బ్రహ్మాండ మహా పురాణము
27 - గణనాథపరాక్రమో
అథ నష్టేషు పుత్రేషు శోకానలపరిప్లుతః ।
విలలాప స దైత్యేంద్రో మత్వా జాతం కులక్షయమ్ ॥ హా పుత్రా హా గుణోదారా హా మరేకపరాయణాః ।
హా మన్నేత్రసుధాపూరా హా మత్కులవివర్ధనాః ॥
హా సమస్తసురశ్రేష్ఠమదభంజనతత్పరాః ।
హా సమస్తసురస్త్రీణామంతర్మోహనమన్మథాః ॥
దీశత ప్రతీవాచం మే మమాంకే వల్గతాధునా ।
కిమిదానీమీమం తాతమవముచ్య సుఖం గతాః ॥
యుష్మాన్వినా న శోభంతే మన రాజ్యాని పుత్రకాః ।
రిక్తానీ మమ గేహాని రిక్తా రాజసభాపి మే ॥
కథమేవం వినిఃశేషం హతో యూయం దురాశయా ।
అప్రధృష్యభుజిసత్వాన్ భవతో మత్కులాంకురాన్ ॥
కథమేకపదే దుష్టా వనితా సంగరేఽవధీత్ ॥
మమ నష్టాని సౌఖ్యాని మమ నష్టాః కులస్త్రియః ।
ఇతః పరం కులే క్షీణే సాహసాని సుఖాని చ ॥
భవతః సుకృతైర్లబ్ధ్వా మమ పూర్వజనుఃకృతైః । నాశోఽయం భవతిమద్య జాతో నష్టస్తతోఽస్మ్యహమ్॥
హా హతోస్మి విపన్నోఽస్మి మందభాగ్యోఽస్మి పుత్రకాః ।
ఇతి శోకాత్సపర్యస్య ప్రలపన్ ముక్తమూర్ధజః ॥ మూర్ఛయా లుప్తహృదయో నిష్పపాత నృపాసనాత్ ॥
విశుక్రశ్చ విషంగశ్చ కుటిలాక్షశ్చ సంసది ।
భండమాశ్వాసయామాసుర్దేవస్య కుటిలక్రమైః ॥
బ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున శ్రీలలితోపాఖ్యాసమున గణనాథపరాక్రమమను - నిరువది యేడవ యధ్యాయము.
ఆ తరువాత, పుత్రులు నశింపగా శోకాగ్నితో జుట్టబడి కులక్షయము జరిగినదని తలచి భండాసురుడు విలపించెను-1. హా! పుత్రులారా! హా! గుణోదారులారా! హా! నాయందే ముఖ్యముగానాసక్తులారా! హా! నా కన్నుల సుధా ఫూరములారా! హా! నాకుల వివర్ధను లారా!-2. హా! సమస్త దేవతా శ్రేష్ఠుల మదముల భగ్నము జేయుటలో తత్పరులారా! హో! సమస్తసురస్త్రీల యంతరంగముల మోహింపజేయు మన్మథులారా!-3. నాకు మారుపలుకుడు. ఇపుడు నా తోడపై నెగురుడు. మీరేలయిపుడీ తండ్రిని వదిలి సుఖముగా వెళ్లితిరి?-4. ఓ నా పుత్రులారా! మీరు లేక నా యీ రాజ్యములు శోభించుచు లేవు. నా భవనములు శూన్యములు. నా రాజసభయు శూన్యము-5 దురాశయురాలిచే నీ విధముగా నీఃశేషముగా జంపబడితిరి? తిరస్కరీంపబడిన భుజ బలములు గలిగి నాకులాంకురములైన మిమ్ములను ఒకేమారు ఆ దుష్టవనిత సంగరమున నెట్లు వధించినది?-7. నా సౌఖ్యములు నశించినవి. నా కుల స్త్రీలు నశించినారు. కులక్షయముగాగా నా సాహసములును, సుఖములును నశించినవి. నా పూర్వ జన్మమున జేయబడిన పుణ్యములచేతను మీ పుణ్యములచేతను మీమ్ముల బోండితిని. అట్టి మీకు నాశము జరిగినందున నేను నష్టుడనైతిని-8. హా! హతుడనైతిని, ఆపద జెందితినీ. పుత్రకులారా! మంద భాగ్యుడనైతిని. ఈవిధముగా శోకమున నావరింపబడుచు, ఏడ్చుచు చెదరిన తల వెంట్రుకలు గలిగి మూర్ఛచే లోపించిన హృదయము గలవాడై రాజు ఆసనమునుండి క్రిందబెడను-9. విశుక్రుడు, విషంగుడును, కుటిలాక్షుడును ఆ సభలో ఇవి దైవము యొక్క కుటిల క్రమములని భండాసురునోదార్చిరి-10.
