29 - హోమధేనువు కొఱకు పోరాటము - జమదగ్ని చంపఁబడెను హోమధేనువ దృశ్యమయ్యెను

వసిష్ఠ ఉవాచ :-

జమదగ్నిస్తతో భూయస్తమువాచ రుషాన్వితః

  బ్రహ్మస్వం నాపహర్తవ్యం పురుషేణ విజనలో

 ప్రసహ్య గాం మే హరతో పాపమాప్స్యపీ దుర్మతే

 ఆయుర్జానే పరిక్షీణం న చేదేతత్కరిష్యసి

 బలాదిచ్ఛసి యన్నేతుం తన్నశక్యం కథంచన

 స్వయం వా యది సా యుజ్యేద్విన శిష్యతి పార్ధివః

 దానం వినాపహరణం బ్రాహ్మణానాం తపస్వినామ్

 శతాయుషోఽర్జునాదన్యః కోన్విచ్ఛతి జిజీవిషుః

 ఇత్యుక్తస్తేన సంక్రుద్దః స మంత్రి కాలచోదితః

 బద్ద్వా తాం గాం దృడైః పాశైర్విచకర్ష బలాన్వితః

 జమదగ్ని రథ క్రోధాద్భావికర్మప్రచోదితః

 రురోధ తం యథాశక్తి వికర్షంతం పయస్వినీమ్

 జీవన్న ప్రతిమోక్ష్యామి గామేనామిత్యమర్షితః

జగ్రాహ సుదృఢం కంఠే బాహుభ్యాం తోం మహామునిః

 తతః క్రోధపరీతాత్మా చంద్రగుప్తోఽతినిర్ఘృణః

ఉత్సారయధ్వమిత్యేనమాదిదేశ స్వసైనికాన్

 అప్రధృష్యతమం లోకే తమృషిం రాజకింకరాః

భర్త్రాజ్ఞయా ప్రసహ్యైనం పరివవ్రుః సమంతతః

 దండైః కశాభిర్లగుడైర్వినీఘ్నంతశ్చ ముష్టిభిః

 తే సముత్సరయన్ ధేనోః సుదూరతరమంతీకాత్

 స తథా హన్యమానోఽపి వ్యధితః క్షమయాన్వితః

 న చుక్రోథాక్రోధనత్వం సతో హి పరమం ధనమ్

 స చ శక్తః స్వతపసా సంహర్తుమపి రక్షితుమ్

జగత్సర్వం క్షయం తస్య చింతయన్న ప్రచుక్రుధే

 స పూర్వం క్రోధనోఽత్యర్థం మాతురర్థే ప్రసాదితః

 రామేణాభూత్తతో నిత్యం శాంత ఏవ మహాతపాః

వసిష్ఠుడు చెప్పెను.

మంత్రియైన చంద్రగుప్తునితో క్రోధోదగ్రుఁడయి జమదగ్ని మరల పలికెను. “బ్రాహ్మణస్వము బుద్ధిమంతుఁడైన వానిచే నపహరింపం ఐడరాదు. ఓ దురాత్మా ! బలాత్కారముగా నా గోవును తీసికొని పోవుటచే పాపము నొందుదువు. నీకు జీవిత సమాప్తి వచ్చినదని తలంతును. కానిచో నీ పని నీవు చేయవు, చెప్పుచుంటిని. ఆలకించుము, బలాత్కారముగా గోవును తీసికొని పోవనెంచినచో ఎన్నడును అయ్యదీ నీకు శక్యము కాదు. ఒకవేళ ఆ ధేనువే స్వయముగా వచ్చి కలిసినచో రాజు నశించును. దానమిచ్చుటకు బదులుగా తపస్వులయిన బ్రాహ్మణుల ధనము యొక్క అపహరణమున శతవర్షములు, జీవింపఁదలంచిన వాఁడెవఁడు, అర్జునుఁడు దక్క కోరును? ఈ విధముగా పలుకబడి, మరణ కాలమాసన్నమయి కాలచోదితుఁడయిన ఆ మంత్రి సంక్రుద్దుఁడయి, ఆ ధేనువును దృఢమయిన పాశములచే బంధించి బలాన్వితుఁడై లాగెను. భవిష్యత్కర్మ ప్రచోదితుఁడయి జమదగ్ని క్రోధావిష్ణుఁడయి ధేనువును పట్టి కట్టి లాగుచున్న మంత్రిని అడ్డగించెను. కంఠములో ప్రాణముండగా నీ ధేనువును విడువను అని కోపముతో జమదగ్ని మహాముని ఆ ఆవును కంఠమునందు బాహులతో గట్టిగా పట్టుకొనెను. అంత చంద్రగుప్తుం డు క్రోథావిష్ణుఁడయ్యెను. ఆతఁడు సహజముగా అతిక్రూరుఁడు. దయారహితుఁడు. తన సైనికులకు “ఆతనిని గెంటివేయుఁడని ఆజ్ఞాపించెను. రాజాజ్ఞచే రాజకింకరులు ఋషి అప్రధృష్య శరీరుఁడయినను (ప్రపంచమున నెవ్వరిచే జయింపబడని శరీరము కలవాడయినను) ఆతని చుట్టును అంతటను చుట్టిముట్టి బలాత్కారముగా భాగిరి. వారా మునీని దండములతో మాదిరి. కశలతో (కంచీకర్రలతో) బాదిరి, కత్తులతో కొట్టిరీ, పీడికిలి పోటులతో పొడిచిరి. అంతియేకాక ఆ మునీంద్రుని ధేనువు దగ్గర నుండి దూరముగా లాగుకొని పోయిరి. ఆ ముని తద్విధముగా కొట్టబడినను, ఎక్కువగా వ్యధితుఁడయినను, క్రోధోదగ్రుఁడు కాలేదు. క్షమాన్వితుఁడై యుండి పోయెను. క్రోధమునకు తావీయ కుండుటయే కదా మహామునుల పరమధనము. ఆతఁడో తన తపశ్శక్తిచే ప్రపంచము నంతటినీ రక్షించుటకు కానీ సంహరించుటకుకానీ సమర్థుఁడు. ఆతఁడు తన తపోనాశనమును నెంచుకొనీ యట్టిపనీ చేయలేదు. పూర్వము జమదగ్ని అత్యంత క్రోధనుఁడు. కాని తన తల్లి కొఱకు రాముడోతనిని ప్రసాదితుని చేసెను. అందుచే ఆ మహాతపస్వి శాంతి మంతుఁడయ్యెను.

