39 - చత్వారింశోధ్యాయః

అగస్త్య ఉవాచ:-

అద్యనంతమవ్యక్తం వ్యక్తానామాదికారణమ్

ఆనందబోధైకరసం తన్మహన్మన్మహే మహః

అశ్వానన మహాప్రాజ్ఞ వేద వేదాంతవిత్తమః

శ్రుతమేతన్మహాపుణ్యం లలితాఖ్యానముత్తమమ్

సర్వపూణ్యా త్వయా ప్రోక్తా త్రిపురా పరదేవతా

పాశాంకుశధనుర్బాణపరిష్కృతచతుర్భుజా

తస్యా మంత్రమితి పోక్తం శ్రీచక్రం చక్రభూషణమ్

నవావరణమీశానీ శ్రీపరస్యాధిదైవతమ్

కాంచీపురే పవితేజ స్కిన్ మహీమండలమండనే

కేయం విభాతి కల్యాణీ, కామాక్షిత్యభివిశ్రుతా

ద్విభుజా వివిధోల్లాసవిలసత్తమువల్లరీ

అదృష్టపూర్వసౌందర్యా పరజ్యోతిర్మయీ పదా

అగస్త్యుడనెను. మొదలు లేనిదియు, చివరలేనిదియు (నిత్యమైనది), బయలుపడనిదీయు (సూక్ష్మమైనది), బయలుపడిన ప్రపంచములకు మొదటి కారణమైనదియు, ఆనందరూపమైనయాత్మను దెలిసికొనుటయే ముఖ్యరసమైనదియు (ఆత్మ (ఆనంద జ్ఞాన రూపిణియైనది)యు నగు నామహాతేజమును ధ్యానింతుము. (1) అశ్వముఖియైనమహాప్రాజ్ఞా వేదవేదాంతములు దెలిసినవారిలోనుత్తముడా! నీ నుండి యీ మహాపుణ్యమైనదియునుత్తమమైనలలితాఖ్యానమును వీటిని నీవు త్రిపురా పరదేవత - సర్వపూజనీయయని చెప్పితివి. ఆమె పాశము అంకుశము, ధనుస్సు, బాణములు వీనిని ధరించి యందముగా నుండు చేతులు గలదని కూడ జెప్పితివి (3) ఆమెకు శ్రీచక్రము మంత్రము. అది చక్రములన్నింటికీ భూషణమైనది. తొమ్మిదియావరణములుగలది.

శ్రీపరమైనయాచక్రమునకు ఈశానీ అధిదైవతము (4) భూమండలమునకెల్లనలంకారమైన కాంచీపురమున కల్యాణస్వరూపిణియై కామాక్షియను ప్రసిద్ధి వహించినదై ప్రకాశించునీమె యెవరు? రెండు భుజములుగలిగి, వివిధోల్లాసముల విలసించు తీవమేనుగల యీమెయెవరు? పూర్వమెక్కడను జూడని యందముగలది పరంజ్యోతిర్మయి (పరంజ్యోతినిండినది) పరారూపిణియైన యీమె యెవరు?

సూత ఉవాచ :-

అగస్త్యేనైవముక్తః సన్ పరానందాదృతేక్షణః

ధ్యాయంస్తచ్చ పరం తేజో హయగ్రీవో మహామనాః

ఇతి ధ్యాత్వ నమస్కృత్య తమగస్త్యమథాబ్రవీత్

 సూతుడనెను; అగస్త్యుడు పైవిధముగానడుగగా పరమానందమందిన చూపులు గలవాడై యాపరంజ్యోతిని ధ్యానించి నమస్కరించి మహామనస్వియైన హయగ్రీవుడు అగస్త్యునితో నిట్లనెను.

హయగ్రీవ ఉవాచ:

రహస్యం సంప్రవక్ష్యామి లోపాముద్రాపతే శృణు

 ఆద్యాయాణుతరా సా స్యాచ్ఛిత్పరా త్వాదికారణమ్

అంతాఖ్యీతి తదా ప్రోక్తా స్వరూపాత్తత్త్వచింతకైః

ద్వితీయాభూత్తతః శుద్ధపరా ద్విభుజసంయుతా

దక్షహస్తే యోగముద్రాం వామహస్తే తు పుస్తకమ్

బిభ్రతీ హిమకుందేందుముక్తాసమవపుర్డ్యుతిః

పరాపరి తృతీయా స్వాదాల్కా యుతసంమితాః

సర్వాభరణసంయుక్తా దశహస్తధృతాంబజా

వామోరున్యస్తహస్తా వా కిరీటార్గెందుభూషణా

 పశ్చాచ్చతుర్భుజా జాతా సా పరా త్రిపురారుణా

 పాశాంకుశేక్షుంకోదండపంచబాణలసత్కరా

లలితా సైవ కామాక్షీ కాంచ్యాం వ్యక్తిముపాగతా

సరస్వతీరమాగొరస్తామేవాద్యాముపాసతే

నేత్ర యం మహేశస్య కాశీకాంచీపురద్వయమ్

విఖ్యాతం వైష్ణవం క్షేత్రం శివసాన్నిధ్యకారకమ్

కాంచీక్షేత్ర పురా ధాతా సర్వలోకపితామహః

శ్రీదేవీదర్శనాయైవ తపస్తేపే సుదుష్కరమ్

ఆల్మైకధ్యానయుక్తస్య తస్య వ్రతవతో మునే

ప్రాదురాసిత్పురో లక్ష్మీః పద్మహస్తా పరాత్పరా

పద్మాసనే చ తిష్ఠంతీ విష్ణునా జిష్ణునా సహ

సర్వళ్ళంగారవేషాధ్యా సర్వాభరణభూషితా

సింహాసనేశ్వరీ ఖ్యాతా సర్వలోకైకరక్షిణీ

తాం దృష్ట్వాద్భుతసౌందర్యాం పరజ్యోతిర్మయీం పరామ్

ఆదిలక్ష్మీ మితి ఖ్యాతాం సర్వేషాం హృదయే స్థితామ్

యామాహుః స్త్రీపురామేవ బ్రహ్మవిష్వీకమాతరమ్

కామాక్షీతి ప్రసిద్దాం తామస్తౌషీత్పూర్ణభక్తిమాన్

 హయగ్రీవుడనేను :- ఓలోపాముద్రాపతీ; అగస్త్యా! రహస్యమును జెప్పెద వినుము-8 ఆద్యయై, అణుతరమైన (అణవుకంటే చిన్నదైన) - యామె చిత్స్వరూపిణి (జ్ఞాన స్వరూపిణి) అంతటికిని ఆదికారణమైనది. తత్త్వచింతకులామెను స్వరూపకారణమున అంతయని చెప్పుదురు-9 ఆ తరువాత రెండవది శుద్ధపరమై రెండు భుజములతో గూడినది. -10 కుడి చేతిలో యోగముద్రను. ఎడమచేతిలో పుస్తకమును వహించినది. మంచు, మల్లెమొగ్గ, చంద్రుడు, ముత్యము-వీనితో సమానమైన శరీరకాంతిగలది. పంపర అనునది మూడవది. - పదివేల బాలసూర్యులతో సమానమైనది. -11. సర్వాభరణములతో గూడినది. పదిచేతులలో కమలముల ధరించినది, లేదా ఎడమ . తొడపై చేతి నుంచినది, కిరీటము పై చంద్రరేఖ భూషణముగా గలది. -12 తరువాత నాలుగు భుజములుగల దైనది. ఆమె పర త్రిపుర, అరుణ.. పాశము, అంకుశము, ఇక్షువు (చెఱకు) కోదండము. (ధనువు), పంచబాణములు (మన్మథుని పంచబాణములు)-ఇవి చేతులలోగలది. -13 ఆమెయే లలిత. ఆమె కాంచీపురమున వెలసినది కామాక్షి, సరస్వతి, లక్ష్మి, గౌరులు ఆమెను ఉపాసింతురు-14. రెండు. కాంచీపురములు (శివకంచీ-విష్ణుకంచీ) మహేశ్వరుని రెండు కన్నులు -15 వైష్ణవక్షేత్రమైన విష్ణుకంచి శివసాన్నిధ్యమును గలుగజేయునది. కాంచీక్షేత్రమున పూర్వము సర్వలోకపితామహుడైన బ్రహ్మ -16 శ్రీదేవీ దర్శనము కొఱకే దుష్కరమైన తపము చేసెను. ఆత్మైక ధ్యానములో వ్రతములోనున్న బ్రహ్మయెదుట లక్ష్మి ప్రత్యక్షమయ్యెను. ఆమె పద్మహస్త (పద్మముహస్తములో గలగియుండెను) పరాత్పర (పరము. కంటే పరమైనది). జయశీలియైన విష్ణువుతో పద్మాసనమున గూర్చు నియుండెను-18. సర్వశృంగారమైన - వేషముతోనొప్పినది. (అన్ని విధములనందమైన వేషముగలది), సర్వాభరణములచే నలంకరింపబడినది. సర్వలోకములకు ఏకైక (ఒకేఒక) రక్షిణి-19. బ్రహ్మ ఆమెను జూచెను. ఆమె అతిసుందరముగా నుండెను. పరమైనది (ఉత్కృష్టమైనది) ఆదిలక్ష్మియని ప్రసిద్ధిజెందినది. అందరిహృదయములలో నుండినది. -20. ఆమెను బ్రహ్మ-విష్ణు-ఈశ్వరుల తల్లియైన త్రిపురయని యందురు. బ్రహ్మ కామాక్షియని ప్రసిద్ధురాలైన యామెను పూర్ణభక్తిగలవాడై స్తుతించెను. -21

 బ్రహ్మోవాచ :

