30 - మదనపునర్భవో   

అగస్త్వఉవాచ :

అశ్వాసన మహాప్రాజ్ఞ, శ్రుతమాఖ్యానముత్తమమ్

 విక్రమో లలితాదేవ్యా విశిష్టో వర్ణితస్త్వయా

 చరితైరనఘైర్దేవ్యాః సుప్రీతోఽస్మి హయానన

 శ్రుతా సా మహతీ శక్తిర్మంత్రిణీదండనాథయోః

పశ్చాత్కిమకరోత్తత్ర యద్ధానంతరమంబికా  చతుర్ధదీనశర్వర్యాం విభాతాయాం హయానన

అగస్త్యుడనెను: ఓ హయగ్రీవా! మహాప్రాజ్ఞా! నీవల్ల ఉత్తమమైన లలితాఖ్యానమును ఆమె విశిష్ట పరాక్రమమును వింటిని. ఓయగస్త్యా! దేవియొక్క పాపరహితమైన చరితము సంతుష్టుడనైతిని. మంత్రీడీదండనాథలయొక్క యామహాశక్తిని గూడవింటిని.-2. నాలుగవ దినపురాత్రి తెల్లవారగనే యుద్ధానంతరము అంబికయేమి చేసెను?

హాయగ్రీవ ఉవాచ :

శృణు కుంభజ తత్ర్పాజ్ఞ యత్తయా జగదంబయా

 పశ్చాదాచరితం కర్మ నిహతే భండదానవే

శక్తీనామఖిలం సైన్యం దైత్యాయుధశతార్డితమ్

 ముహురాహ్లాదయామాస లోచనైరమృతాప్లుతైః

లలితాపరమేశాన్యాః కటాక్షామృతధారయా

జహుర్యుద్ధపరిశ్రాంతీం శక్తయః ప్రీతమానసాః

 అస్మిన్నవసరే దేహ భండమర్ధనతోషితాః

సర్వేఽపి సేవితుం ప్రాప్తా బ్రహ్మవిష్ణువురోగమాః

 బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ శక్రాద్యాస్త్రిదశాస్తథా

 ఆదిత్యా వసవో రుద్రా మరుతః సాధ్యదేవతాః

సిద్ధాః కింపురుషా యక్షా నిరృత్యాద్యా నిశాచరాః

 ప్రహ్లాదాధ్యా మహాదైత్యాః సర్వేఽప్యండనివాసినః

ఆగత్య తుష్టువుః ప్రీత్యా సింహాసనమహేశ్వరీమ్

హయగ్రీవుడనెను. ఓ ప్రాజ్ఞ! కుంభజ! భండాసురుడు చనిపోగా తరువాత జగదంబ ఏమి చేసెనో వినుము-4. భండాసురుని నూర్లకొలదీ యాయుధములచే పీడింపబడిన సమస్తశక్తి సైన్యమును తనలోచనామృత స్నానములతో గాయముల బోగొట్టి మరల సంతసింపజేసెను-5. లలితా పరపరమేశాని యొక్క కటాక్షామృత ధారచేత శక్తులు ప్రీతమనసులై యుద్ధ పరిశ్రమను వదిలిరి-6. ఈ సమయమున భండాసురవధతో సంతసించిన బ్రహ్మ, విష్ణువు మొదలుగాగల దేవతలు అందరును అదేవిని సేవించుటకు వచ్చిరి-7. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రాది దేవతలు, ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు మరుత్తులు, సాధ్యదేవతలు-8. సిద్దులు, కింపురుషులు, యక్షులు, నిరృతి మొదలగు నిశాచరులు, ప్రహ్లాదుడు మొదలగు మహాదైత్యులు, బ్రహ్మాండమున నివసించునందరును వచ్చి సింహాసనముననున్న మహేశ్వరిని సంతోషముతో స్తుతించిరి.

బ్రహ్మాద్యాఊచు :

