బ్రహ్మాండ మహా పురాణము
5 - నరసింహావతారము: హిరణ్యకశిపుఁడు చంపఁబడెను - హిరణ్యకశిపునివంశము: మరుత్తులయుత్పత్తి
ఋషిరువాచ : -
దైత్యానాం దానవానాం చ గంధర్వోరగరక్షసామ్ ।
సర్వభూతపిశాచానాం వసూసోం పక్షివీరుధామ్ ॥
ఉత్పత్తిం నిధనం చైవ విస్తారాత్కథయస్వ నః ।
ఏవముక్తస్తదా సూతః ప్రత్యువాచర్షిసత్తమమ్ ।
సూత ఉవాచ :-
దితేః పుత్రద్వయం జజ్ఞే కన్యా చైకా మహాబలా ।
కశ్యపస్యాత్మజౌ తా తు సర్వేభ్యః పూర్వజౌ స్మృతా ॥
సౌశ్యహస్యతిరాత్రస్య కశ్యపస్యాశ్వమేధికాః ।
హిరణ్యకశిపుర్నామ ప్రథితం పృథగాసనమ్॥
దిత్యా గర్భాద్వినిఃసత్య తసీనః సమంతతః ।
హిరణ్యకశిపుస్తస్మాత్ కర్మణా తేన స స్మృతః ॥
ఋషయః ఊచుః :-
హిరణ్యకశిపోర్జన్మ నామ చైవ మహాత్మనః ।
ప్రభావం చైవ దైత్యస్య విస్తారాద్రూహి నః ప్రభో ॥
సూత ఉవాచ :-
కశ్యపస్యాశ్వమేథో భూతుణ్యే వై పుష్కరే తదా ।
ఋషిభిర్దేవతాభిశ్చ గంధర్వైరుపశోభితః ॥
ఉత్సష్టే స్వేచ వీధినా ఆఖ్యానాదౌ యథావిధి ।
ఆసనాన్యుపక్లుప్తాని సౌవర్ణానీ తు పంచ వై ॥
కులస్పదోపిత్రీణ్యత కూర్చః ఫలకమేవ చ ।
ముఖ్యర్వీజస్తు చత్వారస్తేషాం తాన్యుపకల్పయన్ ॥
క్లుప్తం తత్రాసనం చైకం హోతురర్థ హిరణ్మయమ్ ।
నిషసాద స గర్భోత్ర తత్రాసీనః శశంస చ ॥
ఆఖ్యానమానుపూర్యేణ మహర్షిః కశ్యపో యథా ।
తం దృష్ట్వా ఋషయస్తస్య నామ కుర్వంతి వర్ధితమ్ ॥
హిరణ్యకశిపుస్తస్మాత్కర్మణా తేన స స్మృతః ।
హిరణ్యాక్షనుజస్తస్య సింహికా తస్య చానుజా ॥
రాహో సా జననీ దేవీ విప్రచిత్తేః పరిగ్రహః ।
హిరణ్యకశిపుత్తైత్యశ్చచార పరమం తపః ॥
శతం వర్ష సహసణాం నీరాహారో హ్యధఃశీరాః ।
వరయా మాస బ్రహ్మాణం తుష్టం దైత్యో వరేణ తు ॥
సర్వామరత్వమవధం సర్వభూతేభ్య ఏవ హి ।
యోగాద్దేవాన్ వినిర్జిత్య సర్వదేవత్వమాస్థితః ॥
ఋషి యిట్లు అడిగేను.
దైత్యులయొక్క దానవులయొక్క గంధర్వులయొక్కఉరగులయొక్కరాక్షసుల యొక్క సర్వభూతములయొక్క వస్తువులయొక్క పక్షులయొక్క లతలయొక్క ఉత్పత్తిని,వినాశనమును,మాకు సవిస్తరముగా చెప్పుము. ఇట్లడుగఁబడి, ఆ ఋషి సత్తమునకు సూతుఁడిట్లు. ప్రత్యుత్తర మొసంగెను.
సూతుడు పలికెను.
‘దితి’కి ఇద్దరు కుమారులు,మహాబలవంతురాలయిన కూతురు కలిగిరి. కశ్యపుని ఆ కుమారద్వయము అందరికంటే ముందుగా పుట్టినవారు. కశ్యపుని ఆశ్వమేధికమున అతిరాత్రయజ్ఞము జరిగెను. అందు హిరణ్యకశిపు" అను పేరుతో ఒక ప్రత్యేకమైన యాసనము విస్తరింపబడెను. అప్పుడే దీతి ఆగర్భము నుండి వెలువడి యాయాసన మందంతటనొకడు గూర్చునెను. అందువలన అట్లు కూర్చున్నవాడు “హిరణ్యకశిపుడు” అనీ పిలుపబడెను.
ఋషులిట్లనిరి :
ఓ ప్రభో ! మహాత్ముఁడు హిరణ్యకశిపుండునైన వానీయొక్క జన్మను గూర్చి నామమును గూర్చి, ప్రభావమును గూర్చి మాకు విస్తరించి చెప్పుము.
సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిడెను.
కశ్యపుని అశ్వమేధము,పుణ్యము, పవిత్రమునైన పుష్కరమున జరిగెను. అయ్యది ఋషులచే, దేవతలచే, గంధర్వులచే నుపశోభితము. (7) స్వేచ్చగా తిరుగుటకు అశ్వము విడువబడెను, 'ఆఖ్యానము' మున్నగు వీధులు యథావిధి జరుపబడెను. ఐదు బంగారపు ఆసనములు సమకూర్పం బడి యుండెను. (8) ఆ విధులు మూఁడు కులస్పదములు, కూర్చము, రెండవది ఫలకము. (కట్టపలక), ముఖ్యఋత్విజులు నలుగురు. వారికి ఆ యాసనములను ఏర్పరచిరి. అందులోనొక బంగారు ఆసనము హోతకోకుగాను ఏర్పరుపబడినది. అచట నదితి గర్భమునుండి వెలువడిన వాడు కూర్చున్నవాడై కశ్యపమహర్షి చెప్పినట్లు ఆనుపూర్వీకముగ మంత్రముల జెప్పసాగెను. అతనిని జూచి ఋషులు ఆతనికి “హిరణ్యకశిపుడు” అను వర్దితమైన పేరు బెట్టిరి. (11) హిరణ్యకశిపుఁడు హిరణ్యాక్షుని తమ్ముఁడు. సింహిక ఆతని చిన్నచెల్లెలు.(12) ఆమె విప్రచిత్తి భార్య. రాహువు యొక్క తల్లిదైత్యుఁడయిన హిరణ్యకశిపుండు శతవర్ష సహస్రములు, నిరాహారుఁడై, అధఃశిరుఁడై ఉత్కృష్టమయిన తపస్సా చరించెను. బ్రహ్మసంతుష్టుఁడయ్యెను. ఆతనిని ఈ వరములు అడిగెను - (1) వధలేని సర్వామరత్వము. (సర్వదేవతాత్వము కలిగియుండుట- ఎట్టి జీవుల చేతను మరణము పొందకుండుట). ఆతఁడు తనయోగశక్తిచే దేవతల నందరను జయించెను. సర్వదేవత్వమును వహించెను.
