63 - ఇక్ష్వాకువంశము

సూత ఉవాచ :-

కుకుర్మీనస్తు తం లోకం రైవతస్య గతస్య హ

హృత్వా పుణ్యజనైః సర్వా రాక్షసైః సా కుశస్థలీ

తద్వై భ్రాతృశతం తస్య ధార్మికస్య మహాత్మనః

నిబధ్యమానం నారాచైః విదిశః ప్రాద్రవద్భయాత్

తేషాం తు తద్భయక్రాంతక్షత్రియాణాం చ విద్రుతామ్

అన్వవాయస్తు సుమహాంస్తత్ర తత్ర ద్విజోత్తమాః

శౌర్యతో ఇతి విఖ్యాతా దీక్షు సర్వాసు ధార్మికాః

ధృష్టస్య ధార్టీకం సర్వం రణధృష్టం బభూవ హ

శ్రీసాహస్రం తు సగణః క్షత్రియాణాం మహాత్మనామ్

నభగస్య చ దాయాదో నాభాగో నామ వీర్యవాన్

అంబరీషస్తు నాభాగిర్వీరూపస్తస్య చాత్మజః

పృషదశ్వో విరూపస్య తస్య పుత్రో రథీతరః

ఏతే క్షత్రప్రసూతి వై పునశ్చాంగీరసః స్మృతాః

రషీతరాణాం ప్రవరాః క్షేత్రోపేతా ద్విజాతయః

క్షువతస్తు మనోః పూర్వమీక్ష్వాకురభినిఃసృతః

తస్య పుత్రశతం త్వాసీదిక్ష్వాకోః భూరిదక్షిణమ్

తేషాం శ్రేజే వికుక్షిస్తు నిమిల్దండశ్చ తే త్రయః

శకునిప్రముఖాస్తస్య పుత్రాః పంచశతస్తు తే

ఉత్తరాపథదేశస్య రక్షిరారో మహీక్షితః

చత్వారింశత్తథాష్ఠా చ దక్షిణస్యాం తు వైదీశీ

విరాటప్రముఖాస్తే చ దక్షిణాపథరక్షిణః

ఇక్ష్వాకుస్తు వికుక్షిం వై అష్టకాయామథాధిశత్

సూతుఁడిట్లనెను.

కకుర్మీయని పిలువఁబడు రైవతకుండు (బ్రహ్మ) లోకమున కరుగగా, ఆతని నగర మయిన కుశస్థలిని యక్షులు) రాక్షసులు స్వాధీనము : చేసికొనిరి (అపహరించిరి) ధార్మికుఁడయిన ఆ మహాత్ముని నూర్గురు సోదరులు బాణములచే కొట్టబడిరి. ప్రాణ భయమున. వారు నానాదిక్కులకు పారిరి, ఓ ద్విజోత్తములారా భయాక్రాంతులై పలాయితులయిన క్షత్రియులయొక్క అన్వయము చాల గొప్పది. అయినను వారు నలుదిక్కులకు పారిపోయిరి. శర్యాతులనీ వారు సర్వత్ర ప్రసిద్ధులు. వారు ధార్మికులు. దృష్ట యొక్క వంశీయులు ఛార్షకులు, వారందరు యుద్ధమున - ధైర్యవంతులు. ధృష్టవంతులు (అసాధ్యులు). ఆ క్షత్రియ మహాత్ముల వంశము మూడు వేల మంది. నభగుని యొక్క దాయాది నాభాగుండు. నాభాగుని కుమారుఁడు అంబరీషుఁడు. అంబరీషుని కుమారుఁడు విరూపుఁడు. విరూపుని కుమారుఁడు పృషదశ్వుఁడు. పృషదశ్వునీ కుమారుం డు, రథతరుఁడు. వీరందరు క్షత్రియ వంశమున పుట్టినవారు. కానీ వీరినీ ఆంగిరసులనీ స్మరింతురు, రథోతరుని ఉత్తమ వంశీయులు బ్రాహ్మణులు క్షత్రియులు కూడ. (7) పూర్వము మనువు తుమ్మగా ఇక్ష్వాకుఁడు పుట్టెను. ఇక్ష్వాకునకు నూర్గురు పుత్రులు. వారు భూరి దక్షిణలు బ్రాహ్మణుల తృప్తి పరచిరి. వారిలో (ఆ నూర్గురిలో) వికుక్షి, నిమి, దండుడు - అను ముగ్గురు శ్రేష్ఠులు. ఆతనికి ఏబది. పుత్రులు. వారిలో ముఖ్యుఁడు శకుని. (7) వారు ఉత్తరాపథ దేశములకు రక్షకులు. వారిలో విరాటుడు మొదలైన నలుబది యెనమండ్రు. దక్షిణాపథ రక్షకులు. అష్టకమను నొక శ్రాద్ద క్రియయందు, ఇక్ష్వాకుఁడు వికుక్షి కిట్లాదేశించెను. రాజిట్లాదేశించెను. “ఓ మహాబల ! శ్రాద్దము కొఱకు మృగముల చంపి మాంసమును దేమ్ము ఈ శ్రాద్ధాష్టకము నాచే తప్పక ఆచరింపఁ బడవలెను. (11)

రాజోవాచ :-

మాంస మానయ శ్రాథే త్వం మృగాన్ హత్వా మహాబల !

శ్రాద్ధం మమ తు కర్తవ్యమష్టకానాం చ సంశయః

సగతో మృగయాం చైవ వచనాత్తస్య ధీమతః

మృగాన్ సహస్రకాన్ హత్వా పరిశ్రాంతశ్చ వీర్యవాన్

భక్షయచ్ఛశకం తత్ర వికుక్షిరృగయాం గతః

ఆగతే హి వికుక్షౌ తు సమాంసే సహస్రనికే

వశిష్ఠం చోదయామాసమాంసం ప్రోక్షయతామితి

తథేతి చోదితే రాజ్ఞా విధివత్తదుపస్థితమ్

సదృష్ట్వాపహతం మాంసం క్రుధో రాజానమబ్రవీత్

అనేనోపహతం మాంసం పుత్రేణ తవ పార్థివ

శశభక్షాదదుష్టం వై నైవ మాంసం మహాద్యుతే

శశో దురాత్మనా పూర్వమమనా భక్షితోఽనఘ

తేనమాంసమీదం దుష్టం పితరోణాం సృపసత్తమ

ఇక్ష్వాకుర్తు తతః క్రుడ్లో వికుక్షిమీదమబ్రవీత్

పితృకర్మణి నిర్దిష్ణో మయా చ మృగయాం గతః

శశం భక్షయసేఽరణ్యే నిర్హణః పూర్వమద్య తు

తస్మాత్ పరిత్యజామి త్వాం గచ్ఛ త్వం స్వేన కర్మణా

ఏవమీక్ష్వాకుణా త్యక్తో వసిష్టవచనాత్సుతః

ఇక్ష్వాకౌ సంస్థితే తస్మిణ్ఛశాదః పృథివీమిమామ్

ప్రాప్తః పరమధర్మాత్మా స చాయోధ్యాథిపోఽభవత్

తదాఽకరోత్స రాజ్యం వై వసిష్ఠపరినోదితః

తతస్తేనైనసా పూర్ణో రాజ్యావస్థో మహీపతిః

కాలేన గతవాన్ సోఽథ శకృన్మూత్రతరంగితమ్

జ్ఞాత్వైవమేతదాఖ్యానం నావిధిర్భక్షయేద్భుధః

ధీమంతుఁడయిన యాతని యాజ్ఞచే ఆతఁడు వేటకరిగెను. చాల మృగములను చంపెను. అంత ఆతఁడు అలసిపోయెను. వేటకు వెళ్లిన వికుక్షి యొక కుందేటిని తినెను. వికుక్షి మాంసముతో తన సైన్యముతో తిరిగి రాగా, రాజు “మాంసమును చూడుడు, నీటినీ దానిపై చల్లుఁడు” అనెను. ‘అట్లే’ యనెను వసిషుఁడు. మాంసమును రాజు వశిష్ఠునకు చూపెను. మాంసము కలుషితమగుట చూచి వసిషుఁడు క్రుద్దుఁడయ్యెను. రాజుతో నిట్లనెను. ఓ రాజా ! మాంసము కుమారునిచే కలుషీకృతమయినది. శశమును తినుట వలన - ఓ మహారాజా, మాంసము దుష్టమయినది. ఓ రాజా ! ఈ దురాత్మునిచే శశము పూర్వము భక్షింపఁబడినది. అందుచే పితరులకీ మాంసము దుష్టము” అని. తరువాత ఇక్ష్వాకుఁడు క్రుద్దుఁడై వికుక్షితో - నాచే పితృకర్మకు నిర్దిష్ణుఁడవై వేట కరణ్యమున కరిగితివి. కాని నీవు శశమును ముందుగనే యీ రోజున తీంటివి. నీవు నీర్ఘణుఁడవు. దయాశూన్యుఁడవు. అందుచే నిన్ను నేపరిత్యజించుచున్నాను. నీ కర్మమున నీవెచ్చట కేనియేగుము”, అనెను. ఈ విధముగా నతఁడు ఇక్ష్వాకునిచే పరిత్యజింపఁబడెను. అందుచే నాతఁడు శశాదుఁడయ్యెను. (కుందేలునీ తిన్నవాఁడు) ఆతఁడు పరమధర్మాత్ముఁడు. అయోధ్యాధిపుఁడయ్యెను. వసిష్ఠునిచే ఆదేశింపఁబడి రాజ్యము నతఁడు చేసెను. రాజ్యము చేయుచుండగా రాజు ఆతని పాపముచే బాధపడెను. కొంతకాలము తరువాత శకస్మూత్ర తరంగములలో పడి ఆతడు నరకమేగెను. ఇది చదివిన తరువాత విధి నిషిద్ధముగా బుద్దిమంతుఁడేదియును తినరాదు.

