42 - భార్గవచరితము

వసిష్ఠ ఉవాచ :-

ఏవం సంభ్రమితో రామో గణాధీశేన భూపతే

హర్షశోకసమావిష్టో వీచింత్యాత్మపరాభవమ్

 గణేశం చాభితో వీక్ష్య నిర్వీకారమవస్థితమ్

 క్రోధావిష్టో భృశం భూత్వా ప్రాక్షపత్ స్వపరశ్వధమ్

 గణేశస్త్వభివీక్ష్యాథ పిత్రా దత్తం పరశ్వధమ్

అమోఘం కర్తుకామస్తు పామే తం దశనే గ్రహీత్

 స తు దంతః కుఠారేణ విచ్ఛిన్నే భూతలేఖ పతత్

 భువి శోణితసంధిగ్ధో వజ్రాహత ఇవాచలః

దంత పాతేన విధ్వస్తా సాబ్ధిద్వీపధరా ధరా

చకంపే పృథివీపాల లోకాస్రాసముపాగతాః

 హాహాకారో మహానాసీద్దేవానాం దీవి పశ్యతామ్

 కార్తికేయాదయస్తత్ర చుర్రుశురళమాతురాః

అథ కోలాహలం త్వా దంతపాతధ్వనిం తథా

 పార్వతీశంకరౌ తత్ర సమాజగృతురీశ్వరౌ

 హేరంబం పురతో దృష్ట్వా వక్రతుండైకదంతినమ్

 ప్రప్రచ్ఛ పార్వతీ స్కందం కిమేతదితి కారణమ్

 స తు సృష్టిస్తదా మాత్రా సేనానీః సర్వమాదితః

 వృత్తాంతం కథయామాస మాత్రే రామస్య శృణ్వతః

 సా శ్రుత్వోదంతమఖిలం జగతాం జననీ నృప

ఉవాచ శంకరం రుషా పార్వతీ ప్రాణనాయకమ్

 పార్వత్యువాచ :-

అయం తే భార్గవః శంభో! శిష్యః పుత్రసమో భవత్

 త్వత్తో లబ్ద్వి పరం తేజో వర్మ త్రైలోక్యజిద్వీభో !

కార్తవీర్యార్జునం సంఖ్యే జీతవానూర్జీతం నృపమ్

స్వకార్యం సాధయిత్వా తు ప్రాదాత్తుభ్యం చ దక్షిణమ్

 యత్తే సుతస్య దశనం కుఠారేణ న్యపాతయత్

 అనేనైవ కృతార్థస్త్వం భవిష్యసి న సంశయః

 త్వమిమం భార్గవం శంభో రక్షాంతవాసిసత్తమం

తవ కార్యాణి సర్వాణి సాధయిష్యతి సద్గురోః

వసిష్ఠుఁడిట్లు చెప్పెను.

ఈ విధముగా నిక్కడకునక్కడకు గణేశుని వలన విసరబడి కైలాసమునకు తుదకు వచ్చినదానికి రాముఁడు సంతోషించెను. ఆత్మ పరాభవమునకు విచారించేను. నిర్వికార స్థితిలో నున్న గణేశుని ఎదురుగా చూచి, రాముఁడధికముగా క్రోధావిష్ణుఁడయ్యెను. గణేశునిపై పరశువును విసిరెను. గణేణుఁడది చూచెను. పితరుఁడొసంగిన అమోఘమయిన పరశ్వధము వ్యర్థము కాకుండుట కోరి ఆ పరశ్వధమును గణేశుఁడు తన ఎడమ దంతముతో గ్రహించెను. ఆ దంతము కుఠారముచే విచ్చిన్నమయి భూమిపై రాలేను. వజ్రముచే గొట్టఁబడిన పర్వతమువలె, భూమియంతయును రక్తసిక్త మయ్యెను. దంతపాతము వలన సముద్రములతో సహితము ద్వీపములు పర్వతములు విధ్వస్త్రములయ్యెను. పృథివి కంపించెను. లోకములు భయత్రస్తములయ్యెను. తత్సన్నివేశమును చూచుచున్న దేవతలలో స్వర్గమున గొప్ప “హాహా కారములు వెడలేను. కార్తికేయాదులందరును, మిక్కిలి భయాతురులయిరి. గట్టిగా రోదించిరి. అరచిరి. అంత దంతపాతధ్వనిని, ప్రజలయందలి కోలాహలమును విని, పార్వతీశంకరులచ్చట కేతెంచిరి. తనముందు ఏకదంతుఁడైయున్న హేరంబుని చూచి, స్కదుని పార్వతీదేవి “ఇదేమి? ఏమికారణమని యడిగెను. తల్లియడుగగా దేవతాసేనానియైన స్కందుడు తల్లికిమొదటినుండియు వృత్తాంతము నంతటినీ రాముఁడువినుచుండగనే చెప్పెను. జగజ్జననీ యగుటమే అఖిలవృత్తాంతమును వినెను, కోపముతో ప్రాణనాయకుఁడయిన శంకరునితో నిట్లనెను.

