బ్రహ్మాండ మహా పురాణము
11 - ఋషి సృష్టి వర్ణనము
సూత ఉవాచ:-
భృగోః ఖ్యాతిర్విజ జ్ఞే వై ఈశ్వరౌ సుఖదుఃఖయోః ।
శుభాశుభప్రదాతారౌ సర్వప్రాణభృతామిహ ॥
దేవౌ ధాతృవిధాతారౌ మన్వంతరవిచారిణౌ ।
తయోర్జ్యేష్ఠా ను భగినీ దేవీ శ్రీర్లోకభావినీ ॥
సా తు నారాయణం దేవం పతిమాసాద్య శోభనా ।
నారాయణాత్మజౌ తస్యాం బలోన్మాదౌ వ్యజాయతామ్ ॥
బలస్య తేజః పుత్త్రస్తు ఉన్మాదస్య తు సంశయః ।
తస్యాఽన్యే మానసా పుత్రా ఆసన్ వ్యోమవిచారిణః ॥
యే మహన్తి విమానాని దేవానాం పుణ్యకర్మణామ్ ।
మేరుకల్పే స్మృతే భార్యే విధాతుర్ధాతు రేత చ॥
ఆయతిర్నయతిశ్చైవ తయోః పుత్రౌ దృఢవ్రతౌ ।
ప్రాణశ్చైవ మృకండశ్చ బ్రహ్మకోశౌ సనాతనౌ ॥
మనస్విన్యాం మృకండస్య మార్కండేయో బభూవ హ ।
సుతో వేదశిరాస్తస్య ధూమప త్న్యామజాయత ॥
పీవర్యాం వేదశిరసః పుత్రా వంశకరాః స్మృతాః ।
మార్కండేయాః సమాఖ్యాతా ఋషయో వేదపారగాః ॥
ప్రాణస్య పుండరీకాయాం ద్యుతిమానాత్మజోఽభవత్ ।
ఉన్నతస్య ద్యుతిమతః స్వనవాతశ్చ తావుభౌ ॥
సూతుఁడిట్లు పలికెను :
భృగువలన ఖ్యాతికి ఇరువురు పుత్రులు ఒక పుత్రిక కలిగిరి. ఆ కుమారులిరువురు సుఖ దుఃఖములు కలిగించుటకు ప్రభువులు. వారే సర్వ ప్రాణులకును శుభాశుభముల నొసంగువారు. వారిరువురు ధాత, వీధాతలు. ధాత సంవర్థకుఁడు, విధాత శుభా శుభముల నొసంగువాఁడు. వారు మన్వంతరము నందుండిరి. అందు సంచరించిరి. వారీ అక్క జ్యేష్ణ భగిని శ్రీదేవి. ఆమె లోకములను పవిత్రీకరించునది, ఆమెకు బలము, ఉన్మాదము - అను ఇరువురు పుత్రులు నారాయణుని వలనఁ గలిగిరి. బలము యొక్క పుత్రుడు తేజము. ఉన్మాదము యొక్క పుత్రుఁడు సంశయము. ఇతరుల నేకులు మానస పుత్రులతనికి పుట్టిరి. వారు ఆకాశ సంచారులు. వారు దేవతల యొక్క పుణ్యకర్మల యొక్క విమానముల వహించెదరు (నడిపెదరు) (5) ఆయతి, నియతి యనువారు మేరువు పుత్రికలు, ఆయతీ. అనఁగా భవిష్యత్తు. నీయత అనఁగా నీగ్రహము. ఆయతి నియతులు ధాతృ విధాతృ భార్యలుగో స్మరింపఁబడిరి. దృడప్రతులయిన ప్రాణము, మృకండుడు వారి కుమారులు. వారు సనాతనులు. బ్రహ్మకోశులు (వేదకోశములు). (6) మనస్విని యందు మార్కండేయుడుద్భవించెను. ఇతఁడు మృకండుని పుత్రుఁడు. ఆతని కుమారుఁడు వేదశిరసుడు. ఇతడు మార్కండేయునకు ధూమ్ర పతివలనఁగలిగెను. వేద శిరసునికి పీవరి యందు కలిగిన పుత్రులు వంశకరులుగా గణింపం బడిరి. వేద పారగులయిన ఋషులు మార్కండేయులుగా సమాఖ్యాతులయిరి. (8) ప్రాణునకు పుండరీకయందు ద్యుతీమంతుఁడను కుమారుల డు కలిగెను. ద్యుతిమంతున కిరువురు పుత్రులు, ఉన్నతుఁడు, స్వనవాతుఁడు.