విశుక్ర ఉవాచ :-
దేవ కిం ప్రాకృత ఇవ ప్రాప్తః శోకస్య వశ్యతామ్ ।
లపసి త్వం ప్రతి సుతాన్ ప్రాప్తమృత్యూన్ మహాహవే॥
ధర్మవాన్ విహితః పంథా వీరాణామేష శాశ్వతః । అశోచ్యమాహవే మృత్యుం ప్రాప్నువంతి యదర్హితమ్॥
ఏతదేవ వినాశాయ శల్యవద్భాధతే మనః ।
యత్ స్త్రీ సమాగత్య హఠాన్నిహంతి సుభటాన్ రణే॥
ఇత్యుక్తే తేన దైత్యేన పుత్రశోకో వ్యముచ్యత ।
భండేన చందకాలాగ్నిసదృశః క్రోధ ఆదధే॥
స కోశాత్ క్షిప్రముద్ధృత్య ఖడ్గముగ్రం యమోపమమ్ ।
విస్ఫారితాక్షియుగలో భృశం జజ్వాల తేజసా॥
ఇదానీమేవ తాం దుష్టాం ఖడ్గేనానేన ఖండశః ।
శకలీకృత్య సమరే శ్రమం ప్రాప్స్యామి బంధుభిః॥
ఇతి రోషస్ఖలద్వర్ణః శ్వసన్నివ భుజంగమః ।
ఖడ్గం వీధున్వన్నుత్థాయ ప్రచచాలాతిమత్తవత్ ॥
తం నిరుధ్య చ సంభ్రంతాః సర్వే దానవపుంగవాః ।
వాచమూచురతిక్రోధాజ్జ్వలంతో లలితం ప్రతి ॥
న తదర్థే త్వయా కార్యః స్వామిన్ సంభ్రమ ఈదృశః ।
అస్మాభిః స్వబలైర్యుక్తైరణోత్సాహో విధీయతే ॥
భవదాజ్ఞాలవం ప్రాప్య సమస్తభువనం హఠాత్ ।
విమర్దయితుమిశాః స్మః కిము తాం ముగ్ధభామినీమ్ ॥
కిం చూషయామః సపాబ్ధీన్ క్షోదయామోఽథ వా గిరీన్ ।
అధరోత్తరమేవైతత్ త్రైలోక్యం కరవామ వా॥
చినదామ సురాస్ సర్వాన్ భినదామ తదాలయాన్ ।
పినషామ హరిత్పాలానాజ్ఞాం దేహిమహామతే ॥
ఇత్యుదీరితమాకర్ణ్య మహాహంకారగర్వితమ్ ।
ఉవాచ వచనం క్రుద్ధః ప్రతిఘారుణలోచనః ॥
విశుక్ర భవతా గత్వా మాయాంతర్హితవర్త్మణా ।
జయవిఘ్నం మహాయంత్రం కర్తవ్యం కటకే ద్వీషామ్॥
ఇతి తస్య వచః శ్రుత్వా వీశుక్రో రోషరూషితః ।
మాయాతిరోహితవపుర్జగామ లలితాబలమ్॥
తస్మిన్ ప్రయాతుముద్యుక్తే సూర్యోస్తం సముపాగతః ।
పర్యస్తకిరణస్తోమపాటలీకృతదిజ్ముఖః ॥
అనురాగవతీ సంధ్యా ప్రయాంతం భానుమాలినమ్ ।
అనువవ్రాజ పాతాలకుంజే రంతుమినోత్సుకా ॥
వేగాత్ప్రపతోతో భానోర్ధేహసంగాత్సముత్థితాః ।
చరమాబ్ధేరివ పయః కణాస్తారా విరేజిరే ॥
అథాససాద బహులం తమః కజ్జలమేచకమ్ ।
సార్థం కర్తుమివోద్యుక్తం సవర్ణస్యాసి దుర్ధియా ॥
మాయారథం సమారూఢో గూఢశార్వరసంవృతః।
అదృశ్యపపురాపేదే లలితాకటకం ఖల: ॥
తత్ర గత్వా జ్వలజ్జ్వలం వహ్ని ప్రాకారమండలమ్ ।
శతయోజనవిస్తారమాలోకయత దుర్మతిః॥
పరితో విభ్రమన్ శాలమవకాశమవా(నా)ప్నువన్ ।
దక్షిణం ద్వారమాసాద్య నిదధ్యౌ క్షణముద్ధతః ॥
తత్రాపశ్యన్ మహాసత్త్వాసావధానా ధృతాయుధాః ।
ఆరూఢయానాః సంనద్ధవర్మాణో ద్వారదేశతం ॥
స్తంభినీప్రముఖాః శక్తీర్వింశత్యక్షౌహిణీయుతాః ।
సర్వదా ద్వారరక్షార్థం నిర్దిష్టా దండనాథయా ॥
విలోక్య విస్మయావిష్టో విచార్య చ చిరం తదా ।
శాలస్య బహిరేవాసౌ స్థిత్వా యంత్రం సమాతనోత్ ॥
గవ్యూతిమాత్రకాయామే తత్సమానప్రవిస్తరే ।
శిలాపట్టే సుమహతి ప్రాలిఖద్యంత్రముత్తమమ్ ॥
అష్టదిక్ష్వష్టశూలేన సంహారాక్షరమౌలినా ।
అష్టభిర్దై వతైశ్చైవ యుక్తం యంత్రం సమాలిఖత్ ॥
అలసా కృపణా దీనా నితంద్రా చ ప్రమాలికా ।
క్లీభా చ నిరహంకారా చేత్యష్టౌ దేవతాః స్మృతాః॥
దేవతాష్టకమేతచ్చ శూలాష్టకపుటోపరి ।
నియోజ్య లిఖితం యంత్రం మాయావీ సమయంత్రయత్॥
పూజాం విధాయ మం(యం)త్రస్య బలిభిశ్ఛాగలాదిభిః ।
తద్యంత్రం చారికటకే పాక్షిపత్సమరేఽసురః॥
ప్రాకారస్య బహిర్భాగే వర్తినా తేన దుర్ధియా ।
క్షిప్తముల్లంఘ్య చరణే పపాత కటకాంతయే॥
తద్యంత్రస్య వికారేణ కటకస్థాస్తు శక్తయః ।
విముక్తశస్త్రసన్యాసమాస్థితా దీనమానసా ॥
కిం హతైరసురైః కార్యం శస్త్రాశస్త్రి క్రమైరలమ్ ।
