21 - భండాసురాహంకారో

ఆకర్ణ్య లలితాదేవ్యా యాత్రానిగమనిస్వనమ్

 మహాంతం క్షోభమాయాతా భండాసురపురాలయాః

 యత్ర చాస్తి దురాశస్య భండదైత్యస్య దుర్ధియః

 మహేంద్రపర్వతోపాంతే మహార్ణవతటే పురమ్

తత్తు శూన్యకనామ్నైవ విఖ్యాతం భువనత్రయే

 విషంగాగ్రజదైత్యస్య సదావాసః కిలాభవత్

 తస్మిన్నేవ పురే తస్య శతయోజనవిస్తరే

 విత్రేసురసురాః సర్వే శ్రీదేవ్యాగమసంభ్రమాత్

 శతయోజనవిస్తీర్ణం తత్సర్వం పురమాసురమ్

ధూమైరివావృతమభూదుత్పాతజనీతైర్ముహుః

 అకాల ఏవ నిర్భిన్నా భిత్తయో దైత్యపత్తనే

ఘూర్జమానాః పతంతి స్మ మహోల్కా గగనస్థలాత్

 ఉత్పాతానాం ప్రాథమికో భూకంపః పర్యవర్తత

మహీ జజ్వాల సకలా తత్ర శూన్యకపత్రనే

 అకాల ఏవ హృత్కంపం భేజుర్థైత్యపురౌకసః

 ధ్వజాగ్రవర్తినః కంకగృద్ధ్రాశ్చైవ బకాః ఖగాః

 ఆదిత్య మండలే దృష్ట్వా దృష్ట్వా చక్రం దురుచ్చకైః

 క్రహ్యాదా బహవస్తత్ర లోచనైర్నావలోకితాః

 ముహురాకాశ వాణీభిః పరుషాభిర్భభాషిరే

 సర్వతో దిక్షు దృశ్యంతే కేతవస్తు మలీమసాః

 ధూమాయమానాః ప్రక్షోభజనకా దైత్యరక్షసామ్

 దైత్యస్త్రీణాం చ వీభ్రష్టా అకాలే భూషణ స్రజః

 హాహేతి దూరం క్రందంత్యః పర్యశ్రు సమరోదిషు

 దర్పణానాం వర్మణాం చ ధ్వజానాం ఖడ్గసంపదామ్

 మణీనామంబరాణాం చ మాలిన్యమభవన్ముహః

 సౌధేషు చంద్రశాలాసు కేలివేశ్మసు సర్వతః

 అట్టాలకేషు గోష్ఠేషు విపణేషు సభాసు చ

 చతుష్మికాస్వలిందేషు ప్రగ్రీవేషు వలేషు చ

 సర్వతోభద్రవాసేషు నంద్యావరేషు వేశ్మసు

 విచ్ఛందకేషు సంక్షుబ్ధేష్వవరోధనపాలిషు

 స్వస్తికేషు చ సర్వేషు గర్భాగారపుటేషు చ

గోపురేషు కపాటేషు వలభీనాం చ సీమసు

 వాతాయనేషు కక్ష్యాసు ధిష్ణ్యేషు చ ఖలేషు చ

సర్వత్ర దైత్య నగరవాసీభిర్జనమండలైః

 అశ్రూయంత మహాఘోషాః పరుషా భూతభాషితాః

 శిథిలీ సవతో జాతా ఘోరపర్ణా భయానకా

 కరటైః కటుకాలాపైరవలోకి దివాకరః

ఆరావిషు కరోటీనాం కోటయశ్చాపతన్ భువి

అపతన్ వేదిమధ్యేషు బిందవః శోణితాంభసామ్

 కేశౌఘకాశ్చ నిషేతుః సర్వతో ధూమధూసరాః

 భౌమాంతరిక్షదీవ్యానాముత్పాతానామితి ప్రజమ్

 అవలోక్య భృశం ప్రస్తాః సర్వే నగరవాసినః

 నివేదయామాసురమా భండాయ ప్రధితౌజసే

 సచ భండః ప్రచంఢోత్ధైస్తైరుత్పాతకదంబకైః

 అసంజాతధృతిభ్రంశో మంత్రస్థానముపాగమత్

 మేరోరివ వపుర్భేదం బహురత్నవిచిత్రీతమ్

 అధ్యాసామాస దైత్యేంద్రః సింహాసనమనుత్తమమ్

స్ఫురన్ముకుటలగ్నానాం రత్నానాం కిరణైర్ఘనైః

 దీపయన్నిఖలాశాన్తానద్యుతద్దానవేశ్వరః

ఏకయోజనవిస్తారే మహత్యాస్థానమండపే

 తుంగసింహాసనస్థం తం సిషేవాతే తదానుజౌ

 విశుక్రశ్చ విషంగశ్చ మహాబలపరాక్రమౌ

 త్రైలోక్యకంటకీభూతభుజదండభయంకరౌ

అగ్రజస్య సదైవాజ్ఞామవిలంఘ్య ముహుర్ముహుః

 త్రైలోక్యవిజయే లబ్ధం వర్గయంతౌ మహద్యశః

 సతేన శిరసా తస్య మృద్నంతౌ పాదపీఠికామ్

కృతాంజలిప్రణామౌ చ సముపావిశతాం భువి

 అథాస్థానే స్థితే తస్మిన్నమరద్వేషిణాం వరే

 సర్వే సామంతదైత్యేంద్రాస్తం ద్రష్టుం సముపాగతాః

 తేషామేకైక సైన్యానాం గణనా నహీ విద్యతే

 స్వం స్వం నామ సముచ్చేర్య ప్రణేముర్భండకేశ్వరమ్

 స చ తానసురాన్ సర్వానతిధీరకనీనకైః

 సంభావయన్ సమాలోకైః కియంతంచిత్క్షణం స్థితః

 అవోచత విశుక్రస్తమగ్రజం దానవేశ్వరమ్

 మథ్యమానమహాసింధుసమానార్గలనిస్వనః

దేవ త్వదీయదోర్దండవిధ్వస్తబలవిక్రమాః

 పాపినః పామరాచారా దురాత్మానః సురాధమాః

శరణ్యమన్యతః క్వాపి నాప్నువంతో విషాదిన:

 జ్వలజ్జ్వలాకులేవహ్నౌ పతిత్వా నాశమాగతాః

తస్మాద్దేవాత్సముత్పన్నా కాచిత్ స్త్రీ బలగర్వతా

 స్వయమేవ కిలాస్రాక్షుస్తాం దేవా పాసవాదయః

తైః పునః ప్రబలోత్సాహైః ప్రొత్సాహితపరాక్రమాః

 బహుస్త్రీపరివారాశ్చ వివిధాయుధమండితాః

 అస్మాన్ జేతుం కిలాయాంతీ హా కష్టం విధ్వైశసమ్

 అబలానాం సమూహశ్చేద్బలినోఽస్మాన్విజేష్యతే

 తర్షి పల్లవభంగేన పాషాణస్య విదారణమ్

 ఊహ్యమానమిదం పంతుం పరిహాసాయ కల్ప్యతే

విడంబనా న కిమసౌ లజ్జాకరమిదం న కిమ్

 అస్మత్సైనికనాసీరభటేభ్యోఽపి భవేద్బయమ్

కాతరత్వం సమాపన్నాః శక్రాద్యాస్త్రిదివౌకసః

బ్రహ్మాదయశ్చ నిర్విణ్ణవిగ్రహా మద్యలాయుధైః

 విష్ణోశ్చ కా కథైవాస్తే విత్రస్తః స మహేశ్వరః

 అన్యేషామిహ కా వార్తా దిక్పాలాస్తే పలాయితాః

అస్మాక మిషుభిస్తీక్షైరదృశ్యైరంగతిభిః

 సర్వత్ర విద్ధవర్మాణో దుర్మదా విబుధాః కృతాః

 తాదృశానామపి మహా పరాక్రమభుజోష్మణామ్

 అస్మాకం విజయాయాద్య స్త్రీ కాచిదభిధావతి

యద్యపి స్త్రీ తథాప్యేషా నావమాన్యా కదాచన

అల్పోఽపి రిపురాత్మజ్ఞైర్నావమాన్యో జిగీషుభిః

తస్మాత్తదుత్సారణార్థం ప్రేషణీయాస్తు కింకరాః

 సచగ్రహమాకృష్య సా నేతవ్యా మదోద్దతా

దేవ త్వదీయశుద్ధాంతర్వర్తినీనాం మృగీదృశామ్

చిరేణ చేటికాభావం సా దుష్టా సంశ్రయిష్యతి

ఏకైకస్మాద్భటాదస్మాత్సైవ్యేషు పరిపంథనః

 శంకతే ఖలు విత్రస్తం త్రైలోక్యం సచరాచరమ్

 అన్యద్దేవస్య చిత్తం తు ప్రమాణమితి దానవ

నివేద్య భండదైత్యస్య క్రోధం తస్య వ్యవీవృధతీ

 విషడ్గస్తు మహాసత్త్వో విచారజ్ఞో విచక్షణ

 ఇదమాహ మహాదైత్యమగ్రజన్మానముద్ధతమ్

 దేవ త్వమేవ జోనాసి సర్వం కార్యమరిందమ

 న తు తే క్వాపి వక్తవ్యం నీతివర్త్మనీ వర్తతే

సర్వం విచార్య కర్తవ్యం విచారః పరమా గతిః

 అవిచారేణ చేత్కర్మ సమూలమవక్కంతతి

పరస్య కటకే చారాః ప్రేషణీయాః ప్రయత్నతః

తేషాం బలాబలం జ్ఞేయం జయసంసిద్ధమిచ్ఛతా

 చారచక్షుర్దృడప్రజ్ఞః సదా శంకితమానసః

 అశంకితాకారవాంశ్చ గుప్తమంత్రః స్వమంత్రిషు

 షడుపాయాన్ ప్రయుంజానః సర్వత్రాభ్యర్దితే పదే

 విజయం లభతే రాజా జాల్మో మంక్షు వినశ్యతి

అవిమృశ్యైవ యః కశ్చిదారంభః స వినాశకృత్

విమృశ్య తు కృతం కర్మ విశేషాజ్జయదాయకమ్

 తిర్యగీత్యపి నారీతి క్షుద్రా చేత్యపీ రాజభిః

 నావజ్ఞా వైరీణాం కార్యా శక్తేః సర్వత్ర సంభవః

స్తంభోత్పన్నేన కేనాపి నరతిర్యగ్వపుర్భృతా

 భూతేన సర్వభూతానాం హిరణ్యకశిపుర్హతః