కారయేహమిహైశ్వర్యం బలవీర్యసమన్వితః ।
దానవోస్త్వసురాశ్చైవ దేహశ్చ సహ చారణైః ॥
భవంతు వశగాస్సర్వే మత్సమీపానుభోజనాః ।
అర్ధశుషైరవధ్యశ్చ దివా రాత్రే తథైవ చ।
ఏవముక్తస్తదా బ్రహ్మానుజజ్ఞే సాంతరం వరమ్ ॥
బ్రహ్మోవాచ :-
మహానయం వరస్తాత వృతో దితిసుత త్వయా ।
ఏహీదానీం ప్రతిజ్ఞానం భవిష్యత్యేవమేవ తు ॥
దత్వా చాభిమతం తస్మై తలైవాంతరధాదథ ।
సోపి దైత్యస్తదా సర్వం జగత్థావరజంగమమ్ ॥
మహిమ్నా వ్యాప్య సంత’ బహుమూర్తిరమిత్రజీత్ ।
స ఏవ తపతి వ్యోమ్ని చంద్రసూర్యత్వమాస్థితః ॥
స ఏవ వాయుర్భూత్వా చ వనౌ జగతి సర్వదా ।
స గోపాలో విపాలశ్చ కరకశ్చ స ఏవ హ ॥
స జ్ఞాతా సర్వలోకేషు మంత్రవ్యాఖ్యాకరస్తథా ।
నేతా గోప్తా గోపయితా దీక్షితో యాజకః స తు ॥
తస్య దేవాః స్సురాః సర్వే తదాసన్సోమపాయినః ।
ఏవం ప్రభావో దైత్యోసావతో భూయో నిబోధత ॥
తస్మై సర్వే నమస్కారం కుర్వంతీజ్యః స ఏవ చ ।
హిరణ్యకశిపోర్టెత్యైః శ్లోకో గీతః పురా త్వీహ ॥
హిరణ్య కశిపూరాజా యాం యామాశాం నిరైక్షత ।
తస్యై తస్యై తదా దేవా నమశ్చక్రుర్మహర్షిభిః ॥
తస్యాసీన్నరసింహస్య మృత్యుర్విష్ణుః పురా కీల ।
నరాత్తు యస్మాజన్మాస్య నరమూర్తిశ్చ యత్ర్పభుః ॥
తస్మాత్స నరసింహో వై గీయతే వేదవాదిభిః ।
సాగరస్య చ వేలాయాముచ్ఛితస్తపనో విభుః ॥
శరీరం తస్య దేవస్య హ్యాపీద్దేవమయం ప్రభో ।
నామ్నా సుదర్శనం చైవ విశ్రుతశ్చ మహాబలః ॥
తతః స బాహుయుద్ధేన దైత్యేంద్రం తు మహాబలమ్ ।
నల్గేర్బిభేద సంక్రుద్ధో నార్ద్రాః శుష్కా నఖా ఇతి ॥
హిరణ్యాక్షసుతాః పంచ విక్రాంతాః సుమహాబలాః ।
శంబరః శకునిశ్చైవ కాలనాభస్తథైవ చ ॥
బలవీర్యసమన్వితుఁడనై ఈశ్వరుల యొక్క సకల చర్యలను ప్రభుత్వ యుత క్రియాకలాపముల) నేనే చేసెదను. దానవులు, అసురులు, దేవతలు చారణులతో సహా అందరు నా వశవర్తులగుదురుగాక. వారు మత్సమీపానువర్తులగుదురు గాక. (సాయాజకై ప్రతీక్షించుచుందురుగాక). వారు నా తరువాత భుజింతురుగాక. తడిసినది గాని (ఆర్ధము) శుష్కము (ఎండినదిగాని) యైన ఆయుధముచే నేను చంపఁబడరాదు” పగలున గాని రాత్రీయందుగాని నేను చంపబడురాదు. అని కోరెను.