నమోనమస్తే జగదేకనాథే నమోనమః శ్రీత్రిపురాభిధానే

 నమోనమో భండ మహాసురఘ్నే నమోఽస్తు కామేశ్వరీ వామకేశి

 చింతామణే చింతీదానదక్షేఽచింత్యే చిరాకారతరంగమాలే

చిత్రాంబరే చిత్రజగత్ర్పసూతే చిత్రాఖ్యనిత్యే సుఖదే నమస్తే

 మోక్షప్రదే ముగ్ధశశాంకచూడే ముగ్ధస్మితే మోహనభేదదక్షే

ముద్రేశ్వరీచర్చితరాజతంత్రే ముద్రాప్రియే దేవి నమోనమస్తే

 క్రూరాంతకధ్వంసిని కోమలాంగే కోపేషు కాలీం తనుమాదధానే

 క్రోఢాననే పాలితసైన్యచక్రే క్రోడీకృతాశేషభయే నమస్తే

 షడంగదేవీపరివారకృష్ణే షడంగయుక్తశ్రుతివాక్యమృగ్యే

 షట్చక్రసంస్థే చ షడూర్మియక్తే షడ్భావరూపే లలితే నమస్తే

 కామే శివే ముఖ్యసమస్తనిత్యే కాంతాసనాంతే కమలాయతాక్షి

 కామప్రదే కామిని కామశంభోః కామ్యే కలానామధిపే నమస్తే

 దివ్యౌషధాద్యే నగరౌఘరూపే దివ్య దినాధీశసహస్రకాంతే

 దేదీప్యమానే దయయా సనాథే దేవాధి(ది)దేవప్రమదే నమస్తే

 సదాణిమాద్యష్టకసేవనీయే. సదాశివాతోజ్వలమంచవాసే

 సభ్యే సదేవాలయపాదపూజ్యే సావిత్రి లోకస్య నమోనమస్తే

బ్రాహ్మీముఖైర్మాతృగణేర్నిషేవ్యే బ్రహ్మప్రియే బ్రాహ్మణబంధభేత్రి

 బ్రహ్మామృతస్రోతసి రాజహంసి బ్రహ్మేశ్వరి శ్రీలలితే నమస్తే

సంక్షోభిణీముఖ్యసమస్తముద్రాసంసేవితే సంసరణప్రహంత్రి

సంసారలీలాకృతిసారసాక్షి సదా నమస్తే లలితేజధినాథ

 నిత్యే కలాషోడశకేన నామాకర్షిణ్యధీశీ ప్రమథేన సేవ్యే

 నిత్యే నిరాతంకదయాప్రపంచే నీలాలకశ్రేణి నమోనమస్తే

అనంగపుష్పాదిభిరున్నదాభిరనంగదేవీభిరజససేవే

 అభవ్యహంత్ర్యక్షరరాశిరూపే హతారివర్గీర్గే లలితే నమస్తే

సంక్షోభిణీముఖ్యచతుర్ధశార్చిర్మాలావృతోదారమహాప్రదీప్తే

 ఆత్మానమాబిభ్రతి విభ్రమాడ్యేశుభ్రాశ్రయే శుభ్రపదే నమస్తే

 సశర్వసిద్ధాదికశక్తివంద్యే సర్వజ్ఞవిజ్ఞాతపదారవిందే

 సర్వాధికే సర్వగతే సమస్తే సిద్ధిప్రదే శ్రీలలితే నమస్తే

సర్వజ్ఞజాతప్రథమాభిరన్యదేవీభిరప్యాశ్రితచక్రభూతే

సర్వామరాకాంక్షితపూరయిత్రి సర్వస్య లోకస్య సవిత్రి పాహిః

 వందే వశిన్యాదికవాగ్విభూతే వర్దిష్ణుచక్రద్యుతివాహవాహే

 బలాహకశ్యామకచే వచోఽబ్ధే వరప్రదే సుందరి పాహి విశ్వమ్

 బాణాదిదివ్యాయుధసార్వభౌమే భండాసురానీకవనాంతదావే

అత్యుగ్రతేజోజ్జ్వలితాంబురాశే ప్రసేవ్యమానే పరితో నమస్తే

కామేశి వజ్రేశి భగేశ్యరూపే కన్యే కలే కాలవిలోపదక్షే

 కథావశేషీకృతదైత్యసైన్యే కామేశయాం(కాం)తే కమలే నమస్తే

 బిందుస్థితే బిందుకలైకరూపే బింద్వాత్మికే బృంహితచిత్రకాశే

 బృహత్కుచాంభోజవిలోలహారే బృహత్ర్పభావే లలలితే నమస్తే

కామేశ్వరోత్సంగసదానివాసే కాలాత్మికే దేవి కృతానుకంపే

 కల్పావసానోత్థితకాలిరూపే కామప్రదే కల్పలతే నమస్తే

 సవారుణే సాంద్రసుధాంశుశీతే సారంగశావాక్షి సరోజవక్త్రే

 సారస్య సారస్య సదైకభూమే సమస్తవిద్యేశ్వరి సంగతిస్తే

 తవ ప్రభావేణ చిదగ్నిజాయాః శ్రీశంభునాథప్రకట్రీకృతాయాః

 భండాసురాద్యాః సమరే ప్రచండా హతా జగత్కంటకతాం ప్రయతాః

నవ్యాని సర్వాణి వపూంషి కృత్వా హి సాంద్రకారుణ్య సుధాప్లవైర్నః

 త్వయా సమస్తం భువనం సహర్షం సుజీవితం సుందరి సభ్యలభ్యే

 శ్రీశంభునాథస్య మహాశయస్య ద్వితీయతేజఃప్రసరాత్మకే యః

 స్థాణ్వాశ్రమే క్లుప్తతయా విరక్తః సతీవియోగేన విరస్తభోగః

తేనాద్రివంశే ధృతజన్మలాభం కన్యాముమాం యోజయితుం ప్రవృత్తాః

ఏవం స్మరం ప్రేరితవంతఏవ తస్యాంతికం ఘోరతపఃస్థితస్య

తేనాథ వైరాగ్యతపోవిఘాత క్రోధేన లోలాటకృశానుదగ్ధః

 భస్మావశేషో మదనస్తతోఽభూత్తతో హి భండాసుర ఏష జాత

తతో వధస్తస్య దురాశయస్య కృతో భవత్యా రణదుర్మదస్య

 అథాస్మదర్థే త్వతనుస్సజాతస్త్వం కామసంజీవనమాశుకుర్యా

 ఇయం రతిర్భర్తృవియోగఖిన్నా వైధవ్యమత్యంతమభవ్యమాప

 పునస్త్వదుత్పాదితకామసంగాద్భవిష్యతి శ్రీలలితే సనాథా

 తయా తు దృష్టేన మనోభవేన సంమోహితః పూర్వవదిందుమౌలిః

చీరం కృతాత్యంతమహాసపర్యా తాం పార్వతీం ద్రాక్పరిణేష్యతీశః

 తయోశ్చ సంగోద్భవితా కుమారః సమస్తగీర్వాణచమూవినేతా

తేనైవ వీరేణ రణే నిరస్య స తారకో నామసురారీరాజః

 యో భండదైత్యస్య దురాశయస్య మిత్రం స లోకత్రయధూమకేతుః

 శ్రీకంఠపుత్రేణ రణే హతశ్చేత్ప్రాణప్రతిష్ఠైవ తదాభవేన్న

తస్మాత్వమంబ త్రిపురే జనానాం మానాపహం మన్మథవీరవర్యమ్

 ఉత్పాద్య రత్యా విధవావ్వదుఃఖమపాకురు వ్యాకులకుంతలాయాః

ఏషాత్వనాథా భవతీం ప్రపన్నా భర్తృప్రణాశేన కృశంగయష్టి

 నమస్కరోతి త్రిపురాభిధానే తదత్ర కారుణ్యకలాం విధేహి

