బ్రహ్మాండ మహా పురాణము
2 - ప్రజాపతి వంశానుకీర్తనము
సూత ఉవాచ :-
వినివృత్తే ప్రజాసర్గే షష్ఠే వై చాక్షుషస్య హ ।
ప్రజాః సృజేతి వ్యాదిష్టః స్వయం దక్షః స్వయంభువా ॥
ససర్జ సర్వభూతానీ గతిమంతీ ధ్రువాణి చ ।
మానసాని చ భూతానీ స పూర్వమసృజత్ర్పభుః ॥
ఋషీన్ దేవాంశ్చ గంధర్వాన్ మనుష్యోరగరక్షసాన్ ।
యక్షభూతపిశాచాంశ్చ వయఃపశుమ్భగాంస్తథా ॥
యదాస్య మనసా సృష్టి న వ్యవర్థంత తాః ప్రజాః ।
అపధ్యాతో భగవతా మహాదేవేన ధీమతా ॥
సమైథునేన భావేన సిసృక్షుర్వివిధాః ప్రజాః ।
అసిక్నీమాహవద్భార్యాం వీరణస్య ప్రజాపతేః ॥
సుతాం సుమహరా యుక్తాం తపసా లోకధారిణీం ।
యయా ధృతమిదం సర్వం జగతావరజంగముమ్ ॥
అత్రాప్యుదాహరంతీమౌ శ్లోకె ప్రాచేతసాం ప్రతి ।
దక్ష్యద్వహతో భార్యామసిడ్నీం వైరణీం పురా ॥
కృపానాం నియుతం దక్షం సర్పిణాం సాభిమానినామ్ ।
నదీగిరీష్వసజంతం పృష్ఠతోనుయ ప్రభుమ్ ॥
తం దృష్ట్వా ఋషిభిః ప్రోక్తం ప్రతిష్టాస్యతి వై ప్రజాః ।
ప్రథమోత్ర ద్వితీయస్తు దక్షః స పొ ప్రజాపతిః ॥
అథాగచ్ఛద్యథాకాలం ప్రహీనాం నియుతం తు యత్ ।
అసిడ్నీం వైరణీం తత్ర దక్షః ప్రాచేతసోవహత్ ॥
అథ పుత్రసహస్రం స వైరణ్యామమితౌజసమ్ ।
అసిక్న్యాం జనయామాస రక్షః ప్రాచేతసః ప్రభుః ॥
తాంస్తు దృష్ట్వా మహాతేజాః స వివర్ధయిషుః ప్రజాః ।
దేవర్షిప్రియసంహాదో నారదో బ్రహ్మణః సుతః ॥
నాశాయ వచనం తేషాం శాపాయైవాత్మనో బ్రవీత్ ।
యః కశ్యపసుతస్యాథ పరమేష్ఠి వ్యజాయత ॥
మానసః కశ్యపస్యాసీదక్షశాపవశాత్పునః ।
తస్మాత కాశ్యపస్యాథ ద్వితీయో మానసోభవత్ ॥
సూతుఁడిట్లు వచించెను.