పురా హి చండికా నామ నారీ మాయా విజృంభిణీ

 నిశుంభశుంభౌ మహిషం వ్యాపాదితవతీ రణే

 తత్ప్రసంగేన బహవస్తయా దైత్యా వినాశితాః

 అతో వదామి నావజ్జా స్త్రీమాత్రే క్రీయతాం క్వచిత్

శక్తిరేవ హి సర్వత్ర కారణం విజయశ్రియః

 శక్తేరాధారతాం ప్రాప్తైః స్త్రీపుంలింగైర్న నో భయమ్

 శక్తిస్తు సర్వతో భాతి సంసారస్య స్వభావతః

తర్హి తస్యా దురాశాయాః ప్రవృత్తి ర్జ్ఞాయతాం త్వయా

 కేయం కస్మాత్సముత్పన్నా కిమాచారా కిమాశ్రయా

 కింబలా కీంసహాయా వా దేవ తత్ప్రవీచార్యతామ్

ఇత్యుక్తః స విషంగేణ కో విచారో మహౌజసామ్

 అస్మద్బలే మహాసత్త్వ అక్షౌహిణ్యధిపాః శతమ్

 పాతుం క్షమాస్తే జలధీనలం దగ్ధుం త్రివిష్టపమ్

 అరే పాపసమాచార కింవృధా శంకసే స్త్రియః

 తత్సర్వం హి మయా పూర్వం చారద్వారావలోకితమ్

 అగ్రే సముదితా కాచిల్లలితా నామధారిణీ

 యథార్థనామవత్యేషా పుష్పవత్పేశలాకృతిః

 న సత్త్వం నచ వీర్యం వాన సంగ్రామేషు వా గతిః

 సా చావిచారనివహా కింతు మాయాపరాయణా

 తత్సత్త్వేనావిద్యమానం స్త్రీకదంబకమాత్మనః

 ఉత్పాదితవతీ కిం తే న చైవం తు విచేష్టతే

 అథ వా భవదుక్తేన న్యాయేనాస్తు మహద్బలమ్

త్రైలోక్యోల్లంఘిమహిమా భండః కేన విజీయతే

 ఇదానీమపి మద్బాహుబలసంమర్దమూర్ఛితాః

 శ్వసితుం చాపి పటవో న కదాచన నాకినః

 కేచీత్పాతాలగర్భేషు కేచిదంబుధివారిషు

 కేచిద్దిగంతకోణేషు కేచీత్కుండేషు భూభృతామ్

విలీనా భృశవిత్రస్తాస్త్యక్తదారసుతశ్రియః

 భ్రష్టాధికారాః పశవశ్చన్నవేషాశ్చరంతి తే

 ఏతాదృశం న జానాతి మమ బాహుపరాక్రమమ్

 అబలా న చీరోత్పన్నా తేనైషా దర్పమశ్నుతే

 న జానంతి స్త్రియో మూఢా వృధా కల్పితసాహసాః

 వినాశమనుధావంతీ కార్యాకర్యవిమోహితాః

 అథవా తాం పురస్కృత్య యద్యాగచ్ఛంతి నాకినః

 యథా మహోరగాః సిద్ధాః సాధ్యా వా యుద్ధదుర్మదాః

 బ్రహ్మా వా పద్మనాభో వా రుద్రో వాపి సురాధిపః

 అన్యే వా హరితాం నాథాస్తాన్ సంపేష్టుమహం పటుః

 అథ వా మమ సేనాసు సేనాన్యో రణదుర్మదాః

 పక్వకర్కరికాపేషమవపేక్ష్యంతీ వైరీణః

 కుటిలాక్షః కురండశ్చ కరంకః కులవాశితః

 వజ్రదంతో వజ్రముఖో వజ్రలోమా బలాహకః

సూచీముఖః ఫలముభో వికటో వికటాననః

కరాలాక్షః కర్కటకో మదనో దీర్ఘజిహ్వకః

హుంబకో హలముల్లంచః కర్కశః కల్కివాహనః

 పుల్కసః పుండ్రకేతుశ్చ చండబాహుశ్చ కుక్కురః

 జంబుకాక్షో జృంభణశ్చ తీక్షశృంగప్తికంటకః

 చతుర్గుప్తశ్చతుర్బాహుశ్చకారాక్షశ్చతుఃశిరాః