బ్రహ్మాదులు అనిరి :- ఓ జగమున కేకైకనాథురాలా నీకు నమోనమః ఓ శ్రీ త్రిపురయనుపేరు గలదానా! నీకు నమోనమః భండమహాసురుని జంపినదానా! నీకు నమోనమః. ఓ కామేశ్వరి! సుందరమైన కేశములు గలదానా! నీకు నమస్కారము-11. కోరినదెల్ల యిచ్చు సమర్ధురాలా! చింతామణి స్వరూపిణీ! చింతింపనలవి కానీదానా! (ధ్యానాతీతా) చీత్స్వరూపముయొక్క తరంగములను మాలలుగా ధరించినదానా! జ్ఞానసముద్రరూపిణీ, (అచటచట జ్ఞానభేదములు పోడసూపినను తరంగములు సముద్రమున లీనమైనట్లే జ్ఞానభేదములు అద్వయజ్ఞాన సముద్రమున లీనమగును. ) చిత్రమైన యంబరములు (వస్త్రములు) కలదానా! చిత్రమైన జగమును సృజించినదానా! చిత్రా యను- నిత్యాశక్తి రూపిణి. సుఖము నిచ్చుదానా! నీకు నమస్కారము-12. మోక్షమునిచ్చుదానా! సుందర చంద్రకళను సిగలో ధరించినదానా! సుందరమైన చిరునగవు గలదానా! మోహమును భేదించుటలో సమర్థురాలా! ముద్రలకీశ్వరివై రాజతంత్రమును చర్చించినదానా! ముద్రాప్రియయైన దేవీ నీకు నమస్కారము. (శాక్తేయమున ప్రతికైంకర్యము ముద్రాపూర్వకముగనే జరుగును గాన ముద్రాప్రియ యనబడినది)-13. క్రూరుడైన యంతకుని ధ్వంసము జేసిన దానా! కోమలాంగే! కోపమున కాళీరూపమును వహించుదానా! వరాహ ముఖమైనదానా (వారాహీ రూపిణి). శక్తి సైన్య చక్రమును పాలించినదానా! సమస్త భయములను, వారాహీ రూపమున  నిమిడ్చుకొనినదానా! నీకు నమస్కారము. శరీరము యొక్క యాజు, అంగములను రక్షించు దేవీ పరివారమునకు కృష్ణస్వరూపిణీ! శిక్షా-వ్యాకరణ-చ్చందో-నిరుక్త-జ్యోతిష-కల్పములను ఆరంగములతో గూడిన శ్రుతి వాక్యములకు వేదుకదగినదానా (అలభ్యమైనదానా!) మూలాధారాది షట్చక్రములలో నున్నదానా! క్షుత్-తృష్ణా-శోక-మోహ-జరా-మరణములను షడూర్ములతో గూడిన దానా! (ప్రాణి శరీరాంతర్గతముగా! షడ్బావరూపిణీ! ఓ లలితా! నీకు నమస్కారము-15. స్త్రీ రూపము జెందిన కామ స్వరూపిణి! శీవాస్వరూపిణి ముఖ్యములైన సమస్తములోని నిత్యస్వరూపిణి! మనోహర స్వరూపిణి! కాంతాసనాంతరూపిణీ! కమలవిశాలలోచనే కోరిన కోరికలనిచ్చుదానా! కామశంభుపునకు కామినియైనదానా! మోక్షమునకై కోరదగినదానా! కళలకు అధిపురాలా! నీకు నమస్కారము-16. దీన్యౌషధమునకు మొట్టమొదటిదానా! నగర సముహ స్వరూపిణి! దీవ్యురాలా! సూర్యసహస్రకాంతిమతి! ఆకాంతితో మిక్కిలి ప్రకాశించుదానా! దయతో గూడినదానా! దేవాదిదేవులకు సంతోష స్వరూపురాలా! నీకు నమస్కారము-17. ఎల్లప్పుడు అణిమాది అష్టైశ్వర్యములతో సేవింపదగినదేనా! సదాశివుని యాత్మయై దివ్య ప్రకాశముతో వెలుగు మంచముననుండు దానా! (సదాశివ హృదయాశాయిని) సభ్యురాలా! (సభామర్యాదలు తెలిసినదానా!) సత్తునకు ముఖ్యమైన యాలయమైన పాదములందు పూజ్యురాలా (నీ పాదపూజవల్ల సదాత్మత చేకూరును), లోకమును సృష్టించినదానా నీకు నమస్కారము-18. బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలతో సేవింపదగినదానా! బ్రహ్మకు ప్రియురాలా! (జ్ఞానప్రియవు) బ్రాహ్మణుల ఇంధములను చేధించుదోనా! బ్రహ్మ జ్ఞానము) అను ప్రవాహమున విహరించు రాజహంసీ! బ్రహ్మకు గూడ ఈశ్వరివైనదానా ఓ శ్రీలలితా! నీకు నమస్కారము-19. సంక్షోభిణీ మొదలగు సమస్తముద్రలతో సేవింపబడినదానా! సంసారబంధమును ధ్వంసము జేయుదానో! సంసారమునకు లీలకొరకైన యాకారమైనదానా! పద్మములవంటి కన్నులు గలదానా! (సంసారలీలాకారమునకు పద్మాక్షి వైనదానా!) ఓ అధినాథవైన లలితా! నీకు నమస్కారము. నిత్య స్వరూపిణి! పదునాలు కళలతోను లలితయను నామముతోను సర్వముగా సాకర్పించుదానా! సర్వమున కధీశ్వరివైన దానా! ప్రమథ గణముతో సేవింపదగినదానా! -20 నిత్యస్వరూపిణి (నిత్యాశక్తి స్వరూపిణి) - భయములేని దయకు విస్తార స్వరూపిణికి నల్లని ముంగురుల వరసలు గలదానా! నీకు నమోనమః. మన్మధపుష్పములై ఉన్నత గీతనాదములు గలవారైన మన్మథుని దేవుల (భార్య) చేతను ఎల్లప్పుడు సేవింపదగినదానా! అభవ్యులను (అమంగళులను) జంపుదానా! శివదూషకులను  జంపుదానా! వర్ణమాలా స్వరూపిణి! చంపబడిన శత్రువులు గలదానా! ఓ లలితా నీకు నమస్కారము-21. సంక్షోభిణి మొదలగు పదునాలుగు జ్వాలలతో నావరింపబడి గొప్పదైన మహాజ్వాలతో ప్రకాశించినదానా ఆత్మను (సర్వాత్మను) పూర్తిగా ధరించుదానా! విలాసశోభితురాలా! శుభ్రమునకు నెలవైనదానా! శుభ్రమైన పాదములు గలదానా! (నీరుష్టములైన మాటలు గలదానా!). నీకు నమస్కారము-22. శర్వసిద్ద మొదలగు శక్తులకు నమస్కరింప దగినదానా! సర్వజ్ఞునిచేత సర్వస్వాత్మ జ్ఞానిచేత, (శిపునిచేత) తెలియబడిన పదకమలములు గలదానా! సర్వులకన్ననధికురాలా! సర్వము నందున్నదానా! సమస్త సిద్దుల నిచ్చుడోనా! ఓ శ్రీలలితా! నీకు నమస్కారము-23. సర్వజ్ఞునకు