మాం సభక్షయితాముత్ర యస్య మాంసమీహాద్మ్యహమ్

ఏతన్మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషిణః

శశాదస్య తు దోహదః కకుథో నామవీర్యవాన్

ఇంద్రస్య వృషభూతస్య కకుత్తో జయతే పురా

పూర్వమాడీబకే యుద్ధే కకుత్థస్తేన సంస్కృతః

అనేవాస్తు కకుత్సస్య పృథుశ్చానేన సస్మృతః

దృషదశ్వః పృథోః పుత్రస్తస్మాదంధ్రస్తువీర్యవాన్

ఆంధ్రాత్తు యువనాశ్వస్తు శ్రావస్తస్తస్య చాత్మజః

జజే శ్రావస్తకో రాజా శ్రావస్తీ యేన నిర్మితా

శ్రావస్తస్య తు దాయాదో బృహదశ్వో మహాయశాః

బృహదశ్వసుతశ్చాపి కువలాశ్వ ఇతి శ్రుతః

యస్య ధుంధువధాద్రజా ధుంధుమారత్వమాగతః

ఋషయ ఊచుః :-

ధుంధోర్వధం మహాప్రాజ్ఞ శ్రోతుమిచ్ఛామ విస్తరాత్

యదర్థం కువలాశ్వస్య ధుంధుమారత్వ మాగతమ్

సూత ఉవాచ :-

కువలాశ్వస్య పుత్రాణాం సహస్రాణ్యేకవింశతిః

సర్వే విద్యాసు నిష్ణాతాః బలవంతో దురాసదా

బభూవుర్థార్మీకాస్సర్వే యజ్వానో భూరిదక్షిణాః

కువలాశ్వం మహావీర్యం శూరముత్తమధార్మికమ్

బృహదశ్వో హ్యభ్యషించత్తస్మిన్ రాజ్యే నరాధిపః

పుత్రసంక్రామీతశ్రీస్తు వనం రాజా వివేళ హ

బృహదశ్వం మహారాజం శూరముత్తమధార్మికమ్

ప్రయాస్యంతముతంతస్తు బ్రహ్మర్షిః ప్రత్యవాదయత్

‘మాంస’ పదమునకు అర్థము. ఎవరి మాంసమును నేను తినుచుంటినో అయ్యది నన్ను తినును మాం=నన్ను, సః = అతఁడు భక్షయితా = తప్పక తినును) తరువాతి జన్మలో, ఇదీయే మాంసత్వము, శశాదుని యొక దాయాది కకుత్తుడను వీర్యవంతుఁడు. పూర్వము ఆడీబక యుద్ధమున ఇంద్రుడు వృషభరూపమొందెను. ఈ రాజు ఆ వృషభము యొక్క మూపురమున కూర్చుండెను. కకుత్తుఁడు యుద్ధమున జయించెను. (వృషభము (ఇంద్రుఁడు) కకుది మూపురమందు స్థితః ఉన్నవాఁడు) అందుచే నీతఁడు కకుత్తుఁడయినాఁడు. కకుత్తుని కొమరుఁడు అనేవసుడు. పృథువు అనేనస కుమారుఁడు పృథుని కుమారుఁడు దృషదశ్వుఁడు. వీర్యవంతుఁడయిన రాజు అంధ్రుఁడు ఆతని వల్లబుట్టెను, అంధ్రునకు యువనాశ్వుఁడు పుత్రుడు, శ్రావస్తు ఆతని కుమారుఁడు. శ్రావస్తుండు రాజయ్యెను. ఆతఁడే శ్రావస్తీ నగరమును నిర్మించెను. శ్రావస్తుని వారసుండు బృహదశ్వుఁడు. ఆతఁడు ప్రఖ్యాతవంతుడు. బృహదశ్వుని సుతుఁడు కువలాశ్వుఁడు. ధుంధు వధ వలన ఆ రాజు ధుంధుమారుఁడని పేరు . గోంచెను. ధుంధుమారుఁడయ్యెను. ఋషులిట్లడిగిరి. ధుంధువు యొక్క వధను సవిస్తరముగా వీనఁగోరెదము, ఏకారణమున కువలాశ్వునకు. ధుంధుమారత్వమబ్బెనో ఆ వృత్తాంతమును జెప్పుడు. సూతుఁడిట్లు నుడివేను.. కువలాశ్వునకు (21000) ఇరువది యొక వేయి పుత్రులు వారందరు సర్వ విద్యల యందు ఆరితేరినవారు. బలవంతులు. దురాసదులు. అందరు ధార్మికులే. యజ్ఞము లాచరించినవారు. గొప్పగొప్ప దక్షిణల నొసంగినవారు. బృహదశ్వుఁడు, మహావీరుఁడు, శూరుఁడు, ఉత్తముఁడునైన కువలాశ్వుని తన రాజ్యము నందు రాజుగా నభిషేకించేను. పుత్రులకు సర్వైశ్వర్యము లొసంగి రాజు అరణ్యము ప్రవేశించేను. (33) మహారాజు, శూరుఁడు, ఉత్తమ ధార్మికుఁడు నైన బృహదశ్వుని వనమునకు ప్రయాణమై పోవు వానీని మహర్షి యైన ఉత్తంకుఁడు పారించెను. (34)

ఉత్తంక ఉవాచ :-

భవతా రక్షణం కార్యం తత్తావత్కర్తుమర్హతి

నిరుద్విగుస్తపశ్చర్తుం న హి శక్రోఽపి పార్థివ

మమాశ్రమ సమీపేషు మేరోర్హి పరితస్తు వై

సముద్రో వాలుకాపూర్ణస్తత్ర తిష్ఠతి భూపతే

దేవనామవద్యస్తు మహాకాయో మహాబలః

అంతర్భూమిగతస్తత్ర వాలుకాంతర్షితో మహాన్

రాక్షసస్య మధేః పుత్రో ధుంధుర్నామమహాసురః

శేతే లోకవినాశాయ తప ఆస్థాయ దారుణమ్

సంవత్సరస్య పర్యంతే స నిశ్వాసం ఏముంచతి

యదా తదా మహీ తత్ర చలతిస్మ సకాననా

తస్య నిశ్వాస వాతేన రజ ఉదూయతే మహత్

ఆదిత్యపథమావృత్య సప్తాహం భూమికంపనమ్

సవిస్ఫులింగం సజ్వాలం సధూమమతీదారుణమ్

తేన రాజన్న శక్నోమి తస్మిన్ స్థాతుం స్వ అశ్రమే

తం వారయ మహాబాహో ! లోకానాం హితకామ్యయా

తేజస్తే సుమహద్విష్ణుస్తేజసాప్యాయయిష్యతి

లోకాః స్వస్థా భవంత్యద్య తస్మిన్ వినిహతే సురే

త్వం హి తస్య వధార్థాయ సమర్థః పృథివీపతే

విష్ణునా చ వరో దత్తా మమ పూర్వం యతోఽనఘ

న హి ధుంధుర్మహావీర్యస్తేజసాల్పేన శక్యతే

నిర్దగుం పృథివీపాలైరపి వర్షశతైరపి

వీర్యం హి సుమహత్తస్య దేవైరపి దురాసదమ్

ఏవముక్తస్తు రాజర్షిరుత్తంకేన మహాత్మనా

కువలాశ్వం తు తం ప్రాదాత్ తస్మిన్ ధుంధునివారణే

ఉత్తంకుఁడిట్లు చెప్పెను. ప్రజారక్షణము నీ కార్యము. నీవు దానీ నాచరింప నరుఁడవు. ఓ రాజా ! నిరుద్విగ్నుఁడవై (శాంతమనస్సుతో) తపము చేయలేకుంటివి. ఓ రాజా ! నా యాశ్రమ సమీపములందు, మేరు పర్వతపు ప్రక్కను, సముద్రము ఇసుకతో నిండియున్నది. దేవతలచే, అవధ్యుఁడు, మహాకాయుఁడు, మహాబలుఁడు, రాక్షసుఁడైన, మధుని పుత్రుఁడు ధుంధువను మహా రాక్షసుఁడు, అంతర్భూమిగతుఁడై, (ఇసుకలో అంతర్షితుఁడై) (పూడిపోయి) లోకవినాశనము కొఱకు, దారుణమయిన తపమందుండి యున్నాడు. సంవత్సరాంతమున నొకసారి ఆతఁడు - నిశ్వసింప భూమీ సకాననముగా చలించిపోవును. (39) ఆతని నీశ్వాసవాయువుచే గొప్పగా రజస్సు బయలుదేరును. ఆ వాయువు ఆదిత్యమార్గము నావరించును. భూమి ఏడురోజులు ప్రకంపనము చెందును. విస్ఫులింగములతో, మంటలతో, ధూమముతో అతి దారుణమై యొప్పును. అందుచే నేను నా యాశ్రమమున నిలువ జాలకుంటిని. ఓ మహారాజ ! లోకమునకు హితమాచరింప వానిని వారించుము. నీ తేజము చాల గొప్పది. విష్ణువు నీ తేజస్సును ఇంకను నధీకము చేయును. ఆ రాక్షసుఁడు చంపఁబడినచో లోకములన్నియు. స్వస్థములగును. ఓ.పృథివీపతీ ! నీవు ఆ రాక్షసవధకు నరుఁడవు. పూర్వము ఓ రాజా ! ఆతనిని చంపెదనని విష్ణుతల్యుండవయిన నీవు నాకు వరంబొసంగితివీ. ధుంధుఁడు మహావీర్యుండు అల్పతేజస్సుచే చంపబడ శక్తుఁడు కాడు. పృథివీ పాలురు వర్షశతము యుద్ధము చేసినను, ఆతనినీ దగ్గపటలుని చేయుటకు వీలు కాదు. ఆతని వీర్యము చాల గొప్పది దేవతలకు దరిచేరి జయింపరానిదీ”. అని మహాత్ముఁడు రాజర్షి ఉత్తంకుండు పలుక, రాజు ధుంధుమారుని వధార్థము కువలాశ్వు నొసంగెను.

భగవన్న్యస్తశస్త్రోఽహమయం తు తనయో మమ

భవిష్యతి ద్విజశ్రేష్ఠ ధుంధుమారో న సంశయః

స తమాదిశ్య తనయం ధుంధుమారణమచ్యుతమ్

జగామ సవనాయైవ తపసే శంసితవ్రతః

కువలాశ్వస్తు ధర్మాత్మా పితుర్వచనమాశ్రితః

సహస్రరేకవింశత్యా పుత్రాణాం సహ పార్థివః

ప్రాయాదుత్తంకసహితో ధుంధోస్తస్య నివారణే

తమావితత్తతో విష్ణుః భగవాన్ స్వేన తేజసా

ఉత్తంకస్య నియోగాత్తు లోకానాం హితకామ్యయా

తస్మిన్ ప్రయాతే దుర్ధర్ష దివి శబ్లో మహానభూత్

అద్య ప్రభృత్యేష నృపో ధుంధుమారో భవిష్యతి

దివ్యైః పుపైశ్చ తం దేవాః సమంతాత్ సమవాకిరన్

దేవదుందుభయశ్చైవ ప్రణీదుర్షి తదాభృశమ్

సగత్వా పురుష వ్యాఘస్తనయైః సహ వీర్యవాన్

సముద్రం నయామాస వాలుకాపూర్ణమవ్యయమ్

తస్య పుతైః ఖనద్భిశ్చ విలుకాంతర్షితస్తదా

ధుంధురాసాదితస్తత్ర దిశమాశ్రిత్య పశ్చిమామ్

ముఖజేనాన్నీనా క్రుదో లోకానుద్వర్తయన్నివ

వారి సుస్రావ యోగేన మహోదధిరివోదయే

సోమస్య సోఽసురశ్రేష్ణో ధారోరికలీలో మహాన్

తస్య పుత్రాస్తు నిర్దగ్ధస్త్రయ ఉర్వరితా మృధే

తతః స రాజాతిబలో రాక్షసం తం మహాబలమ్

ఆససాద మహాతేజా ధుంధుం బంధునిబర్హణమ్

భగవన్ ! నేను శస్త్రత్యాగము చేసితిని. ఈతఁడు నా కుమారుడు. సంశయింపకుము. ఈతఁడు తప్పక ధుంధుమారకుఁడు కాగలఁడు.” విడువక ధుంధువును చంపుకార్యమును నెరవేర్చుమని ఆతనిని శాసించెను. శంసితవ్రతుఁడయిన రోజు తపస్సునకు అరణ్యమున కరిగెను. ధర్మాత్ముఁడయిన కువలాశ్వుఁడు పితృవాక్యము నాశ్రయించి ఇరువది యొక వేయి సంఖ్య గల తన పుత్ర వర్గముతో, ఉత్తంకునీతో కూడ ధుంధువు యొక్క నివారణము కొఱకు బయలుదేరెను. అంత భగవంతుఁడయిన విష్ణువు స్వతేజస్సుతో నాతనిని ఆవేశించెను. ఉత్తంకుని యొక్క నియోగము వలన లోకములకు హితమాచరించుకోరికతో, దుర్ధర ప్రతాపుఁడయిన ఆ మహారాజు బయలుదేరగా, ఆకాశమున మహా శబ్దమొకటయ్యేను. “నేఁడు మొదలుకొని యీ రాజు ధుంధుమారుడగును. దేవతలందరు దీవ్యములయిన . పుష్పములతో ఆతనిపై నంతట వర్షించిరి. అప్పుడు దేవదుందుభులు గట్టిగా ధ్వనించేను. పురుషవ్యాఘమైన యాతఁడు తన కుమారులతో కూడి వెడలెను. ఇసుకతో అవ్యయముగా నిండియున్న సముద్రమును త్రవ్వించెను. ఆ మహారాజపుత్రులచే త్రవ్వబడి, మౌలుకలో (ఇసుకలో) అంతర్షితుఁడయి పశ్చిమముగా నున్న ధుంధువుని వారు గాంచిరి. ధుంధువు క్రుద్ధుఁడయ్యెను. ముఖము నుండి పుట్టిన అగ్నితో లోకములను తల్లక్రిందులు చేయబూనినట్లుండెను. (55) ఆ అసురశ్రేష్ఠుఁడు తన యొక్క యోగబలముచే మహోదధి చంద్రోదయమున తరంగ సమూహములతో నీటిని గుమ్మరించునట్లు మహోర్మికలతో ప్రవహింప చేసెను. ఆ మహారాజ పుత్రులందరు పూర్తిగా దగ్గపటలులైరి. వానితోడి యుద్దములో ముగ్గురు మాత్రమే మిగిలిరి. అంత మహా బలుఁడు, మహాతేజుఁడునయిన రాజు తన బంధువుల (ఐరి) నెల్లరంజంపిన అతిబలుఁడయిన ధుంధువును చేరెను.