బ్రహ్మ ఇట్లనెను :
ఓ బిడ్డా ! దితిసుత ! నీవు కోరిన వరము చాల గొప్పది. ఇటు రమ్ము. నేను ప్రతిజ్ఞానము చేయుచుంటిని ఆవియన్నియునట్లేయగును. అని ఆతని కభిమతములయిన వరములు హృదయపూర్వకముగా నొసంగి బ్రహ్మయచ్చటనే అంతర్జానుఁడయ్యెను. తన మహిమచే దైత్యుఁడు జంగమ స్థారవ రూపకమయిన సర్వజగత్తు వ్యాపించెను. (18) శత్రువులజయించు నాతండనేక రూపములు పొందెను. ఆతఁడు సూర్యచంద్రుల రూపములు దాల్చీ (వ్యోమి) ఆకాశమునందు ప్రకాశించును, ఆతఁడే వాయువై ఎల్లవేళల జగత్తునందు వీచును. ఆతఁడే గోపాలుఁడై ఆవుల కాచుగొల్లపాడు, గొఱ్ఱలకాపరి, కర్షకుండు. అన్ని లోకములయందు అతఁడే సర్వజ్ఞుండయిన జ్ఞాత.మంత్ర వ్యాఖ్యానకరుడును నాతఁడే. ఆతం డే నాయకుఁడు, దక్షకుఁడు, యజ్ఞము దీక్షితుఁడు యజ్ఞమాచరించు యాజకుఁడు. దేవతలు, సురలు అందరు ఆతని వలననే సోమపాయులయిరి. ఈ దైత్యున కొంతటి ప్రభావము కలిగెను. మరియెలుంగుఁడు.(23) అందరు ఆతనికే నమస్కారము చేయుదురు. అంతియేకాక పూజ్యారుండా తఁడు కూడనయ్యెను. పూర్వము హిరణ్యకశిపుని గూర్చి యీ శ్లోకము చదువబడెను. హిరణ్యకశిపుఁడే యేదిక్కు చూచునో ఆ దిక్కునకు మహా ఋషులతో సహా దేవతలు నమస్కరించిరి. పూర్వము విష్ణువు నరసింహుని ఆకృతిలో ఆదైత్యునకు మరణ మాపాదించెను. ఆ ప్రభువు నరుని జన్మ సంది యుండుటచే ఆతఁడు వేదములేటింగిన మహనీయులచే నరసింహుఁడుగా కీర్తింపఁబడెను, ఆ విభువు (విష్ణువు) సాగరతీరమునందు నిలువంబడి తపస్సు ఆచరించెను. ఆతని శరీరము సర్వదేవమయమయ్యెను. ఆతఁడు మహాబలుడు. సుదర్శనుఁడను పేరిచే జగద్విశ్రుతుండు. అంత మహాబలుఁడైన దైత్యేంద్రుని అధికాగ్రహోదగ్రుఁడై నఖములచే చీల్చెను. ఆ నఖములు ఆర్ధములుకాపు, శుష్కములు కావు. బాహుయుద్ధముచే దైత్యేంద్రుని చీల్చేను. హిరణ్యాక్షుని కొమరులు ఐదుగురు, వారు మహాబలులు పరాక్రమవంతులు. వారు, శంబరుఁడు, శకునీ, కాలనాభుఁడు, సురసంతాపనుఁడు.
మహనాభః సువీక్రాంతో సుతసంతాపనస్తథా ।
హిరణ్యాక్షసుతా హ్యేతే దేవైరపి దురాసదాః ॥
తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ దైతేయాః సగణాః స్మృతాః ।
స శతాని సహస్రాణి నిహతాస్తారకామయే ॥
హిరణ్యకశిపోః పుత్రాశ్చత్వారః సుమహాబలాః ।
ప్రహ్లాదః పూర్వజస్తేషామనుహ్లాదస్తథాపరః॥
సంప్రదశైవ ప్రదశ్చ ప్రోదపుత్రా నిబోధత ।
సుందో నిసుందశ్చ తథా ప్రదపుత్రా బభూవతుః ॥
బ్రహ్మఖ్నో తా మహావీరా మూకస్తు ప్రదదాయకః ।
మారీచః సుందపుత్రస్తు తాడకాయామజాయత ॥
దండకే నిహతః సోథ రాఘవేణ బలీయమో ।
మూకో వినిహతశ్చావ్ కైరా సవ్యసాచినా ॥
సంప్రదస్య తు దైత్యస్య నిపాతకవచాః కులే ।
ఉత్పన్నా మహతాచైవ తపసా భావితాఃయమ్ ॥
అరయో దేవతానాం తే జంభస్య శతదుందుభిః ।
తధా దక్ష సురశ్చండశ్చత్వారో దైత్యనాయకాః ॥
బాష్కలస్య సుతా హ్యేతే కాలనేమేః సుతాఇణు ।
బ్రహ్మజిత్కతుజివ దేవాంతకనరాంతకౌ ॥
కాలనేమిసుతో హ్యేతే శంభోస్తు శ్రుణుత ప్రజాః ।
రోజాజశైవ గోమశ్చ శంభోః పుత్రా ప్రకీర్తితా ॥
విరోచనస్య పుత్రశ్చ బలిరేకః ప్రతాపవాన్ ।
బలేః పుత్రశతం జజ్జీ రాజానః సర్వ ఏవ తే ॥
తేషాం ప్రధాసాశ్చత్వారో విక్రాంతాః సుమహాబలాః ।
సహస్రబాహుః (శైష్ణో భూద్భాడో రోజా ప్రశాపవాన్ ॥
కుంభగత్తో దయో భోజః కుంచిరిత్యేవమాదమః ।
శకునీ పూతానా చైవ కన్యే ద్వే తు బలేః స్కృతే ॥
బలేః పుత్రాశ్చ పౌత్రాశ్చ శతశోథ సప్తసశః।
బాలేయా నామ విఖ్యాతా గణా విక్రాంతపౌరుషాః ॥
బాణస్య చెంద్రధన్వా తు లోహిన్యాముదపద్యత ।
దితిర్వీహతపుత్రా వై తోషయామాస కశ్యపమ్ ॥