చాక్షుష మన్వంతర సంబంధమయిన ఆవ ప్రజాసృష్టి ముగిసేను. స్వయంభువుఁడయిన బ్రహ్మ స్వయముగా “ప్రజలను సృజింపుము” అని దక్షునినాజ్ఞాపించెను. అంత దక్షుండు, జంగమములు, స్థావరములునయిన సమస్త జీవరాశులను (భూతములను) సృజించెను. గతి గలిగినవి జంగమములు. ధ్రువములు స్థావరములు. జగత్ర్పభువు ముందుగా మానసముగా భూతములను సృజించెను. (2) ఆతఁడు తన మనస్సుచేతనే, ఋషులను, దేవతలను, గంధర్వులను, మనుష్యులను, నాగులను, రాక్షసులను, యక్షులను, భూతములను, పిశాచములను, పక్షులను, పశువులను, మృగములను, సృజించెను. ఆతడు మనసా సృజించిన ప్రజలు వృద్ధిపొందమి, వారందరిని ధీమంతుఁడు, భగవంతుఁడునయిన మహాదేవుఁడు మనసా శపించెను. వివిధ ప్రజా సముదాయమును, మైథున క్రీయచే సృష్టింప గోరి ఆతఁడు ప్రజాపతియైన వీరణునీ కుమార్తెయైన అసిక్నిని వివాహమాడెను. ఆమెకు గొప్ప తపశ్శక్తి కలదు. ఆమెయే లోకధారిణి : లోకమునంతటిని భరించినట్టిది. ఆమె చేతనే చరాచర నీబద్ధమయిన యీ యావత్పపంచము ధృతము. ఈ విషయములో ప్రాచేతసుని గూర్చి వారి సంతానమును గూర్చియు, ఈ క్రింది శ్లోకములు చెప్పును. వైరణియైన అసిక్నిని దక్షుఁడు పెండ్లియాడిన తరువాత- పదిలక్షల నల్లని పొగరుతో గూడిన సర్పములు దక్షుని అనుసరించేను. ఆ దక్షుండు నదులలోను పర్వతములలోను తిరుగుచున్నాడు. అతని వెనుక సర్పములు సాగిపోయినవి. ఆతనిని ఋషులు చూచిరి, “ఇందు మొదటి దక్షుఁడు ప్రజలను ప్రతిష్టించును.” అనిరి. ఇక ద్వితీయ దక్షుఁడు - తనంతట తానే ప్రజాపతి. ప్రజలను సృష్టించువాఁడు. అందుచే పదిలక్షల సర్పములు యథాకాలము (కాలక్రమమున) తొలగిపోయెను. అచ్చటనే వైరణికుమార్తెయైన అసిక్నిని దక్షుఁడు పెండ్లియాడెను. అంత ప్రాచేతసుఁడు ప్రభువునయిన దక్షుడు వైరణియైన అసిక్నియందు సహస్ర సంఖ్య పుత్రులను కనెను. వారందరు అనంతశక్తిమంతులు. వారినీ దక్షుఁడు చూచెను. మహాతేజస్వియైన యతఁడు ప్రజలను వృద్ధి పొందింపవలయునను కోరిక వహించెను. బ్రహ్మసూనుఁడు దేవర్షియునయిన నారదుఁడు దేవతా ఋషులతోడీ సంవాదమున సంతుష్టుఁడయ్యెను. ఆతఁడు కొన్ని పలుకులుచ్చరించెను. తత్ఫలము ఆ సంతాన వినాశనము; అంతీయొక్క ఆతనికి శాపము నయ్యెను. నారదుఁడు పరమేష్టి యొక్క మానసపుత్రుఁడు. అట్టిండు దక్షుని శాపముచే కశ్యపునకు రెండవ మానస కుమారుఁడయ్యెను.(14)
స హి పూర్వం సముత్పన్నో నారదః పరమేష్ఠినః ।
తేన దృక్షస్య పుత్రా వై హర్యశ్వా ఇతి విశ్రుతాః ॥
ధర్మార్థం నాశీతాస్సర్వే వీధినా చ న సంశయః ।
తస్యోద్యతస్తదా దక్షః క్రుద్ధః శాపాయ వై ప్రభుః ॥
బ్రహ్మర్షిన్వై పురస్కృత్య యాచితః పరమేష్ఠినా ।
తతోభిసంధిం చక్రే వై దక్షస్య పరమేష్ఠినా ॥
కన్యాయాం నారదో మహ్యం తవ పుత్రో భవేదితి ।
తతో దక్షః సుతాం ప్రాదాత్ ప్రియాం వై పరమేష్టినే ॥
తస్మాచ్చ నారదో జజ్ఞే భూయః శాపభయాదృషిః ॥
శాంశపాయన ఉవాచ:-
కథం వై నాశితాః పూర్వం నారదేన సురర్షిణా ।
ప్రజాపతీసుకొస్తే వై శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥
సూత ఉవాచ :-
దక్షపుత్రాశ్చ హర్యశ్వా వివర్గయిషపః ప్రజాః ।
