12 - అగ్నివంశము

సూత ఉవాచ:-

 మోఽసావగ్నేరభిమానీ స్మృతః స్వాయంభువంతరే

బ్రహ్మణో మానసః పుత్రస్తస్మాత్వ్యాసహిత్సాహా వ్యజాయిత

పావకం పదమాసం చ శుచిరగ్నిశ్చ యః స్కృతః

నిర్మథ్య: పవమానస్తు వైద్యుతః పావకః స్కృతః

శుచిః సౌరస్తు విజ్ఞేయః స్వాహాపుత్రాస్తు తే త్రయః

నిర్మథ్య: పవమావస్తు శుచిః సౌరస్తు యః సుతః

అబ్యోనిర్వైద్యుతశ్చైవ తేషాం స్థానాని తానీ వై

పవమానాత్మజశ్చైవ కవ్యవాహన ఉచ్యతే

 పావకిః పహరక్షస్తు హవ్యవాహః శుచేః సుతః

దేవానాం హహ్యపాహోఽగ్ని పితృణాం కవ్యవాహనః

సహ రక్షోఽసురాణాం తు త్రయాణాంతు త్రయోఽగ్నయః

ఏతేషాం పుత్రపౌత్రాస్తు ఛాత్వారింశన్నవైవ తు

వక్ష్యామి నామభిస్తేషాం ప్రవిభాగం పృథక్ఫృథక్

విశ్రుతో లౌకికోఽగ్నిస్తు ప్రథమో బ్రహ్మణః సుతః

బ్రహ్మో దత్తాగ్నిసత్పుత్రో భరతో నామ విశ్రుతః

వైశ్వానరసుతస్తవ వహవ్ హవ్యం సమాః శతమ్

సంభృతో ధర్వణ పూర్వమేధితికి పుష్కరో దదౌ

సోథర్వా లౌకికోఽ గ్నిస్తు దర్పహాఽథర్వణః స్మృతః

స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మ మానసపుత్రుఁడు అగ్నియొక్క అభిమాన దేవతగా స్మరింపఁబడును. ఆయగ్ని వలన స్వాహకు ముగ్గురు పుత్రులు కలిగిరి. వారు పవమానుఁడు (గార్హపత్యము) పావకుఁడు, శుచి, అనువారు.. (శుచినే యగ్నియందురు) పవమాన వహ్ని అరణిని మథించుట వలన నుత్పన్నమయినది. పొవకార్నీ విద్యుత్తు నుండి కలిగినది. శుచి సూర్యుని వలన కలిగిన అగ్ని దీనిని సౌరాగ్ని అందురు. వీని నగ్నిచయ మందురు. (3) పావకాగ్ని నీటిని తదుత్పత్తి స్థానముగా గలిగినది. అయ్యది (పావకాగ్ని) విద్యుత్తు నుండి పుట్టును అరటి, సూర్యుడు, విద్యుత్తు క్రమముగా వాని పుట్టిన స్థానములు. పవమానుని కుమారునిగా కవ్యవాహనుని చెప్పుదురు. సహరక్షుఁడు పావకుని కుమారుఁడు. హవ్యవాహనుఁడు శుచికుమారుఁడు. హవ్యవాహనుఁడు దేవతాగ్ని : కవ్యవాహనుఁడు పితరులకు సంబంధించిన అగ్ని; సహారక్ష రాక్షసుల యొక్క (అసురులయొక్క) అగ్ని, అందుచే నీ ముగ్గురు దేవతలకు పితరులకు రాక్షసులకు సంబంధించిన అగ్నులు. వీరి కుమారులు, మనుమలు కలిసి నలుబది తొమ్మండు. (4,6) వారి విభజనమును నామములతో సహితముగా వేఱువేఱుగా పేర్కొందును. ప్రథితుఁడయిన లౌకికాగ్ని బ్రహ్మగారి మొదటి కుమారుడు. (7) బ్రహ్మదగ్ని అనఁగా బ్రహ్మకు సమర్పించిన అగ్ని. బ్రహ్మదత్తాగ్నిని సత్పుత్రుం డు వైశ్వానరుఁడు. ఆతఁడు శత సంవత్సరములు హవ్యమును (అగ్నిని) వహించెను. (8) పూర్వమే ఏధితి (నాముకాగ్ని) పుష్కరమను సముద్రము నందు అధర్వణునిచే సంపాదింపఁబడినది. అందుచే లౌకికాగ్ని ఆధర్వణాగ్నిగా స్మరింపఁబడుచున్నది. ఈ యధర్వణుని పుత్రుఁడు దర్పహుఁడు,