జయసిద్ధఫలం కిం వా ప్రాణిహింసా చ పాపదా ॥
అమరాణాం కృతే కోఽయం కిమస్మోకం భవిష్యతీ ।
వృథా కలకలం కృత్వా న ఫలం యుద్ధకర్మణా ॥
కా స్వామినీ మహారాజ్జీ! కా వాఽసౌ దండనాయికా । కా వా సా మంత్రిణీ శ్యామా భృత్యత్వం నోఽథ కీదృశమ్॥
ఇహ సర్వాభిరస్మాభిర్భృత్యభూతాభిరేకికా ।
వనితా స్వామినీకృత్యే కింఫలం మో(భో)క్ష్యతే పరమ్ ॥
పరేషాం మర్మభిదురైరాయుధైర్న ప్రయోజనమ్ ।
యుద్ధం శామ్యతు చాస్మాకం దేహశస్త్రక్షతిప్రదమ్ ॥
యుద్ధే చ మరణంభావి వృధా సుర్జీవితానీ నవి ।
యుద్ధే మృత్యుర్భవేదేవ ఇతి తత్ర ప్రమైవ కా ॥
ఉత్సాహేన ఫలం నాస్తి నిద్రైవైకా సుఖావహా । ఆలస్యసదృశం నాస్తి చీత్తవిశ్రాంతిదాయకమ॥
ఏతాదృశీశ్చ నో జ్ఞాత్వా సా రాజ్ఞీ కిం కరిష్యతి। తస్యా రాజ్ఞీత్వమపి నః సమవాయేన కల్పితమ్॥
ఏవం చోపేక్షితాస్మాభిః సా వినష్టబలా భవేత్ ।
నష్టసత్త్వా చ సా రాజ్ఞీ కా నః శిక్షాం కరిష్యతి ॥
ఏవమేవ రణారంభం విముచ్య విధుతాయుధాః ।
శక్తయో నిద్రయా ద్వారే ఘూర్ణమానా ఇవాభవన్॥
సర్వత్ర మాంద్యం కార్యేషు మహదాలస్యమాగతమ్।
శిథిలం చాభవత్సర్వం శక్తీనాం కటకం మహత్॥
జయవిఘ్నం మహాయంత్రమితి కృత్వా సదానవః ॥
నిర్విద్య తత్ర్పభావణ కటకం ప్రమిమంథిషుః ।
ద్వితీయయుద్ధదివసస్యార్ధరాత్రే గతే సతి॥
నిస్సృత్య నగరాద్భూయస్త్రింశదక్షౌహిణీవృతః ।
ఆజగామ పునర్దైత్యో విశుక్రః కటకం ద్విషామ్॥
అశ్రూయంత తతస్తస్య రణనిఃస్సాణనిస్వనాః ।
తథాపి తా నిరుద్యోగాః శక్తయః కటకేఽభవన్॥
తదా మహానుభావత్వాద్వికారైర్విఘ్నయంత్రజైః ।
అస్పృష్టే మంత్రిణీదండనాథే చింతామహాప తుః ॥
అహో బత మహత్కష్టమిదమాపతితం భయమ్ ।
కస్య వాఽథ వికారేణ సైనికా నిర్గతోద్యమాః ॥
నిరస్తాయుధసంరంభా నిద్రాతంద్రవిఘూర్జితాః ।
న మానయంతి వాక్యాని నార్చయంతి మహేశ్వరీమ్॥
ఔదాసీన్యం వితన్వంతి శక్తయోనిస్పృహా ఇమాః॥
ఇతి తే మంత్రిణీదండనాథే చింతాపరాయణేః చక్రస్యందనమారూఢే మహారాజ్ఞీం సమూచతుః॥
విశుక్రుడనెను - దేవ! పామరుని వలె నేల శోకమునకు వశుడవైతివి? మహాయుద్దమున (వీర) మరణముజెందిన పుత్రుల గూర్చి నీవేడ్చుచుంటివి-11. వీరులకిది ధార్మికమై శాశ్వతమైన మార్గము. వారు యుద్ధమున పూజ్యమనదగిన మృత్యువు నందిరి. అది దుః - భీంపదగినది కాదు-12. ఒక స్త్రీ మన నాశము కొఱకే. వచ్చి రణమున హఠాత్తుగా మన సుభటులను జంపుట శల్యమువలె నామనమును బాధించుచున్నది-13. ఈ విధముగా విశుక్రుడు చెప్పగా భండాసురుడు పుత్ర శోకమును వదిలెను. కాలాగ్నితో సమానమైన కోపమును వహించెను-14. ఆతడు కోశము నుండీ భయంకరమై యమునివలెనున్న ఖడ్గమును పైకి దీసెను. తన రెండుకన్నులను పెద్దవిగా జేసెను. తేజముతో మిక్కిలి ప్రకాశించేను-15. ఇపుడే దుష్టురాలినీ యుద్ధమున నాయీ ఖడ్గముతో ముక్కముక్కలుగా చేసి బంధువులతో సహా విశ్రాంతిని బొందెదను-16. అపుడాతని వర్ణములు రోషముతో స్టలితములగుచుండెను. బుసకొట్టుచున్న నాగుబామువలె నుండెను. ఖడ్గమును విదిలించుచు. మిక్కిలి మదించిన వానివలె పైకిలేచి కదిలెను-17. సమస్తదానవ శ్రేష్ఠులు సంక్రాంతులై యాతని నడ్డిరి. మిక్కిలి క్రోధమున మండిపడుచు లలితను గూర్చి యిట్లనిరి-18. ప్రభూ ఆమె కొరకు ఇటువంటి సంభ్రమము అవసరములేదు. మా బలములతో గూడుకొని మేము రణోత్సాహమున వెడలెదము-19. మీ చిన్నియాజ్ఞను బొంది అకస్మాత్తుగా భువనమంతయు మర్దింపగలము. ఆ ముగ్గురాలైన స్త్రీ ఒక లెక్కయా?