తస్యవారిమయం వేగమపి వత్స నరాధిపః

యోగీ యోగేన వహ్నిం చ శమయామాస వారిణా

నీరస్యంతం మహార్రాయం బలేనోదకరాక్షసమ్

ఉత్తంకం దర్శయామాస కృతకర్మా నరాధిపః

ఉత్తంకశ్చ వరం ప్రాదాత్తసై రాజ్ఞే మహాత్మనే

దదతశ్చాక్షయం విత్తం శత్రుభిశ్ఛాప్రధృష్యతామ్

ధర్మే రతిం చ సతతం స్వర్గీ వాసం తథాక్షయమ్

పుత్రాణాం చాక్షయాంల్లోకాన్ స్వరే యే రక్షసాహతాః

తస్య పుత్రాస్త్రయః శిష్టా దృధాశ్వో జ్యేష్ఠ ఉచ్యతే

భద్రాశ్వః కపిలాశ్వళ్ళ కనీయాంసౌ తు తెసుతౌ

రౌంధుమారిర్దృశాశ్వశ్చ హర్యశ్వస్తస్య చాత్మజః

హర్యశ్వస్య నికుంభోఽభూత్క్షాత్రధర్మరతః సదా

సంహతాశ్వో నికుంభస్య సుతో రణవిశారదః

కృశాశ్వశాలకృతాశ్వశ్చ సంహతాశ్వసుతావుభౌ

తస్య పత్నీ హైమవతీ సతీ మాతా దృషద్వతీ

విఖ్యాతా త్రిషులోకేషు పుత్రశ్ఛాస్య ప్రసేనజిత్

యువనాశ్వసుతస్తస్య త్రీషులోకేషు విశ్రుతః

అత్యంతధార్మికా గౌరీ తస్య పత్నీ పతివ్రతా

అభిశప్తా తు సా భద్రా నదీ సా బాహుదా కృతా

తస్యాస్తు గౌరికః పుత్రశ్చక్రవర్తీ బభూవ హ

మాంధాతా యౌవనాశ్వో వై త్రైలోక్యవిజయీ నృపః

అత్రాప్యుదాహరంతీమం శ్లోకం పౌరాణికా ద్విజాః

యావత్సూర్య ఉదయతే యావచ్చ ప్రతితిష్ఠతి

సర్వం తద్యౌవనాశ్వస్య మాంధాతుః క్షేత్రముచ్యతే

తస్య చైత్రరథీ భార్యా శశబిందోః సుతాఽభవత్

యోగియయిన రాజు తన యోగబలముచే, రాక్షసుఁడు కల్పించిన నీటియొక్క వేగమును శమింప చేసెను, వహ్నినీ నీటిచే చల్లార్చేను, తుదిని మహాకాయుఁడయిన ఆ ఉదకరాక్షసుని తన శక్తిచే చంపెను. కృతకర్ముఁడై రాజు మృతుఁడయిన ధుంధుపును ఉత్తంకునకు చూపెను. మహాత్ముడయిన రాజునకు ఉత్తంకుఁడు వరమొసంగెను. దానమిచ్చిన కొలదీ అధికము అక్షయమునగు విత్తమును, శత్రువులకప్రధష్యత్వము, సతతము ధర్మమునందాసక్తియు, అక్షయముగా సర్గమునందు వాసము, రాక్షసునిచే హతులయిన పుత్రులకు స్వర్గమున అక్షయలోకములు వరములుగా రాజున కొసంగెను. బ్రతీకీయున్న ముగ్గురు పుత్రులు శిష్టులు. వారిలో జ్యేష్ణుఁడు దృఢశ్వుఁడు. భద్రాశ్వుడు, కపిలాశ్వుఁడు చిన్నవారు. దృఢశ్వుండు రౌంధుమారిగా విశ్రుతుఁడు. ఆతని కుమారుఁడు హర్యశ్వుడు. హర్యశ్వునీ పుత్రుఁడు నికుంభుఁడు. నీకుంభుం డెల్లప్పుడు క్షత్రియ ధర్మవిశారదుఁడు. (64) సంహతాశ్వుఁడు నికుంభుని సుతుఁడు, ఇతఁడు రణవిశారదుఁడు. సంహతాశ్వునకు కృతాశ్వుండు, అకృతాశ్వుఁడు అను నిద్దరు కుమారులు, సంహతాశ్వుని పత్ని హైమవతి. ఆమె పతివ్రత. తల్లి దృషద్వతి, త్రిలోకవిఖ్యాత. ఆతని కుమారుం డు ప్రసేనజిత్తు. ఆతని కుమారుఁడు యువనాశ్వుఁడు, లోకత్రయమున విశ్రుతుడు. (65) ఈతని భార్య గౌరి. ఆమె అత్యంత ధార్మికురాలు పతివ్రత. కాని ఆమె భర్తచే శపింపఁబడి ‘బాహుదా’ నదిగా! మారిపోయినది. ఆమె కుమారుడు గౌరికుఁడు, ఈతఁడు చక్రవర్తి యయ్యెను. యువనాశ్వుని కుమారుఁడగు మాంధాత మూడు లోకములను జయించిన రాజు. ఈ విషయములో పౌరాణీకద్విజులు ఈ శ్లోకము నుదహరింతురు. “సూర్యుఁడెందెందుదయించునో, ఎందెందు ప్రతిష్టితుఁడగునో అదియంతయు యౌవనాశ్వుఁడయిన మంధాత యొక్క క్షేత్రమని చెప్పుదురు. ఆతనికి చైత్రరథ భార్య. ఆమె శశబిందునీ కూతురు. (?)

సాధ్వీ బిందుమతీ నామ రూపేణాప్రతిమా భువీ

పతివ్రతా చ జ్యేష్ఠా చ భాతృణామయుతస్య సా

తస్యాముత్పాదయామాస మాంధాతా త్రీన్ సుతాన్ ప్రభుః

పురుకుత్సమంబరీషం ముచుకుందం చ విశ్రుతమ్

అంబరీషస్య దాయాదో యువనాశ్వోఽపరః స్మృతః

నర్మదాయాం సముత్పన్నః సంభూతస్తస్య చాత్మజః

సంభూతస్యాత్మజః పుత్రో హ్యనరణ్యః ప్రతాపవాన్

రావణేన హతో యేన త్రైలోక్యం విజితం పురా

తేన దృశ్యోనరణ్యస్య హర్యశ్వస్తస్య చాత్మజః

హర్యశ్వాత్తు దృషద్వత్యాం జజే చ సుమతీర్నృపః

తస్య పుత్రోఽభవద్రాజా త్రిధన్వా నామ ధార్మికః

అసీత్రిధన్వనశ్చాపి విద్వాంస్థయ్యారుణిః ప్రభుః

తస్య సత్యవ్రతో సోమ కుమారో భూర్మహాబలః

తేన భార్యా విదర్భస్య హృతా హత్వా దివొకసః

పాణిగ్రహణముండ్రేషు నిష్టానం ప్రాపితేష్వాహ

కామాత్బలాచ్చ మోహాచ్చ సంహరేణ బలేన చ

భావినోఽఅర్ధస్య చ బలాత్తత్కృతం తేన ధీమతా

తమధర్మేణ సంయుక్తం పితా త్రయ్యారుణోఽత్యజత్

అపధ్వంసేతి బహుశో వదన్ క్రోధసమన్వితః

పితరం సోఽబ్రవీదేకః క్వ గచ్చామీతి వై ముహుః

పితా చైనమథోవాచ శ్వపాకైలెస్సహవర్తయ

నాహం పుత్రేణ పుత్రార్జీ త్వయాద్య కులపాసన

ఇత్యుక్తః స నిరాక్రామన్నగరాద్వచసాద్విభోః 

నచైనం వారయామాస వసిష్ఠో భగవాన్ ఋషిః

స తు సత్యవ్రతో ధీమాన్ శ్వపాకావసధాంతికే

పిత్రా త్యక్తాఽవసఫ్గరః పితాచాస్య వనం యయౌ

ఆమే బిందుమతి. సాధ్వి, రూపమున ఆమె భూమీయందత్వీయ. ఈ సాధ్వీ వేయిమంది సోదరులకు అక్క ఆమె వలన మాంధాతకు ముగ్గురు కొమరులు, వారు పురుకుత్సుఁడు, అంబరీషుఁడు, ముచికుందుఁడనీ విఖ్యాతులు. యువనేశ్వుఁడు అంబరీషునకు దాయాది (వారసుం డు). ఈమె నర్మదకు జన్మించెను, అతని కుమారుఁడు సంభూతుఁడు. సంభూతునకాత్మజుఁడు అనరణ్యుఁడు. అతఁడు ప్రతాపవంతుఁడు. ఆతనిని రిషణుఁడు చంపెను. రావణుఁడో మూఁడులోకములను జయంచినవాఁడు. (74) దృశ్యుఁడు అనరణ్యుని యొక్క కుమారుడు.. హర్యశ్వుండు దశ్యుని పుత్రుఁడు. హర్యశ్వ దృషద్వతులకు ‘సుమతి’ పుట్టెను. ఆ సుమతి పుత్రుఁడు ధార్మికుఁడు, పేరు త్రిధన్వుఁడు. త్రీధన్వుని కుమారుఁడు త్రయ్యారుడి. ఆతఁడు పెద్ద పండితుఁడు. (76) ఆతనికి సత్యవ్రతుఁడు కుమారుఁడు. ఆతఁడు మహాబలు(డు. దీనౌకలను (దేవతలను - పితరులను)చంపి, సత్యవ్రతుఁడు వీధరుని యొక్క భార్యను ఎత్తుకొని పోయెను. ఆ విద్వాంసునిచే ఈ పాపకృత్యము కామముచే, బలముచే, మోహముచే నొనర్పఁబడెను, ఇయ్యది అనివార్యమయిన భవిష్యత్కాలకర్మచే ఆధీమంతునిచే చేయఁబడెను. పాణిగ్రహణ మంత్రములు సంపూర్ణము కానప్పుడే యీ కార్యమాతఁడు చేసెను. ఆతడొనర్చిన యధర్మకార్యమునకు ఆతని తండ్రి త్రయ్యారణుఁడు కుమారుని బహిష్కరించెను. (71) తండ్రి క్రోధ సమన్వితుఁడై ఈ కార్యము అవమానకరము, అపధ్వంసము అనీ పలుమార్లు చెప్పుచు చేసెను. ఆతఁడు పదేపదే తండ్రిని నేను ఒక్కడను. ఎక్కడ కేగువాఁడ'నని యడిగెను. తండ్రి ‘కుక్కమాంసము వండుకొని తినువారితో కలిసి నర్తించుము. నీవలన పుత్రుని నేను కోరను నీవో కులపొంసుఁడవు’ అనెను. ఇట్లు చెప్పఁబడి తండ్రి ఆజ్ఞచే- నతఁడు నగరము నుండి వెడలేను. భగవంతుఁడు వసిష్ణుండైన నాతని వారింపలేదు. ధీమంతుడైన సత్యవ్రతుఁడు తండ్రిచే వ్యక్తుఁడై శ్వపాకుల నివాసాంతీకమున నివసించేను. తరువాత అతని తండ్రికూడ నరణ్యమున కరగెను.

