజీతాస్తు తే

పుత్రాః స్వాయం భువస్యైతే శక్తా నామ తు మానసాః

తేషాం యతో గణా హ్యేతే దేవానాం తు త్రయః స్మృతాః

ఛందజాస్తు త్రయస్త్రింశత్సర్గే స్వాయంభువన్య హా

యదుర్యయాతిర్దేవౌ ద్వౌ వీవధప్రాసతో మతిః

వీభాసశ్చ ఋతుశ్చైవ ప్రయాతిర్విశ్రుతో ద్యుతిః

వాయవ్య: సంయమశ్చైవ యామా ద్వాదశ కీర్తితాః

అసమ శ్చోగ్రదృష్టిశ్చ సునయోఽథ శుచిశ్రవాః

కేవలో విశ్వరూపశ్చ సుదక్షో మధుపస్తథా

తురీయ ఇంద్రయుక్చైవ యుక్తో గ్రావజితస్తు వై

ఇట్లు ప్రజాపతి యయిన దక్షునకు, ధీమంతుఁడు, స్వయంభువుఁడు త్ర్యంబకుఁడునయిన ఈశ్వరునకు, గతజన్మము నుండి తీవ్రమయిన వైరమును విడువక పూనియుండుట కార్యము కాదు. (85) శుభాశుభముల నుసరించి మానవులు తమ మనస్సులలో తీవ్రముగా దలపోసిన విషయముల గూర్చిన పరిజ్ఞానమును, అయ్యది పూర్వజన్మ కనుబంధించిన దయినను విడువరు. అందుచే పండితుఁడయిన వాడట్టి విరోధమును పురస్కరించుకోనీ ప్రవర్తించుట కార్యము కాదు. (86) పాప విమోచనకరము, దక్షునికి సంబంధించిన కథ యిట్లు ఆరంభమైనది. ఈ కథనే మీరింతకుంబూర్వము చెప్పవలసినదని ప్రార్థించితిరి. పితృవంశ కథన ప్రసంగమున నీకథ చెప్పబడినది. ఇంక అట్లే పితృవంశ కథనమును కీర్తించినట్లే, దేవల చరిత్రను చెప్పెదను. (88) పూర్వము త్రేతాయుగము యొక్క ఆరంభమున, స్వయంభువ మన్వంతరములో, “యాములు” అనే పేరుతో దేవతలు కలరు. వారందరు 'యజ్ఞ' పుత్రులు. (ఇది దేవవంశ కథనమునకు ఆరంభము). (89) వారు ప్రథితుఁడయిన బ్రహ్మకు పుత్రులు. వారు అజులు (పుట్టనివారగుట. అజులగుట వారు అజితులు. జయింపఁబడనివారు. (90) వారు స్వయంభువుని మానస పుత్రులు, వారీ నామము శక్తులు. అందుచే వారు దేవతలలో త్రివర్ణులుగా స్మరింపఁబడుదురు. (యాములు, అజితులు, శక్తులు). స్వాయంభువుని సృష్టియందు ఛందజులు ముప్పది ముగ్గురు. (91) యాములు పండ్రెండుగురు. వారు క్రమముగా - యదువు, యయాతి, వీవధుఁడు, " స్రాసతుఁడు, మతి, విభాసుఁడు, క్రతువు, ప్రయాతి, విశ్రుతుఁడు ద్యుతి, వాయవ్యుఁడు, సంయముఁడు. (93} యదువు, యయాతులు ఇద్దరు దేవతలు అజితులు పండ్రెండుగురు - వారు - అసముడు, ఉగ్రదృష్టి, సునయుఁడు, శుచిశ్రవుండు, కేవలుఁడు, విశ్వరూపుఁడు, సుదక్షుఁడు, మధుపుఁడు, తురీయుఁడు, ఇంద్రయుక్, యుక్తుఁడు ఉగ్రుఁడు. (గామ్రాజితుఁడు) (94)

