28 - విశుక్రవిషంగవధో   

రణే భగ్నం మహోదైత్యం భండదైత్యః సహోదరమ్ ।

 సేనానాం కదనం శ్రుత్వా సంతప్తో బహుచింతయా॥

ఉభావపి సమేతౌ తౌ యుక్తౌ సర్వైశ్చ సైనికైః।

 ప్రేషయామాస యుద్ధాయ భండదైత్యః సహోదరౌ॥

 తావభౌ పరమక్రుద్ధౌ భండదైత్యేన దేశీతౌ ।

 విషంగశ్చ విశుక్రశ్చ మహోద్యమమ వాపతుః॥

 కనిష్ఠసహితం తత్ర యువరాజం మహాబలమ్।

 విశుక్రమనువవ్రాజ సేనా త్రైలోక్యకంపినీ॥

అక్షౌహిణీచతుఃశత్యా సేనానామావృతశ్చ సః।  యువరాజః ప్రవవృధే ప్రతాపేన మహీయసా॥

ఉలూకజిత్ప్రభృతయో భాగినేయా దశోద్ధతాః।

 భండస్య చ భగిన్యాం తు ధూమీన్యాం జాతయోనయః॥  కృతాస్త్రశీక్షా భందేన మాతులేన మహీయసా।

విక్రమేణ వలంతస్తే సేనానాథాః ప్రతస్థిరే॥

ప్రోద్గతైశ్చాపనిర్ఘోషైర్ఘోషయంతో దిశో దశ।

 ద్వయోర్మాతులయో: ప్రీతీం భాగినేయా విలేనిదే॥  ఆరూఢయానాః ప్రత్యేకం గాడాహంకారశాలినః।

ఆకృష్టగురుధన్వానో విశుక్రమనువవ్రజు॥

 యావరాజ్యప్రభాచిహ్నచ్చత్ర చామరశోభితః।

 ఆరూఢవారణః ప్రాప విశుక్రో యుద్ధమేదినీమ్॥

తతః కలకలారావకారిణ్యా సేనయా వృతః।

 విశుక్రః పటు దధ్వాన సింహనాదం భయంకరమ్॥

 తత్క్షోభాత్ క్షుభితస్వాంతాః శక్తయః సంభ్రమోద్ధతాః।

 అగ్నిప్రాకారవలయాన్నిర్జగ్ముర్భద్ధపంక్తయః॥

 తడిన్మయమివాకాశం కుర్వంత్యః స్వస్వరోచిషా।

 రక్తాంబుజావృతమివ వ్యోమచక్రం రణోన్ముఖాః॥

అథ భండకనీయాం సాహాగతౌ యుద్ధదుర్మదౌ।

 నిశమ్య యుగపద్యోద్దుం మంత్రిణీ దండనాయికే॥  కిరీచక్రం జ్ఞేయచక్రమారూఢే రథశేఖరమ్।

 ధృతాతపత్రవలయే చామరాభ్యాం చ వీజితే॥

అప్సరోభిః ప్రనృతాభిర్గీయమానమహోదయే।

 నిర్జగ్మతూరణం కర్తుముభాభ్యాం లలితాజ్ఞయా।

 శ్రీచక్రరథరాజస్య రక్షణార్థం నివేశితే।

 శతాక్షౌహిణికాం సేనాం వర్జయిత్వాస్త్రభీషణమ్॥

 అన్యత్సర్వం చమూజాలం నిర్జగామ రణోన్ముఖీ।

 పురతః ప్రాచలద్దండనాథా రథనిషేదుషీ॥

 ఏకమైవ కరాంగుల్యా ఘూర్ణయంతీ హలాయుధమ్।

 ముసలం చాన్యహస్తేన భ్రమయంతీ ముహుర్మహుః॥

 తరలేందుకలాచూడాస్పురత్పోత్రముఖాంబుజా ।

పురః ప్రహర్త్రీ సమరే సర్వదా విక్రమోద్దతా॥

 ధనుషో ధ్వనినా విశ్వం పూరయంతీ మహోద్ధతా।

 వేణీకృతకచన్యస్తవిలసచ్చంద్రపల్లవా॥

 స్ఫురత్త్రీతయనేత్రేణ సిందూరపాలకత్విషా।

 పాణినా పద్మరమ్యేణ మణికంకణచారుణా॥

తూణీరముఖతః కృష్ణం భ్రామయంతీ శిలీముఖమ్।

 జయ వర్ధస్వ వర్ధస్వేత్యతిహర్షసమాకులే॥

నృత్యద్భిర్ధివ్యమునిభిర్వర్థితాశీర్వచోమృతైః।  గేయచక్రరధేంద్రస్య చక్రనేమివిఘట్టనైః॥

 దారయంతీ క్షితితలం దైత్యానాం హృదయైః సహ।

 లోకాతీశాయితా విశ్వమనోమోహనకారిణా॥

గీతిబంధనామరీభిర్బహ్వీభిర్గతవైభవా॥

అక్షౌహణీసహస్రాణామష్టకం సమరోద్ధతమ్।  కర్షతీ కల్పవిశ్లేషనిర్మర్యాదాబ్ధిసంనిభమ్॥

తస్యాః శక్తిచమూచక్రే కాశ్చిత్కనకరోచిషః। కాశ్చిద్దామసంకోశాః కాశ్చిజ్జీమూతరోచిషః॥

అన్యాః సిందూరరుచయః పరాః పాటలపాటలాః।

 కాశ్చిద్రక్తాంబరాః కాశ్చిత్పరాః శ్యామలకోమలాః॥

 అన్యాస్తు హీరకప్రఖ్యాః పరా గరుత్మతోపమా।

 విరుద్ధైః పంచభిర్భాణైర్మిశ్రితైః శతకోటిభిః ॥

 వ్యఞ్జయంత్యో దేహరుచం కతిచీద్వివిధాయుధాః।

 అసంఖ్యా శక్తయశ్చేలుర్దండీన్యాస్సైనికే తథా॥

తథైవ సైన్యసన్నాహో మంత్రిణ్యాః కుంభసంభవ।

 యథాభూషణవేషాదీ యథా ప్రభావలక్షణమ్॥

 యథా సద్గుణశాలిత్వం యథాచాశ్రితలక్షణమ్।  యథా దైత్యౌఘసంహారో యథా సర్వైశ్చ పూజితాః॥

 యథా శక్తిర్మహారాజ్ఞా దండిన్యాశ్చ తథాభిలమ్।  విశేషస్తు పరం తస్యాః సాచివ్యే తత్కరే స్థితమ్।