వజ్రఘోషశ్చోర్ధ్వ కేశో మహామాయా మహాహనుః

 మఖశత్రుర్మఖాస్కందీ సింహఘోషః శిరాలకః

 అంధకః సింధునేత్రశ్చ కూపకః కూపలోచనః

 గుహాక్షో గండగల్లశ్చ చండధర్మో యమాంతకః

 లడునః పట్టసేనశ్చ పురజిత్పూర్వమారకః

 స్వర్గశత్రుః స్వర్గబలోదుర్గాఖ్యః స్వర్గకంటకః

 అతిమాయో బృహన్మాయ ఉపమాయ ఉలూకజిత్

 పురుషేజో విషేణశ్చ కుంతిషేణః పరూషకః

మలకశ్చ కశూరశ్చ మంగలో ద్రఘణస్తథా

 కోల్లటః కుజిలాశ్వశ్చ దోసేరో బభ్రువాహనః

దృష్టహాసో దృష్టకేతుః పరిక్షేప్తాపకంచుకః

 మహామహో మహాదంష్ట్రో దుర్గతిః స్వర్గమేజయః

 షట్కేతుః షడ్వసుశ్చైవ షడ్గంతః షట్ప్రియస్తథా

 దుఃశఠో దుర్వినీతశ్చ ఛిన్నకర్ణశ్చ మూషకః

అట్టహాసీ మహాశీ చ మహాశీర్షో మహోత్కటః

 కుంభోత్కచః కుంభనాసః కుంభగ్రీవో ఘటోదరః

 అశ్వమేడ్రో మహాండశ్చ కుంభాండః పూతినాసికః పూతిదంతః పూతిచక్షుః

పూత్యాస్యః పూతిమేహనః

ఇత్యేవమాదయః శూరా హిరణ్యకశిపోః సమాః

 హిరణ్యాక్షసమాశ్చైవ మమ పుత్రా మహాబలాః

ఏకైకస్య సుతస్తేషు జాతాః శూరాః పరఃశతమ్

 సేనాన్యో మే మదోద్ద్వత్తా మమపుత్రైరనుద్రుతాః

నాశయిష్యంతి సమరే ప్రోద్ధతానమరాధమాన్

 యే కేచిత్కుపితా యుద్ధే సహస్రాక్షౌహిణీవరాః

 భస్మశేషా భవేయుస్తే హాహంత కిముతాబలా

 మాయావిలాసాః సర్వేఽపి తస్యాః సమరసీమని

 మహామాయావినోదాశ్చ కుప్యుస్తే భస్మ సాద్బలమ్

తద్వృథా శంకయా భిన్నం మా తే భవతు మానసమ్

 ఇత్యుక్త్వా భండదైత్యేంద్రః సముత్థాయ నృపాసనాత్

 ఉవాచ నిజసేనాన్యం కుటిలాక్షం మహాబలమ్

 ఉత్తిష్ఠ రే బలం సర్వం సంనాహయ సమంతతః

 శూన్యకస్య సమంతాచ్చ ద్వారేషు బలిమర్పయ

 దుర్గాణి సంగృహాణ త్వం కురు క్షేపణికాశతమ్

దుష్టాభిచారాః కర్తవ్యా మంత్రిభిశ్చ పురోహితైః

 సజ్జీకురు త్వం శస్త్రాణి యుద్ధమేతదుపస్థితమ్

 సేనాపతిష యం కేచిదగ్రే ప్రస్థాపయాథునా

 అనేకబలసంఘాతసహితం హోరదర్శనమ్

 తేన సంగ్రామసమయే సన్నిపత్య వినిర్జితమ్

 కేశేష్వాకృష్య తాం మూడాం దేవసత్త్వేన దర్పితామ్

 ఇత్యాభాష్య చమూనాథం సహస్రత్రితయాధిపమ్

 కుటీలాక్షం మహాసత్త్వo స్వయం సొంతః పురం యయా

అథాపతన్త్యాః శ్రీదేవ్యా యాత్రానిఃసాణనిః స్వనాః

 అశ్రూయంత చ దైత్యేంద్రైరతికర్ణజ్వరావహాః

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానో భండాసురాహంకారో నామైకవింశోఽధ్యాయః 

శ్రీబ్రహ్మాండపురాణమున సుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున భండాసురాహంకారమను నిరువదియొకటవ యధ్యాయము.