జనిమా విశ్వదేవా చ జవిష్ఠో మితవానపి

 జరో విభుర్విభావశ్చ స ఋచీకోథ దుర్దిహః

శ్రుతి ర్గృణానోఽథ బృహచ్ఛుక్రా ద్వాదశ కీర్తితాః

ఆసన్ స్వయంభువస్యైతే చాంతరే సోమపాయినః

దీప్తిమంతో గణా హ్యేతే వీర్యవంతో మహాబలాః

తేషామింద్రస్తదాహ్యాసీత్ ప్రథమో విశ్వభుక్ ప్రభుః

అసురా యే తదా తేషామాసన్ యాదబాంధవాః

సుపర్ణయక్షగంధర్వాః పిశాచోరగరాక్షసాః

అష్ఠౌ తాః పితృభిః సార్ధమాసన్యా దేవయోనయః

స్వాయంభువంతరేఽతీతాః ప్రజాస్తాసాం సహస్రశః

ప్రభావరూపసంపన్నా ఆయుషా చ బలేన చ

విస్తరాదిహ నోచ్యంతే మాప్రసంగో భవేదిహ

స్వాయంభువో విసర్గస్తు విజ్ఞేయః సాంప్రతేన హ

అతీతో వర్తమానేన దృష్టో వైవస్వతేన సః

ప్రజాభిర్దేవతాభిశ్చ ఋషిభిః పితృభిః సహ

తేషాం సప్తర్షయః పూర్వమాసన్యే తాన్నిబోధత

భృంగ్వంగిరా మరీచిశ్చ పులస్త్యః పులహః క్రతుః

అత్రిశ్చైవ వసిష్ఠశ్చ సప్త స్వాయంభువోంతరే

అగ్నీధ్రశ్చాగ్నిబాహుశ్చ మేధా మేధాతిథిర్వసుః

జ్యోతిష్మాన్ ద్యుతిమాన్హవ్యః సవనః సత్ర ఏవ చ

శక్తులు పండ్రెండుగురు. వారు క్రమముగా - జనిమంతుఁడు, విశ్వదేవుడు, జనిష్టుడు, మితవంతుఁడు, జరుఁడు, విభుఁడు, విభావుఁ. డు, బుచీకుఁడు, దురీహఁడు, శ్రుతి, గృణానుఁడు, బృహత్తు. వీరందరు స్వాయంభువ మన్వంతరమున సోమపాయులు. (96) ఈ గణము లందరు మొదట దీప్తిమంతులు, వీర్యవంతులు, మహాబలురు : ప్రభువైన విశ్వభుక్కు వారి అధిపతి. ఆతఁడే యింద్రుఁడు. (97) అచ్చటనే వసించిన అసురులు వారి సోదరులు, దాయాదులు, సుపర్ణులు, యక్షులు, గంధర్వులు, పిశాచులు, ఉరగులు, రాక్షసులు - వీరందరు పితరులతో దేవతలతో కూడుకొని, పండ్రెండు దేవయోని విశేషులు. వారందరు స్వయంభువ మన్వంతరములో గడచిపోయిరి. వారికి సహస్ర సంఖ్యలలో ప్రజలు (సంతానము) కలరు. వారందరు విశేషముగా ప్రభావముతో, సౌందర్యముతో, ఆయుష్చుతో, బలముతో కూడియున్నవారు. వారిని " గూర్చి - ఇచ్చట ప్రసక్తము లేనందున విస్తరముగా చెప్పబడలేదు. (100) స్వాయంభువ మనువు సృష్టినీ వర్తమాన మనుసృస్టిని బట్టి గ్రహింపవలెను. (స్వాయంభువ మనువు, వర్తమాన మనువయిన వైశ్వానరమనువు ముఖ్యులు. వీరి కాలములలోని సంగతులను బట్టి వీరి ప్రాధాన్యము ఈపురాణ కవిచే నుద్ఘాటీంపఁబడియుండవచ్చును.) గత సృష్టి వర్తమాన సృష్టిని బట్టి గ్రహింపవలెను. ఈ ప్రస్తుత సృష్టి ప్రజలు, దేవతలు, ఋషులు, పితరులు - మున్నగు వారిని బట్టి వైవస్వత మను సృష్టి. సప్తరులు పూర్వముండి యుండిరనియే తెలిసికొనవలెను. (101,102) భృగువు, అంగీరసుఁడు, మరీచి, పులస్త్యుఁడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుఁడు - ఈ ఏడుగురు మహర్షులు స్వాయంభువ మన్వంతరమున నుండిరి. (103) అగ్నీధ్రుఁడు, అగ్ని బాహువు, మేథ, మేథాతిథి, వసువు, జ్యోతీష్మంతుఁడు, ద్యుతిమంతుఁడు, హవ్యుఁడు, సవనుఁడు, సత్రుం డు వీరందరు పదిమంది. వీరు స్వాయంభువ మనువు పుత్రులు. (104)