 మహారాజ్జీవితీర్ణం తదాజ్ఞాముద్రాంగులీయకమ్

 ఇత్థం ప్రచలితే సైన్యే మంత్రిణీదండనాథయోః।

 తద్భారభంగురాభూమిర్దో లాలీలామలంబత॥

 తతః ప్రవవృతే యుద్ధం తుములం రోమహర్షణమ్।

 ఉద్ధూతధూలిజంబాలీభూతసప్తార్ణవీజలమ్॥

 హయస్థైర్హయసాదిన్యో రథస్థైరథసంస్థితాః।

 ఆధోరణైర్హస్తిపకాః ఖడ్గైః పద్దాశ్చ సంగతాః॥

 దండనాథా విషంగేణ సమయుధ్యంత సంగరే।  విశుక్రేణ సమం శ్యామా వికృష్టమణికార్ముకా॥

 అశ్వారూఢా చకారోచ్చైః సహోలూకజితా రణమ్।

సంపదీ కా చ జగ్రాహ పురుషేణ యుయుత్సయా ॥

విషేణ నకులీ దేవీ సమాహ్వాస్త యుయుత్సయా।  కుంతిషేణేన సమరం మహామాయా తదాఽకరోత్॥

 మలదేన సమం చక్రే యుద్ధమున్మత్తభైరవీ।  లఘుశ్యామా చకారోచ్చైః కుశూరేణ సమం రణమ్॥

స్వప్నేశీ మంగలాఖ్యేన దైత్యేంద్రేణ రణం వ్యధాత్।

 వాగ్వాదినీ తు జఘటే ద్రుఘణేన సమం రణే ॥

 కోలాటేన చ దుష్టేన చండకాల్యకరోద్రణమ్।  అక్షౌహిణీభిర్ధైత్యానాం శతాక్షౌహిణీకాస్తథా॥

మహాన్తం సమరే చక్రురన్యోన్యం క్రోధమూర్ఛితాః॥

ప్రవర్తమానే సమరే విశుక్రో దుష్టదానవః।

 వర్దమానాం శక్తిచమం వీయమానాం నిజాం చమూమ్॥

అవలోక్య రుషావిష్టః స కృష్ణగురుకార్ముకః।

 శక్తి సైన్యే సమస్తేఽపి తృషాస్త్రం ప్రముమోచ హ॥

తేన దావానలజ్వాలాదీప్తేన మథీతం బలమ్।

 తృతీయే యుద్దదివసే యామమాత్రం గతే రవౌ॥

 విశుక్రముక్తతర్షాస్త్రవ్యాకులాః శక్తయోఽభవన్ ॥

 క్షోభయాన్నింద్రియగ్రామం తారుమూలం విశోషయన్।  రూక్షయస్ కర్ణకుహరమంగదౌర్భల్యమావహన్॥

 పాతయన్ పృథివీపృష్ఠే దేహం విసంసితాయుధమ్।

 ఆవిర్బభూవ శక్తీనామతితీవ్రస్తృషాజ్వరః॥

యుద్ధేష్వనుద్యమకృతా సర్వోత్సాహవిరోధినా ।

తర్షేణ తేన క్వథితం శక్తి సైన్యం విలోక్య సా॥

 మంత్రిణీ సహ పోత్రిణ్యా భృశం చింతామవాప హా॥

 ఉవాచ తాం దండనాథామత్యాహితవిశంకినీమ్।

రథస్థితా రథగతా తత్ప్రతీకారకర్మణే।

సఖి పోత్రిణి దుష్టస్య తర్షాస్త్రమిదమాగతమ్॥

 శిథిలీకురుతే సైన్యమస్మాకం హా విధేః క్రమః।  విశుష్కతాలుమూనాం విభ్రష్టాయుధతేజసామ్।

శక్తీనాం మండలేనాత్ర సమరే సముపేక్షితమ్॥

న కాపి కురుతే యుద్ధం న ధారయతి చాయుధమ్।  విశుష్కతాలుమూలత్వాద్వక్తుమప్యాలీ న క్షమాః॥

 ఈదృశీం నో గతిం శ్రుత్వా కీం వక్ష్యతి మహేశ్వరీ।

 కృతా చాపకృతిర్దైత్యైరుపాయం ప్రవిచింత్యతామ్॥

సర్వత్ర ద్వ్యష్టసాహస్రాక్షౌహిణ్యామత్ర పోత్రిణి।

 ఏకాపి శక్తిర్నైవాస్తి యాతర్షేణ న పీడితా॥

అత్రైవావసరే దృష్ట్వా ముక్తశస్త్రాం పతాకినీమ్।

రంధ్రప్రహారిణో హంత బాణెర్నీఘ్నంతి దానవాః॥

అత్రోపాయస్త్వయా కార్యో మయా చ సమరోద్యమే।

 త్వదీయరథపర్వస్థో యోస్తి శీతమహార్ణవః॥

తమాదిశ సమస్తానాం శక్తీనాం తర్షనుత్తయే।

 నాల్సైః పానీయపానాద్యైరేతాసాం తర్షసంక్షయః॥  స ఏవ మది రాసింధుః శక్తౌఘం తర్పయిష్యతి । తమాదిశ మహాత్మానం సమరోత్సాహకారిణమ్ ।

సర్వతర్షప్రశమనం మహాబలవివర్ధనమ్॥

 ఇత్యుక్తే దండనాథా సా సదుపాయేన హర్షితా।  ఆజుహావ సుధాసింధుమజ్ఞాం చక్రేశ్వరీ రణే॥

 స మదాలసరక్తాక్షో హేమాభః స్రగ్విభూషితః॥

 ప్రణమ్య దండనాథాం తాం తదాజ్ఞాపరిపాలకః॥

 ఆత్మానం బహుధా కృత్వా తరుణాదిత్యపాటలమ్।  క్వచిత్తాపిచ్ఛవచ్ఛామం క్వచిచ్చ ధవలద్యుతిమ్॥