అథర్వా తు భృగుర్జజ్ఞే హ్యగ్నిరాథర్వణః స్మృతః

తస్మాత్స లౌకికోఽగ్ని స్తు దధ్యజ్జాధర్వణ్వోమతః

అథర్వః పవమానస్తు నిర్మథ్యః కవిభిః స్మృతః

స జ్ఞేయో గార్హపత్యోఽగ్నీస్తస్య పుత్రద్వయం స్మృతమ్

శంస్యస్త్వాహవనీయోఽగ్నిః స్మృతో యో హవ్యవాహనః

ద్వితీయస్తు సుతః ప్రోక్తః శుకోఽగ్నిర్యః ప్రణీయతే

తథా సవ్యాపసవ్యౌ చ శంస్యస్సాగ్నేః సుతావుభౌ

శంస్యస్తు షోడశ నదీశ్చకమే హవ్యవాహనః

యో సావాహవనీయోఽగ్నిరభిమానీ ద్విజైః స్మృతః

కావేరీం కృష్ణవేణాం చ నర్మదాం యమునాం తథా

గోదావరీం వివస్తాం చ చంద్రభాగామీరావతీం

విపాశాం కౌశికీం చైవ శతద్రూం సరయూం తథా

సీతాం సరస్వతీం చైవ హ్రాదినీం పావనీం తథా

తాసు షోడశధామానం ప్రవిభజ్య పృథక్పృథక్

ఆత్మానం వ్యదధత్తాసు ధిష్ణీష్వథ బభూవ సః

కృత్తికాచారిణీ ధిష్ణీ జజ్ఞిరే తాశ్చ ధీష్ఠయః

ధిష్ణీషు జజ్ఞిరే యస్మాత్ ధిష్ణీయస్తేన కీర్తితాః

ఇత్యేతే వై నదీపుత్రా ధిష్ణీష్వేవం విజజ్ఞిరే

తేషాం విహరణీయా యే ఉపస్థేయాశ్చ యోఽగ్నయః

తాఞ్ శృణుధ్వం సమాసేన కీర్త్యమానాన్యథాతథమ్

విభుః ప్రవాహాణోగ్నీధస్తత్రస్థా ధీష్ణయోఽపరే

విధీయంతే యథాస్థానం సూత్యాహే సవనే క్రమాత్

 అధర్వుని వలన భృగుడదయించేను. ఆయగ్ని ఆధర్వణాగ్నిగా (అధర్వణుని కుమారునిగా) స్మరింపఁబడినది. అందుచే లౌకికాగ్ని దధ్యజుం డు. ఇతఁడే అధర్వుని కుమారుఁడు. (10) అధర్వణుని కుమారుఁడయిన పవమాన్యుడు మథనముచే పొందఁదగిన వాఁడని విజ్ఞులందురు. అయ్యదియే గార్హపత్యాగ్నియని యేరుంగవలయును అతనికిరువురు సుతులు. వారు శంస్యుఁడు, శుకుడు. శంష్యుఁడు ఆహవనీయాగ్ని, ఆతనిని హవ్యవాహనునిగా జ్ఞప్తి యందుంచుకొనవలెను. రెండవ కుమారుడు శుకుఁడు. అతఁడు (శుకుఁడు) అగ్నిని సంగ్రహణము చేయును, వహించును, (12) శంష్యునకు సవ్యాపసవ్యులిద్దరు కుమారులు. హవ్యవాహనుఁడయిన శంస్యుఁడు షోడశనదులను ప్రేమించేను. (13) ఆ హవనీయునిగా స్మరింపఁబడు, శంష్యాగ్నిని బ్రాహ్మణులు అభిమాని ఆగ్నిగా గుర్తించిరి. బ్రాహ్మణులీ షోడశ (16) నదుల నభిమానించిరి. ఆ 16 నదులు - కావేరి, కృష్ణవేణి, నర్మద, యమున, గోదావరి, వితస్త, చంద్రభాగ, ఇరావతి, విపాశ, కౌశికీ, శతద్రు, సరయు, సీత, సరస్వతీ, హోదీని, పావని - అనునవి. ఆతఁడు (శంష్యుఁడు) తన్ను షోడశ ధామములుగా విభజించుకొనెను (ధామము - ఉండుచోటు - నీవాసము). ఆ ధామముల యందోతఁడు తన్ను నిక్షేపించుకొనెను. (అగ్నులు ధిష్టులు) లేదా అగ్నిధామములు. ఆ దిష్ణులను అగ్నులు కృత్తికాచారిణులు. ఆ ధిష్టులకు పుత్రులు కలిగిరి. అందుచే ఆ బిడ్డలు ధీష్ఠులు అని పిలువబడిరి. ఇట్లు నదులకు దిష్ణులయందు (అగ్ని స్థానముల యందు) కుమారులుదయించిరి. వారు ధీష్ఠులుగా కీర్తిగనిరి. వీరిని నదీ పుత్రులనుగా నెఱుంగదగును." (14,18) వీనిలో కొన్ని అగ్నులు విరహణీయములు. (తీసికొని పరువం దగినవి లేదా పరిత్యక్తావ్యములు). మిగిలినవి 'ఉపగ్గేయములు. (ఉంచదగినవి). అవి పురోగాములు. వానిని గూర్చి వినుము. సంక్షిప్తముగా చెప్పెదను. క్రింద చెప్పబడువారు శంస్యాగ్ని సుతులు. వీరినందరినీ బ్రాహ్మణులు ఉపస్థయాగ్నులుగా స్మరింతురు. విభుఁడు, ప్రవహణుఁడు, అగ్నీధ్రుఁడు, మొదలగువారు ధిష్ణులు (ఆహితాగ్నులు). వీరందరు వారివారి యర్ఘ స్థానములలో, సోమరసము పిండిన దినమున యజ్ఞమున నుంపబడుదురు. (20).

