బ్రహ్మాండ మహా పురాణము
30 - రేణుకా విలాపము: క్షత్రియ నాశనము చేయరాముని ప్రతిజ్ఞ జమదగ్నిప్రత్యుజ్జీవనము
వసిష్ఠ ఉవాచ :-
శ్రుత్వైతత్సకలం రాజా జమదగ్నివధాదికమ్ ।
ఉద్విగ్నచేతాః సుభృశం చింతయామాస నైకథా ॥
అహో ! మే సునృశంసస్య లోకయోరుభయోరపి ।
బ్రహ్మస్వహరణే వాంఛా తద్ధత్యా చాతిగర్హితా ॥
అహో ! నాశ్రౌషమస్యాహం బ్రాహ్మణస్య విజానతః ।
వచనం తర్హి తాం జహ్యాం విమూఢాత్మా గతత్రపః ॥
ఇతి సంచితయన్నేవ హృదయేన విదూయతా ।
స్వపురం ప్రతీచక్రామ సబలః సానుగస్తతః ॥
పురీం ప్రతి గతే రాజ్ఞి తస్మిన్ సపరివారకే ।
ఆశ్రమాత్సహసా రాజన్ వినిశ్చక్రామ రేణుకా ॥
అథ సక్షతసర్వాంగం రుధిరేణ పరిప్లుతమ్ ।
నిశ్చేష్టం పతితం భూమౌ దదర్శ పతిమాత్మనః ॥
తతః సా విహతం మత్వా భర్తారం గతచేతనమ్ ।
అన్వాహతేనాశనినా మూర్ఛితా న్యపతద్భువి ॥
చిరాదివ పునర్భూమేరుత్థాయాతీవ దుఃఖితా ।
పతిత్వోత్థాయ సా భూయః సుస్వరం ప్రరురోద హ ॥
విలలాప చ సాత్యర్థం ధరణీధూళిధూసరా ।
అశ్రుపూర్ణముఖీ దీనా పతీతా శోకసాగరే ॥
హా నాధ ! ప్రియ ధర్మజ్ఞ దాక్షిణ్యామృతసాగర! ।
హా ధీగత్యంతశాంతత్వం నైవ కాంక్షేత చేదృశమ్ ॥
ఆశ్రమాదభినిష్కాంతః సహసా వ్యసనార్ణవే ।
క్షిప్త్వానాథామగాధే మాం క్వ చ యాతోఽసి మానద ॥
స తాం సాప్తపదే మైత్రీ ముషితాఽహం త్వయా సహ ।
యాసి యత్ర త్వమేకాకీ తత్ర మాం నేతు మర్హసి ॥
వసిష్ఠుఁడు ఇట్లు చెప్పెను.
జమదగ్ని వధ తదితర విషయములను గూర్చి విని, రాజు, తన మనంబున సంక్షుద్ద భావుఁడయ్యెను. తత్సంబంధి బహు విషయముల గూర్చి ఆలోచించెను. “అహో ! నేనో, ఉభయలోకములందునను మిక్కిలి క్రూరమయిన కర్మ నాచరించితిని. బ్రాహ్మణుల సొత్తును హరింప కోరికయు, బ్రాహ్మణ హత్యయు మిక్కిలి గర్షింపఁదగినవి. అయ్యో ! పురోహిత బ్రాహ్మణుని యొక్క ఉపదేశమును విమూఢాత్ముఁడనయి సిగ్గువిడిచి అప్పుడు నేను విసర్జించితిని వినలేదు.” అని దుఃఖభరిత హృదయముతో చింతించుచు రాజు తన బలగముతో అనుచరులతో సహ నగరమున కరీగెను. స్వపరిపారముతో రాజు నగరమునకు తిరిగిపోగా, రేణుక (ఓ రాజా!) ఆశ్రమము నుండి వెంటనే ఈవలకు వచ్చెను. వచ్చి శరీరము నందంతటను గాయములు కలిగి రక్తముచే తడిసి ముద్దయి, నిశ్చేష్ణుఁడయి నేలపై పడియున్న తన భర్త నామె చూచెను. అంత గత చైతన్యము గల భర్త చంపఁబడిన వానినిగా తలంచి, ఆమె పిడుగు యొక్క పతనముచే కొట్టబడినట్లు భూమిపై కూలేను. చాల సేపటికి మరల భూమి నుండి లేచి, అత్యంత దుఃఖితయై మరల నేలపై మూర్చపడి తెప్పిరిల్లి లేచి, ఆమె మరల సుస్వరముతో ప్రరోదనము చేసెను. ధరణీధూళిధూసరయైన యామె అత్యంతము విలపించి విలపించి, అశ్రుపూర్ణ ముఖముతో దీనురాలై