జయ దేవి జగన్మాతర్జయ త్రిపురసుందరి

జయ శ్రీనాథసహజే జయ శ్రీసర్వమంగళే

జయ శ్రీకరుణారాశే జయ శృంగారనాయికే

జయజయధికసిద్ధేశి జయ యోగీంద్రవందితే

జయజయ జగదంబ నీత్యరూపే జయజయ సన్నుతలోకసౌఖ్యదాత్రి

 జయజయ హిమశైలకీర్తనీయే జయజయ శంకరకామవామనేత్రి

జగజ్జన్మస్థితిధ్వంసపిధానానుగ్రహాన్ముహుః

యా కరోతి స్వసంకల్పాత్తస్యై దేవ్యై నమోనమః

వర్ణాశ్రమాణాం సాంకర్యకారిణః పాపినో జనాన్

నిహంత్యాద్యాతితీక్షాసైస్తస్యై దేవ్యై నమోనమః

నాగమైశ్చ న వేదైశ్చ న శాస్రార చ యోగిభి

వేద్యా యా చ స్వసంవేద్యా తస్యై దేవ్యై నమోనమఃఈ

 రహస్యామ్నాయవేదాంతైస్తత్వవిద్భిర్మునీశ్వరైః

పరం బ్రహ్మేతి యా ఖ్యాతా తస్యై దేవ్యై నమోనమః

సూక్ష్మవిజ్ఞానరూపాయై తస్యైదేవ్యై నమోనమః

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః

యద్ధ్యానైకపరా నిత్యం తస్యై దేవ్యై నమోనమః

యచ్చరణభక్తా ఇంద్రాద్యా యదాజ్ఞామేవ

బిభ్రతి సామ్రాజ్యసంపదీశాయై తస్యై దేవ్యై నమోనమః

వేదా నిఃశ్వసితం యస్యా వీక్షితం భూతపంచకమ్

స్మితం చరాచరం విశ్వం తస్యై దేవ్యై నమోనమః

 సహస్రశీర్షా భోగేంద్రో ధరిత్రీం తు యదాజ్ఞయా

ధత్తే సర్వజనాధరాం తస్యై దేవ్యై నమోనమః

జ్వలత్యస్తపత్యర్కోవాతో వాతి యదాజ్ఞయా

జ్ఞానశక్తిస్వరూపాయై తస్యై దేవ్యై నమోనమః

పంచవింశతితత్త్వానీ మాయాకంచుకపంచకమ్

యన్మయం మునయః ప్రాహుస్తస్యై దేవ్యై నమోనమః

"45 శివశక్తీశ్వరాశ్చైవ శుద్ధబోధః సదాశివః

యదున్మేషవిభేదాః స్యుస్తస్యై దేవ్యై నమోనమః

గురుర్మంత్రో దేవతా చ తథా ప్రాణాశ్చ పంచధా

యా విరాజతి చిద్రూపా తస్యై దేవ్యై నమోనమః

సర్వాత్మనామంతరాత్మా పరమానందరూపణీ

శ్రీవిద్యేతి స్మృతా వా తు తన్యై దేవ్యై నమోనమః

దర్శనాని చ సర్వాణి యడంగాని విదుర్బుధాః

తత్తన్నియమరూషాయై తస్యై దేవ్యై నమోనమ

యా భాతి సర్వలోకేషు మణిమంత్రాషధాత్మసు

తత్వోపదేశరూపాయై తస్యై దేవ్యై నమోనమః

దేశకాలపదార్థాత్మా యద్యద్వస్తు యథా తథా

తత్తద్రూపేణ యా భాతి తన్యై దేవ్యై నమోనమః

హేమ ప్రతిభటాకారా కల్యాణగుణశాలినీ

విశ్వోత్తీర్ణేతి చాఖ్యాతా తస్యై దేవ్యై నమోనమః

ఇతీ స్తుత్వా మహాదేవీం ధాతా లోకపితామహః

భూయోభూయో నమస్కృత్య సహపా శరణం గత

సంతుష్టా (సా)తదా దేవీ బ్రహ్మాణం ప్రేక్ష్య సంవతమ్

 వరదా సర్వలోకానాం వృణీష్వ వరమిత్యశాత్

బ్రహ్మయనెను : ఓ జగముల తల్లీ దేవీ! నీకు జయము. సర్వోత్కర్షతో వర్ధిల్లుము. త్రిపురసుందరీ! నీకు జయము. ఓ లక్ష్మీపతి సోదరీ! నీకు జయము. సంర్వమంగళరూపిణీ! నీకు జయము. లక్ష్మీ! కరుణకురాశియైనదానా! జయము. అందమైన నాయికా! జయము. అధికములైన సిద్దులకు ఈశ్వరీ! జయము. శృంగారనాయికా! జయము, అధికములైన సిద్దులకు ఈశ్వరీ! జయము. యోగిశేషులచే నమస్కరింపడినదానా! జయము-23. జగదంబా! జయము, నిత్యరూపిణీ! జయము. సన్నుతించినలోకులకు సౌఖ్యములొసగుదానా! జయము. హిమశైలముచే కీర్తింపదగినదానా! జయము. శంకరుని కామనగల అందమైన యెడమకన్నుగలదానా! జయము (అర్ధనారీశ్వరి స్వరూపముగాన వామనేత్రము దక్షిణ నేత్రమునకు తన కామమును వ్యక్తీకరించుచున్నది. దీనికి సద్యో దక్షిణదృతసంకుచద్వమదృష్టయే. అన్నది వ్యతిరేకము)-24 తన సంకల్పముననే మాటిమాటికి జగముల సృష్టి స్థితిలయములను అనుగ్రహించు దేవికి నమస్కారము, నమస్కారము-25. ఆద్యములై మిక్కిలి వాడియైన యంత్రపూర్వకములైన యాయుధములచే వర్ణాశ్రమముల సాంకర్యమునుజేయువారిని ధ్వంసముజేయు దేవికి నమస్కారము. బ్రాహ్మణ, క్షత్రియ-వైశ్య-శూద్రుల నొకరిలోనోకరిని వివాహాది సంబంధములచే కలుపుట వర్ణసంకరము. బ్రహ్మచర్య-గార్హస్థ్య-వానప్రస్థ-సంన్యాసముల సక్రమముగా వాటిని పాలిషకుండునట్లు చేయుట ఆశ్రమసంకరము. ఈ రెండును నరక ప్రాయములు)-26. ఆగమములతో, వేదములతో, శాస్త్రములతో, యోగులతో దెలియరానిదై. జనునకు తనలోతాను దెలియదగు రూపమున నున్న స్వాత్మరూపిణియైన యాదేవికి నమస్కారము-27. రహస్యములైన యామ్నాయములతోను వేదాంతములతోను తత్వవేత్తలతోను మునీశ్వరులతోను పరంబ్రహ్మయని ప్రకటింపబడినయాదేవికి నమోనమః-28, హృదయమునందుండియు నెవ్వరిచే - దేలియబడక సూక్ష్మజ్ఞానరూపిణీయైన యాదేవికి నమస్కారము-29, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడును. తత్పరులై ధ్యానించు నాదేవికి నమోనమః-30, ఇంద్రాదులు ఆమె చరణభక్తులై యామెయాజ్ఞను శిరసావహింతురు. సామ్రాజ్యసంపదకీశ్వరియైన యాదేవికి నమోనమః-31. వేదములు ఆమెనిట్టూర్పులు. పంచభూతములామె వీక్షితములు (చూడ్కులు) చరాచర విశ్వము ఆమె చిరునవ్వు - ఆదేవికి నమోనమః-82. వేయి తలల యాదిశేషుడు ఆమె యాజ్ఞచేతనే భూమిని మోయును, సర్వజనుల కాధారమైన యా దేవికి నమోనమః-35. . ఆమె యానచే అగ్నీమండును, సూర్యుడెండరాయును. వాయువు వీచును. జ్ఞానశక్తి స్వరూపిణి యైన యాదేవికి నమోనమః-34. ఇరువది యైదు తత్త్వములు మాయాకంచుకపంచకమును మును లాదేవీమయముగనే జెప్పుదురు. ఆ దేవికి నమోనమః-35, శివుడు, శక్తి, ఈశ్వరుడు, శుద్ధబోధుడు సదాశివుడును. ఆమె యున్మేష భేదములు (కనురెప్పలు దేఱచు భేదములు) ఆదేవికి నమోనమః-36. గురువు, మంత్రము, దేవత, పంచప్రాణములు-వీని రూపములతో నామె విరాజిల్లును. చిద్రూపిణియైన. యామెకు నమోనమః-37. ఆమె సర్వాత్మల కంతరాత్మ స్వరూపిణి. పరమానందరూపిణి. శ్రీ విద్యయనబడును. ఆదేవికీ నమోనమః-38. సమస్త దర్శనములు ఆమె యంగములు- అని పండితులందురు. ఆయానియమస్వరూపిణియైన దేవికి నమోనమః-39. మణి-మంత్ర-ఓషది రూపములలో సర్వలోకములందామె ప్రకాశించును. తత్త్వోపదేశస్వరూపిణియైన యా దేవికి నమోనమః-40. ఆమె దేశ-క్రాల-పదార్థాత్మగా సర్వవస్తువుల సర్వస్వరూపిణియైన యా దేవికి నమోనమః-41. ఆమె బంగారునకు ప్రతిరూపమైన యాకారముగలది. కల్యాణ గుణములతో నొప్పినది. విశ్వమును మించిన దనియనబడినది. ఆ దేవికి నమోనమః-42. ఈ విధముగా. లోకపితామహుడైన బ్రహ్మ మహాదేవిని స్తుతించి మాటిమాటికి నమస్కరించి వెంటనే యామే శరణమునందెను-43. భక్తితో నమస్కరించినయా బ్రహ్మను జూచి యాదేవి యపుడు సంతసించినదై సర్వలోకములకు వరములనిచ్చునా.మహాదేవి వరమును గొరుకొనుము అని శాసించెను.