జనించిన మొదటివారగు నితర దేవులాశ్రయించిన చక్ర స్వరూపిణి! సమస్త దేవతల కోరికల నెరవచ్చుదానా! సర్వలోకములను సృష్టించుదానా! రక్షింపుము-24. వశిని మొదలగు శక్తుల వాగైశ్వర్యరూపిణి! చక్రాకారము గల కాంతీ ప్రవాహమును వహించుదానా! (ఆకారము చుట్టు మహాకాంతిపుంజ ప్రవాహము గలదానా!) మేఘవలె నల్లని వెంట్రుకలు గలదానా! హక్కులకు సముద్రమైనదానా! వరమునిచ్చుదానా! ఓ సుందరి! లలితా విశ్వమును రక్షింపుము-25. బాణము మొదలగు దివ్యాయుధములకు సార్వభౌమ చక్రవర్తి స్వరూపిణి! భండాసుర సైన్యవనమధ్యము నందలి కార్చిచ్చువైసదానా! వజ్రేశ్వరి! భగేవ్వరి (బశ్వర్యములకు గూడనీశ్వరి! రూపములేనీ దానా! (ఆత్మస్వరూపిణి) కన్యా! కలి స్వరూపిణి! కాలుని గూడ జంపదక్షురాలా! దైత్య సైన్యమును ధ్వంసముజేసి మాటలలో మాత్రము నిలుచు దానిగ జేసినదానా! కామేశునిచే ననుసరింపబడినదానా! లక్ష్మీస్వరూపిణి! నీకు నమస్కారము-27. బిందువునందున్నదానా! బిందుకళతో ఏకరూపమైన దానా! బిందు స్వరూపమైన దానా! జ్ఞాన ప్రకాశమును ప్రకాశింపజేసినదానా! విశాల స్తనములపై కదులుచున్న కమలహారములు గలదానా! విశాల ప్రభావము గలదానా! ఓ లలితా! నీకు నమస్కారము-28. కామేశ్వరుని తొడపై నెల్లప్పుడు నివసించుదానా! కాల స్వరూపిణి! దేవి! దయదలచినదానా! కల్ప ప్రలయము చివర విజృభించిన యమస్వరూపిణి! కామములనిచ్చు కల్పవృక్షలతా! నీకు నమస్కారము-29. మద్యముతో గూడినదానా! దట్టమైన చంద్రుని వెన్నెల వలె చల్లనైనదానా! లేడిపిల్ల కన్నులదానా! పద్మముఖీ! పద్మసారము (బ్రహ్మానందసారము) నకెల్లప్పుడొకే నెలవైనదానా! సమస్త విద్యలకు ఈశ్వరి! నీకు నమస్కారము-30. జ్ఞానాగ్ని యందు బుట్టినట్టియు, శ్రీశంభునాథునిచే ప్రకటింపబడినట్టిదియు నైన నీయొక్క ప్రభావముచే సమరమున జగతంటకులై భయంకరులైన భండాసురుడు మొదలగువారు చంపబడిరి-31. ఓ సభ్యులకు లభ్యమైనదానా! నీ దట్టమైన దయాసుధా ప్రపోహములతో మా శరీరములను ఆయుధపు దెబ్బల గాయములు లేకుండగా క్రొత్తవానీనిగా జేసితివి. నీవీ సమస్త లోకమును సంతోషముతో సుఖముగా జీవించిన ప్రాణులు గలదానినిగా జేసితివి-32. (11 నుండి 32వ శ్లోకమునకు నమోనమస్తే జగదేక నాథే మొదలుకొని సభ్యలభ్య-అన్నది చివరిదిగా మొత్తమించు మించు 122 నామములున్నవి. ఇందులో కొన్ని వాక్యరూపములు, మొత్తము పైననివి విడిగా విశద వ్యాఖ్యేయములనిపించుచున్నవి.) లలితా సహస్రనామములిందు కనబడచులేవు. కాని అవియున్నట్లు సూచన ఈ లలితోపాఖ్యానమున 20 అధ్యాయమున 68వ శ్లోకమున గలదు - "తా సాం సారూని సర్వాసాం డండిన్యాలి కుంభసంభవ సహస్రనో మధ్యాయే తు వక్ష్యంతే నాధునా పునః” మహాశయుడైన శ్రీశంభునాథుని యొక్క రెండవ తేజము ప్రసరించినచోటు స్థాణ్వాశ్రమము. అచట సతీ వియోగమున శివుడు నిరస్తభోగుడై విరక్తుడై యుండెను-33. అపుడు హిమ పర్వతవంశమున బుట్టిన కన్యయైన ఉమను శివునితో గలుపుటకు బూనినవారై దేవతలు ఘోరతపమున నున్న యా శివునికడకు మన్మథుని ప్రేరేపించిరి-34. ఆ తరువాత. తన వైరాగ్య తపములకు విఘాతము నొనరించుటచే శివుడు ఫాలనేత్రాగ్నితో మన్మథుని భస్మము జేసెను. ఆ విధముగా భస్మావశేషుడైన మన్మథుడే యీ భండాసురుడుగా జనించెను-35, తరువాత దురాశయుడును దర్ముదుడునైన యా భండాసురుని నీవు చంపితివి. మా కొఱకు (దేవతల కొఱకు) మన్మథుడు శరీరములేని వాడయ్యేను. ఈ రతీదేవి కూడ భర్తవియోగమున మిక్కిలి దుఃఖితురాలై యభవ్యమైన వైధవ్యమును బొందినది. కావున నీవా కాముని వెంటనే సంజీవితునిగా జేయుము. నీవు సంజీవితునిగా జేసిన మన్మథుని సంగముచే ఓ శ్రీ లలితా! రతీదేవి సనాథ (నాథుడు గలది) యగును-36, 37. రతితో జూడబడిన మన్మథుడు మరల చంద్రమౌళిని మోహితుని జేయును. తరువాత అట్లు మోహితుడైన యీశుడు చాలాకాలము మిక్కిలి సపర్యజేసిన పార్వతిని వెంటనే పెండ్లాడగలడు-38. ఆ శివపార్వతుల సంగము వలన సమస్త దేవసేనాయకుడగు కుమారస్వామి జనించును. శివపుత్రుడైన (కుమారస్వామి) ఆతడు, దురాశయుడైన భండాసురుని మిత్రుడును, ముల్లోకములకు తోకచుక్కవలె వినాశసూచకుడునునైన తారకుడను రాక్షసరాజును రణమున నిరసించి చంపినచో మనకు (దేవతలకు) ప్రాణప్రతిష్ట యగును-40. కావున నో త్రిపురాంబా! నీవు జనమానముల భంగపరచు మహావీరుడగు మన్మథుని జనింపజేసి విరబోసికొన్న తలవెంట్రుకల గల రతీదేవియొక్క వైధవ్య దుఃఖమును బోగొట్టుము-41. భర్త నశించుటచే అనాథయై బక్కచిక్కినదై  రతీదేవి నిన్ను శరణు బొంది నమస్కరించుచున్నది. కావున నో త్రిపురాంబా! ఇచట నీ కారుణ్యకళను ప్రసరింపజేయుము-42.