శోక సాగరమున మునింగెను. “హా ! నాథ! ప్రియ! ధర్మము నెఱింగినవాఁడా ! దాక్షిణ్యామృతమునకు సాగరమైన వాఁడా ! అయ్యో ! యెంత కష్టము ! అత్యంత శాంతుఁడా ! ఇట్టి శాంతమును ఎవ్వరును కోరరు ! ఆశ్రమము నుండి బయటికి వచ్చి, ఓ నాథా ! నీవు నన్ను వెంటనే అగాధమయిన దుఃఖార్ణవము నందుఁద్రోసి, అనాథనయిన నన్ను వీడి ఓ మానద ! అభిమానులలో శ్రేష్ఠుఁడా ! ఎచ్చటికి వెడలిపోయితివి? సజ్జనులతోడి మైత్రి సాప్తపదీనమందురు. నీతో కలిసి నివసించితినే ! ఒక్కడవై ఏకాకిగా వెచ్చటి కరిగితివి? అచ్చటకు నన్ను తీసికోనిపోవ నరుఁడవు కావా
దృష్ట్వా త్వామీదృశావస్థమచిరాద్ధృదయం మమ ।
న దీర్యతే మహాభాగ ! కథనాః ఖలు యోషితః ॥
ఇత్యేవం విలపంతీ సా రుదతీ చ ముహుర్ముహుః ।
చుక్రోశ రామరామేతి భృశం దుఃఖపరిప్లుతా ॥
తావద్రామోఽపి స వనాత్సమిద్భారసమన్వితః ।
అకృతవ్రణసంయుక్తః స్వాశ్రమాయ న్యవర్తత ॥
అపశ్యద్భయశంసీని నిమిత్తాని బహూనీ సః ।
పశ్యన్నుద్వీగ్నహృదయస్తూర్ణం ప్రాపాశ్రమం విభుః ॥
తామాయాంతమభిప్రేక్ష్య రుదతీ సా భృశాతురా ।
నవీభూతేన శోకేన పారుదద్రేణుకా పునః ॥
రామస్య పురతో రాజన్ భర్తృవ్యసన పీడితా ।
ఉభాభ్యామపీ హస్తాభ్యా ముదరం సమతాడయత్ ॥
మార్గో విదితవృత్తాంతః సమ్యగ్రామోఽపి మాతరమ్ ।
కురరీమీవ శోకార్తాం దృష్ట్వా దుఃఖముపేయివాన్ ॥
ధైర్యమారోప్య మేధావీ దుఃఖశోకపరిప్లుతః ।
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం తస్థౌ భూమావధోముఖః ॥
తం తథాగతమాలోక్య రామం ప్రాహాకృతవ్రణక: ।
కిమిదం భృగుశార్దూల నైతత్త్వయ్యుపపద్యతే ॥
న త్వాదృశా మహాభాగ భృశం శోచంతి కుత్రచిత్ ।
ధృతిమంతో మహాంతస్తు దుఃఖం కుర్వంతి న వ్యయే ॥
శోకః సర్వేంద్రియాణాం హి పరిశోషప్రదాయకః ।
త్యజ శోకం మహాబాహో ! న తత్పాత్రం భవాదృశాః ॥
ఓ మహాభాగ ! ఇట్టి అవస్థలో నిన్నుచూచి నా గుండె వ్రేలలేదే ! స్త్రీలు కఠినాత్మలు కదా” అని యీ విధముగా ఆమె విలపించి మాటిమాటికి హోరున రోదించుచు, అత్యంత దుఃఖపరిస్థుతమై రామ ! రామ ! (ఎందుంటీవి) అని అధికముగా ఆక్రందనము చేసెను. అంతలో రాముఁడు సమిధల భారముతో వనము నుండి అకృతప్రణునితో షహా స్వాశ్రమమునకుఁ దిరిగి వచ్చెను. (15) త్రోవలో రాముఁడు భయమును శంకింపఁజేయు అనేకములయిన దుర్నిమిత్తములను చూచెను. చూచి దుఃఖముచే నుద్విగ్న హృదయుఁడై రాముఁడు వెంటనే ఆశ్రమమును చేరెను. (16) ఆశ్రమమునకు వచ్చుచున్న రామునిచూచి, అత్యంతాతురయై నవీ భూతమయిన శోకముతో మరల రేణుక అధికముగా రోదించెను. భర్త వ్యసనముచే నత్యంత పీడితయైన రేణుక తన రెండు చేతులతో కడుపు మీద భాధాపరవశయై బాదుకొనెను. రాముఁడు మార్గములో