మనోః స్వాయంభువస్త్యేతే దశపుత్త్రా మహౌజసః

 వాయువేగా మహాసత్త్వా రాజానః ప్రథమేంఽతరే

పాసురం తత్సు గంధర్వం సయక్షోరగరాక్షసమ్

సపిశాచమనుష్యంచ ససుపర్ణాప్సరోగణమ్

నశక్యమాసుపూర్యేణ వక్తుం వర్షశతైరపి

బహుత్వాన్నామధేయానాం సంఖ్యా తేషాం కుతః కులే

యా వై ప్రజా యుగాఖ్యాస్తు ఆసన్ స్వాయంభువేంఽతరే

కాలేన మహతాతీతా అయనాబ్ధయుగక్రమైః

ఋషయ ఊచుః-

క ఏష భగవాన్ కాలః సర్వభూతాపహారకః

కస్య యోనిః శ్రీమాదిశ్చ కిం సతతః క్రియాత్మకః

కిమస్య చక్షుః కా మూర్తిః కేవా అవయవాః స్మృతాః

కీం నామధేయం కోఽస్యాత్మా ఏతత్వం బ్రూహి తత్వతః

సూత ఉవాచ :

శ్రూయతాం కాలసద్భావః శ్రుత్వా వైవావధార్యతామ్

సూర్యయోనిర్నిమేషాదిః సంఖ్యాచక్షుః స ఉచ్యతే

మూర్తిరస్య త్వహోరాత్రో నిమేషావయవశ్చ సః

సంవత్సరః సతత్త్వశ్చ నామ చాస్య కళాత్మకః

సాంప్రతానాగతాతీతకాలాత్మా న ప్రపతిః

పంచధా ప్రవీభక్తాం తు కాలావస్థాం నిబోధత

వారు మిక్కిలి బలవంతులు. వారికి వాయువేగము కలదు. ప్రథమ మన్వంతరములో వారు మహాసత్త్వ వంతులయిన రాజులు. (105) అసురులతో, యోగ్య గంధర్వులతో యక్షో గణ రాక్షసులతో, పిశాచ మనుష్య గణములతో, సుపర్ణులతో, అప్సరోగణములతో గూడియున్న యా వంశమును (జాతిని) ఒక క్రమములో వర్ణించుటకు శత సంవత్సరములయినను చాలవు. వారి సామధేయములసంఖ్యాకములు. అందుచే హారి జాతీకి పరిమితి యెందున్నది. (107) ఆ ప్రజలు స్వాయంభువ మన్వంతర యుగమున నుండిరి. యుగములు, సంవత్సరములు, కొలక్రమమున సెన్నియో గతించిపోయినవీ. (108)

ఋషులిట్ను అడీగిరి :

మీరు 'కాలు'డను చున్నారే భగవత్స్వరూపుఁడయిన ఆ కాలుండేవఁడు? సర్వభూతాప హారకుఁడయిన యితఁడెదఁడు? ఆతని జన్న స్థానమెయ్యిది? ఆతనికాదీయెద్ది? ఆతని తత్వమెట్టిది? ఆతని యాత్మయెట్టిది? (109) ఆతని చక్షువేది? ఆతని స్వరూపమెట్టిది? అతని యవయివము లెట్టివిగా స్మరింపఁబడుచున్నవి? ఆతని నామధేయమొద్ది? ఆతని ఆత్మయెట్టిది? తత్త్వత వీనిని చెప్పుగోరెదము.

సూతుడిట్లు పలికెను :

'కాలము” యొక్క సద్భావము నాలకింపుఁడు. విని తరువాత మనస్సున జ్ఞాపక ముంచుకొనుఁడు. సూర్యుఁడాతని జన్మస్థానము. యోని. కనురెప్పపాటు కాల వ్యవధి ఆతఁడు పుట్టినది. ఆతనిని “సంఖ్యాచక్షువందురు. (ఆతని కెన్నియో కన్నులున్న వనచ్చును. ) (111) దీవానిశలాతని శరీరమూర్తి. నిమేషములాతని యవయవములు. సంవత్సరమాతని సారము (తత్త్వము}; ఆతని నామము “కళాత్మకుఁడు' (ఆతని యాత్మయే సంఖ్యా స్థానము) (112) అతడు ప్రజాపతి. ఆతని ప్రజలు, భూత, వర్తమాన, భవిష్యత్కాలములు. ఈకాలావస్థ యైదు విధములుగా విభజింపం బడినది.