మహానాభుఁడు, వీడు సుతసంతాపనుఁడు - మహావిక్రాంతుఁడు), వీరైదుగురు హిరణ్యాక్షుని సుతులు. దేవతలచే గూడ నెదురింపబడరాని వారు. (31) వారి పుత్రులు పౌత్రులు వారి వారి గణములతో డైతేయులుగా సంస్కృతులు. వందలు వేలుగా ఆ దైత్యులు తారకామయము. నందుఁ (తారకాసురునితోడి యుద్దమున) చంపఁబడిరి.(32) హిరణ్యకశిపుని పుత్రులు నల్వురు. వారు సుమహాబలులు. వారందరిలో పెద్ద వాం డు ప్రహ్లాదుఁడు. తరువాత అనుప్రదుఁడు, సంప్రదుఁడు, ప్రదుఁడు. ప్రదునకు ఇద్దరు కుమారులని యెరుంగుఁడు. వారు సుందుఁడు నీసుందుడు. వారు మహావీరులు. బ్రాహ్మణహంతకులు, ప్రోదుని వారసుఁడు మూకుఁడు, ఆతని దాయాది.సుందుని పుత్రుడు మారీచుఁడు. ఆతడు తాటకయందు పుట్టెను. (35) మహాబలవంతుఁడయిన రాఘవునిచే నతఁడు దండకారణ్యములో హతుఁడయ్యెను. మూకుఁడు సవ్యసాచియైన యర్జునిచే కిరాతునితో (శ్రీవుఁడుకిరాతుఁడుగాయుద్ధము చేసినప్పుడు, చంపఁబడెను. (36) దైత్యుఁడయిన సంప్రదుని కులమున నీవాత కవచులు పుట్టిరి. వారు మహాతపస్సుచేత స్వయముగా పవిత్రీకృతులైరి. వారు దేవతలకు శత్రువులు. జంభునకు,శతజంభుఁడు, దక్షుఁడు, అసురుఁడు, చండుడు - అను నలుగురు దైత్య నాయకులు. వారందరు భాషలుని కుమారులు. కాలనేమీ సుతులగూర్చి వినుము. వారు బ్రహ్మజిత్తు, క్రతుజిత్తు, దేవాంతకుఁడు, నరాంతకుడు అనువారు. (39) రాజైన అజుఁడు, గోముఁడు - వీరిద్దరు జంభుని కుమారులుగా ప్రకీర్తితులు. (40) విరోచని పుత్రుడు బలీ : ఆతఁడు ప్రతాపవంతుఁడు. బలికి నూరుగురు పుత్రులు, వారందరు రోజులు. వారిలో నలుగురు ప్రధానులు. వారు విక్రాంతులు, సుమహాబలురు. సహస్ర బాహుఁడు ప్రతాపవంతుఁడునయిన బాణుఁడు పెద్దవాఁడు. కుంభగర్తుఁడు ఒకఁడు. అతఁడు దయాశూన్యుం డు. భోజుఁడు వేణాకఁడు. కుంచి మొదలయినవారు ఇతరులు. శకుని పూతన అను వీరిద్దరు బలియొక్క కూతుండ్రు. బలియొక్క కుమారులు, మనుమలు వందలుగా వేలుగానున్నారు. వారు “బాలేయులు” (బలికుమారులు)అని విఖ్యాతులు. వారొక రాక్షసగణము పోరు విక్రాంతులు. పౌరుషవంతులు ఇంద్ర ధన్వుఁడు బలికుమారుఁడు. లోహిని యందు పుట్టెను. పుత్రులు చంపఁబడిన దితి కశ్యపుని ప్రసన్నుని చేసికొనెను.
తాం కశ్యపః ప్రసన్నాత్మా సమ్యగారాధితస్త్వథ ।
వరేణ ఛందయామాస సా చ వన్రే వరం తతః॥
అథ తస్యై వరం ప్రాదాత్ప్రార్థితో భగవానునః ।
ఉక్తే వరే తు సా తుషా దితిస్తం సమభాషత ॥
మారీచం కశ్యపం దేవీ భర్తారం ప్రాంజలిస్తదా ।
హతపుత్రా స్మి భగవన్నాదీతైస్తవ సూనుభీ;॥
శక్రహంతారమిచ్ఛామి పుత్రం దీర్ఘతపోఖర్జితమ్ ।
సాహం తపశ్చరిష్యామి గర్భమాధాతుమర్హసి ॥
పుత్తమింద్రవధే యుక్తం త్వం మే వై దాతుమర్హసి ।
తస్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కశ్యపస్తదా ॥
ప్రత్యువాచ మహాతేజా దితిం పరమదుఃఖితః ।
ఏవం భవతు గర్భే తు శుచిర్భవ తపోధనే! ॥
జయిష్యసి పుత్రం త్వం శక్రహంతారమాహవే ।
పూర్ణం వర్షసహస్రం తు శుచిర్య ది భవిష్యసి ॥
పుత్రం త్రిలోకప్రవరం మన్మథం జనయిష్యసి ।
ఏవముక్త్వా మహాతేజాస్తథా సమభవత్తదా ॥
తామాలభ్య స్వభవనం జగామ భగవాన్ ఋషిః ।
గతే భర్తరి సా దేవీ దితిః పరమహర్షితా ॥
కుశప్లవనమాసాద్య తపస్తేపే సుదారుణమ్ ।
శక్రస్తు సముపశ్రుత్య సంవాదం తం తయోః ప్రభుః ॥
కుశప్లవనమాగమ్య దీతీం వాక్యమభాషత ।
శుశ్రూషాం తే కరిష్యామి మానుజ్ఞాం దాతుమర్హసి ॥
సమిధశ్చాహరిష్యామి పుష్పాణి చ ఫలాని చ ।
యథా త్వం మన్యసే వత్స శుశ్రూషాభిరతో భవ ॥
సర్వకర్మసు నిష్ణాత ఆత్మనో హిత మాచర ।
వరం శ్రుత్వా తు తద్వాక్యం మాతుః శక్రః ప్రహర్షితః ॥
శుశ్రూషాభిరతో భూత్వా కలుషేణాంతరాత్మనా ।
శుశ్రూషలే తు తాం శక్రః సర్వకాలమనువ్రతః ॥
ఫలపుష్పాణ్యుపాదాయ సమిధశ్చ దృఢవ్రతః ।
