బ్రహ్మాండ మహా పురాణము
3 - తృతీయాధ్యాయము
సూత ఉవాచ:-
శ్రుణు తేషాం కథాం దివ్యాం సర్వపాపప్రమోచనీం ।
కథ్యమానాం మయా చిత్రాం బహ్వర్థం శ్రుతిసంమతామ్ ॥
య ఇమాం ధారయేన్నిత్యం శ్రుణుయాద్వాప్యభీష్టతః ।
స్వవంశం ధారణం కృత్వా సర్గలోకే మహీయతే ॥
విశ్వతారా యా చ పంచ యథావృత్తం యథాశ్రుతమ్ ।
కీర్త్యమానం నీబోధార్థం పూర్వేషాం కీర్తివర్ధనమ్ ।
ధన్యం యశస్యమాయుష్యం స్వర్యం శత్రుఘ్నమేవ చ ।
కీర్తనం స్థిరకీర్తీనాం సర్వేషాం పుణ్యకర్మణామ్ ఈఈ
యస్మాత్ కల్పాయతే కల్పః సమగ్రం శుచయే శుచిః ।
తస్మై హిరణ్యగర్భాయ పురుషాయేశ్వరాయ చ ॥
అజాయ ప్రథమాయైవ వరిషాయ ప్రజాసృజే ।
బ్రహ్మణే లోకతంత్రాయ నమస్కృత్య స్వయంభువే ।
మహదాద్యం విశేషాన్తం సవైరూప్యం సలక్షణమ్ ।
పంచప్రమాణం షటీశ్రాంతః పురుషాధిష్టితం చ యత్ ॥
ఆసంయమాత్ ప్రవక్ష్యామి భూతసర్గమనుత్తమమ్ ।
అవ్యక్తం కారణం యతన్నిత్యం సదసదాత్మకమ్ ॥
ప్రధానం ప్రకృతిం చైవ యమాపస్తత్వచింతకాః ।
గంధరూపరసైరీనం శబ్దస్పర్శవివర్జితమ్ ॥
జగద్యోనీమ్మహాభూతం పరం బ్రహ్మ సనాతనమ్ ।
విగ్రహాం సర్వభూతానామవ్యక్తమభవతిల॥
అనాద్యంతమజం సూక్ష్మం త్రిగుణం ప్రభవాప్యయమ్ ।
అసాంప్రతీకమజ్ఞేయం బ్రహ్మ యత్సదసత్పరమ్ ॥
తస్యాత్మనా సర్వమిదం హ్యప్తమాసిత్తమోమయమ్ ।
గుణసామ్యేతదా తస్మిన్న విభాతం తమామయమ్ ॥
సర్గకాలే ప్రధానస్య క్షేత్రజ్ఞాధిష్ఠితస్య వై ।
గుణభావాత్ భాసమానే మహాతత్త్వం బభూవ హ॥
సూతుడిట్లు పలికెను.
దివ్యము, సర్వపాప ప్రమోచనకరము, చిత్రము, అనేకార్థ సంయుతము, వేద సమ్మితము నయిన కథను నాచే చెప్పబోవు దానిని వినుము. (1) ఎవ్వడీ కథను నెల్లప్పుడు స్మృతి పథమున నెలయించునో ఎప్పుడును వినునో, తన వంశమును శాశ్వత మొనర్చుకొని స్వర్గ లోకమున నతఁడు చిరకాలము గౌరవమున వెలుంగును. (2) యథావృత్తము, యథాశ్రుతము, కీర్తింపబడునట్టిది, వ్యక్తము చేయబడునట్టిది, పూర్వుల యొక్క కీర్తినీ వృద్దిని పరచునదియునగు దీని నెవఁడు విశ్వసించునో, యయ్యదీయైన యీ చరితము అరివినాశనకరము, ధన్యము, ఆయుర్వృద్ధికారకము, స్వర్గదము, స్థిరకీర్తిమంతులయొక్క పుణ్యకర్ములయొక్క సంకీర్తనము. ఏ మహాత్ముని ఇచ్ఛయే కల్పమనబడునో, పరిశుద్ధ వస్తువై పరగునో అట్టి హిరణ్యగర్భునకు, పురుషునకు, ఈశ్వరునకు, అజునకు, ప్రథమరూపునకు, శ్రేష్ఠునకు, ప్రజాసృష్టికర్తకు, లోకతంత్రజు నకు, పరమాత్ముఁడునయిన బ్రహ్మకు నమస్కరించి, మహత్తు మొదలుకొని విశేషాంతము, వఱకు విరూపయుతము, లక్షణాన్వితము, పంచ ప్రమాణములతో గూడినది షట్గ్రౌంతయుతము నైయేది పురుషాధిష్ఠితమై యున్నదో (7) అట్టి దానిని సమస్తము తుదివఱకు చెప్పెదను. శ్రేష్ఠమయిన భూతసృష్టి, దానికి కారణమయిన అవ్యక్తము, సద్ అసదాత్మకమై యెయ్యది నిత్యమో, తత్త్వచింతకులు. (వేదాంతులు) దేనిని ప్రధానము, ప్రకృతియని