హయగ్రీవ ఉవాచ :

ఇతి స్తుత్వా మహేశానీం బ్రహ్మాద్యా విబుధోత్తమాః

 తాం రతిం దర్శయామాసుర్మలినాం శోకకర్శితామ్

సా పర్యశ్రుముఖీ కీర్ణకుంతలా ధూలిధూసరా

 ననామ జగదంబాం వై వైధవ్యత్యక్తభూషణా

అథ తద్దర్శనోత్పన్నకారుణ్యా పరమేశ్వరీ

 తతః కటాక్షాదుత్పన్నః స్మయమానముఖాంబుజః

పూర్వదేహాధికరుచిర్మన్మథో మదమేదురః

 ద్విభుజః సర్వభూషాడ్యః పుష్పేషుః పుష్పకార్ముకః

ఆనందయన్ కటాక్షేణ పూర్వజన్మప్రియాం రతిమ్

 అథ సాపి రతిర్దేవీ మహత్యానంద సాగరే

 మజ్జంతీ నిజభర్తారమలోక్య ముదం గతా

 ఆనందితాంతరాత్మానౌ భక్తినిర్భరమాన

 జ్ఞాత్వాథ తౌ మహారాజ్ఞి మందస్మితముఖాంబుజా

వీదానతాం రతిం ప్రేక్ష్య శ్యామలామిదమబ్రవీత్

 శ్యామలే స్నాపయిత్వైనాం వస్త్రకాంచ్యాదిభూషణైః

 అలంకృత్య యథాపూర్వం శీఘ్రమానీయతామిహ

తదాజ్ఞాం శిరసా ధృత్వా శ్యామా సర్వం తథాఽకరోత్

బ్రహ్మర్షిభిర్వసిష్టాద్యైర్వైవాహికవిధానతః

కారయామాస దంపత్యోః పాణిగ్రహణమంగలమ్

 అప్సరోభిశ్చ సర్వాభిర్నృత్యగీతాదిసంయుతమ్

ఏతద్దృష్ట్వా మహేంద్రాద్యా ఋషయశ్చ తపోధనాః

 సాధు సాధ్వితి శంసంతస్తుష్టువర్లలితాంబికామ్

 పుష్పవృష్టిం విముంచంతః సర్వే సంతుష్టమానసా

 బభూవుస్తౌ మహాభక్త్యా ప్రణమ్య లలితేశ్వరీమ్

తత్ఫార్శ్వే తు సమాగత్య ఇద్దాంజలిపుటౌ స్థితౌ

 అథ కందర్పవీరోఽపి నమస్కృత్య మహేశ్వరీమ్

 వ్యజ్ఞాపయదిదం వాక్యం భక్తినిర్భరమానసః

 యద్దగ్ధమీశనేత్రేణ వపుర్మేలలితాంబికే

 తత్త్వదీయకటాక్షస్య ప్రసాదాత్పునరాగతమ్

తవ పుత్రోఽస్మి దాసోఽస్మి క్వాపి కృత్యే నియుంక్ష్వ మామ్

 ఇత్యుక్తా పరమేశానీ తమాహ మకరధ్వజమ్

హయగ్రీవుడనెను:- బ్రహ్మ మొదలగు దేవశ్రేష్ఠులు ఈ విధముగా జెప్పి దుఃఖముతో బక్కచిక్కిమలినముగానున్న (అలంకారములేమియు లేకయున్న) యా రతీదేవిని శ్రీలలితాంబకు జూపించిరి-43. ఆ రతీదేవియు దుమ్ముబారి విరియబోసికొన్న వెంట్రుకలు గలిగి, కన్నీరు గార్చుచున్న ముఖముగలదై వైధవ్యముతో నలంకార శూన్యయై జగదంబకు నమస్కరించెను-44. అంత, పరమేశ్వరి యామెను జూచి కారుణ్య పూర్తయయ్యెను. అంత, ఆమె కటాక్షమునుండి చిరునవ్వు ముఖమును, పూర్వదేహమున కన్న మించిన కాంతిని గలిగి మదముతో నునుపెక్కిన మన్మథుడు రెండు భుజములు గలిగి సమస్త భూషణములతో నొప్పి పుష్పధనువును పుష్పబాణములను ధరించి-46. తన పూర్వజన్న ప్రియురాలైన రతీదేవిని క్రీగంటి చూపుతో నానందింపజేయుచు జనించెను. ఆ రతీదేవియు భర్తను జూచి మహానంద . సాగరమునమునుగుచు ముదము నందెను-47. అంతరాత్మలలో నానందము. నిండిన వారైనమ వారిరువును లలితాదేవి, యెడ భక్తితో నిండిన మనస్సులు గలవారైరి. అట్టి వారిని గుర్తించి మహారాజ్ఞి లలితాదేవి చిరునవ్వుతో సిగ్గున తలవంచియున్న రతీదేవిని చూచి శ్యామలతో నిట్లనెను-48. ఓ శ్యామలా! ఈ రతీదేవిని స్నానము చేయించి వస్త్రములు మొలనూలు మొదలగు నలంకారములతో, పూర్వమువలె నలంకరించీ తొందరగా నీటకు దీసికొనిరమ్ము-48. శ్యామలయు నామె యాజ్ఞ నౌదలదాల్చి యామె చెప్పినదంతయు  జేసెను. వైవాహిక విధి విధానముతో-50. వసిష్టాది బ్రహ్మర్షులచే నా దంపతులకు పాణిగ్రహణ మంగల కర్మను చేయించెను-51. ఇది చూచి మహేంద్రాదులును తపోధనులైన ఋషులును బాగు బాగు అని ప్రశంసించుచు లలితాంబికను స్తుతించిరి-52. లలితా పరమేశ్వరిని మహాభక్తితో నమస్కరించి పుష్పవర్షమును గురిపించుచు అందరును సంతుష్ట మనస్కులైరీ-25. రతీమన్మథులును లలితాదేవి యొక్క ప్రక్కన చేతులు జోడించి నిలిచిరి. తరువాత మన్మథ వీరుడుగూడ మహేశ్వరికి నమస్కరించి భక్తి నిండిన మనస్సుతో నీ మాటలును విన్నవించెను-54. ఓ లలితాంబా! ఈశ్వరుని నేత్రముచే దగ్గమైన నాశరీరమును నీ కటాక్షప్రసాదమున మరలబొందితిని-55. ఇపుడు " నీ పుత్రుడను. నీదాసుడను. ఏదేని పనియందు నన్ను నియోగింపుము- అనగనే పరమేశానియు మన్మథుతో నిట్లనెను-56.

శ్రీదేవి యనెను.

వత్సాగచ్ఛ మనోజన్మన్ న భయం తవ విద్యతే!

మత్ప్రసాదాజగత్సర్వం మెహయావ్యాహతాశుగః

త్వద్బాణపాతనాజ్జాతధైర్యవిప్లవఈశ్వరః

పర్వతస్య సుతాం గౌరీం పరిణేష్యతి సత్వరమ్

సహస్రకోటయః కామా మత్ప్రసాదాత్త్వదుద్భవాః

సర్వేషాం దేహమావిశ్య దాస్యంతి రతిముత్తమామ్

మత్ర్పసాదేన వైరాగ్యాత్సంక్రుద్ధోఽపిస ఈశ్వరః

దేహదాహం విధాతుం తే న సమర్థో భవిష్యతి

అదృశ్యమూర్తిః సర్వేషాం ప్రాణినాం భవమోహనః

స్వభార్యావిరహాశంకీ దేహస్యార్ధం ప్రదాస్యతి

ప్రయాతోఽసౌ కాతరాత్మా త్వదాణహతమానసః

అద్య ప్రభృతి కందర్పమత్పసాదాన్మహీయసః

త్వన్నిందాం యే కరిష్యంతి త్వయి వా విముఖాశయాః

అవశ్యం క్లీబతైవ స్యాత్ తేషాం జన్మజన్మని

యేపాపిష్టా దురాత్మానో మద్భక్తద్రోహిణశ్చ పొ

తానగమ్యాసు నారీషు పాతయిత్వా వినాశయః!