శ్రీ లలితాదేవి యొక్క దండయాత్రా ధ్వనిని విని భండాసురపుర నివాసులు గొప్ప క్షోభమును బొందిరి-1. దురాశగలవాడు, దుర్బుద్ధియునైన భండాసురుని పురము మహేంద్ర పర్వత సమీపమున మహా సముద్రపుటొడ్డునగలదు-2. అది శూన్యకమనుపేర ముల్లోకముల బ్రసిద్ధము. విషంగునియన్న భండాసురుని కది నిత్యావాసమయ్యెను-3. నూరు యోజనముల విస్తారముగల యాపురమునందు శ్రీదేవి వచ్చునేమోయని సంభ్రాతిచే రాక్షసులందరు భయముజెందిరి-4. నూరు యోజనముల విశాలమైన యారాక్షసు లందరు భయము జెందిరి-4. నూరు యోజనముల విశాలమైన యా రాక్షస పురమంతయు ఉత్పాత సూచకముగా నేర్పడిన పొగలచే మాటిమాటికీ గప్పబడినట్లయ్యెను-5. ఆ రాక్షస పట్టణమున గోడలు అకాలముననే బీటలు వారి తీరిగినవి. ఆకాశము నుండి మహోల్కలు తీరుగుచు తిరుగుచుపడుచున్నవి-6. ఉత్పాతములలో మొదటిదైన భూకంపము జరిగినది. ఆ శూన్యకపత్తనమున భూమియంతయు మండిపోయినది-7. రాక్షసపురనివాసులకు ఆకాలముననే గుండెలదరినవి. ధ్వజాగ్ర (జెండా చీవర)మున గూర్చున్నవై రాబందులు, గద్దలు, కొంగలు, తక్కిన పక్షులును-8. సూర్యమండలమును జూచి జూచీ బిగ్గరగా నణచినవి. ఆపురమున మాంసభక్షములు కన్నులకు గనబడకుండగనే-9. పరుషములైన యాకాశవాణులతో మాటిమాటికి మాట్లాడినవి. అన్నీ దీక్కులయందును ధ్వజములు (జెండాలు) మాసిపోయినవిగా గనబడుచున్నవి-10. అవి పొగచూరినట్లు గనబడి దైత్య రాక్షసులకు క్షోభను గలిగించినవి. అకాలములోనే రాక్షస స్త్రీలయలంకారమాలలు జారిపడిపోయినవి-11. వారు బిగ్గరగా హాహాయనుచు కన్నీటితో నేడ్చిరి. అద్దములు, కవచములు, ధ్వజములు, ఖడ్గములు, సంపదలు-12. మణులు, వస్త్రములును మాటి మాటికి మలినముగాజొచ్చినవి. మేడలలో, వానిపైభాగములలో, క్రీడాభవనములలో-13. కోటబురుజులలో, పశువులకొట్టములలో, అంగళ్లలో, సభలలో, కోనేళ్లలో, తలవాకిట ప్రక్కనుండు గదులలో, ప్రోసోదపు. కిటికీలలో, సైన్యములలో-14. అన్ని దిక్కుల భద్రతగలిగిన నీవాసములలో, పడమటదప్ప తక్కిన మూడు దిక్కుల రాజగృహములలో, విచ్చందకములలో, సంక్షోభము జెందిన యంతఃపురపంక్తులలో, తూర్పు వాకిలిగల రాజ గృహములలో, అన్ని యంతర్బవనములలో-13. గోపురములలో, తలుపులలో, కౌగలలో, కిటికీలలో, కక్షలలో గదులలో) నివాసములలో, కళ్లములలో-16 అంతటను నగరవాసులైన జన సమూహములు గొప్ప ధ్వనులు గలిగిన పరుషములైన భూతముల దయ్యముల) మాటలను వినిరి-17. అంతటను బయలుదేరిన పచ్చని చెదలు భయంకర పర్ణములతో మిక్కిలి భయానకముగానున్నది. కాకులు అసహ్యమైన యరపులతో సూర్యుని జూచుచున్నవి. భూమీయందు కోట్ల కొలదిపుత్థాలు మహాధ్వనులతో పడుచున్నవీ-18. యజ్ఞములకై పరిష్కృతములైన వేదులలో రక్తజల బిందువులు పడుచున్నవి. అంతటను. పొగచూరిన వెంట్రుకల సమూహములు గూడపడినవి-19. ఇవి భౌమ (భూమికి సంబంధించిన) అంతరిక్ష (ఆకాశమునకు సంబంధించిన) ద్యవ్య (ద్యు లోకమునకు సంబంధించినవియునైన) ఉత్పాతముల సమూహములని, వానిని చూచి నగర వాసులందరు మిక్కిలి బాధనొందిరి. వీరు ప్రసిద్ధ వీరుడైన భండాసురునకు ఆయుత్పాతములన్నియు దేలిపిరి. -20. ఆ భండాసురుడును తీవ్రముగా బయటపడిన యాయుత్పాతసమూహములతో ధైర్యమును గోల్పోలేదు. మంత్ర స్థానమునకు (రాజ్య వీచారముజేయు స్థానమునకు) వచ్చేను-21. భండాసురుడు తన సింహాసనమున గూర్చుండెను. అది బహురత్నములు పొదిగిన సువర్ణమయము. అచటచట మారురూపము చెందిన మేరు పర్వతమా యన్నట్లున్నది. అంతకన్న గొప్పదైన సింహాసనము మరొకటిలేదు-22. తన కిరీటముననున్న దట్టమైన రత్నకిరణములచే దిక్కులనన్నింటిని వెలిగించుచున్న వాని వలె భండాసురుడు ప్రకాశించేను-23. ఆయాస్థానమండపము ఒక యోజన వైశాల్యము గలది. అందు సింహాసనముననున్న భండాసురుని అతని సోదరులు సేవించిరి-24. వారు