-20. ఏడు సముద్రముల నొక్కమారుగా జుట్టవలెనా? లేదా. సప్తకుల పర్వతములను చూర్ణము చేయవలెనా? ఈ ముల్లోకములను తల్లక్రిందులుచేయవలెనా?-21. సమస్త దేవతలను ఛేదించెదము. వెరీ భవనములను భేదించెదము. దీక్పాలురను పిండి చేసేదము, ఓ మహామతీ! ఆజ్ఞనీండు-22, మహాహంకార గర్వముతో బలికిన యీ మాటలను వినీ, కోపించి, కోపమున కన్నులెల్లజేసెను-23. ఓ విశుక్రా! మాయచే, అదృశ్యమైన యాకారముతో వెళ్లి శత్రు రాజధానిలో జయవిఘ్నమను మహాయంత్రమును స్థాపించుము. ఈ మాటలు విని విశుక్రుడు కోపోద్విగ్నుడయ్యెను. మాయచే- అదృశ్యమైన శరీరము గలవాడై లలితాదేవి సైన్యములోనికి వెళ్లాను-25, వాడు పోవుట కుద్యుక్తుడుగాగానే సూర్యుడస్తమించెను. అస్తమించిన సూర్య కిరణములచే దీక్కుల ముఖములన్నియు నెఱ్ఱనైనవి-26. అనురాగ వతియైన సంధ్య పాతాళమను పొదరింటిలో రమించుటకా యనునట్లు ఉత్సుకురాలై కిరణమాలలు ధరించిన సూర్యుని వెంబడించేను-27, అస్తసముద్రమున వేగముగా బడుచున్న సూర్యుని తాకిడికి లేచిన నీటిబిందువులు చుక్కలా యన్నట్లు బ్రకాశించినవి-28. ఆ తరువాత కాటుకవలె నల్లనైన చీకటి తనతో సమానమైన వర్ణముగల కత్తులకు తోడ్పాటు చేయుటకా యన్నట్లు వచ్చేను-29. మాయారథమునెక్కి గూఢమైన కటిక చీకటితో నావరింపబడి. అదృశ్యమైన యాకారము గలిగిన యా నీచుడగు వీశుక్రుడు లలితా రాజధానీ నగరమును జేరెను-30. అచటికి వెళ్లి యా దుర్మతి విశుక్రుడు మండుచున్న జ్వాలలు గలదియు, నూరు యోజనముల విస్తారముగలదియు నైన అగ్ని ప్రాకార (కోటగోడ) మండలమును జూచెను-31. అచట లలితా దేవి యింటి చుట్టు తిరుగుచు అవకాశము లభింపగనే దక్షిణ ద్వారమును జేరి క్షణ కాల ముద్దతుడై చింతించెను-32. అచట, మహాసత్త్వలు, సావధానలు, ఆయుధముల ధరించినవారు, వాహనములనెక్కినవారు, కప్పుకొనిన కవచములు గలవారు, ద్వార దేశమునన్న వారునైన-33. స్తంభిని మొదలగు శక్తులను జూచెను. వారు ఇరువది యక్షౌహిణీ, సేనలతో గూడిరి. దండనాథ వారినెల్లప్పుడు ద్వార రక్షణకై నియోగించేను-34 ఇది చూచి యాశ్చర్యపడి చాలసేపాలోచించి, యపుడో లలితాదేవియింటి వెలుపలనే యుండి (విఘ్న) యంత్రమును విస్తరింపజేసెను -35. రెండు కోసుల పొడవు రెండు కోసుల వెడల్పు (విస్తరముగల మక్కిలి గోప్పనైన శిలాపట్టమున నాయుత్తమ యంత్రమును వ్రాసేను-36. ఎనిమిది దిక్కులలో అష్ట శూలములు గలిగి, సంహారాక్షరములు మౌళియందు గలిగిన యెనిమిది దేవతలతో గూడిన యంత్రమును చక్కగా వ్రాసెను -37. ఆయష్ట దేవతలు - అలస, కృపణ, దీన, నీతంద్ర, ప్రమాలిక, క్లీబ, నిరహంకార - యనువారు -38. మాయావి విశుక్రుడు ఈ యెనిమిది దేవతలను ఎనిమిది శూలముల పుటములపైన నియోగించి వ్రాసిన యంత్రమును చక్కగా మంత్రించేను-39. ఆ యంత్రమునకు మేకపోతులు మొదలగు వానితో బలిపూజలను చేసి యా యంత్రమును శత్రునగరమున రణమున నుంచేను-40. ప్రాకారము వెలుపల నున్నయా దుర్బద్ధి విశుక్రుడుంచీన యా యంత్రము దుమీకి రణమున కటకాంతరమున బడెను-41. ఆ యంత్రము యొక్క వికారముచే కటకములోనున్న శక్తులందరును దీనమనస్కులై శస్త్రములవదిలి శస్త్ర సన్యాసము జేసిరి-42. “చచ్చిన రాక్షసులేమీ చేయలేరు. కావున శస్త్రాస్తాదుల యుద్దమికచాలు. అథ వా జయముతో సిద్ధించిన ఫలమేమి? కావున యుద్దమున యుభయ ప్రాణుల హింసతో పాపము సంపాదించుట మాత్రము జరుగును-43, దేవతల కై చేసిన యీ యుద్ధయున మనకేమి లాభము కలుగును? వ్యర్థముగా కలకలముచే సెడి యుద్ధ కర్మచే ఫలితము శూన్యము-44. స్వామిని యైన మహారాజ్ఞయెవరు? ఈ దండనాయిక యెవరు? ఈ శ్యామయైన మంత్రిణి యెవరు? ఇక మన సేవకత్వమెట్టిది?