వృత్తాంత మంతయు నెటింగెను. ఆడలేడి వలే దుఃఖార్తయైన తల్లిని చూచి, తాను కూడ దుఃఖ పరవశుఁడయ్యెను. మేథావియైన రాముఁడు ధైర్యము తెచ్చుకొనెను. దుఃఖముచే శోకముచే పరిఫుతుఁడై దుఃఖాశ్రువుల వరదలచే నిండిన కన్నులతో తలదించుకొని నేలను పరికించుచు అధోముఖుఁడై యుండి పోయెను, అంత, అట్లువచ్చి దుఃఖ సంఫ్లుతుఁడయిన రాముని చూచీ, అకృతప్రణుఁడు రామునితో “భృగు వంశశార్దూల! ఇదేమీ ? దుఃఖ పరీతుఁడవైతివి ! ఇది నీకు తగదు. ఓ మహాభాగ ! ఎక్కడయినను నీవంటివారు అధికముగా శోకించేదరా? ఆపద ఆపతితమయినప్పుడు, ధైర్యవంతులు, మహాత్ములు దుఃఖింపరుకదా ! శోకము సర్వేంద్రియములను శుష్కింపఁజేయునది. మహాబాహో! అత్యంత శౌర్యనిధీ ! శోకమును పరిత్యజింపుము. ఇయ్యది నీవంటి వారికి యోగ్యమైనది కాదు.
ఐహికాముష్మికార్ధానాం నూనమేకాంతరోధకః ।
శోకస్తస్యావకాశం త్వం కథం హృదీ నియచ్ఛసి ॥
తత్త్వం ధైర్యధనో భూత్వా పరిసాంత్వయ మాతరమ్ ।
రుదతీం బత వైధవ్యశంకాపహతచేతనామ్ ॥
నైవాగమనమస్తీహ వ్యతి క్రాంతస్య వస్తునః ।
తస్మాదతీతమఖిలం త్యక్త్వా కృత్యం విచింతయ ॥
ఇత్యేవం సాంత్వమానశ్చ తేన దుఃఖసమన్వితః ।
రామః సంస్తంభయామాస శనైరాత్మానమాత్మనా ॥
దుఃఖశోకపరీతా హి రేణుకా త్వరుదన్ముహుః ।
త్రిఃసప్తకృత్వో హస్తాభ్యాముదరం సమతాడయత్ ॥
తావత్తదంతికం రామః సమభ్యేత్యా శ్రులోచనః ।
రుదతీమలమంబేతి సాంత్వయామాస మాతరమ్ ॥
ఉవాచాపనయన్దుఃఖాద్భర్తృశోకపరాయణామ్ ।
త్రిఃసప్తకృత్వో యదిదం త్వయా వక్షః సమాహతమ్ ॥
తావత్సంఖ్యమహం తస్మాత్ క్షత్రజాతమశేషతః ।
హనిష్యే భువి సర్వత్ర సత్యమేతద్భ్రవీమి తే ॥
తస్మాత్వం శోకముత్సృజ్య ధైర్య మాతిష్ట సాంప్రతమ్ ।
నాస్త్యేవ నూనమాయాతమతిక్రాంతస్య వస్తునః ॥
ఇత్యుక్తా రేణుకా తేన భృశం దు:ఖాన్వితాఽపి సా ।
కృచ్చ్రాద్ధైర్యం సమాలంబ్య తథేతి ప్రత్యభాషత ॥
తతో రామో మహాబాహుః పితుః సహ సహోదరైః ।
అగ్నౌ సత్కర్తుమారేభే దేహం రాజన్ యథావిధి ॥
భర్తృశోకపరీతాంగీ రేణుకాపి దృఢవ్రతా ।
పుత్రాన్ సర్వాన్ సమాహూయ త్వదం వచనమబ్రవీత్ ॥
శోకము నిజముగా ఐహికాముష్మిక ప్రయోజనముల కన్నింటికీని ఏకైకరోధకమయినది. అట్టి శోకమున కావకాశము నెట్లు నీ హృదయమున నోసంగితివి? అందుచే, నీవు ధైర్యధనుఁడవై, మీ అమ్మ యయిన రేణుకను ఓదార్పుము. వైధవ్య శంకచే చైతన్యము లేనిదై మీయమ్మ రోదించుచున్నది. వ్యతిశ్రాంత వస్తువునకు జరిగిపోయిన దానికి గతమునకు) పునరాగమనము (తిరిగివచ్చుట) యున్నదా? అందుచే జరిగిన దంతయు విడిచిపెట్టి, ఇక ముందు చేయవలసిన కార్యమును గూర్చి ఆలోచించుము.” అనీ ఈ విధముగా అకృతవణునిచే ఊరడింపఁబడి, రాముఁడు దఃఖ సమన్వితుం డయ్యు