పార్వతి పలికెను :

పరమేశ్వరా ! ఈ నీ శిష్యుండు భార్గవుఁడు నీకు పుత్రసముఁడు. నీవలన నతఁడు ఉత్కృష్టతేజమును కవచమును పొంది త్రిలోక విజయుఁడయ్యెను. అధికశక్తిసామర్థ్యముగలిగిన కార్తవీర్యుని యుద్ధమునందుజయించెను. తనకార్యమునుసాధించుకోని రాముడు నీకో దక్షిణ నొసంగీనాఁడు. ఆదక్షిణ తన కుఠారము చేత నీకుమారునిదంతమును పడఁగోట్టుట. నీవో ఈ కార్యముచే కృతార్థుఁడవైతివి. సంశయములేదు. నీశిష్యసత్తముడయిన భార్గవుని ఓ ఈశ్వరా ! రక్షించు. ఆతఁడు సద్గురుఁడవయిన నీయొక్క సర్వకార్యములను సాధింపఁగలఁడు.

అహం నైవాత్ర తిషామి యత్త్వయా విమతా విభో

పుత్రాభ్యాం సహితా యాస్యే పితుః స్వస్య నికేతనమ్

 సంతో భుజిష్యాతనయం సత్కుర్వంత్యోత్మపుత్రవత్

భవతా తు కుతో నైవ సత్కారో వచసాఃపి హి

  ఆత్మనస్తనయస్యాస్య తతో యాస్యామి దుఃఖితా

 వసిష్ఠ ఉవాచ :-

ఏతచ్భుత్వా తు వచనం పార్వత్యా భగవాన్ భవః

 నోవాచ కించిద్వచనం సాధు వాసాధు భూపతే

 సస్మార మనసా కృష్ణం ప్రణతక్లేశనాశనమ్

 గోలోకనాథం గోపీశం నానానునయకోవిదమ్

 స్కృతమాత్రోఖథ భగవాన్ కేశవః ప్రణతార్తీహా

 ఆజగామ దయాసింధుర్భక్తవశ్యో ఖిలేశ్వరః

 మేఘశ్యామో విశదవదనో రత్నకేయూరబోరో విద్యుద్వాసా మకరసదృశ కుండలే సందధానః

 బర్పాపీడం మణిగణయుతం బీభ్రదీషల్సితాస్యో గోపీనాథ్ గదితసంయశాః కౌస్తుభోద్భాసివక్షాః

రాథయా సహితః శ్రీమాన్ శ్రీదామ్నా చ పరాజితః

 ముష్ణం స్తేజాంసి సర్వేషాం స్వరుచో జ్ఞానవారిధిః

 అక్రేనమాగతం దృష్ట్వా శివ సంపృష్టమానసః

 ప్రణిపత్య యథాన్యాయం పూజయామాస చాగతమ్

ప్రవేశ్యా భ్యంతరే వేశ్మ రాధయా సహితం విభుమ్

రత్నసింహాసనే రమ్యే సాదరం స న్యవేశయత్

 అథ తత్ర గతా దేవీ పార్వతీ తనయాన్వితా

ననామ చరణాన్ ప్రభ్వోః పుత్రాభ్యాం సహితో ముదా

 అథ రామోపి శత్రప గత్వా నమితకంథరః

 పార్వత్యాశ్చరణోపాంతే పపాతాకులమానసః

సా యదానాభ్యనందత్తం భార్గవం ప్రణతం పురః

 తదోవాచ జగన్నాథః పార్వతీం ప్రీణయన్ గిరా

 శ్రీకృష్ణ ఉవాచ :-

అయి నగనందిని ! నిందితచంద్రముఖి త్వమిమం జమదగ్నిసుతమ్