సమాగతా మహావీర్యా నారదస్తానువాచ హ॥
బాలీశా బత యూయం వైన ప్రజానీథ భూతలమ్ ।
అంతరూర్వమథశ్చైవ కథం సక్ష్యథ వై ప్రజాః॥
తే తు తద్వచనం శ్రుత్వా ప్రయాతాః సర్వతోదిశమ్ ।
అద్యాపీ న నివర్తంతే సముద్రస్థా ఇవాషగాః ॥
అథ తేషు ప్రణస్టేషు దక్షః ప్రాచేతసః పునః ।
వైరణ్యామేవ పుత్రాణాం సహస్రమసృజత్పభుః ॥
ప్రజా వీవర్థయిషవః శబలాశ్వాః పునస్తు తే ।
పూర్వముక్తం వచస్తద్వై శ్రావితా నారదేన హ ॥
అన్యోన్యమూచుస్తే సర్వే సమ్యగాహ ఋషిః స్వయమ్ ।
భ్రాతృణాం పదవీం చైవ గంతవ్యో నాత్ర సంశయః ॥
జ్ఞాత్వా ప్రమాణం పృథ్యాం వై సుఖం స్రక్షామహే ప్రజాః ।
ప్రకాశః స్వస్థమనసా యథావదనుశాసితాః ॥
తేపి తేనైన మార్గేణ ప్రయాతాః సర్వతోదిశమ్ ।
అద్యాపి న నివర్తంతే విస్తారాయామలిప్సవః ॥
ఆ నారదుఁడు పూర్వము పరమేష్ఠికి (బ్రహ్మకు) సముత్పన్నుఁడు, దక్షుని పుత్రులు హర్యశ్వులని విశ్రుతులు. ధర్మార్థము వారందరు విధిచే నాశనము చేయఁబడిరి అందు సందేహము లేదు. దక్షుండు సంక్రుద్ధుఁడయ్యెను. విధిని (బ్రహ్మను) శపించుటకు లేచెను. బ్రహ్మరులతో పురస్కృతుఁడైన బ్రహ్మ ఆతనిని (దక్షుని) యాచించెను. అంత బ్రహ్మకు దక్షునకు నంధీయయ్యెను. అంత దక్షుఁడిట్లనెను”. నో కుమార్తె వలన నారదుఁడు నీకు కుమారుఁడగుగాక” ఆతఁడంగీకరించెను. అంత దక్షుండు తన ప్రియమైన కూఁతురును పరమేష్ఠికిచ్చెను. ఆ కారణమున, తచ్ఛాపము వలన నారదుఁడు తిరిగి జన్మించెను.
శాంశ పాయనుఁడు ఇట్లడిగెను :
దేవర్షియైన నారదునిచేతను దక్షప్రజాపతి సుతులు ఏల వినాశనము నొందింపఁబడిరి. యథార్థముగా వినఁగోరుచున్నాను”. అని.
సూతుఁడిట్లనియెను :
దక్షుని పుత్రులయిన హర్యశ్వులు ప్రజలను (బిడ్డలను) వృద్ధి పొందింపఁదలంచిరి. ఆ ప్రజలెల్లరు నొకచో సమావిష్ణులయిరి. వారలతో సారదుఁడు మాటాడెను. “అయ్యో ! మీరందరు బాలిశులు - కుర్రకుంకలు. మీరు భూమి యొక్క అంతర స్వరూపము నెఱుంగరు. అంతియేకాక దాని పైనేమి యున్నదో దాని యధోభాగమున నేమున్నదో తెలియదు. ఇట్టి తెలివితక్కువ వారెట్లు ప్రజలను సృష్టింతురు?” అనెడు నీ పలుకులను వారు వినిరి. నలుదిక్కులకు పలాయితులైరి. సముద్రములో ప్రవేశించిన నదులవలె వారీప్పటీకీని తిరిగి రాలేదు. వారందరు నశింపఁగా ప్రాచేతసుఁడయిన దక్షుఁడు వైరణి కూతురయిన అసిడ్నీ యందు మరల వేయిమంది పుత్రులను కలిగించెను. వీరందరు శబలాశ్వులు. వీరందరు ప్రజలను వృద్ధి పొందింపగోరిరి. ఇంతకు పూర్వము నారదుఁడేమని పలికెనో ఆ పలుకులే మరల వారలతో నతఁడు పలికెను. ఆ కుమారులందరు పరస్పరము మాట్లాడుకొనిరి. “ఋషి చెప్పినది సత్యము. మన సోదరుల మార్గముననే మనమును పోవలయును. ఇందు సంశయము లేదు. పృథ్వి యొక్క ప్రమాణాదులను తెలిసికొనిన పిమ్మట ప్రజలను సులువుగా మనము సృష్టింపఁగలము. మనము చక్కగా ఉపదేశింపఁబడితిమీ. మన మనస్సులను విషయ పరిజ్ఞాన ప్రకాశితములుగా చేసిన తరువాత మనము స్వస్థమనసులము కాగలము. వారందరు పారీ సోదరులు పోయిన మార్గమునండియే భూమి విస్తారమును, ప్రమాణమును తెలిసికొనంగోరి వెడలిరి. ఇంతదనుక వారు తిరిగిరాలేదు.