తస్మింస్తు విషయే తస్య నావర్షత్పాకశాసనః

సమా ద్వాదశ సంపూర్ణాస్తేనాధర్మేణ వై తదా

దారాంస్తు తస్య విషయే విశ్వామిత్రో మహాతపాః

సంన్యస్య సాగరానూపే చచార విపులం తపః

తస్య పత్నీ గళే బద్ధ్వా మధ్యమం పుత్రమౌరసం

శిష్టానాం భరణార్థాయ వ్యక్తీణాద్గోశతెన వై

తం తు బద్ధం గళే దృష్ట్వా విక్రయార్థం నరోత్తమ

మహర్షిపుత్రం ధర్మాత్మా మోక్షయామాస సువ్రతః

సత్యవ్రతో మహాబుద్ధిర్భరణం తస్య చొకరోత్

విశ్వామిత్రస్య తుష్ఠ్యర్థమనుకంపార్థమేవ చ

సోఽభవద్దాలవో నామ గలే ఐదో మహాతపాః

మహర్షిః కౌశికస్తాత తేన వీరేణ మోక్షితః

తస్య వ్రతేన భక్త్యా చ కృపయా చ ప్రతిజ్ఞయా

విశ్వామిత్రకళత్రం చ బభార వినయే స్థితః

హత్వా మృగాన్వరాహాంశ్చ మాహిషాంశ్చ జలేచరాన్

విశ్వామిత్రాశ్రమాభ్యాసే తన్మాంస మనయత్తతః

ఉపాంశువ్రతమాస్థాయ దీక్షాం ద్వాదశవార్షికీమ్

పితుర్ని నియోగాదభజనపై తు వనమాస్థితే

అయోధ్యాం చైవరాష్ట్రం చ తథైవాంతఃపురం మునిః

యాజ్యోత్థాన్యాయసంయోగద్వసిష్ఠ పర్యరక్షత

సత్యవ్రతః సుబాల్యాతు భావినోఽర్థస్య వైబలాత్

వసిష్ఠేఽభ్యధికం మన్యుం ధారయామాస మన్యునా

పీత్రా తు తం తద్ రాష్ట్రాత్పరిత్యక్తం స్వమాత్మజమ్

న వారయామాస మునిః వసిష్ఠః కారణేన వై

ఈ పాపము కారణముగా ఇంద్రుఁడాదేశమున పూర్తిగా పదిరెండేండ్లు ఒక్క చినుకైన రాల్చలేదు. (84) మహాతపస్వి విశ్వామిత్రుఁడు తన భార్యను ఆ రాజు యొక్క రాష్ట్రమున విడిచిపుచ్చి, సముద్ర సమీపమందలి కయ్యలలో దీర్ఘమయిన తపస్సాచరించెను. (85) ఆతని పత్ని తనకు పుట్టినకుమారులలో మధ్యముని యొక్క గళమున త్రాడు కట్టి పందగోపుల వెలకు అమ్మజూపెను. ఆమె మిగిలిన కుమారులను పోషించుట కొఱకు ఈ కుమారు నమ్మజూపెను. (86) ధర్మాత్ముఁడు సువ్రతుఁడు నైన రాజు, విక్రయము కొఱకు గళమున కట్టబడిన మహర్షి పుత్రుని చూచి యాతని విడిపించేను. (విముక్తిని చేసెను). విశ్వామిత్రుని సంతుష్టిపరచుటకు, ఆతనీ దయకొలకు, బుద్ధిమంతుఁడయిన సత్యవ్రతుఁడు ఆతనిని రక్షించి భరించెను. (పోషించేను) మెడలో త్రాడు గట్టఁబడిన బాలుఁడు కాలాంతరమున గోలవుఁడను మహాతపస్వి యయ్యెను. కౌశికుఁడు (కుశిక వంశోత్పన్నఁడు) వీరుఁడైన సత్యవ్రతునిచే విముక్తుఁడయ్యెను. పూనిన వ్రతము చేతను, భక్తి చేతను, దయచేతను, ప్రతిజ్ఞచేతను సుప్రతుఁడు (రాజు) విశ్వామిత్రుని యొక్క భార్యను కూడ నియబద్ధుఁడై పోషించెను. (90) ఆతఁడు మృగములను, వరాహములను, మహిషములను, జలచరములను చంపి వానీ మాంసమును విశ్వామిత్రునీ సన్నిధికి తీసికొనివచ్చెడివాఁడు. వసిష్టునియొక్క ప్రేరేపణమున సత్యవ్రతుని తండ్రి ఉపాంశువ్రతమును స్వీకరించి, తన్నిమిత్తమై పండ్రెండ్లిండ్ల దీక్ష వహించేను. రాజు అరణ్యమున కేగినప్పుడు, వసిష్ఠుఁడు సత్యవ్రతుని వలన కలుగు దుస్సంబంధము వలన నుండి, అయోధ్యానగరమును, రాష్ట్రమును రాజాంతఃపురమును, రక్షించెను. (73) సత్యవ్రతుఁడు బాల్యముచే, అనివార్యమగు భవిష్యత్తు. యొక్క బలముచే, తన విచారముచే వసిష్ణునీ యెడ కోపము వహించెను. రాష్ట్రము నుండి తండ్రి కుమారుని బహిష్కరించుచుండ వసిష్ఠుఁడు ఆతని నివారింప లేదనుకరణముచేతనే వసిష్టుని యెడ నాతనికి కోపము.

పాణిగ్రహణమంత్రాణాం నిష్ఠా స్యాత్సప్తమే పదే

ఏవం సత్యవ్రతస్తాం వై హృతవాన్ సప్తమే పదే

జాననర్మాన్వసిష్టస్తు నవమంత్రానిహేచ్ఛతి

ఇతి సత్యవ్రతో రోషం వసిష్ఠ మనసాః కరోత్

గుణబుద్ధ్యా తు భగవాన్ వసిష్ఠః కృతవాంస్తపః

న తు సత్యవ్రతోఽబుద్ధ్యదుపాంశువ్రతమస్య వై

తస్మింస్తు పరమో రోషః పితురాసీన్మహాత్మనః

తేన ద్వాదశ వర్షాణి నావర్షతాకశాసనః

తేన వ్వీదానీం వహతా దీక్షాం తాం దుర్వహాం భువి

కులస్య నిష్కృతిః స్వస్య కృతేయం చ భవేదితి

తతో వసిష్ణో భగవానీత్రా వ్యక్తం న వారయత్

అభిషేక్ష్యామ్యహం నష్ట పశ్చాదేసమితి ప్రభుః

స తు ద్వాదశ వరాణి దీక్షాం తాముద్వహన్ బలీ

అవిద్యమానే మాంసే తు వసిష్ఠస్య మహాత్మనః

సర్వకామదుభం ధేనుం స దదర్శ నృపాత్మజః

తాం వైక్రోధాచ్ఛ మోహాచ్చ శ్రమాచ్చైవ క్షుధాన్వితః

దస్యుధర్మగతో దృష్వా జఘాన బలీనాం వరః

స తు మాంసం స్వయం చైవ విశ్వామిత్రస్య చాత్మజాన్

భోజయామాస తచ్ఛృత్వా వసిష్ఠస్తం తదాఽత్యజత్

ప్రోవాచ చైవ భగవాన్వసిష్ఠస్తం నృపాత్మజమ్

పాతయేయమహం క్రూర తవ శంకుమపోహ్య వై

యది తే శ్రీడి శంకూని న స్యురీ పురుషాధమ !

పితుశ్చాపరితోషేణ గురోర్దోగ్రీవధేన చ

అప్రోక్షితోపయోగాచు త్రివిధస్తే వ్యతిక్రమః

పాణిగ్రహణ మంత్రములలో తుదీదీ సప్తపది, దానిని తలపోసి సప్తమపాదమున సత్యవ్రతుఁడు ఆమెను పరిత్యజించేను. “వసిష్ఠుఁడు ధర్మము నెఱింగియు, నవ మంత్రములను గోరుచున్నాఁడని చెప్పుచు సత్యవ్రతుఁడు తనమనమున వసిషుని యెడకోపించెను. భగవానుఁడైన వసిష్ఠుఁడు వారియొక్క క్షేమము కొఱకు తపమాచరించెను. కాని అతని ‘ఉపాంశు’ వ్రతమును సత్యవ్రతుఁడు గ్రహీంపలేదు. (78) మహాత్ముం డైన యాతని కోపమంతయును కుమారునియందే అధికమయ్యెను. అందుచే ఇంద్రుఁడు పండ్రెండు సంవత్సరములు వర్షింపలేదు. “అందుచే ఏతత్కులమునకు నిష్కృతి కఠినమైన దీక్ష వహించిన నాచే ఇప్పుడు జరుగును” అని వసిష్ఠుఁడు తలపోసెను. అందుచే పుత్రుని దేశ బహిష్కృతుని చేయు తండ్రి తండడ్డుపెట్ట లేదు.” “ఆతఁడు చనిపోయిన వెనుక నీతనిని నేను అభిషిక్తునిచేసెద నని వసిష్ఠుఁడు. తలంచెను. అంతలో, బలవంతుడైన రాజు ద్వాదశవర్ష దీక్షను వహించెను. మాంసమప్పుడు దొరకనందున, నృపాత్మజుండు కోరికలనొసంగు కామదుఘ యైన వసిష్ఠుని ధేనువును చూచెను. దానిని క్రోధముచే మోహముచే, శ్రమచే, ఆకలిచే చూచి, ఛండాలుని ధర్మమును వహించీ దొంగవలే బలవంతులలో శ్రేషుఁడయిన రాజపుత్రుఁడు వసిష్టునీ యందలి కోపముచే ఆ ధేనువును చంపెను. ఆతఁడు ఆ మాంసమును విశ్వామిత్రుని కుమారులచే తినిపించెను. (104) ఏతద్వృత్తాంతమును విని వసిష్ఠుఁడాతనిని త్యజించెను. వసిష్ఠుఁడు రాజకుమారునితో ఓ క్రూరుఁడా నీకిప్పటికే మూడు పాపములు లేకుండ నున్నచో నిన్ను పతితునిచేసేవాఁడను. నీవో ఇంకొక ఫరపాతకము చేసితివి. నీవు మూఁడు విధములుగా పాతకము లాచరించితివి. నీ తండ్రిని అసంతృప్తనీ జేసితివి; నీగురువైన నాయొక్క ధేనువును చంపితిని. నీటితో ప్రోక్షితము చేయకుండగ భుజించితివి. ఇది విధి వ్యతిక్రమము.