కోటితో మధురా ధారా కరిహస్తసమాకృతీః।

వవర్ష సింధురాజోఽయం వాయునా బహులీకృతః॥

 పుష్కలావర్తకాద్యైస్తు కల్పక్షయబలాహకైః।  నిషిద్యమానో మధ్యేఽబ్ధః శక్తినే పపాత హ ॥ యధ్గాంధాఘ్రాణమాత్రేణ మృత ఉత్తిష్ఠతే స్ఫుటమ్।  దుర్బలః ప్రబలశ్చస్యాత్తద్వవర్ష సురాంబుధిః॥  పరార్ధసంఖ్యాతీతాస్తా మధుధారాపరంపరాః।  ప్రపిబంత్యః పిపాసార్తైర్ముఖైః శక్తయ ఉత్థితాః॥

యథా సా మదిరాసింధువృష్టిర్థైత్యేషు నో పతేత్।

తథా సైన్యస్య పరితో మహాప్రాకారమండలమ్॥

లఘుహస్తతయా యుక్తైః శరజాలైః సహస్రశః।

 చకార విస్మయకరీ కదంబవనవాసినీ॥

కర్మణా తేన సర్వేపి విస్మితా మరుతోఽభవన్॥

 అథ తాః శక్తయో భూరీ పిబంతి స్మ రణాంతరే॥

 వివిధా మదిరా ధారా బలోత్సాహవివర్దినీ। యస్యా యస్యా మనఃప్రీతీ రుచిః స్వాదో యథా యథా॥

 తృతీయే యుద్ధదివసే ప్రహరద్వితయావధి।

 సతతం మద్యధారాభిః ప్రవవర్ష సురాంబుధిః॥

గౌడీ పైష్టీ చ మాధ్వీ చ వరా కాదంబరీ తథా।  హైతాలీ లాంగలేయా చ తాల జాతాస్తథా సురాః॥

 కల్పవృక్షోద్భవా దీప్యో నానాదేశసముద్భవాః।

 సుస్వాదుసౌరభాద్యాశ్చ శుభగంధసుఖప్రదాః॥

 బకులప్రసవామోదా ధ్వనంత్యో బుద్బుదోజ్జ్వలాః।

 కటుకాశ్చ కషాయాశ్చ మధురాస్తిక(స్తిక్త) తాసృశాః॥

బహువర్ణసమావిష్టాశ్ఛేదినీః పిచ్ఛలోస్తథా ।

ఈషదమ్లాశ్చ కట్వమ్లా మధురామ్లాస్తథా పరాః॥

 శస్త్రక్షతరుగాహంత్రీ చాస్థిసంధానదాయినీ।  రణభ్రమహరా శీతా లఘ్వ్యస్తద్వత్కవోష్ఠాకాః॥

సంతాపహారిణీశ్చైవ వారుణీస్తా జయప్రదాః।

నానావిధాః సురాధారా వవర్ష మదిరార్ణవః॥

అవిచ్ఛిన్నం యామమాత్రమేకైకా తత్ర యోగినీ।

 ఐరావతకరప్రఖ్యాం సురాధారాం ముదా పపౌ॥  ఉత్తానం వదనం కృత్వా విలోలరసనాశ్చలమ్।

శక్తయః ప్రపపుః సీధు ముదా మీలితలోచనాః॥

ఇత్థం బహువిధం మాధ్వీధారాపాతైః సుధాంబుధిః।

ఆగతస్తర్పయిత్వా తు దివ్యరూపం సమస్థితః॥

 పునర్గత్వా దండనాథాం ప్రణమ్య స సురాంబుధిః।

 స్నిగ్ధగంభీరఘోషేణ వాక్యం చేదమువాచ తామ్॥

దేవి పశ్య మహారాజ్ఞి దండమండలనాయికే।  మయా సంతర్పితా ముగ్ధరూపా శక్తివరూధినీ॥

కాశ్చిన్నృత్యంతి గాయంతో కలకణితమేఖలాః॥

 నృత్యంతీనాం పురః కాశ్చిత్కరతాలo వితన్వతే ॥

కాశ్చిద్ధసంతి వ్యావల్గద్వల్గువక్షోజమండలాః॥

 పతంత్యన్యోన్యమంగేషు కాశ్చిదానందమంధరాః॥

కాశ్చిద్వల్గంతి చ శ్రేణివిగలన్మేఖలాంబరాః।

 కాశ్చిదుత్థాయ సంసద్ధా ఘూర్ణయంతి నిరాయుధాః॥

ఇత్థం నిర్దిశ్యమానాస్తాః శక్తీ మైరేయసింధున।  అవలోక్య భృశం తుష్టా దండినీ తమువాచ హ॥

పంతుష్టాస్మి మద్యాబ్ధే త్వయా సాహ్యమనుష్ఠితమ్।  దేవకార్యమిదం కిం చ నిర్వఘ్నితమిదం కృతమ్॥