గాత్రసంవాహనం కాలే శ్రమపనయనే తథా ॥
సమ్యగారాధితుఁడై కశ్యపుండు హృదయమున సంతోషించేను. కశ్యపుడామెనొక వరము కోరుకొనమనెను. ఆమె సంతుష్టురాలయ్యెను. తీరుగ ప్రార్థింపఁబడి భగవానుడయిన బ్రహ్మ ఆమెకు వరమొసంగెను. వరము చెప్పఁబడగా, దీపా సంతోషించి ఆతనితో సంభాషించేను. (47) చేతులు జోడించి తన భర్తయు, మరీచిసుతుఁడునయిన కశ్యపుని గౌరవముగా “ఓ భగవాన్. నీ కుమారులయిన ఆదిత్యులచే నేను పుత్ర హీనురాలనయితిని, ఇంద్రుని చంపగల పుత్రునీ నేగోరెదను ఆతడో నాచే మహాతపస్సుచే పొందబడును. నేను తీవ్రమయిన తపస్సాచరించెదను. నీవు నన్ను గర్బిడిగా నొనర్చ నరుండవు. ఇంద్రుని చంపగల శక్తిగల కుమారుని నాకనుగ్రహింప నీవే అరుఁడవు”. అనెను. ఆమె వచనము మరీచి కొడుకయిన కశ్యపుఁడు వీనీ (50) దీతీతో ప్రతిభాషించెను. ఆ మహాతేజుఁడు విశేషముగా దుఃఖితుఁడయ్యెను. ఓ తపోధనురాలా ! అట్లే యగుగాక. (51) వెయ్యి యేండ్లు నీవు శుచివిగా నున్నచో శక్రుని యుద్దమున జయించు పుత్రుని కనెదవు. మన్మథుని వలె త్రిలోక సుందరుం డయిన పుత్రునీ కండువు”. ఇట్లు పలికీ, యపుడు మహా తేజస్వియయ్యెను. ఆమెను కౌగిలించుకొని భగవంతుఁడయిన ఋషి స్వభవనమున కరీగెను. భర్త యచ్చట నుండి వెడలిన తరువాత దేవియైన రీతి పరమహర్షితురాలయ్యెను. (54) అంత ఆమె కుశప్లవనమున కరీగెను. సుదారుణమయిన తపస్సాచరించెను. శక్రుఁడు దీతీ యొక్క కశ్యపునీయొక్కయు సంభాషణమును వినెను. కుశప్లవనమునకు శక్రుఁడేతెంచెను. దీతితో నీట్లనెను. “నీకు శుశ్రూషను చేసెదను నీవు నా కనుజ్ఞ యీయ గదువు, హోమమునకు సమిధలను తెచ్చెదను. ఫలములను పుష్పములను గోనివత్తును”. “ఓ బిడ్డా ! నీవు తలపోసినట్లే నాకు శుశ్రూషాభిరతుఁడవు కమ్ము. (57) సర్వకర్మల యందు నిష్ణాతుఁ డవై యాత్మహితము లాచరింపుము”, అనెను. తల్లియొక్క యావాక్యమును వరముగా విని శక్రుఁడు ప్రహర్షితుఁడయ్యెను. కలుషమయిన అంతరాత్మతో మాతృ శుశ్రూషాభిరతుఁడై, సర్వకాలము ఆమె ననుసరించుచు సేవచేయుచుండెను. దృఢ వ్రతుఁడై ఫల పుష్పములను సమిధలను తీసికొనివచ్చును. ఆమెకు శ్రమాపనయనము చేయఁగోరి ఆమె వొళ్లు పట్టును. సేవచేయును.
శక్రః సర్వేషు కాలేషు గీతిం పరిచచారహ ।
కీంచిచ్చిష్టే ప్రతే దేవీ తుష్టా శక్రమువాచ హా ॥
ప్రీతాహం తే సురశ్రేష్ఠ దశవర్షాణి పుత్రక ।
అవశిష్ఠాని భద్రం తే భాతరం ద్రక్ష్యసే తతః ॥
తమహం త్వత్కృతే పుత్ర సహ ధాస్యే జయైషిణమ్ ।
త్రైలోక్యవిజయం పుత్ర భోక్ష్యసే సహ తేన వై ॥
నాహం పుత్రాభిజానామి మద్భక్తిగతమానసమ్ ।
ఏవముక్త్వా దితిః శక్రం మధ్యం ప్రాప్తి దివాకరే।
నిద్రయాపహృతా దేవి శిరః కృత్వా తు జానునీ ।
కేశాన్ కృత్వా తు పాదస్థాన్సా సుష్వాప చ దేవతా ॥
అధస్తాద్యత్తు నాభే ర్వై సర్వం తదశుచి స్మృతమ్ ।
తతస్తామశుచిం జ్ఞాత్వా సోంతరం తదమన్యత ॥
దృష్ట్వా తు కారణం సర్వం తస్య బుద్ధిరజాయత ।
గర్భం నిహంతుం వై దేవ్యా స పా దోషోత్ర దృశ్యతే ॥
తతో వివేశ దిత్యా వై హ్యుపస్థనోదరం వృషా ।
ప్రవిశ్య చాపి తం దృష్ట్వా గర్భమింద్రో మహౌజసమ్ ॥
భీతస్తం సప్తధా గర్భం బిభేద రీపుమాత్మనః ।
స గర్భో భిద్యమానస్తు వట్రేణ శతపర్వణా ॥
రురోద సుస్వరం భీమం వేపమానః పునః పునః ।
మారోద మారోద ఇతి గర్భం శక్రోఖభ్యభాషత ॥
తం గర్భం సప్తధా కృత్వా హ్యేకైకం సప్తధా పునః ।
కులీశన బిభేదేంద్రస్తతో దితీరబుద్యత ॥
న పొంతవ్యో న పొంతవ్య ఇత్యేవం దితిరబ్రవీత్ ।
నిష్పపాత తతో వజ్జీ మాతుర్వచనగౌరవాత్ ॥
ప్రాంజలీర్వజసహితో దీతీం శక్రో భ్యభాషత ।
అశుచిర్దేవి సుప్తాసి పాదయోర్గతమూర్ధజా ॥
తదంతర మనుప్రాప్య గర్భం హంతారహమాహవే ।