తయోః పుత్త్రాశ్చ పౌత్రైశ్చ భార్గవాణాం పరంపరాత్ ।
స్వాయంభువాంతరేఽతీతా మరీచేః శృణుత ప్రజాః ॥
పత్నీ మరీచేః సంభూతీర్విజజ్ఞే హ్యాత్మసంభవమ్ ।
ప్రజాపతేః పూర్ణమాసం కన్యాశ్చమా నిబోధత ॥
కృషి ర్వృష్టి స్త్విషా చైవ తథా చోపచితః శుభా ।
పూర్ణమాసః సరస్వత్యాం పుత్రౌ ద్వావుదపాదయత్ ॥
విరజం చైవ ధర్మిష్ఠం పర్వశం చైవ తావుభౌ ।
విరజస్యాత్మజో విద్వాన్ సుధామా నామ విశ్రుతః ॥
సుధామా స తు వైరాజః ప్రాచీం దేశముపాశ్రితః ।
లోకపాలః స ధర్మాత్మా గౌరీపుత్రః ప్రతాపవాన్ ॥
పర్వశః పర్వగణనాం ప్రవిష్టః సమహాయశాః ।
పర్వశః పర్వశాయాం తు జనయామాస వై సుతౌ ॥
యజుర్ధామ చ ధీమంతం స్తంభకాశ్యపమేవ చ ।
తయోర్గోత్రకరౌ పుత్రౌ జతౌ సంన్న్యాసనిశ్చితౌ ॥
స్కృత స్వంగిరసః పత్నీ జజ్ఞే సా హ్యాత్మసంభవాన్ ।
పుత్రౌ కన్యాశ్చతస్రశ్చ పుణ్యాస్తా లోకవిశ్రుతాః ॥
సినీవాలీ కుహూశ్చైవ రాకా చాఽనుమతిస్తథా ।
తథైవ భరతాగ్నిం చ కీర్తిమంతం చ తావుభౌ ॥
వారిరువురకు భార్గవ వంశంజులతోడి పరస్పర సంబంధ బాంధవములచే పుత్రులు పౌత్రులు గలిగిరి. వారు స్వాయంభువ మన్వంతరమున మరణించిరి. ఇంక మరీచి యొక్క సంతానమును గూర్చి వినుము. (10) ప్రజాపతియైన మరీచిపత్ని సంభూతి, ఆమె పూర్ణమాసుండను కుమారునిఁగనెను. అంతీయేకాక ఈ కుమార్తెలను గూడ కనెను. అని యెఱంగుము. కృషి, వృష్టి, త్వష, శుభంకరురాలయిన ఉపచితీ, పూర్ణమాసుడు, సరస్వతి యందు ఇరువురు పుత్రులగనెను. వారిరువురు ధర్మిష్ణుఁడయిన విరజుఁడు, పర్వశుఁడును. విరజుని కుమారుడు సుధాముఁడు. అతఁడు లోకవిశ్రుతుడు. (13) వీరజగౌరుల కుమారుఁడయిన సుధాముఁడు తూర్పుదిక్కును సమాశ్రయించెను. ప్రాక్టిశాపాలకుం డు అయిన సుధాముఁడు ధర్మాత్ముఁడు, ప్రతాపవంతుఁడు. మహాయశస్వియైన పర్వశుఁడు పర్వగణన క్రియయందు ప్రవిష్ణుఁడయ్యెను. పర్వశుఁ డు పర్వశయందు కుమారద్వయమును కనెను. వారిరువురు ధీమంతుఁడయిన యజుర్దాముఁడు, స్తంభకాశ్యపుఁడు. వారికిరువురు పుత్రులు. వారు సన్యాసుఁడు నీశ్చితుండు. వీరు వారి గోత్ర వృద్ధికరులయిరి. అంగీరసుని పత్నీ స్మృతీ నలుగురు కూతుండ్రను, ఇరువురు కుమారులను గనెను. ఆ నలుగురు కూతులు లోకమున మిక్కిలి విశ్రుతలు. వారు సినీవాలి, కుహు, రాక, అనుమతి యనువారు. భరతాగ్ని కీర్తిమంతులు కుమారులు.