 నయ నిజహస్తసరోజసమర్పితమస్తకమంకమనంతగుణే

 ఇక్కడ నేనింక క్షణముండను, ఓవిభో నన్నవమానించితివి. నేనోపుత్రుల యిద్దరితో కూడికొని నాతండ్రిగారి గృహమునకు పోయెదను. సజ్జనులు నేవకురాలికుమారుని తమకుమారునీవలె సత్కరించుదురు. నీకుమారుడో నీచే పల్కుచే మాత్రమయిన గౌరవింపఁబడలేదు (ఆదరింప బడలేదు). అందుచేనేనో దుఃఖితను. నేను వెడలిపోయెదను.

వసిష్ఠుఁడిట్లు పలికేను :-

భగవంతుఁడయిన ఈశ్వరుఁడు పార్వతీవచనములను వీని మంచిదని కాని, మంచిది కాదని గాని నోరువిప్పి పల్లెత్తయినను పలుకలేదు. వెంటనే ఈశ్వరుఁడు నమస్కరించి ప్రార్థించిన వారిక్లేశమును నాశనమొనరించు కృష్ణుని మనసా స్మరించెను, కృష్ణుఁడుగోలోకనాథుఁడు గోవులకు ప్రభువు. ఇతరులననేకవిధముల ననునయించీ యోదార్చుటలో పండితుఁడు. తలచి నంత మాత్రముననే ప్రణతార్తిహరుఁడు, దయాసింధువు. భక్తులకు వశుఁడు, అఖిలేశ్వరుఁడు, మేఘశ్యామవర్ణుఁడు, విశదవదనుఁడు, రత్నకేయూరపోరుఁడు, విద్యుత్తువలె ప్రకాశించు వస్త్రముకలవాం డు మకర సదృశమయిన కర్ణ కుండలములుకలవాఁడు బరీపింఛసదృశమయిన శిరః ఓంఛముకలవాఁడు మజీగణయుతుఁడు చిరునవ్వుకలపాం డు గోపీనాథుఁడు అత్యంతప్రథితయశస్వి, కౌస్తుభమాణిక్యముచే ప్రకాశించు వక్షస్థలము కలవాఁడు భగవానుండు, కేశవుఁడు, రాధాసహితుం డు, దామోదరుడు, శ్రీమంతుఁడు, అపరాజితుఁడు, జ్ఞానసముద్రుఁడు, స్వతేజస్సుల నెల్లర తేజస్సును అతీశయించినవాడు వచ్చినకృష్ణుని చూచి,ఈశ్వరుఁడు సంహృష్టమానసుఁ డయ్యెను. న్యాయానుగుణముగ నాతనికి శివుడు నమస్కరించెను. (పూజించెను). రాధతోకూడప్రభువును అభ్యంతరగృహములోనికి ప్రవేశింప జేసెను. అత్యంతాదరముతో నతనినీ రత్నసింహాసనమున ఆసీమనిచేసెను. తనకుమారులతో నచ్చటకు వచ్చిన పార్వతీదేవి పుత్రులతో కూడికొని సంతోషముతో నతనికి నమస్కరించేను, శిరస్సు వంచుకోని రాముఁడచ్చటకు వచ్చి పార్వతీదేవి చరణోపాంతమున నేలపై పడెను. ఆతఁడధికముగా ఆకులమానసుడయ్యెను. తనముందు నేలపై వ్రాలి నమస్కరించిన భార్గవుని పార్వతి అభినందింపక పోవుట చూచి జగన్నాథుఁడయిన కృష్ణుఁడు పాక్కులచే పార్వతిని ననునయించుచు నిట్లు పలికెను.