తనకు తాను మెల్లగా దృఢచిత్తుఁడయ్యెను. దుఃఖ శోక పరీతాత్మురాలయిన రేణుక మాటిమాటికి రోదించుచునే యుండెను. ఇరువది యొక్కమారు తన బాహువులతో ఆమె ఉదరమును బాదుకొనెను. (28) అంతలో రాముఁడు కన్నీరు నిండిన కనులు గలిగి రేణుక యొక్క సమీపమున కరుదెంచి “అమ్మా విలపింప చాలును. అని ఆమెను సాంత్వన పరచెను. భర్తృశోకము వలన గలిగిన దుఃఖము నుండి తల్లిని అపనయించి, రాముఁడు “నీవు ఇరువది యొక్కమారు కుడుపు పై బాదుకొనినట్లు, అన్ని మార్లు నే నా క్షత్రజాతి నశేషముగా చంపెదను. నీతో చెప్పుచుంటిని. ఇదీ భువి సత్యము' అందుచే నీవు శోకమును విడువుము. ఇప్పుడు ధైర్యమును వహింపుము. జరిగిన వస్తువులు {పోయిన విషయములు) విచారించిన తిరిగి రావు కదా " అని పలికెను. ఆమె యత్యంత దుఃఖాన్వితయై యున్నను, ఎట్లో ధైర్యము వహించి 'అట్లే చేయుదుననీ' రామునికి రేణుక ప్రత్యుత్తర మిచ్చెను. ఓ రాజా ! అంత మహాబాహుడయిన రాముఁడు, తన సహోదరులతో సహితముగా, యథావిధి పితరున కగ్ని సాతృతీ చేయ నారంభించెను. భర్తృ వియోగము వలన శోకము గలిగిన రేణుకయు, దృఢవ్రతురాలై తన బిడ్డల నెల్లరను పిలిచి ఇట్లు వారితో పలికెను.
రేణుకోవాచ :-
అహం వః పితరం పుత్రాః స్వర్గతం పుణ్యశీలినమ్ ।
అనుగంతుమిచ్ఛామి తన్మేఽనుజ్ఞాతుమర్హథ ॥
అసహ్యదుఃఖం వైధవ్యం సహమావా కథం పునః ।
భర్త్రా వీరహితా తేన ప్రవర్తిస్యే వీనిందితా ॥
తస్మాదనుగమిష్యామీ భర్తారం దయితం మమ ।
యథా తేన ప్రవర్తిష్యే పరత్రాపి సహానీశమ్ ॥
జ్వలంతమిమమేవాగ్నిం సంప్రవిశ్య చిరాదివ ।
భర్తుర్మమ భవిష్యామి పితృలోకప్రియాతిథిః ॥
అనువాదమృతే పుత్ర భవద్భిస్తత్ర కర్మణి ।
ప్రతీభూయ న వక్తవ్యం యది మత్ప్రియమిచ్ఛథ ॥
ఇత్యేవముక్త్వా వచనం రేణుకా దృఢనిశ్చయా ।
అగ్నిం ప్రవిశ్య భర్తారమనుగంతుం మనోదధే ॥
ఏతస్మిన్నేవ కాలే తు రేణుకాం తనయైస్సహ ।
సమాభాష్యాతిగంభీరా వాగువాచాశరీరిణీ ॥
హే ! రేణుకే ! స్వతనయైర్గీరంమేఽవహితా శృణు ।
మాకార్షీః సాహసం భద్రే ప్రవక్ష్యామి ప్రియం తవ ॥
సాహసో నైవ కర్తవ్యః కేనాప్యాత్మహితైషిణా ।
న మర్తవ్యం త్వయా సర్వో జీవన్ భద్రాణి పశ్యతి ॥
తస్మాద్ధైర్యధనా భూత్వా భవ త్వం కాలకాంక్షిణీ ।
నిమిత్తమంతరీకృత్య కించిదేవ శుచిస్మితే ॥
అచిరేణైవ భర్తా తే భవిష్యతి సచేతనః ।
ఉత్పన్నజీవితేన త్వం కామంప్రాప్యతి శోభనే ।
భవిత్రీ చిరరాత్రాయ బహుకళ్యాణభాజనమ్ ॥
వసిష్ఠ ఉవాచ :-
ఇతి తద్వచనం శ్రుత్వా ధృతిమాలంబ్య రేణుకా ।
తద్వాక్యగౌరవాద్దర్షమవాపుస్తనయాశ్చ తే ॥
తతో నీత్వా పితుర్దేహమాశ్రమాభ్యంతరం మునేః ।
శాయయిత్వా నీవాతే తు పరితః సముపావిశన్ ॥
రేణుక ఇట్లనెను.
నాయనలారా ! పుణ్యశీలుఁడు, సర్గమును పొందినవాఁడును నయిన మీ తండ్రిని అనుగమించుటకు నేను కోరుచున్నాను అట్టి నాకు మీరనుజ్ఞ నీయ నర్పులరు. సహించుటకు దుర్లభమైన వైధవ్యదుఃఖమును వహించుచు, భర్తచే విరహితురాలపై వీనిందితురాలనై యెట్లు నేను ప్రవర్తింపఁగలను. (3) అందుచే నాకు ప్రియదతుఁడయిన భర్తను నేననుసరించి పోయెదను. పూర్వ మాతనితో నెట్లుంటినో స్వర్గమున కూడ (పరలోకాము నంగూడ) నట్లే ఆతనితో ననిశము ప్రవర్తించెదను. ఈ ప్రజ్వలించు నగ్నిలో ప్రవేశించి అచిరకాలములో నేను పితృలోకమున నా భర్తకు ప్రియాతిథినగుదును. ఓ పుత్రులారా ! నా కిష్టమును మీరాచరింపఁదలంచినచో, మీరందరు కలిసి యీ విషయములో నాకు వ్యతిరేకముగా పలుకవలదు, నేను సహగమనము చేసెదను,” అని పలికి, దృఢ నిశ్చయురాలయిన రేణుక అగ్నిని ప్రవేశించి భర్తననుగమింప దృఢమనస్సు పూనెను. అంతలో (అంతలో) కుమారులతో సంప్రదించు రేణుకను నిర్దేశించి 'అశరీర' వాణి గంభీరమయిన వాక్యము లాడెను. “ఓ రేణుకా ! నీవు నీ తనయులతో గూడ ఈ నావాక్కులను వినుము. ఓ భద్రురాలా ! ఓ మాంగళ్యవతీ ! సాహసము చేయకుము. నీకు ప్రియమును చెప్పుచున్నాను, నీవు మరణింపరాదు. “సర్వో జీవన్ భద్రాణి పశ్యతి” బ్రతికీ యుండి శుభముల బడయవచ్చు. అందుచే, ధైర్యధనురాలపై కాలమును ప్రతీక్షించుచు నుండుము. ఓ శుచిస్మిత ! శుచి మంతమైన చిరునవ్వు గలదానా ! నిమీత్తమును గమనించి కొంతకాలము సహించుము. అచిర కాలములో నీభర్త సచేతనుఁడు కాగలడు. ఆతడు ప్రత్యుజ్జీవితుడయినంతనే నీవు నీ కోరికలను పొందగలవు. ఓ శోభనా ! చిరకాలముండగల కళ్యాణములకు నీవు స్థానమవు కాఁగలవు”. అనెను.
వసిష్ఠుఁడిట్లనెను’
ఆ ఆకాశవాణిని విని రేణుక ధైర్యమూసాను. ఆమె కుమారులందరావాక్యగౌరవమున హర్షము నొందిరి. అంత పితృశరీరమును ఆశ్రమాభ్యంతరము లోనికి తీసికొనిపోయిరి. ఆ శరీరమును బాగుగా గాలి లేని ప్రదేశమున పండుకొనఁబెట్టి చుట్టును వారందరు కూరుచుండిరి.