భిన్నవానహమేతం తే బహుధా క్షంతుమర్హసి ॥
తస్మింస్తు విఫలే గర్భే దితిః పరమదుఃఖితా ।
సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయాబ్రవీత్ ॥
మమాపరాధాన్దర్భోయం యది తే విఫలీకృతః ।
నాపరాధోస్తి దేవేశ తవ పుత్ర మహాబల ॥
శత్రార్వధే న దోషోస్తి భేతవ్యం న చ తే విభో ।
ప్రియం తు కృతమిచ్ఛామి శ్రేయో గర్భస్య మే కుతః ॥
అన్ని వేళల యందు ఇంద్రుఁడు దిలీకి పరిచర్య చేసెను. దితి యొక్క వ్రతము ఇంచుమించుగా పూర్తినొంది, యొక కొంచెము మిగిలి యుండగా సంతుష్టురాలయిన యామె శక్రునీతో ఓ దేవతాశ్రేష్ఠుఁడా ! నీవలన సంతుష్టురాలనైతిని. ఇంక పది సంవత్సరములు మత్రమే వ్రతము మిగిలియున్నవి. నీకు భద్రమగుగాక. తదనంతరము నీవు నీ సోదరుని చూడగలవు. (62) ఆతఁడు నీన్ను జయించు కోరిక కలవాఁ డయినను, ఆతని నీ కొఱకు నీ సేవలో నియోగించెదను. అతనితో కూడి ఓ బిడ్డా ! మూడు లోకముల యొక్క విజయము ననుభవింతువు. నీ మనస్సు భక్తిగతమయి నా యందు గతమయిన దని యెఱుంగను." అని పలికెను, అంత సూర్యుఁడు గగన మధ్య భాగమును చేరగా మధ్యాహ్నము నిద్రచే పరీతమయి (కునుకువచ్చి) మోకాళ్ల మీద శిరస్సుంచి, ఆమె శిరోజములు పాదముల మీఁద వ్రేలాడ నిద్రపోయెను.(65) నాభి ప్రదేశమునకు దిగువ భాగమంతయు అశుచిమంతముగా గమనింతురు. అప్పుడామెను అశుచిమతిగా తెలిసికొని అయ్యది తన కార్యమున కనుకూల సమయముగా శక్రుడు దెలిసికొనెను. తత్కారణమున, ఆతనికిట్లు బుద్దీ పుట్టెను, “సత్సవిత్రురాలయిన దేవియందు ఆమె గర్భమును నాశనము చేయుటకు దోషము కనంబడినది.” అని. అంత ఇంద్రుఁడు దితి యొక్క జననేంద్రియము ద్వారా ఆమె గర్భమును ప్రవేశించేను. ప్రవేశించి అందు మహాశక్తిమంతుడయిన బిడ్డనతఁడు జూచెను. ఆతఁడు భయచకితుఁడయ్యెను. ఆ గర్భస్థ శిశువును, ఆత్మీయ శత్రువును, నూరంచులు గలిగిన వజ్రముచే ఏడు ముక్కలుగా (సప్తధా) ఛేదించేను. ఆ గర్భస్థ శిశువు ఛేదింపఁబడి, మాటిమాటికీ కదలాడుచు భయంకరముగా సుస్వరముగా రోదించెను. అంత ఇంద్రుఁడు గర్భస్థ పిండముతో మారోద మారోద' ఏడువకుము, ఏడువకుము' అని చెప్పేను. ఇంద్రుఁడా గర్భ పిండమును సప్తధా ఛేదించి మరల నొక్కొక్క భాగమును తన వజ్రాయుధముచే ఏడు భాగములుగ ఛేదించెను. అంతలో దితి మేల్కొనెను. (71) “నహంతవ్యః, నహంతవ్యం” బిడ్డ చంపఁదగినవాడు కాడు.” అని దితి పలికెను. మాతృవచనముల యందలి గౌరవముచే ఇంద్రుడు మాతృగర్భము నుండి యీవలకు దూకేను. చేతులు జోడించి వజ్రసహితుఁడై ఇంద్రుఁడు దితితో నిట్లు పలికెను. పాదముల యందు శిరోజములు వ్రేలాడునట్లుగా అశుచిమతివై ఓ దేవి నిద్రించితివీ. ఆ సమయమును పురస్కరించుకొని, నీ గర్భమును ప్రవేశించి, యుద్దమున నన్ను చంపునట్టి పొడయిన వానిని నేను పలుఖండములుగా ఛేదించితిని. నన్ను నీవు క్షమింపతగుదువు” అంత గర్భము విఫలము కాగా దీతీ పరమ దుఃఖితయయ్యెను. అంత ఆమె దురాధరుఁడయిన సహస్రాక్షునితో సానునయముగా నాయపరాధము చేతనే నా గర్భస్థమయిన బిడ్డ నీచే విఫలీకృతమయ్యెను. ఓ దేవేశ, మహాబల, ఓ పుత్ర ! నా దోషముచే అపరాధముచే నా గర్భము విఫలీకృత మయిన పక్షమున, నీ అపరాధము కాదు.
భవంతు మమ పూత్త్రాణాం సప్త స్థానాని వై దివీ ।
వాతస్కంధానీమాన్సప్త చరంతు మమ పుత్త్రకాః ॥
మరుతస్తే తు విఖ్యాతా గతాస్తే సప్త సప్తకాః ।
పృథివ్యాం ప్రథమస్కంధౌ ద్వితీయశ్చాపి భాస్కరే ॥
సోమే తృతీయో విజేయశ్చతుర్థో జ్యోతిషాం గజే ।
గ్రహేషు పంచమశ్చైవ షష్ఠః సప్తర్షిమండలే ॥
ధ్రువే తు సప్తమశ్చైవ పోతస్కంధాశ్చ సప్తమే ।
తేనైతే వీచరంత్యద్య కాలే కాలే మమాత్మణాః ॥
వాతస్కంధాధిపా భూత్వా చరంతు మమ పుత్రకాః ।
