బ్రహ్మాండ మహా పురాణము
25 - నీలకంఠ నామోత్పత్తి కథనము
సూత ఉవాచ :-
ఏతదుక్త్వా మహాబుద్ధిర్వాయుర్లోకహితే రతః ।
జజాప జప్యం భగవాన్మధ్యం ప్రాప్తే దివాకరే ॥
ఋషయశ్చాపి తే సర్వే యే తత్రాసన్సమాగతాః ।
తే సర్వే నియతాత్మానస్తస్థుః ప్రాంజలయస్తథా ॥
య ఇజ్యో నియమస్యాంతే ప్రాణినాం జీవనప్రభుః ।
నీలకంఠ నమస్తేఽస్తు ఇత్యువాచ సదాగతిః ॥
శ్రుత్వాతు భావితాత్మానో మునయః శంసితవ్రతాః ।
వాలఖిల్యేతి విఖ్యాతాః పతంగసహచారిణః ॥
అష్టాశీతిసహస్రాణి ఋషీణా మూర్ధ్వరేతసామ్ ।
తే స పృచ్ఛంతి వాయుం చ వాయుపర్ణాంబుభోజనాః ॥
నీలకంఠేతి యత్ప్రోక్తం త్వయా పవనసత్తమ ।
ఏతత్ గుహ్యం పవిత్రాణాం పుణ్యం పుణ్యవిదాం వరః ॥
తద్వయం శ్రోతుమిచ్ఛామస్తన్నో నిగద సత్తమ ।
తత్సర్వం శ్రోతుమిచ్ఛామస్త్వత్ప్రసాదాత్ ప్రభంజన!॥
నీలతా మేన కంఠస్య కారణేనాంబికాపతేః ।
శ్రోతుమిచ్ఛామహే దేవ తవ వక్త్రాద్విశేషతః ॥
యావద్వాచః ప్రవర్తంతే సర్వాస్తాః ప్రేరితాస్త్వయా ।
వర్ణస్థానగతే వాయో వాగ్విధిః సంప్రవర్తతే ॥
సూతుఁడిట్లు చెప్పెను :
జ్యోతిర్గణముల వృత్తాంతమును విని, లోకము యొక్క హితము నందాసక్తుఁడు, మహాబుద్ధిమంతుఁడు, అగు వాయువు సూర్యుఁడాకాశ మధ్యభాగమును చేరినప్పుడు (జపమును) చేయవలసిన మంత్రమును జపించేను. (1) అచ్చట సమాగతులైయున్నవారు, నియతాత్ములు, ఆత్మనిగ్రహులునయిన ఋషులు ప్రాంజలులై నిలువఁబడిరి. (2) సదాగతియైన పాయువు “ఓ నీలకంఠ, నియమాంతమునందు పూజింపం బడునట్టిపోఁడు, ప్రాణులకు జీవన ప్రభువు అయిన నీకు నమస్కారము” అనీ యనెను, ఆ పలుకులు విని, శంసీతప్రతులు, భావితాత్ములు సూర్య సహచారిణులు వాలఖిల్యులని విఖ్యాతులు, ఎనుబదీ యెనిమిదివేల సంఖ్యలైనవారు, ఊర్ధ్వ రేతస్కులు, వాయు పర్లాంబు భోజనులునయిన మునులు వాయువు నిట్లు పృచ్చించిరి. (4,5} శ్రేష్ఠుఁడవయిన వాయుదేవా! పుణ్యము నెఱిగిన వారలలో శ్రేష్ఠుఁడా! నీలకంఠుఁడ’ని యెయ్యది. నీచేతను చెప్పఁబడినదో, ఏది పరమ రహస్యమో, ఎయ్యది పవిత్రులకు కూడ పుణ్యప్రదమో దానిని గూర్చి మేము వినఁగోరుచున్నాము; ఓ సత్తమా! దానిని మాకు వివరింపుము. ఓ ప్రభంజన! తత్సర్వమును నీ యనుగ్రహమున వినుటకు కుతూహల పడుచుంటిమి. ఏ కారణముచేత అంబికాపతియైన ఈశ్వరుని కంఠమునకు నీలత్వము కలిగినది? నీ ముఖ పద్మము నుండి సవిశేషముగా ఓ దేవ! వినఁగోరు చున్నాము. ఓ వాయుదేవా! సర్వవాక్కులును సర్వము నీచే ప్రేరితములయినవి వాగ్విధి యంతయును వర్ణస్థానముపై నాధారపడియున్నది. (స్థానములు - ఉచ్ఛారణాస్థలములు).
జ్ఞానపూర్వమథోత్సాహస్త్వత్తో వాయో ప్రవర్తతే ।
త్వయి నిష్పూయమానే తు శేషా వర్ణప్రవృత్తయః ॥
యత్ర వాచో నివర్తంతే దేహవర్ణాశ్చ దుర్లభాః ।
త్వత్తో హి వర్ణసద్భావః సర్వగస్త్వం సదానిల ॥
నాన్యః సర్వగతో దేవస్త్వాదృశేఽస్తి సమీరణ ।
ఏష వై జీవలోకస్తే ప్రత్యక్షః సర్వతోఽనీల ! ॥
వేత్థ వాచస్పతీం దేవం మనోనాయకమీశ్వరమ్ ।
బ్రూహి తత్కంఠదేశే తు కింకృత్వా రూపవిక్రియా ॥
వచః శ్రుత్వా తతస్తేషాం మునీనాం భావితాత్మనామ్ ।
ప్రత్యువాచ మహాతేజా వాయుర్లోకనమస్కృతః ॥
పురా కృతయుగే విప్రో వేదనిర్ణయతత్పరః ।
వసిష్ఠో నామ ధర్మాత్మా మానసో వై ప్రజాపతిః ॥
ప్రప్రచ్ఛ కార్తికేయం వై మయూరవరవాహనమ్ ।
మహిషాసురనారీణాం నయనాంజనతస్కరమ్ ॥
మహాసేనం మహాత్మానం మేఘస్తనితనిస్స్వనమ్ ।
ఉమామనఃప్రహర్షాణాం బాలకచ్ఛద్మరూపిణమ్ ॥
క్రౌంచజీవితహర్తారం గౌరీహృదయనందనమ్ ।
యదేతద్ధృశ్యతే పర్య శుభ్రం శుభ్రాంజనోపమమ్ ॥
తత్కిమర్థం సముత్పన్నం కంఠే కుందేందు సప్రభే ।
ఏతద్దీప్తాయ దాంతాయ భక్తాయ బ్రూహి పృచ్ఛతే ॥
కథాం మంగళసంయుక్తాం పవిత్రాం పాపనాశినీం ।
మత్ప్రియార్థం మహాభాగ వక్తుమర్హత్యశేషతః ॥