కృష్ణుఁడిట్లనెను :-

ఓ పర్వతరాజపుత్రి కే చంద్రుని మించిన సౌందర్యము కలదానా ! ఈ జమదగ్నికుమారుని నీఅంకదేశమున జేర్చుకొనుము. నీహస్త సరోజమును ఆతని శీర్షముపై నుంచుము.

భవభయహారీణి ! శంభువిహారిణి కల్మషనాశినీ కుంభిగతే

తవచరణే పతితం సతతం కృతకిల్బిషమష్యవ దేహి పరమ్

 శృణు దేవి మహాభాగే వేదోక్తవచనం మమ

యచ్భుత్వా హరీలా నూనం భవిష్యసి న సంశయః

వినాయకస్తే తన మహాత్మా మహాతాం మహాన్

 యం కాచుః క్రోధ ఉద్వేగో భయం నావీశతే కదా

 వేదస్కృతిపురాణేషు సంహితాసు చ భామిని

 నామాన్యస్యోపదిషాని సుపుణ్యాణి మహాత్మభిః

యానీ తానీ ప్రవక్ష్యామి నిఖిలాఘహారాణి చ

ప్రమథానాం గణా యే చ నానారూపా మహాబలాః

 తేషామీశస్త్వయం యస్మాద్గణేశస్తేన కీర్తితః

 భూతాని చ భవిష్యాణి వర్తమానాని యాని చ

 బ్రహ్మాండావ్యభిలాన్యేవ యష్మింలంబోదరః స తు

 యః స్థిరో దేవయోగేన భిన్నం సంయోజితం పునః

 గజస్య శిరసా దేవి తేన ప్రోక్తో గజాననః

 చతుర్యాముదితశ్చంద్రో దర్భిణా శప్త ఆతురః

 అనేన వీధృతో భాలే భాలచంద్రస్తతః స్మృతః

 శప్తః పురా సప్తభిస్తు మునిభిః సంక్షయం గతః

 జాతవేదా దీపితో భూద్యేనాసౌ శూర్పకర్ణకః

 పురా దేవాసుర యుద్దే పూజితో దివిషద్గణేః

 విఘ్నం నివారయామాస విఘ్ననాశస్తతః స్మృతః

 అద్యాయం దేవి రామేణ కుఠారేణ నిపాత్య చ

దశనం దైవతో భద్రహ్యేకదంతః కృతో మునా

భవిష్యత్యథ పర్యాయే బ్రహ్మణో హరవల్లభే

వక్రీభవిష్యత్తుంగత్వాద్వక్రతుండః స్మృతో బుధైః

 ఏవం తహస్య పుత్రస్య సంతీ నామాని పార్వతి

స్మరణాతాపహారీణి త్రికాలానుగతాన్యపి

 అస్మాత్రయోదశీకల్పాత్పూర్వస్మిన్ దశమీభవే

మయాస్త్రి తు వరో దత్తః సర్వదేవాగ్రపూజనే

జాతకర్మాదిసంస్కారే గర్భాధానాదీకేపి చ

యాత్రాయాం చ వణీజ్యదౌ యుద్దే దేవార్చనే శుభే

 భవభయహారిణి ! అనంతగుణ ! శంభువిహారిణి, కల్మషనాశిని, కృతకిల్బిషుఁడయినను, నీ చరణములపై పడి ప్రార్థించినవాఁడు, అగుట ఈతనికీ వరము నొసంగుము. ఓ పూజ్యురాలా ! వేదోక్తమయిన నా వచనమును వినుము. దానినివిని నీవు తప్పక హర్షితురాలవగుదువు. సందేహము లేదు. వినాయకుఁడు నీకుమారుఁడు. మహానుభావులలో మహానుభావుడు. ఆతనిని కామము క్రోధము, ఉద్వేగము, భయము నెప్పుడును చేరవు. ఓ పుణ్యురాల ! ఆతని పుణ్యమయిన నామములు వేదములలో స్మృతులలో, పురాణములలో చెప్పం బడినవి అయ్యవియన్నియు పాపహరములు. వానిని చెప్పుచున్నాను. ప్రమథగణములు నానారూప మహాబలములు. వానికి