పృథివ్యాం ప్రథమస్కంధ ఆమేఘేభ్యో య ఆవహః ॥
చరంతు మమ పుత్రాస్తే సప్త యే ప్రథమే గణే ।
ద్వితీయశ్చాపి మేఘేభ్య ఆసూర్యాతవహస్తతః ॥
వాతస్కంధో హి విషైయో ద్వితీయశ్చరతాం గణః ।
సూర్యాదూర్ధ్వమథః సోమాదుద్వహోథ స వై స్మృతః ॥
వాతస్కంధస్తృతీయశ్చ పుత్రాణాం చరతాం గణః ।
సోమాదూర్ధ్వమధర్క్షేభ్యశ్చతుర్థః సంవహస్తు సః ॥
చతుర్లో మమ పుత్రాణాం గణస్తు చరకాం విభో ।
ఋక్షేభ్యశ్చ తథైవోర్డ్వామాగ్రహాద్వివహస్తుయః ॥
వాతస్కంధః పంచమస్తు పుత్రాణాం చరతాం గణః ।
గ్రహేభ్య ఊర్ధ్వమార్షిభ్యః షష్ణోమ్యానువహశ్చ యః ॥
వాతస్కంధస్తత్ర మమ పుత్రాణాం చరతాం గణః ।
ఋషిభ్య ఊర్ధ్వమాధైవం సప్తమో యః ప్రకీర్తితః ॥
వాతస్కంధః పరివహస్తత్ర తిష్ఠంతు మే సుతాః ।
ఏతాన్సర్వాంశ్చరం్వతే కాలే కాలే మమాత్మజాః ॥
త్వత్కృతేన చ నామ్నా వైభవంతు మరుతఘ్విమే ।
తతస్తేషాం తు నామాని మత్పుత్రాణాం శతక్రతో ॥
తద్విర్తేః కర్మభిశ్చైవ సమవేహి పృథక్ పృథక్ ।
శక్రజ్యోతిస్తథా సత్యః సత్యజ్యోతిస్తథాపరః ॥
శత్రువును వధించుటలో నీ దోషము లేదు. నీవు భయపడవలసిన పనిలేదు. నీకేది యో యొక ప్రియమును చేయగోరుచున్నాను. కానిచో నా గర్భస్థ శిశువునకు శ్రేయమెక్కడిది? స్వర్గము నందు నా కుమారులకు సప్త స్థానములుండుగాక. నా కుమారులు ఈ సప్తవాత స్కంధముల యందు సంచరించెదరుగాక. (వాతస్కంధములు - వాయు మార్గములు - వాయు పథములు). వారందలు మరుత్తులుగా వీఖ్యాతి నొందుదురుగాక. ఒక్కొక్క వర్గమున (గణమున) ఏడుగురుగా, ఏడుగణములుండును (7x7=49). మొట్టమొదటి స్కంధము పృథివీ యందుండుగాక, రెండవది సూర్యునియందు, మూఁడవస్కంధము చంద్రుని యందు, నాలుగవది ఆకాశమందలి జ్యోతిషాంగణము నందు, ఇక నైదవది గ్రహముల యందు, సప్తర్షి మండలమున ఆరవది, ధ్రువునియందు సప్తమ స్కంధము. నా కుమారులీ సప్త స్కంధముల ఆయా వివిధ కాలములలో సంచరింతురుగాక. (81) నా కుమారులు వాత స్కంధాధిపతులై సంచరింతురుగాక. ప్రథమ స్కంధము పృథివీ యందున్నది. అయ్యది మేఘముల పర్యంతము వ్యాపించును. దాని పేరు “ఆవహము” (82) మొదటి స్కంధమునకు (వాతపథమునకు) సంబంధించిన నా పుత్రులేడ్లురు ఈ భూ స్కంధపు పథమునందే సంచరింతురు. రెండవ వాత స్కంధము మేఘముల కుపరి సూర్యుని వరకు నున్నది. దానికి ప్రహవము' అని పేరు. నా కుమారులలో ద్వితీయగణమీ 'ప్రవహ' మను రెండవ పథమున సంచరింతురుగాక. మూఁడవ వాత స్కంధము సూర్యుని కుపరితలమున చంద్రునకు అధస్తలమున నుండును. అయ్యది ‘ఉద్వహము' అను నామముతో ప్రసిద్దము. నాకుమారులలోని మూడవ గణము మూఁడవ వాతస్కంధమున సంచరింతురు. (85) నాలుగవ వాత పథము చంద్రునకుపరి భాగమున, నక్షత్రముల కధోభాగమున నున్నది. దీనికి 'సంవహము” వాతపథమని పేరు. ఇఁక నైదవదీయగు నా కుమారుల వాయుపథము నక్షత్రములకు పైగా, గ్రహముల పర్యంతము వ్యాపించియుండును. దీనికి 'వివహము' అని పేరు. నా కుమారులలో పరిచయ గణమీ వాయు పథమున సంచరింతురుగాక. ఆవ వాత స్కంధము గ్రహములకు పై భాగమున నుండీ సప్తర్షి మండలము వరకు వ్యాపించును. అయ్యది 'అనువహము' నా కుమారులలో ఆరవగణమీ వాయు పథముగంటి సంచరింతురుగాక, ఇక ఏఁడవ వాయు స్కంధము సప్తర్షులకు పైన నున్నది. అందుండి ధ్రువమండలము వరకు వ్యాపించును. దీనికి 'పరివహము' అని పేరు. నా కుమారులందుండుదురుగాక. నా కుమారులు విభిన్న కాలములలో నీ వాయు పథముల సంచరింతురు గాక, వారందరు నీ వొసంగిన నామముచే మరుత్తులుగా నగుదురుగాక. ఓ శతక్రతూ ! నాకుమారుల నామములను తెలిసికొనుము. ఆ నామములు వారి వారి వివిధ కర్మలచే వేరువేరుగా నున్నవి. మొదటి గణము శక్రజ్యోతి (2) సత్య, (3) సత్యజ్యోతి.