జ్ఞాన పూర్వమయిన యుత్సాహము ఓ వాయూ ! నీయందే ప్రవర్తించును. నీవు పవిత్రీకరించిన తరువాత మిగిలిన వర్ణములు వ్యాపారము చేయనారంభించును. (10) నీనుండియే వాక్కులన్నియు నివర్తిల్లును; వర్ణములయునికి యంతయు నీవలననే, నీవులేక దేహవర్ణములు కూడ దుర్లభములు, ఓ అనిల! నీవు సర్వగుఁడవు. వర్ల సద్భావమంతయు నీవలననే. ఓ సమీరణ (ఓ వాయూ !) నీవలె సర్వగుఁడై సర్వతోగతుం డయినవాడు వేడొక్కడులేఁడు. ఓ అనిల! ఈ జీవలోకము అన్నివైపుల నుండి నీకు ప్రత్యక్షము (12) నీవు వాచస్పతియు భగవంతుఁడునగు ఈశ్వరుని నెఱుంగుదువు; ఈశ్వరుఁడే సర్వజన మనోనాయకుఁడు. అందుచే ఏమియాచరించుట మూలమున, కంఠ దేశమునందు రూప విక్రియ (రంగునకు మార్పు) కలిగినదో చెప్పుము. పవిత్రులు, భావితాత్ములునయిన ఋషుల యొక్క యీ పలుకులు విని, సర్వలోక నమస్క తుఁడు, మహాతేజస్వియునగు వాయువు ప్రత్యుత్తర మొసంగెను. (14) “పూర్వము కృతయుగమున ప్రజాపతి మానసపుత్రుఁడు, విప్రుఁడు, వేదార్థ నిర్ణయ తత్పరుఁడు ధర్మాత్ముఁడునగు వశిష్ఠుఁడు కలఁడు. ఆ వశిష్ఠుఁడు మయూర వాహనుఁడగు కార్తికేయుని నడిగెను. కార్తికే యుం డు మహిషాసురుని స్త్రీల కంటి కాటుకను దొంగిలించినవాఁడు. (అనఁగా వారలను విధవలనుగా జేసినవాఁడు అనఁగా మహిషాసురుని చంపినవాఁడు). మహాత్ముఁడు. మహాసేననాముఁడు; మేఘగర్జనములవలే ప్రతిధ్వనిల్లు గంభీర నిస్స్వనుఁడు. పార్వతీదేవి మనస్సున కానందము కూర్చువాఁడు; బాలకుని యొక్క (ఛద్మ) కపటరూపము ధరించినవాఁడు. క్రౌంచ జీవితమును హరించినవాఁడు. గౌరీహృదయనందనుఁడు. “ఓ వర్య! శ్రేష్ఠతముఁడా! శుభ్రమై, శుభాంజనతుల్యమై, మల్లెపూవువలె, చంద్రునివలె ప్రభావంతమై కంఠమునందు కాననగునదియేమి?” ఆ కంఠముననదీ యేల కల్గినది? దానిని భక్తునకు, ఇంద్రియ నిగ్రహునకు, దీప్తిమంతునకు నాకు చెప్పుము. శుభసంయుతము, పవిత్రము, పాపనాశనము, నయిన కథను ఓ మహాభాగ, నా ప్రియము కొఱకు సమగ్రముగ చెప్పుటకు నీవరుఁడవు.
శ్రుత్వా వాక్యం తతస్తస్య వసిష్ఠస్య మహాత్మనః ।
ప్రత్యువాచ మహాతేజా దేవారిజలసూదనః ॥
శ్రుణుష్వ వదతాం శ్రేష్ఠ కథ్యమానం వచో మమ ।
ఉమోత్సంగోపవిష్టేన యథాపూర్వం యథాశ్రుతమ్ ॥
పార్వత్య సహ సంవాదః శర్వస్య చ మహాత్మనః ।
తమహం సంప్రవక్ష్యామి త్వత్ప్రియార్థం మహామునే ॥
కైలాసశిఖరే రమ్యే నానాధాతువిచిత్రితే ।
తరుణాదిత్యసంకాశే తప్తచామీకరప్రభే ॥
వజ్రస్ఫాటికసోపానే చిత్రపాదశిలాతలే ।
జాంబూనదమయే దివ్యే నానాధాతువిచిత్రితే ॥
నానాద్రుమలతాకీర్ణే నాసాపుష్పఫలోపగే ।
హంసకరండవాకీర్ణే చక్రవాకోపశోభితే ॥
షట్పదోద్గీతబహుళే ధారాసంపాతనాదితే ।
మత్తక్రౌంచమయూరాణాం నాదైర్విక్రుష్టకందరే ॥
అప్సరోగణసంకీర్ణే కిన్నరైరుపశోభితే ।
జీవంజీవకజతీనాం విరాటైరుపకూజితే ॥
కోకిలారావబహులే సిద్దచారణసేవితే ।
సౌరభేయనినాదాడ్యే మేఘస్తనితనీస్స్వనే ॥
వినాయకభయోద్విగ్నకుంజరైర్ముక్తకందరైః ।
వీణావాదిత్రనిర్ఘోషైః శ్రోత్రేంద్రీయమనోరమైః ॥
మహాత్ముఁడైన వశిష్ఠుని వాక్యములు విని, దేవరీబలసూదనుఁడు మహాతేజస్వియునైన స్కందుఁడు ప్రత్యుత్తరమిచ్చెను. వక్తలలో శ్రేష్ఠుఁ డవైన ఓ వశీషా, నేను పూర్వము ఉమాదేవి యొక్క తొడపై కూర్చుండి వినిన దానిని, యథాశ్రుతము వినుము, ఇదీ మహాత్ముఁడయిన ఈశ్వరుని యొక్క పార్వతితోడి సంహాదము. ఓ మహాముని ! నీ సంతోషము కొఱకు నేను దానిని చెప్పుచున్నాను. నానావిధ ధాతువులచే చిత్రితము, తరుణ సూర్యకాంతీ సదృశము, కాచిన బంగారు కాంతీ గలిగినది, రమ్యమైనదియునగు కైలాస శిఖరమున మదనుని యంగనాశన మొనర్చిన శివుఁడు సుఖముగా నాసీనుఁడై యుండెను. అపుడు గిరిరాజ పుత్రియైన పార్వతి శివునితో ఇట్లు పలికెను.
కైలాస శిఖర వర్ణనము : రమ్యమైన కైలాస శిఖరము వివిధ ధాతువులచే చిత్రితమైనది. వజ్రమయము. స్పటికమయమునైన సోపానములు కలది. ఆ సోపానములు చిత్రపాదశిలాతలములు. దివ్యమైనది. బంగారు వికారమయినది. సౌనా ద్రుమలతాకీర్ణము. నానావిధ పుష్పములతో ఫలములతో గూడినది. అందు హంసలు, కారండవములు నిండియున్నవి. చక్రవాకములచే నలంకృతము; తుమ్మెదల గీత బాహుళ్యము కలదు. పడునట్టి నీటి ధారల వలన గలిగిన నాదములు కలది; మదించిన క్రౌంచముల యొక్క మయూరముల యొక్క నాదములచే ప్రతిధ్వనించు కందరములు గలది. ఆ కైలాస శిఖరము అప్సరస గణ సంకీర్ణము. కిన్నరులచేనుపశోభితము. జీవంజీవకములను పక్షులు వివిధములయిన ధ్వనులను చేయును. ఆ పక్షుల కూజితములచే వ్యాప్తమయినది. కోకిలస్వనములు బహు ప్రదేశముల మధురముగా వినవచ్చుచున్నవి. అందు సిద్దులు ఊరణలు తరచుగా సంచరించువారు. అందు కామధేనువులు కలవు. పోని ‘అంబా’ స్వరములు స్పుటముగా వ్యాపించియున్నవి. మేఘముల గర్జనలు ప్రతిశబ్దించును. అందు ఇతర ధ్వనులు కూడ కలవు. వినాయకుని భయము వలన కలత నోందీ ఏనుగులా కందరములను విడిచి పోయినవి. వీణ మొదలయిన సంగీత వాద్యముల మధుర ధ్వనులు కలవు. అవి శ్రోత్రేంద్రీయముల కత్యంత మనోహరములుగా నున్నవి.