-45. ఇట సేవికలమైన మన యంగిరకి నొక్కరితయ స్వామిని. ఆమె పనీలో మనకేమీ గొప్పతనము కలిసి వచ్చును-46, ఇతరుల మర్మములను ఛేదించు నాయుధములతో బ్రయోజనములేదు. మన దేహములకు శస్త్రముల దెబ్బలతో గాయముల నిచ్చుయుద్దము శమించుగాక-47. యుద్ధమున మరణము గలుగును. అట్లు మన జీవితములు వ్యర్థములగును. యుద్ధమున మరణము తప్పక కలుగుననుటలో యథార్థతలేదు -48. ఉత్సాహముతో ఫలములేదు. నిద్ర యొక్కటియే సుఖావహము. ఆలస్యముతో సమానముగా చిత్త విశ్రాంతి నిచ్చు మరొకటిలేదు-49. ఇట్టి వారినిగా దెలిసికొన్న యా రాజ్ఞియేమి చేయగలదు? ఆమె రాజీత్వము మన సమూహముచేత నేర్పడినది-50. ఈ విధముగా మనము పేక్షించినచో నామే నష్టబలురాలగును, నష్ట బలురాలైన రాజ్ఞిమననెవ్వరిని శిక్షింపగలదు-"51". ఈ విధముగా రణారంభమును వదిలి, ఆయుధముల విడిచి, శక్తులు నిద్రచే ద్వారమున తిరుగుచున్న వారివలె నుండిరి-52. కార్యములందంతటను మాంద్యము వచ్చేను. గొప్పయాలస్యము గూడవచ్చేను. శక్తుల యొక్క మహాకటకము(సగరము) శిథిలమయ్యెను-53. ఈ విధముగా విశుక్రుడు జయవిఘ్నమును మహా యంత్రమును జేసి దాని ప్రభావముతో నగరమంతయు మథింపదలచి, రెండవదివసము యొక్కయర్థరాత్రి దాటగా-55, మరలముప్పది అక్షౌహిణీసేనలతో గూడి విశుక్రుడు శత్రు నగరము పైకి వచ్చేను- 56. అంత రణభేరీ నాదములు వినబడెను. అయినను ఆ శక్తులు నగరముననే యుద్ధ ప్రయత్నము లేక యూరక యుండిరి-57. అపుడు మహా ప్రభవతులగుటచే మంత్రదండనాథలను ఆ వీఘ్నయంత్ర వికారములు తాకలేదు. కాని తక్కిన శక్తులు ఆ వికారములకు వశులగుటచే మిక్కిలి చింతించిరి-58. ఆశ్చర్యము. అయ్యో మహాకష్టమైన భయము వచ్చిపడినది. దేని వికారముచే సైనికులు నిర్గతోద్యోగులైరి?-59. వారి యందా యుద్ధ సంరంభమస్తమించినది. నీద్రాలసలై తిరుగుచున్నారు. మా వాక్యములను గౌరవించుటలేదు, మహేశ్వరి నర్చించుటలేదు. ఔది సీన్యమును వహించుచున్నారు. మొత్తముపైన శక్తులందరు నిస్పృహలైనారు ఎందులకు?-60. అని యీ విధము మంత్రీడీదండనాథలు చింతా పరాయణలై చక్రరథమునెక్కి మహారాజ్ఞితో నిట్లనిరి-61.
మంత్రిణ్యువాచ:-
దేవి! కస్య వికారోఽయం శక్తయో విగతోద్యమాః ।
న శృణ్వంతీ మహారాజ్ఞి తవాజ్ఞాం విశ్వపాలితామ్ ॥
అన్యోఽన్యం చ విరక్తాస్తాః పరాచ్యః సర్వకర్మసు।
నిద్రాతందాముకులితా దుర్వాక్యాని వితన్వతే॥
కాదండినీ మంత్రిణీ కా మహారాజ్ఞితి కా పునః ।
యుద్ధం చ దృశమితి క్షేపం భూరి వితన్వతే ॥
అస్మిన్నేవాంతరే శత్రురాగచ్ఛతి మహాబలః।
ఉద్దండభేరీనిస్వానైర్విభిందన్నివ రోదసీ ॥ అత్ర యత్ర్పాప్తరూపం తన్మహారాజ్ఞి ప్రపద్యతామ్।
ఇత్యుక్త్వా సహ దండిన్యా మంత్రిణీ ప్రణతిం వ్యధాత్॥
తతః సా లలితా దేవీ కామేశ్వరముఖం ప్రతి ।
దత్తదృష్టిః సమహసదతిరక్తరదావలిః॥
తస్యాః స్మితప్రభాపుంజే కుంజరాకృతిమాన్ ముఖే । కటక్రోడగలద్దానః కశ్చిదేవ వ్యజృంభత॥
జపాపటలపాటల్యోబాలచంద్రవపుర్ధరః ।
బీజపూరగదామిక్షుచాపం శూలం సుదర్శనమ్ ॥
అబ్జపాశోత్పల వ్రీహిమంజరీవరదాంకుశాన్ ।
రత్నకుంభం చ దశభిః స్వకైర్హస్తైః సముద్వహన్॥
తుందీలశ్చంద్రచూడాలో మంద్రబృంహితనిస్వనః।
సిధ్ధలక్ష్మీసమాక్లిష్టః ప్రణనామ మహేశ్వరీమ్॥
తయా కృతాశీః సమహాన్ గణనాథో గజాననః।
జయవిఘ్నం మహాయంత్రం భేత్తుం వేగాద్వినిర్యయౌ॥