ఆగ్నేః పుత్రం చ పర్జన్యం సద్వతీ సుషువే తథా ।
హిరణ్య రోమా పర్జవ్యో మారీచ్యాముదపద్యత॥
ఆభూతసంప్లవస్థాయి లోకపాల: స వై స్మృతః॥
యజ్ఞే కీర్తిమతశ్చాపి దేమకాలీశకల్మషౌ ॥
చరీష్ణుం ధృతి మంతం చ ఉభావంగిరసాం వరౌ ।
తయోః పుత్రాశ్చ పౌత్రాశ్చ అతీతా వై సహస్రశః॥
అనసూయా వీజజ్ఞే వై పంచాత్రేయాన్ అకల్మషాన్ ।
కన్యాం చైవ శ్రుతిం నామ మాతా శంఖపదస్య సా ॥
కర్దమస్య తు పత్నీ సా పౌలహస్య ప్రజాపతేః ।
సత్యనేత్రశ్చ హవ్యశ్చ అపోమూర్తిః శనైశ్చర॥
సోమశ్చ పంచమస్తేషామాసీత్స్వాయంభువేంఽతరే ।
యామా దేవైస్సహాతీతాః పంచాత్రేయాః ప్రకీర్తితాః ॥
తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ అత్రేయాణాం మహాత్మనామ్ ।
స్వాయంభువేంఽతరేఽతీతాః శతశోఽథ సహస్రశః ॥
ప్రీత్యాం పులస్త్యభార్యాయాం దానాగ్నిస్తత్సుతో భవత్ ।
పూర్వజన్మనీ సోఽగస్త్యః స్మృతః స్వాయంభువేఽoతరే ॥
మధ్యమో దేవ బాహుశ్చ శ్రీనామా చ తే త్రయః ।
స్వసా యవీయసీ తేషాం సద్వతీ నామ విశ్రుతా ॥
భరతాగ్నియే అగ్ని) షర్టన్యుని సద్వతీ అగ్నికి గనెను. హిరణ్యరోముఁడయిన పర్జన్యుఁడు మరీచి యందు పుట్టెను, ఇతఁడు వేడొకఁడు. హిరణ్యరోముఁడయిన పర్జన్యుఁడు). (19) ఇతఁడే లోకపాలుఁడు. ప్రళయాంతమండునట్టివాఁడు కీర్తిమంతునకు చరిష్ణువు, ధృతిమంతుఁడను సిరువురు పవిత్రులు, పుత్రులు, వీరిరువురును అంగీరస వంశమున మిక్కిలి యుత్తములు. వారి పుత్రులు, పౌత్రులు సహస్ర సంఖ్యకు మించిరి, వారందఱు గతించిరి. [21] అనసూయ ఆత్రి వలన అకల్మషులయిన యైదుగురు ఆత్రేయులను కనెను. ఆమె యొక కూతును కూడకనను, ఆమె పేరు శ్రుతి. ఆ శ్రుతి కుమారుఁడు శంఖపాదుఁడు. ఆమె {ఆశ్రుతి) పౌలహుడు, ప్రజాపతియునైన కర్గమునిపత్ని. ఆ యైదుగురు ఆత్రికుమారులు - సత్యనేత్రుఁడు,హవ్యుఁడు, ఆఫోమూర్తీ, శనైశ్చరుడు, సోముఁడు. వీరందరు స్వాయంభువ మన్వంతరమున యామదేవులతో సహితము గతించిరి. (24) మహాత్ములయిన ఆత్రేయులకు (ఆత్రసంతతులు) పుత్రులు పౌత్రులు వందలు, సహస్రములు కలరు. వారును స్వాయంభువ మన్వంతరమున గతించిపోయిరి. (25) పులస్త్యుని భార్య ప్రీతి. ఆమే సుతుఁడు దానాగ్ని ఆతని పూర్వజన్మలో స్వాయం భువ మన్వంతరమున అగస్త్యుడుగా స్మరింపబడుచున్నాఁడు {26) పులస్త్యునకు ముగ్గురు కుమారులు. మధ్యముఁడు దేవబాహువు. మూఁడవవారం డు ఆత్రీనామకుఁడు. (మొదటిపొండు దాణాగ్ని నాయకుఁడు) పారికొక చెల్లెలున్నదీ, ఆమె సద్వతి' ప్రసిద్ధురాలు. ఆమె శుభ వంతురాలు. పవిత్రురాలు. భరతాగ్ని పత్ని. పర్జన్యునీ తల్లి.