అతః పరం మత్ప్రసాదాద్వాపరే యాజ్ఞికైర్మఖే।  సోమపానవదత్యంతముపయోజ్యో భవిష్యసి॥

 మంత్రేణ పూతం త్వాం యాగే పాస్యంత్యఖిలదేవతాః।

 యాగేషు మంత్రపూతేన పీతేన భవతా జనా॥

 సిద్దిమృద్ధిం బలం స్వర్గమపవర్గం చ బిభ్రతు।

 మహేశ్వరీ మహాదేవో బలదేవశ్చ భార్గవ।

 దత్తాత్రేయో విధిర్విష్ణుస్త్వాం పాస్యంతి మహాజనాః॥

 యాగే సమర్చితస్త్వం తు సర్వసిద్ధిం ప్రదాస్యసి ॥

ఇత్థం వరప్రదానేన తోషయిత్వా సురాంబుధిమ్॥

మంత్రిణీం త్వరయామాస పునర్యుద్ధాయ దండినీ।

 పునః ప్రవవృతే యుద్ధం శక్తీనాం దానవైః సహ॥

ముదాట్టహాసనిర్భిన్నదీగష్టకధరాధరమ్।

 ప్రత్యగ్రమదిరామత్తా పాటలీకృతలోచనాః॥

శక్తయో దైత్యచక్రేషు న్యపతన్నేకహేలయా॥

ద్వయేన ద్వయమారేభే శక్తీనాం సమదశ్రియమ్।

మదరాగేణ చక్షూoషి దైత్యరక్షేన శస్త్రికా॥

 తథా బభూవ తుములం యుద్ధం శక్తిసురద్విషామ్।

 యథా మృత్యురవిత్రస్తః ప్రజా సంహరతే స్వయమ్॥

 సంస్ఖలత్పదవిన్యాసా మదేనారక్తదృష్టయః।

 యువరాజస్య సైన్యాని శక్తయః సమనాశయన్॥

 అక్షౌహిణీశతం తత్ర దండినీ సా వ్యదారయత్।

 అక్షౌహిణీసార్ధశతం నాశయామాస మంత్రిణీ॥

 అశ్వారూడాప్రభృతయో మదారుణవిలోచనాః।

 అక్షౌహిణీసార్ధశతం నిన్యురంతకమందిరమ్॥

అంకుశేనాతితీక్ష్ణ్యేన తురగారోహిణీ రణే।

 ఉలూకజితమున్మథ్య పరలోకాతీథిం వ్యధాత్।

 సంపత్కరీప్రభృతయః శక్తిదండాధినాయికాః।

 పరుషేణ ముఖాన్యన్యాన్యవరుద్ధా వ్యధారయన్ ॥

 అస్తం గతే సవితరీ ధ్వస్తసర్వబలం తతః।

 విశుక్రం యోధయామాస శ్యామలా కోపశాలినీ॥

అస్త్రప్రత్యస్త్రమోక్షేణ భీషణేన దివౌకసామ్।

 మహాతా రణకృత్యేన యోధయామాస మంత్రిణీ॥

ఆయుధాని సుతీక్ష్ణాని విశుక్రస్య మహౌజసః।

 క్రమశః ఖండయంతీ సా కేతనం రథసారథిమ్॥

ధనుర్గుణం ధనుర్ధండం ఖండయంతీ శిలీముఖైః।

 అస్త్రేణ బ్రహ్మశిరసా జ్వలత్పావకరోచిషా॥

 విశుక్రం మర్థయామాస సోఽపతచ్చూర్ణవిగ్రహః।

 విషంగం చ మహాదైత్యం దండనాథా మదోద్ధతా॥

 యోధయామాస చండేన ముసలేన వినిఘ్నతీ।

 స చాపి దుష్టదనుజః కాలదండనీభాం గదామ్।

 ఉద్యమ్య బహునా యుద్ధం చకారాశేషభీషణమ్॥

అన్యోన్యమంగం మృద్నంతౌ గదాయుద్ధ ప్రవర్తినౌ।

 చండాట్టహసముఖి పరిభ్రమణకారిణా॥

కుర్వాణౌ వివిధాంశ్చోరాన్ ఘూర్ణంతౌ తూర్ణవేష్టినౌ।

 అన్యోన్యదండహననైర్మోహయంతౌ ముహుర్ముహుః॥

 అన్యోన్యప్రహృతౌ రంధ్రమీక్షమా మహోద్ధతౌ।

 మహాముసలదండాగ్ర ఘట్టనక్షోభితాంబరౌ॥

ఆయుధ్యేతాం దురాధర్షౌ దండినీదైత్యశేఖరౌ॥

అధార్ధరాత్రిసమయపర్యంతం కృతసంగరా।

 సంక్రుద్ధా హంతుమారేభే విషంగం దండనాయికా॥

తం మూర్ధని నిమగ్నేన హలేనాకృష్య వైరిణమ్।

 కఠోరం తాడనం చక్రే ముసలేనాథ పోత్రిణీ॥

తతో ముసలఘాతేన త్యక్తప్రాణో మహాసురః।

 చూర్ణితేన శతాంగేన సమం భూతలమాశ్రయత్॥

 ఇతి కృత్వా మహత్కర్మ మంత్రిణీదండనాయికే । తత్రైవ తం నిశాశేషం నిన్యతుః శిబిరం ప్రతి ॥

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే విశుక్రవిషంగవధో నామాష్టావింశోఽధ్యాయః ॥

సమాప్తం తృతీయదివసయుద్ధమ్.

శ్రీ బ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున విశుక్రవిషంగవధమను నిరువదియెనిమిదవ యధ్యాయము-తృతీయదివ సయుద్ధము.