తేషాం తత్రోపవిష్టానామప్రహృష్టాత్మచేతసామ్ ।
నిమిత్తాని శుభాన్యాసన్ననేకాని మహాంతి చ ॥
తేన తే కించిదశ్వస్తచేతసో మునిపుంగవాః ।
నిషేదుః సహితా మాత్రా కాంక్షంతో జీవితం పితుః ॥
ఏతస్మిన్నంతరే రాజన్ భృగువంశధరో మునిః ।
విధేర్బలేన మతిమాస్తత్రాగచ్ఛద్యదృచ్ఛయా ॥
అథర్వణాం విధిః సాక్షాద్వేదవేదాంగపారగః ।
సర్వశాస్త్రార్థవిత్ప్రాజ్ఞః సకలాసురవందితః ॥
మృతసంజీవినీం విద్యాం యో వేద మునిదుర్లభామ్ ।
యథాహతాన్మృతాన్దేవైరుత్థాపయతి దానవాన్ ॥
శాస్త్రమౌశనసం యేన రాజాం రాజ్యఫలప్రదమ్ ।
ప్రణీతమనుజీవంతి సర్వేద్యాఽపీహ పార్థివాః ॥
తదాశ్రమమాసాద్య ప్రవిష్టోంఽతర్మహామునిః ।
దదర్శ తదవస్థాంస్తాన్సర్వాన్ దుఃఖపరిప్లుతాన్ ॥
అథ తే తు భృగుం దృష్ట్వా వంశస్య పితరం ముదా ।
ఉత్థాయాస్మై దదుశ్చాపి సత్కృత్య పరమాసనమ్ ॥
స ఆశీర్భీస్తు తాన్సర్వానభినంద్య మహామునిః ।
పప్రచ్ఛ కిమిదం వృత్తం తత్సర్వం తే న్యవేదయన్ ॥
తచ్చృత్వా స భృగుః శీఘ్రం జలమాదాయ మంత్రవిత్ ।
సంజీవిన్యా విద్యయా తం సిషేచ ప్రోచ్చరన్నిధమ్ ॥
యజ్ఞస్య తపసో వీర్య మమాపి శుభమస్తిచేత్ ।
తేనాసౌ జీవతాచ్చీఘ్రం ప్రస్తుప్త ఇవ చోద్ధితః ॥
ఏవముక్తే శుభే వాక్యే భృగుణా సాధుకరిణా ।
సముత్తస్థావథార్చీకః సాక్షాద్గురురివాపరః ॥
సంతోష రహిత చిత్తములతో వారందరందుపవిష్టులై యుండగా గొప్పవియైన యనేక శుభ నిమిత్తములు కలిగెను. తన్మూలమున మునీ పుంగవులు కొలదిగా నూరట చెందిరి. అందే పితృపాదుల పునర్జీవనమునాకాంక్షించుచు, తల్లితో కూడికొని వారుండిరి. (50) ఆ మధ్యకాలంలో భృగు వంశోద్దరణుఁడయిన యొక ముని మతీమంతుఁడు, అతర్కితోపపన్నముగా దైవబలమున నచ్చటకేతెంచెను. ఆతఁడు అధర్వణ మంత్ర నిర్మాత. వేదవేదాంగముల యొక్క సారమును ముట్టినపోఁడు. సర్వ శాస్త్రముల యొక్క అర్థము నేజింగిన వాఁడు. ప్రాజ్ఞుఁడు. సకలాసుర వందితుఁడు. ఆతఁడు మృత సంజీవనీ విద్య నెటీంగినవాఁడు. తన్మూలమున యుద్దమున మరణించిన దానవులను బ్రతికింపఁ గలిగినవాఁడు ఈ రహస్యశాస్త్రము ఇతర ఋషులకు తెలియనిది రోజులకురాజ్యఫలప్రదమయిన శాస్త్రమును రచించినవాఁడు. ఆ శాస్త్రమే ఆతని తరువాత “శుక్రనీతిసారము” అయినది. ఆ శాస్త్రమే రాజులను తమ రాజ్యములను తిరిగి పొందఁజేసినది. ఇప్పటికి కూడ రోజులందరు దాసిననుసరింతురు. దానిపై ఆధారపడియుందురు. (అట్టి యాతఁడు) ఆ యాశ్రమమును చేరి లోనికి ప్రవేశించెను. ఆ యవస్థలో దుఃఖ పరీఫుతులయియున్న వారందరిని ఆతఁడు చూచెను. అంత వారందరు, తమ వంశ పితరుఁడయిన భృగువును చూచి లేచిరి, సత్కరించిరి. ఆతనికి ఆసన మొసంగిరీ, ఆ మహాముని ఆశీస్సులచే వారందరిని అభినందించెను. 'ఇదంతయు ఏమి'యనీ వృత్తాంతమడిగెను. ఆ వృత్తాంతము నంతటినీ వారు నివేదించిరీ, అది భృగు ఋషి వినినాఁడు. ఆ మంత్రవిదుఁడు వెంటనే నీటిని తీసికొని వచ్చి క్రింది పదముల నుచ్చరించుచు సంజీవినీ విద్యచే జమదగ్ని శరీరము నందు ఆ జలమును ప్రోక్షించేను. “నేనొనరించిన యజ్ఞముల యొక్క తపస్సు యొక్క శుభమయిన శక్తి యున్నచో, తచ్ఛక్తిచే పండుకొనినవాఁడు లేచినట్లు ఇతఁడు వెంటనే జీవించుగాక, “సాధుకారియయిన భృగునిచే ఈ శుభ వాక్యముచ్చరింపఁ బడినవేంటనే ఋచీకుని కుమారుం డయిన జమదగ్ని వేడొక బృహస్పతి వలె లేచెను.