అనుద్దేశ్య నివాస్యానామగ్నీనాం శ్రుణుత క్రమమ్

సమ్రాడగ్నిః కృశానుర్యో ద్వీతీయోంఽతరవేదికః

సమ్రాడగ్నిముఖానష్టౌ ఉపతిష్ఠంతి తాన్ ద్వీజాన్

పరిషత్పవమానస్తు ద్వితీయః సోఽనుదిశ్యతే

ప్రతల్కాన్యో నభోనామ చత్వరేసౌ విభావ్యతే

హవ్యస్తతో హ్యసమృష్టః శామీత్రేఽగ్నౌ విభావ్యతే

ఋతుధామా చ సుజ్యోతిరౌదుంబరః ప్రకీర్త్యతే

విశ్వవ్యచాః సముద్రోఽగ్నిర్ర్బహ్మస్థానే స కీర్యతే

బ్రహ్మజ్యోతిర్వసుర్దామా బ్రహ్మస్థానే స ఉచ్యతే

అజైకపాదుపస్థో యః స వై శాలాసుఖీయకః

అనుద్దేశ్యో హ్యహిర్బుద్న్యో సోఽగిరహపతిః స్మృతః

శంస్యస్యైతే సుతాః సర్వే ఉపస్థేయా ద్విజైః స్మృతాః

తతో విహరణీయాంశ్చ వక్ష్యామ్యష్టౌ చ తత్సుతాన్

విభుః ప్రవాహణోఽగ్నీధ్రస్తేషాం ధిష్ణ్యస్తథా పరే

విధీయంతే యధా స్థానం సౌత్యేఽహ్ని సవనే క్రమాత్

హోత్రీయస్తు స్మృతో హ్యగ్నిర్వహ్నిరో హవ్యవాహనః

అనుద్దేశ్యమున (ఏ నిర్దేశమీయక చేయబడిన యజ్ఞము) నుంచబడు అగ్నుల క్రమము నాలకింపుము. సమ్రాడగ్నితో నారంభించి అష్ణాగ్నులను బ్రాహ్మణులు పూజింతురు. అయ్యది సమ్రాడగ్న్యాదులు రెండవది కృశానుఁడు. ఇది వేదికాంతరమున నుండును. మూఁడవదీ పరీషతవమానాగ్ని ఇదీ అనుద్దిశ్యమే. నిర్దేశించిన విధమున వ్రేల్చబడును. (21,22) వేటొక్క అగ్ని ప్రతలము. దానినే నభోగ్ని అందురు. - అయ్యది చత్వరమున భావింపఁబడును, చత్వరమున చతురస్రమే సమతలమై యజ్ఞము కొఱకై సిద్ధము చేయబడిన ప్రదేశము. ఘృతముతో సంస్పృష్టము కానీ హవ్యము అగ్నిలో శామిత్రమను పాత్రమున భావింపఁబడును. యజ్ఞమున నుపయోగింపఁబడు ఒకానొక విధమయిన