బ్రహ్మోవాచ :

భక్త్యా త్వద్దర్శనేనైవ కృతార్థోస్మి న సంశయః

 తథాపి ప్రార్థయే కించీల్లోకానుగ్రహకామ్యయా

కర్మభూమౌ తు లోకేబిస్మిస్ ప్రాయో మూడా ఇమే జనాః

తేషామనుగ్రహర్దాయ నిత్యం కుర్వత సన్నిధిమ్

తథేతి తస్య తం కామం పూరయామాస వేధసః

అథ ధాతా పునస్తస్యా దేవ్యా వాసమకల్పయత్

శ్రీదేవీసోదరం నత్వా పుండరీకాక్షమచ్యుతమ్

తత్సాన్నిధ్యం సదా కాంచ్యాం ప్రార్థయామాస చాదృతః

తతస్తథా కరిష్యామిత్యబ్రవీత్తం జనార్దనః

అధాతుష్టా జగద్ధాతా పునః ప్రాహ మహేశ్వరీమ్

శివోప్యతైవ సాన్నిధ్యం తవ ప్రీత్యా కరోత్వితి

అథ శ్రీత్రిపురాదక్షభాగాత్కామేశ్వరః పరః

ఈశానః సర్వవిద్యానామిశ్వరః సర్వదేహినామ్

ఆవిరాసీన్మహాదేవః సాక్షాచుంగారనాయకః

తతః పునః శ్రీకామాక్షీభాలనేత్రకటాక్షతః

కాచిదాలా ప్రాదురాసీన్మహాగౌరా మహోజ్వలా

సర్వశృంగార వేషాఢ్యా మహాలావణ్యశేవధిః

అథ శ్రీపుండరీకాక్షో బ్రహ్మణా సహ సాదరమ్

కారయామాస కల్యాణమాదిస్త్రీపుంసయోస్తయోః

ఆఖండలాదయో దేవా వసురుద్రాదిదేవతాః

మార్కండేయాదిమునయో వసిష్టాదిమునీశ్వరా

యోగీంద్రాః సనకాద్యాశ్చ నారదాద్యాః సురర్షయః

వామదేవప్రభృతయో జీవన్ముక్తాః శుకాదయః

యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరోరగాః

గణాగ్రణీర్మహాశాస్తా దుర్గాద్యాశైవ మాతరః

యా యాస్తు దేవతాః ప్రోక్తాస్తాః సర్వాః పరమేశ్వరీమ్!

 భద్రాసనవిమానస్థా నేముః ప్రాంజలయస్తదా

మనసా నిర్మితం ధాత్రా మధ్యేనగరమద్భుతమ్

మందిరం పరమేశాన్యా మనోహరతమం శుభమ్

శ్రీమతో వాసుదేవేన సోదరేణ-మహేశ్వరః

తత్రోదవోడత్తాం గౌరీముపాగ్ని భగవాన్భవః

దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిః పపాత హ

 దంపత్యోర్థగతాం పత్యోః పాణిగ్రహణమంగళమ్

 కో వా వర్ణయితుం శక్తో యది జిహ్వాసహస్రవాన్

ఆదిశ్రీమందిరస్యాస్య వాయుభాగే మహాశివునికి

విస్తృతం భువనశ్రేష్ఠం కల్పితం పరమేష్ఠినా

శ్రీగృహస్యాగ్నిభాగే తు విచిత్రం విష్ణుమందిరమ్

ఇళం తో దేవతాస్తత్ర తిస్రః సన్నిహితాః సదా

తదా ప్రదక్షిణీకృత్య తత్పరౌ దంపతీ తు

తెగ ప్రాప్తా సభావనాగారం తదా విధిజనార్ధనౌ

సమాగమ్య చ సభ్యానాం సమస్తానాం యథావిధి.

సంస్కారం వైదికైర్మంతైః కథయామాసతుర్ముదా

ఆద్యాదిలక్ష్మీ: సర్వేషాం పురతః శ్రీపరేశ్వరీః

విరించిం దక్షిణీనాక్షా వామేన హరిమైక్షత

కా నామ వాణీ (మా?) కా నామ కమలా తే ఉభే తతః

ప్రాదుర్భూతే ప్రభాపుంజే పంజరాంత ఇవ స్థితే

శ్రీదేవతానమచ్ఛీర్షబద్ధాంజలిపుటావుభో

జయ కామాక్షి కామాక్షీత్యూచతుస్తాం.

ప్రణీమతు: మూర్తీ చ గంగాయమునే తత్ర సేవార్థమాగతే తీసః

కోట్యోతిర్థకోటీ చ యా యాస్తీర్ధాధిదేవతా సేవార్థం

త్రిపురాంబాయాస్తాస్తాః సర్వాః సమాగతాః

తదా కరాభ్యామాదాయ చామరే భారతీత్రియా

శ్రీదేవీముపతగ్గితే వీజయంత్యా యథోచితమ్

అనర్హరత్నఖచితకింకిణీచితదోర్లతే

ఆదిశ్రీనయనోత్పన్నే తే ఉభే భారతీశ్రియా

సంవీక్ష్య సర్వజనతా విశేషేణ విసిస్మియే తదా

ప్రభృతి కల్యాణీ కామాక్షీత్యభిధామియాత్

తదుచ్చారణమాత్రేణ శ్రీదేవీ శం ప్రయచ్ఛతి

కామాక్షీతి త్రయో వర్షా: సర్వమంగలహేతవః

అథ సా జగదీశానీ వేదవేదాంగపారగే

విధా నిత్యం నిషీదేతి సందిదేశ సరస్వతీమ్

సాపి వాణీశ్వరీగంగాహస్రనిక్షిప్తచామరా

పశ్యతాం సర్వదేవానాం విధాతుర్ముఖమావిశత్

ఇందిరా చ మహాలక్ష్యా సందీషా తుష్టయా తథా

యథోచీతనివాసాయ విష్ణోర్వక్షస్థలం ముదా

తదాజ్ఞాం శిరసా ధృత్వా రమా విష్ణుశ్చ భక్తితః

ఆవు భౌ దంపతీ నక్వీ మహాత్రిపురసుందరీమ్

 ప్రార్థయామాసతుర్భూయస్తదావరణదేవతామ్

తధాస్త్వితి వరం దత్త్వా తాభ్యాం త్రిపురసుందరమ్

తదావరణదేవత్వం ప్రాప్తో పద్మాచ్యుతౌ తద

 పీఠోత్తరమాస్టాప్య దక్షిణే స్థితవాన్ స్వయమ్

 అథవాచ మహాగౌరీం త్వమన్యద్రూపమాచర

తత్ర యాతో మహాగౌర్యా ప్రతిబింబో మనోహరః

చకాసదివ్యదేహేన మహాగౌరీసమాకృతిః

తరుణారుణరాజాథసౌందర్యచరణద్వయః

క్వణత్కంకణమంజీరతిత్తిరీకృతపీఠకః

విద్యుదుల్లాసితస్వానమనోజ్ఞమణిమేఖల:

రత్నకంకణకేయూరవిరాజితభుజద్వయః

ముక్తావైదూర్యమాణిక్యనిబద్ధవరబంధనః

విభ్రాజమానో మధ్యేన వలితీతయశోభితః

జాహ్నవీసర్దావర్తశోభినాభివిభూషితః

పాటీరపంకకర్పూరకుంకుమాలంకృతస్తవః

ఆముక్తముత్తాలంకారభాసురస్తనకంచుకః

వినోదేన కటీదేశలంబమానసుశృంఖలః

మాణిక్యశకలాబద్దముద్రికాభిరలంకృతః

దక్షహస్తాంబుజాసక్త స్నిగోజ్వలమనోహరః

ఆభాత్యాప్రపదీనస్రగ్జిమ్యాకల్పకదంబకైః

దీప్తభూషణరత్నాంశురాజిరాజిత దిజ్ముఖః

 తపహాటకసంక్లుప్తరత్నగ్రీవోపశోభితః

 మాంగల్యసూత్రరత్నాంశుశోణిమాధరకంధరః

పాలీవతంసమాణిక్యతాటంకపరిభూషితః

జపావిద్రుమలావణ్యలలితాధరపల్లవః

దాడిమీఫల బీజాభదంతపంక్తివిరాజిత:

 మందమందస్మితోల్లాసి కపోలఫలకోమల

ఔపమ్యరహితోదారనాసామణిమనోహరః

విలసత్తిలపుష్పశ్రీవిమలోన్నతనాసికః

ఈషదున్మేషమధురనీలోత్పలవిలోచనః

నవప్రసూనచాపశ్రీలలితభూవికాశకః

అర్గెందుతులితో భాలే పూర్ణేందురుచిరాననః

సాంద్రసౌరభసంపన్నకస్తూరీతిలకోజ్వలః

 మత్తాలిమాలావిలసదలకోగ్యముఖాంబుజ

పారిజాతప్రసూనస్రగ్వాహిధమ్మిల్లబంధనః

అత్యర్థరత్నణచితముకుటాంచితమస్తకః

సర్వలావణ్యవసతిర్భవనం విభ్రమశ్రియః

శివో విష్ణుశ్చ తత్రత్యాః సమస్తాశ్చ మహాజన

బింబస్య తస్య దేవ్యాశ్చ అభేదం జగృహుస్తదా

 అథ తర్షి మహేశానీ స్వతంత్రా ప్రవివేశ హ  అగ్రతః

సర్వదేవానామాశ్రయేణ ప్రపశ్యతామ్

బింబం కృత్వాత్మనా బింబే సంప్రవిశ్య స్థితాం చ తామ్

దృష్ట్వా భూయో నమస్కృత్య పునః ప్రార్థితవాన్ విధిః

పూర్ణబ్రహ్మే మహాశక్తే మహాత్రిపురసుందరి

శ్రీకామాక్షీతి విఖ్యాతే నమస్తుభ్యం దినే దినే

కించిద్విజ్ఞాపయామ్యద్య శృణు తత్కృపయా మమ

 అతైవ తు.మహాగౌర్యా మహేశస్యోభయోరపి

శ్రీదేవి నిత్యకల్యాణి వివాహః ప్రతివత్సరమ్

కర్తవ్యో జగతామృధ్ధ సేవాయై చ దివొకసాప్

భూలోకేఖ స్మిక్ మహాదేవి విమూఢా జనతా

అపి తాం దృష్ట్వా భక్తితో నత్వా ప్రయాంతు పరమాం గతిమ్

తఢత్యాకాశవాణ్యా తు దదౌ తస్యోత్తరం పరా

విససర్ణ చ సర్వాంస్తాన్ స్వనికేతనివృత్తియే

తదద్భుతతమం శీలం సృత్వో స్మృత్వా ముహుర్ముహుః

తాం నమస్కృత్య తే సర్వే తతో జగ్ముర్యథాగతమ్

పితామహస్తు హృష్టాత్మా ముకుందేన శివేన

చ సార్ధం శ్రీమందిరే తత్ర మంత్రోపేతాం

నివేశ్య చ ఆరాధ్య ప్రదకైనాత్ర సాష్టాంగం ప్రణనామ స

ఆరాధ్య వైదికైస్తోతైః సాష్టాంగం ప్రణనామ సు

అథాకాశగిరా దేవీ బ్రహ్మాణమిదమబ్రవీత్

విష్ణుం శివం చ స్వస్థానే సమాధాయ సమాహితః

 ప్రతిసంవత్సరం తత్ర సేవాం కురు ధృడాశయ

స్వయం వ్యక్తమిహ శ్రీశమిశాంబాసమన్వితమ్

శ్రీకామగిరిపీఠం తం సాక్షాఛ్ఛీపురమధ్యగమ్

వామభాగే వృతం లక్ష్యం విష్ణునాస్యత సేవితమ్

 చిదానందకారరూపం సర్వపీఠాధిదైవతమ్

అదృశ్యమూర్తిమవ్యక్తమారధార యథావిధి

శ్రీమనోజే సునక్షత్ర దలానాం హీరకోదకై

అర్చిషుదిరప్రధృషెర్లోకానామభివృద్ధయే

ఇదానీం త్వం తదభ్యర్య యథావిధి విధే

ముదా మండలం త్వఖిలం కృత్వా నిజలోకం హి పాలయ

ఇత్యుక్తో భగవాన్ బ్రహ్మా తథా కృత్వా తదీరితమ్

నిక్షిప్య హృది తాం దేవీం నిజం ధామ జగామ స

ఇతి తే తత్వతః ప్రోక్తం కామాక్షీశీలమద్భుతమ్

సాక్షాదేవ మహాలక్ష్మీమిమాం విద్ధి ఘటోద్భవ

య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి ప్రయతః పఠేత్

తస్య భుక్తిశ్చ ముక్తిశ్చ కరసా నాత్ర సంశయః

ఇృహస్పతిసమో బుద్ధ్యా సర్వవిద్యాధిపో భవేత్

 ఆదీర్నాడాయణా శ్రీమాన్ భగవాన్భక్తవత్సలః

తపసా తోషితః పూర్వం మయా చ చిరకాలతః

సారూప్యముక్తిం కృపయా దత్త్వా పుత్రాయ మే ప్రభుః

మహాత్రిపురసుందర్యా మాహాత్మ్యం సముపాదిశత్

తతస్తస్మాదహం. కించిద్వేష్మి వక్ష్యే న చాన్యథా

రహస్యమంత్రం సంవక్ష్యే శృణు. తం త్వం సమాహితః

న బ్రహ్మా న చ విష్ణుర్వా న రుద్రశ్చ త్రయోప్యమా

మోహితా మాయయా యస్యాస్తురీయస్తు స చేశ్వరః

సదాశివో న జానాతి కథం ప్రాకృతదేవతాః

సదాశీవస్తు సర్వాత్మా సచ్చిదానందవిగ్రహః

అకరుమన్యధాకర్తుం కర్తుమస్యా అనుగ్రహాత

సదా కశ్చిత్తదేవాహం మన్యమానో మహేశ్వరః

తన్మాయామోహితో భూత్వా త్వవశః శవతామగాత్

సైవ కారణమేతేషాముత్పత్తి చ లయే పి

చ కశ్చిదత్ర విశేషో స్త్రీ వక్తవ్యాంశోఽపి తం శృణుః

బ్రహ్మాదీనాం శ్రయాణాం చ తురీయస్వీశ్వరః ప్రభుః

చతుర్ణామపి సర్వేషామాదికర్తా సదాశివ

ఏతద్రహస్యం కథితం తస్యాశ్చరితమద్భుతమ్

భూయ ఏవ ప్రవక్ష్యామి సావధానమనాః శృణు

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరఖండే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే ఏకోనచత్వారింశోధ్యాయః