            భండాసురుడు సోదరుడైన మహారాక్షసుడు (గజాసురుడు) రణమున జచ్చుటను విని సేనల యొక్క యుద్ధమును గూడవిని సంతపుడై మిక్కిలి చింతించెను-1. అంత, భండాసురుడు తనసోదరులగు విషంగవీశుక్రులను యుద్ధమునకు పంపెను.వారిరిరువురు నెప్పుడును కలిసియుండువారు. భండునిచే నాజ్ఞాపింప బడినవారు. అట్టి విషంగ విశుక్రులు యుద్ధమునకు మహోద్యమమును జేసిరీ-3. కనిషునితో గూడి మహాబలుడై యువరాజగు శ్రీశుక్రుని ముల్లోకముల నగరజేయు సేనయనుసరించేను. నాలుగువందల యక్షౌహిణీ సేన విశుక్రుని నావరించి వచ్చుచుండెను. యువరాజైన విశుక్రుడు గూడ గొప్ప ప్రతాపముచే హెచ్చుచుండెను-5. ఉలూకుడు మొదలగు భండాసురునీ మేనల్లుండ్రు గూడ మహోద్దతులై బయలుదేరిరి, వారు భండాసురుని యక్కయగు ధూమిని యందు బుట్టిన వారు-6. వారికి మామ యగు భండాసురుడే యస్త్రశీక్షణము నిచ్చెను. పరాక్రమమున దీరుగుచు వారు సేనాధిపతులై బయలు దేరిరి-7. పైకెగసిన తమ ధనుష్టంకార ధ్వనితో పది దీకులను మారు మ్రోగించిరి. ఈ మేనల్లుండ్రు తమ యిరువురి మేనమామలకు (విషంగవిశుక్రులకు) ప్రీతిని గలుగజేసిరి-8. తమ తమ వాహనములెక్కిది. ప్రతియొక్కరును గాఢమైన యహంకారములతో నొప్పిరి. తమ బరువైన ధనువుల నారులను లాగిరి. ఈ విధముగా వారు విశుక్రుని ననుసరించి వెడలిరి-9. యావరాజ్య ప్రభాచిహ్నములైన ఛత్రచామరములతో బ్రకాశించి గజమునెక్కి విశుక్రుడు యుద్ధభూమీని జేరెను-10. అంత, కలకలా రావమును జేయుసేనతో నావరింపబడినవాడై విశుక్రుడు ఒక గంభీరమై భయంకరమైన సింహనాదమును జేసెను-11. ఆకలతతో కలత జెందిన మదీతో శక్తులు సంభ్రమముతో విజృంభించిరి. వరుసలు గట్టి అగ్ని ప్రాకార వలయము నుండి బయలువెడలి-12. తమ తమ కాంతులతో నాకాశమునంతయు మెఱపులు నిండినట్లుగా జేసిరి. రణోన్ముఖులై ఆశాశమండలమును ఎట్ట కమలములతో నావరింపబడిన దానిగా జేసిరి-13. అంతలో భండాసురునీ తమ్ములు యుద్ధదుర్మదులై, శక్తులు వచ్చుటను విని, ఒక్కుమ్మడిగా మంత్రిణీ దండనాయికలతో యుద్ధము జేయవచ్చిరి-14. ఆ మంత్రీడీ దండనాయికలు శ్రేష్ఠములైన కిరిచక్రరథమును బ్లేయ చక్రరథమును ఆధీష్ఠించిరి. ఆ రథములకు రాజచిహ్నములైన గొడుగులు గలవు. వీచుచున్న చామరములును గూడ గలవు. అప్సరలు వచ్చి వారి మహోదయములును గానము జేయుచుండిరి. విషంగవీశుక్రులతో యుద్ధము జేయుటకు లలితాదేవి యాజ్ఞచేత, శ్రీచక్రరాజరథముయొక్క రక్షణమున నియోగింపబడిరి-17. రథమున గూర్చున్న దండనాథ అస్త్రములతో భయంకరమైన తక్కిన సైన్య సమూహములను గూర్చి రణోన్ముఖియై ముందుకు బయలుదేరెను-18. చేతియొక్క ఒక్కవేలిచేత హలాయుధమును ద్రిప్పుచుండెను. మరోక హస్తముతో రోకలి వంటి యాయుధమును మాటిమాటికి ద్రిప్పుచుండెను-19. ఆమె ముఖము పద్మము వలెనుండెను. ముసుగు వస్త్రములో నుండి సిగలోనున్న చంద్రకళ తళతళమని ప్రకాశించుచుండెను. యుద్ధమున శత్రువుకన్న ముందే దెబ్బవేయునట్టి పరాక్రమముతో విజృంభించుచుండెను-20. ధనువు యొక్క నారీఠంకారముచే వీశ్వమునే నీంపుచుండెను. అల్లిన జడలో చంద్రుడను చివురాకు నలంకరించేను-21. మూడవకన్ను సిందూర తిలకకాంతిని గలిగియున్నది. చేయి మణికంకణముతో సుందరమై పద్మమువలే రమ్యమైనదీ-22. అమ్ములపొదీనుండి లాగిన బోణమును చేత త్రిప్పుచుండెను. జయింపుము, వర్ధిల్లుము వర్ధిల్లుము అని మిక్కిలి సంతోషముతో నమృతవాక్కులతో-23. నాట్యము జేయుచు దివ్యమునులాశీర్వదించుచుండిరి. గేయ చక్రరథశ్రేష్ఠము యొక్క చక్రపుటంచుల ఘట్టనములు-24. దానవ హృదయములతో బాటు భూతలమును జీల్చుచుండెను. అమరస్త్రీలుపెక్కురు విశ్వ మనోమోహనమైన గీతిబంధముతో దండనాథయొక్క లోకాతీశయ వైభవమును గానము జేయుంచుండిరి-25. కల్పాంతకాలమునుద్వేలమైన సముద్రమువలె సమరమున విజృంభించు ఎనిమిది వేల యక్షౌహిణీ సైన్యమును దండనాథ లాగుకోనీ పోవుచుండెను-26. ఆమెయొక్క శక్తి సైన్య మండలమున కొందరు బంగారు వన్నెగలవారు, కొందరు దానిమ్మ పండు రంగు గలవారు. కొందరు మేఘకాంతి గలవారు-27. ఇతరులు సిందూరపు వన్నెగలవారు. మరి కొందరు కలిగొట్టు పువ్వువలె  నెఱ్ఱనైన వారు, కొందరు  కాచాద్రీకాంబరులు (గాజు పర్వతము వంటి వస్త్రములు గలవారు). కొందరు శ్యామల వర్ణముగల సుకుమారులు-28. కొందరు మణులవలె ప్రకాశించువారు. కొందరు గరుత్మత మణుల వలే బ్రకాశించువారు. (గరుడపచ్చలవంటివారు). కొందరు