దివసార్ధమానమాసైశ్చ ఋతుభిస్త్వయనేస్తథా

సంత్సరత్తు ప్రథమో ద్వితీయః పరివత్సరః

ఇ డ్వస్తరస్తృతీయశ్చ చతుర్థశ్చానువత్సరః

పంచమో వత్సరస్తేషాం కొలః స యుగసంజ్ఞితః

తేషాం తత్వం ప్రవక్ష్యామీ కీర్త్యమానం నిబోధత

ఋతు రగ్నిస్తు యః ప్రోక్తః స తు సంవత్సరో గతః

ఆదితేయస్త్వాసౌ సూర్య కాలాగ్నిః పరివత్సరః

శుక్లకృష్ణగతిశ్చాపి అపాం సారమయః ఖగః

స ఇడావత్సరః సోమః పురాణే నిశ్చయం గతః

యశ్చాయం పవతే లోకాంస్తుభిః సప్తసప్తభిః

అనువాతాం చ లోకస్య స వాయురనువత్సరః

అహంకారాదుదగ్రుద్రః సంభృతో బ్రహ్మణస్తు యః

స రుద్రో వత్సరత్తేషాం విజ్ఞేయో నీలలోహితః

స తత్వం తస్య వక్ష్యామి కీర్త్యమాసం నిబోధత

అంగప్రత్యంగ సంయోగాత్కాలాత్మా ప్రపితామహః

ౠక్సామయజుషాం యోని పంచావాం పతిరీశ్వరః

సోఽగ్నీర్యమశ్చ కాలశ్చ సంభూతిః స ప్రజాపతిః

ప్రోక్తః సంపత్పరశ్చేతి సూర్యయోనీర్మనీషిభిః

దీవసము, అర్దమాసము (పక్షము), మాసము, ఋతువు, అయసము - మొదటిది సంవత్సరము; రెండవది పరివత్సరమ. (114) మూఁడవదీ ఇడ్వత్సరము; నాల్గవది అనువత్సరము. దానిలో ఐదవది వత్సరము. ఆ కాలము {యుగము కాలపు రెండును ఒకటయే. కాల, యుగములు పర్యాయపదములు. ఆ కాలము ఐదేసియేండ్లతో కూడినది. అయ్యవి క్రమముగా, సంవత్సరము, (2) పరివత్సరము (3) ఇవత్సరము {4) అనువత్సరము; 5 వత్సరము. ఈ క్రింది శ్లోకములు - క్రతు - అగ్ని, {2) సూర్యదేవ, (3) సోమ లేక చంద్ర దేష (పితృవర్గముతో) (4) వాయుదేవ 5. రుద్ర యుగముగా పిలువబడినది. (కాలమునకే యుగమని పేరు వారి తత్త్వమును చేపెలమ. కీర్తింపబడగా గ్రహించామని, ఏది క్రతువు, అగ్నిగా చెప్పబడినదో ఆయ్యది సంవత్సరముగా పరిగణించబడినది. (116) ఆదితేయుఁడు (ఇదిశీకుమారుఁడు) అయిన ఈ సూర్యుడు, కాలాగ్నీ కలిసి పరివత్సరము. ఈ చంద్రుఁడు శుక్లకృష్ణ పక్షముల ద్వివిధ గతంలు కలిగినను, ఆతఁడు ఆసాంసారః (నీటి యొక్క సారము) (117) ఇది ఇడోవత్సరమని పురాణముల నిశ్చయింపఁబడినది. ఇతఁడు (చంద్రుఁడు) సప్తసప్తభిః తనుభిః 49 తనువులతో లోకములను పవిత్రీకరించును. ఇంక లోకమునను అనుకూలముగా వీచు వాయువు - అనువత్సర సంజ్ఞకము. (118) ఆతఁడు బ్రహ్మయొక్క అహంకారము వలన 'ఉదగ్రుద్ర'గా పుట్టెను. నీలలోహితుఁడయిన రుద్రుఁడు “వత్సర"ముగా తెలిసికొనదగినవాఁడు. ఆతనియొక్క తత్త్వమును యథార్థ శక్తిని వర్ణించెదను. కీర్తింపఁబడగా ,దానీ నెలలుంగుఁడు. (120) అంగప్రత్యంగ సంయోగమున కాలాత్ముఁడు ప్రపితామహుఁడు, ఆతఁడు ప్రభువు ఋక్సొమయజుర్వేదములకు జన్మస్థానము. ఆతఁడే దీవసము, అర్థమాసాది పంచవిభాగములకు ప్రభువు. (121) అతడు, అగ్ని,యమ, కాల, సంభూతి, ప్రజాపతి. ఆతఁడే సూర్యయోని. దానినే బుద్ధిమంతులు సంవత్సరమందురు.