ఈతఁడు ఈశుఁడు అధిపతి. అందుచేగణేశుఁడని కీర్తింపఁబడినాఁడు,  ఆతని యుదరము నందు భూత భవిష్య ద్వర్తమాన స్థితములయిన బ్రహ్మాండము 'లఖిలములు కలవు. అందుచేలంబోదరుఁడు. డ్రైవయోగముచే శీరము భిన్నమయి ఏనుగు తలచే మరల స్థిరమగుటవలనగజాననుఁడు. పూర్వము చతుర్థినాడుదయించిన చంద్రుఁడు ‘దర్శి'చేశపుఁడై ఆతురుడు, అప్పుడు విఘ్నేశ్వరుఁడాతనిని (చంద్రుని) ఫాలమునధరించెను. అందుచే నతఁడు (విఘ్నేశ్వరుడు) భాలచంద్రుఁడయినాఁడు. జాతవేదుఁడు(అగ్ని) పూర్వము సప్తఋషులచే శపింపఁబడెను. అందుచే సంక్షయమొందెను, అయినను ఈ వినాయకునిచే జాతవేదుఁడు మరల (విసరబడి) ప్రజ్వలింపబడెను. అందుచే గణేశుఁడు శూర్పకర్ణకుఁడయినాఁడు. పూర్వము దేవాసురయుద్ధమున దేవతాగణములచే నతఁడు పూజితుఁడయ్యెను. వారి వీఘ్నములను నివారించెను. అందుచే విఘ్ననాశకుఁడని స్మరింపం బడుచున్నాఁడు, ఓ దేవి! ఇప్పుడు రామునిచే దైవికముగా కుఠారముచే పడగొట్టఁబడి ఏకదంతుఁడయినాఁడు, ఓ హరవల్లభే !. భవిష్యత్కాలమున బ్రహ్మ సృష్టిలో ఈతని తొండము వక్రమగును. అందుచే బుధులీతనిని వక్రతుండునిగా స్మరింతురు. ఓ తల్లి ! నీకుమారునకు నామములున్నవి. స్మరణమాత్రము చేతనే యవి పాపహరములు శ్రీకాలానుగతములు కూడ. ఈ పదమూడవ కల్పమునకుఁబూర్వము, పదియవ సృష్టిలో (దశమభవే). అందరి దేవతలచే మున్ముందుగా పూజనొందువానినిగా నీతనికి నేనువరము నొసంగితిని. జాతకర్మాదిసంస్కారములందు గర్భాధానదీకములయందు యాత్రయందు, వాణిజ్యమునందు,దేవతార్చనము నందు

సంకష్టే కామ్య సిద్ధ్యర్థం పూజయేద్యో గజాననమ్

 తస్య సర్వాణీ కార్యాణీ సిద్ధ్యంత్యేవ న సంశయః

వసిష్ఠ ఉవాచ :-

ఇత్యుక్తం తు సమాకర్ణ్య కృష్ణేన సుమహాత్మనా

 పార్వతీ జగతాం నాథా విస్మితాసీ చ్ఛుభాననా

యదా వైవోత్తరం ప్రాదార్ పార్వతీ శివసన్నిధౌ

 తదా రాధాబ్రవీద్దేవీం శివరూపా సనాతనీ

శ్రీ రాధోవాచ :-

ప్రకృతీః పురుషశ్చోభావన్యోన్యాశ్రయవిగ్రహో

ద్విధా భిన్నా ప్రకాశేతే ప్రపంచేస్మిన్ యథా తథా

త్వం చాహమావయోర్దేవి భేదో నైవాస్తి కశ్చన

విష్ణు స్వమహమేవాష్మి శివో ద్విగుణతాం గతః

శివస్య హృదయే విష్ణుర్భవత్యా రూపమాశ్రితః

మమ రూపం పవస్థాయు విష్ణోశ్చ హృదయే శివః

ఏష రామే మహాభాగే వైష్ణవః శైవతాం గతః

 గణేశ్యం శివఃసాక్షాద్వైష్ణవత్వం సమస్థితః

 ఏతయోరావయోః ప్రభ్వోశ్చాపి భేదో న దృశ్యతే

 ఏవముక్త్వా తు సా రాధ క్రోడే కృత్వా గజాననమ్

 మూర్ఖ్యుపామ్రాయ పస్పర్శ స్వహస్తేన కపోలకే !