బ్రహ్మయనెను:- నాభక్తితోగలిగిన నీదర్శనము చేతనే నీఃసంశయముగా ధన్యుడనైతిని, ఐనను లోకములననుగ్రహించుకామనతో కొద్దిగా బ్రార్థించుచున్నాను-45, కర్మభూమియైన యీ లోకములో నీజనులందరును సామాన్యముగా మూడులు. వారిననుగ్రహించుటకై యిచట నిత్యము. నీసన్నిధియుండునట్లు చేయుము--46. మహాదేవి యట్లేయవి. యా బ్రహ్మయొక్క కోరికను నెరవేర్చెను. తరువాత బ్రహ్మయామహాదేవికి, కాంచీనగరమున వ్రాసమును కల్పించెను -47. శ్రీదేవికి సోదరుడై పుండరీకాక్షుడై కమలాక్షుడైన విష్ణువునకు నమస్కరించి యాతనిచే నాదరింపబడినవాడై కాంచీనగరమున విష్ణువు యొక్క నిత్య సాన్నిధ్యములను గోరెను-48.

 జనార్థనుడైన విష్ణువుగూడ నట్లేచేయుదునని బ్రహ్మకు జెప్పెను. తరువాత సంతసించిన బ్రహ్మ “మహాదేవిప్రీతితో శివుడు గూడనిచ్చోట సాన్నిధ్యమును జేయుగాక యని మహేశ్వరినీ బ్రార్థించెను. అంత త్రిపురాదేవి యొక్క కుడి భాగమునుండి పరమేశ్వరుడైన కామేశ్వరుడు ఆవిర్భవించెను-50. అతడు- సర్వవిద్యలకీశ్వరుడు  సర్వప్రాణులకు ఈశ్వరుడు. సాక్షాత్తు. శృంగారనాయకుడు -51.తరువాత శ్రీకామాక్షీభాలనేత్రకటాక్షమున ఒకబాల ప్రాదుర్భవించెను. ఆమె మహాగౌరి- (మిక్కిలి తెల్లనైనది) మహోజ్జ్వల: (గోప్పవెలుగుగలది)-52. సమస్తశృంగార వేషములతో నొప్పినది. "మహాసౌందర్యమునకు నిధానము. ఆ తరువాత, బ్రహ్మతోగలిసి విష్ణువు ప్రేమతో-53. ఆయాది స్త్రీపురుషులకు కల్యాణము జేయించెను. అప్పుడు, ఇంద్రాది దేవతలు, వసురుద్రాది దేవతలు -54-మార్కండేయాదిమునులు, వసిషాదిమునీశ్వరులు, సనకాది యోగీంద్రులు, నారదాది దేవమునులు-55. వామదేవుడు మొదలగువారు, జీవన్ముక్తులైన శుదులు, యక్ష-కిన్నర, గంధర్వసిద్ద-విద్యాధర-ఉరగులు -56. గణగణియైన మహాశాస్త్ర, దుర్గాదులైన మాతలు దేవతలనిపిలువబడు పోరందరును భద్రాసనములుగల విమానములందున్నవారై చేతులుజోడించి నమస్కరించిరీ-67: బ్రహ్మచే నగరమధ్యన-మనస్సుతో నిర్మింపబడిన పరమేశ్వరి మందిరము అద్భుతమై మనోహరమై శుభమైనది-58.- శ్రీమంతుడైన (లక్ష్మీయుతుడైన) వాసుదేవుడు శ్రీదేవి సోదరుడు. ఆతని సహాయమున నచట కాంచీనగరమున భగవంతుడై భవుడైన మహేశ్వరుడు-అగ్నిసమీపమున ఆ గౌరిని పెండ్లాడెను. దేవదుందుభులు. మ్రోగినవి. పుష్పవర్షము గురిసెను. వేయి సాలుకలుగలవాడైనను. ఎవడు ఆ జగత్పతులైన దంపతుల పాణిగ్రహణ మంగళ మహోత్సవమును వర్ణింప సమర్థుడు? (ఎవ్వనీ తరమునుగాదు)-61. ఈ యాది శ్రీమందిరమునకు వాయవ్యభాగమున మహేశ్వర మందిరముగలదు. అది విశాలమైనది భువనశ్రేష్టమైనది. దానిని బ్రహ్మ నిర్మించెను-62. శ్రీమందిరము యొక్క ఆగ్నేయ భాగమున విచిత్రమైన విష్ణుమందిరము గలదు. ఈ విధముగా నచట కంచీలో ముగ్గురు దేవతలు. (శ్రీదేవి-కామేశ్వరుడు-విష్ణువు) ఎల్లప్పుడును సన్నిహితులైయున్నారు-63. అపుడు బ్రహ్మవిష్ణువులు తత్పరులై యా గౌరీమహేశ్వరులకు ప్రదక్షిణము జేసి సభావనాగరమునకు (దేవసభకు దాని ప్రక్కనున్న నందనోద్యానవనమునకు) జేరిరి. -66. అచటి సభ్యులందరికి (సభా-వనములలో నున్నవారికి సంతోషముతో గౌరీ మహేశ్వరులకల్యాణము వైదికమంత్రములతో నగ్ని ప్రదక్షిణాది సంస్కారములతో జరిగిన విధమంతయువిన్నవించిరి-65, ఆద్యయైన (మొదటిదైననది లక్ష్మి. అందరిముందట శ్రీపరమేశ్వరి నీలచినది. ఆమెకుడి కన్నుతో బ్రహ్మను ఎడమకన్నుతో విష్ణువును జూచెను -66. వాడి యెవరు? కమల యెవరు? వారి రువురును ఆ శ్రీపరమేశ్వరి నుండి ప్రాదుర్భూతములైన కాంతిపుంజములు. అవి పంజరములో : నున్నట్లు ఆమెలో నున్నవి-67. ఆవాడీ కమలలు శ్రీదేవికి తలవంచి చేతులు జోడింతురు. కామాక్షికి జయము కామాక్షికి జయము అని.. నమస్కరింతురు-66, వారు ఆకారము దాల్చిన గంగాయమునలవలె నచటికి శ్రీదేవీసేవకై వచ్చిరి. మూడున్నరకోట్ల తీర్థదేవతలు అందరు త్రిపురాంబసేవకై యచటికి వచ్చిరి. అపుడు సరస్వతీ లక్ష్ములు, చేతులలో చామరములదీసికొని తగినట్లుగా వీచుచు శ్రీదేవిని సేవించిరి -70 ఆదిశ్రీ (ఆదిలక్ష్మి) యొక్క కన్నుల నుండి బుట్టినవారు సరస్వతీలక్ష్ములు ఇరువురు, వారి బాహులతలు అమూల్యములైన రత్నములు పొదిగినచిరుగంటల తో వ్యాపించినవి-71. దీనిని