దోలాలంబితసంఘాతే వనితాసంఘసేవితే ।
ధ్వజాలంబితదోలానాం ఘంటానాం నీనదాకులే ॥
వల్లకీవేణుబహులే త్రింశద్భర్హిణసంకులే ।
ముఖమర్దలవాదిత్రై ర్వలీతా స్ఫోటితైస్తథా ॥
క్రీడావేగ వివాదానాం నిర్ఘోషైః పూర్ణకందరే ।
హంసైః పారావతైశ్చైవ బకరాజైః సుఖస్థితే ॥
దేహబంధైర్వచిత్రైశ్చ ప్రక్రీడితగణేశ్వరీ ।
సింహ వ్యాఘ్రముఖైర్ఘోరవాశితైః చండవేగితైః ॥
మృగమేషముఖైశ్చాన్యైః గజవాజీముఖై స్తధా ।
బిడాల వచనైశ్చోగ్రైః క్రోష్టుకాకారమూర్తిభిః ॥
హ్రస్వైర్ధీర్ఘైశ్చ సుకృతైర్లంబోదరమహోదరైః ।
హ్రస్వజంఘైః ప్రలంబోష్టైస్తాలజంఘైస్తథాపరైః ॥
గోకర్ణైరేకకర్ణైశ్చ మహాకర్ణైరకర్ణకైః ।
బహుపాదైర్మహాపాదైరేకపాదైరపాదకైః ॥
బహునేత్రైర్మహానేత్రైరేకనేత్రైరనేత్రకైః ।
ఏకదంష్ట్రైర్మహాదంష్ట్రైర్బహుదంష్ట్రైరదంష్ట్రకైః ॥
ఏకశీర్షైర్మహాశీర్ష ర్బహుశీక్షౌరశీర్షైకైః ।
ఏకజిహ్వైర్మహాజీ హ్వైర్బహుజిహ్వైరజిహ్వకైః ।
ఏపం రూపైర్మహాయోగై ర్భూతై ర్భూత పతిర్వృతః ॥
విశుద్ధ ముక్తామణిరత్న భూషితే శిలాతలే స్వర్ణమయే సురమ్యకే ।
సుఖోపవిష్టం మదనాంగనాశనం ప్రోవాచ వాక్యం గిరిరాజపుత్త్రీ ॥
జన సంఘములు ఊయెలలందు నూగుచున్నారు. ఆ ప్రదేశము బహు వనితా సంఘములచే సేవితము, ధ్వజములకు కట్టిన ఊయెలల యొక్క ఘంటానాదములు ప్రతి ధ్వనిల్లుచున్నవి. (31) అందు ‘వల్లకి’ వేణువులుమొదలగునీత సాధనాదికములు విశేషముగా కలవు. (వల్లకి వీణ); పిల్లనగ్రోవుల నాదము అందు ముప్పది నెమళ్లు క్రేంకారములు చేయుచున్నవేమో యన్నట్లున్నవి. గుహలు మౌఖిక గానముచే, మృదంగ ధ్వనులచే, వాదీత్రముల స్వనములచే నిండియున్నవి. (32) కందరములు క్రీడా వేగ వివాదము యొక్క నిర్దోషములచే పూర్ణమయి యున్నవి. హంసలు, పావురములు బక రాజములచ్చట నిర్భయముగా తిరుగాడుచున్నవి. (33) వివిధములయిన దేహ బంధములచే (వ్యాయామ భంగిమలచే) విఘ్నేశ్వరుండచ్చట విచిత్రముగా క్రీడించుచుండెను. భూతపతి వివిధ రూపములు గల భూతములచే పరివృతుఁడై యుండెను. భూతములు వివిధ విధములు. కొన్ని భూతములకు సింహ ముఖములు, కొన్నింటికి వ్యాఘముఖములు. కొన్ని భయంకర రావములను గల్గించుచున్నవి; కొన్నింటికీ ప్రచండ వేగము కలదు; కొన్నింటికి హరిణముఖములు, మేషముఖములు; ఇతరములు కొన్ని ఏనుగు ముఖములు కలిగినవి. కొన్ని అశ్వముఖములు కలిగియున్నవి. కొన్నింటికి క్రూరమయిన పిల్లిముఖములు, (నక్క ముఖములు). కొన్ని పొట్టి, కొన్ని పొడుగు, కొన్నింటి కడుపుల చాల కృశించి యున్నవి. కొన్నింటికి వ్రేలాడునట్టి కడుపులు, కొన్నింటికిహ్రస్వములు; కోన్ని భూతముల జంఘములు, హ్రస్వములు, కొన్నింటికీ వ్రేలాడు పెద్ద పెదవులు; కొన్నింటికి తాడిచెట్లవంటి జంఘములు; (36) కొన్ని భూతములకు గోకర్ణములు; కొన్నింటికి నొక్కటే చేవి, కొన్నింటికీ పెద్ద కర్ణములు, కొన్నింటికీ చెవులే లేవు. కొన్నింటికనేక పాదములు; కొన్నింటికి పెద్ద పెద్ద పాదములు; కొన్నింటి కోక్కటే పాదము, కొన్నింటికో అసలే పాదములు లేవు; కొన్నింటికి బహునేత్రములు; కొన్నింటికి బృహనేత్రములు, కొన్నింటికొక్కటే నేత్రము; కొన్ని భూతములకు నేత్రములే లేవు; కొన్నింటి కొక్కటే శిరస్సు; కొన్నింటికి మహాశీర్షములు; కొన్నింటికి బహు శీర్షములు కొన్నింటికి తలలే లేవు: కొన్ని భూతముల కొక్కటే జిహ్వ (నాలుక), కొన్నింటికి మహాజిహ్వలు; కొన్నీంటికి బహుజిహ్వలు. కొన్ని భూతములకు జిహ్వలే లేవు. కొన్నింటికి నొక్కటే దంష్ఠ, కొన్నింటికి మహాదంష్టలు; కొన్నింటికి బహుదంష్ట్రాలు, కొన్ని భూతములకు దంష్ట్రలే లేవు. (రమ్యకైలాస శిఖరమిట్లున్నది. అప్పుడు గిరిరాజపుత్రి ఈశ్వరునితో ఇట్లు పలికెను).