వ్యవహరింతురో దానిని గూర్చి చెప్పెదను (8) అయ్యదీ గంధరూప రసములు లేనిది, శబ్దస్పర్శ వివర్జితము. అదియే జగత్తునకు కారణమయిన మహదోని, అదియే పరబ్రహ్మము, అదియే సనాతనము. అదియే సర్వభూతముల స్వరూపమై యవ్యక్తముగా నున్నది. (10). అది ఆదిలేనిది, అంత్యము లేనిది, పుట్టుక లేనిది, సూక్ష్మమయినది, దానినుండియే త్రిగుణములు పుట్టినవి. అది అసాంప్రతికము (ఎల్లకాలములయందుండునది) అజేయము, సద్ అసద్ పరమయిన బ్రహ్మము, (11) దాని యాత్మచేతనే యీ సమస్తము వ్యాప్తమై యున్నది. ఇయ్యది గుణ సామ్యత్వ మునూని సృజింపఁదలపోయ సర్వము తమో మయమగుట నప్రకాశంబై యుండెను. (12) సృష్టికాలమున ప్రధానమైన క్షేత్రజ్ఞాధిష్ఠితమైన బ్రహ్మము సగుణభావము నొంది భాసమానముకాగా (నది) మహత్తత్వమయ్యెను. (13)
సూక్ష్మః స తు మహానగ్రే అవ్యక్తేన సమావృతః ।
సత్వోద్రేకో మహానగ్రే సత్వమాత్రప్రకాశకః ॥
సత్త్వాన్ మహాన్ స విజ్ఞేయ ఏకస్తత్కారణః స్మృతః ।
లింగమాత్రం సముత్పన్నం క్షేత్రజ్ఞాధిష్ఠితం మహత్ ॥
సంకల్పోయిధ్యవసాయశ్చ తస్య వృత్తిద్వయం స్మృతమ్ ।
మహాసృష్టిం చ కురుతే వీతమానః సిసృక్షయా ॥
ధర్మాదీని చ భూతాని లోకతత్త్వార్థహేతవః ।
మనో మహాత్మని బ్రహ్మ దుర్బుద్ధిఖ్యాతిగీశ్వరావ్ ॥
ప్రజ్ఞాసంధిశ్చ సర్వస్వం సంఖ్యాయతనరశ్మిభిః ।
మనుతే సర్వభూతానాం తస్మాచ్చేష్టఫలో విభుః ॥
భోక్తా త్రాతా విభక్తాత్మా వర్తనం మన ఉచ్యతే ।
తత్త్వానాం సంగ్రహే యస్మాన్మహాంశ్చ పరిమాణతః ॥
శేషేభ్యో గుణతత్వేభ్యో మహానివ తనుః స్మృతః ।
విభక్తిమానం మనుతే విభాగం మన్యతేపి వా॥
పురుషో భోగసంబంధాతేన చాసౌ సతి స్మృతః ।
బృహత్త్వద్బృంహణత్వాచ్చ భావానామభిలాశ్రయాత్ ॥
యస్మాదంహయత భవాన్ బ్రహ్మా తేన నిరుచ్యతే ।
ఆపూరయతి యస్మాచ్చ సర్వాన్ దేహాననుగ్రహైః॥
బుద్ధ్యతే పురుషశ్చాత్ర సర్వాన్ భావాన్ పృథక్ పృథక్ ।
తస్మింస్తు కార్యకరణం సంసిద్ధం బ్రహ్మణః పురా ॥
ప్రాకృతం దేవి వర్త మాం క్షేత్రజ్ఞో బ్రహ్మ సంమితః ।
స వై శరీరీ ప్రథమః పురా పురుష ఉచ్యతే॥
అయ్యది అవ్యక్త సమాకృతమయి సూక్ష్మరూపము నొందజాలియుండును, సత్వోద్రేకముచేనదీ సత్త్వ ప్రకాశమయి యుండును. (14) ఆ మహత్తు సత్త్వసంపన్నము. ఏకైక కారణముగా నెఱుంగవలయును. క్షేత్రజ్ఞాధిష్ఠితమయిన యా మహత్తత్త్వము లింగమాత్ర సముత్పన్నమయి యొప్పును. (15) దానికి సంకల్పాధ్యవసాయంబులు అను వృత్తిద్వయము తత్సహకారులని యెఱుంగవలయును. సృజింపవలయునను నిచ్ఛలేకయే ఆ తత్త్వమే మహా సృష్టిని చేయును. (16) ధర్మము మొదలగు భూతములు లోకతత్త్వార్థ హేతువులయి దాని వలన కలిగెను. ఆ మహత్తత్వము వలన మనస్సు, దాని వలన నహంకారాదులు పుట్టెను. (17) ఆ మహత్తత్వము నుండియే ప్రజ్ఞాసంధి మొదలయినవి సర్వస్వము అసంఖ్యాకమగు నాతని యంశలచే జనించేను. తత్ర్పభువు సర్వభూతరక్షకుఁడై యిష్టఫలదుఁడై