అంతరేవ హి శాలస్య భ్రమద్దంతావలాననః ।
నిభ్భతం కుత్రచిల్లగ్నం జయవిఘ్నం వ్యలోకయత్॥
స దేవో ఘోరనిర్ఘాతైర్జుఃసహైర్ధంత పాతనైః ।
క్షణాచ్చూర్ణీకరోతి స్మ జయవిఘ్నమహాశిలామ్॥
తత్ర స్థితాభిరుష్టాభిర్దేవతాభిః సహైవ సః ।
పరాగశేషతాం నీత్వా తద్యంత్రం ప్రక్షిపద్దవి॥
తతః కిలకిలారావం కృత్వాలస్యవివర్జితా: ।
ఉద్యతాః సమరం కుర్తుం శక్తయః శస్త్రపాణయః॥
స దంతివదనః కంఠకలితాకుంఠనిస్వనః ।
జయయంత్రం హీ తత్సృష్టం తథా రాత్రౌ వ్యనాశయత్॥
ఇమం వృత్తాంతమాకర్ణ్య భండః స క్షోభమాయయౌ ।
ససర్జయ (సోఽసర్జయత) బహూనాత్మ రూపాన్ దంతావలాననాన్॥
తే కటక్రోడవిగలన్మదసౌరభచ ఞ్చ లై ।
చంచరీకకులైరగ్రే గీయమానమహోదయాః॥
స్ఫురద్దాడిమకింజల్కవిక్షేపకరరోచిష।
సదా రత్నాకరానేకహేలయా పాతుముద్యతాః॥
ఆమోదప్రముఖా బుద్ధిముఖ్యశక్తినిషేవితాః ।
ఆమోదశ్చ ప్రమోదశ్చ సుముఖోదుర్ముఖస్తథా॥
అరిఘ్నో విఘ్నకర్తా చ షడేతే విఘ్ననాయకాః।
తే సప్తకోటిసంఖ్యానాం హేరంబాణామధీశ్వరాః ॥
తే పురశ్చలితాస్తస్య మహాగణపతే రణే।
అగ్నిప్రాకారవలయాద్వినిర్గత్య గజాననాః॥
క్రోధహుంకారతుములాః ప్రత్యపద్యంత దానవాను ।
పునః ప్రచండపూత్కారబధిరీకృతవిష్టపాః॥
పపాత దైత్యసైన్యేషు గణచక్రచమూగణః।
అచ్ఛిదన్నిశితైర్బాణైర్గణనాథః సదానవాన్॥
గణనాథేన తస్యాభూద్విశుక్రస్య మహౌజసః।
యుద్ధ ముద్ధతహుంకారభిన్నకార్ముకనీఃస్వనమ్॥
భ్రుకుటీకులే చక్రే దష్ఠోష్ఠమతిపాటలమ్।
విశుక్రో యుధి బిభ్రాణః సమయుధ్యత తేన సః॥
శస్త్రా ఘట్టననిస్వానైర్హుంకారైశ్చ సురద్విషామ్॥
దైత్యసప్తిఖురక్రీడత్కుద్దాలీకూటనిస్వనైః॥
ఫేత్కారైశ్చ గజేంద్రాణాం భయేనాక్రందనైరపి ।
హెషయా చ హయశ్రేణ్యా రథచక్రస్వనైరపి॥
ధనుషాం గుణనిస్స్వానైశ్చక్రాచీత్కరణైరపి॥
శరసాత్కార ఘోషైశ్చ వీరభాషాకదంబకైః ।
అట్టహాసైర్మహేంద్రాణాం సింహనాదైశ్చ భూరిశః॥
క్షుభ్యద్దిగంతరం తత్ర బుబుధే యుద్ధముద్ధతమ్।
త్రింశద క్షౌణీ సేనా విశుక్రస్య దురాత్మనః॥। ప్రత్యేకం యోధయామాసుర్గణనాథా మహారధాః।
దంతైర్మర్మ విభిందంతో వేష్టయంతశ్చ శుండయా॥
క్రోధయంతః కర్ణతాలైః పుష్కలావర్తకోపమై ।
నాసాశ్వాసైశ్చ పరుషైర్విక్షిపంతః పతాకినీమ్॥
ఉరోభిర్మర్థయంతశ్చ శైలవప్రసమప్రభై:।
పింషంతశ్చ పదాఘాతైః పీనైర్ఘ్నంతస్తథోదరైః ॥
విభీందంతశ్చ శూలేన కృత్తంతశ్చక్రపాతనైః।
శంఖస్వనేన మహతా త్రాసయంతో వరూధినీమ్॥
గణనాథముఖోద్భూతా గజవక్త్రాః సహస్రశః।
ధూలీశేషం సమస్తం తత్ సైన్యం చక్రుర్మహోద్యతాః॥
అథ క్రోధసమావిష్టో నిజ సైన్యపురోగమః।
ప్రెషయామాస దేవస్య గజాసురమసౌ పునః॥
ప్రచండసింహనాదేన గజదైత్యేన దుర్దియా ।
సప్తాక్షౌహిణియుక్తేన యుయుధే స గణేశ్వరః॥
హీయమానం సమాలోక్య గజాసురభుజాబలమ్।
వర్ధమానం చ తద్వీర్యం విశుక్రః ప్రపలాయితః॥
స ఏక ఏవ వీరేంద్రః ప్రచలన్నాఖువాహనః।
సప్తాక్షౌహిణికాయుక్తం గజాసురమమర్దయత్॥
గజాసురే చ నిహతే విశుకే ప్రపూయితే ।
లలితాంతికమాపేదే మహాగణపతిర్మృధాత్॥ కాలరాత్రీశ్చ దైత్యానాం సా రాత్రిర్వీరతిం గతా। లలితా చాతీముదితా బభూవాస్య పరాక్రమైః॥
వితతార మహారాజ్ఙీ ప్రియమాణా గణేశితుః। సర్వదైవతపూజాయాః పూర్వపూజ్యత్వముత్తమమ్॥
ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే గణనాథపరాక్రమో నామ సప్తవింశోధ్యాయః॥
సమాప్తశ్చ ద్వీతీయయుద్ధదివసః॥