భగవన్భూతభవ్యేశ గోవృషాంకిత శాసన ! ।
తవ కంఠే మహాదేవ భ్రాజతేఽoబుదసన్నీథమ్ ॥
నాత్యుల్బణం శుభం శుభ్రే నీలాంబుజచయోపమమ్ ।
కిమీదం దీప్యతే దేవ కంఠే కామాంగనాశన ॥
కో హేతుః హిరణం కింవా కంఠే నీలత్వమీశ్వర ! ।
ఏతత్సర్వం యధాన్యాయం బ్రూహి కౌతూహలం హి మే ॥
శ్రుత్వా వాక్యం తతస్తస్యాః పార్వత్యాః పార్వతీప్రియః ।
కథాం మంగళ సంయుక్తాం కథయామాస శంకరః ॥
మహేశ్వర ఉవాచ :-
మధ్యమానేఽమృతే పూర్వం క్షీరోదే సురదానవైః ।
అగ్రే సముత్థితం ఘోరం విషం కాలానలప్రభమ్ ॥
తం దృష్ట్వా సురసంఘాశ్చ దైత్యాశ్చైవ వరాననే ! ।
విషణ్ణవదనాస్సర్వే గతాస్తే బ్రహ్మణోంఽతీకమ్ ॥
దృష్ట్వా సురగణాన్ భీతాన్ బ్రహ్మోవాచ మహాద్యుతిః ।
కిమర్థం వై మహాభాగా భీతా ఉద్విగ్నచేతనాః ॥
మయా త్రిగుణమైశ్వర్యం భవతాం సంప్రకల్పితమ్ ।
తేన వ్యావర్తితైశ్వర్యా యూయం భో సురసత్తమాః ॥
భగవాన్ ! భూత భవిష్యత్పభూ ! గోవృషాంకిత శాసన ! ఓ మహాదేవ ! నీ కంఠ సీమనేదియో మేఘసదృశమయి కనంబడుచున్నది. ఓ దేవ ! కాముని శరీరమును నాశనముచేసినట్టివాఁడా! నీ శుభ్రమయిన కంఠమున ప్రకాశించుచున్నట్టిదదీయేమీ? అయ్యది నీలాంబుదచయ తుల్యముగా నున్నది. శుభంకరము అంత యతిశయించిలేదు. (42) ఓ ఈశ్వరా ! ఏమీకారణము? నీ కంఠము నందలి నీలత్వమునకు. హేతువేమి? కుతూహలముగా నున్నది. ఈవిషయ మంతటినీ నాకు సక్రమముగా చెప్పగోరెదను. (వినవలయునని యున్నది) (43) పార్వతీప్రియుఁ డు పార్వతి యొక్క వాక్యములను వినెను, మంగళ సంయుక్త మయిన యా కథను శంకరుఁడు వివరించెను. (44) మహేశ్వరుఁడిట్లు వచించెను. పూర్వము క్షీరసముద్రము దేవాసురలచే అమృతము కొఱకు మధింపఁబడుచుండ మున్ముందుగా భయంకరాగ్ని ప్రభతో ఘోరమయిన విషము ఉత్పన్నమయి వచ్చినది. (45) సుందరమయిన ముఖము కలదానా ! సుర సంఘములు రాక్షస సంఘములు దానిని చూచెను. విషజ్ఞ వదనములయ్యెను. వారందరు బ్రహ్మయొక్క సన్నిధి కరిగిరి. (46) మహాద్యుతి మంతుఁడయిన బ్రహ్మా భీతులయిన సురసంఘములను చూచెను. ఓ మహాపుణ్యులారా ! మీరందరేల భయత్రస్తులు; క్షోభించిన మనస్సు కలవారైతిరి? మీ కోటకు నేను త్రివిధమైన టైశ్వర్యమును సంకల్పించియుంటినీ కదా ! ఓ సుర సత్తములారా ! ఎవ్వరిచే మీశ్వర్యముహ్యవర్తితము. తొలగింపఁబడినది. (48)
త్రైలోక్య స్యేశ్వరా యూయం సర్వే వై విగతజ్వరాః ।
ప్రజాసర్గేన సోఽస్తీహ యశ్చాజ్ఞాం మేఽతీవర్తయేత్ ॥
విమానచారిణః సర్వే సర్వే స్వచ్ఛందగామినః ।
ఆధ్యాత్మికే చాధిభూతే అధిదైవే చ నిత్యశః ॥
ప్రజాః కర్మవిపాకేన శక్తా యూయం ప్రవర్తితుమ్ ।
తత్కిమర్థం భయోద్విగ్నా మృగాః సింహార్దితా ఇవ ॥
కిం దుఃఖం కోఽను సంతాపః కుతో వా భయమాగతమ్ ।
ఏతత్సర్వం యథాన్యాయం శీఘ్రమాఖ్యాతుమర్హథ ॥
శ్రుత్వా వాక్యం తతస్తస్య బ్రహ్మణః పరమాత్మనః ।
ఊచుస్తే ఋషిభిః సార్ధం సురదైత్యేంద్రదానవాః ॥
సురాసురైర్మథ్యమానే పయోరాశౌ పితామహ ।
భుజంగభృంగసంకాశం నీలజీమూతసన్నిభమ్ ॥
ప్రాదుర్భూతం విషం ఘోరం సంవర్తాగ్నిసమప్రభమ్ ।
కాలమృత్యురీవోద్భూతం యుగాంతాదిత్యవర్చసమ్ ॥
త్రైలోక్యోత్సాదసూర్యాభం విస్ఫురత్తత్ సమంతతః ।
విషేణోత్తిష్ఠమానేన కాలానలసమత్విషా ॥
నిర్దగ్ధో రక్తగౌరాంగో కృతః కృష్ణో జనార్దనః ।
తం దృష్ట్వా రక్తగౌరాంగం కృతం కృష్ణం జనార్ధనమ్ ॥
తతః సర్వే వయం భీతాః త్వామేవ శరణం గతాః ।
సురాణామసురాణాం చ శ్రుత్వా వాక్యం భయావహమ్ ॥
ప్రత్యువాచ మహాతేజా బ్రహ్మాలోకపితామహః ।
శ్రుణ్వంతు దేవతాః సర్వే ఋషయశ్చ తపోధనాః ॥
మీరో ! త్రిలోకముల కీశ్వరులు. మీరందరు బాధా రహితులరు. ఈ సర్వ ప్రజాసృష్టిలో నా యాజ్ఞనుల్లంఘించు సాహసుఁడు లేఁడు. (49) మీరందరు విమానములలో సంచరింతురు. మీరందరు యధేచ్చగా పోగల స్వచ్ఛందములు. ఆధ్యాత్మికము ఆధిభూతము, ఆధిదైవికముల యందు మీరెల్లప్పుడు సర్వసమర్థులు. ప్రజల సేల్లరను పొరీవారి పూర్వజన్మకర్మవిరోజానుసారముగా ప్రవర్తింపజేయుటలో సమర్థులు. అట్టమీరు, మీరేల సింహముచే బాధింపఁబడిన హరిణములవలే భయోద్విగ్నులైయున్నారు? మీ దుఃఖమేది? మీకు కలిగిన ఆపద యేది? ఎవరివలన యీ భయము కలిగినది? మీరందరు తదత్తాంతము నంతటిని వెంటనే సక్రమముగా చెప్పనరులు (చెప్పుడు). (52) పరమాత్మయేన బ్రహ్మయొక్క వాక్యములు విని, సురలు, దైత్యేంద్రుఁడు, దానవులు ఋషులు ఇట్లు చెప్పిరి. (53) ఓ పితామహ ! క్షీర సముద్రము సురాసురలచే చిలుకం బడుచున్నది. (అంత) భయంకరమైన విషము ప్రాదుర్భవించినది. ఆ విషము పాములవలెనున్నది. తుమ్మెద వలె నున్నది. నల్లని జీమూతమును పోలియున్నది. (54) ఘోరముగా నున్నది. ప్రళయకాలాగ్ని సమప్రభమై వెలుగుచున్నది. అదీ కాలమృత్యువువలె నుద్భూతమయినది, దాని కాంతీయో యుగాంతమందలి సూర్యవర్చస్సువలె నున్నది. (55) మూఁడు లోకములను నాశనముచేయు సూర్యునివలె సర్వత్ర ప్రజ్వరిల్లుచున్నది. సముత్తితమగుచున్నట్టిదై .ప్రళయకాలాగ్ని సమకాంతీ కలిగిన ఆ విషముచే, రక్తము ధవళమునయిన శరీరము గల జనార్దనుఁడు కృష్ణ (నల్లని వర్ణుఁడయ్యెను రక్త గౌరాంగమయిన శరీరము నల్లగానయిన జనార్ధనుని చూచి, మేమందరము భీతావహుమతిమి. నిన్నే శరణుపొందితిమి. (58) భయావహమయిన దేవతల యొక్క రాక్షసుల యొక్క వాక్యములను విని మహాద్యుతిమంతుఁడు లోకపితామహుడు, నగు బ్రహ్మ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ దేవతలారా ! తపోధనులయిన ఋషీశ్వరులారా మీరందరు వినుడు. (59)