పాత్రము 'శామీత్రము' (23) తరువాత అగ్ని ఋతుధామమనునది. దానినే సుజ్యోతి యనియు, ఔదుంబర్యమనియు, విశ్వవ్యచస్సనియు కీర్తింపం బడును. ఇది సముద్రాగ్నీ దీనిని బ్రహ్మ స్థానమున కీర్తింతురు. బ్రహ్మ జ్యోతియైన వసుర్ధామమునే బ్రహ్మ స్థానము నందు చెప్పుదురు. ఉపగ్గేయమయిన అజైకషాదాన్నీ సాలా సుఖీయక మైనది. అహిర్భుధ్యుము అనుద్దేశ్యాగ్ని అయ్యదియే 'గృహపతి' అగ్నిగా స్మరింపఁబడును. (27) ఇక విహరణీయులను వాసియెనమండ్రు కుమారులను గూర్చి చెప్పెదను. విభుఁడు, ప్రపోహనుఁడు, అగ్నీధ్రుడు - మొదలగువారు. ధిష్ఠులు వారి వారి స్థానముల (20వ శ్లోకము పునరుక్తము). సోమ యజ్ఞమున విధింపఁబడినది. హవ్యవాహనాగినీ హోత్రీయాగ్నిగా స్మరించిరి. (28)

ప్రశాంతోఽగ్నిః ప్రచేతాస్తు ద్వీతీయశ్చాత్రనామకః

తతోఽగ్నిర్వైశ్వదేవస్తు బ్రాహ్మణాచ్ఛంసి రుచ్యతే

ఉశిగగ్నిః కవీర్యస్తు పోతోఽగ్నీః స విభావ్యతే

ఆవారిరగ్నిర్వాభాదిర్వేష్ఠీయః స విభావ్యతే

అవస్ఫూర్జో వివస్వాంస్తు ఆస్థాంశ్చైవ స ఉచ్యతే

అష్టమః సుద్ధ్యురగ్నిర్యోమార్జారీయః స ఉచ్యతే

ధిష్ట్యావాహ రణా హేతే సౌహ్యేవ్నోజ్యంతతేవై ద్విజైః

అపాం యోనిః స్మృతోఽసౌ స హ్యప్సునామా విభావ్యతే

తతోయః పావకో నామ్నా అబ్జో యో గర్భ ఉచ్యతే

అగ్నిః సోఽవభృథే జ్ఞేయో వరుణేన సహేజ్యతే

హృచ్ఛయస్తత్సుతో హ్యగ్నిర్జఠరే యో నృణాం పచన్

మృత్యుమాఞ్ జాఠరస్యాన్నేర్విద్వానగ్నిః సుతః స్మృతః

పరస్పరోత్థితః సోఽగ్నిర్భూతానీహ వినిర్ధహేత్

పుత్త్రస్వగ్నేర్మన్యుమతో హోరః సంవర్తకః స్మృతః

పిబన్నపః స వసతి సముద్రే బడబాముఖ:

సముద్రవాసినః పుత్రః సహరక్షో విభావ్యతే

సహరక్షసుతః క్షామో గృహాణాం దహతే నృణామ్

క్రవ్యాదగ్నిః సుతస్తస్య పురుషానత్తి యో మృతాన్

రెండవ యగ్ని ప్రచేతసుఁడు. అది ప్రశాంతాగ్ని. తరువాత వైశ్వానరాగ్ని కలదు. దానీనీ బ్రాహ్మణులు 'శంసి’ యందురు. (29) ఉసికన్నీ కలదు. దానికి కవి అని పేరు. దానినే పోతోగ్నిగా భావింతురు. దీనినే ఆవారిరగ్నిగా, భారీ అగ్నిగా, వైఫీయాగ్నిగా భావింతురు. (30) అవస్ఫూర్జాగ్నినీ వివస్వంతుఁడని, ఆస్థానాగ్నియని చెప్పుదురు. ఎనిమిదవది సుద్యురగ్నీ దీనిని 'మార్జాలీ' యాగ్ని యందురు. (31) ధిష్ట్యాగ్నులను, విహరణీయా గ్నులను సౌత్యేహ్నేజ్యంతమున (సోమరసమును పిండు దినమున) ద్విజులు పూజింతురు. సుద్యురగ్నీ నీటిని జన్మ స్థానముగా గలది (యోని) నిజముగా నయ్యది నీటియందే భావింపఁబడినది. (32) పావకాగ్ని నీటి నుండి పుట్టినదీ. ఇదీ అబ్దము. (నీరే యోగుట) ఈ అగ్నినే అవభృథాగ్నీగా నెఱుంగవలయును. (యజ్ఞాంత తర్పణమవబ్బథము). ఇయ్యది వరుణునితో సహా పూజింపఁబడును. (33) హృచ్ఛయుఁడు (హృదయమున శయనించుపోఁడు) అనునగ్ని పావకుని సుతుఁడు. మానవ హృదయమందలి ఆహారమున జీర్ణింపఁజేయునట్టి జఠరాగ్ని ఇదీయే. (పావకుఁడు - హృచ్ఛయుఁడు - మృత్యుమంతుఁడు - సంవర్తకుడు - సహరక్షుడు - క్షాముఁడు - క్రవ్యాదుఁడు) మృత్యుమంతుఁడు జాఠరాగ్ని యొక్క విద్వాంసుఁడయిన సుతుఁడు, (34) పరస్పరోళితమయిన అగ్నీ ఇచ్చట నన్ని భూతములను దహించును. భయంకరుండైన సంవర్తకాగ్ని మృత్యుమంతుని కుమారుఁడుగా గ్రహింపవలెను. (35) అయ్యది నీటిని త్రాగును. సంద్రమున వసించును. దానికి బాడబశ్రీ బ్రహ్మాండ మహాపురాణమ్ (ఆడగుపు) ముఖము కలదు. సహరక్షుఁడు సముద్ర పోసేయొక్క పుత్రుడు. (36) సపోరకునీ కుమారుడు క్షోముఁడు. అతఁడు మానవుల గృహములను దహించును. ఆతని కోమరుఁడు క్రవాదుఁడు. ఇతఁడు మృతశధీరములను దీనును.