ఏవం చ త్రీణి శంకూని దృష్ట్వా తస్య మహాతపాః

త్రిశంకురిత హోవాచ త్రిశంకుస్తేన స సృతః

విశ్వామిత్రస్తు దారాణామాగతో భరణే కృతే

తతస్తస్మై వరం ప్రాదాత్తదా ప్రీతః త్రిశంకవే

ఛంద్యమానో వరేణాథ గురుం వజ్రే నృపాత్మజః

సశరీరో ప్రజే స్వర్గమిత్యేవం యాచితో వరః

అనావృష్టిభయే తసింజాతే ద్వాదశవార్షికే

అభిషిద్య రాజ్యే పిత్ర్యే యోజయామాస తం మునిః

మిషతాం దేవతానాం చ వసిష్ఠస్య చ కౌశికః

సశరీరం తదా తం వై దివమారోపయత్ర్పభుః

మీషతస్తు వసిష్ఠస్య తదద్భుతమీవాభవత్

అత్రాప్యుదాహరంతీమం శ్లోకం పౌరాణికా జనాః

విశ్వామిత్రప్రసాదేన త్రిశంకుర్దివి రాజతే

దేవైః సార్థం మహాతేజోఽనుగ్రహాత్తస్య ధీమతః

తస్య సత్యరతో నామ భార్యా కైకయ వంశజా

కుమారం జనయామాస హరిశ్చంద్రమకల్మషమ్

స శురాజా హరిశ్చంద్రస్రంశకవ ఇతి శ్రుతః

అహర్తా రోజసూయస్య సమ్రాడితి పరిశ్రుతః

హరిశ్చంద్రస్య తు సుతో రోహిత్ నామ వీర్యవాన్

హరితో రోహితస్యాథ చంచురారీత ఉచ్యతే

వినయశ్చ సుదేవశ్చ మంచుపుత్రో బభూవతుః

జేతా సర్వస్య క్షేత్రస్య విజయస్తేన సంస్కృతః

రురుకస్తనయస్తస్య రాజా ధర్మార్థకోవిదః

రురుకాత్తు వృకః పుత్రః తస్మాద్భాహు ర్వజజ్జీవాన్

హైహయెస్తాలజంపైశ్చ నీరస్తో వ్యసనీ నృపః

శకైర్యవనకాంభోఐః పారదైః పహ్లవైస్తథా

మహాతపస్వీ యీ మూఁడుపాపములోతని యందు చూచెను. అందుచే నతనిని త్రిశంకువనిరి. తాను లేనప్పుడు తన భార్యను రక్షించుటచే నతనీ యంద్రు ప్రీతుఁడయ్యెను.ఆతడతనికి వరమీడేను. వరము కోరుకొమ్మనీ. బలాత్కరింప ఆ రాజపుత్రుఁడు “నీవు నాకు గురుఁడవు కావలెను. స్వశరీరముతో స్వర్గమునకు నేను వెళ్లవలయు ననీ వరము యాచించెను. (110) పండ్రెండు సంవత్సరములు అనావృష్టి భయముచే, ముని యీతనినీ ప్రీత్యరాజ్యమున నభిషిక్తునీ చేసెను. దేవతలు,మునియైన వసిష్ఠుఁడు, సశరీరముగా నీరాజ పుత్రుని విశ్వామిత్రుఁడు దీవమున కారోహింప జేయచూచిరి. ఇది యత్యంతమాశ్చర్యకరమయ్యెను. ఏలయన, వసిష్ఠుఁడు తాను స్వయముగా చూచుచుండుటచే ఈ సందర్భమున పురాణ పరిచితులైన వారీ శ్లోకము నుదహరించెదరు. విశ్వామిత్రుని ప్రసాదము వలన, దేవతలతో సహా మహా తేజస్వి త్రిశంకుండు ఆకాశమున ప్రకాశించుచున్నాఁడు” అని. ఆతని భార్య సత్యరత, ఆమె కైకయవంశమున పుట్టెను. ఆమెకు హరిశ్చంద్రుఁడు కుమారుఁడు. ఆతఁడకల్మషుఁడు. ఆ రాజయిన హరిశ్చంద్రుఁడు త్రిశంకుఁడని సంస్కృతుఁడు. ఆతడు రాజసూయ యజ్ఞముల నాచరించినవాడని, సమ్రాట్టని ప్రఖ్యాతి పొందెను, (116) హరిశ్చంద్రుని కుమారుఁడు రోహితుఁడు. ఆతఁడు వీర్య వంతుండు. రోహితుని కుమారుడు హరీతుఁడు. హరితుని కుమారుడు చంచును. చంచువు యొక్క పుత్రులు వీనయుఁడు, సుదేవుఁడును. సుదేవుఁడు సర్వక్షత్రియవిజేత అందుచేనతఁడు వీజయుఁడుగా ప్రసిద్ధుఁడు. విజయునికుమారుఁడు రురుకుఁడు, రాజయిన రురుకుఁడుఁడు ధర్మము నందు అర్థశాస్త్రమునందు కోవిదుఁడు. గురుకునకు వృకుఁడు పుత్రుం డు వృకుని పుత్రుఁడు బాహువు. బాహువు వ్యసనపరుఁడైన రాజు, హైహయులు, తాలజంఘులు, శకులు, యవనులు, కాంభోజులు, పారదులు, పహ్లవులు - వీరందరతనిని పదచ్యుతుని చేసిరి.

నాత్యర్థం ధార్మికోఽభూత్స ధర్మ్యే సతీ యుగే తథా

సగరస్తు సుతో బాహోర్జజ్ఞే సహగరేణ వై

భృగోరాశ్రమమాసాద్య హ్యార్వేణ పరిరక్షితః

ఆగ్నేయమస్త్రం లఖ్వా తు భార్గవాత్సగరో నృపః

జఘాన పృథివీం గత్వా తాలజంఘాన్న హైహయాన్

శకానాం పప్లవానాం చ ధర్మం నిరసదచ్యుతః

క్షత్రియాణాం తథా తేషాం పారదానాం చ ధర్మవిత్

ఋషయః ఊచుః :-

కథం స సగరోరాజా గరేణ సహా జజ్ఞివాన్

కిమర్థం వా శూదీనాం క్షత్రియాణాం మహౌజసాం

ధర్మాన్ కులోచితానుద్ధో రాజా నీరసదచ్యుతః

సూత ఉవాచ :-

బాహోర్వ్యసనస్తస్య హృతం రాజ్యం పురా కిల

హైహయెస్తాలజం పైశ్చ శకైః సార్థం సమాగతైః

యవనాః పారదాశ్చైవ కాంభోజాః పహ్లావాస్తథా

హైహయార్థం పరాక్రాంతా ఏతే పంచగణాస్తథా

హృతరాజ్యస్తదా బాహుః సంన్యస్య చ తదా గృహమ్

వనం ప్రవిశ్య ధర్మాత్మా సహ పత్యా తపోచరత్

కదాచిదపకల్పః స తోయార్థం ప్రస్థితో నృపః

వృద్ధత్వాద్దుర్బలత్వాచ్ఛ హ్యంతరా స మహర చ

పత్నీ తు యాదవీ తస్య సగర్భా పృష్ణతోఽప్యగాత్

సపత్యా తు గరస్తస్మై దతో గర్భజిఘంసయా

సాతు భర్తుశ్చితాం కృత్వా వహ్నిం తం సమరోహయత్

ఔర్వస్తం భార్గవో దృష్ట్వా కారుణ్యాద్ధి న్యవర్తయత్

ఆ యుగము ధర్మమున కనుకూలముగా నున్నను ఆ రాజు (బాహువు) అత్యర్థముగా ధర్మరహితుఁడయ్యెను. ఆబాహువు కుమారుఁడు సగరుండు. గరము (వీషము)తో జన్మించెను. (121) భృగుని ఆశ్రమమున నాతఁడు జన్మించెను. ఔర్వునిచే రక్షింపఁబడెను. భృగుని మనుమం డయిన ఔర్వుని వలన ఆగ్నేయాస్త్రమును బడసి, రాజయిన సగరుఁడు విజయయాత్రకు ప్రపంచమున బయలుదేరి, తాలజంఘులను, హైహయులను చంపెను. ధర్మవిదుఁడయిన రాజు. శకుల యొక్క పహ్లవుల యొక్క ధర్మమును నిరాకరించెను. ధర్మము యొక్క సత్యస్వభావము నెఱిఁగిన సగరుఁడు పారదులనెడు క్షత్రియులను స్వవర్ణము నుండి బహిష్కరించెను, ఋషులిట్లడిగిరి, విషము నుండి సగరుఁడు ఎట్లు జన్మించెను? కుదుఁడయిన రాజు ఎన్నడును దోషమాచరింపనివాఁడు, మహౌజసులు ధర్మవంతులు క్షత్రియులునయిన శకాదులను వంశపరంపరయా వచ్చు ధర్మము ననుసరించు వారలను ఏల పరిత్యజించెను. (కులము నుండి వెలివేసెను)? (125) సూతుఁడిట్లు, సమాధాన మొసంగెను. ఇంతకు పూర్వమే చెప్పఁబడినది - దుర్వ్యసనియైన బాహువు యొక్క రాజ్యము శకులతో కూడివచ్చిన హైహయులచేతను తాలజంఘులచేతను అపహృతమయినది. (126) యవనులు, పారదులు, కాంభోజులు, పహ్లవులు (శకులు) ఈ యైదు జాతులవారు హైహయులకొఱకు పరాక్రాంతులయిరి. (ఒండొరులతో యుద్ధము చేసిరి) సంహృతరాజ్యండయిన బాహువు తన గృహాదులనెల్లను విడిచి పుణ్యవనమును ప్రవేశించెను. ధర్మాత్ముడయిన బాహువు తన భార్యతో తపమాచరించెను. (128) దుర్భలుడయినను రాజు ఒకనాఁడు నీరు తెచ్చుటకు వెడలెను. పద్ధత్వముచే, దుర్భలత్వముచే నతఁడు ఆయరణ్యములో మరణించెను. యాదవ వంశ్యురాలయిన ఆ రాజపత్ని, ఆపన్నసత్త్వ, ఆతని వెనుకనే వేడలేను. ఆమె సవతి, ఆమె గర్భస్థమయిన శిశువు మరణింపవలెనని విషమామేకిడెను. ఆమె భర్తకు చితిపై నిప్పు పెట్టి, తాను కూడ ఆ చీత్ నారోహించెను. భృగుని మనుమఁడయిన ఔర్వుఁడు ఆమెను చూచి, దయపుట్టి, చితినుండి ఆమెను విరమింపఁజేసెను.