యస్మాత్కాలవిభాగానాం మాసర్త్వయనయోరపి

 గ్రహనక్షత్రశీతోష్ణవర్షాయుఃకర్మణాం తథా

యోనిః స ప్రవిభాగానాం దివసానాం చ భాస్కరః

వైకారికః ప్రసన్నాత్మా బ్రహ్మపుత్త్రః ప్రజాపతిః

ఏకో నైకోఽథ దివసో మాసోఽర్ధర్తుః పితామహః

ఆదిత్యః సవితా భానుర్జీవనో బ్రహ్మసత్కృతః

ప్రభవశ్చాష్యయశ్చైవ భూతానాం తేన భాస్కరః

తారాభిమానీ విజ్ఞేయో ద్వితీయః పరివత్సరః

సోమః సర్వౌషధిపతిర్యస్మాత్ స ప్రపితామహః

ఆజీవః సర్వభూతాసాం యోగక్షేమకృదీశ్వరః

ఆవేక్షమాణః సతతం భిభర్తి జగదంశుభిః

తిథినాం పర్వ సంధీనాం పూర్ణిమాదర్శయోరపి

యోనీర్నిశాకరోయశ్చ అమృతాత్మా ప్రజాపతిః

తస్మాత్స పితృమాన్ సోమః స్మృత ఇడ్వత్సరాత్మకః

ప్రాణాపానసమానాద్యైర్వ్యానోదానాత్మకైరపి

కర్మభిః ప్రాణినాం లోకే సర్వచేష్టాప్రవర్తకః

పంచానాం చేంద్రియమనోర్బుద్ధిస్మృతిబలాత్మనామ్

సమానకాలకరణక్రియాః సంపాదయన్నపి

సూర్యుఁడు పరివత్సరముగా గ్రహింపవలయును. ఆతఁడే కాల విభాగములయిన మాసములకు, ఋతువులకు, ఉత్తరాయణ దక్షిణాయన ద్వయమునకు, గ్రహములకు, నక్షత్రములకు, శీతోష్ణములకు, వర్షమునకు, ఆయుః కర్మలయిన పవిత్ర కలాపములకు జన్మస్థానము. (యోని}; భాస్కరుఁడు ప్రవిభాగములకు, దివసములకు జనుః స్థానము, ఆతఁడు వైకారికుఁడు : ప్రసన్నాత్ముఁడు; బ్రహ్మ పుత్రుఁడు, ప్రజాపతి. (124) (ప్రజారక్షకుఁడు}; ఆతఁడు ఒక్కడు (ఏకః); నిజమునను ఒకవిధముగా చెప్పిన ఒక్కడే కాఁడు; ఆతఁడు - దీవసము, మాసము, ఋతువు అంతియేకాదు ఆతఁడు పితామహుఁడు. ఆతఁడు ఆదిత్యుఁడు, సవిత, భానువు, జీవనుఁడు (ప్రాణకారుఁడు) బ్రహ్మచే సత్కృతుఁడు; ఆతఁడే ప్రభువుఁడు (జన్మమునకు (భవమునకు) కారకుఁడు; అవ్యయుఁడు (అవ్యయుఁడు - ప్రళయాంతమున నాతనీ యందు నన్నియును లయమొందువాఁడు). అందుచే భాస్కరుఁడు తారాభీమాని; ఆతనినే ద్వితీయ పరివత్సరునీగా నెఱుంగవలయును. (126) సోముఁడు (చంద్రుం డు) సర్వోషధిపతి; అందుచే నాతండు పితామహుఁడు; ఆతఁడే సర్వభూతముల జీవితమునకు ఆధారుఁడు (ఆజీవుండు}; ఆతఁడీశ్వరుఁడు. అందుచే అప్రాప్త విషయమును ప్రాప్తించుట యను యోగమును, ప్రాప్తమయిన దానిని రక్షించుట యను క్షేమమును సమకూర్చునట్టివాఁడు. (127) ఆతఁడెల్లప్పుడీ విశ్వమును పర్యవేక్షించుచు స్వకీరణములచే రక్షించి భరించును; ఆతఁడు తిథులకు, పర్వములకు, పర్వసంధులకు, పూర్ణిమలకు, అమావాస్యలకు కారణుడు; ఆతఁడు రాత్రిని కలిగించును; అందుచే నతఁడు నిశాకరుండు; అమృతాత్ముఁడు, ప్రజాపతి. ఈ కారణములచే సోముఁడు పితృమంతుఁడు (పితృదేవతాత్మకుఁడు; అందుచే నతనిని ఇడ్వత్సరునీగా స్కరీంతురు. (129) ఇంక వాయువు అనువత్సరుఁడు : ఏలయన - ఆతఁడు ప్రపంచ మందలి సర్వప్రాణులకు, ప్రాణాపాన సమానవ్యానోదానాదులచే జరుగు కర్మలచే సర్వశేషా ప్రవర్తకుఁడు. అతఁడు పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, స్మృతి.