యత్తదగ్రే సముత్పన్నం మధ్యమానే మహోదధౌ ।
విషం కాలానలప్రఖ్యం కాలకూటమితిశ్రుతమ్ ॥
యేన ప్రోద్భూతమాత్రేణ న వ్యరాజంత దేవతాః ।
తస్య విష్ణురహం వాపి సర్వే వాఽసురపుంగవాః ॥
న తక్నువంతి వై సోడుం వేగమన్యత్ర శంకరాత్ ।
ఇత్యుక్త్వా పద్మగర్భాభః పద్మయోనిరయోనిజః ॥
ఓంకారం సమనుస్మృత్య ధ్యాయన్ జ్యోతిః సమంతతః ।
తతః స్తోతుం సమారబో బ్రహ్మా వేదవిదాం వరః ॥
నమస్తుభ్యం విరూపాక్ష నమస్తే దివ్యచక్షుషే ।
నమః పీకహస్తాయ వజ్రహస్తాయ వై నమః ॥
నమః త్రైలోక్యనాథాయ భూతానాం పతయే నమః ।
నమః సురారిహంత్రే చ సోమసూర్యాగ్నిచక్షుషే ॥
బ్రహ్మణే చైవ రుద్రాయ విష్ణవే చైవ తే నమః ।
సాంఖ్యాయ చైవ యోగాయ భూతగ్రామాయ వై నమః ॥
మన్మథాంగవినాశాయ కాలపృష్టాయ వై నమః ।
సురేతసేఽథ రుద్రాయ దేవదేవాయ రంహసే ॥
కపర్దినే కరాలాయ శంకరాయ హరాయ చ ।
కపాలినే విరూపాయ శివాయ వరదోయ చ ॥
త్రిపురఘ్నమఖఘ్నాయ మాతృణాం పతయే నమః ।
వృద్ధాయ చైవ శుద్ధాయ ముక్తాయైవ బలాయ చ ॥
లోకత్రయైకవీరాయ చంద్రాయ వరుణాయ చ ।
అగ్రాయ చైవ చోగ్రాయ విప్రాయానేకచక్షుషే ॥
రజసే చైవ సత్త్వాయ నమస్తేఽవ్యక్త యోనయే ।
నిత్యాయ చైవానిత్యాయ నిత్యానిత్యాయ వై నమః ॥
మీరు సముద్రమును మథించుచుండగా సముత్పన్నమైనట్టిది కాలానలమను విషము అదీ కాలకూటము. (60) అది పుట్టినంతనే దేవతలు తేజోహీనులయిరి. నేనుగాని, విష్ణువుకాని, దేవతా పుంగవులందరుకాని, ఆ విషము యొక్క తీవ్రత్వమును (వేగమును) భరించుటకు శక్తిమంతులము కాము. ఒక్క శివుఁడు తక్క అని పలికి పద్మగర్భము వంటి కాంతి కలిగిన పద్మయోనియు, అయోనిజుఁడు వేదవేత్తలలో శ్రేషుఁ డునయిన బ్రహ్మ ‘ఓం’కారమును స్మరించెను; అంతటను వ్యాపించియున్న దివ్యజ్యోతిని ధ్యానించి తరువాత స్తోత్రము చేయుటకారంభించేను. (63) ఓ విరూపాక్ష ! నీకు నమస్కారము. (బేసి సంఖ్య కన్నులు కలవాఁడు) దివ్య. చక్షుష్మంతుఁడవయిన నీకు నమస్కారము. మీనాకహస్తుం డవయిన నీకు నమస్కారము. వజ్రహస్త ! నీకు నమస్కారము. త్రిలోకనాథునకు, భూతపతీకి, దేవతలకు శత్రువులయిన వారిని చంపినట్టివానికి, చంద్ర సూర్యాగ్నులకు నేత్రములుగా గలిగిన వానికి నీకు నమస్కారము. బ్రహ్మవు, రుద్రుఁడవు, విష్ణుఁడవు నయిన నీకు నమస్కారము. సాంఖ్యునకు, యోగియైన వానికి, భూత సమూహుఁడవయిన నీకు నమస్కారము. మన్మథుని యంగములను వినాశనము చేసిన వానికి, కాల పృషునకు (కాలము వెనుక భాగమున గలవానికి) నమస్కారము. సురేతసునకు (యోగ్యమయిన వీర్యము కలవానికి) రుద్రునకు, దేవదేవునకు, ఉగ్రుఁడయిన వానికి, కపర్దికి (జటాజూటము కలవానీకి) భయంకరుఁడు (కరాళుఁడు) అయిన శివునికి, శంకరునకు, హరునకు, కపాలికి (పుల్లెలు ధరించువానికి) విరూపునకు, వరదునకు, శివునకు నీకు నమస్కారము. త్రిపురముల నాశనము చేసినవానికి, (దక్ష యజ్ఞఘ్నునకు, మాతృణాం పతయే (దేవమాతృకల యధిపతికి) వృద్ధుఁడైనవానికి (సనాతనునకు) శుద్దునకు, ముక్తునకు, బలునకు, మూఁడు లోకములకు ఏకైక వీరుఁడయినవానీకి, చంద్రునకు, వరుణునకు, అగ్రవ్యక్తియైన వానికి ఉగ్రుఁడైనవానికి విప్రునకు అనేక చక్షువులు కలవానికీ, (70) రజోగుణునకు, సత్వగుణునకు, అవ్యక్తజన్ముడయిన నీకు నమస్కారము. నిత్యుఁడైన వానికి, అనీత్యుఁడైన వానికి, నిత్యానీత్యుండైన వానికి, నమస్కారము. (71)
వ్యక్తాయ చైవావ్యక్తాయ వ్యక్తావ్యక్తాయ వై నమః ।
చింత్యాయ చైవాచింత్యాయ చింత్యాచింత్యాయ వై నమః ॥
జగతామార్తినాశాయ ప్రియనారాయణాయ చ ।
ఉమాప్రియాయ శర్వాయ నందివక్త్రాంకితాయ చ ॥
పక్షమాసార్ధమాసాయ ఋతుసంవత్సరాయ చ ।
బహురూపాయ ముండాయ దండినే చ వరూధినే ॥
నమః కపాలహస్తాయ దిగ్వాసాయ శిఖండినే ।
ధన్వినే రథినే చైవ యమీనే బ్రహ్మచారిణే ॥
ఋగ్యజుఃసామవేదాయ పురుషాయేశ్వరాయ చ ।
ఇత్యేవమాదిచరితైః స్తోత్రైః స్తుత్య నమోస్తుతే ॥
ఏవం స్తుత్వా తతోబ్రహ్మా ప్రణిపత్య వరాననే ।
జ్ఞాత్వా తు భక్తిం మమ దేవతానాం గంగాజాలాస్ఫాలితముక్తకేశః ॥
సూక్ష్మోఽసీ యోగాతీశయాదచింత్యో నహి ప్రభో వ్యక్తముపైషి రుద్రః ॥
ఏవం భగవతా పూర్వం బ్రహ్మణా లోకకర్త్రుణా ।
స్తుతోఽహం వివిధైః స్తోత్రైః వేదవేదాంగసంభవైః ॥
తతోఽహం ముఖ్యయా వాచా పితామహమథాబ్రవమ్ ।
భూతభవ్యభవన్నాథ లోకనాథ జగత్పతే ॥
కింకార్యం తే మయా బ్రహ్మన్ కర్తవ్యం వద సువ్రత ।