విశుక్రుడు విషంగుడు అనువారు. మహా బలపరాక్రమవంతులు. వారి భుజదండములు ముల్లోకములకు మిక్కిలి భయంకరములైన ముండైనవి. -25. వారు అన్నగారియాజ్ఞలను ఏ మాత్రము జవదాటక పాలించుచు త్రైలోక్య విజయమున బొందిన మహాకీర్తి నెల్లప్పుడు వర్ధిల్ల జేయుచుండిరి-26. వారు తమ శిరస్సులను అన్నగారీ పాదపీఠమును దాకించి చేతులు జోడించి భూమీ మీద గూర్చుండీరీ-27. దేవశత్రుశ్రేష్ఠుడైన భండాసురుడాస్థానమునకనుండగా సమస్త సామంత రాక్షసరాజులు ఆతని జూచుటకు వచ్చిరి-28. వారి యొక్కొక సైన్యములకు లెక్కలేదు. వారు తమ తమ నామముల జెప్పుచు భండాసురనకు నమస్కరించిరి-29. భండాసురుడు వారిని తన ధీరమైన కనుచూపులతో పరీక్షించి సంభావించెను. అట్లే కొంతక్షణముండెను-30. ఇంతలో తమ్ముడైన విశుక్రుడు మథింపబడుచున్న సముద్రము వంటి ధ్వనితో అన్నయగు రాక్షసరాజుతో నిట్లనెను-31. దేవా! నీ భుజదండములచే, పాపులు, పామరాచారులు, దురాత్ములు నీచులునైన దేవతలయొక్క బలపరాక్రములు ధ్వంసము చేయబడినవి-32. రక్షణ యెక్కడను లభింపక దుఃఖితులైరి. మండుచున్న జ్వాలలచే వ్యాకులముగానున్న యగ్నియందు బడి నశించిపోయిరి-33. ఆ దేవుని (అగ్ని దేవుని) నుండి ఒకానొక స్త్రీ జనించి బలగర్వితయైనది. ఆమెను ఇంద్రాది దేవతలు స్వయముగా సృజించిరట. ప్రబలమైన యుత్సాహముగల యా దేవతలచేతనే ప్రోత్సహింపబడిన పరాక్రమములుగల బహు స్త్రీ పరివారములు గూడ సృజింపబడినవి. అవి వివిధాయుధములచే నలంకరింపబడినవి-35. వారు మనను జయించుటకు వచ్చుచున్నారట. అబలలగు స్త్రీల సమూహము బలవంతులమగు మనలను జయింపగలుగుటయా! హా! ఎంత కష్టము? వీధి యొక్క క్రౌర్యము!-36. అట్లినచో, చిగురాకుతో బండను బద్దలు గొట్టుటయే. ఇది యూహించుట పరిహాసమే యగును. మనసేనా ముఖముననుండు వీరభటులకు గూడ భయము గలుగుననుట వెక్కిరింపుగదా! సిగ్గు చేటు కాదా!-38. నాసైన్యమునకును ఆయుధములకును ఇంద్రాది దేవతలు భయముచెందీరి-39. బ్రహ్మాదులుగూడ ఆశ్చర్యముతో నిశ్చేష్టులైరి-39. ఇక విష్ణువు కథయేమీ చెప్పవలె: ఆ మహేశ్వరుడు గూడ భయపడెను. ఇతరుల మాట చెప్పవలెనా! ఆదిక్పాలురు పారిపోయిరి-40. కనబడకుండగనే శత్రు శరీరములపై బడు మన వాడి బాణములు కవచములంతట గ్రుచ్చగా దేవతలందరి మదము నీరుగారిపోయినది. అటువంటి మహాభుజపరాక్రమతేజము గల మనను జయించుటకొక స్త్రీ దండెత్తి వచ్చుచున్నది!-42. స్త్రీ యైన ఈమెను ఎప్పుడైనను తక్కువగా నెంచరాదు. “తన్ను తాను బాగుగా దెలిసిన జగీషువులు (శత్రువుల జయింపగోరువారు) అల్పునైనను శత్రువును తక్కువగా నెంచరాదు” అన్నది నీతి-43. కావున ఆమెను కదల్చివేయుటకు సేవకుల బంపవలె. మదమెక్కిన యామెను వెంట్రుకల బట్టి యీడ్చి తీసుకొని రావలె.-44. దేవా! నీ శుద్ధాంతః పురముననున్న లేడికంటి లేమలకు ఈ దుష్టురాలు చీరకాలపు చెలికత్తెగా నుండగలదు -45. మన సైన్యములలో నొక్కొక్క భటుని వలన శత్రువులును చరాచరములతో గూడిన మూడు లోకములును జంకుదురు-46. ఓదానవ రాజా! తక్కిన దానికీ దేవర చిత్తమే ప్రమాణము. (మీకే తెలియును) - అని నివేదించి విశుక్రుడు భండాసురుని కోపమును మరింతబెంచెను-47. తరువాత, మహా సత్వుడు  విమర్శదెలిసినవాడు వివేకము గలవాడునైన విషంగుడు అన్న గారైన భండాసురినితో నిట్లనెను-48. ఓయరిమర్దనా దేవా కార్యమంతయు నీకే తెలియును. నీకు దెలుపదగిన నీతి మార్గములేదు-49. అంతయు విచారించి చేయవలె, రాజనీతి గతి విచారమే (సమాలోచనయే) మిక్కిలి ప్రాముఖ్యము గలదీ, సమాలోచనము జేయని కర్మ సమూలముగా కత్తిరించివేయును- 50. ప్రయత్నముతో శత్రు నగరమునకు గూఢచారుల బంపవలె. జయసిద్ధిని గోరినవాడు వారి బలా బలమును దెలిసికొనవలె-51. రాజు చారులే కన్నులు