దృష్ట్వా తత్ర స్థితం వంద్యం భృగుం స్వస్య పితామహమ్ ।
ననామ భక్త్యా నృపతే ! కృతాంజలి రువాచ చ ॥
జమదగ్ని రువాచ :-
ధన్యోఽహం కృతకృత్యోఽహం సఫలం జీవితం చ మే ॥
యత్పశ్యే చరణో తేఽద్య సురాసురనమస్కృతా ।
భగవస్ కిం కరోమ్యద్య శుశ్రూషాం తవ మానద ॥
పునీహ్యాత్మకులం స్వస్య చరణాంబుకణైర్విభో ।
ఇత్యుక్త్వా సహసాఽఽనీతం రామేణార్ఘ్యం ముదాన్వితః ॥
ప్రదదౌ పాదయోస్తస్య భక్త్యానమితకంధరః ।
తజ్ఞలం శిరసాఽధత్త సకుటుంబో మహామనాః ॥
అథ సత్కృత్య స భృగుం ప్రప్రచ్ఛ వినయాన్వితః ।
భగవన్ కిం కృతం తేన రాజ్ఞా దుష్టేన పాతకమ్ ॥
యస్యాతిథ్యం హి కృతవానహం సమ్యగ్విధానతః ।
సాధు బుద్ధ్యా స దుష్టాత్మా కిం చకార మహామతే ॥
వసిష్ఠ ఉవాచ :-
ఏవం స పృష్టో మతిమాన్ భృగుః సర్వవిదీశ్వరః ।
చిరం ధ్యాత్వా సమాలోచ్య కారణం ప్రాహ భూపతే ॥
భృగురువాచ :-
శ్రుణుతాత ! మహాభాగ ! బీజమస్య హి కర్మణః ।
యశ్చ వై కృతవాన్పాపం సర్వజ్ఞస్య తవానఘ ॥
శప్తః పురా వసిష్ఠేన నాశార్థం స మహీపతిః ।
ద్వీపరాధతో మూఢ ! వీర్యం తే వినశిష్యతే ॥
తత్కథం వచనం తస్య భవిష్యత్యన్యథా మునేః ।
అయం రామో మహావీర్యం ప్రసహ్య నృపపుంగవమ్ ॥
హనిష్యతి మహాబాహో ! ప్రతిజ్ఞాం కృతవాన్పురా ।
యస్మాదురః ప్రతిహతం త్వయా మాతర్మమాగ్రతః ॥
ఏకవింశతి వారం హి భృశం దుఃఖపరీతయా ।
త్రిః సప్త కృత్వో నిఃక్షత్రాం కరిష్యే పృథివీమిమామ్ ॥
అందే యున్నట్టి వానిని, తన పితామహుఁడయిన భృగుని, వంద్యుని చూచి, భక్తితో జమదగ్ని నమస్కరించెను. కృతాంజలియై యిట్లు పలికెను.
జమదగ్ని పలికెను.
నేను ధన్యుఁడనయితినీ. కృతకృత్యుఁడనయితిని. నా జీవితము సఫలమయినది. సురాసురులచే నమస్కరింపబడునట్టి నీ చరణద్వంద్వమును చూచిన పుణ్యముచే ఓ మానద ! ఓ భగవన్ ! నీకు ఎట్టి శుశ్రూషను చేయగలను? ఓ విభో నీ చరణాంబుకణములచే నీ కులమంతయు పుణ్యమయినది.” అని పలికెను. ముదాన్వితుఁడయ్యెను. రాముఁడు అర్ఘ్యమును వెంటనే తీసికొని వచ్చెను. భక్తిచే వంచిన కంధరముతో ఆ మహరీ పాదముల గడిగెను, ఆ మహామతిమంతుని కుటుంబ సభ్యులెల్లరా జలమును (పాదార్యజలమును శిరసాధరించిరి. జమదగ్ని భృగువును సత్కరించెను. వినయాన్వితుఁడై యిట్లు అడిగెను.” భగవన్ ఆ రాజుచే ఈ పాతకమేల చేయంబడినది? ఆతనికి నేను సమ్యగ్వధానముతో సర్వసంపత్సమృద్ధముగా ఆతిథ్య మొనర్చి యుంటినే. ఓ మహామతీ! ఆ దుష్టాత్ముడు, ఏమి పాపమొనర్చెను”. వసిష్ఠుఁడిట్లనెను.