స హన్యమానః సుభృశం చూర్ణితాంగాస్థిబంధనః

నిపపాత మహాతేజా ధరణ్యాం గతచేతనః

 తస్మిన్మునౌ నిపతితే స దురాత్మా విశంకితః

 కింకరానాదీశచ్ఛీఘ్రం ధేనోరానయనే బలాత్

 తతః సవత్సాం తాం ధేనుం బద్ధ్వా పాశైర్దృడైరృప

 కశాభిరభిహన్యంత చక్రుషుశ్చ నినీషయా

 ఆకృష్యమాణా బహుభిః కశాభిర్లగుడైరపి

 హన్యమానా భృశం తైశ్చ శుక్రుదే చ పయస్వినీ

 వ్యధితాతికశాపాతైః క్రోధేన మహతాన్వితా

ఆకృష్య పాశాన్ సుదృడాన్ కృత్వాఽత్మానమమోచయత్

 విముక్తపాశబంధా సా సర్వతోఽభివృతా బలైః

హుంహారవం ప్రకుర్వాణా సర్వతోఽహ్యపతద్రుషా

 విషాణఖురపుచ్ఛాగ్రైరభిహత్య సమంతతః

 రాజమంత్రిబలం సర్వం వ్యద్రావయదమర్షితా

 విద్రావ్య కింకరాన్సర్వాంస్తరసైవ పయస్వినీ

పశ్యతాం సర్వభూతానాం గగనం ప్రత్యపద్యత

 తతస్తే భగ్నసంకల్పా సంభగ్నక్షతవిగ్రహాః

 ప్రసహ్య బద్ధ్వా తద్వత్సం జగ్మురేవాతినిర్ఘృణాః

 పయస్వినీం వినావత్సం గృహీత్వా కింకరైస్సహ

సపాపస్తరసా రాజ్ఞః సన్నిధిం సముపాగమత్

 గత్వా సమీపం నృపతేః ప్రణమ్యాస్మై ప్రశంసకృత్

 తద్వృత్తాంతమశేషేణ వ్యాచచక్షే ససాధ్వసః

 ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

అర్జునోపాఖ్యానే ఏకోన త్రింశత్తమోఽధ్యాయః

శరీరమంతయు ఎముకలతో చూర్ణీతమగునట్లు అత్యధికముగా కొట్టఁబడి మహాతేజస్వియయిన జమదగ్ని అచేతనుఁడై భూమిపై పడెను. ఆ ముని నేల కొరగగా శంకారహితుఁడై ఆ చంద్రగుప్త దురాత్ముఁడు “బలాత్కారముగా ధేనువును తీసికొని రండు” అని సైనికుల కాజ్ఞాపించెను, అంత వారు పాశములతో దూడతో కూడ ధేనువును దృఢముగా బంధించిరి. కంచీ కర్రలతో కొట్టిరి. 'దానిని తీసికొని పోవందలంచి లాగుకొని చనిరి. చాలమందిచే బలాత్కారముగా నీడ్వబడి కశాదుల లగుడములచే కొట్టంబడి ఆ ధేనువు కోపోద్రిక్తయయ్యెను. కశాఘాతములచే వ్యధనొంది అత్యధిక కోపముతో గూడి ఆకర్చించు త్రాళ్లను తెంచుకొని తన్ను తావిమోచన మొందెను. ఆ ధేనువు విముక్త పాశములు గలదైనదీ, దానీని రాజసైనిక బలములు సర్వత్ర చుట్టుముట్టిరి. అంత ధేనువు 'హుంహారవము' చేయుచు, కోపముతో, వారందరిపై పడెను. కొమ్ములతో, తోకతో, డెక్కల చిగుళ్లతో. పొడవబడి, కొట్టబడి, పిప్పిగా తొక్కబడి రాజసైన్యమంతయు పలాయన మంత్రము పఠించెను, ఆ ధేనువు వెంటనే సైనికుల నెల్లరను పరుగిడఁజేసి, అందరు అన్ని భూతములు కండ్లప్పగించి చూచుచుండగనే ఆకాశమున కెగసెను. అంత భగ్న సంకల్పులు, గాయముతో పుండ్లు పడిన శరీరములు గలవారయిన సైనికులు దయాశూన్యులై బలాత్కారముగా వత్సమును బంధించుకొని వెళ్లిరి. హోమధేనువు లేకుండగా వత్సము నొక్కదానినే తీసికొని పాపియైన (చంద్రగుప్త) మంత్రి తన సైన్యముతో త్వరగా రాజసన్నిధికి వచ్చేను. రాజు దగ్గరకు వెళ్లి ఆతనికి నమస్కరించి, జరిగినదంతయు మంత్రి భయముతో విన్నవించెను.

ఇది వాయుప్రొక్తమైన బ్రహ్మాండపురాణములతో మధ్యమభాగమున తృతీయోపాద్ఘాతమున అర్జునోపాఖ్యానము నంధు ఇరువధి తొమ్మిదవ అధ్యాయము.