 ఇత్యేతే పావకస్యాగ్నేః పుత్రా ఏవ ప్రకీర్తితాః

తతః శుచిస్తు వై సౌరో గంధర్వైయురాహుతః

మథితో యస్త్వరణ్యాం చ సోఽగ్నిరగ్నీం సమీంధతీ

ఆయుర్నామ్రా తు భగవానసౌ యస్తు ప్రణీయతే

ఆయుషో మహిషః పుత్రః సహసో నామ తత్సుతః

పాకయజ్ఞేష్వభీమానీ సోఽగ్నిస్తు సహసః స్కృతః

పుత్రస్య సహసస్యాగ్నే రద్భుతః స మహాయశాః

వివిధశ్చాద్భుతస్యాపీ పుత్రోఽగ్నేస్తు మహాన్ స్కృతిః

ప్రాయశ్చిత్తేష్వభీమానీ హుతం భుంక్తే హవీః సదా

వివిధేస్తు సుతో హ్యర్కస్తస్య చాగ్నేః సుతా ఇమే

అనీకవాన్ వాచసృక్ చ రక్షోహ యష్టికృత్తథా

సురభీర్వసురన్నాదోఽప్రవిష్టో యః స రుక్మరాట్

శుచేరగ్నేః ప్రజా హ్యేషా వహ్నాయశ్చ చతుర్దశ

ఇత్యేతే చాగ్నయః ప్రోక్తాః ప్రణీయంతేధ్వరేషు పై

ఆదిసర్గే వ్యతీతా వైయామైస్సహ సురోత్తమైః

స్వాయంభువేంఽతరే పూర్వమగ్నయస్తేభిమానినః

ఏతే విహరణీయేషు చేతనా చేతనేషు వై

స్థానాభిమానినో లోకే ప్రాగాసన్ హవ్యవాహనః

వీరు పావకానీ పుత్రులు. ప్రకీర్తింపబడిరి. తరువాత సొరుదు అయిన (సూర్య సంబంధియైన) అగ్ని శుచి. దీనినే గంధర్వులు ‘ఆయువు' అందురు. (38) అరణీయండు మథింపఁబడిన యగ్నీ ఇతరాగ్నులను ప్రజ్జ్వలింపజేయును. ఈ యగ్నియొక ప్రదేశము నుండి వేడొక ప్రదేశమునకుఁ దీసికోనీ పోవఁబడును. ఈ అగ్ని ఆయువుగా ప్రఖ్యాతుఁడు, (39) ఆయువు పుత్రుఁడు మహిషుఁడు, ఆతని కుమారుని నామము సహసుఁడు. ఈ సహసుఁడు పాక యజ్ఞమునందభిమాని. (పచన యజ్ఞమునందు ప్రీతిమంతుఁడు). (40) ఈ సహసుని కుమారుఁడు అద్బుతుఁడు. ఇతఁడు మహా యశస్వి 'ఏవీధి’ అద్భుతుని యొక్క కుమారుఁడు. అతఁడు చాలా గొప్పవాఁడు. (41) ఈ అగ్ని (వివిధి నామకుం డు) ప్రాయశ్చిత్తముల యందభిమానీ అగ్నిలో ఆహుతీగావింపఁబడిన హవిస్సుల నీతఁడు సదా భుజించును. 'అర్కుడు' వివిధీ యొక్క కుమారుం డు. ఈ క్రింది వారు అర్మాన్ని సుతులు. (42) 1. అనీక వంతుఁడు; 2. వాజసృక్కు 3, రక్షోహా, 4, యష్టికృత్తు, 5. సురభి, 6. వసువు, 7. అన్నాదుఁడు, 8. ఆప్రవిష్ణుండు, 9, రుక్మరాట్టు (43) వీరందరు 'శుచి' యొక్క పదునలుగురు కుమారులు, వీరందరు యజ్ఞములయందు పవిత్రీకృతులు. (44) స్వయంభువమను మొదటీ మన్వంతరములో అభిమానులయిన యీ అగ్నులు సురోత్తములయిన “యాము”లతో వ్యతీతులయిరీ (గడచిపోయిరీ) (45) పర్వము, లోకమున, హవ్యవాహనాగ్నులు చేతనాచేతసాభిమానులయిన విహరణీయాగ్నులతో హరి స్థానముల నభిమానులయి యుండిరి. (46)