జూచి జనసమూహము విశేషముగా సాశ్చర్యపడెను. అప్పటి నుండి - యాకల్యాణీ కామాక్షి యనబడినది. ఆ నామోచ్చారణ మాత్రమున శ్రీదేవి సుఖమునిచ్చును. -72 'కామాక్షియను మూడు అక్షరములు సర్వమంగళముల గలుగ జేయును. అంతగా జగదీశ్వరి సరస్వతిని వేదవేదాంగపారగుడైన బ్రహ్మలో నిత్యము నివసించుమని యాదేశించేను. " ఆ వాణీశ్వరియు గంగ చేతులో చామరములనుంచి సర్వదేవతలు జూచుచుండ బ్రహ్మముఖములో బ్రవేశించేను-73, 74 అట్లే సంతసించిన మహాలక్ష్మీ రూపిణియైన మహాదేవిచే నాదేశింపబడి ఇందిర తనకు దగిన నివాసము కొఱకు సంతోషముతో విష్ణువు యొక్క వక్షస్థలమున - జేరెను. ఆ మహదేవి యొక్క యాజ్ఞను శిరసావహించి దంపతులైన రమ (లక్ష్మి)యు విష్ణువును భక్తితో (మహాత్రిపురవసుందరిని. నమస్కరించి) తాము తదావరణ దేవతలుగానుండటకు బ్రార్థించిరీ-75,76. త్రిపురసుందరి “అట్లేయగుగాక" యని వారికి వరమిచ్చెను. అప్పుడు పద్మా-విష్ణువులు (లక్ష్మీవిష్ణువులు) ఆయావరణమునకు దేవత్వమును బొందిరి-77. విష్ణువు తన మిక్కిలియెత్తైన పీఠమునుత్తరమున పద్మను నిలిపి తాను దక్షిణమున నిలచేను. ఆ తరువాత కామాక్షి గౌరిని “నీవు వేరొక రూపమును’ వహింపుము-అనెను. అచట - మహాగౌరి యొక్క మనోహరమైన ప్రతిబంబము చేరేను-78. అది ప్రకాశించు దివ్య దేహముతో మహాగౌరీ సమానమైన యాకారము - గలిగియున్నది. పాదములజంట లేతమెరుపు చంద్రునికాంతి సౌందర్యము గలిగియున్నది. పీఠమున తిత్తిరి పక్షుల వలెనున్న చిరుగంటలు - మోగుచున్నవి. మనోహరమైన మణులమొలనూలు మెరుపువలె మెరసి మ్రోయుచున్నది-80, భుజముల జంట రత్నములు పొదిగిన కంకణములతోను భుజభూషణములతోను శోభించుచున్నది. నడుము ముత్యములు వైడూర్యములు మాణిక్యములు పోదిగిన ఒడ్డాణముతో బ్రకాశించుచున్నది. నాభీమండలము. గంగానది సుడివలె శోభిల్లుచున్నది-81,82, స్తనములు కుంకుమపూవు కర్పూరము: గలిసిన చందన గంధము పూతతో నలంకిరింపడినవి. రవిక ముత్యముల యల్లికతో ప్రకాశీంచినది -83, నడుము ప్రదేశమున జలతారుగొలుసులు వినోదముగ వ్రేలాడుచున్నవి. మాణిక్య (కెంపు) పుముక్కలు పొదిగిన ముద్రలు (పతకములు) అలకంరించుచున్నవి-84. ఎడమచేత కమలము మనోహరముగొనంటియున్నది. మీగాళ్ళ వరకు దివ్యాలంకారములైన కదంబపుష్ప మాలలు శోభిల్లుచున్నవి-85. ధరించిన భూషణములలోని రత్నముల కిరణపంక్తులు దీజ్ముఖములనే వెలిగించుచున్నవి. -86, క్రిందికంఠము మంగళసూత్రములోని రత్నకిరణముల నేబారినది. చెవికమ్మలు కెంపులతో నలంకరింపబడినవి -87. దంతముల వరుసలు దానిమ్మ పండ్ల విత్తులవలె బ్రకాశించుచున్నవి-88. చెక్కిళ్ళుకోమలములైమెల్లని చిరునవ్వుల వెలుగులో వెలయుచున్నది. ఆ మనోహరమైన పోడవైన ముక్కునకు పోలికయేలేదు -89. ఆ ముక్కు నిర్మలమై నూవు పూవువలె శోభిల్లుచున్నది. కన్నులు కొద్దిగా వికసించిన నల్లగలువల వలే ఈషన్మధురోన్మేషముగలిగి యున్న సుశాంతమును వ్యంజింపీజేయుచు కొద్దిగా దెఇంచియున్నవి-70. కనుబొమ్మలు కొత్తగా వికసించిన పుష్పధనువును బోలియున్నవి... ఫాలభాగము అర్థచంద్రునివలె నందమైనది. కాని ముఖము . పూర్ణచంద్రునివలెనున్నది-91, అది దట్టమైన సౌగంధ్యముగల కస్తూరీ తిలకముతో (బొటుతో) బ్రకాశించుచున్నది. ఆమే ముంగురులముఖము. మదించినతుమ్మెదల గురవుతో బ్రకాశించుకలమలమువలేనన్నదీ-92. ఆమెకొప్పుముడి పారిజాత పుష్పమాలలచే జుట్టబడినది. ఆమె తలపైని కిరీటము మిక్కుటముగా - రత్నములు పొదిగియున్నదీ-93. ఆమె సర్వలావణ్యముల నివాసము, విలాస సంపదకు భవనము-శివుడు, విష్ణువు, అచటనున్న సమస్తమహాజనులును-94. ఆబింబమునకును ఆదేవికిని అపుడుకభేదమును (ఏకత్వమును) గ్రహించిరి. (తెలిసికొనిరి) తరువాత - మహేశ్వరి దేవిని తమకాశ్రయముగా జూచుచున్న దేవతలందరియెదుట స్వతంత్రురాలై యాబింబములో ప్రవేశించెను. తన తోనే యొక బింబమేర్పరచి యాబింబిమున బ్రవేశించియున్న (తత్సృష్ట్వాతదేవాను ప్రావిశాత్ అని వేదము) యా మహాదేవిని జూచి బ్రహ్మ మరలమరల నమస్కరించి యిట్లు ప్రార్థించేను-96. పూర్ణబ్రహ్మస్వరూపిణి, మహాశక్తి స్వరూపిణి, మహాత్రిపురసుందరి, కామాక్షియని ప్రసిద్ధిజేందినదానా ప్రతిదినము నీకు