 స్పృష్టమాత్రే కపోలే తు క్షతం పూర్తిముదాగతమ్

 పార్వతీ సుప్రన్నాభూదనునీతాలిథ రాధయా

 పాదయోః పితరం రామముత్థాష్య నిజపాణినా

 క్రోడీచకార సుప్రీతా మూర్త్యుపాఘాయ పార్వతీ

ఏవం తయోస్తు సత్కారం దృష్ట్వా రామగణేశయోః

కృష్ణః స్కందముపాకృష్య స్వాంకే ప్రేమ్ణా న్యవేశయత్

 అథ శంభురపి ప్రీతః శ్రీరామానముపస్థితమ్

స్వోత్సంగే స్థాపయామాస ప్రేమ్ణా సత్కృత్య మానదః

 ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

భార్గవచరితే ద్విచత్వారింశత్తమో ధ్యాయః

శుభ సమయమునందు, సంకట సమయమునందు, ఎవ్వఁడు గజాననుని పూజించునో, ఆతనికి సర్వకార్యములు సిద్ధించును. ఇందు సంశయము లేదు.

వసిష్ఠుడిట్లనెను :-

మహాత్ముఁడయిన కృష్ణుడిట్లనుటవిని, జగజ్జననీ పార్వతీ, ఆశ్చర్యచకితానన యయ్యెను. శివసన్నిధి యందు పార్వతీ ప్రత్యుత్తరమీయక యుండ, శివరూప, సనాతని యగు రాధ దేవితో నిట్లనెను.

 శ్రీరాధ ఇట్లు పలికెను :-

ప్రకృతి పురుషుఁడు ఈ రెండును అన్యోన్యాశ్రయములు. ఈ ప్రపంచమున మాత్రమా రెండు భిన్నముగా నున్నట్లు కనవచ్చును. నీవు నేనును ఒకటియే. మనలో నిద్దరకు భేదములేదు. నీవు విష్ణువువు. నేను శివుఁడను. ఆకారమున ద్వీగుణత్వము నొందితిని. శివుని హృదయమున విష్ణువు నీరూపము నొందెను, మజీ విష్ణునీ హృదయమున శివుఁడు నారూపము నొందెను. ఈ మన యిరువురిలో ప్రభువులలో భేదము కానరాదు. ఓ పూజ్యురాలా ! ఈ రాముఁడు వైష్ణవుఁడు శైవత్వము నొందెను. ఈ గణేశుఁడు సాక్షాత్తువైష్ణవత్వము నొందిన శివుఁడు ఈ విధముగా రాధ పలికి, గజాననుని తన యొడిలో పెట్టుకొని శీర్షము నాఘ్రాణించి తన హస్తముతో ఆతని కపోలమును తాకెను. స్పృశించినంతమాత్రమున ఆతనిచెక్కిలిపై పుండు మానిపోయేను, రాధచే ఆశ్వాసింపఁబడి పార్వతి సుప్రసన్నయయ్యెను. ఆమె పాదములపైపడి నమస్కరించిన రాముని తన చేతులతో లేవనెత్తి తొడమీఁద కూర్చుండ బెట్టుకొని మూర్ధమాఘ్రాణముచేసి దీవించెను. రామగణేశుల యొక్క యీ సత్కారమును చూచి కృష్ణుఁడు స్కందుని తన తొడమీఁద కూర్చుండఁ బెట్టుకొనెను. అంత వచ్చిన శ్రీ రాముని వలన శంభుఁడు ప్రీతుఁ డయ్యెను. శంభువు ఆతనిని తన యుత్సంగమున ప్రేమతో కూర్చుండ బెట్టుకొని సత్కరించెను.

ఇదీ వాయుప్రోక్త మహాపురాణమయిన బ్రహ్మాండమునందు, మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున భార్గవ చరితమున నలుబది రెండవ అధ్యాయము.