యుండును. (18) భోక్త, తాత (సంరక్షకుండు) విభక్తాత్మయు, ప్రవర్తకుండు మనస్సే యయి యుండును, తత్వ సంగ్రహరూపమయిన ఆ మహత్తత్వము పరిణామము వలన నమేయమై యుండును. (19) మిగిలిన తత్త్వముల వలన ఆ మహతత్త్వము గొప్ప తనువు గలిగిన వాడుగా స్మరింపబడుచున్నాఁడు, విభాజ్య విభాగంబుల స్వతంత్ర శక్తి గలిగి యుండును. (20) పురుషుఁడు భోగ సంబంధము వలన ఆ తత్త్వము గలిసీ యుండును. బృహత్తత్త్వము వలన, సర్వము విపులమై వ్యాపించి యుండుట వలన అన్నింటికి నాశ్రయమగుట వలన నాతఁడు బ్రహ్మయనంబడును. ఆతఁడే యనుగ్రహముచే నఖీల జంతువుల దేహముల సమగ్ర పూర్ణములుగ చేయును. (22) ఆ పురుషుడు సర్వభావములను వేటువేయగా నెటింగును. ఆతని పూర్వము బ్రహ్మకు సర్వకార్యకరణము సంసిద్ధమయ్యెను. (23) ఆతఁడే బ్రహ్మసమ్మితుఁడయిన క్షేత్రజ్ఞుడు ఆతఁడే ప్రథమతః శరీరి. ఆతఁడే పూర్వము పురుషుఁడుగా వచింపబడెను.(24)
ఆదికర్తా స భూతానాం బ్రహ్మాగ్రే సమవర్తినామ్ ।
హిరణ్యగర్భః పోలిండేస్మిన్ స్రాదుర్భూతశ్చతుర్ముఖః ॥
సర్గే చ ప్రతిసర్గే చ క్షేత్రజ్ఞో బ్రహ్మసంమితః ।
కరడైస్సహ పృచ్ఛస్తే ప్రత్యాహారెస్యజస్తి చ।
భజనే చ పునర్దేహాంస్తే సమాహారసంధిసు (షు) ॥
హిరణణ్మయస్తు యే మేరుస్తస్యోద్ధరుర్మహాత్మనః ।
గర్లోదకం సంబుదాస్తు హరేయుశ్చాపి పంచ తొః॥
యస్మిన్నండ ఇమే లోకాః సప్త వై సత్పతిష్ఠితాః ।
పృథివీ సప్తభిధ్వీపైః సముదైః సహ సప్తభిః ॥
పర్వతై స్సుమహద్భిశ్చ నదీభిశ్చ సహస్రశః ।
అంతస్థస్య త్వమే లోకా అంతర్విశ్వమిదం జగత్ ॥
చంద్రాదిత్యా సనక్షత్రా సంగ్రహః సహ వాయునా ।
లోకాలోకం చ యత్కించిదండే తస్మిన్ ప్రతిష్టితమ్ ॥
ఆపో దశగుణేనైవ తేజసా బాహ్యతో వృతాః ।
తేజో దశగుణేనైవ బాహ్యతో వాయునా వృతమ్ ॥
వాయుర్దశగుణేనైవ బాహ్యతో నభసా వృతః ।
ఆకాశమావృతం సర్వం బహిర్భూతాదినా తథా ।
భూతాదిర్మహతా చైవ ప్రధానేనా వృతో మహాన్ ।
ఏభిరావరణేరండం సప్తభిః ప్రాకృతైర్వృతమ్ ॥
ఇచ్ఛయావృత్యచోన్యోన్యమరణే ప్రకృతయః స్థితాః ।
ప్రసర్గకాలే స్థిత్వా చ గ్రసన్తశ్చ పరస్పరమ్ ॥
సర్వభూతములకు బ్రహ్మ ఆదికర్త. సత్పురుషులలో సాతఁడు ప్రథముఁడు. అగ్రయాయి. (25) అతడు హిరణ్యగర్భుఁడయి, యా యండము నందు చతుర్ముఖుఁడై యుద్భవించెను. (26) సర్గము నందు ప్రతిసర్గము నందు నాతఁడే బ్రహ్మ సమీతుడై యుండు క్షేత్రజుఁడు, (27) ఇంద్రీయ యుతుఁడై యాతడేల్ల విషయముల నెఱుంగును. విషయ నివృత్తి వలన వాని సోతఁడు త్యజించును. కాని ఆ దేహాదులను పునః సమాహార సంధుల పూని యిష్టరీతి వర్తించును. ఆతనీ మహత్త్వము వలన హిరణ్మయంబగు మేరుపు పంచత్వము నొందగలదు. సాగరాంబువులు గుంట లలోని నీటివలె నశింపను గలవు. (28) అందుచే నాతడంతటి యసమాన ప్రజ్ఞానిధియని లుంగవలెను. ఆ హిరణ్మయాండము నందు, ఈ సప్తలోకములు, పృథివీ, సప్తద్వీపములతోడి సప్తసముద్రములు, (29) మహా