ఇట్లుడుగబడి మతిమంతుఁడు బ్రహ్మతుల్యుఁడునగు భృగువు, చిరము ధ్యానము చేసి, సమాలోకించి, కారణమిట్లు చెప్పెను.
భృగువు ఇట్లనెను.
“ఓ మహాభాగ ! వత్స ! ఈ కర్మకు బీజమును వినుము, సర్వజ్ఞుఁడవయిన నీకేల పాపమాచరించెనో మినుము. పూర్వము వసిష్టునిచేత ఆ మహీపతి నాశనము అగునట్లుగా శపింపఁబడెను. “ఓ మూఢ ! ద్విజశ్రేష్ఠున కొనరించిన అపరాధముతో నీ వీర్యము నశించగలదు. ఆ మునీశ్వర వచనమెట్లన్యధా కాగలదు? ఈ రాముఁడు మహావీర్యుడైన ఆ రాజును ఎదుర్కొని చంపఁగలఁడు. మహాబాహో ! రాముడింతకు పూర్వమే ప్రతిజ్ఞచేసి యున్నాఁడు ! ఏ కారణమున నా యెదుట దుఃఖ పరీతయయిన తల్లి తన యురమును ఇరువది యొక్కమారు చేతులతో తాడనము చేసికొనెనో, తత్కారణమున ఈ పృథివి నంతటిని ఇరువది యొక్క మారు నిఃక్షత్రయుత మొనర్చెదను.
అతోఽయం వార్యమాణోఽపీ త్వయా పిత్రా నిరంతరమ్ ।
భావినోఽర్ధస్య చ బలాత్కరిష్యత్యేవమానద ॥
స తురాజా మహాభాగో వృద్ధానాం పర్యుపాసితా ।
దత్తాత్రేయాద్ధరేరంశాల్లబ్ధబోధో మహామతిః ॥
సాక్షాద్భక్తో మహాత్మా చ తద్వధే పాతకం భవేత్ ।
ఏవముక్త్వా మహారాజ స భృగుర్భ్రహ్మణఃసుతః ।
యథాగతం యథా విద్వాన్భవిష్యత్కాలపర్యయాత్ ॥
ఇతి శ్రీ బ్రహ్మండమహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయఉపోద్ఘాతపాదే భార్గవచరితే త్రింశత్తమోఽధ్యాయః ॥
అందుచే, తండ్రివయిన నీవు నిరంతరము ఆతనిని వారించుచున్నను, రాముఁడు, అనివార్యమయిన భవిష్యత్కార్య బలాత్కారమున తప్పక యిట్లు చేయును. మహాభాగుఁడయిన ఆ రాజు వృద్ధులను బహుపర్యాయములు భక్తిచే సేవించినవాఁడు. దత్తాత్రేయుని వలన లభించిన మహా విజ్ఞానము కలవాఁడు. మహాత్ముడైన యారాజు సాక్షాద్భక్తుఁడు. తద్వధ వలన పాతకము కలుగును. ఓ మహారాజ ఇట్లు పలికి బ్రహ్మ సుతుఁడయిన యా భృగువు భవిష్యత్కాల విపర్యయవేత్త వచ్చిన విధముగనే తిరిగి వెడలి పోయెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమునందు మధ్యభాగమున తృతీయోపోద్ఘాత పాదమునందు భార్గవ చరితమను ముప్పదియవ అధ్యాయము.
Summary of chapter 68 of the Brahmānda Mahā Purana is as follows:
Continuing the Lunar Dynasty chronicle, this section details the succession of king Āyu and the majestic reign of king Nahusha who once ascended to the throne of heaven. It recounts his great virtues as well as his eventual fall due to momentary pride when interacting with the holy sages. The story serves as a profound spiritual lesson for the faithful, reminding them that humility and constant self-vigilance are essential on the path to ultimate liberation.