తస్యాశ్రమే తు గర్భం సా గరేణ చ తదా సహ

వ్యజాయత మహాబాహుం సగరం నామ ధార్మికమ్

ఔర్వస్తు జాతకర్మాదీన్ కృత్వా తస్య మహాత్మనః

అధ్యాప్య వేదాఇస్రాణి తతోఽస్త్రం ప్రత్యపాదయత్

తతః శకాన్ సయవనాన్ కాంభోజాన్ పారదాంస్తథా

పహ్లావాంశ్చైవ నిఃశేషాన్ కర్తుం వ్యవసితో నృపః

తే హన్యమానా వీర్ణ సగరేణ మహాత్మనా

వసిష్ఠం శరణం సర్వే సంప్రాప్తాః శరణెషిణః

వసిషో వీక్ష్య రాన్యుక్తాన్వినయేన మహామునిః

సగరం వారయామాస తేషాం దత్వా భయం తథా

సగరః స్వాం ప్రతిజ్ఞాం చ గురోర్వాక్యం నిశమ్య చ

జఘాన ధర్మం వై తేషాం వేషాన్యత్వం చకార చ

అర్ధం శకానాం శిరసో ముందయిత్వా వ్యసర్జయత్

యవనానాం శిరః సర్వం కాంభోజానాం తథైవ చ

పారదా ముక్తకేశాశ్చ షష్ణవాః శ్మశ్రుధారిణః

నీఃస్వాధ్యాయవషటకారాః కృతాస్తేన మహాత్మనా

శకా యవనకాంభోజః పప్లవాః పారదైః సహ

కలిస్పర్శా మాహిషికా దార్వాశ్చోలాః ఖశాస్తథా

సర్వే తే క్షత్రియగణాః ధర్మస్తేషాం నిరాకృతః

వసిష్టవచనాత్పూర్వం సగరేణ మహాత్మనా

స ధర్మవిజయీ రాజా విజిత్యేమాం వసుంధరామ్

అశ్వం వై చారయామాస వాజిమేధాయ దీక్షితః

తస్య చారయతః సోఽశ్వః సముద్ర పూర్వదక్షిణే

వేలాసమీపేఽపహృతో భూమిం చైవ ప్రవేశితః

స తం దేశం సుతైః సర్వైః ఖానయామాస పార్థివః

ఆసేతుశ్చ తతస్తస్మిన్ ఖననంతస్తే మహార్ణవే

ఆ ఔర్వుని ఆశ్రమములో విషముతో సహితముగా. మహాబాహుడు ధార్మికుఁడునైన సగరునీ ఆమె కనెను. (132) ఆ మహాత్మునకు ఔర్వుడు జాతకర్మాదు లాచరించెను. వేదాలను శాస్త్రములను అధ్యయనము చేయించెను. తరువాత ఆస్త్రవిద్యను ప్రసాదించెను. తరువాత ఆ.. రాజు (సగరుఁడు) శకులను, యవనులను, కాంభోజులను, పారదులను, పహ్లవులను నిశ్శేషము చేయుటకు నిశ్చయించుకొనెను. (134). వారందరు వీరుఁడు, మహాత్ముఁడునైన సగరునిచే బాధింపఁబడ, వారందరు శరణాభిరతులయి వసిష్ఠునీ శరణుజొచ్చిరి. వినయవంతులయిన వారందరిని వసిష్ఠుఁడు చూచి, భయము నుండి వారికి అభయమొసఁగి, సగరుని వారిని చంపుట నుండి వారించేను. సగరుండు తన ప్రతిజ్ఞను, గురుఁడయిన వసిష్ఠునీ వాక్యమును విని, వారి వంశాగత కులాచారములను, ధర్మమును ఛేదించెను. వారి వేషములను, వస్త్రధారణములను మార్చుకొనునట్లు చేసెను. ఆతఁడు శకులయొక్క తలలను సగము గొరిగించెను; యవనుల యొక్క తలలను పూర్తిగా గొరిగించి విడిచెను, కాంభోజులకు నట్లే యొనర్చెను. పారదులను జుత్తు విదల్చుకొనియుండునట్లును, పహ్లవులను వారి మీసములను గడ్డమును మాత్రమే పెంచుకోనునట్లును చేసెను. వీరందరు స్వాధ్యాయ రహితులుగను, వషట్కారమంత్రములు లేకుండువారలగను సగరుఁడు చేసెను. శకులు, యవనులు, కాంభోజులు, ప్రహ్లవులు, పారదులు, కలిస్పర్థులు, మహిషికులు, దార్పులు, చోళులు, ఖశాసులు మొదలగు క్షత్రియగణములు వారి వారి ధర్మములను నిరాకించియుండునట్లు వసిష్ఠుల యాజ్ఞచే మహాత్ముఁడు సగరుఁడు చేసెను. సకల పృథ్విని ధర్మవిజయము చేసి జయించి, వాజిమేధ యజ్ఞమును చేయుటకు దీక్షితుఁడై అశ్వమేధాశ్వమును సగరుఁడు వీడిచిపెట్టెను. ఇట్లు పూర్వదీక్షితుని యశ్వము సముద్రపరీత భూముల సంచరించుచుండ సముద్రతీరమున అశ్వము అపహృతమై భూమిలోనికి తీసికొని పోబడెను. ఆ ప్రదేశము నంతటినీ రాజు తన. సుతులచే త్రవ్వించేను. సేతువు పర్యంతము సముద్రము త్రవ్వబడగా మహార్ణవము యొక్క అంతఃప్రదేశమున ఆది పురుషుడు, దేవుడు, హరీ, కృష్ణుఁడు, ప్రజాపతి, హంసుఁడు, నారాయణుఁడు, ప్రభువునయిన విష్ణువును కపిల మహర్షి రూపమున వారు చూచిరి. (45)

తమాదిపురుషం దేవం హరిం కృష్ణం ప్రజాపతిమ్

విష్ణుం కపిలరూపేణ హంసం నారాయణం ప్రభుమ్

తస్య చక్షుః సమాసాద్య తేజస్తత్పతిపద్యతే

దగ్ధాః పుత్రాస్తథా సర్వే చత్వారస్త్వవశేషితాః

బర్తికేతుః సుకేతుశ్చ తథా ధర్మరథశ్చ యః

శూరః పంచజనశ్చైవ తస్య వంశకరాః ప్రభోః

పాదాచ్చ తస్య భగవాన్ హరిర్నారాయణో వరాన్

అక్షయత్వం స్వవంశస్య వాజిమేధశతం తథా

విభుః పుత్రం సముద్రం చ స్వర్గీ వాసం తథాఽక్షయమ్

తం సముద్రేఽశ్వమాదాయ వవందే సరితాం పతిః

సగరత్వం చ లేభే స కర్మణా తేన తస్యపై

తం చాశ్వమేధికం సోఽశ్వం సముద్రాత్ర్పాష్య పార్థివః

ఆజహారాశ్వమేధానాం శతం చైవ పునః పునః

షష్టిం పుత్ర సహస్రాణి దగ్దాన్యస్య రుషా విభో

తేషాం నారాయణం తేజః ప్రవిషాని మహాత్మనామ్

పుత్రాణాం తు సహస్రాణి షష్టిస్తు ఇతి నః శ్రుతమ్

ఋషయః ఊచుః :-

సగరస్యాత్మజా నానా కథం జాతా మహాబలాః

విక్రాంతాః షష్టి సాహస్రా విధీనా కేన వా వద

సూత ఉవాచ :-

ద్వేపత్న్యౌ సగరస్యాస్తాం తపసా దగ్ధకిల్బిషే

జ్యేష్ఠా విదర్భరుహితా కేశినీ నామ నామతః

కనీయసీ తు యా తస్య పత్నీ పరమధర్మిణీ

అరిష్టనేమిదుహితా రూపేణాప్రతిమా భువి

ఔర్వస్తాభ్యం వరం ప్రాదాత్తపసాఽరాధీతః ప్రభుః

ఏకా జనిష్యతే పుత్రం వంశకర్తార మీప్సితమ్

ఆతని దృష్టిపథము లోపడి సగరునిపుత్రులందరుదగ్గులయిరి. నలుగురు మాత్రము బ్రతికిరి. (146) వారు బర్షికేతువు, సుకేతువు, ధర్మ రథుఁడు, శూరుడైన పంచరథుఁడును. పోరా రాజవంశకరులయిరి. నారాయణుఁడు, హరి, భగవానుఁడు వారికీ వరములొసంగేను. ఆ వరములు స్వవంశమునకు అక్షయత్వము, వంద వాజేషయము లొనర్చుశక్తి, సర్వవ్యాపకమయిన సముద్రుఁడు పుత్రుఁడుగ, స్వర్గమున శాశ్వత వాసము ను బొందెను. అశ్వమును తీసికొని వచ్చి సరితాంపతియైన సముద్రుఁడు రాజునకు నమస్కరించెను. తానొనర్చిన యాకర్మచే నతనికి సాగరము (సగరత్వము)అని పేరు వచ్చెను. సముద్రము నుండి అశ్వమేధికాశ్వమును పొందిన తరువాత రాజు మొత్తము అశ్వమేధ యాగములను నూరింటినొనర్చెను. ఆతని అరువది వేల కుమారులను క్రోధముతో కపిలుఁడు దగ్గుల నొనర్చెను. తేజస్వంతులయిన ఆ అరువదివేల పుత్రులు విష్ణుని తేజస్సులో లీనమయిరని యింతకు పూర్వము వంటిమీ. ఋషులీట్లడిగిరి. సగరుని కుమారులు మహాబలులు, పరాక్రమవంతులు షష్టి సహస్రసంఖ్యాకులు ఏ వీధిచే పుట్టిరో తెలుపగోరెదము. సూతుఁడిట్లు చెప్పెను. సగరునకు ఇరువురు భార్యలు. వారు తపస్సుచేసి దగ్గకిల్బిషలయిరి. జ్యేష్ణురాలు విదర్భరాజు కూతురు పేరు కేశిని. చిన్నభార్య అరిష్టనేమి యొక్క కూతురు. ఆమె పరమధార్మికురాలు. రూపము నందు అసామాన్యురాలు. సాటి లేనిది. మునిసత్తముఁడయిన ఔర్వుని వారు తపస్సుచే నారాధించిరి. ఆ మహార్షి వారలకు వరము లొసంగెను. ఒకతె ఒక కుమారుని కనును. ఆతఁడు శాశ్వత వంశకర్తయగును.