విరుద్ధములైన పంచ బాణములతో మిశ్రితములైన శతకోటి కాంతులతో తమ దేహకాంతిని వ్యంజింపజేయువారు. కొందరు  వివిధాయుధములు గలవారు. దండినీ సైన్యమున వీరు అసంఖ్యాకులై కదిలిరీ-30. ఓ అగస్త్యా! మంత్రిణీ సేనానాయిక యొక్క సైన్య సన్నాహము:- భూష-వేషాదులలోను, ప్రభావ లక్షణములలోను-31, సద్గుణ సౌలితలోను, ఆశ్రిత రక్షణలోను, రాక్షస సమూహ సంహారములోను, సర్వులచే పూజింపబడుటలోను-32. మహారాజ్ఞి కెంత శక్తి కలదో దండినికి గూడనంతటి సమస్త శక్తి కలదు. కాని, మంత్రిత్వమునకై మహారాజ్ఞచే నీయబడి యామె కరముననున్న ఆమెయాజ్ఞాముద్రాంగుళీయకము మాత్రము విశేషము, (ఇది మహారాజ్ఞకడనుండదని భావము)-33. ఈ విధముగా మంత్రిణీదండనాథల సైన్యము ముందుకు కదలగా నా, సైన్య భారముచే బీటలు వారిన భూమీ ఊయెల యూగెను -34. ఆ తరువాత యుద్ధము ప్రవర్తిల్లెను. అది దొమ్మి యుద్దము, గగుర్పాటు గలిగించెను. దాని వలన పైకెగసిన ధూళిచేత సప్త సముద్ర జలములన్నియు బురదగానైనవి-35, గుఱ్ఱము నెక్కిన వారితో గుఱ్ఱము నెక్కిన స్త్రీలు, రథముననున్న వారితో రథముననున్న స్త్రీలును, గజము నెక్కిన వారితో గజము నెక్కిన స్త్రీలును, గడ్డ ధారులతో ఖడ్గ ధారిణులైన పదాతి దళమును ఢీ కొనిరీ-36, దండనాథ విషంగునితో రణమున యుద్ధము జేసెను. విశుక్రునితో లాగిన మణి ధనువు గల శ్యామా శక్తి యుద్దముజేసెను-37. అశ్వారూఢ ఉలూకజిత్తుతో గొప్ప రణము జేసెను. సంపదీశ పురుషునితో యుద్ధము జేయదలచి వాని బట్టుకొనెను-38. నకులీదేవి విషునితో యుద్ధము జేసెను. మహామాయ కుంతిషేణునితో యుద్ధము జేసెను-39, ఉన్మత్త భైరవి మలదునితో యుద్ధము జేసెను. లఘుశ్యామ కుశూరునితో యుద్దము జేసెను-40. స్వప్నే మంగలుడను దైత్య-రాజుతో యుద్దము జేసెను. పొగ్వాదిని, ద్రుఘణునితో తలపడేను-41. చండకాలి దుష్టుడైన కోలాటునితో యుద్దము జేసెను. శక్తుల శతాక్షౌహిణీ సైన్యము క్రోధమూర్ఛితలైన రాక్షసుల యక్షౌహిణీ సైన్యముతో నొండొరులు రణమున తలపడిరి-42. యుద్ధము జరుగుచుండెను. దుష్టుడైన విశుక్ర రాక్షసుడు శక్తిసేన వర్ధిల్లుచుండుటను తమ సేన తగ్గుతున్నట్లను జూచెను-43. చూచి కోపావిష్ణుడై తన బరువైన ధనువును లాగీ సమస్త శక్తి సైన్యముపై తృషాస్త్రమును (దప్పిని కలుగజేయు నస్తమును) వదిలెను-44. కారు చిచ్చువలె మండిన యాతృషాస్త్రముచే శక్తి సైన్యము మథింపబడినది. అపుడు మూడవ యుద్దదివసమున సూర్యుడు ఒక జాము గడచేను. శక్తులు విశుక్రుడు వదిలిన తృషాస్త్రముచే, వ్యాకులితలైరీ-45. అపుడు శక్తులకతీతీవ్రమైన తృషా జ్వరమావరించెను. అది వారీ యింద్రియ సమూహములను క్షోభింపజేసినది. దవడల మూలములను మిక్కిలి ఎండజేసినది. చిట్ట చివరకు చేతి నుండి యాయుధములను జారవిడిచి దేహములు భూమిపై బడునట్లు జేసినదీ-46, 47. దప్పితో తపింపబడిన శక్తి సైన్యమును జూచి యా మంత్రిణి పోత్రిణితో (వారాహితో)బాటు మిక్కిలి చింతించేను-48. అపుడు రథ  స్థితమై మహా భయమునాశంకించుచున్న మంత్రిణితో ఆతృషాస్త్రప్రతీకార కర్మ విషయమును రథ గతమైన దండనాథ యిట్లనెను. చెలీ! . పోత్రిణీ! (వారాహీ) ఇదీ దుష్టుని యొక్క (విశుక్రుని యొక్క తృషాస్త్రమున వచ్చిపడినదీ-49. ఇదీ మన సైన్యమును శిథిలము జేయుచున్నది. అయ్యో! ఇదీ విధి యొక్క క్రమము. ఎండిన తాలుమూలములు గలిగి, విభ్రష్టమైన యాయుధముల తేజములు గలిగిన శక్తుల మండలము యుద్దమును ఉపేక్షించినది-60. ఎవ్వరితో గూడ యుద్ధము జేయుటలేదు, ఆయుధమును ధరించుటలేదు, ఓ. చెలీ! దవడల మూలము లెండి పోవుటచే మాటాడ నశక్తలైనారు-51. ఇటువంటి మన స్థితిని విని మహేశ్వరి యేమి చెప్పునో! దానవు అపకారము జేసినారు. దాని ప్రతీకారోపాయము చింతింపబడుగాక-52, ఓ పోత్రిణీ! ఎనుబది రెండు వేల యాక్షౌహిణీ సైన్యమున దప్పితో బాధపడని యొక్క శక్తి కూడలేదు-53. ఈ విధముగా శస్త్రములను వదలిన సేనను అవకాశముగా జేసికొని రంధ్రమును (లోపావకాశమును) జూచి యపహరించు స్వభావముగల దానవులు అయ్యో! బోణములతో మన సైన్యమును జంపుదురు-54. ఈ విషయమున నీవుపాయమును జేయవలె. నేను సమర ప్రయత్నము జేయుటకును ఉపాయమును జేయవలె. నీ రథము యొక్క ఒక పర్వమున (ఒక భాగమున) శీత మహా సముద్రుడున్నాడు-55. సమస్త శక్తుల దప్పినార్పుటకు అశీత సముద్రు నాదేశింపుము. చిన్న చిన్న పానీయముల ద్రోవుట మొదలగు పోటితో నీ శక్తుల దప్పి శాంతింపదు-56, అదీయే మద్రాసింధువు. శక్తుల సమూహముల దప్పిని శాంతింపజేయగలదు. కావున, సమరోత్సాహమును గలుగజేయు మహాత్ముడైన మదిరా సింధువు నాజ్ఞాపింపుము. అది యందరి దప్పినార్చగలదు. మహాబలమును వర్ధిల్ల చేయగలదు-57. అని చెప్పగా దండనాథ ఆ సదుపాయమునకు సంతసించెను. చక్రేశ్వరీ సుధా సింధుపును బిలువుమని (దండనాథను) ఆజ్ఞాపించెను-58. ఆ సుధా సింధువు మత్తుతో అలసమై యెర్రనైన కన్నులు గలవాడు, బంగరు వన్నెగలవాడు. పూలమాలల నలంకరించుకొన్నవాడు -59. ఆతడు దండనాథకు నమస్కరించి ఆమె యాజ్ఞను పరిపాలించేను-60. లేత. సూర్యునివలే నేనైన తనను బహు విధములుగా జేసెను. ఒకచోట చీకటిమ్రానువలె శ్యాముడు (నల్లనివాడు) ఒకచోట తెల్లని కాంతీ గలవాడు-61. ఈ సింధురాజు వాయువుచే బహంలీకృతుడై వ్యాపించి ఏనుగ తొండముల వంటి కోట్ల కొలదీ మధుధారలను వర్షించెను-62. పుష్కలావర్తకము మొదలగు కల్పాంత కాలమేఘములచే మధ్యన తడుపబడుచున్నవాడై శక్తి సైన్యమున బడెను-63. దాని గంధమును వాసన జూచినంత మాత్రమున చచ్చినవాడు సైతము జీవించి స్పష్టముగా లేచి నిలబడును. దుర్భలుడు ప్రబలుడగును. కావున సురాసముద్రుడు వర్షించెను-64. పరార్ద సంఖ్యకు (సంఖ్యామానములో చివరి సంఖ్య కంటే) మించిన మధు ధారల వరుసలను ద్రాగుచు దప్పితో బాధ జెందిన ముఖములతో శక్తులు లేచిరి-65. ఆ మదిరా సముద్ర వర్షము దానవులపై బడకుండగా ఆశ్చర్య కరియైన కదంబ వనవాసిని తన చురుకైన చేతులతో బ్రయోగించిన వేలకొలదీ బాణ సమూహములతో శక్తి సైన్యము చుట్టును ప్రాకార మండలమును నిర్మించేను-66-67, ఆ పనితో దేవతలందరు నాశ్చర్యపడిరి. ఇక శక్తులు బలోత్సాహముల పెంపొందించు ఏవిధములైన మదిరాధారలను వారి వారి రుచికి, స్వాదమునకు, మనః ప్రీతిడిని అనుగుణముగా రణ మధ్యమున మిక్కుటముగాద్రాగుచుండిరి-68-69. మూడవ యుద్ద దీవసమున రెండు జాముల వరకు సురాసముద్రుడు ఎడతెగకుండ మద్య ధారలను వర్షించేను-70. మద్య భేదములివీ: గౌడి (బెల్లముతో జేసినది) పైష్టి (పిండితో జేసినది), మాధ్వి (ఇప్పపూవుతో జేసినదీ), వరకాదంబరి (గోమంత పర్వతముననొక కడప చెట్టు తొఱ్ఱలో నుండి వచ్చినది), హైతాలీ; లాంగలేయ, తాలజాత (తాటికల్లు). సుర-71. కల్ప వృక్షమునుండి బుట్టినది దివ్య అనేక దేశములందు బుట్టినవి మంచి రుచి, పొసన గలిగి సుఖమును నీచ్చునవి-72. బకుల పుష్పపు వాసనగల ధ్వని జేయుచు నురుగుతో ప్రకాశించునవి. కారము గలవి, ఒగరుగలని, తీయనివి, చేదుగలవి-73. అనేక వర్ణములు గలవి. కోయునవి. దట్టమైనవి. కొద్దిగా పుల్లనివి. కారము పులుపు గలవీ. తీపి, పులుపు గలవి-74. శస్త్రముల దెబ్బతో గలిగిన బాధలను పోగొట్టునవి. ఎముకల నతుకునవి. రణమునందు భ్రమను బోగొట్టునవి. చల్లనీవి. చురుకైనవి (చురుకుదనమును గలిగించునవి) కొద్దిగా వెచ్చనివి-75. బాధలను బోగొట్టునవి. వరుణ దేవుని పుత్రికలైన యీ మద్యములు.  జయప్రదములు. సోనా విధములునైన సురాధారలను మదిరాసముద్రుడు వర్షించెను -76. ఆరణమున ఒక్కొక్క యోగినీ శక్తి జామువరకు ఐరావతమను నేనుగు యొక్క తొండముతో సమానమైన సురాధారను ఎడతెగకుండ సంతోషముతో ద్రాగెను-77. నోరుపైకెత్తి ఆశతో కదులుచున్న నాలుక గలిగి, సంతోషముతో మూసిన కన్నులుగలిగి శక్తులు మదిరనుబాగుగా ద్రావిరి-78. ఈ విధముగా సుధాంబుధి బహువిధ ధారాపాతములచే వచ్చి శక్తి సైనికుల నందరికీడప్పీ దీర్చి తన దివ్య రూపమునందెను-79 ఆ సురా సముద్రడు మరల దండనాథ కడకేగి నమస్కరించి యామెతో (లలితాదేవితో) స్నేహపూర్వకమై గంభీరమైన ధ్వనితో నీ మాటలనేను-80. దేవి! మహారాజ్ఞి! దండమండలనాయికా! ముగ్గరూపమైన శక్తిసేనను దాహముదీర్చి తృప్తిపరచితిని చూడుము-81. కొందరు శక్తులు గానముజేయుచు, మధురముగా మొలనూళ్లు ధ్వనింపగా, నాట్యము జేయుచున్నారు. నాట్యము. జేయుచున్నవారి ముందర  కొందరు తాళములు వేయుచున్నారు-82. కదులుచున్న సుందరములైన స్తనమండలము గలిగి కొందరు శక్తులు నవ్వుతున్నారు. కొందరు ఆనందముచే మెల్లగా బోవుచు ఒండొరుల యంగములపై బడుచున్నారు-83. కొందరు పిరుదులపైన జారుచున్నమొలనూలును వస్త్రములును గలవారై -యెగురుచున్నారు. కొందరు లేచి సన్నద్ధలై ఆయుధములు లేకయే త్రిప్పుచున్నారు-84. ఈ విధముగా మదీరా సముద్రునిచే చూపబడుచున్న యీ శక్తులను జూచి మిక్కిలి సంతసించినదై