పర్జన్యజననీ శుభ్ర పత్నీ చాగ్నేః స్మృతా శుభా ।
పౌలస్త్యస్య బ్రహ్మర్షేః ప్రీతిపుత్త్రస్య ధీమతః ॥
దానాచ్చ సుషునే పత్నీ సుజంఘే చ బహూన్ సుతాన్ ।
పౌలస్త్యా ఇతి విఖ్యాతాః స్మృతాః స్వాయంభువేమింతరే ॥
క్షమా తు సుషువే పుత్రాన్ పులహస్య ప్రజాపతేః ।
త్రేతాగ్నివర్చసః సర్వే యేషాం కీర్తి: ప్రతిష్ఠితా ॥
కర్దమశ్చోర్వరీవాంశ్చ సహిష్ణుశ్చేతి తే త్రయః ।
ఋషిః కనకపీఠశ్చ శుభా కన్యా చ పీవరీ ॥
కర్దమస్య శ్రుతిః పత్నీ ఆత్రేయ్యజనయత్స్వయమ్ ।
పుత్త్రం శంఖపదం నాడు కన్యాం కామ్యాం తథైవ చ ॥
స వై శంఖపదః శ్రీమాన్ లోకపాలః ప్రజాపతిః ।
దక్షిణస్యాం ధీశి రతః కామ్యా దత్తా ప్రియవ్రతే॥
కామ్యా ప్రియవ్రతాల్లేభే స్వాయంభువసమాన్ సుతాస్ ।
దశ కన్యాద్వయం చైవ యైః క్షత్త్రం సంప్రవర్తితమ్ ॥
పుత్త్రం కనకపీఠస్య సహిష్ణుం నామ విశ్రుతమ్ ।
యశోధరా విజజ్ఞే వై కామదేవం సుమధ్యమా ॥
క్రతోః క్రతుసమాన్ పుత్త్రాన్ విజజ్ఞే సంతతిః శుభాన్ ।
వేషాం న భార్యా పుత్రోవా సర్వే తే ఊర్ధ్వరేతసః ॥
బ్రహ్మర్షియైన పౌలస్త్యునకు ప్రీతికిఁ గలిగిన ధీమంతుఁడయిన పుత్రుఁడు దోసగి సుజంఘి దానాగ్నీ భార్య, హరిరువురకు పెక్కురు పుత్రులు. వారందరు పౌలస్త్యులనీ విఖ్యాతి నొందినారు. వారందరు స్వాయంభువ మన్వంతరమున వసించి యుండిరని స్మరింపఁబడుచున్నారు. (29) పులహ ప్రజాపతి వలన 'క్షమ' పెక్కురు పుత్రులను బడసెను. (పులస్త్య అని యున్నది. ఇది తప్పు. పులహ అని యుండవలెను) వారందరు త్రేతాగ్ని వర్చస్వంతులు. వారి కీర్తి లోకమున సుప్రతిష్ఠితము. (30) వారు మువ్వురు - కర్గముఁడు, ఉర్వరీవంతుడు, సహిషుఁడు. కనకపీరుం డును. ఋషియును క్షమాసుతుఁడే. వారికొక యందమైన కూతురు. ఆమె పేరు మీనరి. (3}} అత్రి కూతురు శ్రుతీ, శ్రుతి కరముని భార్య. ఆ - శ్రుతి కుమారుఁడు శంఖపాదుఁడు, కుమార్తె కామ్య' (32) శంఖపాదుఁడు (పదుఁడు) లోకపాలుఁడు. ప్రజాభర్త. అతడు దక్షిణ ఊగ్రత్యుడు కామ్య ప్రియవ్రతునకు భార్యగా నీయఁబడెను (33) కామ్య ప్రియవ్రతుని వలన స్వాయంభువసములయిన పదిమంది పుత్రులను, ఇద్దరు కుమార్తెను గాంచేను. వీరి వలన క్షత్రియ సంతతి సంప్రవర్తితమయ్యెను. (34) సుమధ్యమయయిన యశోధర కనకవీరుని వలన విశ్రుతుండయిన సహిష్ణుని కనెను. ఆమె కామదేవుని కూడ కనెను. (35) సన్నతి క్రతువు వలన క్రతు సమానులయిన యోగ్య పుత్రులను గనెను. వారికీ భార్యలు లేరు పుత్రులు లేరు. వారూర్వ రేతస్ములు. బ్రహ్మచారులు. (46).