షష్టిం పుత్రసహస్రాణి ద్వితీయా జనయిష్యతి

మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ పుత్త్రమేకకమ్

వంశస్య కారణం శ్రేష్ఠం జగ్రాహ నృపసంసది

షష్టిం పుత్రసహస్రాణి సుపర్ణభగినీ తథా

మహాభాగా ప్రముదితా జగ్రాహ సుమతిస్తథా

అథ కాలే గతే జ్యేషా జ్యేష్ఠం పుత్రం ష్యజాయిత

అసమంజ ఇతిఖ్యాతం కాకుత్థ్సం సగరాత్మజమ్

సుమతిస్త్వషి జడ్డీ వై గర్భముంబం యశస్వినీ

షష్టిః పుత్రసహస్రాణాం తుంబమధ్యాద్వినిస్సృతాః

ఘృతపూర్ణేషు కుంభేషు తగ్గర్భాన్యదధాత్తతః

ధాత్రీశ్చైకైకశః ప్రాదాత్ తావతీ పోషణే నృపః

తతో నవసు మాసేషు సముత్తస్తుర్యథాసుఖమ్

కుమారాస్తే మహాభాగాః సగరప్రీతివర్ధనాః

కాలేన మహతా చైవ యౌవనం సముపాశ్రితాః

కేశిన్యాస్తనయో యోఽన్యః సగరస్యాత్మసంభవః

అసమంజస ఇతిఖ్యాతో బరికేతుర్మహాబలః

పౌరాణామపితే యుక్త పిత్రా నిర్వాసితః పురాత్

తస్య పుత్రాంఽశుమాన్నామ అసమంజస్య వీర్యవాన్

తస్య పుత్రస్తు ధర్మాత్మా దిలీప ఇతి విశ్రుతం

దిలీపాత్తు మహాతేజా వీరో జాతో భగీరథః

యేన గంగా సరిచ్ఛేషా విమానైరుపశోభితా

ఇహానీతా సురేశాద్వై దుహితృత్వే చ కల్పితా

అత్రాప్యుదాహరంతీమం శ్లోకం పౌరాణిక జనాః

భగీరథస్తు గాం గంగా మానయామాస కర్మభిః

తస్మాద్భాగీరధీ గంగా కథ్యతే వంశవిత్తమైః

ఇంక రెండవది అరువది వేల మంది కుమారులను గాంచును. ఆ మహర్షి వాక్యములు వీని, వంశకరణుఁడు, శ్రేష్ఠుడునగు ఒక్క కుమారునీ కేశిని కోరెను. రాజసభలో సుపర్ణుని భగినియైన సుమతి సంతోషముతో అరువదివేల పుత్రులను కోరెను, కాలము సాగినది. జ్యేష్ఠురాలు జ్యేష్ఠుఁడైన పుత్రుని కనినది. (157) అతఁడు సగరుని జ్యేష్ఠుఁడు. అసమంజసుఁడు అని వీఖ్యాతుఁడు. ప్రసిద్ద కుకుత్స వంశీయుం డు. యశస్వినీయైన సుమతీ గర్బతుంబమును గనెను. (సొరకాయ వంటి పిండమును) అరువదివేల సంఖ్యల పుత్రులు ఆగర్భ తుంబము నుండి బహిర్గతములయి పుట్టిరి. ఘృత పూర్వములయిన కుంభములలో ఆగర్భతుంబజులనతఁడుంచెను. వారిని పోషించుటకై రాజు ఒక్కొక్క గర్భశకలమునకొక్కోక్క రాత్రిని (మంత్రసానిని) నియోగించెను. తరువాత తొమ్మిది మాసములలో పుత్రులందరు మహాభాగులు, సగరప్రీతి వర్గనులు నయిరి. చిరకాలమునకు వారందరు యౌవన వంతులయిరి. సగరుని వలన కేశిని యొక్క మరియొక్క కుమారుఁడు బర్షికేతువు, ఆతం డు మహాబలుడు. ఆతఁడు అసమంజసుఁడుగా ఖ్యాతిగాంచేను. ఆతఁడు పురప్రజలకు అహితుఁడుగా నున్నందున పట్టణము నుండి తండ్రి యతనిని బహిష్కరించెను. అసమంజసునకు అంశుమంతుఁడు కుమారుఁడు, ఇతఁడు వీర్యవంతుఁడు. అతని కుమారుడు దిలీపుఁడు. ధర్మాత్ముం డు ప్రసిద్ధుఁడు. దిలీపునకు మహాతేజుఁడయిన భగీరధుడు పుట్టేను. ఆతఁడే విమానోపశోభితమును సరిచ్చేష్ఠమునయిన గంగా నదినీ భూమికీ తెచ్చెను. అయ్యది భగీరథునీ దుహితగా సురేశునిచే చేయఁబడినది. ఆ విషయమును పౌరాణికులు శ్లోకములో నుదహరింతురు. “భగీరథుఁడు గంగను కర్మలచే భూమికి తీసుకొనివచ్చెను. వంశ వృత్తాంత మెలింగినవారు ఆ కారణముచే గంగను భాగీరథీ” యని చెప్పుదురు.

భగీరథ సుతశ్చాపి శ్రుతో నామ బభూవ హ

నాభగస్తస్య దాయాదో నిత్యం ధర్మపరాయణః

అంబరీషః సుతస్తస్య సింధుద్వీపస్తతోఽభవత్

పూర్వే వంశపురాణజ్ఞా గాయంతీతి పరిశ్రుతమ్

నాభాగేరంబరీషస్య భుజాభ్యాం పరిపాలితా

బభూవ వసుధాత్యర్థం తాపత్రయవివర్జితా

అయుతాయుఽసుతస్తస్య సింధుద్వీపస్య వీర్యవాన్

అయుతాయోఖస్తు దాయాదః ఋతుపర్లో మహాయశాః

దీవ్యాక్షహృదయజ్ఞోఽసౌ రాజా నలసధో బలీ

నలో ద్వాప్తి విఖ్యాతో పురాణేషు దృఢవ్రతో

వీరసేనాత్మజశ్చైవ యశ్చక్ష్వాకుకులోద్వహః

ఋతుపర్ణస్య పుత్రోఽభూత్సర్వకామో జనేశ్వరః

సుదాసస్తస్య తన రాజా ఇంద్రసభోఽభవత్

సుదాసస్య సుతః ప్రోక్తః సౌదాసో నామ పార్థివః

ఖ్యాతః కల్మషపాదో వై నామ్నా మిత్రసహశ్చ సః

వసిష్ఠస్తు మహాతేజాః క్షేత్రే కల్మాషపాదకే

అశ్మకం జనయామాస త్విక్ష్వాకుకులవృద్ధయే

అశ్మకస్యౌరసో యస్తు మూలకస్తత్సుతోఽభవత్

అత్రాప్యుదాహరహంతీం మూలకం పై నృపం ప్రతీ

సహి రామ భయాద్రాజా సీభిః పరివృతోఽభవత్

వివస్త్రప్రాణమిచ్చన్వై నారీకవచ ఈశ్వరః

మూలకస్యాపీ ధర్మాత్మా రాజా శతరథః స్మృతః

తస్మాచ్ఛతరథా జజ్ఞే రాజాత్విడవిడో బలీ

భగీరథుని కుమారుఁడు శ్రుతుఁడు. ఆతని కుమారుడు నిత్యధర్మ పరాయణుఁడు నాభాగుండు. నాభాగుని కుమారుఁడు అంబరీ షుఁడు. ఆతని కుమారుఁడు సింధుద్వీపుఁడు పూర్వము వంశ చరిత్రలు పురాణములు తెలిసినవారు ఇట్లు కీర్తించుట తెలిసినదే. “నాభాగ సుతుఁడయిన అంబరీషుని భుజములచే పరిపాలింపఁబడి ఈ భూమి తాపత్రయ బాధచే అత్యంతము విసర్జితము”. వీర్యవంతుఁడయిన అయుతాయువు సింధుద్వీపుని కుమారుఁడు. అయుతాయువుయొక్క దాయాది మహాయశస్వియయిన ఋతుపర్ణుఁడు. ఈ ఋతుపర్ణుఁడు దీవ్యాక్ష హృదయము తెలిసినవాఁడు. ఇతఁడు మహాబలవంతుఁడు నలునీ సఖుఁడు. (173) పురాణములందు దృడప్రతులగు నిరువురు నలులు ప్రఖ్యాతులు. ఒకఁడు వీరసేనకుమారుఁడు, రెండు వాఁడు ఇక్ష్వాకుకులోద్వహుఁడు, ఋతుపర్ణుని కుమారుఁడు సర్వకాముఁడు. ఇతడు మహాప్రభువు . సుదాసుని కుమారుఁడు సుదాసనాముఁడయిన రాజు కల్మాష పాదుఁడుగా వీఖ్యాతుఁడు, ఆతఁడే మీత్ర సహుండను నామమున కూడ నొప్పెను. ఇక్ష్వాకు కులవృద్దికొకు, మహాతేజుఁడయిన వసిష్ఠుఁడు, కల్మాషపాదుని భార్యయందు అశ్మకునీ పుత్రునిగా గాంచేను. (177) మూలకుఁడు అశ్మకుని యారస పుత్రుఁడు. ఈ సందర్భములో మూలక నృపుని గూర్చి ఇట్లుదాహరించెదరు, “నిజముగా ఆతఁడు పరశురాముని వలనీభయముచే (ఆరాజ) స్త్రీలతో పరివృతుఁడై వారి మధ్య నుండేను. రక్షణము కోరి వీవస్తుఁడై ఆ ప్రభువు నారీలోకమునే కవచముగా ధరించెను.” ధర్మాత్ముం డైన శతరథుఁడు మూలకుని యొక్క కుమారుఁడుగా ఖ్యాతుఁడు ‘ఇడవీడు’డను మహాబలుఁడు శతరథుని యొక్క పుత్రుఁడు.

ఆసీత్వైడవీడః శ్రీమాన్కృశశర్మా ప్రతాపవాన్

పుత్త్రో విశ్వసహస్రస్యం పుత్రీకసాం వ్యజాయత

దిలీపస్తస్య పుత్రోఽభూత్ఖట్వాంగ ఇతి విశ్రుతః

యేన స్వర్గాదిహాగత్య ముహూర్తం ప్రాష్య జీవితమ్

త్రయోఽభిసంహితా లోకా బుద్ధ్యా సత్యేన చైవ హి

దీర్ఘబాహుః సుతస్తస్య రఘుస్తస్మాదజాయత

అజః పుత్రో రఘాశ్చాపి తస్మాజజై స వీర్యవాన్

రాజా దశరథో నామ ఇక్ష్వాకుకులనందనః

రామో దాశరథిర్వీరో ధర్మజ్జీ లోకవీశ్రుతః

భరతో లక్ష్మణశ్చైవ శత్రుఘ్నశ్చ మహాబలః

మాధవం లవణం హత్వా గత్వా మధువనం చ తత్

శత్రుఘ్నన పురీ తత్ర మధురా వినివేశితా

సుబాహుః శూరసేనశ్చ శత్రుఘ్నస్య సుతావుభో

పాలయామాసముస్తా తు వైదేహ్యౌ మధురాం పురీమ్

అంగదశ్చంద్రకేతుళ్ళ లక్ష్మణస్యాత్మజావుభౌ

హిమవత్పర్వతస్యాంతే స్ఫీతే జనపదే తయోః

అంగదస్యాంగదా భ్య దేశే కారయతేపురీ?

చంద్రకేతోస్తు విఖ్యాతా చంద్రచక్రా పురీ శుభా

భరతస్యాత్మజా వీరా తక్షః పుష్కర ఏవ చ

గాంధారవిషయే సిద్ధే తయోః పుర్యో మహాత్మనోః

తక్షస్య దీక్షు విఖ్యాతా నామ్నా తక్షశిలా పురీ

పుష్కరస్యాపి వీరస్య విఖ్యాతా పుష్కరావతీ

గాథాం చైవాత్ర గాయంతి యే పురాణవీదో జనాః

రామేణ బద్ధం సత్యార్థం మాహాత్మ్యాత్తస్య ధీమతః

శ్రీమంతుడు ప్రతాపవంతుఁడు. ఆతడు విశ్వసహుని కుమారుఁడు పుత్రిక ఎవతేయందు జనించేను? దిలీపుఁడు విశ్వసహుని కుమారుఁడు. దిలీపుఁడు ఖట్వాంగుఁడుగా ప్రఖ్యాతుఁడు. ఇతఁడు ముహూర్త కాల పరిమిత జీవితముతో స్వర్గము నుండి భూమికి వచ్చి మూఁడు లోకములను తన బుద్ధి వైభవము చేతను, సత్యము చేతను అభిసంహితము చేసెను. (ఏకీభవింపచేసెను). ఆతని కుమారుఁడు దీర్ఘబాహువు. దీర్ఘబాహుని కుమారుఁడు రఘువు. రఘువు యొక్క పుత్రుఁడు అజుఁడు, వీర్యవంతుఁడయిన దశరథమహారాజు ఈతని పుత్రుఁడు. దశరథుఁడు ఇక్ష్వాకు కులనందనుఁడు. రాముఁడు, భరతుఁడు లక్ష్మణుఁడు శత్రుఘ్నుఁడు దశరథుని కుమారులు. వీరు మహాబలురు, రాముఁడు వీరుం డు, ధర్మజుండు లోకప్రఖ్యాతి గన్నవాఁడు. శత్రుఘ్నుఁడు మధువనమున కరీగి మధు కుమారుఁడైన లవణుని చంపెను.. అచ్చట శత్రుఘ్నుఁడు మధురాపురమును నెలకొల్పేను. సుబాహువు, శూరసేనుఁడు శత్రుఘ్నుని కుమారులు. వారు విదేహరాజసుతయందు పుట్టిరి. వారు మధురాపురమును పాలించిరి (187). అంగదుఁడు చంద్రకేతువు. ఇరువురు లక్షణుని కుమారులు, వారి నగరములు హిమవత్పర్వతాంతదేశమున విస్తరించబడినవి. అయ్యవి అత్యంతైశ్వర్యవంతములు, వృద్దీమంతములు. అంగదునీ పురి యంగదయని పిలువబడును. చంద్రకేతుశీపురీ చంద్రచక్రయనబడును. అదీశుభమైనది. (189) వీరులయిన తక్షుఁడు పుష్కరుఁడు భరతుని పుత్రులు. వీరిరువురి యొక్క పట్టణములు గాంధారదేశమందున్నవి. ‘తక్షశిలా’ యను తక్షుని పట్టణము సర్వదీక్రసిద్ధము. వీరుఁడైన పుష్కరునీ నగరము విఖ్యాతమయిన పుష్కరావతీ. పురాణ విదులయినవారు ఈ గాథను కీర్తింతురు. ఇది రామునికి సంబంధించినది. “ధీమంతుఁడైన యాతని మాహాత్మ్యము యొక్క గొప్పదనము గూర్చి ఇది వర్ణించును.