మంత్రిణి యనెను:- ఓ దేవి! ఇది దేని వికారము? శక్తులు రణప్రయత్నము లేనివారైరి, ఓ మహారాజ్ఞి! విశ్వమంతట పాలింపబడిన నీ యాజ్ఞను ఈ శక్తులు వినుటలేదు-62. ఒండొరులు విరక్తలు. సర్వ కర్మలకు పరాజ్ముఖులు (పెడమొగము బెట్టినవారు). నిద్రతో తూగుచు ముడుచుకొనీపోయినవారు. దుర్వాక్యముల విస్తరింపజేయుచున్నారు-68. దండిని యెవరు? మంత్రిణి యెవరు? మరి మహారాజ్ఞి యెవరు? యుద్దము గూడనెట్టిది? అను నిందలను విస్తరింపజేయుచున్నారు-64. ఇంతలోనే మహాబలుడైన శత్రువు ఉద్దండ భేరీ నాదములచే భూమ్యాకాశముల బ్రద్దలు గొట్టుచున్నాడాయనునట్లు వచ్చేను-65. ఇచట సంభవించిన దానిని మహా రాజ్ఞి తెలిసికొనుగాక. - అనీ చెప్పి దండినితో సహా మంత్రీడీ లలితాదేవికి నమస్కరించెను-66. అంతూ లలితాదేవి కామేశ్వర ముఖమున చూపు నిలిపి మిక్కిలి యెఱని దంత పంక్తి గలదై చక్కగా చిరునవ్వు నవ్వెను-67. ఆమె యొక్క చిరునవ్వు కాంతిపుంజమున ముఖము మాత్రము ఏనుగ ముఖముగా, గండ స్థలమునను భుజమధ్యమునను స్రవించుచున్న మదముగల యొకడు గజాననుడు) విజృంభించెను-68. ఆతడు, మందారపు పూల గుంపువలె నేఱనైనవాడు, బాల చంద్రుని శిరమున దాల్చీనవాడు, బీజపూర్, మాదీ, ఫలగదను చేజకు విల్లును శూలమును సుదర్శన చక్రమును-69. కమలమును పాశమును వరిచేరును వరదమును అంకుశమును రత్న కుంభమును తన పది హస్తములతో ధరించినవాడు -70. బొజ్జకడుపువాడు, చంద్రుడు సిగలో గలవాడు, మంద్రమైన బృంహిత ధ్వని (ఘీంకారధ్వని) గలవాడు, సిద్ది లక్ష్మితో కౌగిలింపబడినవాడు, అట్టి గణేశ్వరుడు మహేశ్వరికి నమస్కరించెను-71. ఆమెతో నాశీస్సులను బొందిన యా మహాగణనాధుడైన గజాననుడు జయవిప్ను మహాయంత్రమును ఛేదించుటకై, వేగముగా బయలుదేరెను-72. రాచనగరు లోపలనే తిరుగుచున్న . గజాననుడు గూఢముగా నొక చోట నంటియున్న జయ విఘ్న యంత్రమును జూచెను-73. ఆ గజాననదేవుడు తన భయంకర దంతములతో తీవ్రముగా బొడిచి క్షణములో జయవిఘ్నశిలను చూర్ణము గావించేను-74. ఆ యంత్రముననున్న దుష్ట దేవతలతోబాటు మొత్తమును దుమ్ముదుమ్ముగా జేసి యా యంత్రమును ఆకాశమునకు విసిరివైచెను-75 అంత కిలకిలా రావముజేసి, ఆలస్యమును వదీలి, శస్త్రపాణులై శక్తులు యుద్ధము జేయ సుద్యుక్తలైరి-76. అట్లే ఆ గజాననుడు కంఠమున నేదురులేని పెద్ద ధ్వని జేయుచు విశుక్రుడు సృష్టించిన జయయంత్రమును రాత్రిలో ధ్వంసము జేసెను-77. ఈ వృత్తాంతమును విని భండాసురుడు క్షోభము జెందెను. గజాననుడు తన రూపములుగల బహు గజముఖులను సృజించెను-78. వారీ గండ స్థలముల నుండియు భుజాంతరముల నుండియు స్రవించు మదమునకు వచ్చిన తుమ్మెదలు గుంపులుగా వచ్చి వారి మహోదయమును.వలే గానము జేయుచెండును-79. వారు ప్రకాశించు దాడిమీ పుష్ప కింజల్కము వంటి కాంతి గలవారు. ఎల్లప్పుడు రత్నాకరములను. (సముద్రములను) ఒక్క హేలతో రక్షించుటకుద్యుక్తులైనవారు-80. ఆమోదుడు మొదలగువారు. బుద్ధి మొదలగు శక్తులచే సేవింపబడినవారు. ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు -81. అరిఘ్నుడు, విఘ్నకర్త, ఈ యారుగురు.. విఘ్న నాయకులు. వారు ఏడు కోట్ల హేరంబులకు (శౌర్య గర్వితులకు) నాయకులు -82. వారు మహా గణపతి యొక్క రణమున ముందుగా బోయి, అగ్ని ప్రాకారవలయము నుండి బయలువెడలి-83. క్రోథ హుంకారములతో అనేక ముఖముగా దానవులపై బడిరి. భయంకరమైన ఫూత్కారముతో లోకములు చెవుడు బారినవి-84 ఈ విధముగా గణమండలములతో గూడిన సైన్యగణము రాక్షస సైన్యములపై బడెను. ఆ గణనాథుడు . వాడి బాణములతో దానవులను