నమస్కారము. ఇవ్వేళ కొద్దిగా, విజ్ఞాపనము జేయుదును. దయతో నావిజ్ఞాపనమును వినుము-97, ఓనిత్యకల్యాణియైన - శ్రీదేవికి ఇచటనే జగముల సంపదద్దికొకు, దేవతల సేవకొంకును ప్రతిసంవత్సరమును మహగౌరీ-మహేశుల వివాహామును జేయవలెను. -98. ఓ మహాదేవి! ఈ భూలోకమున జనము మూఢమైనది. ఐనను మహాదేవిని జూచి, భక్తితోనమస్కరించి పరమగతీని బొందవలెను -99. దీనికి పరాశక్తి ఆకాశవాణీతో “అట్లేయగును”అని ప్రత్యుత్తరమిచ్చెను. వారందరిని తమ తమయిండ్లకు వెళ్లవలేననీ కూడ చెప్పెను-100. తరువాత, వారందరును, మిక్కిలియాశ్చర్యకరమైన మెయుదానశీలమును మాటిమాటికీ తలచీతలచి యామెకు నమస్కరించి తమతమ యిండ్లకు బోయిరీ-101. బ్రహ్మ సంతుష్టాంతరంగుడై విష్ణు-శివులతో గూడ మంత్రో పేతమైన యామెను. మందిరమున బ్రవేశంపజేసి, వైదికస్తోత్రములతో నారాధించి, సాష్టాంగముగా బ్రణమిల్లెను-102 : అంత, దేవి ఆకాశవాణి ద్వారా బ్రహ్మతోనిట్లనెను-103. విష్ణువును, శివుని తమస్థానములకుజేర్చి, సర్వేంద్రియములనేకాగ్రుడవై ఓ దృధాశయుడా! అచట ప్రతి సంవత్సరము శ్రీ కామగిరి పీఠమును సేవింపుము-104 అది సాక్షాత్తు శ్రీపురమధ్యముననున్నది. ఇచట స్వయముగా వ్యక్తమైనది (ఎవ్వరును స్థాపింపనిది) శివునితోను శ్రీశమిత్రేశునితోను. ధనేశుడైన కుబేరునకు మిత్రడైన శివుని తోను) అంబతోను, గూడియున్నది. (ఇద్దరు అక్కడ వేంచేసియున్నారనుట.) వామభాగమున లక్ష్మితోను తక్కిన దక్షిణ భాగమున విష్ణువుతోను సేవింపబడినది. చిదానందకారరూపము సర్వపీఠములకు అధిదైవతము. అదృశ్యమైన. యాకారముగలది. కావుననే అవ్యక్తమైనది (కనబడనిది) - ఇట్టి శ్రీకామగిరి పీఠమును, కాంచీపురము యథావిధిగా సంపూర్ణముగా ధరించెను -107. ఇపుడు లోకముల యభివృద్ధికోటకు సంపూర్ణముగా ధరించెను. -107 - ఇపుడులోకముల యభివృద్ధి కొఱకు తిరస్కరింపనలవిగానివి, వెలుగులుగలవి, యునైన దళముల మణులను మొగ్గలచే శ్రీదేవికిష్టమైన మంచి నక్షత్రమున ఓబ్రహ్మ! నీవు ఆకామగిరీ పీఠమును యధావిధిగా బ్రీతితో నర్చించి ఆమండలమునంతయు అఖిలముగా (నశింపనిదానినిగా) జేసి నీ స్వలోకమును పాలించుము-109 ఈవిధముగ నాకాశవాణితో మహాదేవి చెప్పిన దానీనీ భగవంతుడైన బ్రహ్మ ఆమెకోరినట్లంతయు నెరవేర్చి ఆమహదేవిని హృదయమున నిలిపి తన నివాసలోకమునకు వెళ్లాను-110. ఈవిధముగా ఓ అగస్త్వా! అద్భుతమైన కామాక్షీ శీలము నిజస్వరూపములో జెప్పబడినది. ఓ అగస్త్యా. ఈమెను సాక్షాత్తు మహాలక్ష్మిగానే తెలియుము-111. దీనిని నిత్యము వినువానికి, నియమవంతుడై చదువువానికి భుక్తి ముక్తి తనయరచేతిలోనుండును సంశయములేదు -112 వాడు బుద్దిలో బృహస్పతిసముడై సర్వవిద్యాధిపుడగును. శ్రీమంతుడు, భక్తప్రియుడు, భగవంతుడునైన ఆదినారాయణడు-113. పూర్వము నాచిరకాల తపస్సుతో సంతసించి దయతోనాపుత్రునకు సారూప్యముక్తిని ప్రసాదించి మహాత్రిపురసుందరీమాహత్మ్యమునుపదేశించెను-114. తరువాత ఆతని నుండి కొంత తెలసితిని వేరువీధముగా గాడు రహస్యమంత్రమును జెప్పెదను. సమాహితుడవై నీవు దానిని వినుము-115. బ్రహ్మకాని, విష్ణువుగాని, రుద్రుడుగాని, ఈమువ్వురుగూడ ఆమె మాయచేత మోహితులైనారు. నాలుగవవాడై యా యీశ్వరుడైన యా సదాశివుడు గూడ ఆమెమహాత్యమును దెలియడు. ఇక ప్రాకృతదేవతలు ఎట్లు తెలీయుదురు?-116, ఆ మహాదేవి యనుగ్రహమువలననే సదాశివుడు సర్వాత్ముడు, సచ్చిదానంద రూపుడు, చేయుటకు చేయకుండుటకును వేరుగా జేయుటకును సమర్థుడును ఐనాడు -117. ఎప్పుడు అదియే నేనని భావించు నొకమహేశ్వరుడు ఆమె మాయచే మోహితుడై వశముదప్పి శవమైనాడు-118. వీరియొక్క జన్మ-లయములకు ఆమెయే కారణము. ఇచట ఒకానొక విశిష్టమైన కర్తవ్యాంశము (చేయదగినవిషయము) గలదు. దానిని గూడవినుము-119. బ్రహ్మాదుల మువ్వురికీ తురీయుడై నాలగవాడైన యీశ్వరుడు ప్రభువు. ఈనలుగురికీ మొత్తము ఆదికర్త సదాశివుడు -120. ఆమె యొక్క రహస్యము అద్భుత చరిత్రమున్ను చెప్పితిని మరల గూడ జెప్పెదను సావధానమనస్కుడవై వినుము -121.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరఖండమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున ముప్పదితోమ్మిదవయధ్యాయము 39