శ్యామో యువా లోహితాక్షో దీప్తాస్యో మితభాషితః

ఆజానుబాహుః సుముఖః సింహస్కంధో మహాభుజః

దశవర్ష సహస్రాణి రామో రాజ్య మకారయత్

ఋక్సామయజుషాం హౌషో యో ఘోషశ్చ మహాస్వనః

అవ్యచ్ఛిన్నోఽభవద్రాణ్యే దీయతాం భుజ్యతామితి

జనస్థానే వసన్మార్యం త్రిదశానాం చకార సః

తమాగస్కారిణం పూర్వం పౌలస్త్యం మనుజరథః

సీతాయాః పదమన్విచ్ఛన్నిజఘాన మహాయశాః

సత్త్వవాన్ గుణసంపన్నో దీప్యమానః స్వతేజసా

అతీసూర్యం చ వహిం చ రామో దాశరథర్భభో

ఏవమేష మహాబాహోస్తస్య పుత్రే బభూవతుః

కుశో లవ ఇతి ఖ్యాతే తయోర్దేశే నిబోధత

కుశస్య కోసలో రాజ్యం పురీ చాపి కుశస్థలీ

రమ్యా నివేశిత తేన విధ్వపర్వతసానుపు

ఉత్తరాకోసలే రాజ్యం లవస్య చ మహాత్మనః

శ్రావస్తిర్లోకవిఖ్యాతా కుశవంశం నిబోధత

కుశస్య పుత్రో ధర్మాత్మా హ్యతిథః సుప్రియాతిథిః

అతిథెరపి విఖ్యాతో నిషదో నామ పార్థివః

నిషధస్య నలః పుత్రో నలస్య తు నభః సుతః

నభసః పుండరీకస్తు క్షేమధన్వా తతః స్కృతః

క్షేమధన్వసుతో రాజా దేవానీకః ప్రతాపవాన్

ఆసీదహనగుర్నామ దేవానీకాత్మజః ప్రభుః

అహీనగోస్తు దాయాదః పారియాత్రో మహాయశాః

దలస్తస్యాత్మజస్యాపి తస్మాజ్జజ్ఞే బలో నృపః

ఉలూకోనామ ధర్మాత్మా బలపుత్త్రో బభూవ హ

వజ్రనాభః సుతస్తస్య శంఖణస్తస్య చాత్మజః

రాముఁడు శ్యామవర్ణుఁడు. యువకుఁడు, లోహితాక్షుఁడు. ప్రకాశవంతమయిన ముఖము కలవాఁడు, మితభాషి ఆజానుబాహువు. సుముఖుఁడు, సింహస్కంధుఁడు, మహాభుజుఁడు ఆతఁడు పదివేల యేండ్లు రాజ్యమును పాలించేను. ఆతని రాజ్యమున ఋక్ యజుస్సామ వేదముల అధ్యయన (పఠన) ఘోష యొక్క మహానాదము, దీయతాం - (దానమీయుఁడు) - భుజ్యతాం - (భుజింపుఁడు). అను శబ్దములు అవిచ్చిన్నములై ధ్వనించెను. రాముఁడు. జనస్థానమున నివసించుచు ద్రోదశులయొక్క (దేవతలయొక్క కార్యమును నెరవేర్చెను. సీతయున్న స్థానమును అన్వేషించుచు, పురుషరభుఁడయిన రాముఁడు, మహాయశస్వి, పౌలస్త్యుఁడయిన రావణునీ మహాషాపకార్యము లాచరించిన వానిని చంపెను. రాముడు సత్త్వవంతుఁడు, గుణసంపన్నుఁడు, దీప్యమానుఁడు స్వతేజముచే సూర్యుని వహ్నిని అతీశయించినవాఁడు. దశరథ సూనుఁడు. అతని కుమారులిద్దరు ఆతనీ వంటివారు. వారు కుశుఁడు, లవుఁడును. ఇంక వారి దేశాదికముల నెఱుంగుఁడు. కోసలము కుశునీ రాజ్యము. ఆతని నగరము కుశస్థలి. గమ్యమయిన యీ నగరము వింధ్య పర్వత సానువుల యందు ఆతనిచే నిర్మింపబడినది, ఉత్తర కోసలము మహాత్ముఁడయిన లవుని రాజ్యము. అతనీ నగరము శ్రావస్తి. అది సర్వలోక ప్రఖ్యాతము, ఇంక ‘కుశ’ వంశమును గూర్చి యెమింగుము. కుశుని కుమారుఁడు అతిథి ఇతఁడు ధర్మాత్ముఁడు. అతిథి సపర్యాసక్తుఁడు. అతిథి కుమారుఁడు నీషధుడు. నీషధునకు పుత్రుడు నలుఁడు. నలుని కుమారుఁడు నభుఁడు ఆ నభునికుమారుఁడు పుండరీకుఁడు, ఆతనీ తరువాత రాజు క్షేమధన్వుఁడు. క్షేమధన్వునీ సుతుఁడు ప్రతాప వంతు డయిన దేవానీకుఁడు దేవానీకుని సుతుఁడు అహీనుడు. ఆహ్నగునీ వారసుఁడు మహాయశస్విమయిన పారియాత్రుఁడు.దలుఁడు పారియాత్రుని కుమారుఁడు. ఈతని కుమారుడు బలుఁడు. ధర్మాత్ముడయిన ఉలూకుఁడు దలుని పుత్రుఁడు. ఆతని పుత్రుడు వజ్ర నాభుఁడు. వజ్రనాభుని కుమారుడు శంఖణుఁడు.

శంఖణస్య సుతోవిద్వాన్ వ్యషితాశ్వ ఇతి శ్రుతః

ప్యుషితాశ్వసుతశ్చాపి రాజా విశ్వసహః కిల

హిరణ్యనాభః కౌశలో వరిష్ఠస్తత్సుతోఽభవత్

పౌష్యంజేశ్చ స వైశిష్యః సుతః ప్రాచ్యషు సామసు

శతాని సంహితానాం తు పంచ యోఽధీతవాంస్తతః

తస్మాదధిగతో యోగో యాజ్ఞవల్యేన ధీమతా

పుష్పస్తస్య సుతో విద్వాన్ ధ్రువసంధిశ్చ తత్సుతః

సుదర్శనస్తస్య సుతో హ్యగ్నివర్ణః సుదర్శనాత్

అగ్నివర్ణస్య శీఘస్తు శీఘకస్య మరుః స్మృతః

మరుస్తు యోగమాస్థాయ కలాపగ్రామమాశ్రితః

ఏకోనవింశప్రయుగే క్షత్రప్రావర్తకః ప్రభుః

ప్రభుసుతో మరోః పుత్రః సుసంధిస్తన్య చాత్మజః

సుసంధేశ్చ తథామర్షః సహస్వాన్నామ నామతః

అసీత్సహస్వతః పుత్రో రాణగా విశ్రుతవానితి

తస్యాసీద్విశ్రుతవతః పుత్రో రాజా బృహద్బలః

ఏతే ఇక్ష్వాకుదాయాదాః రాజానః శతశః స్మృతాః

వంశే ప్రధానా యే తస్మినాథాన్యేన తు కీర్తితాః

పఠన్ సమ్యగిమాం సృష్టిం ఆదిత్యస్య వివస్వతః

ప్రజావానేతి సాయుజ్యం మనో వైవస్వతస్య సః

శ్రాద్ధదేవస్య దేవస్య ప్రజానాం పుష్టిదస్య చ

విపాప్మా విరజాశ్చైవ ఆయుష్మాన్ జాయతేఽచ్యుతః

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవచరితే ఇక్ష్వాకువంశకీర్తనం నామ త్రిషష్టితమోఽధ్యాయః

శంఖణుని పుత్రుఁడు వ్యుషితాశ్వుఁడు. ఇతఁడు విద్వాంసుఁడుగా ప్రఖ్యాతిగన్నవాడు వ్యుషితాశ్వుని కుమారుఁడు విశ్వసహుఁడు. (206) హిరణ్యనాభుఁడు కౌశల్యనామాంతరుఁడు అతని కుమారులలో విష్ణుఁడు. ప్రాచ్యములందు సామమంత్రములయందు ఆతఁడు పౌష్యంజీ యొక్క శిష్యుడు. (207) ఆతఁడు (హిరణ్యనాభుఁడు) పౌష్యంజీతోడ ఐదువందల సంహితలను గఱచెను. తరువాత ధీమంతుఁడయిన యాజ్ఞవల్క్యునితోడ యోగము నేర్చెను. (208) పుష్పండు ఆతని కుమారుఁడు. ఆతఁడు విద్వాంసుఁడు. ఆతనీకుమారుడు ధ్రువసంధి. ఆతని పుత్రుఁడు సుదర్శనుఁడు. సుదర్శనుని కుమారుఁడు అగ్నివర్ణుఁడు, అగ్నివర్ణునకు శీఘ్రుఁడు, శీఘముని కుమారుఁడు మరువు. మరుపు యోగము నభ్యసించి కలాపగ్రామము నందుండెను, (210) ఈ ప్రభువు 21వ ప్రయుగమున క్షత్రియ ప్రావర్తకుండు. మరుని కుమారుండో ప్రభుసుతుండు. ప్రభుసుతుని కుమారుఁడు సుసంధీ. సుసంధికుమారుడు మరుఁడు. ఇతనికి సహస్పంతుఁడు అను నామాంతరము. సహస్వంతునికి పుత్రుఁడు విశ్రుతవంతుఁడు. విశ్రుతవంతుని పుత్రుఁడు బృహద్బలుడు. వీరందరు ఇక్ష్వాకుల దాయాదులు. వందలకొలదీ రాజులున్నారు. వంశము నందెవ్వరెవ్వరు ప్రధానులో వారిని గూర్చి కీర్తించితిని. ఆ దివ్య వివస్వతుని యొక్క వంశమును (సృష్టినీ) పఠింప పుత్రవంతుఁడగును. వైవస్వత మనువుతో సాయుజ్యమును పొందును. మనువు వివస్వంతుని కుమారుఁడు. ఆతఁడే శ్రాద్ధదేవుఁడు. ఆతఁడే ప్రజలకు పుష్టి నొసంగువాడు పఠించునట్టివాఁడు. పాపరహితుఁడగును. రజోరహితుఁడు ఆయుష్మంతుఁడగును. ధర్మ పథము నుండి యెన్నడును ఆతఁడు వ్యతిక్రమింపఁడు.

ఇది వాయుప్రోక్తమైన బ్రాహ్మండమహాపురాణమున మధ్యమభాగమునందు, తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరితము నందలి ఇక్ష్వాకువంశసంకీర్తనమను అరువదిమూఁడవ అధ్యాయము.