గలవాడుగావలె. దృఢమైన ప్రజ్ఞ గలవాడుగావలె. ఎప్పుడును పైకి అశంకితుడుగాగనబడుచునే లోపల శంకీత మనస్కుడుగావలే. (ఎవనినీ నమ్మరాదు) తన మంత్రులలో మాత్రమే గుప్తముగా మంత్రాలోచన ముండవలే-52. ఆటలు ఉపాయములను చక్కగా ప్రయోగించువాడు అంతట పూజ్యమైన పదమునందుండీ విజయమును బొందును. అవిచారితకర్మకారి వెంటనే వినాశమొందును-53. అవిమర్శగా జేయు నారంభము వినాశకారియగును. మంచి చెడులు విమర్శించి చేయుపనీ విశేషముగా జయమునిచ్చును. మగమని, స్త్రీయనీ, అల్పురాలని రోజులు శత్రువులను తక్కువగా నెంచరాదు. శక్తియంతటనుండును-55. స్తంభము నుండి బుట్టీ మృగ శరీరమును ధరించి సర్వ భూతములకు ప్రాణమైన యొకానొకనిచేత హిరణ్యకశిపుడు చంపబడెను-56. పూర్వము చండీకయను స్త్రీ మాయతో యుద్ధమున విజృంభించినదై నిశుంభ - శుంభులను (రాక్షసులను) మహిషాసురునీ జంపినది-57. ఆ సందర్భమున నామెచే పెక్కురు దైత్యులు చంపబడిరి. అందువలన స్త్రీ మాత్రయని తక్కువగా నెంచరాదని చెప్పుచున్నాను-58. శక్తియే యంతట విజయశ్రీకి కారణము- శక్తి యాధారమునందిన స్త్రీ పుంలింగములతో మనకు భయములేదు-59. స్వభావ సిద్దముగనే సంసారమంతట శక్తి ప్రకాశించుచుండును. అప్పుడు, నీవు ఆమె దురాశ యొక్క ప్రవృత్తిని దెలియవలె-60. ఈమె యెవరు? ఎవరి వలన బుట్టినది? ఏమి యాచారముగలది? ఏ యాశ్రయముగలది? ఏ బలముగలది? ఏ సహాయముగలది? ఓ దేవా! దీనిని విచారింపుడు (సమాలోచన సేయుడు)-61. అని విషంగుడు చెప్పగానే భండాసురుడిట్లనెను. మహౌజస్కులకు మహాతేజో వంతులకు విచారముతో పనిలేదు. మనసైన్యమున-62. మహాసత్తులైన అక్షౌహిణీ సేనాధిపులు నూరుగురుగలరు. వారు సముద్రములనైన త్రాగగలరు. త్రివిష్టపము (స్వర్గము)ను దంహించివేయగలరు. ఒరే పాప సమాచారముగలవాడా! విషంగా! స్త్రీలను వ్యర్థముగా శంకించెదవేల?-63. అది యంతయు నేరులద్వారా పూర్వమే చూచితిని. ముందు లలితయను పేరుగల ఒకానొక యామె జనించినది. ఆమె నిజముగా (త్రిలోక) సుందరియగుటచే ఆ పేరామెకు సార్థకము. ఆమె యాకారము పూవువలె సుకుమార సుందరము. సత్వములేదు. పరాక్రమము లేదు. యుద్దములలోనికెప్పుడును బోలేదు-65. ఆమె యవిచారసమూహముగలది విచారములేకయే బహుకార్యములజేయును. కాని మాయాపరాయణురాలు. ఆమె తన వలన సత్తహీనమైన స్త్రీ సమూహమునే పుట్టించినదీ-66. దానితో నీకేమి? ఇంత మాత్రముచే వికృత చేష్ట చేయరాదు. లేదా నీవన్న నీతి ప్రకారము ఆమెకు మహా బలముండుగాక-67. ముల్లోకములు దాటిన మహిమగల భండాసురునీ నేనడు జయింపగలడు?-68. ఇప్పటికీ గూడ నా బాహు బలసంమర్దనమున మూర్చజెందిన స్వర్గవాసులైన దేవతలు ఊపీరిని గూడ పీల్చుకొనలేకున్నారు-69. కొందరు పాతాల గర్భములలో, మరికొందరు పర్వతముల పొందరిండ్లలోను-70. భార్యా పిల్లలను సంపదలను వదలి మిక్కిలి భయముతో దాగియున్నారు. వారు అధికారముల గోల్పోయి పశువులై వేషములు గప్పికొని చరించుచున్నారు-71. ఇట్టి నా బాహుపరాక్రమమును ఆమె తెలియదు. మొన్న మొన్న బుట్టినయబలమైన యీమె మదముతో మత్తెక్కినదీ-72. మూడులైన స్త్రీలు నిజమును దెలియరు. వ్యర్థముగా సాహసముల గల్పించుకొందురు. చివరకు కార్యాకార్యముల దెలియక వినాశము వైపు పరుగెత్తుదురు -73. లేదా ఆమెను ముందడుకొని దేవతలు - (అనగా) మహోరగులు, సిద్ధులు, యుద్ద దుర్మదులైన సాధ్యులు-74. బ్రహ్మగాని, పద్మనాభుడు (విష్ణువు)గాని రుద్రుడుగానీ ఇంద్రుడుగానీ తక్కిన దిగధిపతులుగాని వచ్చినచో వారిని పిండి చేయుటకు నేను సమర్థుడను-75. అదికాక నా సేనలోని సేనా నాయకులు రణదుర్మదులు వారు శత్రువులను పండు దోసకాయను పిండినట్లు పిండివైచెదరు-76. కుటిలాక్షుడు, కురండుడు, కరంకుడు, కాలవాశితుడు, వజ్రదంతుడు, వజ్రముఖుడు, వజ్రలోముడు, (వజ్రము