పర్వతములు, సహస్రాధికములయిన నదులు అంతస్థములయిన యీ లోకములు, ఈ యంతర్విశ్వమయిన జగత్తు (30) నక్షత్రములతో, గ్రహములతో, వాయువులతో చంద్రాదిత్యులు, ఏ లోకాలోకములున్నవో. యవి యన్నియు యీ యండము నందు ప్రతిష్ఠితములై యున్నవి, (31) జలంబులు పదింతలు గుణాధికమయిన తేజస్సు చేతను, బాహ్యమున దశగుణాధీకమయిన వాయువుచే తేజస్సు, ఆ వాయువు దానికంటే దశ గుణాధికమయిన ఆకాశము చేతను, ఆయాకాశము సర్వము మరల సర్వభూతాదీకముల చేతను బాహ్యమున ఆవృతమై యున్నవి. (33) భూతాదులు గొప్పదియైన ప్రధానముచే ఆవృతమయినది. ఈ ఏడు ప్రాకృతములయిన ఆవరణముల చేతను హిరణ్మయమయిన యండము, ఆవృతమైయున్నది. (34) ఇవి మరల ఇచ్చచే నావృతములై యొప్పి పరస్పరము గ్రహించి గ్రసించి యుండును.
ఏవం పరస్పరైశ్చైవ ధారయన్తి పరస్పరమ్।
ఆధారాధేయభావేన వికారాస్తే వికారిషు॥
అవ్యక్తం క్షేత్రమిత్యుక్తం బ్రహ్మ క్షేత్రజ్ఞముచ్యతే ।
ఇత్యేవం ప్రాకృతః సర్గః క్షేత్రజ్ఞాధిష్ఠితస్తు సః ॥
అబుద్ధిపూర్వః ప్రథమః ప్రాదుర్భూతస్తడిద్యథా ।
ఏతద్ధిరణ్యగర్భస్య జన్మ యో వేత్తి తత్త్వతః॥
ఆయుష్మాన్ కీర్తిమాన్ ధన్యః ప్రజ్ఞావాంశ్చ న సంశయః ।
ఇతి బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ప్రథమే ప్రక్రియాపాదే హిరణ్యగర్భోత్పత్తివర్ణనం నామ తృతీయోధ్యాయః॥
ఈ విధముగా పరస్పరము నొకదాని నోకటి యొడిసిపట్టుకోని ఆధారాధేయభావము నొంది పరగుచు, సర్గమున వికారమొంది నిసర్గమున అవికారమొంది యేకత్వమొంది యుండును. (36) అవ్యక్తమును క్షేత్రమందురు. బ్రహ్మ క్షేత్రజ్ఞుఁడు. ఇట్లు ప్రాకృతమగు ఘన సర్గము అంతయు క్షేత్ర విదుని (బ్రహ్మ) యొక్క కార్యము. (37) అబుద్ధి పూర్వకముగా మొట్టమొదట మేలుపుతీగవలె నీది ప్రాదుర్భవించెను. ఇదీ హిరణ్యగరునియొక్క జన్మవృత్తాంతము యథాతథాముగా చెప్పబడినది. దీని నెఱిగినయతండు నిస్సంశయముగా ఆయుష్మంతుఁడు కీర్తి మంతుఁడు, ప్రజ్ఞావంతుఁడు నగును.
ఇదీ వాయుప్రోక్త బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున, ప్రథమ ప్రక్రియా పాదమున హిరణ్యగర్భోత్పత్తి వర్ణనమను తృతీయాధ్యాయము.
Summary of chapter 3 of the Brahmānda Mahā Purana is as follows:
Here the sacred text gently unveils the majestic genesis of the cosmos, illustrating the divine transition from unmanifested void to vibrant existence. It narrates the sublime emergence of Hiraṇyagarbha, the resplendent golden womb from which all life and cosmic principles emanate. Devotees are invited to witness the supreme intelligence organizing the primordial elements into a harmonious symphony, reflecting the endless grace and unfathomable power of the supreme creator.