శ్రుత్వా వాక్యం తతో బ్రహ్మా ప్రత్యువాచాంబుజేక్షణః ॥
వ్యక్తుడు, అవ్యక్తుఁడు, వ్యక్తావ్యక్తుఁడయిన శివునకు నమస్కారము. చింత్యుఁడు, అచింత్యుఁడు, చింత్యాచింత్యుఁడైన శివునకు నమస్కారము. జగత్తు యొక్క ఆర్తిని నాశనము చేయునట్టి వానికి, నారాయణ ప్రియునకు, ఉమాప్రియునకు, శర్వునకు, నందియొక్క వక్రముచే చిహ్నితుం డయిన శివునకు నీకు నమస్కారము. పక్షము, మాసము, అర్దమాసము, ఋతువు, సంవత్సరము తానేయయిన శివునకు నమస్కారము. బహురూపుడయిన వానికి, ముంగీత శిరస్కునకు, దండము కలవానికి, వరూధిని (సైన్యము) కలవానికి శివునకు నమస్కారము. కపాలము హస్తమునఁగలవానికి, దిగ్వసనునకు (దిగంబరునకు) శిఖండీకి, ధన్వీకి, రథికి, యమకి (నిగ్రహమున కలవానికి) బ్రహ్మచారికి. నీకు నమస్కారము. (75) ఋగ్యజుస్సామ వేదములయిన వానికి, పురుషునకు, ఈశ్వరునకు, నమస్కారము, ఇట్టి యనేకములయిన చరిత్రములచే, స్తోత్రములచే స్తోత్రము చేయబడు శివునికి నమస్కారము; ఓ పార్వతీ (వరాననా)! ఇట్లు స్తోత్రము చేసి, బ్రహ్మ సాష్టాంగనమస్కృతి చేసెను, (76) ఓ రుద్రా ! నాయొక్క దేవతల యొక్క భక్తి నెలుంగుము, సాక్షాత్కరింప కుంటివీ (అవ్యక్తుఁడవుగానే యుంటివి). నీవు గంగాజలములచే చెదరం గొట్టబడిన కేశములు కలవాఁడవు. నీవు చింతింపఁబడుటకు యోగాతిశయముచే గూడ సూక్ష్ముఁడవు. (77) ఈ విధముగా పూర్వము నేను లోకకర్తయైన బ్రహ్మచే వేదవేదాంగ సంభవములయిన వివిధ స్తోత్రములచే స్తోత్రము చేయంబడితిని.(78) అంత బ్రహ్మతో ముఖ్యమయిన హక్కులతో నేను పల్కితిని. ఓ జగత్పతీ ! గతమునకు, భవిష్యత్తునకు, వర్తమానమునకు నీవధిపతివి. నాతో నీకేమి కార్యము వచ్చినది? ఓ సువ్రతా ! కర్తవ్యమేమో చెప్పుము. ఆ వాక్యము విని అంబుజేక్షణుఁడయిన ద్రహ్మ యిట్లు పలికెను. (80)
భూతభవ్యభవన్నాథ శ్రూయతాం కారణేశ్వర ।
సురాసురైర్మధ్యమానే పయోధౌ పంకజేక్షణ ॥
భగవన్ మేఘసంకాశం నీలజీమూతసన్నిభమ్ ।
ప్రాదుర్భూతం విషం ఘోరం సంవర్తాగ్నిసమప్రభమ్ ॥
తం దృష్ట్వా చ వయం సర్వే భీతాః సంభ్రాంతచేతసః ।
తత్పిబస్వ మహాదేవ లోకానాం హితకామ్యయా ॥
భవాన్ శక్తశ్చ భోక్తా వై భవాన్ దేవవర ప్రభో ।
త్వదృతేఽన్యో మహాదేవ వేగం సోడుం న విద్యతే ॥
ఏవం తస్య వచః శ్రుత్వా బ్రహ్మణః పరమేష్ఠినః ।
బాడమిత్యేవ తద్వాక్యం ప్రతిగృహ్య వరాననే ॥
తతోఽహం పాతుమారబ్ధో విషమంతక సన్నిథమ్ ।
పిబతో మే మహాఘోరం విషం సురభయప్రదమ్ ॥
కంఠః సమభవత్తూర్ణం కృష్ణో వై వరవర్ణిని ।
తం దృష్ట్వాత్పలపత్రాభం కంఠసక్తమివోరగమ్ ॥
తక్షకం నాగరాజనం లేలిపోనమివోత్థితమ్ ।
అథోవాచ మహాతేజా బ్రహ్మాలోకపితామహః ॥
శోభసే త్వం మహాదేవ కంఠేనానేన సుప్రత ।
తతస్తస్య వచః శ్రుత్వా మయా గిరివరాత్మజే ॥
కంఠే ధృతం విషం ఘోరం నీలకంఠస్తతోఽ స్మ్యహమ్ ।
పశ్యతాం సురసంఘానాం దైత్యానాం చ వరాననే ॥
తత్కాలకూటం విషముగ్రవేగం కంఠే ధృతం పర్వతరాజపుత్రి ।
నీవేశ్యమానం సురదైత్యసంఘో దృష్ట్వా పరం విస్మయమజగాము ॥
భూతభవిష్యవర్తమానములకు ప్రభూ! సర్వమునకు కారణమైనవాఁడా ! ఓ ఈశ్వరా ! పంకజేక్షణ ! వినుము. దేవదానవులచే సముద్రము మథింపఁబడుచుండ, ఓ భగవాన్! ఘోరమైన విషము ప్రాదుర్భూతమైనది. అది మేఘసదృశము; నీలమైన మేఘమువలె నున్నది; ప్రళయకాలాగ్ని ప్రభ కలిగియున్నది. (82) దానిని చూచి మేమందరము భయపడితిమి; ఉద్విగ్న చేతస్కులమయతిమి. ఓ మహాదేవ ! సర్వలోకములకు హిత మాచరించు కోరికతో దానిని కబళింపుము . (తాగుము) నీవు శక్తుండవు. భోక్తవు; ఓ ప్రభూ ! నీవు దేవతలలో శ్రేష్ఠుఁడవు. నీవు తక్క వేటిక్క డు ఓ మహాదేవ ! ఆ విషము యొక్క వేగమును సహింపఁ గలవాఁడే లేడు.. ఇట్లనిన పమేష్టియయిన బ్రహ్మయొక్క పొక్యములు వింటీని, ఓ వరానన ! 'సరే!' యని యంగీకరించితిని. అంత మృత్యుతుల్యమయిన యా విషమును త్రాగుట కారంభించితిని. సుర భయ ప్రదమైనది, మహా ఘోరమయినదియునగు నా విషమును త్రాగినట్టి నా కంఠము వెంటనే, ఓ పరపర్ణిని ! కృష్ణ (నల్ల) వర్ణము నొందినది. (86) నల్ల కలువల. రేకుల వంటిదయి, కంఠమును కపుంగలించుకొన్న సర్పము వలె నున్నట్టిది. సర్పముల రాజగు తక్షకుడు బయలు దేరి, తన నాలుకచే నాకుచున్నట్లున్నది అట్టి విషమును చూచి మహాతేజుఁడు లోకపితామహుడును నగు బ్రహ్మ ఓ మహాదేవ ! ఓ సువ్రత! కంఠముందలి (విషజనితమయిన కంఠనీలత్వముచే) యీ నల్లని రంగుచే నీవు ప్రకాశించుచున్నావు ! అని పలికెను. ఓ పర్వతరాజపుత్రి ! బ్రహ్మ వచస్సులను వినీ, ఘోరమైన విషమును కంఠమున దాల్చీతిని. అందుచే నేను నీలకంఠుఁడనైతిని. సుర సంఘములను, దైత్యులను యక్ష గంధర్వ భూతములను పిశాచోరగ రాక్షసులను చూచి ఓ పర్వతరాజ పుత్రి! ఉగ్ర వేగము గల యాకాలకూట విషమును కంఠమునందు దాల్చితిని, అట్లు కంఠమునందు నీక్షిప్తము చేసి యుంచుకొన్న విషమును చూచి, సురదైత్య సంఘములత్యంత విస్మయము నొందిరి (91).