సర్వాత్మా సర్వలోకేశ ఆవహప్రవహాదిభిః

 వర్తతే చోఽపకారైర్యస్తనుభిః సప్తసప్తభిః

విధాతా సర్వభూతానాం క్షేమీ నిత్యం ప్రభంజనః

యోనిరగ్నేరపాం భూమే రవేశ్చంద్రమసశ్చ యః

వాయుః ప్రజాపతిర్భూతో లోకాత్మా ప్రపితామహః

అహోరాత్రాకరస్తస్మాత్స వాయురనువత్సరః

ఏతే ప్రజానాం పతయశ్చత్వార ఉపపక్షజాః

పితరస్సర్వలోకానాం లోకాత్మానః ప్రకీర్తితాః

ధ్యాయతో బ్రహ్మణో వక్త్రాద్రుదనమభవద్భవః

ఋషిర్విప్రా మహాదేవో భూతాత్మా ప్రపితామహః

ఈశ్వరః సర్వభూతానాం ప్రణవో యోఽథ పఠ్యతే

ఆత్మావేశేన భూతానామంగప్రత్యంగసంభవః

ఉన్మాదకోఽనుగ్రహకృద్రుదోవత్సర ఉచ్యతే

సూర్యశ్చ చంద్రమాశ్చాగ్నిర్వాయూరుద్రస్తథైవ చ

యుగాభిమానీ కాలాత్మా నిత్యం సంక్షయకృద్విభుః

రుద్రః ప్రవిష్టో భగవాస్ జగత్యస్మిన్ స్వతేజసా

ఆశ్రయాన్మయి సంయోగాత్తనుభిర్నామభిస్తథా

తతస్తస్య తు వీర్యేణ లోకానుగ్రహకారకమ్

బలము, మున్నగు సమాన కాలక్రియలను సంపాదించును. (భౌతిక శరీర సంబంధ కార్య కలాపములతని వలననే కలుగును). (151) అతఁడు సర్వాత్ముఁడు. “ఆహవ ప్రవహాదులచే నతఁడు సర్వలోకేశుఁడు; లోకోపకారములయిన సప్తసప్త (అనఁగా నలుబది తొమ్మిది) మరుత్తుల ద్వారా ప్రవర్తించును. (132) ఆ వాయువు సర్వభూతములకు విధాత, ఆతఁడే సర్వభూత క్షేమము సమకూర్చువాఁడు; నిత్యుఁడు; ఆతఁడే ప్రభంజనుఁడు (విజృంభించిన వాయువు}; ఆతఁడే అగ్నియొక్క నీటి యొక్క భూమియొక్క సూర్యునియొక్క చంద్రునియొక్క ప్రభవస్థానము. (133) ఆ పాయువే ప్రజాపతి; లోకాత్ముడు; ఆతఁడే ప్రపితామహుఁడు; ఆతఁడే రాత్రింబవళ్లను కలిగించును; అందుచే ఆ వాయువు దేవత అనువత్సరుఁడు. (134) ఈ నాలుగు, అనఁగా కాలము, సూర్యుఁడు, చంద్రుఁడు, వాయుదేవత) ప్రజాధిపతులు, వారందరు ఉపపక్షజులు. (బ్రహ్మ పార్వము నుండి పుట్టినవారు. వారే సర్వలోకములకు పితరులు. అందుచే వారు లోకాత్ములుగా కీర్తింపఁబడిరి. (155) ధ్యాన మగ్నుం డయిన బ్రహ్మ ముఖము నుండి ఏడ్చుచుబుట్టినవాడు, ఆ భవుఁడు, వేదములయందు, ఋషి, విప్రుఁడు, భూతాత్ముఁడు, పీతామహుఁడు, మహాదేవుఁడు, సర్వభూతములకు ఈశ్వరుండు, ప్రణవము (ఓం) చెప్పబడినాఁడు. ఆపరమేశ్వరుని ఆత్మావేశము వలననే (భూతములలో ప్రవేశించుటకతమున) భూతములకు అంగప్రత్యంగములు కలిగినాయి. (157) ఉన్మాదకుఁడు, అనుగ్రహకారకుఁడు అయిన రుద్రుఁడు వత్సరమని చెప్పబడుచున్నాడు. సూర్యుడు, చంద్రుఁడు, అగ్నీ, వాయువు, రుద్రుఁడు - అందరు యుగముతో అద్వైత భావమును పొందినవారు; కాలాత్ముం డయిన రుద్రుఁడు, నిత్యము లయకారణుఁడు. భగవానుఁడయిన రుద్రుఁడు స్వతేజస్సుచే జగత్తునందు ప్రవేశించెను. (139) శరీరముతో, నామధేయములతోడి సంబంధము గలిగిన ఆత్మయొక్క ఆశ్రయబలముచే ఆ ఈశ్వరుఁడీ జగత్తునంతను ప్రవేశించును. (140)