వంటి వెంట్రుకలు గలవాడు) లాహకుడు (మేఘమువంటివాడు)-77. సూచీ ముఖుడు (సూది ముఖముగలవాడు), ఫలముఖుడు, వికటుడు, వికటాననుడు. కరాలాక్షుడు, కర్కటకుడు (ఎండ్రకాయవంటివాడు). మదనుడు, దీర్ఘ జిహ్వకుడు-78. హంబకుడు, హలములుంచుడు, కర్కశుడు, కలివాహనుడు, పుల్కసుడు, పుండ్రకేతువు, చండబాహువు, కుక్కురుడు          -79. జంబుకాక్షుడు, జృంభణుడు, తీక్షశృంగుడు, త్రికంటకుడు, చతుర్గుప్తుడు, చతుర్బాహువు, చకారాక్షుడు, చతుఃశిరుడు-80. వజ్రఘోషుడు, ఊర్థ్వకేశుడు, మహాహనువు, మఖశత్రువు, మఖాస్కంది, సింహఘోషుడు, శిరాలకుడు-81. అంధకుడు, సింథునేత్రుడు, కూపకుడు, కూపలోచనుడు, గుహాక్షుడు, గండగల్లుడు, చండధర్ముడు, యమాంతకుడు-82, డునుడు, పట్టి సేనుడు, పురజిత్తు, పూర్వమారకుడు, స్వర్గశత్రువు, స్వర్గబలుడు, దుర్గుడు, స్వర్ణ కంటకుడు-83. అతిమాయుడు బృహస్మోయుడు, ఉపమాయుడు, ఉలూకజీతత్తు, పురుషేణుడు, విషేణుడు, కుంతీషేణుడు, పురూషకుడు-84. మలకుడు, కశూరుడు, మంగలుడు, ద్రఘణుడు, కోల్లటుడు, కుజిలాశ్వుడు, దాసేరుడు, బభ్రువాహనుడు-85. దృష్టహాసుడు, దృష్టకేతువు. పరిక్షేప్త, అపకంచుకుడు, మహామహుడు, మహాదంష్ణుడు, దుర్గతి, స్వర్గమేజయుడు-86. షట్కేతువు, షడ్వసువు, షడ్జంతుడు, షట్రియుడు, దుఃశరుడు, దుర్వినీతుడు, ఛన్నకర్ణుడు, మూషకుడు-87, అట్టహాసి, మహాశి, మహాశీరుడు, మహోత్కటుడు, కుంభోత్కచుడు, కుంభనాసుడు, కుంభగ్రీవుడు, ఘటోదరుడు-88. అశ్వమేధ్రుడు, (అశ్వపురుషాంగము వంటి పురుషాంగముగలవాడు) మహాండుడు (అండము - వృషణము), కుంభాండుడు, పూత నాసికుడు (పూతీ ఉగ్రగంథము), పూతిదంతుడు, పూతి చక్షువు, పూత్యాస్యుడు, పూతీ. మేహనుడు (ఉగగ్రంథము గల పురుషాంగము గలవాడు)-89. వీరు మొదలుగా గల శూరులు హిరణ్యకశిపునకు సమానులు, హిరణ్యాక్షసములును నైననాపుత్రులు మహా బలులు-90. వారిలో ఒక్కొక్కరికి నూటికి మించిన పుత్రులు పుట్టిరి. నా సేనా నాయకులు మదముతో చెలరేగినవారు. వారిని నా పుత్రులు వెంబడించపరుగిడుదురు -91. వారు యుద్ధమున మిక్కిలి రెచ్చిన దేవాధములను నశింపజేయగలరు. నా సహస్రాక్షౌహిణీ నాయకులు కోపించినచో ఆ దేవతలు భస్మమగుదురు. అయ్యో! ఈయబల స్త్రీ విషయము చెప్పవలెనా? -92. ఆమె యొక్క యుద్ధ సీమలో నంతయు మాయా విలాసములు, మహామాయా వినోదములే జరుగును. మనసైన్యమువారు కోపించినచో వారి బలమంతయు భసీ భూతమగును-93. కావుననోవిషంగా! నీ మనస్సు వ్యర్థముగా శంకీంచి భగ్నముగా కుండుగాక - ఈ విధముగా జెప్పి భండాసుర రాజు రాజ సింహాసనమునుండి  లేచి తన సేనాని మహాబలుడైన కుటిలాక్షునితో నిట్లనెను. ఓరేయి! లేవరా! సైన్యము నంతయు నంతట సిద్ద పరుపుము-95, శూన్యక పట్టణము- ద్వారములందంతటను సైన్యమునుంచుము. (నూరు వలలను పన్నుము)-96.మంత్రులతోను పురోహితులతోను దుష్టాభిచారములజేయవలె. నీవు శస్త్రములను సిద్దము జేయము. ఇదిగోయుద్దము వచ్చినదీ-97. సేనాపతులలో నొకరిని ముందెప్పుడు నడిపించుము. వాడక్కడనే సైన్యసమూహములతో గూడి భయంకరముగా నుండవలె-98. యుద్ధ సమయమున నొక్కుమ్మడిగా సైన్యముల దాడిచే జయింపబడిన యామెను దేవ బలముతో మదించిన మూర్ఖురాలిని సిగలాగి పట్టుకొనుము-99. అని మూడు వేల సేనకధిపతియై మహాసత్త్వుడైన కుటిలాక్షుడను సేనా నాయకునకు జెప్పి తాను (భండాసురుడు) అంతఃపురమునకు వెళ్లిను -100. అంత దాడి వెడలివచ్చుచున్న శ్రీ దేవియొక్క యాత్రాపటహధ్వనులు రాక్షసేంద్రులకు వినవచ్చినవి. అది వారి చెవులను బధిరముగా (చెవిటిగా) జేయుచున్నది.-101.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యనంవాదమున శ్రీలలితోపాఖ్యానమున భండాసురహంకారమను నిరువదియొకటవ యధ్యాయము.