తతః సురగణాస్సర్వే సదైత్యోరగరాక్షసాః ।
ఊచుః ప్రాంజలయో భూత్వా మత్తమాతంగగామినీ ॥
అహో బలం వీర్యపరాక్రమస్తే త్వహో వపుర్యోగబలం తవేశ ।
అహోప్రభుత్వంతవదేవదేవ మహాద్భుతం మన్మథదేపనాశన ॥
త్వమేవ విష్ణుః చతురాననస్త్వం ।
త్వమేవ మృత్యుర్వరదస్త్వమేవ ।
త్వమేవ సూర్యో రజనీకరశ్చ వ్యక్తిస్త్వమేవాస్య చారచరస్య ॥
త్వమేవ వహ్నిః పవనస్త్వమేవ త్వమేవ భూమీః సలిలం త్వమేవ ।
త్వమేవ సర్వస్య చరాచరస్య ధాతా విధాతా ప్రళయస్త్వమేవ ॥
ఇత్యేవముక్త్వా వచనం సురేంద్రాః ప్రగృహ్య సోమం ప్రణిపత్య మూర్ద్నా।
గతా విమానై రనిలోపవేగైర్మహానగం మేరుముపేత్య సర్వే ॥
ఇత్యేతత్పరమం గుహ్యం పుణ్యాత్పుణ్యతమం మహత్ ॥
నీలకంఠ ఇతి ప్రోక్తం త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
స్వయం భువా స్వయం ప్రోక్తా కథా పాపప్రణాశినీ ॥
యస్తు ధారయతే నిత్యం బ్రహ్మోద్గీతామిమాం శుభాం ।
తస్యాహం సంప్రవక్ష్యామి ఫలం సువిపులం మహత్ ॥
విషం తస్య వరారోహే స్థావరం జంగమం తథా ।
గాత్రం ప్రాప్య తు సుశ్రోణి క్షిప్రం తత్ప్రతిహన్యతే ॥
ఓ మత్తమాతంగ గామీని ! తరువాత దైత్యోరగ రాక్షసులతో సహా సర్వసురగణములు అంజలుల ఘటించి ఇట్లు పలికిరి. (92) ఓఈశ! సీబలమెంత ఆశ్చర్యకరమైనది ! నీ వీర్య పరాక్రమము లెంత యద్భుతములు ! నీ శరీర బలమెంత విస్మయావహమైనది, ఓ దేవదేవ! ఓ మన్మథ దేహనాశన ! నీ ప్రభుత్వమేంతటి అద్భుతమైనది ! నీవే విష్ణుఁడవు; నాల్గు మొగములు గల బ్రహ్మవు నీవే ! నీవే మృత్యుదేవతవు; నీవే వరదుఁ డవు. నీవే సూర్యుఁడవు ! నీవే చంద్రుఁడవు; ఈ చరాచర ప్రపంచము యొక్క స్వరూపమే (వ్యక్తిత్వమే) నీవు. నీవే వహ్నివి; పవనుఁడవు నీవే. నీవే పృథివివి నీవే జలము (95) స్థావర జంగమ వస్తువులతో కూడిన యీ ప్రపంచమునకు నీవే సృష్టికర్తవు. పాలించువాఁడవును నీవే; మరి ప్రపంచ ప్రళయము నీవే. దేవతలు ఈ విధముగా పలికి, సుధను (సోమమును) గ్రహించి, శిరస్సులను వంచి నమస్కరించిరి. విమానముల నధివసించిరి; వాయు జవముతో మహాపర్వతమయిన మేరువును వారందరు చేరిరి. ఈ విధముగా మీక్కిలి గుహ్యమైనది, పవిత్రమయినది, మహా పుణ్యతమమైనదియునగు దానిని నీలకంఠుఁడు వచించెను. ఇయ్యదీ మూఁడు లోకముల యందు విశ్రుతమైనది, సర్వపాప ప్రణాశన మయినదీకథ స్వయముగా బ్రహ్మచే చెప్పబడినది... (97) బ్రహ్మచే నుద్గీతము, పరమశుభము నయిన దీని నెవఁడు ప్రతినిత్యము మననము చేయునో ఆతనికీ కలుగు విపులమయిన మహత్పలమును చెప్పుచున్నాను. (98) ఓ వరాననో ! సుందరమైన శ్రేణులు (పిరుందులు) కలదానా! విషముతో నేదియైనను సంబంధము (సంస్పర్శ) కలిగిన స్థావర జంగమములకు చెందిన వెంటనే నశించును. (100)
శమయత్యశుభం ఫోరం దుఃస్స్వప్నం చాపకర్షతి ।
స్త్రీసు వల్లభతాం యాతి సభాయాం పార్థివస్య చ ॥
వివాదే జయమాప్నోతి యుద్ధే విజయమేవ చ ।
గచ్ఛతి క్షేమమధ్వానం గృహేభ్యో నిత్యసంపదా ॥
శరీర స్యేహ వక్ష్యామి గతీం తస్య వరాననే ।
హరిశ్మశ్రూర్నీలకంఠః శశాంకాంకిత మూర్ధజః ॥
త్ర్యక్షస్త్రిశూలపాణీశ్చ వృషయానః పినాకధృక్ ।
నందీతుల్యబలః శ్రీమాన్నందీతుల్యపరాక్రమః ॥
వీచరత్యఖిలాంల్లోకాన్ సప్త లోకాన్ మమాజ్ఞయా ।
సహన్యతే గతిస్తస్య అనిలస్య యథాంబరే ॥
మమ తుల్యబలో భూత్వా తిష్ఠత్యాభూతసంప్లవాత్ ।
మమ భక్త్యా వరారోహే యే చ శ్రుణ్వంతి మానవాః ॥
తేషాం గతిం ప్రవక్ష్యామి త్వీహలోకే పరత్ర చ ।
బ్రాహ్మణో వేదమాప్నోతి క్షత్రియో వింధతే మహీమ్ ॥
వైశ్యస్తులభతే లాభం శూద్రః సుఖమువాప్నుయాత్ ।
వ్యాధితో ముచ్యతే రోగాద్భద్ధో ముచేత బంధనాత్ ॥
గుర్విణీ లభతే పుత్త్రం కన్యా విందతి సత్పతిమ్ ।
నష్టం చ లభతే ద్రవ్యమీహలోకే పరత్ర చ ॥
గవాం శతసహస్రస్య సమ్యక్ దత్తస్య యత్ఫలమ్ ।
తత్ఫలం లభతే మర్త్యః శ్రుత్వా దివ్యామిమాం కథమ్ ॥
పాదం వార్ధపాదం వా శ్లోకం శ్లోకార్థమేవ వా ।
యస్తు ధారయతే నిత్యం రుద్రలోకం స గచ్ఛతి ॥
అథవా సర్వమేవేదం దేవబ్రాహ్మణసన్నిధౌ ।
యః పఠేన్మానవో నిత్యం మద్గతేనాంతరాత్మనా ॥
శ్రద్దధానః సదా భక్తో రుద్రలోకం స గచ్ఛతి ।
పఠేచ్చ దేవి భక్త్యా చ పాఠమేచ్చ నరస్సదా ॥