యేషాం మదీయపూజాసు మద్భక్తీష్వాదృతం మనః

తేషాం కామసుఖం సర్వం సంపాదయ సమీప్సితమ్

ఇతి శ్రీలలితాదేవ్యా కృతాజ్ఞవచనం స్మరం:

తథేతి శిరసా బిత్సాంజలిర్నర్యయౌ తతః

తస్యానంగస్య సర్వేభ్యో రోమకూపేభ్య ఉత్థితాః

బహవః శోభనాకారా మదనా విశ్వమోహనా

తైర్విమోహ్య సమస్తం చ జగచ్చక్రం మనోభవః

పునః స్థాణ్వాశ్రమం ప్రాప చంద్రమౌలెర్జిగీషయా:

వసంతేన చ మిత్రేణ సేనాన్యా శీతరోచిషా

రాగేణ పీఠమర్దేన మందానిలయేణ చ

 పుంస్కోకిలగలత్స్వానకాహలీభిశ్చ సంయుతః

శృంగారవీరసంపన్నో రత్యాలింగితవిగ్రహ

జైత్రం శరాసనం ధన్వన్ ప్రవీరాణాం పురోగమః

మదనారేరభిముఖం ప్రాప్య నిర్భయ ఆస్థితః

తపోనిష్ఠం చంద్రచూడం తాడయామాస సాయకైః

అథ కందర్పబాణౌఘైస్తాడితశ్చంద్రశేఖరః

దూరీచకార వైరాగ్యం తపస్తత్యాజ దుష్కరమ్!

నియమానఖిలాంస్త్వక్త్వా త్యక్తధైర్యః శివః కృత:

తామేవ పార్వతీం ధ్యాత్వా భూయో భూయః స్మరాతురః!

నిశస్వాస వహన్ శర్వః పాండురం గండమండలమ్

బాష్పాయమాణో విరహీ సంతప్తా ధైర్యవిప్లవాత్

భూయో భూయో గిరిసుతాం పూర్వదృష్టామనుస్మరస్

అనంగబాణదహనైస్తప్యమానస్య శూలినః

న చంద్రరేఖా నో గంగా దేహతాపచ్ఛిదేఽభవత్

నందిభృంగిమహాకాలప్రముఖైర్గణమండలై

ఆహృతే పుష్పశయనే విలులోఠ ముహుర్ముహు!

నందినో హస్తమాలంబ్య పుష్పతల్పాంతరాత్పునః

పుష్పతల్పాంతరం గత్వా వ్యచేష్టత ముహుర్ముహుఃI

న పుష్పశయనే నేందుఖండనిర్గలితామృతే న

హిమానీపయసి వా నివృత్త సద్వపుర్జ్వరః

స తనోరతనుజ్వాలాం శమయిష్యన్ముహుర్మహుః

 శిలీభూతాస్ హిమపయఃపట్టానధ్యవసచ్ఛివః

భూయః శైలసుతారూపం చిత్రపట్టే నఖైర్లిఖత్

తదాలోకనతోఽదూరమనంగార్తీమవర్దయత్

తామాలిఖ్య హ్రియా నమ్రాం వీక్షమాణాం కటాక్షతః

తచ్ఛిత్రపట్టమంగేషు రోమహరేషు చాక్షిపత్

చింతాసంగేన మహతా మహత్యా రతిసంపదా

భూయసా స్మరతాపేన వివ్యాథే విషమేక్షణవి

తామేవ సర్వతః పశ్యంస్తస్యామేవమనో దిశన్

తయైవ సంల్లపన్ సార్ధమున్నా దేనోపపన్నయా తన్మాత్రభూతహృదయస్తచ్చితస్తత్పరాయణః

తత్కథాసుధయా నీతసమస్తరజనీదినః

తచ్చీలవర్ణనరతస్తద్రూపాలోకనోత్సుకః

తచ్చారుభోగసంకల్పమాలాకరసుమాలికః

తన్మయత్వమనుప్రాపస్తతాపాతితరాం శివః

ఇమాం మనోభవరుజమచికిత్స్యాం స ధూర్జటి

అవలోక్య వివాహాయ, భృశముద్యమ మౌనభూత్

ఇత్థం విమోహ్య తం దేవం కందర్పో లలితాజ్ఞయా

అథ తాం పర్వతసుతామాశుగైరభ్యపాతయత్

ప్రభూతవీరహజ్వాలామలినైః శ్వసితానలైః

శుష్యమాణాధరదలో భృశం పాండుకపోలభూః

నాహారే వా న శయనే న స్వాపే ధృతిమిచ్ఛతి

సఖీసహస్రైః సిషిచే నిత్యం శీతోపచారకై:

పునః పుసస్తప్యమానా పునరేవ చ విహ్వలా

న జమ రుజ శాంతిం మన్మథాగ్నేర్మహీయసః II

న నిద్రాం పార్వతీ భేజే విరహేడోపతాపితా

స్వతనోస్తాపనేనాసౌ పితు ఖేదమవర్ధయత్

అప్రతీకారపురుషం విరహం దుహితు: శివే!