తాని షష్టిసహస్రాణి వాలఖిల్యా ఇతి శ్రుతాః ।
అరుణస్యాగ్రతో యాంతీ పరివార్య దివాకరమ్ ॥
ఆభూతసంప్లవాత్సర్వే పతంగసహచారిణః ।
స్వసారౌ తద్యవీయస్యౌ పుణ్యా సత్యవతీ చ తే ॥
పర్వశస్య స్నుషే తే వై పూర్ణమాససుతస్య తు ।
ఊర్జాయాం తు వసిష్ఠస్య వాసిష్ఠాః సప్త జజ్ఞిరే ॥
జ్యాయసీ చ సుతా తేషాం పుండరీడా సుమధ్యమా ।
జననీ సా ద్యుతిషతః ప్రాణస్య మహిషీ ప్రియాః॥
తస్యాస్తు యే యవీయాంసో వాసిష్ఠాః సప్తవిశ్రుతాః ।
రక్షో గర్తోర్ధ్వబాహుశ్చ సవన పవనశ్చ యః ॥
సుతపాః శంకురిత్యేతే సర్వే సప్తర్షయః స్మృతాః ।
రత్నో వరాంగ్యజనయన్మార్కండేయీ యశస్వినీ ॥
ప్రతీచ్యాం దిశి రాజానం కేతువంతం ప్రజాపతిమ్ ।
గోత్రాణి నామభిస్తేషాం వాసిష్ఠానాం మహాత్మానామ్ ॥
స్వాయంభువేంఽతరేతీతాస్యగ్నేస్తు శృణుత ప్రజా ।
ఇత్యేష ఋషిసర్గస్తు సాసుబంధః ప్రకీర్తితః ॥
విస్తరేణానుపూర్వాచ్చ అగ్నేర్వక్ష్యామ్యతః పరమ్ ।
ఇతి వాయుప్రోస్తే బ్రహ్మాండే మహాపురాణే పూర్వభాగే ద్వితీయేఽసుషంగపాదే ఋషిసర్గపర్ణసం నామ ఏకాదశోధ్యాయః॥
వారందరు అరువది వేలమంది. వారందరు వాతాఖిల్యులని ప్రఖ్యాతి వహించిరి, వారు దివాకరుని ప్రదక్షిణింఛి అరుణునకు ముందుగా పోవుచుందురు. ($7) ప్రపంచముసకు సంపూర్ణ సంప్లవము (వినాశము) వచ్చు వీణకు వారు శాశ్వతముగా సూర్య సహచరులు. వారికి ఇద్దరు చెల్లెండ్రు - వారు పుణ్య, సత్యవతి అనువారు, 18) వారు పర్వశుని కోడండ్రు పర్వశుఁడు పూర్ణమానుని పుత్రుడు. (39) వాసిషులు ఏడుగురు. వీరు వసిష్ఠుని కుమార్తెలు. వీరు ఊర్ణయందు వసిష్టునికి కలిగిరి. వారిలో సౌందర్యవతి సుమధ్యమ పుండరీకు ఈమె ద్యుతిమంతుని తల్లి. ఆ పుండరీక “ప్రాణుని" ప్రియపత్ని (40) పుండరీకకు తమ్ములు ఏడుగురు, వీరు వాసిషులు లోక విశ్రుతులు, చారు - రక్షుఁడు, గర్తుం డు, ఊర్ధ్వబాహుఁడు, ప్రషనుఁడు, సషనుండు, (పావనుఁడు), సుతపసుఁడు, శంకుఁడు అనువారు. వారందరు సప్తర్షులుగా స్మరింపబడుచున్నారు. యశస్వినియైన మార్కండేయి (మార్కండేయుని కూఁతురు వరాంగీ రత్నుండను కుమారునామె కనెను. ఆతఁడు రాజు) పశ్చిమ దిక్కునకు ప్రభుపు, ఆతఁడు ప్రజాపతియగుటచే కేతు మంతుఁడను పేరుగాంచెను మహాత్ములయిన వసిష్ఠనంతతుల గోత్రములు స్వాయంభువ మన్వంతరమున గతించి పోయినవీ. (43) ఇక 'అగ్ని' సంతతుల గూర్చి వినుము. ఈ విధముగా ఋషీశ్వర సృష్టి అనుబంధముతో సహితముగా ప్రకీర్తింపం బడినది. ఇంక పిమ్మట అగ్ని సంతతులను ఆనుపూర్వముగా విస్తరించి చెప్పెదను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమున పూర్వభాగమున ద్వితీయాసుషంగ పాదమున ఋషి సృష్టి వర్ణనమను ఏకాదశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 11 of the Brahmānda Mahā Purana is as follows:
The narrative joyfully continues to describe the sacred birth and spiritual lineage of the great seers and ascetics who serve as the pillars of ancient wisdom. These illustrious sages, born of divine will, are depicted as radiant beacons of ascetic power and compassionate grace who bless the world with sacred chants and timeless rituals. Through their pious example, the faithful are inspired to cultivate a life of truth, purity, and unwavering devotion to the supreme reality.