దండిని యామదరాసముద్రుని నిట్లనెను-85. ఓ మద్యసముద్రుడా! నీవు సహాయము జేసితివి. సంతసించితిని. ఇది దేవకార్యము. ఇది నిర్విఘ్నముగా జేయబడినది-86. ఈ తరువాత సాయనుగ్రహమున ద్వాపర యుగమున యజ్ఞమున యాజ్ఞికులకు సోమపానము వలె. మిక్కిలి యుపయోగపడెదవు-87. సమస్తదేవతలు మంత్రముచేత పవిత్రమైన నిన్ను యాగమున ద్రాగెదరు. మంత్రపూతమైన నిన్ను ద్రాగుటచే జనులు సిద్ధిని, ఋద్దీని (పంపదను), బలమును, స్వరమును, మోక్షమును పొందుదురుగాక.. మహేశ్వరీ, మహాదేవుడు (శివుడు), బలరాముడు, భార్గవుడు (శుక్రుడు), దత్తాత్రేయుడు, బ్రహ్మ, విష్ణువు వీరందరు మహాజనులును నిన్ను ద్రాగెదరు. యాగమున బాగుగా నర్చింపబడిన నీవు వారికి సర్వసిద్ధి నిచ్చెదవు-90. ఈ విధముగా వరమునిచ్చుటచే సురాసముద్రుని సంతోషింపజేసీ-91, దండిని (దండనాథ) మరల మంత్రోసినీ యుద్ధమునకు తొందరపెట్టుచుండెను. శక్తులకు దానవులతో మరల యుద్ధము జరిగెను -92. క్రొత్తకల్లుతో మత్తెక్కి యెని కన్నులు గలవారై శక్తులు తమ పెద్ద నవ్వులతో సినిమీది దిక్కులను పర్వతములను పగులగొట్టుచు ఒకే విలాసముతో ఒక్కసారిగా రాక్షస మండలముపై బడిరి-93. అపుడు మత్తశ్రీలజెలగు శక్తుల యొక్క రెంటిచే రెండు ప్రకాశించినవి. మదరాగముతో నేత్రము లెఱ్ఱనైనవి. రాక్షస రక్తముచే వారు ధరించిన శస్త్రములు నెల్లనైనవి-54. ఆ విధముగా శక్తి రాక్షసులకు తుముల యుద్ధము జరిగెను. మృత్యువేమాత్రము భయపడక స్వయముగా ప్రజలను జంపునట్లు-95. తొట్రుబాటుతో నడచుచు, మదముతో నెళ్ళని కన్నులు గలిగి, తొట్రుపాటు పడుచున్న యక్షరములు గల వీర భాషలు గలవారై రణమున విజృంభించి-96. సమూహముగా గుండ్రని యాకారము గలవారై, చూచిన సర్వాంగ దృష్టులు గలవారై (వేయి కన్నులు న్నట్లు చూచి) శక్తులు యువరాజ సైన్యమును ధ్వంసము జేసిరి-97. దండిని నూరక్షౌహిణులసైన్యమును చీల్చివైచెను. నూటయేబది యక్షౌహిణుల సైన్యమును మంత్రిణి నశింపజేసెను-98. అశ్వారూఢ మొదలగు పొరు మదముతో నెరుపెక్కిన కన్నులు గలవారై నూటయేబదియక్షాణుల సైన్యమును యమ భవనమునకు బంపిరి-99. తురగారోహిణి రణమున వాడియైన యంకుశ (బల్లెముతో ఉలూకజిత్తుని (రాక్షసునీ) పరలోకమునకు బంపించెను -100. సంపత్కరి మొదలగు శక్తి దండాధినాయికలు పరుషముగా శత్రువుల ముఖములను నిరోధించి చీల్చివైచిరి-101. సూర్యుడస్తమించు వరకు సమస్తసైన్యమును జంపీరి-ఆ తరువాత కోపశాలినీయైన శ్యామల విశుక్రునితో బోరాడెను-102. దేవతల యస్త్ర ప్రత్యస్త్రములను భయంకరముగా వదులుచు, మంత్రిణి గొప్ప రణకృత్యములతో యుద్ధము జేసెను-103. ఆమె మహాతేజస్వియైన విశుక్రుని మిక్కిలివాడియైన యాయుధములను బాణములతో ఖండించుచు క్రమముగా నాతని ధ్వజమును రథసారధిని-104 ధనువునారినీ, ధనువును ఖండించెను. మండుచున్న యగ్నీ కాంతిగల బ్రహ్మశిరోనామకాస్తముతో విశుక్రునీ మర్ధించెను. వాడును చూర్ణమైన యాకారముతో బడెను. మహోద్దతయైన. దండనాథ మహారాక్షసుడైన విషంగునీ-106. భయంకరమైన ముసలాయుధముతో మోదుచు యుద్దముజేసెను. ఆదుష్ట రాక్షసుడును యమదండమువంటి గదనెత్తీ బాహువుతో మిక్కిలి భయంకరమైన  యుద్ధమును జేసెను. -107. గదోయుద్దమున ఒండొరులు దేహములను మర్ధించుచుండిరి. తిరుగుచు భయంకరాట్టహాసము జేయుచుండిరి-108. అనేక గదా యుద్దచారముల జేయుచుండిరి, తిరుగుచుండిరి. వేగముగా జుట్టుకొనుచుండిరి. ఒండొరుల దండముల  దెబ్బలకొండొరుల మాటిమాటికి మార్చిల్లజేయుచుండిరి-109. అవకాశము జూచి గొప్పగా విజృంభించి ఒండొరుల గొట్టుచుండిరి. వారి మహాముసల గదా దండాగ్రములయొళపీడికి ఆకాశము క్షోభిల్లుచుండెను. ఈ విధముగా దండినీదానవశ్రేషులు యుద్ధము జేసిరి-110. అర్థరాత్రి వరకు యుద్ధముజేసి దండనాయిక కోపించినదై విషంగుని జంప మొదలిడేను-111. ఆ తరువాత ప్రోత్రిణి విషంగుని శిరమున హలాయుధమును దగిలించి లాగి ముసలాయుధముతో గట్టిగా శిరముపై మోదైను-112. తరువాత ముసలాయుధపు దెబ్బతో విషంగ మహాసురుడు ప్రాణములు వదిలెను. చూర్ణమైన రథముతో బాటు భూమిపై బడెను. 113. ఈ విధముగా మంత్రిణీదండనాయికలు విషంగవధమను మహాకార్యమును జేసి, తక్కిన రాత్రిని గడుపుటకు అచటి శిబిరమునుజేరిరి-114.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున విషంగవధమను నిరువదియెనిమిదవ యధ్యాయము. తృతీయదివసయుద్ధము సమాప్తము.