అవలోక్య స శైలేంద్రో మహాదుఃఖమవాప్తవాన్

భద్రే త్వం తపసా దేవం తోషయిత్వా మహేశ్వరమ్

భర్తారం తం సమృచ్ఛేతి పిఠా సంప్రేరి తాథ సా

హిమావచ్చైలశిఖరే గౌరీశిఖరనామని

చకార పతిలాభాయ పార్వతీ దుష్కకరం తపః

శిశిరేషు జలావాసా గ్రీష్మే దహనమధ్యగా

అర్కే నివిష్టదృష్టిశ్చ సుఘోరం తప ఆస్థితా

తేనైవ తపసా తుష్టః సాన్నిధ్యం దత్తావాస్ శివః

అంగీచకార తాం భార్యాం వైవాహికవిధానతః

అథాద్రిపతినా దత్తాం తనయాం నలినేక్షణమ్

సప్తర్షిద్వారతః పూర్వం ప్రార్థితాముదవోఢ హ

తయా చ రమమాణో ఽ సౌ బహుకాలం మహేశ్వరః

ఓషధీప్రస్థనగరే శ్వశురస్య గృహేఽవసత్

పునః కైలాసమాగత్య సమస్తైః ప్రమథైః సహ

పార్వతీమానినాయాద్రినాథస్య ప్రీతిమావహత్

రమమాణస్తయా సార్ధం కైలాసే మందరే తథా

వింధ్యాద్రౌ హేమశైలే చ మలయే పారియాత్రకే

నానావిధేషు స్థానేషు రతీం ప్రాప మహేశ్వరః

అథ తస్యాం ససర్జోగ్రం వీర్యం సా సోధుమక్షమా

భువత్యజత్సాపి వహ్నౌ కృత్తికాసు స చాక్షిపత్

తాశ్చ గంగాజలేఽముంచస్ సా చైవ శరకాననే

తత్రోద్భూతో మహావీరో మహాసేనః షడాననః

గంగాయాశ్చాంతీకం నీతో దూర్జటిర్వృద్ధిమాగమత్

స వర్ధమానో దివసే దివసే తీవ్రవిక్రమః

శిక్షితో నిజతతేన సర్వా విద్యా అవాప్తవాన్

అథ తాతకృతానుజ్ఞః సురసైన్యపతిర్భవన్

తారకం మారయామాస సమస్తైః సహ దానవైః

తతస్తారకదైత్యేంద్రవధసంతోషశాలినా

శక్రేణ దత్తాం స గుహో దేవసేనాముపానయత్

సా శక్రతనయా దేవసేనా నామ యశస్విని

ఆసాద్య రమణం స్కందమానందం భృశమాదదౌ

ఇత్థం సంమోహితాశేషవిశ్వచక్రో మనోభవం

దేవకార్యం సుసంపాద్య జగామ శ్రీపురం పునః

యత్ర శ్రీనగరే పుణ్యే లలితా పరమేశ్వరీ

వర్తతే జగతామృద్ద్యై తత్ర తాo సేవితుం యయౌ

ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే

మదనపునర్భవో నామ త్రింశోఽధ్యాయః

శ్రీదేవియనేను: వత్సా! మనమున బుట్టినమన్మథా! రమ్ము. నీకు భయములేదు. నాయనుగ్రహమున కొట్టుబడని యాయుధములు : గలవాడవై సర్వ జగమును సంమోహింప జేయుము-57. నీ బాణములు పడుటచే కోల్పోయిన ధైర్య విజృంభణము గల ఈశ్వరుడు వెంటనే పర్వతసుతయైన గౌరిని పరిణయ మాడగలడు-58, నాయనుగ్రహమున నీ నుండి బుట్టిన వేయి. కోట్ల మన్మథులు అందరి . దేహముల నావేశించి యుత్తమరతి నీయగలరు-59. నాయనుగ్రహముననే వైరాగ్యము వలన కోపించినను ఆ యీశ్వరుడు నీ దేహమును .. దహింపజేయ సమర్థుడుగాడు-60. అందరికిని కనబడకుండగనే ప్రాణులందరికిని సంసార మోహమును గలిగించు వాడగు శిపుడు తన భార్యా విరహము నాశంకించి పార్వతికి తన సగము. శరీరమునిచ్చును. నీ బాణములచే కొట్టబడిన మనస్సు గల యీ శివుడు పిరికివాడగును-61. ఓ మన్మథా! ఇవ్వేళటినుండి గొప్ప వాడవైన నిన్ను నిందిచువారు గాని, నీకు ఏముఖులైన వారుగాని జన్మ జన్మలలోగూడ .. తప్పక నపుంసకులగుదురు.-62. పాపిష్టులు, దురాత్ములు, నా భక్తులకు ద్రోహము చేయువారునైన వారిని అగమ్యలైన స్త్రీలలో బడవైచి నశింపజేయుము-63, నా పూజలందును నా భక్తులందును ఆదరముగల వారికి వారు కోరిన దానితోబాటు సమస్త కామ సుఖమును సంపాదించి పెట్టుము-64. ఈ విధముగా నాజ్ఞాపించిన లలితాదేవి వచనమును అట్లే చేయుదునని శిరమున చేతులు జోడించి మన్మథుడు వెడలెను-65. తరువాత, ఆ మన్మథుని రోమకూపముల నుండి శోభనములై సుందరములైన యాకారములుగలిగి. విశ్వ మోహనులైన యనేకులు మన్మథులు బయలుదేరిరీ-66. వారి చేత మన్మథుడు. సమస్త జగమును మోహింపజేసెను. చంద్రమౌళిని జయించుటకై మరల స్థాణ్వాశ్రమమును జేరెను-67. మిత్రుడు వసంతుడు, సేనానియైన చంద్రుడు, వీరమర్ధకుడైన (విదూషకుడైన) రాగము. మందానిల . . వేగము-68, పుంసోకిలగానములు అనెడి కాహళులు, డప్పు చప్పుడులు) వెంట వచ్చిరి. మన్మథుడు శృంగార వీర వేషముతో సుసంపన్నుడై రతీదేవిచే కౌగిలింపబడి యుండెను-69. జయ శీలమైన పుష్పధనువును కదల్చుచు ప్రవీరులందరికిని ముందుగా నడచుచు మదనారియైన శివుని కెదుట జేరి నిర్భయుడై నిలిచెను-70. తపోనిష్టుడైన చంద్రచూడుని (శిపుని) బాణములతో గొట్టసాగెను. తరువాత మన్మధ బాణ - సముహములు చాకిన చంద్రశేఖరుడైన శివుడు వైరాగ్యమును. దూరము జేసెను. దుష్కరమైన తపమును గూడ వదిలెను-71. సమస్త నియమములను వదిలి ధైర్యము వీడెను. ఆ పార్వతినే చింతించి మాటిమాటికి కామ జ్వరము గలవాడయ్యెను-72. శివుడు నిట్టూర్చెను. ఆతని చెక్కిళ్లు తెల్లబారేను. కన్నుల నీరునిండెను. గౌరీ విరహమున బాధితుడయ్యెను. ధైర్యము బోయి నందున సంతప్తుడయ్యెను. " పూర్వము జూచిన గిరిసుతనే స్మరించుచుండెను-73. మన్మథ బాణాగ్నులచే తపింపబడుచున్న శివునకు చల్లని చంద్రరేఖగాని, గంగగాని తాపశాంతి కుపయోగించుటలేదు-74, నంది, భృంగి, మహాకాలులను ముఖ్యములైన గణమండలములచే సిద్దము