దేవత్వం చ పితృత్వం చ కాలత్వం చాస్య యత్పరమ్

 తస్మాద్వై సర్వథా రుద్రస్తద్విద్వద్భిరభీజ్యతే

యతః పతిః స భగవాన్ ప్రజేశానాం ప్రజాపతిః

భావనః సర్వభూతానాం సర్వాత్మా నీలలోహితః

ఔషధీః ప్రతీసంధత్తే రుద్రః క్షీణాః పునః పునః

ప్రజాపతిముఖైర్దేవైః సష్యగిష్టఫలార్దిభిః

త్రిభిరేవ కపాలైశ్చ త్ర్యంబకైరౌషధీక్షయే

ఇజ్యతే భగవాన్ యస్మాత్తస్మాత్ర్యంబక ఉచ్యతే

గాయత్రీ చైవ త్రిష్టుప్చ జగతీ చైవ యాః స్మృతాః

త్ర్యంబకా నామతః ప్రేమ్ణా యోనయస్తా వనస్పతేః

తాభిరేకత్వభూతాభిస్త్రీవిధాభిః స్వవీర్యతః

త్రిసాధనః పురోడాశస్త్రికపాలః స వై స్మృతః

త్ర్యంబకః స పురోడాశస్తేనైష త్ర్యబకః స్మృతః

ఇత్యేతత్పంచ వర్షం హి యుగం ప్రోక్తం మనీషిభిః

స్వీయ తేజస్సుచే నతనికి దేవతల యొక్క పితరుల యొక్క కాలము యొక్క యున్నత స్థితి కలదు. ఈ టౌన్నత్య స్థానమున నతఁడు జగత్తును ఆశీర్వదించును. అయ్యది యున్నతమయినది. అందుచే రుద్రుఁడు రుద్రునెటింగీత విద్వాంసులచే నెల్లపుడును పూజింపబడును. (141) తత్ర్పభువు ప్రజేశులకు ప్రభువగుటచే, ప్రజాపతి యగుటచే, నతఁడు సర్వభూతములకు సర్వాత్ముఁడు; ఏలయన నీలలోహితుఁడు సర్వాత్మకుఁడు కాన. రుద్రుఁడు క్షీణములై కాంతి హీనములయిన ఓషధులను పునః పునః పునరుజ్జీవింపఁజేయును, ఓషధులు క్షీణించునపుడు, ప్రజాపతి పురస్సరులై దేవతలు ఆతని పూజింతురు. తమకు కావలసిన ఇష్టములయిన ఫలములను వారు కోరుదురు. పురోడాశమును కపాల త్రయములోనుంచి యాతఁడు పూజింపఁబడును. దానినే త్ర్యంబకములందురు. తత్ర్పభువు. త్ర్యంబకుఁడని చెప్పఁబడుచున్నాఁడు, (144) వేదమంత్ర ప్రాయమయిన గాయత్రి, త్రిష్టుప్జగతీ ఛందస్సులు త్ర్యంబక నామము వలన స్మరింపఁబడును. ప్రేమచే నయ్యవి వనస్పతి రాజ్యమునకు ఆధార స్థానములు. ప్రభవ స్థానములు. (145) త్రివిధములయిన వేదచ్ఛందములచే పునశ్చరణముచే పురోడాశము ఒక్కటిగా