తతః ప్రభృతి వై భ్రాతా భ్రాతురన్వేషణే రతః ।
ప్రయాతో నశ్యతి క్షిప్రం తన్న కార్యం విజానతా ॥
సస్టేషు శబలాశ్వేషు దక్షః క్రుద్ధోశపత్ విభుః ।
నారదం నాశమేహీతి గర్భవాసం వసేతి చ ॥
తదా తేష్వపి నస్టేషు మహాత్మా స ప్రభుః కిల ।
షష్టిం దక్షోసృజతన్యా వైరణ్యామేవ విశ్రుతాః ॥
ఆస్తదో ప్రతీజగ్రాహ పత్యర్ధం కశ్యపః సుతాః ।
ధర్మః సోమశ్చ భగవాంస్తథా చాన్యే మహర్షయః ॥
ఇమాం విసృష్టిం దక్షస్య కృత్నాం యో వేద తత్త్వతః ।
ఆయుష్మాన్ కీర్తిమాన్ ధన్యః ప్రజావాంశ్చ భవత్యుతః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
ప్రజాపతి వంశానుకీర్తనం నామ ద్వితీయోధ్యాయః ॥
అందుచే నొక భాత తన యొక్క భ్రాతను వెదకుటకుఁబోయిన వెంటనే నశించును. ఇది యెఱింగినవాఁడెవఁడు భాత్రన్వేషణాకార్యమును చేబట్టరాదు. (28) శబలాశ్వులు నష్టులయిరి. దక్షుఁడు మరల కుదుఁడయ్యెను. అంతనతఁడు నారదుని “నాశనము పొందుము. గర్భవాసములో వసింపుము అని శపించెను. ఆ విధముగా ఆ కుమారులు అందరు నశించిరి. దక్షుఁడు మరల వైరణి యందు ప్రసిద్ధురాండ్రైన అరువది మంది కుమార్తెలను గనెను. కశ్యపుఁడు, ధర్ముఁడు, సోముఁడు మొదలగు ప్రసిద్ధులయిన ఋషులు ఆ కుమార్తెలను భార్యలనుగా గ్రహించిరి. ఎవ్వండీ దక్షుని యొక్క సృష్టిని యథార్థముగా నెఱుంగునో యాతఁడు ఆయుష్మంతుఁడు, కీర్తిమంతుఁడు, ధన్యుఁడు, ప్రజావంతుఁడగును.
ఇది వాయుక్తమయిన శ్రీ బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున తృతీయమైన ఉపోద్ఘాతపాదమున ప్రజాపతి వంశాను వర్ణనమను ద్వితీయాధ్యాయము.
Summary of chapter 40 of the Brahmānda Mahā Purana is as follows:
In this sublime section, the narrative unfolds the divine attributes and spiritual qualities of the revered seers and progenitor lords known as Prajāpatis. It describes how these luminous beings embody truth, self-restraint, and boundless compassion to guide the evolving universe. Contemplating their pure nature fills the faithful heart with deep reverence, encouraging every seeker to cultivate divine virtues and walk steadfastly on the holy path of righteousness.