జేయబడిన పూల . పాన్పున మాటమాటికి పొర్లుచుండెను-75, నందీశ్వరుని చేయి పట్టుకొని ఒక పుష్ప శయనము నుండి మరొక పుషశయనమును, బొందినను మాటిమాటికి వికృత చేష్టల జేయుచుండెను-76. పూలపాన్పున గాని, చంద్రరేఖ నుండి జాలువారిన యమృతమునందుగాని, మంచు నీటగాని శివుని శరీరజ్వరము నివృత్తముగాలేదు-77. శరీరము దాల్చిన మన్మథ (కామ) జ్వాలను జల్లార్చుటకు 'శిలలుగా మారీన మంచు నీటి ఫలకములను మాటి మాటికి శివుడధివసించుచుండెను. మాటిమాటికి గిరిసుతా రూపమును చిత్రపటమున వ్రాయుచుండెను-78. ఆ చిత్రపటగౌరిని చూచి కాము. బాధను కొంత పెంపొందజేసెను. సిగ్గుతో తలవంచి క్రీగంట తన్ను జూచునట్లుగా, గీరిసుతను' చిత్రపటమున వ్రాసి యా పటమును పులకించిన యంగములతో దాకుచుండెను. మహాచింతాసంగమునను, మహరతీసంపదతోను మిక్కిలియైన సురతాపముచేతను ఆ త్రినేత్రుడు వ్యధ జెందెను. -76-80. ఆమెనే (గౌరినే) యంతట జూచుచుండెను. - ఆమెయందే మనము నెల్లపుడు లగ్నము జేయుచుండెను. ఆమెతోనే మాట్లాడుచుండెను. ఈ విధముగా: పిచ్చెత్తినవాడై-61. యామెనే యెదలో నింపుకొని, యామెనే చింతించుచు, తత్పరాయణుడై, ఆమె కథామృతముతోనే రేయింబవళ్లు గడపుచుండెను-82. ఆమె శీల వర్ణనమునందాసక్తి గలవాడై, ఆమె రూపమును జూడ నుత్సహీంచుచు, ఆమె సౌందర్య భోగ సంకల్పమనెడి మాలలను గూర్చువాడై, ... తన్మయుడై శివుడు మిక్కిలి తపించేను-83. ధూర్జటియైన శివుడు ఈ కామ జ్వరమును. చికిత్స జేయనలవికానీ దానిగా భావించి, గౌరీని వివాహము జేసికొనుటకే ప్రయత్న శీలియయ్యెను-84. లలితాదేవి యాజ్ఞచే నీవిధముగా శివుని విమోహింపజేసి తరువాత ఆ పార్వతీని గూడ మన్మథుడు తన బాణములకెరగావించెను -85. మీక్కుటమైన విరహజ్వాలలచే ఆమె శ్వాసాగ్నులు ఆమె పెదవుల వెండింపజేసి మలినము గావించుచున్నవి. చెక్కిళ్లు మిక్కిలి తెల్లబారినవి-86. ఆహారమునగాని, పాన్పునందుగాని, నీద్ర విషయమునగాని యభిలాషను గోల్పోయినది. వేలకొలది చెలికత్తెలు నిత్యము శీతలోపచారములు జేయుచున్నారు-87. కాని ఆమె మరల మరల తపించి మరల మరల వివశురాలగుచున్నది. మన్మథ మహాగ్నీ బాధశాంతినీ బొంద లేకున్నది-68. పార్వతీ విరహతాపమున నిద్రబోవుటలేదు. తన శరీరతాపముచే తండ్రికీ దుఃఖమును బెంచెను-89. పార్వతికి శివుని తోడి విరహము ప్రతీకారము చేయజాలనంతటి తీవ్రముగా నున్నది. అది తెలిసి హిమవంతుడు మిక్కిలి దుఃఖించెను-90. ఓ మంగళకరమైనదానా! ఆ దేవుడైన మహేశ్వరుని తపముతో సంతోష పెట్టి వివాహమగుము అని హిమవంతుడు ప్రేరేపించెను -91. ఆమె కూడ గౌరీ శిఖరమను హిమవత్పర్వత శిఖరమున పతిలాభమునకై దుష్కరమైన తపము జేసెను-92, శిశిరములలో జలములందుండి, గ్రీష్మమున అగ్నుల మధ్య నుండి సూర్యుని యందుచూపు నిలిపి ఘోరమైన తపము జేసెను-93, ఆ తపమునకు సంతసించి శివుడు ప్రసన్నుడయ్యెను. వైవాహిక విధానమున నామెను భార్యగా నంగీకరించేను-94. తరువాత ముందుగా సప్తరుల ద్వారా హిమవంతుని అడిగించి, ఆతనిచే యథావిధిగా నీయబడిన పార్వతిని శివుడు పెండ్లాడెను-45. ఆమెతో రమించుచు శివుడు మామగారి నగరమైన యోషధీ ప్రస్థమున చాలకాలముండెను-96. తరుపోత హిమవంతుడు సంతసించుచుండగా కైలాసమునకు సమస్త ప్రమథులతో వచ్చి పార్వతిని దీసికొనివచ్చెను-97. శివుడు కైలాసమున, మందరమున, వింధ్య పర్వతమున, హిమవత్పర్వతమున మలయపర్వతమున, పొరియాత్రికమున, నానా విధ రమ్య స్థానములలో గౌరీతో రమీంచుచు రతి- బొందెను, అప్పుడు శివుడుగ్రమైన వీర్యమును వదిలెను. దానిని పార్వతి ధరించుటకు అశక్తురాలై-69. భూమిపై వదలెను. ఆ భూమియు అగ్నియందును కృత్తికల యందును ఆ వీర్యమునుంచేను. ఆ కృత్తికలును గంగా జలమున దీరి, ఆ గంగయు రెల్లు గడ్డి యందు వదిలేను-100. అచట వీరుడు ఆు ముఖములు గలవాడునైన మహాసేనుడు (కుమారస్వామి) పుట్టెను. శివుడాతనిని గంగా సమీపమునకు దెచ్చి పెంపుజేసేను-101. ప్రతి దినమాతడు మిక్కిలి పరాక్రమవంతుడై పేరుగుచు తన తండ్రియైన శివుని వలన సమస్త విద్యలను బొందెను-1/2 తండ్రిచే ననుమతింపబడిన వాడై దేవ సేనకు పతియయి సమస్త దానవులతోబాటు తారకాసురుని జంపెను -108. తారకాసుర వధతో సంతసించిన యింద్రుడు కుమారస్వామికి దేవసేన నిచ్చి పెండ్లిజేసేను-104. ఆ యింద్రుని కూతురయిన దేవ సేనయను యశస్వినీ కుమారస్వామిని భర్తగా బొంది మిక్కిలి యానందము నందెను-105. ఈ విధముగా విశ్వచక్రము నెల్ల సంమోహింపజేసిన మన్మథుడు దేవి కార్యమును నరకాసుర వధతో సుసంపన్నము జేసి మరల శ్రీ పురమునకు వెళ్లాను-106. ఆ పుణ్య శ్రీపురమున లలితా పరమేశ్వరి జగము యొక్క సంపత్సమృద్ధికై యుండెను. మన్మథుడామెను సేవించుటకై అచటకి వెళ్లాను -107.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున ముప్పదియవయధ్యాయము.