ఇయ్యది ఘోరమైన యశుభమును శమింపఁజేయును దుఃస్వప్నమును (తత్పలితమును తొలగించును. స్త్రీల యందు వల్లభత్వమును పొండును; రాజసభయందు వల్లభత్వమును పొందును. (101) వివాదము నందంతఁడు వీజయమును పొందును. యుద్ధమునందట్లే విజయమొందును. ప్రయాణములందతఁడు శుభములందును; రాజసభయందు గౌరవము నొందును. గృహములందు నిత్య సంపద నొందును. (102) ఓ సుందరీ! అట్టి వానికి గలుగు శరీర లాభములఁ జెప్పెదను. అతఁడు హరీశ్మశ్రుఁడగును. నీలకంఠుఁ డగును; ఆతని శిరోజములందముగా చంద్రునిచే నలంకరింపఁబడియుండును. మూఁడు కన్నులవాడగును; త్రిశూలపాణియగును; వృషభ యాన్యుడగును; పినాకమును ధరించును, శ్రీమంతు డు నందితుల భాగ్యవంతుఁడగును; నందితుల్య పరాక్రమవంతుఁడగును. నా యాజ్ఞ నంది సపాద్యఖిల లోకములనతఁడు సంచరించును, వాయువునకు ఆకాశమునందువలె ఆతనిగతీకి విఘాతముండదు. (105) నాతో సమానమైన బలవంతుఁడగుచు, ఎట్టి ఉపద్రవముల నొందక యుండును. ఓ సౌందర్యవతీ ! నా భక్తులయిన మానవులెవ్వరీకథను విందురో, వారి స్థితీ ఇహలోకమునందు పరలోకమునందెట్లుండునో చెప్పెదను. బ్రాహ్మణుఁడు వేద విద్యావంతుఁడగును. క్షత్రియుఁడు భూమిని పొందును. (107) వైశ్యుఁడు లాభము పొందును. - శూద్రుఁడు సుఖమును పొందును. రోగి వ్యాధివలన వీడువంబడును, బంధనము నుండి బంధితుఁడు విడివడును (విముక్తుఁడగును). (108) గర్భిణీ స్త్రీ పుత్రుని గనును, అవివాహితయైన కన్య యోగ్యుఁడైన పతిని పొందును. ఇహము నందు పరమందు (ఇప్పుడు ఇక ముందు) నష్టద్రవ్యులు ధనమును పొందుదురు. (109) వందవేల యుత్తమ గోవులను దానము చేసిన నెట్టి ఫలితమో అట్టి ఫలమును ఈ కథను వినిన మానవుడు పొందును. ఒక శ్లోకపాదమును గాని, అర్ధశ్లోకమును గానీ, శ్లోకార్థమును గాని యెవ్వఁడు ధారణ చేయునో యతఁడు రుద్రలోకము నందును.
అతః పరతరం స్తోత్రం న భూతం న భవిష్యతి ।
నాపి యక్షాః పిశాచా వా న భూతా న వినాయకాః ॥
కురుర్విఘ్నం గృహే తస్య యత్రాయం తిష్ఠతి స్తవః ॥
మయా తు తుష్టేన తవాంబుజేక్షణే స్తవస్య మాహాత్మ్యమమౌఘనాశనమ్ ।
నివేదితం పుణ్యఫలాదీయుక్తం స్వయంచ గీతం చతురాననేన ॥
కథామిమాం పుణ్యఫలాదీయుక్తాం నివేద్య దేవ్యై శశిబద్ధమూర్ధజాః।
వృషస్య పుష్టేన సహోమయా ప్రభుర్జగామ కైలాసగుహాం గుహప్రియః ॥
శ్రుతం మయా పాపహరం తదంతికే నివేదితం తేఽథ మయా ప్రజాపతేః ।
అధీత్య సర్వం త్వఖిలం సలక్షణం ప్రయతీ చాదిత్యవదం ద్విజోత్తమః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదే నీలకంఠనామోత్పత్తికథనమ్ నామ పంచవింశలితమోఽధ్యాయః ॥
అధవా, ఏ మానవుఁడు మద్దతాంతరాత్మతో శ్రద్ధతో దేవబ్రాహ్మణసన్నిధిలో ఈ గ్రంథమును సర్వమును భక్తితో చదువునో ఆ మర్త్యుఁడు రుద్రలోకమును పొందును. ఓ దేవి ! ఎవ్వఁడు భక్తితో దీనిని చదువునో, చదీవించునో ఆ మర్త్యుఁడు రుద్రలోకమునకు పోవును. ఇంతకంటే నుత్తమమైన స్తోత్రము పూర్వము లేదు; ఇక ముందు కలుగదు. ఎచ్చట ఏ గృహమున నీ స్తవరాజముండునో, యక్షులుగాని, పిశాచములుగానీ, భూతములుగాని, విఘ్నకారకులుకాని విఘ్నము నాపాదింపలేరు. ఓ పద్మముల వంటి నేత్రములు కలదానా ! సంతుష్టుఁడనై అఘముల సముదాయమును నాశనము చేయునట్టిది, పుణ్యఫలములతో గూడియున్నది, చతురాననుఁడయిన బ్రహ్మచే స్వయముగా చెప్పబడినదియునగు నీ స్తవము యొక్క మాహాత్మ్యమును నీకు నివేదించితీనీ. పుణ్యఫలాదులతో కూడిన యీ కథను తనదేవికి చెప్పి ఉమాసహితుం డై వృషభవాహన మధిరోహించి, కుమారస్వామీయందు ప్రియుఁడు, చంద్రచూడుడు నగు శివుడు కైలాసగుహకు బయలుదేరి వెళ్లాను. పాపహరమయిన కథను ప్రజాపతివలన వింటిని. అయ్యది నీకు నాచే చెప్పఁబడినది. సలక్షణముగా నీకథ నంతటినీ అధ్యయనము చేసి ద్విజోత్తముఁడు బ్రహ్మ ఆదిత్యపదమునకుం బోవును.
ఇదీ వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ పురాణమందలి పూర్వభాగములోని ద్వితీయానుషంగపాదమున నీలకంఠ నామోత్పత్తి కథనమను ఇరువదియైదవ అధ్యాయము.
Summary of chapter 25 of the Brahmānda Mahā Purana is as follows:
Through a deeply moving narrative, this chapter recounts the supreme sacrifice of lord Śiva during the churning of the cosmic ocean, where he compassionately drank the deadly poison to save the universe. It lovingly explains how this merciful act left a blue mark on his holy throat, earning him the revered name Nīlakaṇṭha. The devoted heart overflows with tears of love and gratitude, worshipping the great lord whose infinite compassion and selflessness preserve the cosmic order.