కామ్యనైమిత్తికా యజ్ఞేష్వేతే కర్మస్వవస్థితాః

పూర్వమన్వంతరేఽ తీతాః శుక్రైర్యాగైశ్చ తైః సహా

దేవైర్మహాత్మభిః పుణ్యైః ప్రథమస్యాంతరే మనోః

ఇత్యేతాని మయోక్తాని స్థానాని స్థానినశ్చ హా

తైరే వ తు ప్రసంఖ్యాతమతీతోనోగతేష్విహ

మన్వంతరేషు సర్వేషు లక్షణం జాతవేదసామ్

సర్వే తపస్వినో హ్యేతే సర్వే బ్రహ్మభృతస్తథా

ప్రజానాం పతయః సర్వే జ్యోతిష్యంతశ్చ తే స్మృతాః

స్వరోచిషాదిషు జేయాః సామర్థ్యం తేషు' సప్తసు

మన్వంతరేషు సర్వేషు నామరూపప్రయోజనైః

వర్తంతే వర్తమానైశ్చ యామైర్దేవైః సహాగ్నయః

అనాగచైః సురైః సార్థం వర్త్యం తేఽనాగలాగ్నయః

ఇత్యేష నిచయోఽగ్నీనామసుక్రాంతో యథాక్రమమ్

విస్తరేణానుపూర్వ్యా చ పితృణాం వక్ష్యతే పునః

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వీతీయేఽఖనుషంగపాదే అగ్నినిచయో నాము ద్వాదశోధ్యాయః

ఈ యగ్నులు పవిత్రములయిన యజ్ఞకర్మల యందు అవస్థితములు. వారు కొమ్యకర్మలు, నైమిత్తిక కర్మలును. (ఫలితమును గోరునట్టివీ కామ్యములు. నిమిత్తము కలిగినప్పుడప్పుడప్పుడుపయోగింపబడునవి నిమిత్త కర్మలు). అయ్యప్ శుక్రములతో యాగములతో పూర్వము మన్వంతరమున అతీతములయినవి గతించి పోయినవి) (41) మొదటి మనువు యొక్క మన్వంతరమున, పుణ్యులు, మహాత్ములు, నయిన దేవతలతో వారు చనిది. ఈ స్థానికుల యొక్క స్థానములు నాచేనభివర్ణితము లయినవి. (46) జరిగిపోయిన మన్వంతరములందు, భవిష్య నన్వంతరములందు జాతవేదులనంబడు అగ్నుల లక్షణములు అన్నియును పోనీ వలన నభివర్ణింపఁబడినవి. (49) వారందలు తపస్వినులు, వారందరు బ్రహ్మభృత్తులు. (బ్రహ్మజ్ఞానమును చపోంచినపోరు}. వారందఱు ప్రజాపతులు. వారు జ్యోతిషంంతముల స్మరింపఁబడిరి. (50) (ప్రకాశించు జ్యోతి స్వరూపులుగా గమనింపఁబడిరి). వీరందరు ఇప్పుడు స్వారోచిషాదులయిన ఏడుగురు మన్వంతరములతో ఆరంభించి, సావర్ణ్యమనువుతో సమాప్తమొందు మనువుల సోమములతో రూపములతో వర్తమానులయిన అగ్నులు "యామా”గ్నులతో సహా నుండిరి. అనాగతులయిన అగ్నులు (భవిష్యదగ్నులు) భవిష్యద్దేవతలతో సహా యుందురు. (52) ఈ విధముగా "అగ్నీ నిచయము క్రమముగా నభివర్ణింపం బడినది. ఇంక విస్తరించి పితృసంబంధి యగ్నివంశము అభివర్ణింపఁబడును. (53)

ఇది వాయుప్రోక్తమగు శ్రీ బ్రహ్మాండ మహాపురాణమందు పూర్వభాగమున ద్వితీయానుషంగ పాదమున 'అగ్ని నిచయ"మను పండ్రెండవ యధ్యాయము సమాప్తము.