చిత్రజ్యోతిశ్చ జ్యోతిష్మాన్ సుతపాశ్చైత్య ఏవ చ ।
ప్రథమోయం గణః ప్రోక్తో ద్వితీయం తు నిబోధత ॥
ఋతజిత్సత్యజిచ్చైవ సుషేణః సేనజిత్తథా ।
సుమిత్రా హ్యమిత్రశ్చ సురమిత్రస్తథాపరః ॥
గణ ఏష ద్వీతీయసు తృతీయం చ నిబోధత ।
ధాతుశ్చ ధనదశ్చైవ హ్యుగ్రో భీమస్తథైవ చ ॥
వరుణశ్చ తృతీయం చ మయాప్రోక్తం నిబోధత ।
అభియుక్తాక్షికశ్చైవ సాహ్వయశ్చ గణః స్మృతః ॥
ఈదృక్ చైవ తథాన్యాదృక్ ససరిద్రుమవృక్షకాః ।
మీతశ్చ సమితశ్చైవ పంచమశ్చ తథా గణః ॥
ఈదృక్ చ పురుషశ్చైవ నాన్యాదృక్ సమచేతనః ।
సంమితః సమవృత్తశ్చ ప్రతీహర్తా చ షడ్ గణాః ॥
యజైశ్చిత్వా స్తువన్సర్వే తథాన్యే మానుషా వీశః ।
దైత్యదేవాః సమాఖ్యాతాః సప్లైతే సప్తసప్తకాః ॥
ఏతే హ్యాకోనపంచాశన్మరుతో నామతః స్మృతాః ।
ప్రసంఖ్యాశాస్తదా తాభ్యాం దిత్యా శత్రేణ చైవ వై ॥
కృత్వా చైతాని నామానీ దీతీరింద్రమువాచ హ ।
వాతస్కంధాంశ్చరంట్వేతే భాతరో మమ పుత్రకాః ॥
వీచరంతు చ భద్రం తే దేవైస్సహ మమాత్మజాః ।
తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః ॥
ఉవాచ ప్రాంజలిర్భూత్వా మాతర్భవతు తత్తథా ।
సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః ॥
ఏవం భూతామహాత్మానః కుమారా? లోకసమ్మతాః ।
దేవైస్సహ భవిష్యంతి యజ్ఞభాజస్తవాత్మజాః ॥
తస్మాత్తే మరుతో దేవాః సర్వే సేంద్రానుజా వరాః ।
విజేయాశ్చామనాః సర్వేదీతీపుత్రా సర్వినః ॥
ఏవం తే నిశ్చయం కృత్వా మాపుత్రే తపోవనే ।
జగతుఫ్రిదివం హృష్ణా శక్రమాభూద్గతజ్వరః ॥
మరుతాం చ శుభం జన్మ శ్రుణయాద్యః పఠేచ్చ వా ।
వాదే విజయమాప్నోతి లబ్ధాత్మా చ భవత్యుత ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతే మరుదుత్పత్తి వర్ణనం నామ పంచమోధ్యాయః॥
4. చిత్రజ్యోతి, 5. జ్యోతిష్మంతుఁడు; 6. సుతపుడు., 7. చైత్యుఁడు. ఇది మొదటి గణము చెప్పితిని. ద్వితీయగణము నందలి పారల . నామముల నెఱుంగుము, 1. ఋతజిత్తు, 2.సత్యజిత్తు; 3.సుషేణుఁడు; '4, సేవజిత్తు, 5.సుతమిత్రుఁడు, 6.అమిత్రుఁడు, 7. సురమిత్రుఁడు. ఇం క తృతీయగణము యొక్క నామముల నేణుంగుము. ధాతువు 2,ధనదుఁడు, 3. ఉగ్రుఁడు, 4.భీముఁడు, 5.వరుణుఁడు, 6.అభియుక్తాక్షికుఁడు; 7. సాహ్వయుఁడు. ఇది మూఁడవ గణము వివరింపఁబడినదని యెఱుంగుఁడు. (95) పంచమగణము : ఈ దృక్కు 2. అన్యాదృక్కు 3.సరిత్, 4.ద్రుమ, 5.వృక్షకము, 6.మితుఁడు, 7.సమితుఁడు. షష్టమగణము ; 1. ఈఋక్కు 2,పురుషుఁడు 3. నాన్యాదృక్కు 4. సమచేతనుఁడు, 5. సమ్మితుండు, 6. సమవృత్తుడు, 7.ప్రతిహర్త. (సప్తస్కంధములోని మరుద్గణముల పేరులీయబడలేదు), మనుష్యలెల్లరు ప్రజలెల్లరు యజ్ఞముల నాచరించిరి, వారెల్లరును స్తోత్రపారము చేసిరి. ఈ విధముగా వీరు దైత్యదేవతలు చెప్పఁబడిరి. ఈ విధముగా (7x7=49) మరుత్తులు వారి వారి నామధేయములతో జ్ఞప్తి యందుంచుకొనంబడుదురు, వారు నలుబదితొమ్మండు, వారు దితిచే శక్రునిచే గణింపఁబడిరి. (9) ఈ నామములను వారి కొసంగిన తరువాత దితి శక్రునితో ఈ నీ సోదరులు వాత స్కంధముల (పథముల సంచరింతురుగాక. నీకు భద్రమగుగాక. దేవతలతో సహితము నా కుమారులీ వాయుపథముల సంచరింతురుగాక, అనెను. ఈ మాటలను సహస్రాక్షుఁడయిన శక్రుఁడు వినెను. ప్రాంజలిబద్ధుఁడై పురందరుఁడు సగౌరవముగా ఆమెతో ఓ అమ్మా ! అట్లేయగుగాక. నీవు పలికినట్లే యగును. ఇందెట్టి సంశయములేదు. నీవు చెప్పినట్లు ఈ మహాత్ములయిన కుమారులు లోక సమ్మతులగుదురు. దేవతలతో కూడి వారు యజ్ఞ భాకులగుదురు. అందుచే ఈ మరుత్తులందరును దేవతలు. వీరందరుకూడ ఇంద్రునియొక్క తమ్ములు, శక్తిమంతులు, వేగవంతులు నయిన యీ దితి సంతతులు శాశ్వత వ్యక్తులు అగుదురుగాక” అనెను. తల్లి కుమారుం డు- ఇరువురు నీ అంగీకారమునకు ఆశ్రమమున వచ్చిరి. వారు స్వర్గమమునకు సంతోషముగా జనిరి. శక్రుఁడు గత జ్వరుఁడయ్యెను. ఎవడీ పవిత్రమైన మరుత్తుల యొక్క జన్మను చదువునో, వాదము నందతఁడు విజయము నొందును. అతఁడు లబ్దాత్ముఁడగును.
ఇదీ వాయుప్రోక్తమయిన మహాపురాణమయిన బ్రహ్మాండపురాణమందలి మధ్యమభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున మరుదుత్పత్తి వర్ణనము.
Summary of chapter 43 of the Brahmānda Mahā Purana is as follows:
This radiant chapter celebrates the immense lineage of the venerable sage Kashyapa, whose divine union with holy mothers brought forth gods, celestial beings, and diverse earthly creatures. The narrative portrays Kashyapa as a loving universal father whose vast progeny forms the vibrant tapestry of existence. Deeply moved by this celestial vision, the devotee perceives all living beings as interconnected members of one sacred cosmic family created by divine grace.