సంయోజితము చేయబడుటచే నది త్రికపాలమయినది. ఏలయన - దానికి విధానత్రయము కలదు; వాని వీర్యముచే నవి త్రివిధములుగా ప్రతిష్ఠితము. (146) అందుచే పురోడాశము త్ర్యంబకము. అందుచేతనే రుద్రుఁడు త్ర్యంబకుఁడుగా వక్కాణింపఁబడినాడు. ఈ విధముగా ఐదు సంవత్సరములతో కూడిన దానికి యుగమని పండితులు వ్యవహరించినారు. (147)

 యశ్చైష పంచధాత్మా వై ప్రోక్తః సంవత్సరో ద్విజైః

సైకః షట్కో విజజ్ఞేఽథ మధ్వాదీఋతుసంజ్ఞకః

ఋతుపుత్త్రార్తవాః పంచ ఇతి సర్గః సమాసతః

ఇత్యేష బహుమానో వై ప్రాణినాం జీవితాని చ

నదీవేగ ఇవాసక్తకాలో ధావతి సంహరన్

ఏతేషాం యదపత్యం వై తదశక్యం ప్రమాణతః

బహుత్వాత్పరిసంఖ్యాతుం పుత్రపౌత్ర మనంతకమ్

ఇమం వంశం ప్రజేశానాం మహాతః పుణ్యకర్మణామ్

కీర్తయన్ పుణ్యకీర్తీనాం మహతీం సిద్ధీమాప్నుయాత్

ఇతి శ్రీ బ్రహ్మాండమహాపురాణే వాయుప్రోకే పూర్వభాగే ద్వితీయేఽఖనుషంగపాదే కాలసద్భావవర్ణనం నామ త్రయోదశోఽధ్యాయః

ఏయది పంచవిధములుగా పండితులచే చెప్పబడినదో అదీ సంవత్సరము. ఈ పంచ విధములుగా చెప్పఁబడినదానిని వసంతాది షడృతువులుగా గ్రహింపవలెను. (148) ఐదు ఆర్తవములు ఋతువుల బిడ్డలు ఈ విధముగా కాల సృష్టి సంక్షిప్తముగా వ్యాఖ్యానింపఁబడినది. ఈ వీధముగా వేడొక దానితో సంసక్తము కాని కాలము అనంత మానములతో (కొలతలతో) నొప్పి, ప్రాణులయొక్క జీవితములను, అపహరించుచు, సంహరించుచు, తొందరగా సాగక ప్రవహించిపోవు నదీ జలముల వోలె పరువెత్తును. (149) వీనియొక్క సంతానము సప్రమాణముగా వివరించుటకు తత్పుత్ర పౌత్రకముల సంఖ్య అనంతము. ప్రజాప్రభవులు, మహాపుణ్యకర్ములు పుణ్యకీర్తిమంతులునయిన వీరి వంశము యొక్క కీర్తనము వలన, జనులు గొప్ప సిద్ధిని పొందుదురు గాక,

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున పూర్వభాగమందు ద్వితీయానుషంగ పాదమున కాలసద్భావ వర్ణనమను త్రయోదశాధ్యాయము సమాప్తము.