ఛేదించెను-85. గణనాథునకును, మహౌజస్కుడైన విశుక్రునకును తమ తమ హుంకారములే ధనుష్టంకార ధ్వనులను భేదింపగా యుద్ధము జరిగెను-86. ఒక చక్రముగా కనుబొమ్మలను ముడిచి కరచుటచే పెదవి యెఱగాగా విశుక్రుడు గణనాథునితో యుద్ధము జేసెను-87. దానవుల శస్త్రముల తాకిడి ధ్వనులును హుంకార ధ్వనులును చేలరేగినవి. దానవుల గుఱ్ఱముల గిట్టలు భూమిని బొడిచి త్రవ్వుచున్నట్లుగా నున్న ధ్వనులును చెలరేగినవి-88. గజేంద్రముల ఘీంకారములును, భయాక్రందనలును, గుజముల సకిలింపులును, రథచక్రముల ధ్వనులును-89. ధనువుల నారీ ధ్వనులును, చక్రముల ఛీత్కార ధ్వనులును -90, బాణముల ‘జుయ్’ అను ధ్వనులును, వీరుల సంభాషణ సమూహములుసు, అట్టహాసములును, మహేంద్రుల సింహనాదములును అంతట-91. దిగంతరములను క్షోభింపజేసినవి. ముప్పది యక్షౌహిణుల విశుక్రునిసేన ఇట్టి యుద్ధతమైన యుద్దమును జేసెను,-92. మహారథులైన గణనాథులు గూడ ప్రతి యొక్కని కొకరై యుద్ధము జేసిరి. దంతములతో బొడిచి చీల్చుచుండిరి. తొండములతో జుట్టి వేయుచుండిరి-98, పుష్కలావర్తక మేఘములతో సమానమైన చెవులతో కోపమున గొట్టి వేయుచుండిరి. పరుషములైన (తొండపు) ముక్కు శ్వాసలతో శత్రుసేన నంతయు చెల్లాచెదరు - చేయుచుండిరి-54 కొండ నెత్తముల వంటి యురములతో సేనను మగ్గించుచుండిరి. పాదాఘాతములతో పిండిచేయుచుండిరి. బలిసిన కడుపులతో జంపుచుండిరి-95. శూలములతో బొడిచి చీల్చుచుండిరి. చక్ర ప్రయోగములతో కత్తిరించుచుండిరి. శంఖముల మహా ధ్వనితో సేనను భయపెట్టుచుండిరి-96. గణనాథుని ముఖమునుండి వేలకొలదిగా బుట్టిన గజాననులు గొప్పగా విజృంభించి రాక్షస సైన్యమును దుమ్ము దుమ్ముగా మిగిల్చిరి-97. ఆ తరువాత కోపావిష్టుడై విశుక్రుడు తన సైన్యము ముందురాగా గజాసురుని జంపెను-98. ఆ గణేశ్వరుడు ఏడక్షౌహిణీ సైన్యములతో గూడి, దుర్బుద్ధియై, భయంకర సింహనాదము జేయు గజాసురునితో యుద్దము జేసెను-99. గజాసురునీ భు బలము తగ్గుచున్నది. గణేశ్వరుని పరాక్రము వృద్ధి జెందుచున్నది. అది చూచి విశుక్రుడు పారిపోయెను-100. అపుడు ఎలుక వాహనముగా గలిగిన గణేశ్వరుడు ఒకే వీరశ్రేష్ఠుడై ఏడక్షౌహిణుల సైన్యముతోనున్న గజాసురుని మర్దించెను-101. గజాసురుడు చావగా విశుక్రుడు పారిపోగా, మహాగణపతి రణరంగము నుండి లలితాదేవి యంకమున జేరెను-102. రాక్షసులకా రాత్రి కాలరాత్రిగా తెల్లవారెను. లలితాదేవి గణేశ్వరుని పరాక్రములకు మిక్కిలి ప్రీతి జెందినది-103. మహాగణపతియెడ సంతసించి దేవతలందరి పూజలకు ముందు పూజింపబడుటను వరముగా నొసగెను. అదియుత్తమమైన వరము-104.
ఇది శ్రీబ్రహ్మాండమహా పురాణముననుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున గణనాథపరాక్రమమను నిరువది యేడవ యధ్యాయము రెండవ దివసయుద్దము సమాప్తము.
Summary of chapter 139 of the Brahmānda Mahā Purana is as follows:
With tender compassion, this chapter recounts how goddess Lalitā, pleased with the prayers of the gods and Rati, resurrected Kāmadeva from his ashes using her merciful glance. She restored his form and divine function of inspiring pure love and harmony across creation without the taint of crude lust. The devout heart overflows with gratitude, worshipping the supreme mother who transforms binding desire into pure, liberating divine love.